
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించి, వారి సామాజిక సాధికారతకు సీఎం జగన్ తోడ్పడిన వైనాన్ని వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. మంగళవా రం విజయనగం జిల్లా నెల్లిమర్ల, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గాల్లో జరిగిన యాత్రకు జనం నీరాజనాలు పలికారు. బుధవారం ఈ యాత్ర పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నియోజకవర్గాల్లో జరుగుతుంది.
కృష్ణా జిల్లా:
మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో వైసీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ ఆఫీస్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు హాజరుకానున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా:
కురుపాంలో మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు నందివానివలసలో వైసీపీ నేతల విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 2 గంటలకు పెదమేరంగి, సీమనాయుడువలస మీదుగా బైకు ర్యాలీ జరగనుంది. 3 గంటలకు కురుపాం పోలీస్ స్టేషన్ జంక్షన్‌లో జరిగే బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు సీదిరి అప్పలరాజు తదితరులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment