కేపీహెచ్‌బీ కాలనీ (హైదరాబాద్) : జేఎన్‌టీయూ హైదరాబాద్ పేరుకే గొప్ప అని, తమ కళాశాలలో ఎంటెక్ చదువుతున్న వారితో పాఠాలు చెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బీటెక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి, పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రొఫెసర్లతో తరగతులు నిర్వహించాల్సి ఉండగా కేవలం తాత్కాలిక పద్ధతిన అధ్యాపకులను నియమించి తరగతులను నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన అధ్యాపకులను సైతం తొలగించారని తెలిపారు. దీంతో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. రెండు రోజుల్లో రెగ్యులర్ అధ్యాపకులను నియమిస్తామని హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.
జేఎన్‌టీయూలో విద్యార్థుల ఆందోళన
Published Thu, Aug 13 2015 5:40 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement