
సాక్షి, తూర్పు గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరద బాధితులకు ప్రకటించిన రూ.5వేల అదనపు సహాయాన్ని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దేవీపట్నం ముంపు ప్రాంతమైన వీరవరంలో దగ్గరుండి అందజేశారు. దేవిపట్నం మండలం లోతట్టు ముంపు ప్రాంతమైన మడిపల్లి గ్రామానికి మంగళవారం పడవపై వెళ్ళి ఆమె బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. గోదావరి ముంపు బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి, అనంత ఉదయభాస్కర్ పాల్గొన్నారు. గోదావరి వరదల కారణంగా దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే.