
అభిమానుల మధ్య ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి కేకును తినిపిస్తున్న భర్త శత్రుచర్ల పరీక్షిత్‌రాజు
కురుపాం విజయనగరం : తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల సమస్యల పరిష్కారమే తన ముందున్న లక్ష్యమని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఆమె జన్మదినం సందర్భంగా శుక్రవారం రావాడ కూడలిలో ఉన్న మహానేత దివంగత వైఎస్సార్ విగ్రహం వద్ద అభిమానులు, కార్యకర్తల నడుమ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె భర్త, వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు కేకును ఆమెకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ తన భర్త శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, నియోజకవర్గ నాయకులు, ప్రజల సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. భవిష్యత్‌లో గిరిజనులకు వైద్యం, తాగునీరు, రహదారులు, విద్య సక్రమంగా అందేలా పని చేస్తానని చెప్పారు.
కార్యక్రమంలో కురుపాం ఎంపీపీ ఇందిరాకుమారి, జెడ్పీటీసీ పద్మావతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి నాగేశ్వరరావు, ఎంపీటీసీలు గొర్లి సుజాత, రాజేశ్వరి, నీలకంఠాపరం సర్పంచ్ మన్మధరావు, పొడి మాజీ ఎంపీటీసీ కామేశ్వరరావు, మండల కో–ఆప్షన్ సభ్యుడు షేక్ నిషార్‌తో పాటు కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment