కృష్ణా జిల్లా విజ యవాడ సమీపంలో ఐదో నంబరు జాతీయ రహదారిపై పెదఆవుటపల్లి వద్ద సెప్టెంబర్ 24న జరిగిన..
కిల్లర్స్ ఢిల్లీ వాళ్లు.. ఏడుగురు అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ/విజయవాడ: కృష్ణా జిల్లా విజ యవాడ సమీపంలో ఐదో నంబరు జాతీయ రహదారిపై పెదఆవుటపల్లి వద్ద సెప్టెంబర్ 24న జరిగిన ముగ్గురు తండ్రీ కొడుకుల దారుణ హత్య కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులు, హత్యకు వ్యూహం పన్నిన వారిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో విజయవాడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశా రు. హతుల ప్రత్యర్థులు.. కోటి రూపాయల సుపారీ ఇస్తామని ఒప్పందం చేసుకుని కిరాయి హంతకులతో కలిసి ఈ హత్యలకు కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, గంధం గుంజుడు మారయ్య, గంధం పగిడి మారయ్యలు గత నెల 24వ తేదీన గన్నవరం విమానాశ్రయం నుంచి ఏలూరుకు టవేరా కారులో ప్రయాణిస్తుండగా హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఈ కేసులో కిరాయి హంతకులు ప్రతాప్‌సింగ్ అలియాస్ అనుజ్, ధరమ్‌వీర్ అలియాస్ సల్లు (ఇద్దరూ ఢిల్లీలోని కళ్యాణ్‌పురి వాసులు), నితిన్ (ఢిల్లీలోని త్రిలోక్‌పురి నివాసి), నీరజ్ (ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ నివాసి), ఆ హత్యలకు కుట్రదారులు మంజీత్‌సింగ్, సతీష్‌కుమార్, పంకజ్ అలియాస్ ప్రకాశ్ (ఢిల్లీలోని కళ్యాణ్‌పురికి చెందిన వారు) లను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ క్రైం బ్రాంచ్ జాయింట్ సీపీ రవీంద్రయాదవ్ మంగళవారం ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.