అక్రమ రవాణా రూటు మార్చిన స్మగ్లర్లు
బల్లులు, తాబేళ్లు, పాములు, ఇగ్వానాలు.. కాదేదీ స్మగ్లింగ్‌కు అనర్హం
విశాఖ విమానాశ్రయంలో ప్రమాదకరమైన బల్లులు స్వాధీనం
2023–24లో అక్రమ రవాణాకు 18 సార్లు అడ్డుకట్ట వేసిన కస్టమ్స్
ఎయిర్‌పోర్టుల ద్వారా రవాణా జరుగుతున్న సరీసృపాలు 46%
2011–20 మధ్య ఎయిర్‌పోర్టుల్లో స్వా«దీనం చేసుకున్న వన్య ప్రాణులు 70,000
ఎయిర్‌పోర్టుల ద్వారా రవాణా జరుగుతున్న క్షీరదాలు 18%
2023–24లో వన్యప్రాణుల అక్రమ రవాణా కేసులు 18
సాక్షి, విశాఖపట్నం: మూఢ నమ్మకాలతో కొందరు..! హోదా కోసం మరికొందరు..! కారణమేదైనా అరుదైన వన్యప్రాణులు సంపన్నుల ఇళ్లల్లో తారసపడుతున్నాయి. నిఘా వ్యవస్థ కళ్లుగప్పి విమానాల్లో ఖండాతరాలు దాటి వస్తున్నాయి. ఇవి స్మగ్లర్లకు కాసులు కురిపిస్తున్నాయి. అక్రమ రవాణాపై కస్టమ్స్ నిఘా పెరగడంతో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త ఎయిర్‌పోర్టులను అన్వేíÙస్తున్నారు. థాయ్‌లాండ్, మలేíÙయా నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వన్యప్రాణుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు ఓడలలో వీటిని అక్రమంగా తరలించగా ఇప్పుడు వైమానిక మార్గాలను ఎంపిక చేసుకుంటున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు స్మగ్లర్లు వైమానిక రంగాన్ని వినియోగిస్తున్న టాప్ 10 దేశాల్లో భారత్ ఉండటంపై ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఈపీ) ఆందోళన వ్యక్తం చేసింది.
చెన్నైలో అధికం
వివిధ దేశాల నుంచి భారత్‌కు అక్రమంగా వన్య ప్రాణులను తరలిస్తుండగా పట్టుబడిన కేసుల్లో మూడొంతులు చెన్నై ఎయిర్‌పోర్టుల్లో నమోదైనవే కావడం గమనార్హం. ఇక్కడ నిఘా పెరగడంతో తాజాగా బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు విశాఖ ఎయిర్‌పోర్టులను ప్రత్యామ్నాయాలుగా స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. చెన్నై, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులు అక్రమ రవాణాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఆదాయం పెరుగుతుందనే మూఢ నమ్మకంతో..
తాబేళ్లు, అరుదైన బల్లులను పెంచితే ఆదాయం పెరుగుతుందని కొందరి మూఢనమ్మకం. పాములను పెంచితే కష్టాలు తొలగిపోతాయని మరికొందరి విశ్వాసం. స్మగ్లర్లకు ఇది కాసులు కురిపిస్తోంది. ఇగ్వానాలు, మార్మోసెట్‌లు, కంగారూలు, విదేశీ తాబేళ్లు, విషపూరిత పాములు, యాలిగేటర్‌లు, అరుదైన పక్షులను కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. వీటిని ఎలా పెంచాలనే విషయాలపై సోషల్ మీడియాలో సమాచారం సేకరిస్తున్నారు. బ్యాంకాక్, దుబాయ్, కౌలాలంపూర్, ఆ్రస్టేలియా, ఆఫ్రికా నుంచి ఎక్కువగా వీటి అక్రమ రవాణా జరుగుతోంది.
యూఎన్ ఈపీ ట్రాఫిక్ తాజా నివేదిక ప్రకారం 2011– 2020 మధ్య 70,000 రకాల అరుదైన జీవజాతులు 18 భారతీయ విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరిగాయి. వీటిలో సరీçసృపాలు 46 శాతం ఉండగా 18 శాతం క్షీరదాలున్నాయి. ఇండియన్ స్టార్ టార్టాయిస్, బ్లాక్ పాండ్ తాబేళ్లు, జలగలు, ఇగ్వానాలు వీటిలో ఉన్నాయి. దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో 2023–24లో అక్రమ రవాణాకు సంబంధించి 18 కేసులను నమోదు చేయగా 230 వన్యప్రాణుల్ని స్వా«దీనం చేసుకున్నారు.
పాములు నుంచి బల్లుల దాకా సజీవంగా..
గతంలో ఏనుగు దంతాలు, పాంగోలిన్ పొలుసులు, పులి చర్మాలు, జంతు చర్మాలు, గోళ్లు అక్రమంగా తరలించగా ఇప్పుడు ఏకంగా సజీవంగా ఉన్న వన్య ప్రాణులనే స్మగ్లింగ్ చేయడం విస్తుగొలుపుతోంది. 2019లో చెన్నై విమానాశ్రయంలో స్వా«దీనం చేసుకున్న ఆఫ్రికన్ హార్న్ పిట్ వైపర్‌లు, ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన తాచుపాములు, విశాఖ ఎయిర్‌పోర్టులో లభ్యమైన ప్రమాదకరమైన బల్లులు.. ఇలా సజీవంగా తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధపడుతున్నారు.
కట్టుదిట్టంగా తనిఖీలు
విమానాశ్రయంలో నిరంతరం తనిఖీలు జరుగుతున్నాయి. బ్యాగేజ్ తనిఖీల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. డీఆర్‌ఐ, కస్టమ్స్ సహా అన్ని విభాగాల ఆధ్వర్యంలో ప్రతి ప్రయాణికుడినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వన్యప్రాణుల వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నాం. చెక్‌లిస్ట్‌లు, తనిఖీ కేంద్రాల వద్ద ప్రయాణికులకు అవగాహన కలి్పస్తున్నాం. – రాజారెడ్డి, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment