ఆత్మబంధువుకు బ్రహ్మరథం | ys vijayamma election campaign in Vizianagaram | Sakshi
Sakshi News home page

ఆత్మబంధువుకు బ్రహ్మరథం

Published Mon, Apr 28 2014 2:20 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

ఆత్మబంధువుకు బ్రహ్మరథం - Sakshi

ఆత్మబంధువుకు బ్రహ్మరథం

సాక్షి ప్రతినిధి, విజయనగరం:  వైఎస్‌ఆర్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తవలస వచ్చిన ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు కొత్తవలస ప్రజలు నీరాజనాలు పట్టారు.  ఊరిపొలిమేరకు చేరుకుని మహానేత సతీమణికి అపూర్వస్వాగతం పలికా రు. డప్పుల వాయిద్యాలు, పులివేషాలు, కోలాటం, వివిధ నృత్య ప్రదర్శనలతో పట్టణ నడిబొడ్డు వరకు తోడ్కొని వచ్చారు. సభ ప్రాంగణం వద్ద  విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, యువకులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు తమ ఆనందోత్సాహాన్ని తెలియజేశారు. వైఎస్సార్ సీపీ జెండాల రెపరెపలు, కరతాళ ధ్వ నులతో ఆ ప్రాంతం విజయోత్సవాన్ని తలపించింది.
 
 అడ్డంకులు ఛేదించుకుని..  
 ఈ కార్యక్రమం విజయవంతం కాకూడదని టీడీపీ, కాంగ్రెస్ వర్గాలు విశ్వప్రయత్నాలు చేశాయి. ఈ సభ కు జనాలు హాజరు కాకుండా గ్రామాల్లో అనేక ఆం క్ష లు విధించారు. అటు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఇందుకూరి రఘురాజు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మే నల్లుడు చిన్న శ్రీను ఆటంకాలు సృష్టించారు. అనేక ప్ర లోభాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కొత్తవలస, జామి మండలానికి చెందిన వేలాది మం ది కాంగ్రెస్, టీడీపీ  కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి చే రేందుకు ఆసక్తి చూపుతున్నారన్న ఉద్దేశంతోనే మోకాలొడ్డే ప్రయత్నం చేశారు. కానీ వైఎస్సార్ కుటుంబం పై ఉన్న అభిమానంతో జనాలు అడ్డంకులు తెంచుకు ని విజయమ్మ సభకు వచ్చారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు నెక్కల నాయుడు బాబు నేతృత్వంలో దాదాపు ఆరు వేల మంది వరకు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.  
 
 ఆకట్టుకున్న ప్రసంగం..
 వైఎస్ విజయమ్మ ప్రసంగం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంది. ‘పోరాటం కోసమే వైఎస్సార్ సీపీ పుట్టింది. పోరాటంతోనే కొనసాగింది. పోరాటంలో భాగంగానే ఎన్నికల బరిలోకి దిగుతోంది’ అంటూ సాగిన  ప్రసం గం అందరినీ ఆలోచింప చేసింది. ఆచరణ సాధ్యమైన హామీలిస్తూ, విశాఖ లోక్‌సభ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సమస్యలను పరిష్కరిస్తాననని ఆమె భరోసా కల్పించారు.  కష్టసుఖాల్లో తోడుం టానంటూ ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్‌తోనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలు, చేపట్టబోయే పనుల గురించి వివరించారు. ఫ్యాన్ గు ర్తుపై ఓటేసి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్నారు. దీంతో  ప్రజలంతా తమ కరతాల ధ్వనులతో మద్దతు తెలియజేశారు.
 
 కాన్వాయ్‌కి ప్రమాదం...
 తల్లడిల్లిన జనం..
 అంతకుముందు అరకు నుం చి వస్తుండగా ఘాట్‌రోడ్డులో విజయమ్మ కాన్వాయ్‌లో ఒక వాహనానికి ప్రమాదం జరి గింది. ఈ విషయం తెలియగానే ఇక్కడి ప్రజలు ఆందోళన చెందారు.  ఆమె క్షేమ స మాచారాన్ని తెలుసుకునేం దుకు ఆ రాటపడ్డారు.  ఆత్రుతతో ఎదురు చూశారు. ఏం కాలేదని తెలియగానే సంతో ష పడ్డారు.  సభలో వైఎస్సా ర్ సీపీ రాజకీయ వ్యవహారా ల కమిటీ చైర్మన్ కొణతాల రామకృష్ణ, ఉపాధ్యాయ ఎ మ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు, వైఎస్సార్ సీపీ ఎస్‌కోట అభ్యర్థి రొంగలి జగన్నాథం, వైఎస్సార్ సీపీ నాయకులు అల్లు కేశవ వెం కట జోగినాయుడు, వల్లూరి జయప్రకాష్‌బాబు, కోళ్ల గంగాభవా నీతో పాటు కొత్తగా పార్టీలో చేరిన నెక్కల నాయుడుబాబు, గేదెల శ్రీనివాసరావు, ఇనంపూరి శ్రీ నివాసరాజు, సేనాపతి చంద్రరావు, జామి ఈశ్వరరావు,సిం గంపల్లి గణేష్, కంద దుర్గారావు, ఆదిరెడ్డి ఈశ్వరరావు, వెంకటరమణ, గొర్లె మహాలక్ష్మీ, పి.ఎర్రినాయుడు, లగుడు వామాలు, గోపిశెట్టి శ్రీనివాసరావు, అడిగర్ల గోవిందరావు, చొక్కాకుల బంగారయ్య, మా డిన పైడిరాజు, దమ్మ రమణ, చలుమూరి అప్పలనాయుడు, పి.సర్బన్న పాత్రుడు, రాపర్తి కృష్ణమూర్తి, పోలిపర్తి అ ప్పారావు, బి.సన్నిబాబు, ఐఎన్‌టీయూసీ అధ్యక్ష, కా ర్యదర్శులు(జిందాల్) ఎల్.సన్నిబాబు,  ప్రసాదరావు, శ్రీను, దమయంతీదేవి, మాధవరావు  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement