
గుంటూరు అరండల్‌పేట ఒకటో లైనులో రోడ్డు పక్కన గుడారం వేసుకుని జీవిస్తున్న నిరుపేద కుటుంబమిది. కుటుంబ పోషణార్ధం తండ్రి పనికి వెళ్లాడు, తల్లి ఆనారోగ్యంతో బాధపడుతుండటంతో పెద్దకుమార్తె తన ఇద్దరు చెల్లెళ్లను చూసుకోవడానికి బుధవారం బడి మానేసింది. నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆ బాలిక ఇంటి వద్ద తన ఇద్దరు చెల్లెళ్ల్లతో ఏబీసీడీలు దిద్దిస్తోంది.
– మిరియాల వీరాంజనేయులు, గుంటూరు అరండల్‌పేట
కొడవలి పట్టిన కలెక్టర్
కలెక్టర్ కొడవలి పట్టి వరికోత కోశారు. విజయనగరం జిల్లా కురుపాం మండలంలో జట్టు ట్రస్టు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలాలను కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ బుధవారం పరిశీలించారు. దురుబిలి గ్రామానికి చెందిన పత్తి అనే రైతు పొలంలో కలెక్టర్ వరి కోత కోశారు. అనంతరం వరి పంట కోత ప్రయోగం చేసి అధిక దిగుబడి వచ్చినట్టు వ్యవసాయాధికారులు గుర్తించారు.
– కురుపాం
నాంపల్లి టేషను కాడ....
హైదరాబాద్ నగరానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేదలు, యాచకులు, నిరాశ్రయలు తల దాచుకునే చోటులేక నాంపల్లి రైల్వేస్టేషన్ ఎదుట బుధవారం రాత్రి వణికించే చలిలో నిద్రపోతున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment