
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులు ఆర్పించారు. దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యానారాయణ, బాలీనేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment