
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరిక్షిత్‌రాజును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆదివారం పరిక్షిత్ రాజుతో సీఎం జగన్ ఫోన్‌లో మాట్లాడారు. పరిక్షిత్ తండ్రి చంద్రశేఖర్ రాజు మరణం పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు.
కాగా, పరిక్షిత్ రాజు తండ్రి.. మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు శుక్రవారం కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మూడురోజుల నుంచి విశాఖపట్నంలో ఉంటూ వైద్యసేవలు పొందుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచారు.