యనమల ఇలాకలో రిగ్గింగ్ | Yanamala ramakrishnudu Followers Rigging In Tuni | Sakshi
Sakshi News home page

యనమల ఇలాకలో రిగ్గింగ్

Apr 11 2019 4:39 PM | Updated on Apr 11 2019 4:49 PM

Yanamala ramakrishnudu Followers Rigging In Tuni - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి  : నేడు జరుగుతున్న పోలింగ్‌లో టీడీపీ నేతలు ఇప్పటికే దాడులు, దౌర్జన్యాలకు ఒడిగడుతుండగా.. తాజాగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు యధేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. తుని నియోజకవర్గంలో టీడీపీ నాయకులే దగ్గరుండి మరీ ఓట్లు వేయిస్తున్నారు. యదేచ్చగా రిగ్గింగ్‌ చేస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

పోలింగ్‌ బూత్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపించి టీడీపీ నాయకులు ఓట్లు వేయిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లో సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి.. యనమల అనుచరులు దగ్గరుండి మరీ ఓట్లు వేయిస్తున్నారు. ఇంత బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడినా.. అధికారులు, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. రిగ్గింగ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement