తెలంగాణలో ఓటింగ్ అవగానే మాట మార్చారు | Their voice changed after Telangana elections | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఓటింగ్ అవగానే మాట మార్చారు

Published Thu, May 1 2014 8:04 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

కైకలూరులో వైఎస్ జగన్ ప్రసంగం - Sakshi

కైకలూరులో వైఎస్ జగన్ ప్రసంగం

విజయవాడ: తెలంగాణలో ఓటింగ్ అయిపోయి గంట సేపయినా కాకుండానే ఆ నలుగురు మాట మార్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని చీల్చింది వైఎస్ జగనే అంటూ వారు నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్నారన్నారు. కృష్ణా జిల్లా కైకలూరులో  జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో ఆయన  ప్రసంగించారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్ - చంద్రబాబు కుమ్మక్కై నిస్సిగ్గుగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.  విభజనకు అనుకూలంగా ఓటేసి ఈ రోజు తమని విమర్శిస్తున్నారని చెప్పారు. తానిచ్చిన లేఖతోనే తెలంగాణ వచ్చిందని  తెలంగాణలో చంద్రబాబు చెబుతారు. సీమాంధ్రలో రాష్ట్రాన్ని విభజించింది వైఎస్‌ఆర్‌ సీపీ అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారని చెప్పారు.  ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు, టీడీపీ కనుమరుగు కాక తప్పదని హెచ్చరించారు.

1999లో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు ఉన్నది రెండు ఎకరాలు. ఈ రోజు ఆయనకు వేలకోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని జగన్ ప్రశ్నించారు. 1999 నుంచి 2004 వరకు టీడీపీ - బీజేపీ కలిసి రాష్ట్రానికి చేసిన మేలు ఎంటో చెప్పాలన్నారు. బిజెపి  విభజించిన మూడు రాష్ట్రాల్లో కనీసం ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్టు కూడా లేదన్నారు.  రాయపూర్‌కు 10 వేల కోట్ల రూపాయలు  ఇస్తామన్నారు. కేవలం రూ. 400 కోట్లు ముష్టి వేసి చేయి దులుపుకున్నారని గుర్తు చేశారు.

25 ఎంపీ సీట్లు మనమే గెల్చుకుని రాష్టాన్ని అభివృద్ధి దిశగా మనమే నడిపించుకుందాం అన్నారు. చందద్రబాబులా సాధ్యంకాని హామీలు తాను ఇవ్వలేను. విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను. నిజాయితీలేని మాటలు మాట్లాడలేనని చెప్పారు. కారణం తనకు వారసత్వంగా వైఎస్ఆర్ నుంచి వచ్చింది విశ్వసనీయతేనన్నారు. మరో 6 రోజుల్లో మన తలరాత మార్చే ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర దశ-దిశ మార్చే 11 సంతకాలు చేస్తానని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement