kurupam
-
పేరు ఆమెది.. పెత్తనం వారిది..!
కోతి గెంతడం..యజమాని వసూలు చేయడం అన్న సామెత చందాన తయారైంది టీడీపీ కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం మహిళా అభ్యర్థి పరిస్థితి. ఆమెకు బొట్టు పెట్టి ఎన్నికల బరిలో దింపినా వెనుక నుంచి పెత్తనం, ప్రచారం నడిపిస్తున్నదంతా ఆ పార్టీలోని పెద్దలే. ఈ పరిస్థితికి కారణం ఆమెకు కనీస రాజకీయ అనుభవం లేకపోవడమే. నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశించిన వారెవరికీ దక్కకపోవడంతో పోనీలే ఆమెను అడ్డుపెట్టుకుని అయినా పెత్తనం చెలాయించవచ్చన్న ఆలోచనకు వచ్చి తెరవెనుక ఖర్చు చేస్తూ ఎన్నికలు జరగకముందు నుంచే ఆధిపత్యం సాగిస్తున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: మూడు దశాబ్దాలుగా కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది లేదు. ఆ పార్టీ నేతలను నియోజకవర్గం ప్రజలు విశ్వసించే పరిస్థితి కానరాదు. పార్టీలో ఎప్పుడూ అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య ధోరణి, అధికారం చేజిక్కించుకోవాలనే ఆరాటం వెరసి ఎవరికి వారు విశ్వప్రయత్నాలు చేయడం తప్ప అడవి బిడ్డలను పట్టించుకున్న పాపానపోలేదు. ఇదే సందర్భంలో నియోజకవర్గంలో అడుగడుగునా వైఎస్సార్సీపీకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. తమకు మేలు చేసిన జగనన్న ప్రభుత్వమంటే ఇక్కడి గిరిజనుల్లో నమ్మకం గూడు కట్టుకుంది. గడిచిన రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పాముల పుష్పశ్రీవాణి నియోజకవర్గంలో ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. ఆమె విజయాన్ని అడ్డుకునేందుకు నాడు కత్తులు దూసుకున్న వారంతా ఇప్పుడు చేతులు కలిపారు. గిరిజన మహిళ అనే సానుభూతిని తెరపైకి తెచ్చి..నామ్ కే వాస్తేగా ఒక అభ్యర్థిని నిలబెట్టి, కొందరు ‘పెద్దలే’ వెనుక నుంచి కథంతా నడిపిస్తున్నారు. ఇందులో వైరిచర్ల, శత్రుచర్ల వర్గాలు ఒకటైతే..మరో బలమైన సామాజిక వర్గం నేతలు మరికొందరు ఉండడం గమనార్హం.రిమోట్ వారి చేతిలోనే..కురుపాం నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. గిరిజన ప్రజ లు ఎప్పుడూ ఆ పార్టీని తిరస్కరిస్తూనే ఉన్నారు. ఈ దఫా కూడా టీడీపీ నుంచి టికెట్ కోసం చాలా మంది ఆశావహులు పోటీ పడ్డారు. ఆశావహుల్లో వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ ఒకరు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆశీస్సులతో అంటూ తోయక జగదీశ్వరిని టీడీపీ తరఫున నిలబెట్టారు. ఆమెకు ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం మినహా కనీసం మండలస్థాయి నాయకురాలిగానూ పని చేయలేదని, అటువంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తార ని పెద్ద పంచాయితీయే నడిచింది. మరో వర్గంలోని డొంకాడ రామకృష్ణ, దత్తి లక్ష్మణరావు వంటివారు టికెట్ ఆశించి భంగపడ్డారు. గుమ్మలక్ష్మీపురానికి చెందిన బిడ్డిక పద్మావతి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇలా సుమారు నాలుగైదు గ్రూపులు టికె ట్ ఆశించాయి. నియోజకవర్గ ఇన్చార్జిగా తోయక జగదీశ్వరిని నియమించిన తర్వాత ఆమైనెనా తమ అదుపాజ్ఞల్లో ఉంచుకుని, పెత్తనం చెలాయిద్దామన్న ఉద్దేశంతో కొంతమంది బాగా ఖర్చు పెట్టి హడావిడి చేశారు. ఇప్పుడు అభ్యర్థిగా జగదీశ్వరి ఉన్నప్పటికీ..వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ మొత్తం చూసుకుంటున్నారు. దీనివల్ల ఆమెకంటూ స్వతంత్రత గానీ, ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి గానీ కనిపించడం లేదు. ఒకవైపు గిరిజన బిడ్డను ఆదరించాలని కోరుతూనే..మరోవైపు పెత్తనమంతా వీరేష్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయరామరాజు వంటి పెద్దల వద్దే ఉంచుకోవడం ఇప్పుడు గిరిజన ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.ఎమ్మెల్యే అభ్యర్థిపైనే దౌర్జన్యంటీడీపీ నాయకుల దౌర్జన్యాలకు ఇక్కడ కొదవ లేదు. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిపై జియ్యమ్మవలస మండలానికి చెందిన డొంకాడ రామకృష్ణ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. చినబుడ్డిడి పంచాయతీలోని పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని గదిలో నిర్బంధించి తమ అనుచరులతో భయభ్రాంతులకు గురి చేశారు. ఆ ఘటనను నేటికీ నియోజకవర్గ ప్రజలు మరిచిపోలేదు.నియోజకవర్గానికి టీడీపీ చేసింది శూన్యంరాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్య మంత్రిగా చంద్రబాబు చేసింది శూన్యం. తోటపల్లి ప్రాజెక్టు తన వల్లేనంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు..వాస్తవానికి 2003లో తాను పదవి దిగిపో యే నెల ముందు శంకుస్థాపన చేసి వదిలేశారు. ఆ తర్వాత 2004లో అధికారంలో వచ్చిన దివంగత మహానేత వైఎస్సార్ దాదాపు రూ.800 కోట్లు వెచ్చించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి రోశయ్య పదవీ కాలంలో మరికొంత నిధులను వెచ్చించారు. ఆ పనులన్నీ పూర్తి చేసి అప్పగిస్తే.. 2014లో ఆగస్టులో చంద్రబాబు హ యాంలో దీన్ని జాతికి అంకితం చేశారు. దీన్ని తన గొప్పగా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. మళ్లీ తోటపల్లి కాలువల ఆధునికీకరణకు రూ.193కోట్లు కేటాయించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన గడిచిన 59 నెలల కాలంలోనే జరిగిందన్న విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో బస్సు యాత్ర
-
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 24వ రోజు షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించి, వారి సామాజిక సాధికారతకు సీఎం జగన్ తోడ్పడిన వైనాన్ని వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. మంగళవా రం విజయనగం జిల్లా నెల్లిమర్ల, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గాల్లో జరిగిన యాత్రకు జనం నీరాజనాలు పలికారు. బుధవారం ఈ యాత్ర పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నియోజకవర్గాల్లో జరుగుతుంది. కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో వైసీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ ఆఫీస్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు హాజరుకానున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా: కురుపాంలో మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు నందివానివలసలో వైసీపీ నేతల విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 2 గంటలకు పెదమేరంగి, సీమనాయుడువలస మీదుగా బైకు ర్యాలీ జరగనుంది. 3 గంటలకు కురుపాం పోలీస్ స్టేషన్ జంక్షన్లో జరిగే బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు సీదిరి అప్పలరాజు తదితరులు పాల్గొననున్నారు. -
నేడు 24వ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర
-
కురుపాం మండలం భీంపూర్ వంతెన నిర్మాణానికి నిధులు
-
పండుగలా ‘అమ్మ ఒడి’.. సీఎం జగన్ కురుపాం పర్యటన దృశ్యాలు..
-
అమ్మఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
సీఎం జగన్‌కు ఇంట్రెస్టింగ్ గిఫ్ట్..
-
4 పెళ్లిళ్లు.. ఆ పేటెంట్ ఆయనకే సొంతం.. లారీ ఎక్కి ఊగిపోతున్న ప్యాకేజీ రౌడీ..!
-
మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్ గా తయారుకావాలన్నదే లక్ష్యం
-
ఆ ప్యాకేజీ స్టార్ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ.. : సీఎం జగన్
సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే.. చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అబద్ధాలు.. మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంలో గభాంగా.. కురుపాం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్‌పైనా మండిపడ్డారు. తన 45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏనాడూ మంచి గురించి ఆలోచించలేదు. టీడీపీని టీ అంటే తినుకో.. డీ అంటే దండుకో.. పీ అంటే పంచుకోగా మార్చేశారు. దోచుకున్న సొమ్ముతో వాళ్లు బొజ్జలు పెంచుకున్నారని ఎద్దేశా చేశారాయన. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఏ మంచీ చేయని ఈ బాబు.. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రాంతానికీ ఏ మంచీ చేయని ఈబాబు.. ఏ సామాజిక వర్గానికీ కూడా ఏ మంచీ చేయని బాబు. ఎన్నికల ముందు మేనిఫెస్టో బుక్కు తెస్తారు. అధికారంలోకి వస్తే.. మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేస్తారు. ఇదీ వాళ్ల ట్రాక్ రికార్డు. మరోసారి ఇదే దుష్ట చతుష్టయం.. ఇదే బాబు.. మరోసారి అధికారం ఇవ్వండంటూ మరోసారి మేనిఫెస్టోతో మళ్లీ మోసానికి దిగారు.డ్రామాలు ఆడటం మొదలు పెట్టారు. ఈసారి డ్రామాలకు కొంచం రక్తి కట్టించారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారంట.. మోసం చేసేదానికి ఒక హద్దులు పద్దులు పోయి.. జగన్ ఏం చేస్తున్నాడు.. జగన్ కంటే కాస్త ఎక్కువ చెప్పాలని మోసం చేయడంలో రక్తి కట్టిస్తున్నాడు. వీళ్లందరికీ తోడు ఒక దత్త పుత్రుడు ఉన్నాడు. ఈ దత్త పుత్రుడు.. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు, ఇదే చంద్రబాబుకు మద్దతు పలికాడు. మీ ఇంటికి లేఖలొచ్చాయి. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు దత్తపుత్రుడి సంతకంతో లేఖలు వచ్చాయి. మాదీ బాధ్యత అని.. ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల ప్రణాళిక చెత్త బుట్టలో వేశారు. మన రాష్ట్రంలో మంచిచేయొద్దని చెప్పే నాలుగు కోతులు ఉన్నాయి. మంచి అనోద్దు.. మంచి వినోద్దు..మంచి చేయొద్దు అన్నదే వారి విధానం. నమ్మించి ప్రజలను నట్టేటా ముంచడమే వాళ్లకు తెలిసిన నీతి. రాష్ట్రంలో మంచి జరుగుతుంటే భరించలేకపోతున్నారు. వాళ్లకు కడుపులో మంట, ఈర్ష్యతో వాళ్లకు కళ్లు మూసుకుపోయాయి. దత్తపుత్రుడు 2014లోనూ చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు. మరి ఆ తర్వాత చంద్రబాబు చేసిన మోసాన్ని ఎందుకు నిలదీయలేదు. ఆ దత్తపుత్రుడు.. మామూలుగా మాట్లాడడు. ఆ ప్యాకేజీ స్టార్ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని.. చెప్పుతో కొడతానంటాడు. తాట తీస్తానంటాడు. ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఆ మనిషి నోటికి అదుపు లేదు.. నిలకడా లేదు. వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకొని రాలేం. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేం. అవన్నీ వారికి చెందిన పేటెంట్. దుష్టచతుష్టయం సమాజాన్ని చీల్చుతోంది. కానీ, మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి. అందుకే పనికి మాలిని పంచ్ డైలాగులు ఉండవ్. బలమైన, పటిష్టమైన పునాదుల మీద నిలబడ్డాం. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలులో మన పునాదులు ఉన్నాయి. పేదల కష్టాల నుంచి మన పునాదులు పుట్టాయి. మన పునాదులు ఓదార్పు యాత్ర నుంచి పుట్టాయి. వాళ్ల మాదిరిగా వెన్నుపోటు, అబద్ధాలపై మన పునాదులు పుట్టలేదు. రాష్ట్రంలో రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నాం. యుద్ధంలో వారి మాదిరిగా మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేవు. వారి మాదిరిగా మనకు దత్తపుత్రుడు లేడు. అబద్ధాలను పదే పదే చెప్పి భ్రమ కలిగించే మీడియా మనకు లేదు. మీ బిడ్డ ప్రభుత్వంలో 5 మంది డెప్యూటీ సీఎంలలో నలుగురు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలే. రాష్ట్రానికి హోం మంత్రి నా దళిత చెల్లెమ్మ. అలాంటి మనందరి ప్రభుత్వం మీద కావాలని పనిగట్టుకొని సమాజాన్ని చీల్చడం కోసం వాళ్లు పడుతున్న పాట్లు చూడాలి. పేదల కోసం తీసుకొస్తున్న విద్యా విప్లవంలో మన పునాదులున్నాయి. పేదల జీవితాలు మార్చేలా వాళ్ల కోసం చేస్తున్న ఇళ్ల స్థలాల్లో ఉన్నాయి. వారి కోసం కట్టిస్తున్న ఇళ్లలో మన పునాదులున్నాయి. గ్రామాల్లో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అవ్వాతాతలు, పిల్లలకు మంచి జరిగేలా అందిస్తున్న పౌర సేవల్లో నా పునాదులున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాల్లో మన పునాదులున్నాయి. పనికిమాలిన పంచ్ డైలాగుల్లో లేవు వాళ్ల మాదిరిగా. మన పునాదులు మన ఓదార్పు యాత్ర నుంచి, 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో, పేదల కష్టాల్లోంచి నా పునాదులు పుట్టాయి. వారి మాదిరిగా వెన్నుపోటులోంచి నా పునాదులు పుట్టలేదు. అబద్ధాలపైన మన పునాదులు లేవు. దోచుకో, పంచుకో,తినుకో అనే సిద్దాంతం నుంచి పుట్టలేదు. పేద వాడి కోసం నిలబడగలిగాం కాబట్టే 2009 నుంచి ఇప్పటి వరకు ఒకసారి జగన్ అనే మీ అన్నను ఒక్కసారి గమనిస్తే.. ఎక్కడా కూడా ఏ కార్యకర్తా కూడా జగన్ ను చూసినప్పుడు జగన్ నడిచే నడక చూసినప్పుడు అడుగో అతడే మా నాయకుడని కాలర్ ఎగరేసేలా నడత, ప్రవర్తన ఉంది. ఏ రోజూ అధర్మాన్ని, అబద్దాలు చెప్పి గెలవాలని ప్రయత్నం చేయలేదు. అధికారం కోసం, పొత్తుల కోసం పాకులాడలేదు. ప్రతి అడుగులోనూ పేద వాడు బాగుండాలని ఆలోచన చేశా. ఇదీ మన పునాది. ఇదీ మన ఫిలాసఫీ, ఇదీ మన పార్టీ. ఇదీ మన మనసున్న ప్రభుత్వమని తెలియజేస్తున్నా. మీ బిడ్డ పొత్తుల కోసం ఏరోజూ పాకులాడలేదు. రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. మీ బిడ్డ తోడేళ్లను నమ్ముకోలేదు.. దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. జరగబోయే కురుక్షేత్రంలో మీ బిడ్డకు మీరే అండ. మీ బిడ్డకు అండగా ఉన్నది ఆ భగవంతుడు.. ప్రజలు మాత్రమే. మీకు మంచి చేశాను అనిపిస్తేనే ఈ యుద్ధంలో మీరే నాకు అండగా నిలవాలి అని కోరారాయన. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో 10 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరగబోతున్న వేడుకలో ప్రజా ప్రతినిధులంతా పాల్గొనాలని ఆదేశిస్తున్నా. ఇంకా మీకు మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా అని తన ప్రసంగం ముగించారు సీఎం జగన్. -
అమ్మ ఒడి: కురుపాంలో థాంక్యూ జగన్ మామయ్య (ఫొటోలు)
-
పేదల తలరాతలు మార్చే పథకం జగనన్న అమ్మ ఒడి: పుష్పశ్రీవాణి
-
చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం: సీఎం జగన్
సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందులో భాగంగా పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహిస్తాం అని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతీ ఒక్కరికి నిండు మనసుతో.. హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు. తల్లులు తమ పిల్లలను బడులకు పంపేందుకు అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం. ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో.. క్లాస్ టీచర్లకే గతిలేని పరిస్థితి గతంలో చూశాం. ఇప్పుడు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా చేస్తున్నాం. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్‌గా తయారు కావాలి అని సీఎం జగన్ వేదిక నుంచి ఆకాంక్షించారు. ► ఒకటి నుంచి 12వ తరగతి దాకా చదివిస్తున్న 42,61,965 మంది అక్కచెల్లెమ్మలకు అండగా, 83,15,341 మంది విద్యార్థులకు మంచి జరిగిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా రూ.6,392.94 కోట్లు అక్కచెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకైనా అమ్మ ఒడి వర్తింపజేస్తున్నాం. బటన్ నొక్కడం అంటే ఇదీ.. బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్ధాయిలకు ఈ విషయం అర్థం అయ్యేలా చెప్పండి అని కోరుతున్నా. ► భారతదేశంలోనే 28 రాష్ట్రాల్లో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇక మీదట కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పిల్లల బంగారు భవిష్యత్ కోసం తప్పనిసరిగా మీ పిల్లలను బడికి పంపించండి. నాలుగేళ్లుగా మీ పిల్లల బాగు కోరే ప్రభుత్వంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులన్నింటిలో కూడా ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. బడులు ప్రారంభం కాగానే మెరుగైన విద్యాకానుక కిట్లను ప్రతి పిల్లాడు, ప్రతి పాప చేతిలో పెడుతున్నాం. 3వ తరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ టోఫెల్ కరిక్యులమ్ తీసుకొచ్చింది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే. పిల్లలను బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్ లు, చక్కగా అర్థమయ్యేందుకు మొట్టమొదటి సారిగా ఇస్తున్నాం. బైజూస్ కంటెంట్ ను కూడా మన పాఠాల్లోకి అనుసంధానం చేయడం మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది. 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమును డిజిటలైజ్ చేసి ఐఎఫ్పీలను తెచ్చి డిజిటల్ బోధనను స్కూల్స్ లోకి తీసుకొచ్చాం. ► అంగన్వాడీల్లోనూ మార్పులు తెచ్చాం. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సంపూర్ణ పోషణ అమలు చేస్తున్నాం. సంపూర్ణ పోషణ ప్లస్ కూడా గిరిజన ప్రాంతాల్లో అమలు చేస్తున్నాం. పాఠశాలలన్నీ రూపు రేఖలు మార్చి 45,000 గవర్నమెంట్ స్కూళ్లలో నాడు-నేడు తెచ్చాం. 8వ తరగతి పిల్లలకు, టీచర్లకు ఇద్దరికీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో కూడా పని చేసేలా వారికి ట్యాబ్స్ అందిస్తున్న మీ మేన మామ ప్రభుత్వం. ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ పథకాన్ని అమలు చేస్తున్నాం. మీ మేనమామ ప్రభుత్వంలోనే.. పెద్ద చదువుల కోసం వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో జగనన్న విద్యా దీవెన ఇస్తోంది మీ మేనమామ ప్రభుత్వంలోనే. మెస్ ఖర్చులు, హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మీ మేనమామ ప్రభుత్వమే. పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి. ప్రతి కుటుంబం నుంచి సత్యనాదెళ్ల రావాలి. పదో తరగతి పూర్తి చేసి ఉండాల్సిందే అన్న నిబంధనతో వైఎస్సార్ కల్యాణమస్తు-షాదీ తోఫా అమలు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసం అక్షరాలా రూ.66,722 కోట్లు ఖర్చు. గత ప్రభుత్వం దాదాపు కోటి మంది పిల్లలకు చేసిన అన్యాయం క్షమించగలమా అని అడుగుతున్నా. ప్రభుత్వ బడులతో వెలుగులు పెత్తందార్లకు అందుబాటులో ఉన్న ఆ చదువులకంటే గొప్ప చదువులు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులు.. ప్రైవేట్ బడులకు తీసిపోకుండా పోటీ పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. గవర్నమెంట్ బడుల్లో ఆణిముత్యాలుంటాయని, వజ్రాలు, రత్నాలు మెండుగా పుట్టే విద్యా విధానాన్ని తీసుకొచ్చింది మీ మేనమామ ప్రభుత్వంలోనే. పేద కుటుంబాల్లో వెలుగులు నింపేలా గవర్నమెంట్ బడి వెలుగుతోంది. టెన్త్ పరీక్షల్లో గవర్నమెంట్ స్కూళ్లో నుంచి టాప్ 10 ర్యాంకులు గతేడాది 25 రాగా, ఈ ఏడాది ఏకంగా 64కు పెరిగాయి. 75 శాతానికి పైగా మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 63,275 మంది అయితే, ఈ ఏడాది 67,114కు పెరిగింది. గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలు 66.50 శాతం ఫస్ట్ క్లాస్ లో పాసయితే ఈ ఏడాది 70.16 శాతానికి పెరిగారు. 67 మంది పిల్లలకు ఐఐటీ, ఎన్ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు దొరికే అవకాశం ఈ సంవత్సరం రాబోతోంది. ఇవి ఫలితాలు.. 2018-19లో స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో.. 84.48 శాతంతో మన రాష్ట్రంలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటే ఇప్పుడు 100.80 శాతంతో, జాతీయ సగటు 100.13 శాతం కంటే మెరుగ్గా ఉన్నాం. ఇది విద్యారంగంలో మనం చూపించిన శ్రద్ధకు దక్కిన ఫలితాలివీ. గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నది మీ బిడ్డ ప్రభుత్వమే. 5 మంది డిప్యూటీ సీఎంలను తయారు చేస్తే అందులో నా చెల్లెమ్మ మొట్ట మొదటి గిరిజన డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో పని చేసిన చరిత్ర. మీ జగనన్న క్యాబినెట్ లో గిరిజనుడు ఒక డిప్యూటీ సీఎంగా ఈరోజు పని చేస్తున్నాడు. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని వేసిన చరిత్ర మనది నవరత్నాలను మారుమూల ఉన్న ట్రైబల్ విలేజ్ కు చేర్చాలని తపన పడుతున్నాం. కురుపాం నియోజకవర్గంలోనే 118 టవర్లను ఒక్కో టవర్ ఖర్చు 80 లక్షలతో 2,600 సెల్ ఫోన్ టవర్లు నిర్మాణంలో కనిపిస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ కడుతున్నాం. కురుపాం నియోజకవర్గంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వేగంగా కడుతున్నాం. ఇదే కురుపాం నియోజకవర్గంలో మరో మెడికల్ కాలేజీ రాబోతోంది. ఇదే ట్రైబల్ ప్రాంతంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఒకటి పాడేరులో వేగంగా కడుతున్నారు.మరొకటి కురుపాంలో రాబోతోంది. మూడోది నర్సీపట్నంలో వేగంగా కడుతున్నారు. నాలుగోది విజయనగరంలో రేపు సంవత్సరం అడ్మిషన్లు రాబోతున్నాయి. వచ్చే నెల ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నాం. గిరిజనుల కోసం ఏకంగా 147242 కుటుంబాలకు మేలు చేస్తూ ఆర్వోఎఫ్ఆర్ డీకేటీ పట్టాలు 362737 ఎకరాలను పంచి పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. కురుపాంలోనే 21311 కుటుంబాలకు 38798 ఎకరాలు పంపిణీ చేశాం. వాళ్లందరికీ రైతు భరోసా సొమ్మును కూడా గత నాలుగేళ్లుగా ఇస్తున్న ప్రభుత్వం మనది. నామినేటెడ్ పదవి, కాంట్రాక్ట్ నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించాలని చట్టం చేశాం. మన కళ్లెదుటనే గ్రామ సచివాలయాల్లో 1,30,000 మంది ఉద్యోగస్తులు కనిపిస్తున్నారు. నా ఎస్టీ, ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు వీటిలో 84 శాతం కనిపిస్తున్నారు. పెత్తందార్లకే అందుబాటులో ఉన్న చదువులు .. ఇప్పుడు పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు సీఎం వైఎస్ జగన్. ఈ క్రమంలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని క్షమించగలమా? అని ప్రశ్నించారాయన. పెత్తందారీ విద్యావిధానాన్ని బద్ధలు కొట్టి.. అన్నివర్గాలకు ఉన్నతవిద్యను అందిస్తున్నామన్నారు. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడులని తీర్చిదిద్దాం. ప్రైవేట్ బడులతో ప్రభుత్వ బడులు పోటీపడే పరిస్థితికి చేరుకుంది. చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం. ప్రభుత్వ బడుల్లోనూ వజ్రాలు, రత్నాల్లాంటి పిల్లలు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మరోసారి ఉద్ఘాటించారు సీఎం జగన్. -
Live: జగనన్న అమ్మ ఒడి... కురూపంలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
-
కురుపాంలో అమ్మ ఒడి నిధుల్ని జమ చేసిన సీఎం జగన్
జగనన్న అమ్మ ఒడి 2023.. కురుపాం సభ అప్డేట్స్ ► కురుపాంలో 2023-24 ఏడాదిగానూ.. అమ్మ ఒడి నిధుల్ని బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో జమ చేశారు సీఎం జగన్. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి కొనసాగుతోంది. అన్ని స్కూల్స్, కాలేజీల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. అవినీతి, వివక్ష లేకుండా నేరుగా నిధులు అందజేస్తున్నాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకే అమ్మ ఒడి పథకం. ప్రపంచస్థాయిలో పిల్లలు పోటీపడేలా తీర్చిదిద్దుతున్నాం. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వచ్చే తరం మనకంటే బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ► రోజుకో మెనూతో విద్యార్థులకు గోరుముద్ద అందిస్తున్నాం. పిల్లలకు తొలిసారిగా బైలింగ్వుల్ పుస్తకాలు అందజేస్తున్నాం. పిల్లలకు సులువుగా అర్థమయ్యేందుకు డిజిటల్ బోధనను తీసుకొచ్చాం. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు అమ్మ ఒడి అందిస్తున్నాం. అమ్మ ఒడి కింద ఇప్పటి వరకు రూ.26,067.28 కోట్లు అందజేశాం. ► అంగన్వాడీల్లోనూ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తున్నాం. నాడు-నేడు ద్వారా 45వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ పిల్లలకు ట్యాబ్స్ కూడా అందించాం. ఆడపిల్లల కోసం స్వేచ్చ పథకం అమలు చేస్తున్నాం. ► విదేశాల్లో పెద్ద చదువుల కోసం విద్యార్థులకు ఎక్కడ సీటు వచ్చినా రూ. కోటి 25లక్షలు అందజేస్తున్నాం. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా అమలుచేస్తున్నాం. పెద్ద చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా వంద శాతం పూర్తి ఫీజురియింబర్స్మెంట్తో జగనన్న విద్యాదీవెన అందిస్తున్నాం. ప్రతీ కుటుంబంలోనూ ఒక సత్యనాదెళ్ల వంటి వ్యక్తి రావాలి. పెత్తందారులకు అందుబాటులో ఉన్న చదవుల కన్నా గొప్ప చదువులు పేదల పిల్లలకు అందుబాటులోకి వచ్చాయి. చదువుల్లో అంటరానితనాన్ని తుదముట్టించాం. నాలుగేళ్లలో ఏపీలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి అమలవుతోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. బడులు ప్రారంభమైన వెంటనే మెరుగైన విద్యాకానుక కిట్లు అందజేస్తున్నాం. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండేలా చర్యలు చేపట్టాం. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్‌గా తయారుకావాలన్నదే లక్ష్యం. ► విద్యార్థి మనస్వినీ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ద్వారా నేను ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాను. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లెజెండ్ అని ప్రశంసించింది. సీఎం జగన్ తీసుకువచ్చిన ప్రతీ పథకం తమకు ఎంతో మేలు చేస్తున్నదని తెలిపింది. సీఎం జగన్ ఏపీలో హిస్టరీ క్రియేట్ చేశారని పేర్కొంది. ► మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 83 లక్షల మందికిపైగా విద్యార్థులకు అమ్మఒడి ద్వారా లబ్ధి. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారు. విద్యారంగంలో సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడేలా తీర్చిదిద్దుతున్నారు. ► ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. పిల్లలను బడికి పంపించాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి. ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలనే లక్ష్యంతోనే అమ్మఒడి పథకం తీసుకువచ్చాం. విద్యారంగంలో సీఎం జగన్ సంస్కరణలు తీసుకువచ్చారు. ► పేదల తలరాతలు మార్చే పథకం జగనన్న అమ్మఒడి. చదువుల విప్లవం ఎలా ఉంటుందో సీఎం జగన్ ప్రభుత్వంలో చూస్తున్నాం. ► జగనన్న అమ్మఒడి పథకం గొప్ప ఆలోచన. పేద పిల్లల చదువు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ► చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా పేదల చదువుల కోసం అమ్మఒడి లాంటి పథకం అమలు చేశారా?. ► అమ్మ ఒడి పథకం పేదల అక్షయపాత్ర. పేదలకు మేలు చేసే జగనన్న డెడికేషన్‌ను చంద్రబాబు కాపీకొట్టలేరు. చంద్రబాబు పప్పులు ఈసారి జనం దగ్గర ఉడకవు. ► పార్టీ గుర్తులేని వారు ఎంతమంది గుంపులుగా వచ్చినా కనీసం జగనన్న నీడను కూడా తాకలేరు. జగనన్నను గుండెల్లో పెట్టుకున్న హనుమంతుని లాంటి కార్యకర్తలు కోట్లలో ఉన్నారు. ► జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమం కోసం.. కురుపాం బహిరంగ సభ వేదికపైకి సీఎం జగన్ చేరుకున్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి.. జ్యోతి ప్రజల్వనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రజలకు అభివాదం చేసి కూర్చున్నారు. ► సీఎం జగన్ రాక నేపథ్యంలో.. కురుపాం హెలిప్యాడ్ వద్దకు భారీగా జనం చేరుకున్నారు. ఆయన్ని చూసి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆ అభిమానానికి మురిసిపోయిన ఆయన.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆత్మీయ స్వాగతం ► సీఎం వైఎస్ జగన్ కురుపాం చేరుకున్నారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర, పుష్ప శ్రీ వాణి, ఎమ్మల్యే లు, ఎంపీలు.. ఆయనకు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో నాలుగో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం. ► జగనన్న అమ్మఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంతో.. కురుపాంలో పండుగ వాతావరణం నెలకొంది. ► ఇక గత నాలుగేళ్లలో నాలుగేళ్లలో విద్యా రంగంపై సీఎం జగన్ ప్రభుత్వం రూ.66,722.36 కోట్లను వెచ్చించారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నారు. ► తాజాగా విడుదల చేయబోయే నిధులతో కలిపి.. ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని లబ్ధిదారులకు చేకూర్చినట్లయ్యింది జగనన్న ప్రభుత్వం. ► కురుపాం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి అమ్మ ఒడి నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ► పార్వతీపురం మన్యం పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి. ► జగనన్న అమ్మ ఒడి 2023 నిధుల విడుదల కోసం.. తాడేపల్లి తన నివాసం నుంచి పార్వతీపురం మన్యం కురుపాంకు బయల్దేరారు సీఎం జగన్. ► పార్వతీపురం మన్యం కురుపాం బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. అమ్మ ఒడి నిధుల్ని సీఎం జగన్ విడుదల చేస్తారు. ► వరుసగా నాలుగో ఏడాదీ 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పది రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఇందుకోసం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంను వేదికగా ఎంచుకున్నారు. ఇదీ చదవండి: వృత్తి నిపుణుల జాబితాలోకి రైతులు! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
28న కురుపాంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. 28వ తేదీ ఉదయం 8 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి.. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కాలేజ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేసి.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
పంచాయతీ అధికారుల చేతివాటం!
సాక్షి, పార్వతీపురంమన్యం(కురుపాం): వివిధ కేసుల్లో పట్టుబడిన వారిని విడిపించేందుకు జామీనుగా వెళ్లేవారికి సాల్వెన్స్ (ఇంటిపన్ను, ఆస్తి ధ్రువీకరణ పత్రం) సర్టిఫికేట్ అవసరం. వీటి మంజూరుకు పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్‌లో ఓ అధికారి రూ.500 చొప్పున వసూలు చేశారంటూ మొండెంఖల్ పంచాయతీ పరిధిలోని మర్రిమానుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక లక్కాయి, గురపన్న, దుర్గన్న తదితరులు స్థానిక విలేకరుల వద్ద బుధవారం వాపోయారు. ఇదే విషయాన్ని ఎంపీడీఓ వి.శివరామప్ప వద్ద విలేకరులు ప్రస్తావించగా ఇప్పటివరకు నా దృష్టికి రాలేదని, డబ్బులు వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బెదిరించి లొంగదీసుకుని.. గిరిజన బాలికలపై లైంగిక దాడి..
విజయనగరం(కురుపాం): నూతన సంవత్సర శుభవేళ.. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన బాలికలపై ఓ రౌడీషీటర్ కన్నేశాడు. పోలీస్‌నంటూ బెదిరింపులకు దిగి ఇద్దరు బాలికలపై లైంగిక దాడి యత్నానికి తెగబడిన విషాదకర ఘటన కురుపాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కురుపాం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ పోస్ట్‌మెట్రిక్ బాలికల వసతిగృహంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ, హెచ్ఈసీ గ్రూపులు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు.. తమ స్నేహితులతో కలిసి జియ్యమ్మవలస మండలంలోని వట్టిగెడ్డ రిజర్వాయర్‌ను చూసేందుకు శనివారం వెళ్లారు. తిరిగి కాలినడకన వసతిగృహానికి పయనమయ్యారు. సాయంత్రం 3 గంటల సమయంలో చినమేరంగికి చెందిన వెలగాడ రాంబాబు అనే వ్యక్తి విద్యార్థినులు, వారి స్నేహితులను అడ్డగించాడు. తను పోలీసునంటూ బెదిరించాడు. చదవండి: (భార్యతో వివాహేతర సంబంధం.. భర్తకు తెలిసి వేటకొడవలితో..) చెప్పినట్టు వినకపోతే మీ ఫొటోలు సోషల్‌మీడియా, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇద్దరు విద్యార్థులను దూరంగా పంపించేసి... బాలికలను సమీపంలోని పామాయిల్‌తోటకు తీసుకెళ్లాడు. ఒకరి తరువాత ఒకరిపై లైంగికదాడికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానంటూ భయపెట్టాడు. ఘటన అనంతరం కన్నీరు మున్నీరు పెట్టుకుంటూ వసతిగృహానికి చేరుకున్న విద్యార్థినులు విషయాన్ని వసతిగృహ సంక్షేమాధికారిణి మండంగి సీతమ్మకు తెలియజేశారు. ఆమె వెంటనే కురుపాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎల్విన్‌పేట సీఐ తిరుపతిరావు, కురుపాం ఎస్ఐ బి.శివప్రసాద్‌లు వసతిగృహానికి చేరుకున్నారు. చదవండి: (యువతి ప్రేమించిన వాడితో వెళ్లిపోతే.. కుటుంబాన్ని జాతి నుండి వెలివేశారు) బాధితుల నుంచి వివరాలు సేకరించారు. పార్వతీపుపురం డీఎస్పీ సుభాష్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే వసతిగృహానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇద్దరు బాలికలను వైద్య పరీక్షలకు పంపిస్తామని చెప్పారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడు రాంబాబుపై ఇప్పటికే చినమేరంగి పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. రౌడీషీట్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
మామిడి తాండ్ర రుచి ... తినరా మైమరచి
తాండ్ర... ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు. కురుపాం(విజయనగరం జిల్లా): గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న కొండమామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. తాండ్ర తయారీ ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. తియ్యరగు మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు. టెంకపిండి అంబలిగా... మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. మార్కెట్లో మంచి గిరాకి.. ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు. మామిడితో ఎంతో మేలు ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే మేము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. – బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు గిరిజన గ్రామం, కురుపాం మండలం -
మామిడి తాండ్ర రుచి.. తినరా మైమరచి
తాండ్ర...ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు. కురుపాం: గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న మామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. తాండ్ర తయారీ ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. తియ్యరగు మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు. టెంకపిండి అంబలిగా... మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. మార్కెట్లో మంచి గిరాకీ.. ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు. మామిడితో ఎంతో మేలు ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే తాము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. - బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు, కురుపాం మండలం -
‘అల్లనేరేడు’ తింటే ఆరోగ్యానికి ఎంత మేలో..
జియ్యమ్మవలస: గిరిజనులకు అల్లనేరేడు తోటలు ఆసరాగా నిలుస్తున్నాయి. కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్షి్మపురం, కొమరాడ మండలాల్లో నేరేడు తోటలు ఎక్కువగా పెంచుతున్నారు. జియ్యమ్మవలస మండలంలో టికేజమ్ము, పిటిమండ, కొండచిలకాం, నడిమిసిరిపి, పల్లపుసిరిపి, చాపరాయిగూడ, బల్లేరు తదితర గ్రామాలలో విపరీతంగా నేరేడు చెట్లున్నాయి. గిరిజన గ్రామాలలోనే కాకుండా గిరిజనేతర గ్రామాలలో కూడా ఈ చెట్లను పెంచుతున్నారు. సాధారణంగా అల్లనేరేడు చెట్టును నాటినప్పటి నుంచి సుమారు నాలుగేళ్లలోపు పంటకు వస్తుంది. ఒక్కో చెట్టు సుమారు 100 కిలోల వరకు చెట్టు పెరుగుదలను బట్టి దిగుబడి వస్తుందని గిరిజనులు అంటున్నారు. గిరిజన గ్రామాలకు వ్యాపారులు వచ్చి బేరాలు కుదుర్చుకుంటారు. కేజీ నేరేడు పండ్లు రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తుంటారు. వాటిని పట్టణాలకు తీసుకుపోయి కిలోను రూ.160కు విక్రయిస్తుంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పౌరాణికంగాను, ఔషధపరంగా కూడా జంబూ వృక్షానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కడుపులో పేరుకుపోయిన మలినాలు బయటకు పోవడానికి నేరేడు పండ్లను తినడం మంచిదని, మూత్ర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. నేరేడుకు పట్టణాల్లో డిమాండ్ అల్లనేరేడు పండుకు గిరిజన ప్రాంతాలలో అంతగా ధర లేదు. పట్టణాల్లో ఎక్కువ ధర ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుండడంతో ఇక్కడ ఎవరూ కొనరు. దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటాం. - మండంగి అప్పారావు, బల్లేరుగూడ షుగర్‌కు దివ్య ఔషధం షుగర్ వ్యాధిగ్రస్తులు అల్లనేరేడు పండును తింటే దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఈ గింజలను పొడిరూపంలో చేసుకుని తింటే ఫలితం ఉంటుంది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే పండే ఈ పండుకు ఆదరణ ఉంది. - డాక్టర్ శ్రావణ్‌కుమార్, వైద్యాధికారి, పీహెచ్సీ, ఆర్‌ఆర్‌బీపురం చదవండి: నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా.. -
ఉప ముఖ్యమంత్రే వండి వడ్డించారు!
-
చెల్లీ.. ఏ.. బీ.. సీ.. డీ.. నాంపల్లి టేషను కాడ..
గుంటూరు అరండల్‌పేట ఒకటో లైనులో రోడ్డు పక్కన గుడారం వేసుకుని జీవిస్తున్న నిరుపేద కుటుంబమిది. కుటుంబ పోషణార్ధం తండ్రి పనికి వెళ్లాడు, తల్లి ఆనారోగ్యంతో బాధపడుతుండటంతో పెద్దకుమార్తె తన ఇద్దరు చెల్లెళ్లను చూసుకోవడానికి బుధవారం బడి మానేసింది. నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆ బాలిక ఇంటి వద్ద తన ఇద్దరు చెల్లెళ్ల్లతో ఏబీసీడీలు దిద్దిస్తోంది. – మిరియాల వీరాంజనేయులు, గుంటూరు అరండల్‌పేట కొడవలి పట్టిన కలెక్టర్ కలెక్టర్ కొడవలి పట్టి వరికోత కోశారు. విజయనగరం జిల్లా కురుపాం మండలంలో జట్టు ట్రస్టు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలాలను కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ బుధవారం పరిశీలించారు. దురుబిలి గ్రామానికి చెందిన పత్తి అనే రైతు పొలంలో కలెక్టర్ వరి కోత కోశారు. అనంతరం వరి పంట కోత ప్రయోగం చేసి అధిక దిగుబడి వచ్చినట్టు వ్యవసాయాధికారులు గుర్తించారు. – కురుపాం నాంపల్లి టేషను కాడ.... హైదరాబాద్ నగరానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేదలు, యాచకులు, నిరాశ్రయలు తల దాచుకునే చోటులేక నాంపల్లి రైల్వేస్టేషన్ ఎదుట బుధవారం రాత్రి వణికించే చలిలో నిద్రపోతున్న దృశ్యం -
300 కిలోల కేక్ కట్ చేసిన పుష్ప శ్రీవాణి
సాక్షి, విశాఖ: అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం అమలు అవుతుందని ఉపముఖ్యమంత్రి, గిరిజనశాఖ మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా కుల మత బేధాలు లేకుండా అందరకి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి ఆమె విశాఖలోని వైయస్ఆర్ సీపీ కార్యాలయానికి వచ్చారు. వైఎస్సార్ సీపీ విశాఖ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను అరికడతామన్నారు. గతంలో గిరిజనులకు ఇచ్చిన మాట తప్పమని, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ, పార్టీ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల, యతిరాజుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు విశాఖలోని ప్రేమ సమాజంలో మంత్రి పుష్ప శ్రీవాణి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. తన తొలి వేతనంలో 50 వేల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు సొంత నియోజకవర్గం కురుపాంలో మంత్రికి ఘన స్వాగతం లభించింది. జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో పుష్ప శ్రీవాణి నివాసంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 300 కిలోల కేక్‌ను ఆమె కట్ చేశారు. -
లెక్క తేలేదెప్పుడో...!
సాక్షి, కురుపాం: పోస్టల్ బ్యాలెట్ల లెక్క తేలేదెప్పుడో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నెల 22 వరకు వేసేందుకు గడువు ఉండడంతో పోస్టల్ బ్యాలెట్‌పైనే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు దృష్టి సారించారు . సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి నెల రోజులు దాటింది. ఏప్రిల్ 11న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరిగింది. అప్పటికే ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ముందుగానే సిద్ధం చేశారు. అయితే ఏప్రిల్ 11న ఎన్నికల విధులను నిర్వహించేందుకు వెళ్లే ప్రతీ అధికారి వివరాలు సేకరించి వారికి పోస్టల్ బ్యాలెట్లను అందజేశారు. పోలింగ్ ముగిసి లెక్కింపు సమీపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అత్యంత కీలకం కానున్నాయి. ఎన్నికల్లో ప్రతీ ఓటును ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ ఆ ఓటు దక్కాలన్న ఆలోచనలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్‌పై దృష్టి పెట్టినట్టు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్క ఏమిటోనని తీవ్రంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని పార్టీలకు చెందిన నాయకులు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకే ఎర చూపి ఏకంగా బేర సారాలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 23న జరగనున్న ఎన్నికల లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్లనే లెక్కింపుకు అవకాశం ఉండటంతో పాటు ఆ ఓట్లే తమ విజయం వైపు మలుచుకోవాలని అభ్యర్థులు దృష్టి సారించినట్టు తెలిసింది. 1542 పోస్టల్ బ్యాలెట్లు కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఉద్యోగులకు 1542 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. వీటిలో ఏప్రిల్ 11న కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటింగ్ ప్రక్రియలో 476 మంది ఉద్యోగులు ఎన్నికల విధులకు వెళ్లే ముందు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా మిగిలిన 1066 మందిలో 50శాతం వరకు కురుపాం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసి పోస్టల్ బూత్‌లో తమ బ్యాలెట్లను వేయగా మరికొందరు తపాలా శాఖ ద్వారా పోస్టాఫీసుకు వెళ్లి అసెంబ్లీ, పార్లమెంటుకు చెందిన బ్యాలెట్లు వేశారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగటానికి ఈ నెల 22 వరకు సమయం ఉండటంతో ఇంతలోగా పోస్టల్ బ్యాలెట్ కలిగి ఉన్న ఉద్యోగులపై వివిధ పార్టీలకు చెందిన నాయకులు దృష్టి పెట్టి పోస్టల్ బ్యాలెట్లను చేజిక్కించుకొనే యత్నం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పోస్టల్ బ్యాలెట్ల లెక్క తేలకుండా పోయిందని చర్చ జరుగుతుంది. -
బయటపడిన టీడీపీ రిగ్గింగ్ బాగోతం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ నేతలు యథేచ్ఛగా పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు రిగ్గింగ్‌కు పాల్పడిన వైనానికి సంబంధించిన ఆధారాలు విజయనగరం జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. కురుపాం నియోజకవర్గం కుదుమ పంచాయతీ చినకుదుమలోని బూత్ నంబర్ 152లో ఎన్నికల రోజున(11వ తేదీన) టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీన్ని అడ్డుకునేందుకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, ఆమె భర్త వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అక్కడికి వెళ్లగా.. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. అయితే టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్న విషయాన్ని రుజువు చేసేందుకు అవసరమైన ఆధారాలు, ఫొటోలు నాలుగు రోజుల తర్వాత బయటపడ్డాయి. ఇందులో టీడీపీ కార్యకర్తలు యథేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడుతూ కనిపించారు. టీడీపీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు స్వీయ పర్యవేక్షణలో ఇదంతా జరిగినట్లు తెలిసింది. 950 ఓట్లు ఉన్న ఈ పోలింగ్ బూత్‌లో ఆ రోజు 667 ఓట్లు పోలయ్యాయి. వీటిలో అత్యధిక శాతం ఓట్లను టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ ద్వారా తమ సైకిల్ గుర్తుపైనే వేసేసుకున్నారు. ఆ సమయలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఈవో ఎస్.శ్రీనివాసరావుతో పాటు మిగిలిన సిబ్బంది అంతా ప్రేక్షక్ష పాత్రకే పరిమితమయ్యారు. (చదవండి: వ్యూహాత్మకంగా అలజడి..) -
కురుపాంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుష్ప శ్రీవాణి ప్రచారం
-
తుంబలిలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఎన్నికల ప్రచారం
-
రూ.లక్ష కొట్టు... ఉద్యోగం పట్టు..!
విజయనగరం, కురుపాం: ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి అన్న చందగా తెలుగు తమ్ముళ్లు పాలన సాగిస్తున్నారు. దీనికి కురుపాం మండలంలోని పలు శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.లక్షల సొమ్ము వసూళ్లు చేయడమే నిలువెత్తు నిదర్శనం. దీనికి సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వత్తాసు పలకడంతో వసూళ్లు సాఫీగా సాగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కురుపాం మండల కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం, ఎస్ఎన్సీయూ(నవజాత శిశు సంరక్షణ కేంద్రం)లో హెల్పర్లు, అటెండర్లు, నైట్వాచ్మేన్లు నియామకానికి సంబంధిత ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో కీలక వ్యక్తి రూ.లక్షల్లో వసూళ్లు చేసి తమకు సంబందించిన వర్గీయులకే ఉద్యోగాల్లో నియమించినట్లు తెలిసింది. సొమ్ము చేసుకున్న తమ్ముళ్లు... ఆదర్శ పాఠశాలల్లో ఈ మధ్య కాలంలో కమాటీ, కుక్, నైట్వాచ్మేన్, హెల్పర్స్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉండడాన్ని గమనించిన తెలుగు తమ్ముళ్లు, ఓ మాజీ ఎంపీపీతో పాటు సీనియర్ టీడీపీ నాయకులు రూ.లక్షలు వసూళ్లకు పాల్పడినట్టు తెలిసింది. ఓ సీనియర్ టీడీపీ కార్యకర్త నుంచే రూ.లక్షల్లో డబ్బులను వసూళ్లు చేశారు. ఒక ఉద్యోగమే మంజూరు కావడంతో పొరపొచ్చాలు రావడం, సదరు వ్యక్తులు బహిరంగంగా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదర్శ పాఠశాలల్లో అవసరం లేకున్నా ప్రత్యేకించి ఏఎన్ఎం ఉద్యోగాలు ఉండాలని ఓ కొత్త జీఓను సృష్టించి ఆయా ఉద్యోగాల్లో తెలుగు తమ్ముళ్లే తమకు సంబంధించిన వర్గీయులకు నియమించుకునేలా గప్‌చుప్‌గా వ్యవహారం నడిపి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటిండెంట్ వారణాసి గౌరీశంకరరావు వద్ద ప్రస్తావించగా ఉద్యోగ నియామకాల విషయమై తాము ఎటువంటి డబ్బులు వసూలు చేయలేదన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ సూచనల మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కొంతమందిని నియమించామని తెలిపారు. -
‘‘పల్లె వెలుగు’’ కలేనా..?
సాక్షి, జియ్యమ్మవలస: గిరిజనులంటే ప్రభుత్వాలకు ఎప్పుడూ చిన్నచూపే. వారికి కనీస సౌకర్యాలను కల్పించడంలో ఎప్పుడూ అశ్రద్ధే. అందుకే వారు జనజీవనంలోకి అంతతొందరగా రాలేకపోతున్నారు. నియోజకవర్గంలోని కురుపాం, గుమ్మలక్ష్మిపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో చాలా గ్రామాలకు రహదారులు లేక ఇబ్బంది పడుతుంటే, మరికొన్ని గ్రామాల్లో పక్కా రహదారులున్నా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గంలోని 137 పంచాయతీలుండగా 40 గ్రామాలకు బస్సులు నడవడం లేదు. జియ్యమ్మవలస మండలంలో 31 పంచాయతీల్లో 5 పంచాయతీలు పూర్తిగా అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మిగతా అన్ని గ్రామాలకు తారురోడ్డు ఉన్నా బస్సులు మాత్రం రావు. పీటీమండ, టీకే జమ్ము, కొండచిలకాం పూర్తి అటవీ ప్రాంతం ఉన్న గ్రామాలు, ఈ గ్రామాల్లో కనీసం ఆటోలు కూడా వెళ్లవంటే అతిశయోక్తి కాదు. కొండచిలకాం పంచాయతీలో ద్రాక్షణి, నిడగళ్లు గూడ, పీటీమండ పంచాయతీలో నడిమిసిరిపి, బాపన్నగూడ, దీశరగూడ, టీకే జమ్ము తదితర గ్రామాల్లో తారురోడ్డు ఉన్నప్పటికీ బస్సులు రావడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు కాదని... కొన్ని గ్రామాలకు పక్కా రహదారులున్నా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ విముఖత చూపుతోంది. ఈపీకే ( ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్) గిట్టుబాటు కాకనే బస్సులు నడపడం లేదని అధికారులు గిరిజనులతో చెబుతున్నట్లు సమాచారం. ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నామని, అన్నీ లాభపేక్షతో చూస్తే ప్రభుత్వం దేనికని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రైతులకు తప్పని ఇక్కట్లు రైతులు పండించే పంటలను మార్కెట్‌కు తరలించాలంటే ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల ప్రజలు కాలినడకన పట్టణానికి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. అలాగే విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఏదో ఒక పనిమీద పట్టణానికి పోవాల్సిందే. అయితే సర్వీసులు లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామాలకు పల్లె వెలుగు సర్వీసులను నడపాలని గిరిజనులు కోరుతున్నారు. తారురోడ్డు ఉన్నా బస్స సౌకర్యం లేదు పీటీమండ, టీకే జమ్ము, పాండ్రసింగి గ్రామాలకు తారురోడ్డు ఉన్నా బస్సులు నడవడం లేదు. ఆటోలు కూడా సక్రమంగా నడవలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెలుగు సర్వీసులను నిలపాలి. – కొండగొర్రి భూమేష్, పీటీమండ అధికారులకు వినతులు ఇచ్చినా... రహదారులున్నా బస్సులు నడపడం లేదని వినతులు అందించినా పట్టించుకోవడం లేదు. మా సమస్యను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గిరిజనులంటే ప్రభుత్వాలకు ఎందుకు చిన్నచూపో అర్థం కావడం లేదు. – కడ్రక బలరాం, మాజీ జెడ్పీటీసీ,కొండచిలకాం -
కురుపాం విజయనగరం జిల్లా వైఎస్ జగన్ పాదయాత్ర
-
ముగిసిన 302వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
బాబు పాలనలో అవినీతి విలయతాండం చేస్తోంది
-
ఏపీకి హైకోర్టు అవసరం లేదని జీవో తెస్తారేమో: వైఎస్ జగన్
సాక్షి, కురుపాం : ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధలు, వారి సమస్యలు పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై పోరాటం చేస్తానంటూ భేటీలు పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సమస్యలను వదిలేసి పక్క రాష్ట్ర నేతలతో భేటీలవుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంటే పట్టించుకోని చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన అవినీతి బయటపడకుండా కాపాడుకునేందుకే సీబీఐ ప్రవేశాన్ని రద్దు చేస్తూ జీవో తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబుపై విచారణ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇస్తే.. ఏపీకి హైకోర్టు కూడా అవసరం లేదని జీవో ఇచ్చినా ఇచ్చేస్తారని ఎద్దేవా చేశారు. 302 రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాంలో నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన చంద్రబాబు పాలన తీరును చీల్చి చెండాడారు. తోటపల్లి ప్రాజెక్టు గురించి పట్టించుకున్నారా? ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొన్న చంద్రబాబు కురుపాం ఎమ్మెల్యే పుష్పవాణినిని ప్రలోభపెట్టారు. కానీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా విలువలతో కూడిన రాజకీయాలు చేశారు పుష్పవాణి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయంలోనే కురుపాం అభివృద్ధి చెందింది. ఎందరికో ఇళ్లను నిర్మించి ఇచ్చారు. కానీ చంద్రబాబు పాలనలో ఊరికి నాలుగైదు ఇళ్లను కూడా ఇవ్వలేదు. వైఎస్సార్ సీఎం అయ్యాక తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెట్టించారు. ఆయన హయంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక తోటపల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేద’ని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబే దళారులను ప్రొత్సహిస్తున్నారు ‘రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర ప్రకటించలేదు. కనీసం కొనగోలు కేంద్రాలను కూడా తెరువడం లేదు. పంట మొత్తం దళారుల చేతికి వెళ్లాక కొనుగోలు కేంద్రాలను తెరుస్తారు. అప్పడు తెరిస్తే ఎవరికి లాభం? రైతులకు ఏమైనా లాభం ఉటుందా? రైతుల దగ్గర తక్కువ ధరలకు కొని హెరిటేజ్‌లో నాలుగు, ఐదు రెట్ల ఎక్కువకు అమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడే దళారులకు ప్రోత్సహిస్తున్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామంటారు. నెలకు మూడు, నాలుగు వందల రూపాయలు ఏదో ఒక రూపంలో తీసుకుంటారు. వట్టిగడ్డ ద్వారా 17వేల ఎకరాలకు నీరందించాల్సింది ఉండగా..కనీసం 10వేల ఎకరాలకు కూడా నీరు రావడం లేదు. 470 కరువు మండలాలు కాస్తా 520కి పెరిగాయి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూ.2 వేలకోట్లు ఇవ్వాల్సి ఉండగా కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’ అని వైఎస్ జగన్ విమర్శించారు. విచారణ చేయమని రాష్ట్రపతిని ఎందుకు కోరలేదు ఈ మధ్య గరుడ పక్షి అని మీరు వినే ఉంటారు. ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు యాగీ చేస్తున్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందకు పెద్ద కుట్ర జరుగుతుందని, దాని వెనుక ఢిల్లీ పెద్దలు ఉన్నారని చంద్రబాబు టీవీలల్లో చెప్పుతున్నారు. చాలా సార్లు ఈ పెద్దమనిషి (చంద్రబాబు) ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. మరి ఎందుకు ఆపరేషన్ గరుడపై విచారణ చేయాలని రాష్ట్ర పతిని కోరలేదు. ఇదే అంశంపై ఎందుకు సుప్రీం కోర్టులో కేసు వేయలేదు. ఎందుకు వెయ్యలేదంటే..కేసు వేస్తే చంద్రబాబు నాయుడు దొరికి పోతారు. ఎన్నిక వేల రాష్ట్రంలో ఈడీ, ఐటీ సోదాలు జరగకూడదట. చంద్రబాబుపై విచారణ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇస్తే.. మనకు హైకోర్టు కూడా అవసరం లేదని చంద్రబాబు అంటారు. ఏపీ వ్యవహారాలు సుప్రీం కోర్టు పరిధిలోని రావని జీవో తెచ్చిన తెస్తారు. ప్రత్యేక హోదా కోసం కోర్టుకు పోరు కానీ.. అవినీతిపరులను కాపాడేందుకు అవసరమైతే కోర్టుకు పోతారట. ఏపీలో ఇలాంటి అన్యాయమైన పాలన చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి రాజ్యమేలుతోంది ‘చంద్రబాబు పాలనలో అవినీతి రాజ్యమేలుతోంది. రాజధాని, విశాఖ భూములు, మట్టి, ఇసుకను కూడా వదలడంలేదు. చివరికి ఆలయ భూములను కూడా దోచుకుంటున్నారు. కరెంట్ బిల్లు, పెట్రోల్ రేట్లు, ఆర్టీసీ ఛార్జీలు బాదుడే.. బాదుడు. స్కూళ్ల, కాలేజీల ఫీజులు పెంచేశారు. ఫీజురియంబర్స్మెంట్ పాతరేశారు. రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏమి రావడంలేదు. అది కూడా వేలి ముద్రలు రావడం లేదని కోత పెడుతున్నారు. పాఠశాలలు, ఆలయాల పక్కన మద్యం షాపులు నడిపిస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను పధకం ప్రకారం తగ్గిస్తున్నారు. అత్యంత విలువైన హాయ్‌లాండ్ భూములు చంద్రబాబు లాక్కుని అది అగ్రోగోల్డ్ ది కాదని చెబుతున్నారు. అగ్రిగోల్ట్ బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం మోసం చేస్తోంది. విలువైన ఆస్తులను చంద్రబాబు, ఆయన బినామీలు కాజేస్తున్నారు. ఇలాంటి అవినీతి పాలకులు అవసరమా మీరు ఒక్క సారి ఆలోచించాలి’ అని వైఎస్ జగన్ ప్రజలను కోరారు. మీ బిడ్డలను నేను చదివిస్తా రాష్ట్రంలో లంచాలు లేనిదే ఏ పని జరగడం లేదు. అలాంటి పరిస్థితిని తొలగించాలి. రేపు పొద్దున దేవుడి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో మనందరి ప్రభుత్వం వచ్చాక ఏం చేయబోతున్నానో నవరత్నాల్లో చెప్పేశాను. అవన్నీ చెప్పితే సమయం సరిపోదు కనక కొన్ని వివరిస్తాను. మన ఆడవాళ్లకోసం ఏం చేయబోతున్నానను అనేది ఈ మీటింగ్‌లో చెప్పుతా. నాన్నగారు ఎప్పుడూ చెబుతుండేవారు ఆడ వారు కన్నీరు పెడితే ఇంటికి అరిష్టం అని. ఆడవారు లక్షలధికారులు కావాలి అని చెప్పేవారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. ప్రతి అక్కా..చెల్లికి చెప్పుతున్నా ఎన్నికల నాటికి డ్వాక్రామహిళలకు ఎంత అప్పు ఉంటే అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా చెల్లిస్తాం. పిల్లలకు బడులకు పంపిన తల్లులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. పేదవాడు అప్పులపాలు కాకుండా చదువుకునే పరిస్థితి లేదు. ప్రతి అక్కకు హామి ఇస్తున్నా మీ పిల్లను నేను చదివిస్తా. ఇంజనీరింగ్, డాక్టర్ చదవాలంటే లక్షలు ఖర్చులు పెట్టాలి. ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. హాస్టల్ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. అక్కా చెల్లెలమ్మలకు ‘వైఎస్సార్ చేయుత’ పథకాన్ని తీసుకొస్తాం. కార్పొరేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. 45 ఏళ్లు దాటిన అక్కాచెల్లెమ్మలకు వైఎస్సార్ చేయుత అమలు చేస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. గ్రామ సచివాలయంలో స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం. ఫీజు రియంబర్స్ మెంట్ 72 గంటల్లో మంజూరు చేస్తాం. అవ్వా, తాతలకు వైఎస్ భరోసా కింద ఫించన్‌ను రూ.2వేలు పెంచుతాం. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇస్తాం. ఇళ్లులు కట్టించడమే కాదు ఆ ఇళ్లులను అక్కా చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. చివరిగా ప్రతి అక్కకు హామీ ఇస్తున్నా.. 2019లో ఎన్నికలు ఉంటాయి. మళ్లీ 2024లో ఎన్నికలు వస్తాయి. మీ అందరి దయతో 2019లో మనం ప్రభుత్వం ఏర్పాటు అయితే ఐదు ఏళ్ల తర్వాత అంటే 2024 ఎన్నికలనాటికి మందు షాపులు అనేవి లేకుండా చేసి ఓట్లు అడుగుతా అని హామీ ఇస్తున్నాను. ఇంకా ఏం చేయబోతున్నానో మరిన్ని సభలల్లో తెలియజేస్తాను. మీ బిడ్డను ఆశ్వీరదించాల్సిందిగా కోరకుంటూ సెలవు తీసుకుంటున్నాను’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. -
కురుపాం గడ్డ.. వైఎస్అర్ కుటుంబానికి అడ్డ..
-
వైఎస్ జగన్‌ను కలిసిన జీఎంవలస మండలం మహిళలు
-
కురుపాం నియోజకవర్గంలో ప్రవేశించిన వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర
-
జననేతకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి
-
కురుపాం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న ప్రజాసంకల్ప యాత్ర
-
ఉత్తరాంధ్రలో భీకరమైన ఈదురు గాలులు..
విజయనగరం : ఉత్తరాంధ్ర జిల్లాలను ఈదురుగాలులు వణికిస్తున్నాయి.విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, గజపతినగరం ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చిమ్మచీకటిని తలపిస్తోంది. విజయనగరం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. భోగాపురం మండలం పెద్దకొండరాజుపాలెం వద్ద సముద్ర తీరంలో పడవలను ఒడ్డుకు చేర్చుతుండగా బలమైన ఈదురుగాలులకు ఓ వ్యక్తి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. సముద్రంలో గల్లంతైన బొందు చిన్న అమ్ములు(30) స్థానికులు గాలిస్తున్నారు. అలాగే విశాఖపట్నంలోని పాడేరు, తగరపువలస, విశాఖ నగరంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు పొంగిప్రవహిస్తోంది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. జ్ఞానాపురం జంక్షన్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిలాల్లో పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు కూలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది. అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే అకాల వర్షాలు పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కోస్తా జిల్లాల్లో రాగలం 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతోనే ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
వాగుతో గ్రామస్తుల వెతలు
-
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
► కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ చిక్కిన ఏఈ ► పెండింగ్‌బిల్లు చెల్లించేందుకు రూ. 20వేలు లంచం డిమాండ్ ► వలపన్ని పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ షేక్ షకీలాభాను, సిబ్బంది. కురుపాం: కాంట్రాక్టర్ బిల్లు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన విద్యుత్‌శాఖ ఏఈని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్న సంఘటన కురుపాంలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ షేక్ షకీలా భాను స్థానిక విలేకరులకు అందించిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలం మాదలింగికి చెందిన లైసెన్స్డ్ కాంట్రాక్టర్ ఎస్.సురేష్ కొన్ని నెలలుగా కురుపాం మండలంలో విద్యుత్‌శాఖకు చెందిన నిర్మాణ పనులు చేస్తున్నాడు. వాటికి సంబంధించిన బిల్లులు బకాయి ఉన్నాయి. ఆ బిల్లులు చల్లించేందుకు ట్రాన్స్‌కో ఏఈ టి.వేణు రూ. 20,000లు లంచం డిమాండ్ చేయగా ఆ కాంట్రాక్టర్ మొదటి విడతగా రూ. 10,000లు చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీకి సమాచారం అందివ్వగా శుక్రవారం సాయంత్రం ట్రాన్స్‌కో ఏఈకి రూ. 10,000లు లంచం ఇస్తుండగా ముందస్తు సమాచారం మేరకు ఏసీబీ డీఎస్పీ షేక్ షకీలాబాను, సీఐలు ఎస్.లక్ష్మోజీ, డి.రమేష్ వలపన్ని పట్టుకున్నారు. విసిగెత్తిపోయా... కొన్నాళ్లుగా విద్యుత్ శాఖకు చెందిన పనులు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో చేసిన పనులకు నాకు లక్ష రూపాయల వరకు విద్యుత్‌శాఖ ద్వారా రావాల్సి ఉంది. బిల్లు కోసం ఎన్నిమార్లు ప్రస్తావించినా పట్టించుకోలేదు. చివరకు ఏఈ లంచం అడగటంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. – ఎస్.సురేష్, కాంట్రాక్టర్, మాదలింగి గ్రామం -
80 లీటర్ల నాటుసారా స్వాధీనం
విజయనగరం రూరల్: కురుపాం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మిపురం మండలాల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించి 80 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ వై.భీమ్‌రెడ్డి పర్యవేక్షణలో గుమ్మలక్ష్మీపురం మండలం చోడివలస, కురుపాం మండలం రావివలస గ్రామాల్లో దాడులు నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్, కురుపాం ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
గిరిజన ఎమ్మెల్యే అంటే చులకనా?
కురుపాం : గిరిజన ఎమ్మెల్యే అంటే అంత చులకనా..? అధికారుల తీరు మారకుంటే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అధికారులను హెచ్చరించారు. శనివారం కురుపాం ఎంపీపీ ఆనిమి ఇందిరాకుమారి అధక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీఓ నంబర్ 520 ప్రకారం నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలను స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా ఇక్కడ ఇతర ప్రాంతాల నాయకులను తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని మండల స్థాయి అధికారులకు హితవు పలికారు. ఇదే పరిస్థితి భవిష్యత్‌లో కొనసాగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయక తప్పదని హెచ్చరించారు. -
బాలికపై లైంగిక దాడి
కురుపాం: మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో వివాహానికి బయలుదేరిన బాలికపై లైంగిక దాడి జరి గినట్లు నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు ఎల్విన్‌పేట సీఐ వేణుగోపాలరావు ఆదివారం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నారుు.. ఒబ్బంగి పంచాయతీ రెల్లిగూడకు చెందిన ఓ బాలిక (17) శనివారం సాయంత్రం దండుసూర గ్రామం లో జరగనున్న వివాహానికి బయలుదేరింది. ఈ సందర్భంగా దండుసూర గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి తమతో రమ్మని కోరారు. ఆ యువకులు తనకు తెలియ డంతో బాధితురాలు వారితో పాటు వెళ్లగా, మార్గమధ్యలో మండంగి కుమార్ (23) అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆదివారం ఉదయం బాధితురాలు కుటుంబసభ్యులు, గ్రామపెద్దలతో కలిసి వచ్చి నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలిని పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో యువకులు ద్విచక్ర వాహనంపై బాలికను తీసుకొని వెళ్లిన ముగ్గురు యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు. -
అనాదిగా... అవస్థలు
అనాదిగా వారిది అనాగరిక జీవనమే. తరాలు మారుతున్నా... వారి తలరాతలు మారడంలేదు. వారి బతుకులు బండలే అవుతున్నాయి. పక్కా ఇళ్లకు నోచుకోని పల్లెలు... నడవడానికీ వీలుపడని రాళ్లు తేలిన రహదారులు... గుక్కెడు నీటికోసం మైళ్లకొద్దీ ప్రయాణించాల్సిన పరిస్థితులూ... ఇవీ జిల్లాలోని గిరిజనుల స్థితిగతులు. ప్రధానంగా నియోజకవర్గంలోని పల్లెలన్నీ అభివృద్ధికి దూరంగా... కనీస సౌకర్యాలైన రహదారులు, కాలువలు, విద్య, వైద్యం వంటి వాటికి నోచుకోక అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కురుపాం :నియోజకవర్గంలోని గిరిశిఖర గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఐటీడీఏ పాలకులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా ్ఛ గ్రామాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. కనీస సౌకర్యాలైన విద్య, వైద్యం, రోడ్లు, కాలువలు సంగతి సరేసరి. కురుపాం మండలంలోని ఇప్పలగుడ్డి, పోరండంగూడ, జలుబుగూడ, గెడ్డగూడ, ఈతమానుగూడ... గుమ్మలక్ష్మీపురం మండలంలోని వాడబాయి, గేరుజెండ, గేరువాడ, బాలేసు... జియ్యమ్మవలస మండలంలోని చిన్నతోలుమండ, చిలకాం, పెద్దదోర్జ.. కొమరాడ మండలంలోని నయ, కుంతేసు తదితర గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. అనారోగ్యం చేస్తే అంతే.. అత్యవసరవేళ గర్భిణులు, రోగులు, వృద్ధులకు వైద్యంకోసం మైదాన ప్రాంతాలకు తీసుకెళ్లాలన్నా గ్రామాల్లోకి వాహనాలు రాలేకపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యసేవల కోసం డోలీ కట్టి తీసుకు వెళ్లాల్సివస్తోంది. తమ సమస్యలు పలుమార్లు ఐటీడీఏ అధికారులు, మండలాధికారులకు వినతి పత్రాల ద్వారా విన్నంచినా ఫలితం లేదని గిరిజనులు వాపోతున్నారు. ఎన్నికల వేళ తమకోసం ఇంతదూరం వచ్చే నేతలు ఎన్నికలయ్యాక తమ అవసరాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు స్పందించి గిరిశిఖర గ్రామాల అభివృద్ధికి రహదారే ముఖ్యమని గ్రహించి ఉపాధిలో భాగంగా రహదారులను మంజూరు చే యాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేటి నుంచి ఆపరేషన్ ‘గజ’
కురుపాం: ఏజెన్సీలో చొరబడి గిరిజనుల ఆస్తులను ధ్వంసం చేస్తూ వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అడవి ఏనుగులను తరిమికొట్టేందుకు అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ‘ఆపరేషన్ గజ’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి ఏవీ రమణమూర్తి తెలిపారు. మండలంలోని తిత్తిరి పంచాయతీ ఎగువగుండాం గిరిశిఖర గ్రామంలో వారం రోజులుగా నాలుగు ఆడ అడవి ఏనుగులు తిష్ఠ వేసి రెండు గిరిజన గ్రామాల్లో 15 ఇళ్లను, అరటి, వరి పంటలతోపాటు గిరిజనులు దాచుకున్నధాన్యం బస్తాలను సైతం ధ్వంసం చేసిన సంఘటన విదితమే. ఈ మేరకు డీఎఫ్ఓ రమణమూర్తి ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇప్పటికే ఏనుగులను తరలించేందుకు బెంగళూరు నుంచి నిపుణుడైన వైల్డ్ ఎలిఫెంట్ ఎక్స్పర్ట్ రుద్రాదిత్య వస్తున్నారని తెలిపారు. విశాఖ జిల్లా ఐఎఫ్ఎస్ అధికారి ఎన్.ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో ఆపరేషన్ గజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒడిశా లేదా శ్రీకాకుళం అడవుల్లోకి తరలించేందుకు చర్యలు కురుపాం ఏజెన్సీలోకి ప్రవేశించిన నాలుగు అడవిఏనుగులను శ్రీకాకుళం జిల్లా లేదా ఒడిశా అడవుల్లోకి ప్రణాళికా పరంగా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్ఓ రమణమూర్తి అధికారులు తెలిపారు. ఎలిఫెంట్ ట్రంజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు గజరాజుల ప్రభావిత ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల మేరలో గిరిశిఖరాల చుట్టూ ఎలిఫెంట్ ట్రంజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశామని డీఎఫ్ఓ తెలిపారు. ఈ ఎలిఫెంట్ ట్రంజ్ వల్ల గజరాజులు గ్రామాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని భయంతో వెను తిరగడమే కాకుండా గిరిజన గ్రామాల వైపు భవిష్యత్‌లో కూడా రాకుండా ఉంటాయని తెలిపారు. -
వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పరీక్షిత్‌రాజు...
కురుపాం: వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శత్రుచర్ల పరీక్షిత్‌రాజును నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆదివారం ఆదేశాలు అందాయి. కురుపాం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన తండ్రి శత్రుచర్ల చంద్రశేఖరరాజుతో కలిసి పరీక్షిత్ రాజు కృషి చేశారు. పార్టీ రాష్ట్రయువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పరీక్షిత్ రాజు నియమితులవడంతో వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పరీక్షిత్‌రాజు సాక్షితో మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ తరఫున జీవితాంతం పోరాడతానని, ఈ పదవీ బాధ్యతలు అప్పగించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. -
చంద్రబాబు ఎంతమంది ఉద్యోగాలు తీసేశారు?
విజయనగరం: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పాలనలో ఎంతమంది ఉద్యోగాలు తీసివేశారో చెప్పాలని వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. ఈ రోజు కురుపాంలో జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో ఆమె ప్రసంగించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెబుతున్న చంద్రబాబు తన 9 ఏళ్ల పాలనలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో, ఎంతమంది ఉద్యోగాలు తీసేశారో చెప్పాలన్నారు. లాభాల్లో ఉన్న పరిశ్రమలను బాబు తన అనుచరులకే కట్టబెట్టారన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్, వైఎస్ జగన్ నీతి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు మంచి, మర్యాద తెలియదన్నారు. ఉద్యోగులకు భద్రత కల్పించింది వైఎస్ఆర్ అని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి వైఎస్ఆర్ కృషి చేశారని విజయమ్మ చెప్పారు. మీరు విజ్ఞులు, అభివృద్ధి చేసే వారికే పట్టం కడతారన్నారు. వైఎస్ వారసుడిగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తారని హామీ ఇచ్చారు. -
పాస్టర్‌ను దింపి వస్తూ...
కురుపాం, న్యూస్‌లైన్: తిత్తిరి పంచాయతీ గాలిమానుగూడ సమీపంలో ఆదివారం సాయంత్రం మ్యాక్సీపికప్ వాహనం బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి నీలకంఠాపురం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిత్తిరి పంచాయతీ దిగువ కీడవాయి గిరిజన గ్రామంలో ఆదివారం సాయంత్రం వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏటా డిసెంబర్లో చర్చి పాస్టర్‌ను మార్చడం ఇక్కడ ఆనవాయి తీగా వస్తోంది. దీనిలో భాగం గా పాస్టర్‌ను దండుసూర గ్రామానికి మ్యాక్సీపికప్‌లో తీసుకెళ్లారు. అక్కడి నుంచి అదే వాహనంలో తిరిగి వస్తుండగా గాలిమానుగూడ సమీపంలో బోల్తాపడింది. దిగు వ కీడవాయికి చెందిన నిమ్మల సుమిత్ర(22) సంఘటన స్థలంలోనే మృతి చెంద గా, బిడ్డిక గాయత్రి(15) పార్వతీపురం ఏర్పియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మరో 22 మందికి గాయాల య్యాయి. తీవ్రగాయాలపాలైన బిడ్డిక తేజేశ్వరి, గాయామి, బిడ్డిక గంగారి, నీల మ్మ, మౌనికలను 108 వాహనాల ద్వారా పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులైన బిడ్డిక మాసి, బిడ్డిక రాయలో, సిరిమంతి, రామారావు, తవిటమ్మ, సావి త్రి, సరన్, ఇందుమతి, బిడ్డక భూది, సు క్కి, లక్ష్మి, గంగాయి, బిడ్డిక సుహాసిని మొండెంఖల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులకు హెచ్‌సీ దొర, జె. ప్రసాద్ సహాయ సహకారాలను అందిస్తున్నారు. నీలకంఠాపురం ఏఎస్ఐ పాపారావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.