చదువుకోవాల్సిన విద్యార్థులు పక్కదారి పట్టారు.
కుషాయిగూడ (హైదరాబాద్): చదువుకోవాల్సిన విద్యార్థులు పక్కదారి పట్టారు. సోమవారం ఉదయం కాప్రా చెరువు వద్ద గంజాయి సేవిస్తూ ఇద్దరు బీటెక్ విద్యార్థులు పట్టుబడ్డారు.
ఆ ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 300ల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.