pariksitraju
-
శత్రుచర్ల పరిక్షిత్‌రాజును పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరిక్షిత్‌రాజును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఆదివారం పరిక్షిత్ రాజుతో సీఎం జగన్ ఫోన్లో మాట్లాడారు. పరిక్షిత్ తండ్రి చంద్రశేఖర్ రాజు మరణం పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు. కాగా, పరిక్షిత్ రాజు తండ్రి.. మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు శుక్రవారం కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మూడురోజుల నుంచి విశాఖపట్నంలో ఉంటూ వైద్యసేవలు పొందుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచారు. చదవండి: (మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కన్నుమూత) -
సమస్యల పరిష్కారమే ముందున్న లక్ష్యం
కురుపాం విజయనగరం : తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల సమస్యల పరిష్కారమే తన ముందున్న లక్ష్యమని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఆమె జన్మదినం సందర్భంగా శుక్రవారం రావాడ కూడలిలో ఉన్న మహానేత దివంగత వైఎస్సార్ విగ్రహం వద్ద అభిమానులు, కార్యకర్తల నడుమ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె భర్త, వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు కేకును ఆమెకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ తన భర్త శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, నియోజకవర్గ నాయకులు, ప్రజల సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. భవిష్యత్‌లో గిరిజనులకు వైద్యం, తాగునీరు, రహదారులు, విద్య సక్రమంగా అందేలా పని చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో కురుపాం ఎంపీపీ ఇందిరాకుమారి, జెడ్పీటీసీ పద్మావతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి నాగేశ్వరరావు, ఎంపీటీసీలు గొర్లి సుజాత, రాజేశ్వరి, నీలకంఠాపరం సర్పంచ్ మన్మధరావు, పొడి మాజీ ఎంపీటీసీ కామేశ్వరరావు, మండల కో–ఆప్షన్ సభ్యుడు షేక్ నిషార్‌తో పాటు కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పరీక్షిత్‌రాజు...
కురుపాం: వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శత్రుచర్ల పరీక్షిత్‌రాజును నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆదివారం ఆదేశాలు అందాయి. కురుపాం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన తండ్రి శత్రుచర్ల చంద్రశేఖరరాజుతో కలిసి పరీక్షిత్ రాజు కృషి చేశారు. పార్టీ రాష్ట్రయువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పరీక్షిత్ రాజు నియమితులవడంతో వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పరీక్షిత్‌రాజు సాక్షితో మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ తరఫున జీవితాంతం పోరాడతానని, ఈ పదవీ బాధ్యతలు అప్పగించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.