వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శత్రుచర్ల పరీక్షిత్‌రాజును నియమిస్తూ
కురుపాం: వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శత్రుచర్ల పరీక్షిత్‌రాజును నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నుంచి ఆదివారం ఆదేశాలు అందాయి. కురుపాం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన తండ్రి శత్రుచర్ల చంద్రశేఖరరాజుతో కలిసి పరీక్షిత్ రాజు కృషి చేశారు. పార్టీ రాష్ట్రయువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పరీక్షిత్ రాజు నియమితులవడంతో వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పరీక్షిత్‌రాజు సాక్షితో మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ తరఫున జీవితాంతం పోరాడతానని, ఈ పదవీ బాధ్యతలు అప్పగించిన జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.