పులకించిన పల్లెలు
ఏ పల్లె గడప తొక్కినా అంతులేని అభిమానం... ఏ ఊరు పొలిమేరల్లో అడుగుపెట్టినా అనంతమైన ఆప్యాయత... ఎటు చూసినా జనం... వెరసి మహానేత సతీమణి విజయమ్మకు అభిమాన నీరాజనం. శృంగవరపు కోట నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి పల్లె పోటెత్తింది. విజయమ్మను అక్కున చేర్చుకుని పులకరించిపోయింది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:ఎస్.కోట నియోజకవర్గంలో వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం సందర్భంగా శనివారం దారులన్నీ జనగోదారులయ్యా యి. ఆత్మీయ అతిథి కోసం ప్రజలు ఆత్రుతతో ఎదురు చూశారు. తమ వద్దకు వచ్చిన ఆ మాతృమూర్తికి నీరాజనాలు పట్టారు. త నను చూసేందుకు వచ్చిన ప్రజలను విజ యమ్మ ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం పా ర్లమెంట్ అభ్యర్థి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎస్.కోట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. రోడ్‌షో ద్వారా దాదాపు మూడు మండలాలను చుట్టేశారు. ఎస్.కోటలో బహిరంగ స భతో ప్రారంభమైన రోడ్‌షో ఓబల్లయ్యపాలెం, ముకుందపురం, జగ్గయ్యపేట మీదు గా ఎల్.కోట మండలంలోకి ప్రవేశించింది.
ఈ మండలంలో గొలజాం, సోంపురం జంక్ష న్, లక్కవరపుకోట, చందులూరు, భూమిరెడ్డిపాలెం, లక్ష్మీంపేట, రేగ, కళ్లేపల్లి వరకు సాగింది. ఎస్.కోటలో జరిగిన బహిరంగ స భకు అశేష జనవాహిని హాజరైంది. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. ఈ సం దర్భంగా వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగం అన్ని వర్గాలను ఆకట్టుకుంది. వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను గుర్తు చేస్తూనే జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరిం చారు. అలాగే చంద్రబాబు తొమ్మిదేళ్ల భ యానక పాలనను ప్రజలకు గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పప్పు బెల్లాల్లా తన బినామీలైన నామా నాగేశ్వరరావు, రామోజీరావు, సత్యం రామలింగరాజు, ము రళీమోహన్, సీఎం రమేష్, సుజనా చౌదరి తదితరులకు కట్టబెట్టిన ఉదంతాన్ని ప్రస్తావించినప్పుడు సభికుల్లో మంచి స్పందన కనిపించింది.
ఎస్.కోట పురవీధుల గుండా ప్రారంభమైన రోడ్‌షోకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బారులు తీరి, హారతులతో స్వాగతం పలికారు. తమ గ్రామంలో ప్రసంగించాలని ప్రతీచోటా పట్టుబట్టారు. ఓబల్లయ్యపాలెం, ముకుందపురం, జగ్గయ్యపేట, గొలజాం, సోంపురం జంక్షన్, లక్కవరపుకోట, చందులూరు, లక్ష్మీంపేటలో విజ యమ్మ ప్రసంగించారు. లక్కవరపుకోటలోనైతే సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఎవర్నీ నిరుత్సాహం పరచకుండా, అందర్నీ కలుస్తూ ముందుకు సాగారు. ముకుందపురంలో స ర్పంచ్ దమర సింగి సత్యవతి, మాజీ సర్పం చ్ నాగిరెడ్డి కనకరాజు, పాల సంఘం అధ్యక్షుడు ఏరువాక సత్యం, కంచెర్ల స్వామినాయుడు, జామి మహేశ్వరరావు, ఏరువాక రామకొండ, గోపిశెట్టి సత్యనారాయణ, ము త్యాలనాయుడు, నాగిరెడ్డి బైరాగినాయుడుతో పాటు ఆరుగురు వార్డు మెంబర్లు విజ యమ్మ సమక్షంలో వైఎస్‌ఆర్ సీపీలో చేరా రు. అలాగే జగ్గయ్యపేటలో సింగరాయ మా జీ సర్పంచ్ నిరుజోగి సత్యవతి, రాయవరపు పైడితల్లి, సోంపురం గ్రామానికి చెంది న పద్మశాలి చేనేత సహకార సంఘం మం డల అధ్యక్షుడు కొటంశెట్టి గణపతి తదితరులు పార్టీలో చేరారు. ఈ విధంగా విజ యమ్మ వెళ్లిన ప్రతీచోట పార్టీలో చేరేందుకు అనేక మంది ఆసక్తి చూపారు. కాకపోతే, సమయాభావంతో ఆమె సమక్షంలో చేరలేకపోయారు. కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మె ల్యే అభ్యర్థి రొంగలి జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు, నియోజకవర్గ నేతలు అల్లు కేశవ వెంకట జోగినాయుడు, వేచలపు చినరామునాయుడు, వల్లూరి జయప్రకాష్‌బాబు, తూర్పాటి కృష్ణస్వామినాయుడు, నెక్కల నాయుడుబాబు, కోళ్ల గంగాభవానీ తదితర నాయకులు పాల్గొన్నారు.
‘ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు’
శృంగవరపుకోట: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్.కోట వచ్చిన వైఎస్ విజయమ్మ పోలీసుల తీరుతో కాసింత ఇబ్బంది పడ్డారు. శనివారం మధ్యాహ్నం వేళ వచ్చిన విజ యమ్మ కాన్వాయ్‌ని స్థానిక నేతలు షిర్డీ సాయి ఆలయం వద్ద నిలిపారు. కాగా అదే సమయంలో రోడ్‌షోకు వచ్చిన చిరంజీవి కాన్వాయ్ వెనుక ఉండిపోవటంతో స్థానిక పోలీ సులు విజయమ్మ కాన్వాయ్‌ను కాస్త ముందుకు తీయాలంటూ కోరారు. దీంతో కాన్వాయ్ కాస్త ముందుకు తీసి శ్రీనివాసకాలనీ జంక్షన్‌లో నిలిపారు. అనంతరం రోడ్‌షోలో విజ యమ్మ మాట్లాడుతుండగా మరోమారు సీఐ లక్ష్మణమూర్తి, ఎస్.కోట ఎస్.ఐ ఎస్.కె.ఎస్ ఘనీలు వచ్చి కాన్వాయ్ తీయాలని అన్నారు. దీనిపై స్పందించిన విజయమ్మ ‘పోలీసుల కు దండం పెడతా. మమ్మల్ని ఎందుకు అన్నా ఇబ్బందులు పెడతారు. రాజకీయ పార్టీగా ప్రచారం చేసుకునే హక్కు, బాధ్యత మాకున్నాయ్. ఎలక్షన్ కమిషన్ రాత్రి 10గంటల వరకూ ప్రచారం చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఎక్కడా లేని రూల్స్ ఇక్కడ పెట్టకం డి. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి’ అంటూ కోరారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గా రు. జరిగిన ఘటనపై ఎస్.కోట ఎస్‌ఐ ఎస్.కె.ఎస్.ఘనీని వివరణ కోరగా ఎవ్వర్ని ఇబ్బం దులు పెట్టలేదని తెలిపారు. టూర్ షెడ్యూల్ కూడా ముందుగానే ఇచ్చారని అన్నారు.
పేదలకు వరం ‘అమ్మఒడి’
వైఎస్‌ఆర్ సీపీ మేనిఫెస్టోలో ప్రస్తావించిన ‘అమ్మఒడి’ పథకం పేదలకు వరం వంటిది. రోజు కూలీలు, నిరుపేదల కుటుంబాల్లోని చిన్నారులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ పోటీ చేయడం శుభ సూచకం. ఆమె గెలుపుతో విశాఖ ఎంపీ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి.
- షేక్ సలీమ్, ఎస్.కోట
భారీ మెజారిటీ ఖాయం
మహానేత రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ విశాఖ పార్లమెంట్ సభ్యురాలిగా భారీ మెజార్టీతో విజయం సాధిం చడం ఖాయం. ఆమెను గెలిపించేందుకు అన్ని వర్గాల వారు ఎదురు చూస్తున్నారు. వైఎస్‌ఆర్ సీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు చక్కగా ఉపయోగపడతాయి. - అల్లు శ్రీనివాసరావు, ధర్మవరం
రాబోయేది వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వమే
రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యే. విలువలు, విశ్వసనీయతతో యువనేత జగనన్న ప్రజల సంక్షేమం కోరుతూ గతంలో అనేక ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. ఇక విశాఖ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ పోటీ చేస్తుండడం ఆనందంగా ఉంది. వైఎస్‌ఆర్ సీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.
- కొప్పాక లక్ష్మణరావు, ధర్మవరం