సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌రెడ్డి నుంచి తనకు న్యాయం చేయాలని ఆయన భార్య సంగీత చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడని, తనకు, తన పిల్లవాడికి న్యాయం చేయాలని కోరుతూ బోడుప్పల్‌లోని అతని ఇంటి ముందు ఆమె 52 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న సంగతి విదితమే.
మహిళా సంఘాలు, సామాజికవేత్త దేవి సూచనల మేరకు ఆమె దీక్షను విరమించింది. నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. అయితే ధర్నాను మాత్రం కొనసాగిస్తానని సంగీత స్పష్టం చేసింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని ఆమెకు న్యాయం చేయాలని దేవి విజ్ఞప్తి చేశారు. కాగా, తన భర్త, అత్తమామలతో మాట్లాడి న్యాయం చేయాలని సంగీత వేడుకుంటున్నది.
Comments
Please login to add a commentAdd a comment