డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 22.45 క్వింటాళ్ల గంజాయిని హయాత్‌నగర్ పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు.
డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 22.45 క్వింటాళ్ల గంజాయిని హయాత్‌నగర్ పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారంతో హయాత్‌నగర్ పోలీసులు అబ్దుల్లామెట్ వద్ద కాపు కాశారు. గంజాయి లోడుతో వచ్చిన డీసీఎం వ్యానును ఆపి అందులోని 22.45 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.