Pamula Pushpa Srivani
-
బాబు, పవన్ పై పుష్ప శ్రీవాణి ఫైర్
-
‘మహిళా పక్షపాతిగా సీఎం జగన్ దేశానికే ఆదర్శం’
-
పుష్ప శ్రీవాణి కూతురికి సీఎం జగన్ ఆశీస్సులు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్పా శ్రీవాణికి కొద్ది రోజుల కిందట పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మించడంతో మహాలక్ష్మి తమ ఇంట్లో అడుగుపెట్టిందని పుష్ప శ్రీవాణి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ మేరకు పుష్పా శ్రీవాణి-పరీక్షిత్ రాజు దంపతులు తమ ముద్దుల కూతురితో కలిసి బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ చిన్నారిని చేతుల్లోకి తీసుకొని ముద్దాడారు. పాపకు తన ఆశీస్సులు అందజేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా ఇటీవల పుష్ప శ్రీవాణి, పరీక్షిత్ దంపతులను ఎమ్మెల్యే రోజా కలిసిన విషయం విదితమే. స్వయంగా పుష్ప శ్రీవాణి ఇంటికెళ్లి తమ చిన్నారికి ఆశీస్సులు అందించారు. ఇక పుష్ప శ్రీవాణిది పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం. 2014లో శతృచర్ల పరీక్షిత్ రాజుతో వివాహమైంది. భర్త వైఎస్సార్సీపీ అరకు లోక్‌సభ నియోజకవర్గం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు (2014,2019) విజయం సాధించారు. 2019లో 26 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ కేబినెట్లో ఆమెకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. కేబినెట్లో కూడా పుష్ప శ్రీవాణి అత్యంత పిన్న వయస్కురాలు. చదవండి: ఎక్కడా రాజీపడొద్దు: సీఎం వైఎస్ జగన్ ప్రేమోన్మాది ఘాతుకం: డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య -
మహాత్ముడికి సీఎం జగన్ నివాళి
-
మహాత్ముడికి సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులు ఆర్పించారు. దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యానారాయణ, బాలీనేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇలా ఉంటే చదువు సాగేదెలా...?
గుమ్మలక్ష్మీపురం: చదువుకోవడానికి పాఠ్యపుస్తకాలు లేవు. ప్రయోగాలు చేసుకునేందుకు ల్యాబ్‌లు లేవు. కూర్చునేందుకు తగిన బెంచీలు లేవు. రెగ్యులర్ బోధకులు లేరు. ప్రిన్సిపాల్ లేరు. అసంపూర్తిగా నిలిచిపోయిన బోధన గదులు. మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. ఉల్లిపాయలు వేయకుండా... ఎక్స్పైర్ అయిన సామగ్రితో వంటలు. ఇదీ గుమ్మలక్ష్మీపురంలోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల(ఎస్టీ)లో దుస్థితి. వాటిని ప్రత్యక్షంగా చూసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి చలించిపోయారు. గత పాలకుల నిర్లక్ష్యానికి విస్తుపోయారు. ఇప్పటికైనా దానిని పూర్తి మౌలిక సదుపాయాలతోతీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అసలేమైందంటే...: గుమ్మలక్ష్మీపురంలో మంగళవారం నిర్వహించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి హాజరయ్యారు. ఆ సందర్భంలో అక్కడి పాలిటెక్నిక్ విద్యార్థులు ఆమెకు కళాశాలలోని సమస్యలు వివరించారు. వెంటనే స్పందించిన ఆమె అప్పటికప్పుడు కళాశాలను సందర్శించారు. అక్కడ నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు చదువుకోసం వస్తే గత టీడీపీ ప్రభుత్వం కనీస సౌకర్యాలేవీ కల్పించకుండా భవనాన్ని నిర్మించి నిర్లక్ష్యంగా వదిలేయడం బాధాకరమన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఎప్పుడూ తన దృష్టికి రాలేదని, ఈ పరిస్థితుల్లో విద్యార్థులను చూస్తే ఎంతగానో బాధకలుగుతోందని, ఈ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కళాశాలలో నెలకొన్న సమస్యలను నివేదిక రూపంలో అందజేయాలని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నరసింహకు ఆమె ఆదేశించారు. ఆమె వెంట వైఎస్సార్సీపీ శ్రేణులు ఉన్నారు. -
‘చంద్రబాబు, భువనేశ్వరి వ్యతిరేకమని తేలిపోయింది’
సాక్షి, అమరావతి : ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణతో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. అందుకే ఇంట్లోని ఆడవాళ్లను తెచ్చి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.. అమరావతిలో చంద్రబాబుతో కలిసి పర్యటించిన ఆయన సతీమణి భువనేశ్వరి ఆమె చేతికి ఉన్న బంగారు గాజులను రాజధాని రైతులకు అందించారు. ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ సీఎం సచివాలయంలో మాట్లాడుతూ.. భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు.. వాళ్ల భర్త అన్యాయంగా తీసుకున్న రైతుల భూములని స్పష్టం చేశారు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో భూములు కొట్టేసింది మీ భర్త చంద్రబాబు కాదా అని భువనేశ్వరిని ప్రశ్నించారు. హెరిటేజ్ పేరుతో రాజధానిలో ఉన్న భూములపై భువనేశ్వరి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ పేరుతో ఉన్న 14 ఎకరాల భూములను రైతులకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు 4 వేల ఎకరాలు దోచేసింది నిజం కాదా అని నిలదీశారు. ఆ 4వేల ఎకరాలు రైతులకిస్తే మీరు ఇచ్చిన గాజులకంటే ఎక్కువ మేలు చేస్తాయని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం ధర్మం కాదని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు, భువనేశ్వరి వ్యతిరేకమని తేలిపోయిందని అన్నారు. -
'మహిళా సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత'
సాక్షి, విశాఖపట్నం : విశాఖ తగరపువలస జూట్ మిల్స్ గ్రౌండ్లో మహిళా సంఘాలకు రుణ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ జి. సృజన తదితరులు హాజరయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పది సంవత్సరాల పోరాటం తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన అయిదు నెలల కాలంలోనే మేనిఫెస్టోలోని 80శాతం హామీలను నెరవేర్చామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే అన్ని వర్గాలకు మేలు చేసే 20 బిల్లులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దేశంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50శాతం మేర రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా రైతలకు అండగా నిలబడుతున్నామని తలిపారు. కృష్ణా ,గోదావరి నదీ జలాల వినియోగంపై ఇతర రాష్ట్రాలతో సఖ్యతగా మెలుగుతూనే పరిష్కార మార్గాలకు ప్రత్యేక ప్రణాళిక నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆదాయ వనరులిచ్చే మద్యాన్ని ఏ రాష్ట్రం వదులుకోదు, కానీ మా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం రాష్ట్రాన్ని సంపూర్ణ మద్య నిషేదం రాష్ట్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే తొలిదశలో బెల్టు షాపుల నియంత్రణకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ అయిదేళ్ల పాలనలో పేదలకు 25 లక్షల ఇళ్లను ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. విశాఖను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంపీ విజయసాయిరెడ్డి నిరంతరం కష్టపడుతున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజాతీర్పును సహించలేకే టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని విమర్శించారు. లోకేష్ రాజకీయ జీవితం ముగిసిపోయందన్న ఉక్రోశంలో చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అమర్నాథ్ దుయ్యబట్టారు. నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. విశాఖ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు ప్రయత్నం కొనసాగిస్తామని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తెలిపారు. సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం విశాఖపట్నంలోని మధురవాడలో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల ఇంగ్లీషు మీడియం స్కూల్ లో రాష్ట్ర స్దాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సిఎం పాముల పుష్పశ్రీ వాణి సైన్స్ ఎగ్జిబిషన్‌ను లాంచనంగా ప్రారంభించారు . కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి బాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఉప ముఖ్యమత్రి పుష్పశ్రీవాణితో పూజా సమయం
-
బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన డిప్యూటీ సీఎం
సాక్షి, తూర్పు గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద బాధితులకు ప్రకటించిన రూ.5వేల అదనపు సహాయాన్ని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దేవీపట్నం ముంపు ప్రాంతమైన వీరవరంలో దగ్గరుండి అందజేశారు. దేవిపట్నం మండలం లోతట్టు ముంపు ప్రాంతమైన మడిపల్లి గ్రామానికి మంగళవారం పడవపై వెళ్ళి ఆమె బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. గోదావరి ముంపు బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి, అనంత ఉదయభాస్కర్ పాల్గొన్నారు. గోదావరి వరదల కారణంగా దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే. -
‘మంగళగిరి వెళ్లి అడగండి తెలుస్తుంది’
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి విమర్శలు గుప్పించారు. ఘోర ఓటమి చవిచూడటంతో ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని బాబు అంటున్నారు. మీ కొడుకును ఓడించిన మంగళగిరి వెళ్లి అడగండి. ఎందుకు ఓడిపోయారో చెప్తారు. 14 సీట్లలో 13 సీట్లలో ఓడించిన మీ సొంత జిల్లా చిత్తూరు వెళ్లి అడగండి. ఎందుకు ఒడిపోయారో చెప్తారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకపోతే 23 సీట్లు కాస్త 3 సీట్లు అవ్వక తప్పదు’ అన్నారు. తెలివి లేదని అవమానించారు.. ‘గిరిజన ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది పనులు చేపడుతున్నాం. పాడేరులో గిరిజన మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి గిరిజనుల పట్ల చిత్తశుద్ధిని చాటు కున్నాం. మా ప్రభుత్వంపై ప్రతిపక్షనేత చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్‌ను అని చెప్పుకునే ఆయన ప్రజల్ని దారుణంగా మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 600 హామీలిచ్చి మాట తప్పారు. మహిళల్ని కించపరిచారు. దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారని, గిరిజనులకు తెలివి లేదని వ్యాఖ్యానించి చంద్రబాబు అవమాన పరిచారు. 40 ఏళ్ల అనుభవం అని గొప్పలు చెప్పుకునే బాబుకంటే.. 40 ఏళ్ల వయసున్న సీఎం జగన్మోహన్రెడ్డి 40 రోజుల్లోనే హామీల అమలుకు కృషి చేస్తున్నారు’ అన్నారు. అబద్ధాలతో చంద్రబాబు మళ్లీ ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అదేంటన్నా.. అన్నీ మహిళలకేనా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మహిళా అభ్యున్నతికి పాటుపడుతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కొనియాడారు. ప్రతి మహిళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలోపేతం అయ్యేదిశగా వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన నిర్ణయాల పట్ల మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. అదేంటన్నా.. మొత్తం మహిళలకేనా! ఈ సందర్భంగా ఇటీవల కేబినెట్ సమావేశంలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికరమైన సంభాషణను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గుర్తుచేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘మొన్నటి కేబినెట్ భేటీలో అదేంటన్నా మొత్తం మహిళలకే అంటున్నారని ఒకరంటే.. ఎవరేమనుకున్నా.. మన ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు. ‘వామ్మో ఆడపిల్లా.. అనుకునే పరిస్థితి నుంచి.. మాకు లక్ష్మీదేవి ఆడపిల్ల పుట్టిందా అనుకునేవిధంగా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అంటూ ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు మహిళలందరికీ డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని, మీ బంగారం మీ ఇంటికి వస్తుందని ప్రగల్బాలు పలికారని, కానీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత మహిళలను పట్టించుకోకుండా వారిని కోర్టుల చుట్టు తిప్పిన ఘనత చంద్రబాబుదన్నారు. సున్నా వడ్డీ రుణాల కోసం చెల్లించాల్సిన నిధులు కూడా చంద్రబాబు సక్రమంగా చెల్లించలేదని, ఎన్నికలముందు బెల్టు షాపులు రద్దుచేస్తానని చంద్రబాబు చెప్పారని, కానీ, ఆయన అధికారం ముగిసేనాటికి 40వేల బెల్టు షాపులు ఏర్పడి.. మహిళల జీవితాల్ని నాశనం చేశాయని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మహిళలను రాజకీయంగా అగ్రవర్ణం మహిళలను ఎదుర్కోవడానికే ఉపయోగించిందన్నారు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసి గాయపరిస్తే.. ఆ ఎమ్మెల్యే తీరును ఖండించాల్సిపోయి.. వనజాక్షినే చంద్రబాబు తప్పుబట్టారని గుర్తు చేశారు. ఇటీవలి ఎన్నికలకు ముందు మహిళలను మళ్లీ మోసం చేయాలనే దుర్బుద్ధితో మళ్లీ పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు డ్రామాలాడారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇసుకు ర్యాంపులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అంటూ చంద్రబాబు ప్రభుత్వం మభ్యపెట్టినా.. అవి వారికి లబ్ధి చేకూర్చలేదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం మహిళలను అనునిత్యం మోసం చేసే దిశగా పరిపాలన సాగిస్తే.. మహిళలను గౌరవించే దిశగా, మహిళల అభ్యున్నతి దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పాదయాత్రలో ప్రతి ఆడబిడ్డ కష్టాన్ని తెలుసుకొని.. మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని కొనియాడారు. దళితులుగా ఎవరు పుట్టాలని అనుకుంటారని చంద్రబాబు అంటే.. ఏకంగా దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దని ప్రశంసించారు. ఎస్టీలకు హక్కులను కాలరాసే విధంగా గత ప్రభుత్వం పాలన సాగించగా.. ఒక ఎస్టీ మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉన్నత స్థాయిలో ఉంచిన గొప్పతనం వైఎస్ జగన్‌ది అన్నారు. ప్రతి పేద తల్లికీ ఒక సోదరుడిలా అండగా ఉంటూ అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చారని, అదేవిధంగా గ్రామ వాలంటీర్లలోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద రూ. 75వేల రూపాయలు రానున్న నాలుగేళ్లలో అందించనున్నారని పేర్కొన్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకొనే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. అన్ని రంగాల్లోనూ వారు ముందుకు రావాలంటూ వైఎస్ జగన్ తీకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్తున్నానని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. అసెంబ్లీ రేపటికి వాయిదా.. సభలో సభ్యుల ప్రసంగాల అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. -
విశ్వసనీయత... విధేయత...
రాష్ట్ర కేబినెట్లో జిల్లాకు తగిన ప్రాధాన్యం లభించింది. ఇద్దరిని మంత్రి పదవులు వరించాయి. ఒకరు అనుభవంలో దిట్ట... మరొకరు విశ్వసనీయతకు మారుపేరు. వారే బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి. సామాజిక వర్గ సమతూకం పాటించి... పాత కొత్తలను మేళవించి... పార్టీ పురోగమనమే లక్ష్యంగా భావించి... సంచలన నిర్ణయంతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం జిల్లావాసులను ఆనందంలో ముంచెత్తింది. సాక్షిప్రతినిధి, విజయనగరం: అనుభవానికి, విశ్వసనీయతకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టం గట్టారు. సీనియర్ నేత బొత్ససత్యనారాయణ, ఎస్టీ మహిళా నేత పాముల పుష్పశ్రీవాణిలకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్వవస్థీకరణ ఉంటుందని, కొత్తవారికి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చి అసంతృప్తి అనేదే లేకుండా సుపరిపాలనవైపు అడుగులు వేయిస్తున్నారు. పరిచయం అవసరం లేనిసీనియర్ ప్రజా ప్రతినిధి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకుడిగా ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రాధాన్యక్రమంలోనే ఉంటారు. ప్రజా సేవలో తాను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చిన అసలు సిసలైన రాజకీయ నేతగా కీర్తి గడించారు. తన ఎదుగుదలకు పునాది వేసిన చీపురుపల్లి నియోజకవర్గంపై అమితమైన ప్రేమాభిమానాలను మదినిండా నింపుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో వైఎస్సార్సీపీ నుంచి అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొం దారు. ఇప్పుడు ఏకంగా జగన్ మంత్రి వర్గం లో స్థానం సంపాదించారు. విద్యార్థిసంఘ నాయకుడిగా మొదలుపెట్టి, డీసీసీబీ చైర్మ న్, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, పీసీసీ అధ్యక్షు డు వంటి అత్యున్నత హోదాల్లో పనిచేసిన అనుభవం బొత్సకు ఉంది. దివంగత ము ఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హ యాంలో కీలక భూమిక పోషించిన బొత్స తదనంతర పరిణామాల్లో జగన్మోహన్రెడ్డికి అండగా నిలబడ్డారు. సతీమణి బొత్సఝాన్సీ కూడా ఎంపీగా పనిచేసిన అనుభవంతో పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. జిల్లాలో జగన్ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న సమయంలోనూ, విజయమ్మ జిల్లాలో పర్యటించినపుడు వారి వెన్నంటి ఉన్నారు. బొత్స దంపతులు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ బలోపేతానికి అహర్నిశలు పరితపించారు. జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కృ షి చేశారు. రాష్ట్రంలో పార్టీ విజయదుందుభి మోగించడానికి అవసరమైన ప్రణాళికల రచనల్లో జగన్‌కు చేదోడువాదోడుగా ఉన్నారు. బొత్స అనుభవం రాష్ట్రంలో సంక్షేమ పాలనకు అవసరమని భావించిన సీఎం జగన్మోహన్రెడ్డి తన టీమ్‌లో బొత్స సత్యనారాయణ ప్రాధాన్యం ఇచ్చారు. గిరిజనులకు అండదండ... పుష్పశ్రీవాణి గిరిజనులు తమ ఇంటి ఆడబిడ్డగా భావించే పాముల పుష్పశ్రీవాణి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం దొరమామిడి నుంచి విజయనగరం జిల్లాకు కోడలిగా వచ్చారు. 2014లో కురుపాం నియోజకవర్గం చినమేరంగికి చెందిన శత్రుచర్ల పరీక్షిత్‌రాజును వివాహం చేసుకున్నారు. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె పరీక్షిత్‌ను వివాహమాడి అదే ఏడాది ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో 19 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. మొదటి నుంచీ వైఎస్ కుటుంబాన్ని అమితంగా అభిమానించే శ్రీవాణి తనకేదైనా కష్టం వస్తే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో దగ్గరకు వెళ్లి చెప్పుకుంటుంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు దేవుడితో సమానమని అంటుంటారు. తాము విలువలకే ప్రాధాన్యం ఇస్తామని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించారు. టీడీపీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా... ఎంతటి ప్రలోభాలు ఎదురైనా లొంగలేదు. జగన్‌పైనే విశ్వసనీయత చూపించారు. తమకున్న అభిమానాన్ని చాటిచెప్పడం కోసం చేతిపై ‘వైఎస్ఆర్’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలకోసం నిరంతరం పోరాడారు. తాజా ఎన్నికల్లో ఆమెను ఓడించేందుకు టీడీపీ చేసిన వశ్వప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆమెపైనా, ఆమె భర్తపైనా హత్యాయత్నానికి పాల్పడినా బెదరలేదు. అనేక కుట్రలను ఎదుర్కొని ఈ రోజు మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. పేరు: పాముల పుష్పశ్రీవాణి తండ్రి: నారాయణరావు తల్లి: గౌరీ పార్వతి భర్త: శత్రుచర్ల పరీక్షిత్‌రాజు గ్రామం: చినమేరంగి, విజయనగరం జిల్లా విద్యార్హతలు: బీఎస్సీ, బీఈడీ పుట్టినతేది: 22–6–1986 పేరు : బొత్స సత్యనారాయణ విద్యార్హత: బీఏ, మహారాజా కళాశాల,విజయనగరం తండ్రి: బొత్స గురునాయుడు తల్లి: ఈశ్వరమ్మ భార్య : బొత్స ఝాన్సీలక్ష్మి(మాజీ ఎంపి) జననం : 9–7–1958 పిల్లలు : ఒక కుమారుడు, ఒక కుమార్తె నివాసం : కోరాడ వీధి, విజయనగరం పొలిటికల్ కెరీర్: 1978–80: విజయనగరం మహరాజా కళాశాలలో విద్యార్థి సంఘ నాయకత్వం 1992–99: విజయనగరం డీసీసీబీ చైర్మన్ 1996, 1998లో ఎంపీగా పోటీ చేసి ఓటమి 1999లో ఎంపీగా గెలుపు 2004, 2009: చీపురుపల్లి ఎమ్మెల్యేగా విజయం. 2004 నుంచి వైఎస్సార్ కేబినెట్లో మొదటి విడతలో భారీ పరిశ్రమలశాఖ, రెండవ విడతలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా పని చేశారు. రోశయ్య కేబినెట్లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్ కేబినెట్లో రవాణాశాఖా మంత్రిగా పని చేశారు. 2012 – 2015: పీసీసీ చీఫ్‌గా అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై 26,518 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయ ప్రవేశం 2014లో పుష్పశ్రీవాణి వైఎస్సార్సీపీ తరఫున కురుపాం నుంచి పోటీచేసి సమీప టీడీపీ అభ్యర్థి వి.టి.జనార్దన్ థాట్రాజ్‌పై 19,083 ఓట్లు మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో టీడీపీ అభ్యర్థి నర్శింహప్రియ థాట్రాజ్‌పై 26,602 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. -
బయటపడిన టీడీపీ రిగ్గింగ్ బాగోతం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ నేతలు యథేచ్ఛగా పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు రిగ్గింగ్‌కు పాల్పడిన వైనానికి సంబంధించిన ఆధారాలు విజయనగరం జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. కురుపాం నియోజకవర్గం కుదుమ పంచాయతీ చినకుదుమలోని బూత్ నంబర్ 152లో ఎన్నికల రోజున(11వ తేదీన) టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీన్ని అడ్డుకునేందుకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, ఆమె భర్త వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అక్కడికి వెళ్లగా.. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. అయితే టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్న విషయాన్ని రుజువు చేసేందుకు అవసరమైన ఆధారాలు, ఫొటోలు నాలుగు రోజుల తర్వాత బయటపడ్డాయి. ఇందులో టీడీపీ కార్యకర్తలు యథేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడుతూ కనిపించారు. టీడీపీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు స్వీయ పర్యవేక్షణలో ఇదంతా జరిగినట్లు తెలిసింది. 950 ఓట్లు ఉన్న ఈ పోలింగ్ బూత్‌లో ఆ రోజు 667 ఓట్లు పోలయ్యాయి. వీటిలో అత్యధిక శాతం ఓట్లను టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ ద్వారా తమ సైకిల్ గుర్తుపైనే వేసేసుకున్నారు. ఆ సమయలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఈవో ఎస్.శ్రీనివాసరావుతో పాటు మిగిలిన సిబ్బంది అంతా ప్రేక్షక్ష పాత్రకే పరిమితమయ్యారు. (చదవండి: వ్యూహాత్మకంగా అలజడి..) -
ఓటమి భయంతోనే దాడి
విజయనగరం, పార్వతీపురం: ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే కోరికతో తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలకు ప్రేరేపించిందని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కురుపాం నియోజకవర్గం పరిధిలోని చినకుదమ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు పరిశీలనకు వెళ్తే స్థానిక నాయకులు పుష్పశ్రీవాని, పరీక్షిత్‌రాజుపై దాడికి పాల్పడి మూడు గంటలపాటు నిర్భంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాయాలు పాలైన ఎమ్మెల్యే దంపతులు తమపై హత్యాప్రయత్నం చేయడంతో పాటు కుల ధూషణకు పాల్పడిన సంఘటనలో ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసును పెట్టామన్నారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. పరీక్షిత్‌రాజుకు శరీరం లోపల భాగాల్లో గాయాలైనట్టు వైద్యులు నిర్ధారించారు. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి కూడా వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. వ్యూహాత్మకంగా అలజడి.. కురుపాం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు వ్యూహాత్మకంగా ముందస్తు ప్రణాళికలు రచించి ఓటర్లను భయపెట్టి ఏకపక్షంగా ఎన్నికలు జరిపించడానికి పథకం రచించారని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తెలిపారు. వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను భయపెట్టి ఏకపక్షంగా ఓటింగ్ జరిగేలా ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. విషయం తెలుసుకొని పరిశీలించడానికి వెళ్లిన తమపై నిమిషాల వ్యవ«ధిలో వేల సంఖ్యలో ప్రజలను మోహరింపజేసి దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. దాడి చేయడంతో పాటు కులం పేరుతో ధూషించి డొంకాడ రామకృష్ణ అనే టీడీపీ నాయకులు అవమాన పరిచారని, గోర్లి మంగమ్మ, పల్ల నీలిమ అనే ఇద్దరు మహిళలు తమపై భౌతిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. పోలీసుల రక్షణ నడుమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. బంధుత్వం చూడకుండా రెచ్చగొట్టారు.. అధికారం కోసం బంధుత్వాన్ని కూడా పక్కనపెట్టి తన పెదమామ విజయరామరాజు హత్యారాజకీయాలను ప్రేరేపించారని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. తమను పోలింగ్ కేంద్రంలో 3 గంటలపాటు నిర్భందించి దుండగలు తలుపులు విరగ గొట్టేప్రయత్నం చేస్తున్నా అక్కడే ఉన్న తన పెదమామ అయిన విజయరామరాజు మీకు ఇదే మంచి అవకాశం చంపితే చంపండి లేకపోతే భవిష్యత్‌లో మీకు ఇబ్బందులు తప్పవు అంటూ టీడీపీ నాయకులను రెచ్చగొట్టారన్నారు. ఆయన భరోసాతోనే టీడీపీ వర్గీయులు రెచ్చిపోయి హ త్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. సమయానికి పోలీసులు వచ్చి ఉండకపోతే తాము జీవిం చి ఉండేవారం కాదని ఆవేదన చెం దారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు... ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి దంపతులపై దాడికి సంబం ధించి ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. హత్యాప్రయత్నంతో పాటు కులధూషణపై కేసు పెట్టగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 43/2019 యు/ఎస్ 353, 354, 332, 342,323,324,109, ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ 3(1)(ఆర్), 3(1)(ఎస్), 3(2)(వీఏ) ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్ కింద చినమేరంగి పోలీసు స్టేషన్లో ఎస్ఐ పి. ధనుంజయరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరామర్శకు పోటెత్తిన అభిమానులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి వచ్చిన విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న అభిమానులు వందల సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పార్వతీపురం, కురుపాం, కొమరాడ గరుగుబిల్లి మండలాలనుంచి అభిమానులు పోటెత్తడంతో ఆస్పత్రి ప్రాంగణమంతా జనసంద్రంలా కన్పించింది. -
పుష్ప శ్రీవాణి దంపతులకు పరామర్శ
సాక్షి, విజయనగరం : కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి దంపతులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. పోలింగ్ రోజున టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి దంపతులను శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళ అని కూడా చూడకుండా దాడికి పాల్పడటం దారుణమన్నారు. పోలీసులు తక్షణమే స్పందించడం వల్ల శ్రీవాణి దంపతులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై జిల్లా ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనకు స్వస్థి పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారని.. అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. జిల్లాలోని 9 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను ఆయన కుమారుడు వైఎస్ జగన్ అందిస్తాడనే నమ్మకం ఉందన్నారు. ఎన్నికలు సజావుగా జరిపించిన జిల్లా అధికారులకు వైస్సార్ సీపీ తరఫున శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. కురుపాం విషయంలో తప్ప మిగిలిన అన్ని చోట్ల పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిపై దాడి
-
పరీక్షిత్ రాజు, పుష్ప శ్రీవాణిపై దాడి
విజయనగరం జిల్లా: కురుపాం నియోజకవర్గంలోని జీఎంవలస మండలం చినకుదమ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేతలు ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి రానివ్వకుండా ఏకపక్షంగా ఓట్లు వేస్తున్నారు. పరిస్థితిని పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజును టీడీపీ కార్యకర్తలు నిర్బంధించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా పరీక్షిత్ రాజుపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణి చినకుదమకు చేరుకున్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా పుష్పశ్రీవాణిపై కూడా టీడీపీ నేత రామకృష్ణ, ఆయన అనుచరులు దాడికి దిగారు. ఈ ఘటనతో చినకుదమలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసు బలగాలు సరిపడినంత లేకపోవడంతో స్థానికంగా ఉన్న మహిళలే పుష్పశ్రీవాణికి రక్షణగా నిలిచారు. -
నీచ రాజకీయాలు మానుకోవాలి
కురుపాం: టీడీపీ నాయకులు నీచరాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు పరీక్షిత్‌రాజులు అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. మండలంలోని టీడీపీ నాయకులు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని, వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో తమ పార్టీ నాయకులు ప్రతీ ఇంటికీ వెళ్లి ఇంటివారి అంగీకారంతో అం టించిన వైఎస్సార్ ప్రతిమ ఉన్న స్టిక్కర్స్ చింపి వేయటం, వాటిపై చంద్రబాబు స్టిక్కర్స్ అంటిం చమే కాకుండా వైఎస్సార్ సీపీ నాయకుల బ్యాన ర్స్ చింపివేయటం వంటివి చేపడుతున్నారన్నారు. ఇప్పటికే పూతికవలస, సీతంపేట, కస్పాగదబవలస, కాటందొరవలస గ్రామాల్లో వైఎస్సార్ కు టుంబంలో అంటించిన స్టిక్కర్స్‌పై టీడీపీ నేతల స్టిక్కర్లు అంటిస్తున్నారని, ఇటువంటి నీచరాజకీయాలు మానుకోవాలన్నారు. ఒకప్పుడు గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని చూసి స్థానిక టీడీపీ నేతలు మహిళలకు బొట్టు పెట్టే కార్యక్రమని ఎద్దేవా చేశారని, ఇప్పుడు అదే కార్యక్రమాన్ని కాపీ కొట్టి ఇంటింటికీ టీడీపీ అంటూ వెళ్తున్నారన్నారు. స్టిక్కర్లను మూసివేసినా ప్రజల గుండెల్లో చరగని ముద్ర వేసిన రాజశేఖరరెడ్డిని ఎవరూ తొలగించలేరన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, వైస్ ఎంపీపీ వంజరాపు కృష్ణ, ఎంపీటీసీ గొర్లి సుజాత, మం డల కోఆప్షన్ సభ్యులు షేక్ నిషార్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికారి ప్రతినిధి శెట్టి నాగేశ్వరరావు,ఎస్సీసెల్ అధ్యక్షుడు రాయి పిల్లి శ్రీధర్, శ్రీను, షేక్ రజ్వీ, ఆదిల్, త్రిపుర పాల్గొన్నారు. -
'అధికారంలోకి వచ్చారు కాబట్టి తప్పుకాదట'
-
'అధికారంలోకి వచ్చారు కాబట్టి తప్పుకాదట'
చింతపల్లి: తన బంధువులు, టీడీపీ నాయకులకు లాభం చేకూర్చేందుకే ఏపీ సీఎం చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో గురువారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను చంద్రబాబు వ్యతిరేకించారని ఆమె గుర్తు చేశారు. తవ్వకాల వల్ల గిరిజనులకు, పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని 2011లో ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారని, నిన్నమొన్నటివరకు ఈ లేఖ టీడీపీ వెబ్ సైట్ లోనూ ఉందని తెలిపారు. అధికారంలోకి వచ్చారు కాబట్టి బాక్సైట్ తవ్వకాలు తప్పుకాదు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 97 జీవో విడుదల చేసి గిరిజనుల అభివృద్ధి కోసమేనని చెప్పడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. నిజంగా గిరిజనులపై ప్రేమవుంటే గిరిజన గ్రామాలకు, తండాలకు మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు బాసటగా వైఎస్సార్ సీపీ నిలుస్తుందని హామీయిచ్చారు. -
మన్యంపై వైఎస్ఆర్సీపీ పట్టు
సీతంపేట: సీమాంధ్ర పరిధిలోని మన్యంపై వైఎస్ఆర్సీపీ పట్టు సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి మినహా అన్ని చోట్లా ఆ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తెలంగాణ విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల పరిధిలో ఏడు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఆరుచోట్ల వైఎస్సార్సీపీకే ఏజెన్సీ వాసులు పట్టం కట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో మాత్రమే టీడీపీ అభ్యర్థి ముడియం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి విశ్వాసరాయి కళావతి, విజయనగరం జిల్లా కురుపాం నుంచి పాముల పుష్పశ్రీవాణి, సాలూరు నుంచి పీడిక రాజన్నదొర, విశాఖ జిల్లా పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో గిరిజనులకు సంబంధించిన పథకాల అమలు, పర్యవేక్షణలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పాత్ర కీలకం కానుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిబంధనల ప్రకారం గిరిజన సలహా మండలిని ఏర్పాటుచేయాలి. దీనికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. వివిధ శాఖలకు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. నాన్ అఫీషియల్ సభ్యులుగా ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటారు. వీరంతా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కార్యచరణ ప్రణాళిక రూపొందించి, దాని అమలును పర్యవేక్షిస్తారు. అలాగే.. నిధుల వ్యయం, ఇతరత్రా అంశాల్లో సలహాలు, సూచనలు ఇస్తారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా గిరిజన సలహా మండలిలో సభ్యులుగా ఉండేవారు. ప్రతిపక్షానికి చెందిన ఒకరిద్దరినే నియమించేవారు. అది కూడా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జరిగేది. ఇప్పుడు పరిస్థితి వేరు. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీలో ఒక్కరే ఎస్టీ ఎమ్మెల్యే ఉండటం, మిగిలిన వారంతా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకే చెందిన వారు కావడంతో ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారిని సలహా మండలి సభ్యులుగా నియమించక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు శాసనసభ ఎస్టీ కమిటీలోనూ వీరికే ఎక్కువ ప్రాతినిధ్యం లభించనుంది. ఫలితంగా గిరిజన సమస్యలపై స్పందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసే అవకాశం వైఎస్ఆర్సీపీకి దక్కనుంది.