జగనన్న అమ్మ ఒడి 2023.. కురుపాం సభ అప్‌డేట్స్
► కురుపాంలో 2023-24 ఏడాదిగానూ.. అమ్మ ఒడి నిధుల్ని బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో జమ చేశారు సీఎం జగన్.
► సీఎం జగన్ మాట్లాడుతూ.. పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి కొనసాగుతోంది. అన్ని స్కూల్స్, కాలేజీల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. అవినీతి, వివక్ష లేకుండా నేరుగా నిధులు అందజేస్తున్నాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకే అమ్మ ఒడి పథకం. ప్రపంచస్థాయిలో పిల్లలు పోటీపడేలా తీర్చిదిద్దుతున్నాం. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వచ్చే తరం మనకంటే బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం.
► రోజుకో మెనూతో విద్యార్థులకు గోరుముద్ద అందిస్తున్నాం. పిల్లలకు తొలిసారిగా బైలింగ్వుల్ పుస్తకాలు అందజేస్తున్నాం. పిల్లలకు సులువుగా అర్థమయ్యేందుకు డిజిటల్ బోధనను తీసుకొచ్చాం. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు అమ్మ ఒడి అందిస్తున్నాం. అమ్మ ఒడి కింద ఇప్పటి వరకు రూ.26,067.28 కోట్లు అందజేశాం.
► అంగన్వాడీల్లోనూ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తున్నాం. నాడు-నేడు ద్వారా 45వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ పిల్లలకు ట్యాబ్స్ కూడా అందించాం. ఆడపిల్లల కోసం స్వేచ్చ పథకం అమలు చేస్తున్నాం.
► విదేశాల్లో పెద్ద చదువుల కోసం విద్యార్థులకు ఎక్కడ సీటు వచ్చినా రూ. కోటి 25లక్షలు అందజేస్తున్నాం. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా అమలుచేస్తున్నాం. పెద్ద చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా వంద శాతం పూర్తి ఫీజురియింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యాదీవెన అందిస్తున్నాం. ప్రతీ కుటుంబంలోనూ ఒక సత్యనాదెళ్ల వంటి వ్యక్తి రావాలి. పెత్తందారులకు అందుబాటులో ఉన్న చదవుల కన్నా గొప్ప చదువులు పేదల పిల్లలకు అందుబాటులోకి వచ్చాయి. చదువుల్లో అంటరానితనాన్ని తుదముట్టించాం.
నాలుగేళ్లలో ఏపీలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి అమలవుతోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. బడులు ప్రారంభమైన వెంటనే మెరుగైన విద్యాకానుక కిట్లు అందజేస్తున్నాం. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండేలా చర్యలు చేపట్టాం. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్‌గా తయారుకావాలన్నదే లక్ష్యం.
► విద్యార్థి మనస్వినీ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ద్వారా నేను ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాను. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లెజెండ్ అని ప్రశంసించింది. సీఎం జగన్ తీసుకువచ్చిన ప్రతీ పథకం తమకు ఎంతో మేలు చేస్తున్నదని తెలిపింది. సీఎం జగన్ ఏపీలో హిస్టరీ క్రియేట్ చేశారని పేర్కొంది.
► మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 83 లక్షల మందికిపైగా విద్యార్థులకు అమ్మఒడి ద్వారా లబ్ధి. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారు. విద్యారంగంలో సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడేలా తీర్చిదిద్దుతున్నారు.
► ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. పిల్లలను బడికి పంపించాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి. ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలనే లక్ష్యంతోనే అమ్మఒడి పథకం తీసుకువచ్చాం. విద్యారంగంలో సీఎం జగన్ సంస్కరణలు తీసుకువచ్చారు.
► పేదల తలరాతలు మార్చే పథకం జగనన్న అమ్మఒడి. చదువుల విప్లవం ఎలా ఉంటుందో సీఎం జగన్ ప్రభుత్వంలో చూస్తున్నాం.
► జగనన్న అమ్మఒడి పథకం గొప్ప ఆలోచన. పేద పిల్లల చదువు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
► చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా పేదల చదువుల కోసం అమ్మఒడి లాంటి పథకం అమలు చేశారా?.
► అమ్మ ఒడి పథకం పేదల అక్షయపాత్ర. పేదలకు మేలు చేసే జగనన్న డెడికేషన్‌ను చంద్రబాబు కాపీకొట్టలేరు. చంద్రబాబు పప్పులు ఈసారి జనం దగ్గర ఉడకవు.
► పార్టీ గుర్తులేని వారు ఎంతమంది గుంపులుగా వచ్చినా కనీసం జగనన్న నీడను కూడా తాకలేరు. జగనన్నను గుండెల్లో పెట్టుకున్న హనుమంతుని లాంటి కార్యకర్తలు కోట్లలో ఉన్నారు.
► జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమం కోసం.. కురుపాం బహిరంగ సభ వేదికపైకి సీఎం జగన్ చేరుకున్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి.. జ్యోతి ప్రజల్వనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రజలకు అభివాదం చేసి కూర్చున్నారు.
► సీఎం జగన్ రాక నేపథ్యంలో.. కురుపాం హెలిప్యాడ్ వద్దకు భారీగా జనం చేరుకున్నారు. ఆయన్ని చూసి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆ అభిమానానికి మురిసిపోయిన ఆయన.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఆత్మీయ స్వాగతం
► సీఎం వైఎస్ జగన్ కురుపాం చేరుకున్నారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర, పుష్ప శ్రీ వాణి, ఎమ్మల్యే లు, ఎంపీలు.. ఆయనకు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో నాలుగో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం.
► జగనన్న అమ్మఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంతో.. కురుపాంలో పండుగ వాతావరణం నెలకొంది.
► ఇక గత నాలుగేళ్లలో నాలుగేళ్లలో విద్యా రంగంపై సీఎం జగన్ ప్రభుత్వం రూ.66,722.36 కోట్లను వెచ్చించారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నారు.
► తాజాగా విడుదల చేయబోయే నిధులతో కలిపి.. ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని లబ్ధిదారులకు చేకూర్చినట్లయ్యింది జగనన్న ప్రభుత్వం.
► కురుపాం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి అమ్మ ఒడి నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
► పార్వతీపురం మన్యం పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.
► జగనన్న అమ్మ ఒడి 2023 నిధుల విడుదల కోసం.. తాడేపల్లి తన నివాసం నుంచి పార్వతీపురం మన్యం కురుపాంకు బయల్దేరారు సీఎం జగన్.
► పార్వతీపురం మన్యం కురుపాం బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. అమ్మ ఒడి నిధుల్ని సీఎం జగన్ విడుదల చేస్తారు.
► వరుసగా నాలుగో ఏడాదీ 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పది రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఇందుకోసం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంను వేదికగా ఎంచుకున్నారు.
ఇదీ చదవండి: వృత్తి నిపుణుల జాబితాలోకి రైతులు!
Comments
Please login to add a commentAdd a comment