![చంద్రబాబు ఎంతమంది ఉద్యోగాలు తీసేశారు? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51398945356_625x300.jpg.webp?itok=o9Co_HvT)
చంద్రబాబు ఎంతమంది ఉద్యోగాలు తీసేశారు?
విజయనగరం: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పాలనలో ఎంతమంది ఉద్యోగాలు తీసివేశారో చెప్పాలని వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. ఈ రోజు కురుపాంలో జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో ఆమె ప్రసంగించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెబుతున్న చంద్రబాబు తన 9 ఏళ్ల పాలనలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో, ఎంతమంది ఉద్యోగాలు తీసేశారో చెప్పాలన్నారు. లాభాల్లో ఉన్న పరిశ్రమలను బాబు తన అనుచరులకే కట్టబెట్టారన్నారు.
దివంగత మహానేత వైఎస్ఆర్, వైఎస్ జగన్ నీతి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు మంచి, మర్యాద తెలియదన్నారు. ఉద్యోగులకు భద్రత కల్పించింది వైఎస్ఆర్ అని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి వైఎస్ఆర్ కృషి చేశారని విజయమ్మ చెప్పారు. మీరు విజ్ఞులు, అభివృద్ధి చేసే వారికే పట్టం కడతారన్నారు. వైఎస్ వారసుడిగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తారని హామీ ఇచ్చారు.