Hire assassins
-
టీఆర్ఎస్ నేత హత్యకు కుట్ర?
హైదరాబాద్: మారణాయుధాలతో సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం రాత్రి సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గోషామహల్ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్‌ను చంపటానికే వారు తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు గాలింపులు చేపట్టిన పోలీసులు వారిని అఫ్జల్ గంజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి తల్వార్లను స్వాధీనం చేసుకుని, అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. హత్య కుట్ర వెనుక మాజీ మంత్రి తమ్ముడు, ఓ మాజీ కార్పొరేటర్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అడ్డు తొలగించుకునేందుకే అన్వర్ హత్య?
అత్తమామల పాత్రపై అనుమానాలు? కిరాయి హంతకులు ఉన్నారా..? మదనపల్లె క్రైం: మదనపల్లె కృష్ణానగర్‌లో శనివారం జరిగిన రియల్టర్ అన్వర్ బాషా(40) హత్య వెనుక కుట్ర దాగి ఉన్నట్టు సమాచారం. అన్వర్‌ను అత్తమామలతో పాటు కిరాయి హంతకులు హత్యచేసి ఉంటారనే కోణంలో టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్వర్ బాషా భార్య ఐదేళ్ల క్రితం భర్తతో గొడవ పడి కువైట్‌కు వెళ్లినట్టు తెలిసింది. అలాగే మృతుని మామ ఖలీల్ బాషా కూడా గత పదేళ్లుగా కువైట్‌లోనే ఉండేవాడని తెలిసింది. అప్పటి నుంచి అన్వర్ అత్తగారి ఇంటిలోనే ఉన్నప్పటికీ కువైట్‌లో ఉన్న భార్యతో మాటలు లేవని మృతుని బంధువులు చెబుతున్నారు. అన్వర్ మామ ఖలీల్ బాషా(55) ఇటీవలే మదనపల్లెకు వచ్చాడు. అన్వర్ బాషా భార్య కూడా మరో రెండు రోజుల్లో భారత్‌కు రానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ తండ్రి, కూతురు సంపాదించిన డబ్బు, బంగారాన్ని భర్తకు ఇవ్వాల్సి వస్తుందని, అలాగే ఇష్టం లేని భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేకనే ఈ హత్య చేయించారని బంధువులు ఆరోపిస్తున్నారు. ‘ఇంటిలో నాకు ఇష్టం లేని వ్యక్తులు ఎవరు ఉండడానికి వీలు లేదు’ అని అన్వర్ బాషా భార్య పలుమార్లు తన తల్లిదండ్రులను ఫోన్లో హెచ్చరించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భర్త అన్వర్‌బాషాను తండ్రి ద్వారా కిరాయి హంతకులతో హత్య చేయించినట్టు తెలుస్తోంది. పోలీసులు లోతుగా దర్యాప్తు సాగిస్తే తప్ప నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. -
ట్రిపుల్ మర్డర్ కిల్లర్స్‌ను తీసుకొచ్చిన పోలీసులు
విజయవాడ/పెనమలూరు: రాష్ట్రంలో సంచలనం కలిగించిన పెదఅవుటుపల్లి ట్రిపుల మర్డర్ కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను భారీ భద్రత నడుమ ప్రత్యేక బస్సులో కమిషనరేట్‌కు తీసుకొచ్చారు. గురువారం రాత్రి 7గంటల సమయంలో విజయవాడ నగరానికి తీసుకొచ్చిన వీరిని పెనమలూరులోని తూర్పు డివిజన్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. వీరిని శుక్రవారం కోర్టు ద్వారా జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు. గత నెల 24వ తేదీన కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి గ్రామం సమీపంలోని 5వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఆగంతుకుల కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు, ఇతని కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఉంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పినకడిమి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే వీరి హత్యలు జరిగినట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీలోని కళ్యాణిపురా ప్రాంతానికి చెందిన కిరాయి హంతకులు ప్రతాప్‌సింగ్ అలియాస్ అనుజ్, ధరమ్ వీరు అలియాస్ సల్లు, నితిన్, నీరజ్‌తో పాటు హత్యలకు కుట్రదారులైన మంజీత్‌సింగ్, సతీష్‌కుమార్, పంకజ్ అలియాస్ ప్రకాశ్‌ను మంగళవారం ఢిల్లీ పోలీసుల సహకారంతో డిప్యూటీ పోలీసు కమిషనర్(శాంతి భద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్ నేతృత్వంలోని బృందం అరెస్టు చేసింది. వీరిని అక్కడి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు పిటి(ప్రిజనర్స్ ట్రాన్సిట్) వారెంట్‌పై ఇక్కడికి తీసుకొచ్చారు. -
‘బెజవాడ’ హత్యలకు ‘కోటి’ సుపారి
కిల్లర్స్ ఢిల్లీ వాళ్లు.. ఏడుగురు అరెస్టు సాక్షి, న్యూఢిల్లీ/విజయవాడ: కృష్ణా జిల్లా విజ యవాడ సమీపంలో ఐదో నంబరు జాతీయ రహదారిపై పెదఆవుటపల్లి వద్ద సెప్టెంబర్ 24న జరిగిన ముగ్గురు తండ్రీ కొడుకుల దారుణ హత్య కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులు, హత్యకు వ్యూహం పన్నిన వారిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో విజయవాడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశా రు. హతుల ప్రత్యర్థులు.. కోటి రూపాయల సుపారీ ఇస్తామని ఒప్పందం చేసుకుని కిరాయి హంతకులతో కలిసి ఈ హత్యలకు కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, గంధం గుంజుడు మారయ్య, గంధం పగిడి మారయ్యలు గత నెల 24వ తేదీన గన్నవరం విమానాశ్రయం నుంచి ఏలూరుకు టవేరా కారులో ప్రయాణిస్తుండగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో కిరాయి హంతకులు ప్రతాప్‌సింగ్ అలియాస్ అనుజ్, ధరమ్వీర్ అలియాస్ సల్లు (ఇద్దరూ ఢిల్లీలోని కళ్యాణ్పురి వాసులు), నితిన్ (ఢిల్లీలోని త్రిలోక్‌పురి నివాసి), నీరజ్ (ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ నివాసి), ఆ హత్యలకు కుట్రదారులు మంజీత్‌సింగ్, సతీష్‌కుమార్, పంకజ్ అలియాస్ ప్రకాశ్ (ఢిల్లీలోని కళ్యాణ్‌పురికి చెందిన వారు) లను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ క్రైం బ్రాంచ్ జాయింట్ సీపీ రవీంద్రయాదవ్ మంగళవారం ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.