విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో 152 పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరుపుతున్న టీడీపీ వర్గీయులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ నేతలు యథేచ్ఛగా పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు రిగ్గింగ్‌కు పాల్పడిన వైనానికి సంబంధించిన ఆధారాలు విజయనగరం జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. కురుపాం నియోజకవర్గం కుదుమ పంచాయతీ చినకుదుమలోని బూత్ నంబర్ 152లో ఎన్నికల రోజున(11వ తేదీన) టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీన్ని అడ్డుకునేందుకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, ఆమె భర్త వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అక్కడికి వెళ్లగా.. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.
అయితే టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్న విషయాన్ని రుజువు చేసేందుకు అవసరమైన ఆధారాలు, ఫొటోలు నాలుగు రోజుల తర్వాత బయటపడ్డాయి. ఇందులో టీడీపీ కార్యకర్తలు యథేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడుతూ కనిపించారు. టీడీపీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు స్వీయ పర్యవేక్షణలో ఇదంతా జరిగినట్లు తెలిసింది. 950 ఓట్లు ఉన్న ఈ పోలింగ్ బూత్‌లో ఆ రోజు 667 ఓట్లు పోలయ్యాయి. వీటిలో అత్యధిక శాతం ఓట్లను టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ ద్వారా తమ సైకిల్ గుర్తుపైనే వేసేసుకున్నారు. ఆ సమయలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఈవో ఎస్.శ్రీనివాసరావుతో పాటు మిగిలిన సిబ్బంది అంతా ప్రేక్షక్ష పాత్రకే పరిమితమయ్యారు. (చదవండి: వ్యూహాత్మకంగా అలజడి..)
Comments
Please login to add a commentAdd a comment