వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిపై దాడి | GM valasa,TDP Leaders Attacked On YSRCP MLA Pamula Pushpa Srivani | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిపై దాడి

Published Thu, Apr 11 2019 5:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

కురుపాం నియోజకవర్గంలోని జీఎంవలస మండలం చినకుదమ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేతలు ఓటర్లను పోలింగ్‌ బూత్‌లోకి రానివ్వకుండా ఏకపక్షంగా ఓట్లు వేస్తున్నారు. పరిస్థితిని పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజును టీడీపీ కార్యకర్తలు నిర్బంధించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా పరీక్షిత్‌ రాజుపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణి చినకుదమకు చేరుకున్నారు.

ఒక మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిపై కూడా టీడీపీ నేత రామకృష్ణ, ఆయన అనుచరులు దాడికి దిగారు. ఈ ఘటనతో చినకుదమలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసు బలగాలు సరిపడినంత లేకపోవడంతో స్థానికంగా ఉన్న మహిళలే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణికి రక్షణగా నిలిచారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement