Gangayya
-
ఐదున్నర గంటలు అరచేతిలో ప్రాణాలు
స్వర్ణముఖినదిలో ఇద్దరి నరకయాతన కాపాడిన స్థానికులు, అధికారులు ఏర్పేడు: మండలంలోని గోవిందవరం వద్ద స్వర్ణవుుఖి నదిలో దాదాపు ఐదున్నర గంటలసేపు ఇద్దరు నరకయాతన అనుభవించారు. వుంగళవారం సాయుంత్రం 4-30 గంటలకు వారు నదిలో చిక్కుకోగా, రాత్రి 9-45 గంటలకు స్థాని కులు, అధికారులు కలిసి ఎట్టకేలకు సురక్షితంగా ఒడ్డుకుచేర్చారు. తిరుపతికి చెందిన రవి(25) కందాడులో బంధువు అంత్యక్రియులకు వెళ్లేందుకు సాయంత్రం 4-30 గంటల ప్రాంతంలో గోవిందవరం వద్ద స్వర్ణవుుఖినదిపై ఉన్న కాజ్‌వేపైకి వచ్చాడు. కాజ్‌వేపై ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో అవతల వైపునకు వెళ్లడానికి దిగాడు. కొంతదూరం వెళ్లగానే కాలుజారడంతో నదిలోకి కొట్టుకుపోతుండగా, అక్కడే ఉన్న గోవిందవరం ఎస్సీ కాలనీకి చెందిన గంగయ్యు(50)కాపాడేందుకు నదిలోకి దిగాడు. నీటి ప్రవాహంలో ఇద్దరూ స్వర్ణవుుఖినదిలో సువూరు 50 మీటర్ల దూరం వరకు కొట్టుకెళ్లారు. ఆ ప్రాంతంలో ఉన్న వుుళ్ల చెట్టు కొవ్మును పట్టుకున్నారు. ఈ విషయూన్ని స్థానికులు 6-30 గంటలకు తెలుసుకున్నారు. పోలీసులు, తహశీల్దార్ లక్ష్మీనరసయ్యుకు ఫోన్ ద్వారా సవూచారం అందించారు. ఎస్ఐ రావుకృష్ణ, తహశీల్దార్ లక్ష్మీనరసయ్యు రాత్రి 7-30 గంటలకు అక్కడికి చేరుకున్నారు. సవూచారం అందుకున్న తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్యు కూడా 8 గంటలకు అక్కడికి వెళ్లారు. రాత్రి కావడంతో పలు ప్రాంతాలకు చెందిన ట్రాక్టర్లను తీసుకుని వచ్చి లైట్లు వేరుుంచారు. తిరుపతి నుంచి రాత్రి 8-30 గంటలకు అగ్నివూపక యుంత్రాలు, గజ ఈతగాళ్లను రప్పించారు. అగ్నివూపక సిబ్బంది తాళ్లను స్వర్ణవుుఖి నదిలోకి వదిలారు. గజ ఈతగాడు తాడు ద్వారా నదిలో ఆ ప్రాంతానికి చేరుకుని ఒక్కొక్కరిని సురక్షితంగా 9-45 గంటలకు ఒడ్డుకు చేర్చాడు. సువూరు ఐదున్నర గంటల సేపు ఆ ఇద్దరు నీటిలో నరకవేతన అనుభవించారు. ఒడ్డుకు చేరుకున్న తరువాత వారు చలికి వణికిపోయూరు. -
ఎఫ్ఆర్ఓ హత్య కేసులో దూకుడు తగ్గించిన పోలీసులు
సంచలనం సృష్టించిన ఎఫ్ఆర్ఓ రొడ్డ గంగయ్య హత్య కేసులో పురోగతి కరువైంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన సీపీఎం నాయకులు ఇద్దరిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. దీంతో పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి దూకుడు తగ్గించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, నిజామాబాద్ : ఇందల్వాయి ఎఫ్ఆర్ఓ రొడ్డ గం గయ్య ఈ నెల 14వ తేదీన నల్లవెల్లి అటవీ ప్రాంతంలో హత్యకు గురైన విష యం తెలిసిందే. భూ ఆక్రమణదారులు పథకం ప్రకారం గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా చంపారు. అటవీ శాఖ ఉన్నతాధికారి హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. 36 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 33మందిని అరెస్టు చేశారు. మొదట 11 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మోహన్‌రావు ఈ నెల 23న ప్రకటించారు. ఆ త ర్వాత మరో 22 మందిని అరెస్టు చేసినట్లు కేసు విచారణాధికారి, నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్ 25న డిచ్‌పల్లిలో ప్రకటించారు. అయితే, ఈ ఘటనతో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీఎం నేతలిద్దరిని మాత్రం ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గంగయ్య హత్యకు దారితీసేలా సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఆ పార్టీ మహిళా నేత జమున స్థానికులను పురిగొల్పారని పోలీసులు నిర్ధారించారు. వీరు ఘటనలో ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నట్లు తమ దర్యాప్తు లో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పెద్ది వెంకట్రాములు, జమునలకు హత్య కేసుతో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఎస్పీ మోహన్‌రావు సైతం ప్రకటించారు. అయితే హత్య జరిగి 15 రోజులు గడిచినా వీరి ని అరెస్టు చేయలేదు. వీరితో పాటుగా అటవీ భూమి ఆక్రమణకు సహకరించిన ట్రాక్టర్ యజ మానిని కూడా అరెస్టు చేయాల్సి ఉంది. వీరిని అరెస్టు చేయకపోవడంతో హత్య కేసు దర్యాప్తులో జిల్లా పొలీసులు ప్రారంభంలో చూపిన దూకుడు ఇప్పుడు తగ్గించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. పరారీలో ఉన్నారు -అనిల్‌కుమార్, నిజామాబాద్ డీఎస్పీ ఎఫ్ఆర్ఓ హత్య కేసులో ఇప్పటి వరకు 33 మందిని అరెస్టు చేశాం. నిందితులుగా ఉన్న సీపీఎం నేతలిద్దరు దొరకడం లేదు. ప్రత్యేక బృందాలు వారికోసం గాలిస్తున్నాయి. కేసు దర్యాప్తులో రాజకీయ ఒత్తిళ్లేమీ లేవు. -
నల్లవెల్లిలో అటవీశాఖ అధికారి దారుణ హత్య
నిజామాబాద్ జిల్లాలో దర్పల్లి మండలం నల్లవెల్లిలో దారుణం చోటు చేసుకుంది. నల్లవెల్లి ప్రాంతంలో అటవీశాఖ సిబ్బందికి, గిరిజనులకు మధ్య గత అర్థరాత్రి చోటు చేసుకున్న ఘర్షణలో ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగయ్య మరణించగా, మరి కొంత మంది అటవీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... అటవీశాఖకు చెందిన భూములు తమకు ఇస్తే సాగు చేసుకుంటామని గత కొంత కాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ భూములు ప్రభుత్వానికి చెందినవి అని సాగుచేసుకోవడం కుదరదని అధికారులు గిరిజనులకు వివరించారు. అందుకు గిరిజనులు ఒప్పకోక ఆ భూముల్లో సాగు చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఆ క్రమంలో ఆ భూములను గిరిజనులు దున్నుతున్నారు. ఆ సమాచారం తెలుసుకుని, వారి ప్రయత్నాన్ని అపేందుకు ఫారెస్ట్ రేంజ్ అధికారి, సిబ్బంది హుటాహుటిన నల్లవెల్లి బయలుదేరారు. అప్పటికే అటవీశాఖ అధికారులపై దాడికి సిద్ధంగా ఉన్న గిరిజనులు కర్రలు, కరంపోడిలతో వారిపై దాడికి దిగారు. ఆ ఘటనలో ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగయ్య అక్కికక్కడే మరణించారు. మరో కొంత మంది సిబ్బంది తీవ్రంగా గాయపడి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు.