కుప్పంనే బాగు చేయలేదు! | chandra babu not developing kuppam say to ys vijayamma | Sakshi
Sakshi News home page

కుప్పంనే బాగు చేయలేదు!

Published Mon, May 5 2014 2:16 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

కుప్పంనే  బాగు చేయలేదు! - Sakshi

కుప్పంనే బాగు చేయలేదు!

బాబు రాష్ట్రాన్నేం బాగుచేస్తారు: వైఎస్ విజయమ్మ
 
విశాఖపట్నం: ‘‘తాను అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ చేస్తానంటున్నాడు చంద్రబాబు. మరి తన సొంత నియోజకవర్గమైన కుప్పం పాతికేళ్లుగా పంచాయతీగానే మిగిలిపోయింది. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న వ్యక్తి కనీసం తన నియోజకవర్గాన్ని మునిసిపాల్టీ కూడా చేయలేక పోయారు. అసలు కుప్పంనే బాగుచేయలేని చంద్రబాబు రాష్ట్రాన్నేం బాగుచేస్తారు? ఆయన చెప్పే మాటలోను, ఇచ్చే హామీలోనూ ఏ కోశానా నిజాయితీ కనిపించదు. ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ నెత్తినే చెయ్యేసే రకం.

రాష్ట్రాన్ని విడగొట్టండి అని లేఖ ఇచ్చింది ఆయనే. మళ్లీ ఇప్పుడు అన్యాయంగా విభజించారు అంటూ మొసలికన్నీరు కార్చేదీ ఆయనే. రెండు నాల్కల ధోరణి ఈయనకు అలవాటే’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సింహా చలం, భీమిలి, విశాఖ నగర పరిధిలోని చినవాల్తేరు, రాంనగర్, హెచ్‌బీ కాలనీ సభల్లో విజయమ్మ ప్రసంగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement