madipalli
-
బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన డిప్యూటీ సీఎం
సాక్షి, తూర్పు గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద బాధితులకు ప్రకటించిన రూ.5వేల అదనపు సహాయాన్ని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దేవీపట్నం ముంపు ప్రాంతమైన వీరవరంలో దగ్గరుండి అందజేశారు. దేవిపట్నం మండలం లోతట్టు ముంపు ప్రాంతమైన మడిపల్లి గ్రామానికి మంగళవారం పడవపై వెళ్ళి ఆమె బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. గోదావరి ముంపు బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి, అనంత ఉదయభాస్కర్ పాల్గొన్నారు. గోదావరి వరదల కారణంగా దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే. -
ఒకరితో నిశ్చితార్థం.. మరో యువతితో..
సాక్షి, బోడుప్పల్ (హైదరాబాద్) : ఒక యువతితో నిశ్చితార్థం చేసుకొని.. మరో యువతిని వివాహం చేసుకున్న ఓ ప్రబుద్ధుడిని ఆదివారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి వివరాల ప్రకారం నల్గొండ జిల్లా చర్లపల్లికి చెందిన బీపంగి హరిబాబు(28) స్థానికంగా అమ్మ ఆన్లైన్ మీసేవ సర్వీస్‌ను నిర్వహిస్తున్నాడు. ఫిబ్రవరి 22న బోడుప్పల్ శివపురికి చెందిన ఓ యువతి(24)తో నిశ్చితార్థం అయ్యింది. రూ.3 లక్షలు ఇచ్చేందుకు ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు. నిశ్చితార్థం రోజు ఖర్చుల నిమ్తితం రూ.50 వేలు ఇచ్చారు. మరో రూ.50 వేలు నిశ్చితార్థం కోసం ఖర్చు చేశారు. ఆగస్టులో పెళ్లి నిర్ణయించారు. ఈలోపు హరిబాబు ఎవరికీ చెప్పకుండా మీ సేవలో పనిచేసే ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు హరిబాబును నిలదీయగా సమాధానం చెప్ప లేదు. దీంతో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం హరిబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
రూ. 30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
మాడిమిల్లి: అక్రమంగా గంజాయి తరలిస్తున్న రూ. 30 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖ జిల్లా మాడిమిల్లి మండలం మద్దులూరు గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. గంజాయి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అడవిలో తనిఖీలు చేపట్టారు. అది గమనించిన దుండగులు గంజాయి మూటలను వదిలి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న 40 గంజాయి బస్తాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై ఏఎస్పీ ఫకిరప్ప సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.