హైదరాబాద్: మారణాయుధాలతో సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం రాత్రి సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గోషామహల్ ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్‌ను చంపటానికే వారు తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు గాలింపులు చేపట్టిన పోలీసులు వారిని అఫ్జల్ గంజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి తల్వార్లను స్వాధీనం చేసుకుని, అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. హత్య కుట్ర వెనుక మాజీ మంత్రి తమ్ముడు, ఓ మాజీ కార్పొరేటర్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.