
సాక్షి, బోడుప్పల్ (హైదరాబాద్) : ఒక యువతితో నిశ్చితార్థం చేసుకొని.. మరో యువతిని వివాహం చేసుకున్న ఓ ప్రబుద్ధుడిని ఆదివారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి వివరాల ప్రకారం నల్గొండ జిల్లా చర్లపల్లికి చెందిన బీపంగి హరిబాబు(28) స్థానికంగా అమ్మ ఆన్‌లైన్ మీసేవ సర్వీస్‌ను నిర్వహిస్తున్నాడు. ఫిబ్రవరి 22న బోడుప్పల్ శివపురికి చెందిన ఓ యువతి(24)తో నిశ్చితార్థం అయ్యింది. రూ.3 లక్షలు ఇచ్చేందుకు ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు. నిశ్చితార్థం రోజు ఖర్చుల నిమ్తితం రూ.50 వేలు ఇచ్చారు. మరో రూ.50 వేలు నిశ్చితార్థం కోసం ఖర్చు చేశారు. ఆగస్టులో పెళ్లి నిర్ణయించారు.
ఈలోపు హరిబాబు ఎవరికీ చెప్పకుండా మీ సేవలో పనిచేసే ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు హరిబాబును నిలదీయగా సమాధానం చెప్ప లేదు. దీంతో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం హరిబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment