వర్షంలోనూ కొనసాగిన విజయమ్మ ప్రసంగం
పాలకొండ: జోరున వర్షం కురుస్తున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన ప్రసంగాన్ని కొనసాగించారు. వైఎస్ఆర్ జనభేరి సభకు హజరైన జనం ఒక్కరు కూడా కదలకుండా ఆమె ప్రసంగం విన్నారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆమె ఇక్కడకు వచ్చారు. ఆమెకు జనం ఘనస్వాగతం పలికారు. వర్షం కురుస్తున్నప్పటికీ విజయమ్మ సభకు జనం భారీగా హాజరయ్యారు. తడుస్తూనే ఆమె ప్రసంగం విన్నారు.
సభలో ఆమె మాట్లాడుతూ తాను వైజాగ్లో అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుందామని చెప్పారు. సభలో ఆమె మాట్లాడుతూ తాను వైజాగ్లో అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుందామని చెప్పారు. ఆ మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నేడు సరిగా నడవటం లేదన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారని చెప్పారు. జిల్లాకో పరిశ్రమ స్థాపించి, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రతి ఉద్యోగికి భద్రత కల్పిస్తామని చెప్పారు. మీ ప్రతి కష్టంలోనూ వైఎస్ జగన్ అండగా ఉంటారన్నారు.
చంద్రబాబు మాయమాటలను నమ్మొద్దన్నారు. చంద్రబాబు వస్తే సీఎంగా, ప్రతిపక్షనేతగా ఏంచేశావని నిలదీయండని చెప్పారు. 25 ఏళ్లుగా కుప్పంకు ఏమీ చేయని చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా సింగపూర్ చేస్తావని ప్రశ్నించారు. వైఎస్ఆర్‌సీపీకి అండగా నిలిచి, వైఎస్ జగన్‌ను ఆశీర్వదించమని విజయమ్మ కోరారు.