Balineni Srinivasareddy
-
వైఎస్సార్సీపీ సీనియర్ నేత సింగరాజు వెంకట్రావు కన్నుమూత
ఒంగోలు: వైఎస్సార్సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు (55) అనారోగ్యంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. కోలుకుంటున్నారని అందరూ భావిస్తున్న సమయంలో ఆయన మరణవార్త తెలియడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి మంగళవారం మధ్యాహ్నం భౌతికకాయాన్ని ఒంగోలు బండ్లమిట్టలోని ఆయన నివాస గృహానికి తీసుకొచ్చారు. కన్నీటి పర్యంతమైన బాలినేని దంపతులు.. వెంకట్రావు భౌతికకాయం ఒంగోలుకు రాగానే వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి శచీదేవి, కుమారుడు బాలినేని ప్రణీత్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. వెంకట్రావు భౌతికకాయాన్ని పట్టుకుని బాలినేని కన్నీటి పర్యంతమయ్యారు. నగరంలో మంచి అభిమానాన్ని సంపాదించుకున్న సింగరాజు వెంకట్రావు భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఫోన్లో పరామర్శించిన మంత్రి సురేష్.. సింగరాజు వెంకట్రావు మృతికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకట్రావు కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. వెంకట్రావు పారీ్టకి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నామన్నారు. ఇదీ వెంకట్రావు ప్రస్థానం.. సింగరాజు వెంకట్రావు నగరంలో వైఎస్సార్ సీపీకి ఎంతో కీలకమైన నేత. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యంత నమ్మకస్తుడు. వైఎస్సార్ సీపీ ప్రతిపక్షంలో ఉన్నా...అధికారంలో ఉన్నా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో, టీడీపీ ప్రభుత్వంలో అద్దంకి బస్టాండ్‌లో దుకాణాలను కూల్చివేసిన సమయంలో అండగా నిలబడి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. కమ్మపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం ప్రారంభాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్న సమయంలోనూ ఆయన వారిని ఎదిరించి నిలిచారు. ఈ క్రమంలో జైలుకు సైతం వెళ్లారు. పారీ్టలో ఆయన సేవలకు గుర్తింపుగా సింగరాజు వెంకట్రావు సతీమణి మీనాకుమారికి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తొలి చైర్‌పర్సన్‌గా నామినేటెడ్ పోస్టు కేటాయించారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై కన్నుమూయడం అందరినీ కలిచివేసింది. వెంకట్రావుకు భార్య మీనాకుమారితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్రావు భౌతికకాయానికి నగర మేయర్ గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, కుప్పం ప్రసాద్, వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, కటారి శంకర్, గంటా రామానాయుడు, సింగరాజు రాంబాబు, తోటపల్లి సోమశేఖర్, దామరాజు క్రాంతికుమార్, పంది రత్నరాజు, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, హరిబాబు, పటాపంజుల శ్రీనివాసులు, బొట్ల సుబ్బారావు, పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి, షేక్ మీరావలి ఇతర నేతలు నివాళులర్పించారు. నేడు అంత్యక్రియలు... బుధవారం స్థానిక బండ్లమిట్టలోని వెంకట్రావు నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
వైఎస్సార్ సీపీలోకి పలువురు టీడీపీ నాయకులు
ఒంగోలు సబర్బన్/ఒంగోలు: టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఒంగోలు నగరంలోని మూడో డివిజన్ నుంచి టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. నగరంలోని 49వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ నాయకులకు వైఎస్సార్ సీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చదవండి: ఇది టీడీపీ, జనసేనకు జీర్ణించుకోలేని అంశమే టీడీపీ బూత్ కమిటీ కన్వీనర్, ఒంగోలు నగర కార్యనిర్వాహక కార్యదర్శి రేల రాజేంద్ర, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ ఆధ్వర్యంలో మరికొంతమంది వైఎస్సార్ సీపీలో చేరారు. వీరితో పాటు 3వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి ఎలియాజర్, ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ కూడా బాలినేని సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా రేవల రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమంపై చూపుతున్న శ్రద్ధ ప్రతి ఒక్కరినీ వైఎస్సార్ సీపీవైపు ఆకర్షితులను చేస్తోందని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై అభిమానంతో ఆయనతో కలిసి పయనిద్దామనే ఆలోచనతో పార్టీలో చేరామన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్‌రెడ్డిని బాలినేని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో గుండు మధు, పార్టీ నాయకులు ఎందేటి రంగారావు, మహబూబ్‌బాషా, షేక్ హబీబ్, మురళి, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నా:బాలినేని
-
వైఎస్ఆర్ కుటుంబానికి నేను ఎప్పుడూ విధేయుడినే..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం తనకు కేబినెట్లో చోటు దక్కకపోవడంపై బాలినేని శ్రీనివాస్ స్పందించారు. బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబానికి తాను ఎప్పుడూ విధేయుడినేనని స్పష్టం చేశారు. తాను రాజీనామా చేస్తున్నాననే వార్తలను ఖండించారు. పదవి కోసం ఎప్పుడూ పాకులాడలేదని.. పార్టీ కోసమే పని చేశానని అన్నారు. సీఎం జగన్ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని వెల్లడించారు. పార్టీ ఒక కుటుంబం.. అందరూ కలిసి మెలిసి ఉండాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. పార్టీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సామర్థ్యం ఉన్న వారినే సీఎం జగన్ కేబినెట్లోకి తీసుకున్నారు. ఆదిమూలపు సురేష్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని ఈ సందర్బంగా క్లారిటీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీనే అని బాలినేని ప్రశంసించారు. అందరికీ పదవులు ఒకేసారి రావు అని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. -
ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా..
సాక్షి, ప్రకాశం: తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నట్టు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం బాలినేని మాట్లాడుతూ.. ‘‘వైఎస్ఆర్ మరణం తర్వాత నాలుగేళ్ల ముందే మంత్రి పదవి వదులుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్కన నిలబడ్డాను. సీఎం జగన్‌కు నేను వీరాభిమానిని. కేబినెట్ మొత్తాన్ని తొలగిస్తున్నా అని సీఎం జగన్ అన్నప్పుడే నా పూర్తి మద్దతును బహిరంగంగా ప్రకటించాను. నాకు పార్టీ ముఖ్యం.. మంత్రి పదవి కాదని నేను ఎప్పుడో చెప్పాను. ఆంధ్రజ్యోతి రాతలు మరింత నీచంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి విషప్రచారం మానుకోకపోతే ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తా’’ అని హెచ్చరించారు. మరోవైపు.. విజయవాడలో సీదిరి అప్పలరాజు సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రాజీనామాల తర్వాత అసంతృప్తి అనేది అవాస్తవం. మంత్రులందరం సీఎం జగన్ నిర్ణయాన్ని గౌరవించి ఏకాభిప్రాయంతోనే రాజీనామా చేశాం. కొన్ని మీడియాలు ప్రజలని తప్పుదోవ పట్టించేలా అసంతృప్తులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కేబినెట్ కూర్పుపై స్వేచ్చగా నిర్ణయం తీసుకునే అధికారం సీఎం జగన్‌కు ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయాలకి అనుగుణంగానే అందరూ పనిచేయాల్సి ఉంటుంది. సీఎం జగన్ పనితీరుని చూసే ప్రజలు ఓట్లేస్తారు.. మమ్మల్ని చూసి కాదు. మా అందరికీ ముఖ్యమంత్రి జగన్‌పై అపార నమ్మకం, అచంఛల విశ్వాసం ఉంది. బలహీనవర్గాలలో ఇంతమందికి గతంలో ఎవరూ అవకాశం కల్పించలేదు. సామాన్య కుటుంబంలో పుట్టిన నాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా సీఎం వైఎస్ జగన్ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. సీఎం జగన్ దగ్గర పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా సంతోషంగా పాటిస్తాం’’ అని తెలిపారు. -
ఉచిత విద్యుత్‌కు పూర్తి భరోసా
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగనున్న దృష్ట్యా వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకోవాలని డిస్కమ్‌లను ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.7,714 కోట్ల సబ్సిడీని అందిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 6,663 ఫీడర్ల ద్వారా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు కృషి చేస్తూనే వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట కరెంట్ సరఫరాకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాగా, వ్యవసాయం, అనుబంధ రంగాలకు 2021–22లో 19,096 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా 2022–23లో 19,819 ఎంయూలకు చేరుకునే వీలుందని అంచనా వేస్తున్నట్లు విద్యుత్‌శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. ఈ ఏడాది 3.7% మేర విద్యుత్ వినియోగం పెరగనుందని చెప్పారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ డిమాండ్‌ను తీర్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు హరనాథరావు, పద్మ జనార్దనరెడ్డి, సంతోషరావు చెప్పారు. విద్యుత్ లోడ్, కచ్చితమైన వినియోగాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడాదిలోగా మీటర్లు అమర్చేలా కృషి చేస్తున్నట్లు సీఎండీలు పేర్కొన్నారు. విద్యుత్ మోటార్లు కాలిపోవడం, లోవోల్టేజీ లాంటి సమస్యలను అరికట్టి రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఉపకరిస్తుందన్నారు. -
విద్యుత్ ఉద్యోగులకు నగదురహిత వైద్యం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత అపరిమిత వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో బుధవారం వారు సమావేశమయ్యారు. విద్యుత్ సంస్థల్లో కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. గత నెల 28న విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ 24 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. అందులోని అంశాలను జేఏసీ నేతలు మరోసారి బాలినేని, సజ్జల దృష్టికి తెచ్చారు. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ప్రైవేటు నిర్వహణకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దీనిపై బాలినేని, సజ్జల స్పందిస్తూ ఉద్యోగులకు నష్టం జరుగుతుందనుకుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. దశలవారీగా పరిష్కారం... విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ బాధ్యతలను తమ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులకే కేటాయించాలని కోరగా సమీక్షించి ఉద్యోగులకు నష్టం కలగకుండా చూస్తామని బాలినేని, సజ్జల తెలిపారు. జేఏసీ విజ్ఞప్తి మేరకు సర్వీస్ రెగ్యులేషన్స్‌ను ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు కార్మికులకు నేరుగా జీతాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఏపీజెన్కో ఎండీ బి.శ్రీధర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు, జేఏసీ యూనియన్ల నాయకులు చంద్రశేఖర్, ప్రతాప్‌రెడ్డి, సాయికృష్ణ చర్చల్లో పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ నేతలు బాలినేని, సజ్జల, ఇంధన శాఖ కార్యదర్శి, డిస్కంల సీఎండీలతో ప్రత్యేకంగా సమావేశమై ఇవే అంశాలపై చర్చించారు. అన్నింటిపై ప్రభుత్వం నుంచి సానుకూల హామీ లభించిందని వెల్లడించారు. -
ఒక్కసారి పునరాలోచించు రాధా!
-
కుప్పం ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ డబ్బులు పంచుతోంది
-
‘కుప్పంలో విజయానికి లోకేష్ ఐదు వేలు పంచడం సిగ్గుచేటు’
-
‘సెకీ’ విద్యుత్‌తో లాభమే
సాక్షి, అమరావతి: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ–సెకీ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సోలార్ పవర్‌ను రైతుల కోసం కొనుగోలు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 2024 నుండి 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులకు పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను ప్రత్యేక డిస్కమ్ ద్వారా అందిస్తుందని తెలిపారు. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం అత్యంత లాభదాయకమని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని మంత్రి వివరించారు. టీడీపీ హయాంలోనే అనవసరంగా అధిక ధరకు సౌర, పవన విద్యుత్ కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉచిత విద్యుత్ కోసం ట్రాన్స్‌కో, డిస్కంలు గత రెండేళ్లలో రూ.3,762 కోట్ల విలువైన నెట్‌వర్క్‌ను పెంచుకున్నాయని, డిమాండ్‌ను పెంచడానికి 20 కొత్త ట్రాన్స్‌కో సబ్స్టేషన్లు, 162 కొత్త డిస్కం సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీ.. టెండర్ ధర ప్రకారం యూనిట్ ధర రూ.2.49 ఉంటుందన్నారు. రెగ్యులేటరీ కమిషన్ ద్వారా విద్యుత్ చట్టం ప్రకారం టారిఫ్ నిర్ణయిస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సోలార్కు యూనిట్‌కు రూ.6.99, పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)లో స్పష్టంగా ఉందన్నారు. నిజానికి 2016లో టీడీపీ ప్రభుత్వం ఇదే సెకీ నుంచి యూనిట్‌కు రూ.4.57 (గాలివీడు)తో 400 మెగావాట్లు, మైలవరంలో యూనిట్‌కు రూ.2.77 చొప్పున మరో 750 మెగావాట్లు కొనుగోలు చేసిందని మంత్రి పేర్కొన్నారు. డిస్కంలపై భారం ఉండదు సెకీ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడం ద్వారా ప్రస్తుత డిస్కంలపై భారం పడదని, అన్ని ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడంతో పోలిస్తే 25 ఏళ్ల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి మినహాయింపు వస్తుందని, అదే ఇక్కడైతే సెంట్రల్ గ్రిడ్ చార్జీలు 25 ఏళ్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టును రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేస్తే, విద్యుత్ సరఫరాకు సబ్స్టేషన్లు తదితరాల ఖర్చును రాష్ట్రం భరించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చే విద్యుత్‌కు కేంద్రం సెంట్రల్ గ్రిడ్ చార్జీలను మినహాయిస్తోందన్నారు. కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే, మొదట సెంట్రల్ గ్రిడ్‌ను ఉపయోగించి తమిళనాడు, కర్ణాటకకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10,000 మె.వా. ప్రాజెక్ట్ కోసం కేటాయించిన మొత్తం భూమి ఇతర ప్రయోజనాల కోసం రాష్ట్రం వద్ద ఉందన్నారు. చంద్రబాబు ప్రారంభించిన థర్మల్ ప్లాంట్లు ఏవీ లేవని, ఆయన హయాంలో కృష్ణపట్నం ఖర్చు మెగావాట్‌కు రూ.5.5 నుంచి రూ.9.3కి పెరిగిందని మంత్రి వివరించారు. -
రైతుల ప్రయోజనాలకే నూతన డిస్కం
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి రానున్న 25 ఏళ్లపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు పగటిపూటే 9 గంటలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చరల్ సప్లై కంపెనీ’ పేరుతో నూతన డిస్కంని ఏర్పాటు చేస్తోందని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తిగా ఉచితంగానే విద్యుత్తుని సరఫరా చేస్తుందని, రైతులపై ఎలాంటి భారం పడనీయదని తెలిపారు. రైతుల్లో అనుమానాలు రేకెత్తించేందుకు, గందరగోళం సృష్టించేందుకు కొందరు చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం వైఎస్ జగన్ చేసిన వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని, ఇందుకోసం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8,559 కోట్లు కేటాయించిందని తెలిపారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్తు పథకం వల్ల ప్రతి రైతు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాచేసే సామర్థ్యంగల వ్యవసాయ ఫీడర్లను రూ.1,700 కోట్లతో అప్‌గ్రేడ్ చేయించామని, గత రబీ సీజన్ నుంచి నూరుశాతం వ్యవసాయ ఫీడర్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను శాశ్వత పథకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంటున్నట్టు చెప్పారు. దీనివల్ల యూనిట్ రూ.2.49 చొప్పున ఏడాదికి 7 వేల మెగా వాట్ల విద్యుత్తును పాతికేళ్ల పాటు కొనుగోలు చేసేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. -
చంద్రబాబు చరిత్ర వింటేనే అసహ్యం: మంత్రి బాలినేని
-
నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం:మంత్రి బాలినేని
-
విద్యుత్ రంగంలో సంక్షోభం తాత్కాలికమే
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత దృష్ట్యా రాష్ట్ర విద్యుత్ రంగంలో నెలకొన్న తాత్కాలిక ఒడిదుడుకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాజా పరిస్థితులపై సోమవారం రాష్ట్ర ప్రజలకు ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏదో ఒక స్థాయిలో విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయని, మన రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమేనని ఆయన పేర్కొన్నారు. జెన్కో కేంద్రాల మూసివేత అనాలోచితం కాదు ► జెన్కో కేంద్రాలను అనాలోచితంగా మూసివేయలేదు. బహిరంగ మార్కెట్లో జెన్కో కేంద్రాల చర వ్యయం కంటే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం కోసం మార్కెట్ వేలం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. ► బొగ్గు కొరత దృష్ట్యా యూనిట్లను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీటీపీ)లో వార్షిక మరమ్మతులు చేపట్టాం. ఇలా చేయకపోయినా బొగ్గు కొరత వల్ల వాటిని మూసివేయాల్సి వచ్చేది. ► తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు కొరత లేదు. అక్కడున్న బొగ్గు నిల్వలను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడం లేదు. మనం శ్రీశైలంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని మనవి చేస్తున్నాను. -
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం పాలన
-
ఇండేన్ గ్యాస్ ఫైబర్ సిలిండర్లు
సాక్షి, హైదరాబాద్: తక్కువ బరువుతో తేలికగా, దృఢంగా ఉండే ఫైబర్ గ్యాస్ సిలిండర్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందుబాటులోకి తెచ్చింది. ఫైబర్‌తో తయారయ్యే ఈ సిలిండర్లు 10, 5 కిలోల గ్యాస్ వేరియంట్లలో ప్రవేశపెట్టింది. సాధారణ సిలిండర్లు ఇనుముతో తయారై, చాలా బరువుగా ఉంటాయి. వాటిలో 14.5 కిలోల గ్యాస్ ఉంటుంది. బరువు ఎక్కువకావడంతో వాటిని తరలించడం ఇబ్బందికరం. పైగా చిలుము పట్టడం, వంట గదిలో నేలపై మరకలు పడటం వంటి సమస్యలు ఉంటాయి. అదే ఫైబర్ సిలిండర్లు తేలికగా ఉంటాయి. మోసుకెళ్లడం సులభం. చిలుము, మరకలు వంటివి ఉండవు. మహిళలు కూడా సులువుగా మార్చుకోవచ్చు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ ఫైబర్ సిలిండర్‌ను.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ అక్షిత చెన్నంకుట్టి శనివారం హైదరాబాద్‌లో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందచేశారు. -
నగదు బదిలీతో.. హక్కుగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు నగదు బదిలీ పథకానికి రైతుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. వైఎస్సార్ ఉచిత విద్యుత్తు పథకానికి నగదు బదిలీ అమలు పురోగతిపై ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆదివారం విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వివరాలు తెలియచేశారు. నగదు బదిలీ పథకం కింద రైతులపై ఒక్క పైసా కూడా భారం పడకుండా విద్యుత్తు బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి వారి ఖాతాలకు జమ చేయనుంది. ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని రైతులే నేరుగా విద్యుత్తు సంస్థలకు బిల్లుల రూపంలో ల్లించనున్నారు. రైతులే బిల్లులు చెల్లించి విద్యుత్తు తీసుకుంటారు కాబట్టి నాణ్యమైన కరెంట్ సరఫరాను తమ హక్కుగా ప్రశ్నించే వీలుంది. మరోవైపు తమకు బిల్లులు చెల్లిస్తున్న అన్నదాతల పట్ల విద్యుత్తు పంపిణీ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో వ్యవహరిస్తాయి. వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లను బిగించడం వల్ల లోడ్ ఎంతనేది ముందే స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. తగినంత విద్యుత్తు సరఫరా జరుగుతుంది కాబట్టి మోటార్లు కాలిపోవు. లో వోల్జేజీ సమస్య అనేది ఎక్కడా ఉండదు. తద్వారా రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందుతుంది. పైసా కూడా భారం పడకుండా.. రైతన్నల అనుమతితోనే నగదు బదిలీ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలన్న లక్ష్యం నెరవేరుతోంది. పథకం అమలుకు అంగీకరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 92 శాతం మంది రైతులు విద్యుత్ సంస్థలతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వ్యవసాయ విద్యుత్ ధరను యూనిట్ సరాసరి రూ.5.73గా ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించినప్పటికీ రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఆ వ్యయాన్నంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రైతుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న ఈ పథకానికి 98.6 శాతం మంది రైతులు అంగీకారం తెలిపారు. సామర్థ్యం పెంపు... లో ఓల్టేజీ పరిష్కారం మీటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్ లోడు ఎక్కడ ఎక్కువ ఉంది? ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల సామర్ధ్యం ఎక్కడ, ఎంత పెంచాలి? అనే అంశాలను డిస్కమ్‌లు కచ్చితంగా తెలుసుకునే వీలుంది. లో ఓల్టేజి సమస్యలను గుర్తించి పరిష్కరించవచ్చు. ఇబ్బందులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ పగటి పూటే 9 గంటల పాటు సరఫరా చేసే అవకాశం కలుగుతుంది. వ్యవసాయ ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వ్యవసాయ లోడ్‌ను కచ్చితంగా లెక్కించవచ్చు. ఇప్పటివరకూ ఈ విధానం లేదు. మరో 30 ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా.. నాణ్యమైన కరెంట్ కోసం విద్యుత్ సంస్థలను ప్రశ్నించే హక్కు రైతులకు కల్పిస్తున్న ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఇంధన శాఖ కార్యదర్శికి మంత్రి బాలినేని సూచించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, ఉత్పాదకతను పెంచడం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పథకం అమలులో రాష్ట్ర్రంలోని ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఉచిత విద్యుత్‌కు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులంతా నాణ్యమైన ఉచిత విద్యుత్తును నిరాటంకంగా పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. -
నెల్లూరులో మంత్రుల బృందం పర్యటన
సాక్షి, నెల్లూరు: మంత్రుల బృందం నెల్లూరులో శనివారం పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. కావలిలో రూ.86 లక్షలతో నిర్మించిన అగ్రి, ఆక్వా కల్చర్ ల్యాబ్.. తాళ్లపాలెంలో రూ.45 లక్షలతో నిర్మించిన సచివాలయం, ఆర్బీకే.. తుమ్మలపెంటలో రూ.64 కోట్లతో జలజీవన్ మిషన్‌ను మంత్రులు ప్రారంభించారు. జల జీవన్ మిషన్‌తో 240 గ్రామాలకు తాగునీటి సమస్య తీరనుంది. ఆముదాల దిన్నెలో రూ.15 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైన్‌ను కూడా ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా.. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. -
రైతులకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి: బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి,ఒంగోలు అర్బన్: రైతులు సంతోషంగా ఉంటే ప్రజలంతా సంతోషంగా ఉంటారని భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను అన్నీ రకాలుగా ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం భవనంలో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ సలహామండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. చట్ట ప్రకారం రాష్ట్రానికి అందాల్సిన నీటి వాటా అందడంలేదని, అక్రమంగా తెలంగాణకు తీసుకుపోతుంటే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు ఎందుకు సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించడని అన్నారు. ఓటుకు నోటు కేసు తిరగతోడతారని చంద్రబాబుకు భయం అన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన హయాంలో రైతులకు ఏం చేశారో, నీటి వాటాలపై తెలంగాణ వైఖరిపై మాట్లాడాలని సవాల్ విసిరారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా గురించి మాట్లాడితే రాయలసీమలో వ్యతిరేకత వస్తుందని, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలతో జిల్లా ఎడారిగా మారుతుందని మాట్లాడించారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, రైతులకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. జిల్లాలో రైతుల గురించి కాని, నీటి సరఫరా గురించి కాని మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హైదరాబాదులో బాబుని కలిసి స్క్రిప్ట్ తీసుకొచ్చి మీడియా ముందు చదివారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టి మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అన్నీ జిల్లాలు సమానమేనని, అన్నీ జిల్లాలకు సమ న్యాయం జరుగుతుందని చెప్పారు. నీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించి నీటి పంపకాల్లో న్యాయం చేస్తే మంచిదన్నారు. నీటి పంపకాల్లో రాష్ట్రానికి న్యాయం జరగాలన్నారు. ప్రాంతీయ వాదం రెచ్చగొడుతున్న చంద్రబాబు: మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలకు మధ్య చంద్రబాబు ప్రాంతీయ వాదం రెచ్చగొడుతున్నారని అన్నారు. చట్ట బద్ధంగా రాష్ట్రానికి అందాల్సిన నీటిలో ఒక్క చుక్క కూడా ఎక్కువ అవసరం లేదని, అదేవిధంగా ఒక్క చుక్క తగ్గినా ఊరుకునేది లేదన్నారు. రాయలసీమ ప్రజలకు నీరు ఇవ్వకూడదా... రాయలసీమ రైతులకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదా చంద్రబాబు చెప్పాలన్నారు. జిల్లా ఎడారి అవుతుందని మాట్లాడించడం అన్యాయమన్నారు. ఆయన హయాంలో జిల్లాకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది చివరకు మొదటి టన్నెల్ ప్రారంభించి నీటి విడుదల చేస్తామన్నారు. రెండో టన్నెల్ పనులతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజి, పునరావాస కాలనీల పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మంత్రులతో పాటు వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి ఉన్నారు. -
సీఎం జగన్ దృష్టిలో అన్ని జిల్లాలు సమానమే..
సాక్షి, ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టిలో అన్ని జిల్లాలు సమానమేనని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రైతుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఏ ప్రభుత్వం చేయని విధంగా మేలు చేస్తోంది. ప్రతి నెలా మూడో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి మీటింగ్ ఉంటుంది. టీడీపీ ఎమ్మెల్యేలు సాగర్ నీళ్లపై ముసలి కన్నీరు కారుస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా?. ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు రైతుల సమస్యలు గాలికి వదిలేశారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే డ్రామాలు ఆడుతున్నారు. ప్రకాశం నీటి సమస్యపైన చంద్రబాబు ఎందుకు మాట్లాడడు? ఎందుకు స్పందించడు?. ఓటుకి నోటు కేసులో లోపల వేస్తారని భయమా?. నీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము’’ అని అన్నారు. -
సంక్షేమ పథకాలను పక్కదారి పట్టించడానికే చంద్రబాబు డ్రామాలు : బాలినేని
-
జూలైలో కరవు భత్యం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులకు ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీపికబురు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కరవు భత్యాన్ని జూలైలో ఇస్తామని వెల్లడించారు. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగ సంఘాలతో మంత్రి సచివాలయంలో మంగళవారం దాదాపు నాలుగు గంటలకుపైగా చర్చలు జరిపారు. వేతనాలు తగ్గిస్తున్నారని పుకార్లు చెలరేగిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అనేక డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించారు. విద్యుత్ ఉద్యోగులకు 2018లో ప్రకటించిన పీఆర్సీని 2022 వరకు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిస్తామన్నారు. కరోనా బాధిత ఉద్యోగులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అసువులు బాసిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి సానుకూల అభిప్రాయం ఉందని, వారి సేవలను గుర్తించిందన్నారు. వీలైనంతవరకూ వారికి న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వారిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే పుకార్లను నమ్మొద్దని కోరారు. ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం ఉద్యమించిన నేపథ్యంలో నమోదైన కేసులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని అంశాలపై మంత్రి బాలినేని ఓపికగా చర్చించారని, ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఏర్పడిందని చర్చల్లో పాల్గొన్న విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు వెంకట రమణారెడ్డి, సురేష్ కాంతారెడ్డి, వేదవ్యాస్, చంద్రశేఖర్ తదితరులు మీడియాకు తెలిపారు. గత కొంతకాలంగా వస్తున్న పుకార్లతో నెలకొన్న ఆందోళన మంత్రి హామీతో తొలగిపోయిందన్నారు. -
వదంతులు నమ్మవద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ఉద్యోగుల వేతనాలు తగ్గించే ఆలోచన చేయడం లేదని, ఈ ప్రచారం వదంతులేనని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ వదంతులతో ఉద్యోగులు అభద్రతకు లోనుకావద్దని కోరారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయడం లేదన్నారు. ఖరీఫ్ నుంచి వందశాతం ఫీడర్ల ద్వారా పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన సోమవారం విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణాన్నే ఆకాంక్షిస్తోందని, వారికి నష్టం చేసే ఏ ఆలోచన చేయబోదని భరోసా ఇచ్చారు. 2018లో సవరించిన వేతనాలే 2022 వరకు కొనసాగుతాయని, ఈ విషయాన్ని వారికీ స్పష్టం చేశామని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రెండు నెలల్లో అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. రైతు కోసం ఎంతైనా ఖర్చు రైతు పక్షపాతి అయిన సీఎం వైఎస్ జగన్ ఉచిత విద్యుత్ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒక్క అనంతపురంలో మాత్రం రైతుల కోరిక మేరకు రాత్రిపూట విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 55 శాతం ఫీడర్లే 9 గంటల పగటి విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీంతో అప్పటికప్పుడే రూ.1,700 కోట్లు మంజూరు చేసి సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను బలోపేతం చేసినట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, రూ.80 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూ లేని విధంగా రెండేళ్లలోనే రూ.18 వేల కోట్ల చేయూతతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అడుగులేశారని చెప్పారు. ప్రైవేటీకరణ యోచన లేదు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయడంలేదని చెప్పారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గిన దాఖలాలు లేనేలేవన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పంపుసెట్లకు మీటర్లు బిగించి, కచ్చితమైన విద్యుత్ వినియోగాన్ని లెక్కగట్టామని, ఒక్క రైతుపైనా పైసా భారం మోపలేదని చెప్పారు. రైతు ఖాతాల్లోకే వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని వేశామని, దీనివల్ల నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా డిస్కమ్‌ల్లో జవాబుదారీతనం పెరిగిందని పేర్కొన్నారు. వ్యవసాయ సబ్సిడీ ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. జగనన్న కాలనీల్లో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
డిస్కమ్‌లను ప్రైవేటీకరించే ఆలోచన లేదు: మంత్రి బాలినేని
సాక్షి, అమరావతి: డిస్కమ్‌లను ప్రైవేటీకరించే ఆలోచన తమకు లేదని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇస్తున్నాం అని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ.. ‘‘కోవిడ్‌తో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటాం. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులకు 75శాతం వ్యాక్సిన్ వేశాం’’ అని తెలిపారు. ‘‘గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని 80వేల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచింది. విద్యుత్ రంగాన్ని కాపాడేందుకు సీఎం జగన్ 18వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. డిస్కమ్‌లను ప్రైవేటీకరించే ఆలోచన మాకు లేదు. మోటర్లకు మీటర్లు పెట్టినా ప్రజలపై భారం పడకుండా చర్యలు’’ తీసుకుంటామని బాలినేని తెలిపారు. చదవండి: కృత్రిమ మేధ.. లేదిక ‘కోతల’ బాధ! -
‘రఘురామను అరెస్ట్ చేయటంలో ఎలాంటి తప్పులేదు’
సాక్షి, అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయటంలో ఎలాంటి తప్పులేదని, ఆయన్ని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సిందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, సీఎంను ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తే ప్రజలు సహించరని అన్నారు. ఎంపీ రఘురామ అరెస్ట్ అనంతరం మంత్రి బాలినేని స్పందించారు. రఘురామలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోందంటూ మండిపడ్డారు. తన నియోజకవర్గానికి వెళ్లి అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీ ఎక్కడో ఉండి తన ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడం సరైంది కాదన్నారు. రఘురామకృష్ణరాజుపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి: శ్రీరంగనాథరాజు ‘‘ఎంపీ రఘురామకృష్ణరాజు గత 13 నెలలుగా నరసాపురం పార్లమెంట్ ప్రజలను వదిలేసి.. ఢిల్లీ, హైదరాబాద్‌లలో మకాం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. నరసాపురం పరిధిలో నమోదైన కేసులపై కూడా పోలీసులు విచారణ చేయాలి. రఘురామకృష్ణరాజుపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు. చదవండి : ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ -
‘ఎప్పుడైనా ఓకే.. అందుకు సిద్ధం’
సాక్షి, విశాఖపట్నం: ఎస్ఈసీ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మాయ, మోసం, దగాలో టీడీపీ పుంజుకుంటోందని ఆయన విమర్శించారు. మొదటిదశలో 3,244, రెండో దశలో 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని తెలిపారు. రెండో దశ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 2639, టీడీపీ 536, బీజేపీ 6,జనసేన 36, ఇతరులు 108 స్థానాలు గెలిచారని తెలిపారు. ఏకగ్రీవాలతో కలిసి వైఎస్సార్సీపీ మద్దతుదారులు 2,639 మంది గెలిచారని ఆయన వెల్లడించారు. చంద్రబాబులా అంకెలగారడీ చెప్పడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ దాడులు హేయమైన చర్య: మంత్రి బాలినేని ప్రకాశం: పంచాయతీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనం స్పష్టమైందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే వైఎస్సార్ సీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని తెలిపారు. టీడీపీ ఆధిపత్యం గ్రామాల్లో కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో ఓటమిని తట్టుకోలేకే వైఎస్సార్ సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారని, టీడీపీ దాడులు హేయమైన చర్య అని మంత్రి బాలినేని మండిపడ్డారు. (చదవండి: ఆ దమ్ము టీడీపీకి ఉందా..?: పెద్దిరెడ్డి సవాల్) పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ -
టీడీపీ మేనిఫెస్టోపై చర్యలేవి..?
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడరమేశ్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ, ఎన్నికల కమీషనర్లా కాకుండా చంద్రబాబు ఏజెంట్లా వ్యవహరిస్తున్నారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి, మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారంటూ మండి పడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. నిమ్మగడ్డ తీరు ఒంటెద్దు పోకడలా ఉందంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసినా స్పందించని నిమ్మగడ్డ.. ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. ఉన్నత పదవిలో ఉంటూ ఆయన ఇలా వ్యవహరించడం సరికాదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ ఎన్నికల ఫలితాలు ఆయను గుణపాఠం నేర్పుతాయని మంత్రి హెచ్చరించారు. నిమ్మగడ్డ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంటే, ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న నిమ్మగడ్డ తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నాడని మంత్రి తానేటి వనిత కామెంట్ చేశారు. ప్రభుత్వం పట్ల నిమ్మగడ్డ కక్షపూరిత ధోరణి సరికాదని ఆమె మండి పడ్డారు. ఎన్నికల కమిషనర్‌కు ఎన్నికలు సజావుగా నిర్వహించే హక్కు ఉంటుందని, ఆ హక్కును ఉపయోగించి ఎన్నికలు సజావుగా జరిగేటట్టు చూడాలే కానీ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని హితవు పలికారు. ఎస్ఈసీ స్థాయికి మించి జోక్యం చేసుకుంటున్నారు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక అధికారిలా కాకుండా చంద్రబాబు ఏజెంట్లా వ్యవహరిస్తున్నాడని, ఉన్నతాధికారుల విషయంలో తన స్థాయికి మించి ఆయన జ్యోక్యం చేసుకొంటున్నాడని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేశ్ గౌడ్ ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇలాంటి ఎన్నికల కమీషనర్ లేడని, గతంలో పని చేసిన ఎస్ఈసీలను చూసైనా ఆయన హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలి ఆయన సూచించారు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా.. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలు బొమ్మ అని, నిమ్మగడ్డను చంద్రబాబు అడిస్తున్నాడని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఫైరయ్యారు. మంత్రులపై ఫిర్యాదు చేస్తూ గవర్నర్‌కు రాసిన లేఖ నిమ్మగడ్డ రాసింది కాదని, చంద్రబాబు రాసిన లేఖనే ఆయన యధాతధంగా గవర్నర్‌కు పంపాడని ఆరోపించారు. మంత్రులు, వైసీపీ నేతలపై బురద చల్లేందుకే నిమ్మగడ్డ ఇలా వ్యవహరిస్తున్నాడని, ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఎమ్మెల్యే విమర్శించారు. రాజ్యాంగ బద్దంగా పనిచేయడం లేదు.. ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్యాంగ బద్దంగా పనిచేయడం లేదని, ఆయన వ్యవహరిస్తున్న తీరు టీడీపీకి గులాంగిరి చేసినట్లుందని వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో వైషమ్యాలను సృష్టించేందుకు చంద్రబాబు ప్లాన్‌కు అనుగుణంగా పనిచేస్తున్న నిమ్మగడ్డ.. అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఏకగ్రీవాలనేవి ఎప్పటినుంచో ఉన్నాయని, అది కూడా తెలుసుకోకుండా మాట్లాడటం నిమ్మగడ్డ స్థాయికి సరికాదన్నారు. -
90 శాతం స్థానాలను గెలుస్తాం: మంత్రి బాలినేని
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో త్వరలో జరుగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సారధ్యంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా పార్టీ కార్యలయంలో జరిగిన నేతల భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా తమ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో ఏకగ్రీవాలపై దృష్టి సారించాలని నాయకులకు పిలుపునిచ్చారు. గ్రామాల ప్రగతికి తోడ్పడతాయని తాము ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, చంద్రబాబు అండ్ కో కలిసి అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విషయం స్పష్టమవుతుందన్నారు. గతంలో ఆగిన ఎన్నికలను పూర్తి చేయకుండా పంచాయతీ ఎన్నికలను నిర్వహించడమేంటని రమేష్ కుమార్‌ను ప్రశ్నించారు. చీరాల ప్రాంతంలో కోర్టు కేసులు ఉండటం వల్ల అక్కడ ఎన్నికలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఇంఛార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
సెంట్రల్ డిస్కం వెబ్సైట్, యాప్ ప్రారంభం
ఒంగోలు: సెంట్రల్ డిస్కం నూతనంగా అభివృద్ధి చేసిన శాప్ అండ్ ఐటీ అప్లికేషన్, వెబ్‌సైట్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ.. సెంట్రల్ డిస్కం అధునాతన సాంకేతిక విలువలతో వినియోగదారులకు సత్వర సేవలందించే దిశగా ముందుకెళ్లడం అభినందనీయమన్నారు. 2019 డిసెంబర్లో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు, వినియోగదారులకు మరింత మేలు జరిగేలా ఏపీఎస్పీడీసీఎల్ను విభజించి ఏపీసీపీడీసీఎల్ను ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 28 నుంచి కొత్తగా ఏర్పడ్డ సెంట్రల్ డిస్కం సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించిందన్నారు. నేడు ప్రారంభించిన అప్లికేషన్ ద్వారా సెంట్రల్ డిస్కంలోని ఉద్యోగుల దైనందిన కార్యకలాపాలను పారదర్శకతతో చేయడానికి వీలవుతుందన్నారు. అత్యుత్తమ, నాణ్యమైన, కచి్చతమైన సమాచారం ఉంటుందని, ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండటం వల్ల ఉద్యోగులకు, వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. -
విద్యుత్ చార్జీలు పెంచం
సాక్షి, అమరావతి: ఎన్ని ఇబ్బందులున్నా విద్యుత్ చార్జీలు మాత్రం పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం) కొత్త లోగోను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్న విషయాలను చంద్రశేఖరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా సంక్షోభంతో విద్యుత్ సంస్థలు మరింత ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అయినా కూడా ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే విద్యుత్ పంపిణీ సంస్థలు చార్జీల పెంపు ప్రతిపాదన లేకుండా వార్షిక ఆదాయ అవసర నివేదికలను ఏపీఈఆర్సీకి సమర్పించాయని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కంలను ఆదుకుందని మంత్రి చెప్పారు. 2019–20లో రూ.17,904 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.8,353.58 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా కోసం రూ.717.39 కోట్లు సబ్సిడీ కేటాయించిందన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులకు రూ.1,707 కోట్ల సబ్సిడీ ఇచ్చిందని తెలిపారు. చౌక విద్యుత్ లక్ష్య సాధన కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నూతన విధానాలను అధ్యయనం చేయాలని విద్యుత్ సంస్థలకు మంత్రి సూచించారు. కాగా.. గ్రామ, మున్సిపల్ వార్డు సచివాలయాల్లో 7,000 మందికి పైగా జూనియర్ లైన్మెన్లను ప్రభుత్వం నియమించటం వల్ల క్షేత్రస్థాయిలో విద్యుత్ సంస్థల పనితీరు మెరుగుపడిందని మంత్రికి ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వివరించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జెన్కో విద్యుత్ ప్లాంట్లను అమ్మేస్తున్నారనేది కేవలం కొంతమంది పనిగట్టుకుని చేసే దుష్ప్రచారమేనన్నారు. రైతన్నకు మరో 30 ఏళ్లదాకా పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై బుధవారం ఆయా సంఘాల ప్రతినిధులతో మంత్రి చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నారనేది వదంతులు మాత్రమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా విద్యుత్ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి చెప్పారు. 1999–2004 మధ్య కాలంలో చేరిన విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ పథకాన్ని వర్తింపజేయడంపై కూడా సీఎంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కోవిడ్ సంక్షోభంలోని మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సగం జీతాలు త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల వేతనాలు నేరుగా సంస్థల ద్వారా ఇవ్వాలనే డిమాండ్‌నూ పరిశీలిస్తామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారంటూ కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారని, అయితే రైతన్నపై పైసా భారం పడకుండా, మరింత జవాబుదారీతనంతో విద్యుత్ సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని బాలినేని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, జెన్కో ఎండీ శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు పద్మాజనార్థన్ రెడ్డి, హరినాథ్‌రావు, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా మంత్రి తమ సమస్యలు సానుకూలంగా విన్నారని ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖర్, వేదవ్యాస్ పేర్కొన్నారు. -
విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేయం..
సాక్షి, వెలగపూడి : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని ఆయన కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని అన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనా సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని తెలిపారు. ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని మరోసారి స్పష్టం చేసారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని, రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. (ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది మేమే ) అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగుల జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చర్చల్లో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి,విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు చంద్రశేఖర్, వేదవ్యాస్ ,సాయి క్రిష్ణలతో పాటు ముప్పైమంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యుత్ అధికారులతో సమావేశమైన బాలినేని
సాక్షి, ప్రకాశం : భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడటంతో అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పొలాల్లో వ్యవసాయ కనెక్షన్ల వద్ద తగిన జాగ్రత్తలు పాటించే విధంగా రైతులను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. 24/7 పాటు విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారని ఏదైనా సమస్య ఉంటే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. (వర్షాలు, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష) -
మహాత్ముడికి సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులు ఆర్పించారు. దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యానారాయణ, బాలీనేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
అలా జరిగితే పదవి వదులుకుంటా: బాలినేని
సాక్షి, ఒంగోలు : విద్యుత్ సంస్కరణల విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ,లేనిపోని అపోహలు సృష్టించవద్దని ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఉచిత విద్యుత్‌కి ఎటువంటి విఘాతం కలగదని అన్నారు. ఎట్టి పరిస్థితిలో రైతులు డబ్బు కట్టే పరిస్థితి రాదని బాలినేని స్పష్టం చేశారు. రైతులు ఒక్క రూపాయి కట్టే పరిస్థితి వస్తే తన మంత్రి పదవి వదులుకుంటానని తెలిపారు. (రైతుల ఖాతాలోకే విద్యుత్ సబ్సిడీ) మహానేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పధకం ఎట్టి పరిస్థితిలో ఆపే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఆనాడు ఉచిత విద్యుత్ గురించి వైఎస్సార్ మాట్లాడితే ..తీగల మీద బట్టలు ఆరవేసుకోవాల్సిందే అని చంద్రబాబు ఎద్దేవా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాలినేని గుర్తుచేశారు. విద్యుత్ గురించి మాట్లాడితే బషీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలో భాగంగా రైతులకు ,ఉచిత విద్యుత్‌కు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బాలినేని తెలిపారు. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని అన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే డబ్బులు జమచేసి ఆ బిల్లు డబ్బును డిస్కం ఖాతాలో జమచేయడం ద్వారా రైతులకు ఎటువంటి నష్టం లేదని మంత్రి బాలినేని పేర్కొన్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతన్నల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. ఈ పథకం ద్వారా ఇంతకాలం విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఇక నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ తరువాతే ఆ డబ్బు డిస్కమ్‌లకు చేరుతుంది. ఉచిత విద్యుత్తు ద్వారా వ్యవసాయదారులు ఎంత కరెంట్ వాడుకున్నా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. -
వరద నీటిలోనూ విద్యుత్ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: వరదల వల్ల ఉభయగోదావరి జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టంపై సీఎం వైఎస్ జగన్ సోమవారం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. విద్యుత్‌ను పునరుద్ధరించే వరకు సిబ్బంది అక్కడే ఉండాలని సీఎం సూచించారు. వీలైనంత త్వరగా అన్ని గ్రామాలకు విద్యుత్ అందించాలన్నారు. ప్రభుత్వం విద్యుత్ శాఖకు అన్ని విధాల తోడ్పాటునందిస్తుందని తెలిపారు. వరద ప్రాంతాల్లో పరిస్థితిని, విద్యుత్ శాఖ అప్రమత్తమైన తీరును ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వివరించారు. రాత్రింబవళ్లు పునరుద్ధరణ పనులు ► ఉభయగోదావరి జిల్లాల్లోని నాలుగు మండలాలు.. నెల్లిపాక, వీఆర్‌పురం, కూనవరం, చింతూరుల్లో ఉన్న 133 గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 10,998 సర్వీసులకు సరఫరా ఆగిపోయింది. మరో 1,528 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా నిలిపేయాల్సి వచ్చింది. నీటి ముంపుతో ఏలూరు డివిజన్లో రెండు 11 కేవీ ఫీడర్లు విద్యుత్ సరఫరా ఆపేశాయి. 916 ట్రాన్స్ఫార్మర్లు నీటమునిగాయి. ► పోలవరం ముంపు మండలాల్లోనే నష్టం ఎక్కువగా ఉంది. పరిస్థితిని అంచనా వేసి ముందే అక్కడకు అదనపు సిబ్బందిని పంపాం. ప్రస్తుతం రాత్రింబవళ్లు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అవసరమైన సామాగ్రిని పడవల ద్వారా చేరవేస్తున్నారు. సోమవారం రాత్రికల్లా 90 శాతం విద్యుత్ పునరుద్ధరణ పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ► గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో సిబ్బంది అక్కడ నిలబడే వీలు లేకపోయినా విద్యుత్ పునరుద్ధరణ వేగంగానే సాగుతోంది. విరిగిపోయిన స్తంభాలను గుర్తించి తక్షణ చర్యలు చేపడుతున్నారు. ► తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుని అవసరమైన ఆదేశాలిస్తున్నారు. విద్యుత్ సౌధలో అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. -
జోరువానల్లోనూ విద్యుత్ వెలుగులు
సాక్షి, అమరావతి: వర్షాకాలంలోనూ ఎలాంటి అంతరాయాలు లేకుండా కరెంట్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదేశించారు. విద్యుత్ లైన్లు, టవర్లు, సబ్ స్టేషన్లను తరచూ పరిశీలించాలని సూచించారు. క్షేత్రస్థాయి విద్యుత్తు అధికారులతో శ్రీకాంత్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను విద్యుత్‌శాఖ శుక్రవారం మీడియాకు వెల్లడించింది. ఏఈలు అప్రమత్తం కావాలి... ► గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తే ప్రాంతాల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు తక్షణమే అప్రమత్తం కావాలి. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, కండక్టర్లు తెప్పించుకోవాలి. ఏఈల పనితీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ► ఉత్తరాంధ్రలో వాగులు వంకలు ఉప్పొంగే అవకాశం ఉన్నందున లైన్ మెటీరియల్స్, టవర్ భాగాలు, కండక్టర్లు, ఇన్సులేటర్లను అదనంగా సమకూరుస్తున్నారు. ► డీజిల్ జనరేటర్లు, శాటిలైట్ ఫోన్లు, వాకీటాకీలు సిద్ధంగా ఉంచారు. ► ప్రతి సర్కిల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్‌కు అత్యధిక ప్రాధాన్యం: మంత్రి బాలినేని పొలం పనులు ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ నాటికి నూటికి నూరుశాతం ఫీడర్ల ద్వారా 9 గంటల విద్యుత్ అందించాలన్నారు. ఈ దిశగా జరుగుతున్న చర్యలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ తీసుకుంటున్న చర్యలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. -
మంత్రి బాలినేని ఎస్కార్ట్కు ప్రమాదం
-
మంత్రి బాలినేని కాన్వాయ్‌కు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర , సాంకేతిక శాఖమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. గచ్చిబౌలి నుంచి విజయవాడకి వెళ్తుండగా పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగురోడ్డుపై ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ అవ్వడంతో పల్టీకొడుతూ బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. మంత్రి బాలినేని ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా, కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పాపయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మిగిలిన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను హయత్‌నగర్‌లోని హాస్పిటల్‌కి తరలించారు. మృతిచెందిన పాపయ్య కుటుంబానికి మంత్రి బాలినేని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పొగాకు రైతులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తాం
-
కరోనా నియంత్రణ చర్యలు బాగున్నాయి: మంత్రి బాలినేని
-
నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోను: మంత్రి బాలినేని
-
కరోనా కేసులన్నీ మర్కజ్ వెళ్లినవారే
-
పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్లే
సాక్షి, ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న ఆయన, కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం కొంత ఊరటనిచ్చే విషయం అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. అయితే ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులన్ని ఢిల్లీ మర్కజ్కి వెళ్లి వచ్చిన వాళ్లవేనని, ఇంకా ఎవరైనా ఢిల్లీ వెళ్లివచ్చిన వాళ్ళు ఉంటే స్వచ్ఛదంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి బాలినేని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు అధిక రేట్లకు అమ్ముతున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చాయని, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని బాలినేని మరోసారి హెచ్చరించారు. సీఎం జగన్ ముందు చూపుతో వాలంటీర్ల వ్యవస్థ అమలు చేశారని, కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో వారే కీలకంగా మారారన్నారు. అధికారులు, ఉద్యోగులు అందరూ బాగా కష్టపడుతున్నారని వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న రేషన్ కార్డుదారులకు శనివారం నుంచి రూ. 1000 అందజేయనున్నామని బాలినేని తెలిపారు. -
ఒంగోలులో పకడ్బందీగా లాక్ డౌన్
-
కరోనాపై సమీక్ష: వలంటీర్ల వ్యవస్థ కీలకం
సాక్షి, ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల్లో కోవిడ్-19 (కరోనా వైరస్) గురించి పూర్తి అవగాహన కల్పిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ఒంగోలులో శనివారం నిర్వహించిన కరోనా నివారణ సమీక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. జిల్లాలో కరోనాపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. అధికార యంత్రాంగం చాలా కష్టపడుతోందన్నారు. (కరోనా వైరస్: ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం) ఒకప్పుడు గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. ఇప్పడు అదే వ్యవస్థ కీలకంగా మారిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతోనే వాలంటీర్లు వ్యవస్థ ఏర్పాటైందన్నారు. ఇలాంటి సమయంలో మీడియా బాధ్యతగా మెలగాలని మంత్రి సూచించారు. వైరస్‌పై తప్పుడు, అసత్య ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బాలినేని పేర్కొన్నారు. (‘వారి నమూనాలను ల్యాబ్‌కు పంపించాం’) అదేవిధంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీలపై పూర్తి నిఘా పెట్టామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాసంస్థలపై తనిఖీలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఆపదకాలంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఉపయోగిస్తున్నామని సురేష్ చెప్పారు. (కరోనా: జనతా కర్ఫ్యూ.. ఏపీలో బస్సులు బంద్!) -
సీఎం పేరు మీద క్రీడలు జరగడం ఇదే తొలిసారి
-
ఆయన నిర్వాకంతోనే రాష్ట్రం దివాలా..
సాక్షి, కొత్తపట్నం: చదువుకు పేదరికం అడ్డు కాకూడదని.. పేదల బిడ్డలు ఉన్నత విద్య చదవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంగ్లీష్ బోధనను దురుద్దేశం తోనే ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయన్నారు. గురువారం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల జిల్లా పరిషత్ హైస్కూల్లో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన మంత్రి బాలినేని..విద్యార్థుల తల్లులకు అమ్మఒడి చెక్కులను అందజేశారు. మంత్రితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి చిన్నారుల తల్లులు పాలాభిషేకం చేశారు. బాలినేని మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకంతోనే రాష్ట్రం దివాలా తీసిందని.. అయినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. కొత్తపట్నం మండలంలో త్వరలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. జిల్లాలోని కందుకూరులో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ‘జగనన్న అమ్మఒడి పథకాన్ని’ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘వైఎస్సార్ కంటి వెలుగు పథకం’ ద్వారా విద్యార్థులకు కంటి అద్దాలను ఆయన పంపిణీ చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకానికి మద్దతుగా గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చీరాల ఓరియంటల్ యూపీ పాఠశాలలో ‘అమ్మఒడి’ పథకాన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎం. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మఒడి పథకాన్ని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చుండూరు రవి, మండవ అప్పారావు, ఏఎంసీ చైర్మన్ ఎనగంటి పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అమ్మఒడి..పేదింట చదువుకు భరోసా) (చదవండి: ‘వచ్చారు జగన్.. మెచ్చారు జనం’) -
విద్యుత్ అంతరాయాలు తగ్గాయి: బాలినేని
సాక్షి, అమరావతి: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ అంతరాయాలు తగ్గాయని విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యుత రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ అంతరాయాలపై ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... టీడీపీ సర్కారు హయాంలో విద్యుత్ రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా... 2018లో 53,016 ఫీడర్లు ఉండగా... 17320 గంటల పాటు విద్యుత్ అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. అయితే 2019 మే నుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని తెలిపారు. 2019లో 44406 ఫీడర్లు ఉండగా.. 14085 గంటలు మాత్రమే విద్యుత్ అంతరాయం కలిగిందని స్పష్టం చేశారు. అదే విధంగా మే నుంచి ఇప్పటిదాకా వివిధ నెలల్లో కలిగిన విద్యుత్ అంతరాయాలను, గతేడాది గణాంకాలతో పోలుస్తూ వివరణ ఇచ్చారు. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధతో ప్రస్తుతం రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా విద్యుత్ అంతరాయాలపై టీడీపీ ఆందోళన చేయడంపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తాను వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. టీడీపీ సభ్యులు అరవడం మొదలుపెట్టారు. దీంతో సంబంధిత శాఖా మంత్రి వివరణ ఇస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా... ‘ టీడీపీ వాళ్లు నోరు తెరిస్తే అబద్ధాలు. విద్యుత్ అంతరాయాల గురించి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. వాళ్ల అబద్ధాలు బయటపెట్టడానికే డేటా తెప్పించాం. కానీ వాళ్లు వినేందుకు సిద్ధంగా లేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విద్యుత్ అంతరాయాలు తగ్గాయి
-
విద్యుత్‌ను పొదుపు చేయండి: మంత్రి బాలినేని
సాక్షి, విజయవాడ: విద్యుత్ వినియోగం తగ్గించడం, పొదుపు చేయడాన్ని మహిళలు నేర్చుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వయం సహాయక బృందాల మహిళలకు ఇంధన పొదుపుపై అవగాహన సదస్సును సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, నాగులాపల్లి శ్రీకాంత్, ఎనర్జీ డిపార్ట్మెంటు కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. స్టార్ రేటింగ్స్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను వాడి విద్యుత్‌ను పొదుపు చేయాలని సూచించారు. నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకే అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి యూనిట్ విద్యుత్‌ను గతంలో కంటే తక్కువ ధరకు కొని ప్రజలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ కొనుగోలులో 5 నెలల్లో ప్రభుత్వం రూ. 500 కోట్లు ఆదా చేసిందని, బొగ్గు కొనుగోలు టెండర్లలో రివర్స్ టెండరింగ్ ద్వారా 180కోట్లు ఆదా చేశామన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని, విద్యుత్ శాఖ వేల కోట్ల రూపాయల నష్టంలో ఉందని మంత్రి బాలినేని తెలిపారు. ఈ క్రమంలో విద్యుత్ రంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. అలాగే డ్వాక్రా రుణమాఫీని త్వరలో అమలు చేయనున్నామని, పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంధనం లేకపోతే ఏ రంగం అభివృద్ధి చెందదని, అందుకే విద్యుత్‌ను పొదుపుగా వాడాలన్నారు. రాష్ట్రం 70వేల కోట్ల రూపాయల అప్పులో ఉందని, చంద్రబాబు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టారని, ఇక ఆర్థిక భారాన్ని సీఎం జగన్‌పై పెట్టారని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పదవి చేపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని, గ్రామాల్లో ఈఎస్ఎల్ అనే సంస్థ ద్వారా ఎల్ఈడీ లైట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామాల్లో రూ.5 లక్షలతో వీధి దీపాలు ఏర్పాటు చేశామని, డ్వాక్రా సంఘాలకు ఈ ఏడాది రూ. 8540 కోట్లు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చామని వెల్లడించారు. సంఘాలకు రూ. 1137.57 కోట్లు రుణాల కింద అందజేశామని, దేశ చరిత్రలోనే మొదటిసారిగా గ్రామ సచివాలయం, గ్రామవాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణాభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1200 కోట్ల రూపాయలు చెల్లించి బాధితులను ఆదుకున్నారని, ప్రభుత్వ పాఠశాలను ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద మరింతగా అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా పేద విద్యార్థులకు చదువు నిమిత్తం ఏడాదికి రూ. 15000 అందిస్తున్నామని, జనవరి 7నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. -
‘సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి’
సాక్షి, విజయవాడ : విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలో సోమవారం 170 అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లకు నియామక పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో విఫలమైందని, విద్యుత్ శాఖలో చాలా తప్పిదాలకు పాల్పడిందని విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఎనిమిది వేల జూనియర్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేశారని ప్రశంసించారు. 170 మందికి సర్టిఫికేట్ ఇవ్వడం సంతోషంగా ఉందని, ఉద్యోగులందరూ సంస్థ తమది అనుకోని పనిచేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగాల కల్పనలో ముందుంటారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఆశయ సాధనకు అనుగుణంగా ఉద్యోగులు పని చేయాలని పిలుపునిచ్చారు. -
దేవాన్ష్ చదివే స్కూళ్లో తెలుగు మీడియం ఉందా?
సాక్షి, ఒంగోలు: దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డికే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నేడు దేశమంతా ఏపీ వైపు చూస్తోందని.. విద్య కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. ప్రతీ పాఠశాలలో మెరుగైన వసతులతో పాటు స్కూళ్ల స్థితిగతులను మార్చబోతున్నట్లు స్పష్టం చేశారు. గురువారమిక్కడ మనబడి నాడు-నేడు కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి సురేష్ మాట్లాడారు. ‘ఐదు నెలల కాలంలో సీఎం వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నత విద్యను పేదలకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అందిస్తే.. ఆయన తనయుడు సీఎం జగనన్న రెండు అడుగులు ముందుకేసి పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేశారు. ఇలాంటి చరిత్రాత్మక ఘట్టం దేశంలో ఎక్కడా లేదు. వైఎస్సార్ ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చాలనే ధృడ సంకల్పంతో విద్యకు మన ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో దళిత బిడ్డనైన నేను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది. ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. చంద్రబాబు మనవడు దేవాన్ష్ చదివే స్కూల్లో తెలుగు మీడియం లేదు.. రాజ్యాంగ పదవిలో ఉన్న పెద్దలు ఏర్పాటు చేసిన స్వర్ణభారతి ట్రస్టు, పత్రికాధినేత ఏర్పాటు చేసుకున్న స్కూళ్లలో తెలుగు మీడియం ఉందా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయం కోసం పేదలకు ఆంగ్ల మాధ్యమం అందకూడదని కుట్రలు చేస్తున్నారు. ఏదైనా చెప్పాలనుకుంటే ఆచరణ చేసి చూపించమనే సిద్ధాంతాన్ని సీఎం వైఎస్ జగన్ నమ్మారు. తన బిడ్డలతో పాటు రాష్ట్రంలోని 70 లక్షల మంది పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవాలని ధైర్యమైన నిర్ణయం తీసుకోవడం జగనన్నకే సాధ్యమైందని’ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పేదవారి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దా? పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువులు అందిస్తే తప్పేంటని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యాశాఖకు రూ.33 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. పేద పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు సీఎం ముందుకు వస్తే..ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు తన మనవడిని ఏ స్కూల్లో చేర్పించారని, పవన్ తన పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దా అని నిలదీశారు. అందరిని కూడా ఉన్నతంగా చదివించేందుకు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ జగన్ జనరంజక పాలన చేస్తున్నారని, పవన్ మరో 15 రోజుల్లో సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న మంచి కార్యక్రమాలు అందరూ స్వాగతించాలన్నారు. ఇసుకపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇసుకపై నిక్కచ్చిగా ఉన్నారని తెలిపారు. తమ జిల్లాలో ఒక్క లారీ కూడా బయటకు వెళ్లడం లేదని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. చదవండి: ‘చరిత్రను మార్చబోయే అడుగులు వేస్తున్నాం’ ఏం పాపం చేశాం సార్.. ఇంగ్లీషు వద్దంటున్నారు? -
వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు కానీ..
సాక్షి, ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలను మైనింగ్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కొట్టిపారేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్టాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై ప్రతిఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విమర్శలు చేస్తున్న నాయకులకు డబ్బు ఉంది కాబట్టి తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని పేర్కొన్నారు. అదే పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా అని మంత్రి ప్రశ్నించారు. -
దత్తపుత్రుడు ఆరాట పడుతున్నాడు: బాలినేని
సాక్షి, కావలి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో సంపూర్ణ విజయాన్ని సాధిస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి చెప్పారు. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత మొట్ట మొదటిసారిగా జిల్లాకు వస్తూ కావలిలోని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. జిల్లాలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నింటిని కూడా కచ్చితంగా అమలు చేసే తీరుతామని చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అభివృద్ధి పనులన్నీ కూడా అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉందని, జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు పది స్థానాల్లో వైఎస్సార్సీపీనే ప్రజలు గెలిపించారని మంత్రి గుర్తు చేశారు. దానికి ప్రతిఫలంగా తమ వంతుగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అటవీశాఖ అభ్యంతరాలు వల్ల దశాబ్దాలుగా నిలిచి పోయిన సాగునీటి కాలువలు నిర్మాణాలపై దృష్టి పెడతామన్నారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని, అటవీ శాఖ అధికారులను అమరావతికి పిలిపించి సాగునీటి కాలువలు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం కోసం సీఎం అన్ని చర్యలు తీసుకొంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాలు రావడంతో వరదలు వచ్చి అన్ని చోట్ల నీరు ప్రవహిస్తుంటే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇసుక కొరత అంటూ రాజకీయాల కోసం రాద్ధాతం చేస్తున్నారని మంత్రి మండి పడ్డారు. పవన్‌కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని, చంద్రబాబు కోసం ఏదేదో మాట్లాడుతున్నాడన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తే, తాను వెళ్లి సినిమాలు చేసుకొంటానని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. మరీ పవన్‌కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారంటే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తున్నట్లే కదా అని మంత్రి అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనపై సర్వే చేస్తే, సంక్షేమ పథకాల్లో 80 శాతం రాష్ట్రంలోని ప్రజలు ఆమోదం తెలిపారని మంత్రి వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కొండూరు అనీల్ బాబు, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
పీపీఏల్లో టీడీపీ భారీ అక్రమాలు
ఒంగోలు సిటీ: విద్యుత్ రంగంలో ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే పవర్ పర్చేజీ అగ్రిమెంట్ల(పీపీఏ)లో టీడీపీ భారీగా అక్రమాలకు పాల్పడిందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గురువారం ఒంగోలులో విలేకరులతో మాట్లాడారు. పీపీఏలు పవన, సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న సంస్థలతో చేసుకున్న ఒప్పందాల వల్ల విద్యుత్ రంగాన్ని రూ.30 వేల కోట్ల అప్పుల ఊబిలో దించారని విమర్శించారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు యూనిట్ రూ.2.50కే ఇవ్వడానికి ముందుకొచి్చనా.. టీడీపీ ప్రభుత్వం యూనిట్ రూ.4.85 ధరకి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతోనే ఏ మేరకు అక్రమాలు జరిగాయో వెల్లడవుతుందన్నారు.పీపీఏల విషయంలో న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సానుకూల ధోరణితో ఉందని ప్రస్తావించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోనే విద్యుత్ పీపీఏలను రద్దు చేశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ పరంగా కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమేనని బాలినేని అన్నారు. 20 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. వ్యవసాయానికి ఉచితంగా నిరాటంకంగా తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,500 కోట్లు కేటాయించామని తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలెట్టడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గరిష్ట సమయాల్లో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి బాగా పడిపోతుందని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని వివరించారు. అన్ని రంగాలను చంద్రబాబు నాయుడు నిరీ్వర్యం చేశారని బాలినేని విమర్శించారు. వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ప్రజలతోనే
సాక్షి, ప్రకాశం (చీమకుర్తి) : ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు నేటి వరకు మొత్తం 150 రోజులలో 130 రోజుల పాటు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు జనం మనిషిగా ముద్ర వేయించుకున్నారు. ఎమ్మెల్యే టీజేఆర్ పుట్టినరోజు సందర్భంగా నేడు బుధవారం కూడా తన నియోజకవర్గంలోని పేర్నమిట్ట నుంచి చీమకుర్తి శివారు ప్రాంతమైన మర్రిచెట్లపాలెం వరకు కర్నూల్‌రోడ్డు పొడవునా దాదాపు 30 కి.మీ పొడవునా రోడ్డుకి ఇరువైపులా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టి సేవాకార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. రైతుల కోసం అలుపెరగని సేవలు.. రామతీర్థం రిజర్వాయర్, గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లను సాగర్ జలాలతో నింపేందుకు ఇరిగేషన్ మంత్రి, ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలను కలిశారు. కలెక్టర్‌ను కలిసి రైతులకు నీటి కోసం ఎందాకైనా పోతానంటూ అధికారులను పరుగులు పెట్టించారు. శనగ పంట గిట్టుబాటు ధరల కోసం రూ.1500 రాయితీలు, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతంలో 3 చెక్‌డ్యామ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నూతనంగా ఏర్పాటైన సచివాలయాల భవనాలకు రూ.10 కోట్ల నిధులను ఎమ్మెల్యే విడుదల చేయించారు. అదే విధంగా పలు గ్రామాలలో మురుగు కాలువల నిర్మాణానికి మరో రూ.15 కోట్లు కేటాయింపజేశారు. నాలుగు మండలాలలో దాదాపు 1200 మంది వలంటీర్లను నియమించటంలో ఎమ్మెల్యే నిరుద్యోగులకు తగిన ప్రాధాన్యం కల్పించి ఇప్పించారు. రంగాల వారీగా సమీక్షలు గ్రానైట్ క్వారీల యజమానులు, గ్రానైట్ ఫ్యాక్టరీలు, కంకరమిల్లుల యజమానులతో వేరువేరుగా సమీక్షలు నిర్వహించారు. శాఖల వారీగా రవాణా,ఇరిగేషన్, ఉపాధి, మండల పరిషత్, రెవెన్యూ, మార్కెట్‌శాఖ అధికారులతో వేరువేరుగా సమీక్షలు నిర్వహించి ఆయా శాఖల నుంచి ప్రజలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని అధికారులను ఆదేశించారు. నేడు వైఎస్, బూచేపల్లి విగ్రహాలకు శంకుస్థాపన ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు పుట్టినరోజు సందర్భంగా నేడు బుధవారం చీమకుర్తిలోని తూర్పుబైపాస్ కూడలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంతో పాటు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలు ఏర్పాటు, పైలాన్, ఆర్చి నిర్మాణాలకు ఎమ్మెల్యే టీజేఆర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నారు. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. -
కమీషన్ల కోసం చౌక విద్యుత్‌కు కోత!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చౌక విద్యుత్‌నే కొనుగోలు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి నిర్వాకాల వల్లే ఎన్టీపీసీకి చెందిన కుడిగి విద్యుత్‌ను యూనిట్ రూ.11.68 చొప్పున కొనాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలో ఉండగా కమీషన్లు ముట్టజెప్పే పవన, సౌర విద్యుదుత్పత్తి కంపెనీలతో లాలూచీ పడటం వల్ల రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాలినేని ఈ మేరకు గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కర్నాటకలోని కుడిగి విద్యుత్‌ను యూనిట్ రూ. 4.80కే ఇచ్చేలా విద్యుత్ సంస్థలు ఉమ్మడి రాష్ట్ర హయాంలోనే 2010 సెప్టెంబర్ 23న ఒప్పందం చేసుకున్నాయని బాలినేని వివరించారు. ఆ ఒప్పందం ప్రకారమే టీడీపీ సర్కారు విద్యుత్ తీసుకుని ఉంటే యూనిట్ రూ.4.80కే లభించేదన్నారు. కానీ కుడిగి విద్యుత్ కేంద్రంలో విద్యుత్ అందుబాటులో ఉన్నా గత ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లను తగ్గించేశారని, మరోవైపు ఎంవోయులో పేర్కొన్న ప్రకారం స్థిర విద్యుత్ ఛార్జీలు (ఫిక్స్డ్) చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల కుడిగి విద్యుత్ ధర యూనిట్ రూ.11.68కు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొన్నా.. కొనకున్నా ఫిక్స్డ్ చార్జీలు చెల్లించాల్సిందే కుడిగి విద్యుత్‌లో ఏపీకి 360 మెగావాట్లు ఇచ్చేలా ఒప్పందం ఉందని మంత్రి బాలినేని తెలిపారు. దీనివల్ల యూనిట్ రూ.4.8 చొప్పున (రూ. 1.2 ఫిక్స్డ్ ఛార్జీలు, రూ. 3.58 వేరియబుల్ ఛార్జీలు) ఏడాదికి 2,681 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేయాలన్నది పీపీఏలో భాగమన్నారు. అయితే చంద్రబాబు హయాంలో కుడిగి ప్లాంటు నుంచి పూర్తిస్థాయిలో 2,681 మిలియన్ యూనిట్లు కొనకుండా కేవలం 392 మిలియన్ యూనిట్లు మాత్రమే కొనుగోలుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. వాస్తవానికి పీపీఏ ప్రకారం కేటాయించిన విద్యుత్ తీసుకున్నా, తీసుకోకపోయినా ఏటా రూ.317 కోట్లు స్థిర ధర (ఫిక్స్డ్) చెల్లించాల్సి వస్తుందన్నారు.అదే 2,681 మిలియన్ యూనిట్లు తీసుకుని ఉంటే ప్రతి యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ రూ. 1.20 మాత్రమే అయ్యేదని, కానీ 392 మిలియన్ యూనిట్లే తీసుకోవడం వల్ల ఇది యూనిట్‌కు 8.10 చొప్పున అవుతుందని తెలిపారు. దీనికి తోడు చర వ్యయం (వేరియబుల్ కాస్ట్) యూనిట్‌కు రూ. 3.58 చొప్పున చెల్లిస్తున్నామని, ఫలితంగా యూనిట్ విద్యుత్తు ధర రూ. 11.68 అవుతోందని తెలిపారు. ఇది డిస్కమ్‌లకు తీవ్ర నష్టమని బాలినేని వివరించారు. చంద్రబాబు తన అనుయాయులకు చెందిన సోలార్, విండ్ కంపెనీలకు మేలు చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. కుడిగి నుంచి పూర్తిస్థాయిలో 2,681 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసినా లేక 392 మిలియన్ యూనిట్లు మాత్రమే కొన్నా లేదంటే అసలు కరెంటు కొనుగోలు చేయకున్నా ఒప్పందం ప్రకారం ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో ఏడాదికి రూ.317 కోట్లు చెల్లించాల్సి వస్తోందని మంత్రి తెలిపారు. బాబు నిర్వాకాలతో రూ. 562.4 కోట్లు నష్టం సోలార్, విండ్ పవర్ కంపెనీలతో కుదుర్చుకున్న పీపీల ప్రకారం గత ప్రభుత్వం కుడిగి ఎన్టీపీసీ ప్లాంట్ నుంచి యూనిట్ రూ.3.58 చొప్పున వస్తున్న కరెంటును తగ్గించేసి రూ.4.84కి సోలార్, విండ్ పవర్‌ను కొనుగోలు చేయడంతో కుడిగి ప్లాంటుకు చెల్లించాల్సిన ఫిక్స్డ్ ఛార్జీ యూనిట్‌కు రూ.1.2 నుంచి రూ.8.2కు పెరిగిందని మంత్రి బాలినేని తెలిపారు. అంతేకాకుండా యూనిట్‌కు అదనంగా రూ.1.26 చొప్పున చెల్లించాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో మొత్తంమీద ఈ వ్యవహారంలో రూ. 562.4 కోట్లు నష్టం జరిగిందని బాలినేని వెల్లడించారు. కుడిగి ప్లాంటు విద్యుత్ ధర అధికంగా ఉన్నందువల్ల ఆ కేటాయింపును మినహాయించి మరోచోట ఇవ్వాలని కేంద్ర విద్యుత్‌శాఖకు ఇప్పటికే విజ్ఞప్తి చేశామని బాలినేని తెలిపారు. గత ప్రభుత్వం కన్నా తక్కువ ధరకే కొనుగోలు రాష్ట్రంలో అధిక ధరకు కరెంటు కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలను మంత్రి బాలినేని తోసిపుచ్చారు. బొగ్గు కొరతతో సంక్షోభం తలెత్తిన సమయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి తక్కువ ఖర్చుకే కరెంటు కొనుగోలు చేశామని తెలిపారు. 2018 అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో విద్యుత్ ఎక్సే్ఛంజి ద్వారా తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామంటూ ఆ వివరాలను మంత్రి విడుదల చేశారు. కుడిగి విద్యుత్ నష్టం ఇలా..! ►360 మెగావాట్లకు ఫిక్స్డ్ ఛార్జీ : 317 కోట్లు ►కుడ్గీ నుంచి లభించే విద్యుత్ : 2681 మిలియన్ యూనిట్లు ►దీనివల్ల యూనిట్ ధర : 4.80 (1.20 ఫిక్స్డ్... 3.58 వెరీయబుల్) ►2019–20లో ఏపీఈఆర్సీ గుర్తించిన విద్యుత్ : 1729 మిలియన్ యూనిట్లు దీనికి అయ్యే ఖర్చు యూనిట్‌కు రూ. 5.38 (1.80 ఫిక్స్డ్.. రూ. 3.58 వేరియబుల్) ►ఏపీఈఆర్సీ అనుమతించింది 392 మిలియన్ యూనిట్లు ►దీనివల్ల ప్రతీ యూనిట్ ధర : రూ. 11.68 (రూ. 8.10 ఫిక్స్డ్... 3.58 వేరియబుల్) -
నిష్పక్షపాతంగా సేవలు చేయాలి: మంత్రి
సాక్షి, ప్రకాశం : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఒక విప్లవం అని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ప్రకాశంలోని ఎ1 ఫంక్షన్ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, చంద్రబాబులా అబద్ధాలు చెప్పేరకం కాదని అన్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులంతా సీఎం జగన్‌కు మంచి పేరు తేవాలని, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక పత్రాలను అందజేశారు. -
నేరుగా మీ ఖాతాల్లోకి జీతాలు : బాలినేని
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం నిర్వహించిన వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం సబ్ కమిటీ వేసిందని తెలిపారు. ఆ కమిటీలో తాను కూడా సభ్యుడుగా ఉన్నానని, ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు వచ్చేలా కృషి చేస్తానని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అందరి కష్టాలను తీర్చే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తారన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖలో రూ. 20 వేల కోట్లు అప్పు చేసిందని, విండ్, సోలార్, పవర్ పీపీఏల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బాలినేని ఆరోపించారు. హెచ్ఆర్ పాలసీ తెచ్చి ప్రత్యక్షంగా ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు వచ్చేలా చేస్తామన్నారు. 3 వేల మందితో ప్రారంభమైన యూనియన్ నేడు 25 వేలకు చేరుకుందని.. ఇందుకు కారుమురి నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. అవినీతికి తావు లేదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలను అమ్ముకున్న పరిస్థితిని చూశామని, తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో అందరి సమస్యలు తెలుసుకున్నారని.. తగిన న్యాయం చేస్తారని కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాగా ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వెన్నపూస వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం
-
రైతు కళ్లలో ఆనందమే లక్ష్యం
సాక్షి, ఒంగోలు సబర్బన్: రైతు కళ్లలో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక దక్షణ బైపాస్‌లోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతంగా ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన రైతు భరోసా పథకాన్ని ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి రైతులకు ఏడాదికి రూ.12,500 చొప్పున అందిస్తామన్నారు. రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా తెలుసుకున్న జగన్మోహన్నెడ్డి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారన్నారు. వ్యవసాయానికి పగటి పూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించామని, కానీ విద్యుత్ లైన్లు సక్రమంగా లేకపోవటంతో మొదటి విడతగా 60 శాతం రైతులకు ఇస్తున్నామని, మిగిలిన 40 శాతం మంది రైతులకు వచ్చే ఏడాది మార్చికల్లా లైన్లు మరమ్మత్తులు చేసి పూర్తి స్థాయిలో అందిస్తామన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తులకు మొత్తం రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అయినా ముఖ్యమంత్రి వెనకాడకుండా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు యూనిట్‌ను రూ.1.50 ఇచ్చేందుకు నిర్ణయించి ప్రకటించారన్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.720 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రైతులు పండించిన పంటను నిల్వ చేసుకోవటానికి కోల్డ్ స్టోరేజీలు, గోదాముల నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నెలకొల్పేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందిస్తున్నామన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించమని చెప్పారని, అది త్వరగా పూర్తయితే జిల్లాలో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తొలుగుతాయన్నారు. 2020 జూన్ నాటికి మొదటి టన్నెల్ పూర్తి చేసి నీటి విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పీవీ రామమూర్తి మాట్లాడుతూ సాధారణ పంటల్లో అంతర పంటల సాగు ఎంతో మేలు చేస్తుందన్నారు. కార్యక్రమానికి జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జి.గోపాల్ అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లా అధికారులు వి.రవీంద్రనాథ్ ఠాగూర్, ఏఎంసీఝేడీ రాఘవేంద్ర కుమార్, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైతులను సన్మానిస్తున్న మంత్రి, కలెక్టర్ తదితరులు ఉత్తమ రైతులకు సన్మానం ఉత్తమ రైతులను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు. వ్యవసాయ అనుబంధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు రైతులను మెమోంటో, ప్రసంశాపత్రంతో పాటు శాలువాతో సత్కరించారు. పశుసంవర్ధక శాఖ తరుఫున పశుపోషణలో, పాడి అభివృద్ధిలో ప్రతిభ కనబరిచిన పశుపోషకుడు కోటా వెంకట్రామిరెడ్డి, వ్యవసాయంలో ప్రతిభ కనబరిచిన బత్తుల చంద్రశేఖర రెడ్డి, ఉద్యాన పంటల్లో ప్రతిభ కనబరిచిన బలగాని బ్రహ్మయ్య, రొయ్యలు, చేపల పెంపకంలో ప్రతిభ కనబరిచిన మున్నంగి రాజశేఖర్‌లు ఉన్నారు. అనంతరం వైఎస్ఆర్ పింఛన్ల కానుక సందర్భంగా పింఛన్లు పంపిణీ చేశారు. రైతులకు భూసార పరీక్షల కార్డులను పంపిణీ చేశారు. ఉన్నత పాఠశాలల విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. అనంతరం ఆక్వా రైతులు మంత్రి బాలినేని సన్మానించారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం యూనిట్ ధరను తగ్గించినందుకుగాను కృతజ్ఞతగా శాలువా కప్పి సన్మానించారు. కలెక్టర్ పోలా భాస్కర్‌ను కూడా ఆక్వా రైతులు సన్మానించారు. -
ప్రకాశమంతా పండుగ
సాక్షి, ఒంగోలు: జిల్లా కేంద్రం ఒంగోలులో రాష్ట్ర విద్యుత్, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, అటవీశాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యవసాయం పండుగ అని నిరూపించిన మహానేత రాజశేఖరరెడ్డి అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రారంభమైన పార్టీలో నేతలుగా, కార్యకర్తలుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరు గర్వించాలన్నారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఉచిత విద్యుత్‌పై సంతకం చేసి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా పేరుతో అక్టోబరు 15వ తేదీన రు12500లు రైతులకు అందిస్తున్నారని, అంతే కాకుండా రైతులకు నాణ్యమైన 9గంటల పగటిపూట విద్యుత్, రైతులకు వడ్డీలేని పంట రుణాలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. • యర్రగొండపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మార్కాపురం రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆయన కేక్‌ను కట్ చేశారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి మంత్రి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌తో కలిసి రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. • ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ వైఎస్సార్ ఉచిత విద్యుత్‌పై తన తొలి సంతకాన్ని పెట్టి ఆ సంతకానికి ఉన్న విలువేంటే రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా చేశారని కొనియాడారు. రైతులకు రుణాల పంపిణీ, వైఎస్సార్ పింఛన్ పథకం అమలు, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ లాంటి కార్యక్రమాలతో సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్‌కు నిజమైన నివాళులు అర్పించే విధంగా చేశారని అన్నారు. • గిద్దలూరులోని పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. రాచర్ల గేట్ సెంటర్లో వైయస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించడంతోపాటు నగర పంచాయతీ కార్యాలయంలో సామాజిక పెన్షన్లు పంపిణీతోపాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది • దర్శి నియోజకవర్గ ప్రజలు మహానేతను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పించారు. దర్శిలో శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొని పలుచోట్ల వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. • సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వైయస్సార్ జయంతి వేడుకకు సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు హాజరై ఘనంగా జననేతకు నివాళి అర్పించారు. సంతనూతలపాడు, మద్దిపాడులలో జరిగిన కార్యక్రమాలకు హాజరై సామాజిక పెన్షన్లు, బాలికలకు సైకిళ్లు తదితరాలను పంపిణీ చేశారు. • నిగిరిలో జననేత జయంతిని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్‌యాదవ్ ప్రారంభించారు. ఎద్దుల బండిపై ఊరేగింపుగా రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరై ఉత్తమ రైతులకు ప్రశంసాపత్రాలు, పంట రుణాల చెక్కులు, నాగలి, పొట్టేళ్లను పంపిణీచేశారు. • మార్కాపురం శాసనసభ్యులు కుందుర్రు నాగార్జునరెడ్డి రైతు దినోత్సవంలో పాల్గొని వైయస్సార్‌కు ఘన నివాళి అర్పించారు. ఉత్తమరైతులను ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందించారు. పలువురు కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను పంపిణీచేయడంతోపాటు పలువురు రైతులకు ట్రాక్టర్లను పంపిణీచేశారు. . • కందుకూరు పార్టీ కార్యాలయంలో శాసనసభ్యుడు, మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులకు వ్యవసాయ పరికరాలు, కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను పంపిణీ చేశారు. జననేత జయంతి కార్యక్రమంలో భాగంగా పేదలకు పట్టాలు పంపిణీతోపాటు పొజిషన్ చూపించారు. • అద్దంకి మార్కెట్‌యార్డులో జరిగిన రైతు దినోత్సవానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య హాజరై వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బల్లికురవ, జె.పంగులూరు, కోరిశపాడు మండలాల్లో జరిగిన కార్యక్రమాలకు యువ నాయకుడు బాచిన కృష్ణచైతన్య పాల్గొన్నారు. • కొండపిలో వైఎస్సార్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయినాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొని సామాజిక పెన్షన్లు పంపిణీచేశారు. • చీరాల గడియార స్తంభం సెంటర్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తోటవారిపాలెంలో పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను ఆమంచి కట్ చేశారు. అనంతరం రైతుదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. • పర్చూరు నియోజకవర్గం కారంచేడులోని దగ్గుబాటి క్యాంప్ కార్యాలయంలో దగ్గుబాటి హితేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పర్చూరు మార్కెట్ యార్డులో జరిగిన రైతు దినోత్సవంలో పాల్గొని ఆయన సామాజిక పెన్షన్ల పంపిణీ చేశారు. వైఎస్ ఆశయాల కొనసాగింపే ఘన నివాళి ఒంగోలు సిటీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను, ఆదర్శాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్ధానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత 70వ జయంతి కార్యక్రమాలను కేకు కోసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు అధ్యక్షత వహించారు. పార్టీ కార్యాలయంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రైతు బాంధవుని జయంతి నాడే రైతు దినోత్సవాన్ని ప్రారంభించామన్నారు. వైఎస్ బాటలోనే జగన్ పయనిస్తారని అన్నారు. రైతులను వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి కాపాడేందుకే వ్యవసాయాన్ని పండుగ చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. నెల రోజుల్లోనే రైతులను నిలబెట్టే అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతులకు పగటి పూటే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు అందజేస్తున్నామని అన్నారు. ఉచిత విద్యుత్తు, విత్తనాల సబ్సిడీ, కరెంటు బకాయిల రద్దు, పావలా వడ్డీ, ప్రాజెక్టుల నిర్మాణం , మద్దతు ధరతో వ్యవసాయ ఉత్పత్తులు వంటివి గుర్తు చేసుకున్నప్పుడు వైఎస్సారే గుర్తుకు వస్తారని అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల వ్యవధిలోపే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనే ఎన్నో నిర్ణయాలను అమలు చేశారని వివరించారు. పండించిన ప్రతి ధాన్యం గింజ మీద అది ఎవరు తినాలో దేవుడు రాసి మెడతాడన్నది సామెతగా ప్రస్తావిస్తూ ప్రతి ధాన్యపు గింజను ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని పండించే కష్టజీవులైన రైతుల కళ్లల్లో ఆనందం, వారి కుటుంబాల్లో సంతోషాలను నింపేలా జగన్ ప్రభుత్వం ధీమా కల్పిస్తుందని వివరించారు. గ్రామ స్ధాయి నుంచి గ్రామ సచివాలయాల వ్యవస్ధ ద్వారా పేరుకుపోయిన అవినీతిని తొలగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రయత్నానికి దేవుడి దీవెనలు వైఎస్సార్ ఆశీస్సులు ఉంటాయని అన్నారు. జిల్లాలో రైతులకు తొమ్మిది గంటల విద్యుత్తు అందించడం వల్ల ఈ ఏడాది గ్యాప్ ఆయకట్టు లక్షలకు పైగా ఎకరాలు సాగులోకి రానుందని అన్నారు. జగన్ ప్రభుత్వం రైతు బాంధవుని ప్రభుత్వంగా గుర్తింపు పొందిందని, రానున్న రోజుల్లో రైతు కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వ్యవసాయానికి కావాల్సిన అన్ని అంశాల్లోనూ ప్రభుత్వమే అన్నదాతకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఆక్వా ఉత్పత్తులు ఏటా రూ.1400 కోట్లకుపైగా ఉన్నాయని వివరించారు. ఆక్వా రైతుకు సబ్సిడీపై కరెంటు ఇవ్వడం వల్ల ఈ ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. రైతు భరోసా కింద అందిస్తున్న కార్యక్రమాలను వివరించారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. -
విద్యుత్, ఇంధనశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : విద్యుత్, ఇంధనశాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అధికారులతో చర్చించారాయన. వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్‌పై చర్చించారు. ఈ ఉదయం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్నినానితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. -
ప్రజాదర్బార్‌లో మంత్రి బాలినేనికి విన్నపాలు
సాక్షి, ఒంగోలు : రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం తన నివాసం ప్రజాదర్బార్ నిర్వహించారు. వీఐపీ రోడ్డు కిక్కిరిసింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారు తమ సమస్యలపై ఆయనకు అర్జీలు సమర్పించారు. వాటిలో చేయదగిన పనులకు సంబంధించి అధికారులలో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కరించారు. ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది. ఆంధ్రాబ్యాంకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల డీజీఎం పి.రామకృష్ణారావు, బ్యాంకు జోనల్ అధికారులు బాలినేనిని కలిసి అభినందించారు. ఏజీఎంలు పి.కృష్ణయ్య, ఎన్.గణేష్, చంద్రారెడ్డి, మెయిన్ బ్రాంచి ఏజీఎం, జోనల్ కార్యాలయం అధికారులు, మేనేజర్ పీకే రాజేశ్వరరావు తదితరులు బాలినేనిని కలిసిన వారిలో ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి బాలినేని పరామర్శించారు. అంజలి గ్రానైట్స్ అధినేత చల్లా శ్రీనివాసరావు తండ్రి చల్లా వెంకటస్వామి చికిత్స పొందుతుండంతో ఆయన్ను సంఘమిత్రలో పరామర్శించారు. అలాగే సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో 25 ఏళ్ల నుంచి పూజారిగా ఉన్న పిల్లుట్ల సుబ్రహ్మణ్యం దేవాలయం గాలిగోపురం కోసం కంచికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన సంఘమిత్రలో చికిత్స పొందుతున్నారు. మంత్రి బాలినేని పరామర్శించి ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం త్వరగా అందే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. బాలినేని స్వగ్రామం కొణిజేడులో జరిగిన వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. విద్యుత్తు శాఖ అధికారులు పలువురు బాలినేనిని కలిసి అభినందించారు. ఒంగోలులో అభివృద్ధి కార్యక్రమాల గురించి సంభందిత అధికారులతో బాలినేని చర్చించారు. -
ఒంగోలులో భారీ చోరీ
సాక్షి, ఒంగోలు : నగరంలోని లాయరుపేట అడపా బ్యారన్ల వద్ద ఉన్న ఓ ఇంట్లో భారీ దొంగతనం వెలుగు చూసింది. ఆ నివాసం విద్యుత్ శాఖ మంత్రి బాలినేని ఇంటి అత్యంత సమీపంలోనిది కావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అడపా హరనాథబాబు ఇంట్లో చోరీ ఘటన సోమవారం రాత్రి వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హరనాథబాబుకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె, అల్లుడు తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయట హాలులో లైటు వేసి కుమార్తెను ఇంటికి తీసుకొచ్చేందుకు తిరుపతి వెళ్లాడు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న ఆయన కుమార్తె సైడ్ డోర్ నుంచి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అక్కడ తలుపు తెరిచి ఉండటంతో తండ్రికి చెప్పింది. దిగువ భాగంలో ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించి దొంగతనం జరిగిందని గుర్తించాడు. ఇల్లు డూప్లెక్స్ కావడంతో పైభాగంలోకి వెళ్లి పరిశీలించగా అక్కడ దేవుడి గూటితో పాటు కప్‌బోర్డులో దాచుకున్న ఆభరణాలు, సొత్తు చోరీకి గురైనట్లు స్పష్టమైంది. తన భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలకు చెందిన సుమారు 150 సవర్ల బంగారం మాయమైందని పేర్కొన్నాడు. మరో వైపు 8 కేజీల వెండి వస్తువులు, రూ.3 లక్షల నగదు చోరీకి గురైనట్లు చెబుతున్నాడు. మొత్తంగా చోరీ సొత్తు రూ.52 లక్షలు ఉండొచ్చని అంచనా వేశారు. ఎన్నికలకు ముందు స్థానిక కబాడీపాలెంలో జరిగిన దొంగతనం తర్వాత ఇదే అత్యంత భారీ దొంగతనంగా తెలుస్తోంది. చోరీ జరిగిన ఇంటికి సమీపంలో మంత్రి బాలినేని నివాసంతో పాటు మరి కొందరు పోలీసుల ఇళ్లు కూడా ఆ సమీపంలోనే ఉండటం గమనార్హం. -
ఎమ్మెల్యేలు అనే మేము...
సాక్షి, ఒంగోలు : రాష్ట్ర రాజధాని అమరావతిలోని శాసనసభలో బుధవారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన వారు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారులో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌తో పాటు మరో 10 మంది శాసన సభ్యులతో బుధవారం వెలగపూడి సభలో ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వీరంతా శాసనసభ వ్యవహారాల సలహాసంఘ సమావేశంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 12 మందిలో ఇద్దరు అత్యధికంగా 5 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయిన వారుండగా మరో ఇద్దరు ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడోసారి ఒకరు, రెండో సారి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా తొలిసారిగా నలుగురు శాసనసభకు ఎన్నికయినవారున్నారు. ఒంగోలు నుంచి ఐదు సార్లు విజయం.. బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను... అంటూ ఒంగోలు అసెంబ్లీ నుంచి 5వ సారి శాసన సభకు ఎన్నికైన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన బాలినేని 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. తిరిగి 2019 ఎన్నికల్లో అదేపార్టీ నుంచి పోటీ చేసి ఐదోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. మూడు స్థానాలు ఐదు సార్లు.. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం కృష్ణమూర్తి తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985లో మార్టూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989, 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచే అద్దంకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సారి 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నికయ్యారు. ఈ ఇద్దరూ 4వ సారి.. 1989లో కందుకూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహీధర్‌రెడ్డి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు.తర్వాత 2004,2009 లలో కాంగ్రెస్ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నికయ్యారు.2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 4వ సారి ఎన్నికయ్యారు. 2004లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి శాసన సభకు ఎన్నికైన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత 2009లో అద్దంకి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నిక కాగా 2019 ఎన్నికల్లో అద్దంకి నుంచి టీడీపీ తరుపున శాసన సభకు ఎన్నికయ్యారు. 3వసారి ఆదిమూలపు సురేష్ : 2009లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. 2014లో సంతనూతలపాడు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో తిరిగి యర్రగొండపాలెం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. ముగ్గురు 2వసారి.. 2009 ఎన్నిలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసిన అన్నా రాంబాబు తొలిసారి శాసన సభకు ఎన్నిక కాగా 2019లో వైఎస్సార్ సీపీ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోమారు రికార్డు మెజారిటీతో శాసన సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కొండపి, అద్దంకి నియోజకవర్గాల నుంచి టీడీపీ తరుపున పోటీ శాసన సభకు ఎన్నికైన డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావులు 2019 ఎన్నికల్లోనూ అదే స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా మరో మారు ఎన్నికయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా.. 2019 ఎన్నికల్లో మార్కాపురం, దర్శి, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన కుందురు నాగార్జునరెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, బుర్రా మధుసూదన్‌యాదవ్, టీజేఆర్ సుధాకర్‌బాబులు తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. -
ఈ గెలుపు జగన్‌దే
సాక్షా, ఒంగోలు సిటీ : జగన్ పడిన కష్టం ఫలించింది. ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమాన్ని చేయాలనుకొనే మంచి మనస్సుకున్న ఆశయం నెరవేరింది. తన విజయం జగన్‌దే. ఈ గెలుపు ఆయన ఇచ్చిందేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉద్వేగంగా అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నుంచి అభిమానుల కోరిక మేరకు వారి వద్దకు విచ్చేశారు. ఆయనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. నవరత్నాలే జగన్‌ను గెలిపించాయన్నారు. సీఎంగా జగన్మోహన్రెడ్డి ముందు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల కార్యక్రమాలను అమలు చేస్తారన్నారు. మంచి ముఖ్యమంత్రిగా ఆయన గుర్తింపు తెచ్చుకుంటారన్నారు. రానున్న పాతికేళ్లు ఆయనే సీఎం అన్నారు. ఆయన జనం మనిషి. సీఎం పదవిలో ఉన్నా నిత్యం జనం సమస్యలనే ఆలోచిస్తుంటారన్నారు. జనం బాధలు, కష్టాలు వారి నష్టాలను తెలుసుకొనేందుకే పాదయాత్ర చేశారన్నారు. పాదయాత్రలో జనం పడ్తున్న బాధలను స్వయంగా చూశారన్నారు. ఎవరో చెబితే విని ప్రజలు ఇలా ఉన్నారని అనుకొనే నాయకుడు కాదని చెప్పారు. నేరుగా జనంతో కలిసి వారితో నడిచి వారితోనే నిత్యం జీవించిన జగన్ ఇక తన పాలనలో ఒక్కరంటే ఒక్కరైనా ఇబ్బంది పడకుండా జనరంజకంగా పాలన అందిస్తారన్నారు. జగన్ రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రజల వద్దకు వచ్చే ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అభిమాన నీరాజనం బాలినేని శ్రీనివాసరెడ్డికి అభిమానులు నీరాజనం పలికారు. గురువారం సాయంత్రం అబిమానులను పలుకరించేందుకు ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఆయనను అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కలిశారు. బాలినేనిని అభిమానులు తమ భుజాలకెత్తుకున్నారు. కేకలు వేశారు. కేరింతలు కొట్టారు. బాలినేనిని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నుంచి బయటకు భుజాలపైనే తెచ్చారు. అక్కడి నుంచి వీఐపీ రోడ్డులోని బాలినేని ఇంటికి వచ్చారు. అక్కడ మహిళా ప్రతినిధులు, నాయకులు గులాము కొట్టారు. బాలినేనికి రంగు చల్లి రంగులో ముంచెత్తారు. మహిళా నాయకులు గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, నగర అధ్యక్షురాలు పల్లా అనురాధ, కావూరి సుశీల తదితరుల ఆధ్వర్యంలో బాలినేనికి హారతులిచ్చారు. బాలినేని సతీమణి బాలినేని శచీదేవి, బాలినేని సోదరి రమణమ్మలు ఎర్రనీళ్లతో దిష్ఠి తీశారు. అభిమానుల నడుమ విజయోత్సవాన్ని పంచుకున్నారు. తిరిగి వీవీఫ్యాట్స్ లెక్కింపు కోసం గురువారం సాయంత్రం తిరిగి ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా బాలినేని అభిమానులు నగరంలో మతాబులు కాల్చారు. అభిమానులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. -
జిల్లా ప్రజలకు బాలినేని కృతజ్ఞతలు
సాక్షి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతు పలికిన జిల్లా ప్రజలకు ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన గురువారం రాత్రి సాక్షితో మాట్లాడారు. తనతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన వారికి ఎన్నికల్లో ఓట్లు వేసి అత్యధిక మెజారీటి రావటానికి కారణమైన ఓటరు దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలకు జన రంజక పాలన అందిస్తారన్నారు. ప్రకాశం జిల్లాకు అంతా మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నెలకున్న సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. ప్రతి ఒక్కరికీ ఎలాంటి కష్టం రాకుండా సేవ చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా కార్యచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తామని అన్నారు. ఓటర్లు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా బాలినేని తెలిపారు. -
ఒం‘గోలు’ కొట్టేవారెవరో ?
సాక్షి, ఒంగోలు : ఇదరూ ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులే. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర తిరగ రాయడంతో పాటు ఒంగోలు నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి«గా బరిలో ఉండగా..గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మరోసారి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అజాతశత్రువు, మంచి వ్యక్తిగా గుర్తింపుపొందిన బాలినేని విజయమే లక్ష్యంగా గడప గడపకు వెళ్తున్నారు. నవరత్నాలను వివరించి వైఎస్ జగన్‌ను సీఎంను చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి చెబుతున్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో నడిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా సొంత ప్రయోజనాల కోసమే ఐదేళ్లు పాకులాడిన జనార్దన్‌కు ఇంటి పోరు తప్పడం లేదు. మురికి వాడలను పట్టించుకోలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బాలినేనికే విజయావకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. తొలుత ద్విసభ్యుల నియామకం ఉండేది. ఈ నియోజకవర్గానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 1955లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందారు. 1952, 1955లో ద్విసభ్యుల నియామకం జరిగింది. 1957 నుంచి అసెంబ్లీకి ఒకే అభ్యర్థి ఎంపిక కొనసాగుతోంది. ఇప్పటికి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి మధ్యంతర ఎన్నిక జరిగింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఒంగోలు నగరంతోపాటు ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలంలో కొంతభాగం, నాగులుప్పలపాడు మండలంలోని కొంత భాగం ఉండేవి. 2009 పునర్విభజన సమయంలో ఒంగోలు నగరం, ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలం మొత్తం కలిపి నియోజకవర్గంగా అవతరించింది. ఒంగోలు అసెంబ్లీ నుంచి అత్యధిక సార్లు గెలిచిన వ్యక్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి రికార్డు సృష్టించారు. తొలుత 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యక్కల తులసీరావ్పై తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత 2004 , 2009, 2012లలో వరుసగా విజయం సాధించారు. 2012 ఉప ఎన్నికల్లో దామచర్ల జనార్దన్‌రావుపై ఏకంగా 27,403 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. భళా..బాలినేని సౌమ్యుడు, మంచి వ్యక్తిగా పేరుపొందారు. ఎవ్వరైనా సరే నేరుగా ఆయన వద్దకే వెళ్లి సమస్యలు చెప్పుకోవచ్చు. నమ్మినవారి కోసం ఏమైనా చేయగలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. వైఎస్ కుటుంబం కోసం మంత్రి పదవి సైతం తృణప్రాయంగా వదిలేశారు. జిల్లాలోని పేదలకు వైద్యం అందించేందుకు రిమ్స్ వైద్యశాలను మంజూరు చేయించి నిర్మించారు. వేలాది మంది పేదలకు పట్టాలు ఇవ్వడంతో పాటు నివాస గృహాలను నిర్మించి ఇచ్చారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా, మంత్రిగా పనిచేసినా సౌమ్యుడిగా, వివాద రహితుడిగా ప్రజల గుర్తింపు పొందారు. జనం వద్దకు వెళ్లని జనార్దన్ 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దామచర్ల జనార్దన్‌రావు గెలిచిన తరువాత ఒంగోలు నియోజకవర్గంలో విపరీత పరిణామాలు చోటుచేసుకున్నాయనే భావన ప్రజానీకంలో వ్యక్తం అవుతుంది. కమీషన్ల కోసమే అభివృద్ధి పనులు మంజూరు చేయించుకున్నారన్న విమర్శలూ వచ్చాయి. కొందరు అనుచరులకే కాంట్రాక్టు పనులు కట్టబెట్టడంతో మిగిలిన టీడీపీ కేడర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మారింది. నగరంలో కొన్ని ప్రధాన ప్రాంతాలకే రోడ్డు, డ్రైనేజీలాంటి పనులు మంజూరు చేయించి అధికంగా ఉన్న మురికి వాడలను పట్టించుకోదు. మురికి వాడల్లో వసతుల కల్పన గాలికొదిలేశారు. రోడ్లు, తాగునీరు అందని పరిస్థితి. కక్ష సాధింపుకు దిగే వ్యక్తిగా జనార్దన్‌కు పేరుంది. ఇటీవల కమ్మపాలెంలో జరిగిన ఘటనతో గొడవలు సృష్టించే సంస్కృతి ఉన్న నాయకుడుగా నిలిచారు. ఈ పరిస్థితులలో స్థానికేతరుడు అయిన జనార్దన్ ఓ వైపు, నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం కోరుకుంటున్న బాలినేని మరో వైపు పోటీలో ఉన్నారు. ఓటర్ల వివరాలు మొత్తం : 2,29,317 పురుషులు : 1,11,183 మహిళలు : 1,18,101 ఇతరులు : 33 -
అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం
సాక్షి, ఒంగోలు రూరల్: అవినీతిలో కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వానికి చరమగీతం పాడుదామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల పరిధిలోని త్రోవగుంట, మండువవారిపాలెం, అంబేడ్కర్‌నగర్, గుత్తికొండవారిపాలెం, ముక్తినూతలపాడు గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు ఆయనపై పూలవర్షం కురిపించారు. బాలినేని ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. జన్మభూమి కమిటీలు మాకొద్దు, వారి నియంతృత్వ పాలనను సహించలేమంటూ పెద్ద పెట్టున వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రోడ్‌షో పొడవునా నినాదాలు చేశారు. రోడ్‌షోలో బాలినేని మాట్లాడుతూ మీ అభిమానం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో మనం భారీ మెజారిటీ సాధించడం ఖాయమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒంగోలు నగరానికి కలికితురాయి వంటి రిమ్స్ వైద్యశాలను తీసుకువచ్చానన్నారు. అలాగే మున్సిపాలిటీగా ఉన్న ఒంగోలును కార్పొరేషన్ చేసిన ఘనత తనదేనన్నారు. దాని ఫలితంగానే నిధులు భారీగా మంజూరయ్యాయన్నారు. ఆ నిధులను ఐదేళ్లుగా టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసి కోట్ల రూపాయలు జేబుల్లో నింపుకున్నారన్నారు. అవొసరం లేని చోట రోడ్డు మీద రోడ్డు వేసి ఇష్టం వచ్చినట్లు కమీషన్ల దింగమింగారన్నారు. గత కొన్నేళ్లుగా తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఒంగోలు నగరానికి శాశ్విత పరిష్కారంగా మల్లవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే నన్నారు. ఫలితంగా ఒంగోలు నగరానికి తాగునీరు, ఒంగోలు, కొత్తపట్నం, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాలకు తాగునీరు, సాగునీరు వచ్చాయన్నారు. సంక్షేమ పథకాలకు జన్మభూమి కమిటీల మోకాలొడ్డు.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల ఏకపక్ష నిర్ణయాలతో కార్పొరేషన్ రుణాలు, డ్వాక్రా రుణాలు, పక్కా ఇళ్లు వంటి అర్హులకు అందకుండా అధికార పార్టీ వారికి మాత్రమే అందాయన్నారు. రానున్నది జగనన్న రాజ్యమని, అప్పుడు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు గ్రామంలోనే సిబ్బందిని ఏర్పాటు చేస్తారన్నారు. కార్యక్రమంలో కట్టా సింగయ్య, కట్టా గోపి, భీమేష్, తలతోటి అజయ్‌బాబు, బొచ్చు వెంకటరావు, పసుమర్తి శ్రీను, బొచ్చు కోటయ్య, యడవల్లి సాంబయ్య, రావులపల్లి నాగేశ్వరావు, రాయపాటి అంకయ్య, పల్లా అనురాధ, పి.ప్రభావతి, జల్లి సుబ్బులు, పులిచర్ల కృష్ణారెడ్డి, పిచ్చయ్య, సుబ్బారెడ్డి, రామకృష్ణ, వినోద్ పాల్గొన్నారు. అనంతరం టీడీపీకి చెందిన 20 మందికి బాలినేని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముక్తినూతలపాడు, గుత్తికొండవారిపాలెం గ్రామాల్లో జరిగిన రోడ్‌షోలో బాలినేని మాట్లాడుతూ తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐదేళ్లు ప్రజా సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం ఎన్నికలు రావడంతో పసుపు కుంకుమ, పింఛన్ల పెంపు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. బాలినేని, మాగుంటలను గెలిపించడండి ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు ఆధ్వర్యంలో గురువారం ఒంగోలు అసెంబ్లీ, పార్లమెంట్ అ«భ్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డిలను గెలిపించాలని ప్రచారం చేశారు. 24వ డివిజన్లోని సమైక్యతానగర్, వంటపనివారల కాలనీ, బండ్లమిట్ట తదితర ప్రాంతాలో ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు బేతంశెట్టి హరిబాబు, బేతంశెట్టి సిద్ధార్థ, గోవర్ధన్, తోట సత్యన్నారాయణ, వల్లెపు మురళి, దేవా, బాబి, అయ్యప్ప, బండారు శ్రీను పాల్గొన్నారు. -
ఆదరించండి..అండగా ఉంటాం
సాక్షి, అల్లూరు (కొత్తపట్నం): అల్లూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం 30 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిలు అన్నారు. స్థానిక రాజీవ్ కళా మందిరంలో సోమవారం ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ మండల అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా కృష్ణుడు మందిరంలో పూజలు చేశారు. అక్కడ నుంచి ర్యాలీతో ప్రచారం చేసుకుంటూ ఆనవాయితీ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం బహిరంగ సభలో మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నా అన్న సుబ్బరామిరెడ్డి 1990 నుంచి అల్లూరు గ్రామాన్ని ఎన్నికల ప్రచారానికి ఎన్నుకున్నారన్నారు. అల్లూరు గ్రామ వాసులు ఆశీర్వదించడంతో మేము గెలుపుగా భావించేవాళ్లమని గుర్తు చేశారు. ఇప్పటికీ పదిసార్లు పోటీ చేస్తే అల్లూరు నుంచే ప్రచారానికి వచ్చి ప్రారంభించామన్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ప్రజల సాధక, బాధలు తెలుసుకొని నవరత్నాల పథకాలను రూపొందించారన్నారు. అల్లూరులో నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్ఎస్పీ కాలువ ద్వారా నీటి అల్లూరు చెరువుకు తీసుకువస్తామన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందితే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. సాగర్‌లో నీరు ఉన్నా అల్లూరు చెరువుకు ఎందుకు రాలేదని, రాజశేఖరెడ్డి ఉన్నప్పుడు చెరువుకు నీరు వచ్చేయన్నారు. అల్లూరు చెరువుకు నీరు వచ్చేలా కృషి చేస్తామన్నారు. శింగరాజు రాంబాబు మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు చేసే మ్యాజిక్కులు, జిమ్మిక్కులు మోసపోవద్దన్నారు. దామచర్ల జనార్దన్‌రావు కమిషన్లకు, పర్శంటేజీలకు ప్రాధాన్యం ఇచ్చేవాడని, బాలినేని ఎప్పుడూ ప్రజలకు సేవలు చేసేవారని గుర్తు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్‌రెడ్డి మీద నాన్‌బెయిల్‌బుల్ కేసుపెట్టడం ఎంత అన్యాయమని మండిపడ్డారు. సీనియర్ నాయకుడు వీరేపల్లి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మండలంలో సంక్షేమ పథకాల పేరుతో కోట్లు దండుకున్నారన్నారు. కార్యక్రమంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, అయినబత్తిన ఘనశ్యాం, శింగరాజు వెంకట్రావు, గంగాడ సుజాత, గొర్రెపాటి శ్రీనివాసులు, రాజశేఖర్, నానిరెడ్డి పేరారెడ్డి, యూత్ అధ్యక్షుడు మెట్టా రవికుమార్‌రెడ్డి, వీరేపల్లి రామచంద్రారెడ్డి, దాచూరి గోపాల్‌రెడ్డి, లంకపోతు అంజిరెడ్డి, ఎంపీటీసీలు పాలపర్తి నాగేంద్రం, మొలకా బుజ్జమ్మ, వాయల మోహన్‌రావు, స్వర్ణ శివారెడ్డి, మిట్నసల భారతి తదితరులు పాల్గోన్నారు. -
ఒంగోలు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా బాలినేని శ్రీనివాస్ నామినేషన్
-
రాత్రికి రాత్రే శిలాఫలకం మాయం
సాక్షి, ఒంగోలు సిటీ : మీ ఊరికి ఎంత దూరమో .. మా ఊరికి అంతే దూరం అన్న లోకోక్తిని మరో మారు జనం ముందుకు తెస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఎప్పుడో శంకుస్థాపన చేసిన షాదీఖానా నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం అందరూ హర్షించదగ్గదే. అయితే శంకుస్థాపన చేసిన పూర్వ నాయకుల పేర్లను మారడమే విమర్శలకు తావిచ్చింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానుల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒంగోలు నగరంలోని కొత్త మార్కెట్ వద్ద షాదీఖానా ప్రారంభం సందర్భంగా వేసిన శిలాఫలకం వైఎస్సార్ అభిమానులు కలత చెందేలా చేసింది. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా పాత శిలాఫలకాన్ని మాయం చేసి, కొత్తగా దామచర్ల జనార్దన్ ప్రారంభకులుగా వేసిన శిలాఫలకం చర్చలకు దారి తీసింది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు విమర్శలను మూట గట్టుకున్నారు. పాత ఫలకాన్ని తొలగించి రాత్రికి రాత్రే కొత్త ఫలకం ఏర్పాటు అసలు జరిగింది ఇది ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద షాదీఖానా, ఉర్ధూఘర్ నిర్మించాలని ఆ సామాజికవర్గానికి చెందిన వారి నుంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రభుత్వంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు షాదీఖానా కోసం వినతులు వచ్చాయి. ఆయనకు వైఎస్సార్ వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఒంగోలు పర్యటన సందర్భంగా శంకుస్థాపన చేయించి పనులు వెంటనే మొదలు పెట్టించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. బాలినేని చొరవతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ. కోటి నిధులను మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఈ పని అప్పగించారు. వెంటనే ఉత్తర్వులను జారీ చేశారు. ఎండబ్ల్యూడీ గ్రాంటు నుంచి షాదీఖానాకు నిధులు కేటాయించారు. సీఎం హోదాలో రాజశేఖర్‌రెడ్డి ఒంగోలు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఒంగోలుకు మంజూరైన షాదీఖానా, ఉర్ధూఘర్ నిర్మాణాలకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురందేశ్వరి, మంత్రి మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్ దేవానంద్ ప్రముఖులు హాజరయ్యారు. ఎంతో అట్టహాసంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే అనంతరం జరిగిన ప్రభుత్వం మార్పు, రాష్ట్ర విభజన ఇతర అంశాలు తోడై షాదీఖానా నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించిన దివంగత వైఎస్సార్ వేసిన పేరు లేకుండా కొత్త శిలాఫలకం వేయడంతో అభిమానుల విమర్శలకు దారి తీసింది. టీడీపీ ఇదో తరహా రాజకీయం? నగరంలోని కొత్త మార్కెట్ వద్ద అధికార పార్టీ నేతలు బుధవారం నియోజకవర్గం పరిధిలో పూర్తయిన పలు పనులను ప్రారంభించే క్రమంలోనే షాదీఖానాను కూడా ప్రారంభించే కార్యక్రమం చేపట్టారు. ఇక్కడే అసలు రాజకీయం చోటు చేసుకుందని వైఎస్సార్ అభిమానులు వాపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని మాయం చేశారన్న అపవాదును అధికార పార్టీ నేతలతో పాటు జిల్లా అధికారులు మూటగట్టుకున్నారు. షాదీఖానా ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకించడం లేదు. తమ నాయకుని పేరును శాశ్వతంగా భవనంపై లేకుండా చేశారని బాధపడుతున్నారు. త్వరలో రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఈ తరహా రాజకీయం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత అన్యాయమా? అధికారికంగా వేసిన ఆహ్వానం పత్రికల్లోనూ ‘తాత శంకుస్థాపన–మనవడి ప్రారంభోత్సవం’ అంటూ ముద్రించిన పత్రికలోని వివరాలు చూసిన అభిమానులు ఇంత అన్యాయమా అంటూ ముక్కున వేలేసుకున్నారు. పత్రికలో, కొత్త శిలాఫలకంలో కలెక్టర్ వినయ్‌చంద్, ఇతర అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధుల పేర్లను వేయడం గమనార్హం. షాదీఖానా ప్రారంభం సందర్భంగా వేసిన కొత్త శిలాఫలకం న్యాయం కోరతామంటున్న వైఎస్సార్ సీపీ నేతలు వైఎస్సార్ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని తొలగించి, రాత్రికి రాత్రే మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నామని తెలిపారు. అధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి న్యాయం కోరతామని, పాత శిలాఫలకాన్ని సంబంధిత అధికారులు ఏం చేశారో సమాచారం ఇవ్వమని కోరతామన్నారు. ఇక్కడ తగిన స్పందన రాని పక్షంలో న్యాయం కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
మాటిస్తే కట్టుబడి ఉంటాం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అందుకు కట్టుబడి ఉంటుందని మాజీ మంత్రి, ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బీసీలకు ఇచ్చిన మాటపై వెనుకడుగు వేసేది లేదని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆదివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో నూర్‌బాషాల సంఘ రాష్ట్రస్థాయి ఆత్మీయ సదస్సు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్కే నాగూర్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలినేని మాట్లాడుతూ నూర్‌బాషాలకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని జగన్మోహన్రెడ్డి బీసీలకు కేటాయించినట్లుగా గుర్తు చేశారు. అవకాశం ఉన్న చోట తప్పని సరిగా నూర్‌బాషాలకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు నగరంలోని కొణిజేడు బస్టాండ్ సెంటర్లో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని బాలినేని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి అనుమతులు లభించే అవకాశం లేనందున, పార్టీ అధికారంలోకి రాగానే ముందుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు దామచర్ల ఆంజనేయులు విగ్రహం ఏర్పాటుకు నాడు అధికారులు అంగీకరించకపోతే కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి అనుమతులను ఇప్పించినట్లుగా గుర్తు చేశారు. ఆ విశ్వాసం కూడా ఆయన మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే జనార్దన్‌కు లేదన్నారు. పార్టీ «అధికారంలోకి రాగానే విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ సీఎం అయితే సమస్యల పరిష్కారం.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే నూర్‌బాషాల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. టీడీపీ బీసీలను కరివేపాకులా వాడుకుందని విమర్శించారు. వారి అభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యమన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా నూర్‌బాషాలు వైఎస్సార్ సీపీ గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సినీ నటులు, వైఎస్సార్ సీపీ నాయకుడు భానుచందర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. ఒకసారి అవకాశం ఇస్తే పాతికేళ్ల పాటు జనం హృదయాల్లో చెరగని ముద్ర వేస్తారని అన్నారు. దివంగత వైఎస్సార్ లక్షణాలను పుణికి పుచ్చుకున్న జగన్ ప్రతి కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆయన అండగా ఉంటారని వివరించారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. నూర్‌బాషా సంఘం ఉభయ రాష్ట్రాల వ్యవస్థాపక అధ్యక్షుడు ఓ.రసూల్ సాహెబ్, సంఘ నాయకులు పలు అంశాలను బాలినేని దృష్టికి తెచ్చారు. ఆయన ఈ సమస్యలన్నీ విని అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంఘ నేతలు మస్తాన్(గుంటూరు), ఎస్ఎస్ బాబ్జి (ఉంగుటూరు), నిజాం (అనంతపురం), కరిముల్లా (చిత్తూరు), ఖాజా(కర్నూలు), మున్నీ(విశాఖ), రహీం(విజయవాడ)లు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి ఖాశింపీరా, పార్టీ నూర్‌భాషాల సంఘ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉదయగిరి ఇమాంబాషా, చిన్నబాషా, హుస్సేన్ సైదులు, షేక్ శ్రీనుబాషా, మస్తాన్, లాల్, టైలర్ ఖాశిం తదితరులు పాల్గొన్నారు. నూర్‌బాషాల డిమాండ్లు ఇవీ.. నూర్‌బాషాలకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అబ్దుల్ కలాం విగ్రహాల ఏర్పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టులతో పాటు వక్ఫ్‌బోర్డ్‌లో ప్రాధాన్యం రాజధానిలో 5 ఎకరాల స్థలం కేటాయించి అందులో సామాజిక భవన నిర్మాణం రూ.2 లక్షల సబ్సిడీతో బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు 4 చక్రాల వాహనాలకు రుణ సదుపాయం 45 ఏళ్లు దాటిన దూదేకుల వృత్తి వారికి పింఛన్ ఇవ్వాలని కోరారు. -
మాటకు కట్టుబడే నేత..జగన్!
ఒంగోలు సిటీ: ‘జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడే నేత..అందరి కష్టాలూ తీరుస్తారు. ఎన్నికల్లో ఆయన పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులను ఆశీర్వదించాలి’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. ఆదివారం ఒంగోలు 21వ డివిజన్లో యనమల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమానికి బాలినేని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు నేతృత్వంలో ధారావారితోటలో నవరత్నాలకు సంబంధించిన ప్రచారం చేశారు. డివిజన్ నాయకుడు యనమల వెంకటేశ్వర్లు, శంకర్, నాగేంద్ర, కె.శివ, డి.మనోజ్, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాజుల కృష్ణ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాలపై బాలినేని ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని ఆశీర్వదించాలని కోరారు. అవ్వా, తాతలకు రూ.3 వేలపింఛన్ ఇస్తామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బాధితులకు ఏ చిన్న కష్టం వచ్చినా సొంత అన్నలా అండగా నిలుస్తామని చెప్పారు. వైఎస్సార్ సీపీ బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా రుణాలు రద్దు చేయకుండా కేవలం రూ.10 వేలతో మాయ చేస్తోందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్ల నుంచి అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో కంటితుడుపుగా రూ.250 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు వసూలు చేసి యాజమాన్యం రూ.వేల కోట్లు ఆస్తులను కూడబెడితే వాటిని నొక్కేందుకు అధికార పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, బాధితులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే తన అనుచరులతో హాయ్‌ల్యాండ్‌లో పార్టీలు చేసుకుంటారని, కానీ దాన్ని అమ్మి బాధితులకు న్యాయం చేయాలని మాత్రం ఎందుకు అడగరని ప్రశ్నించారు. ఎవరు ఎవరి పక్షాన ఉన్నారో గమనించాలన్నారు. వాస్తవంగా ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో గమనించి ఓట్లు వేయాలని బాలినేని కోరారు. అనంతరం తాను చేసిన శాశ్వత అభివృద్ధి పనులు వివరించారు. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాల్లో ఉన్నారని బాలినేని విమర్శించారు. ఒంగోలులో కమీషన్ల కోసం అభివృద్ధి మాటున ప్రజల సొమ్ము పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేషన్ సాధారణ నిధులు ఖర్చు చేశారని మండిపడ్డారు. రహదారులు, కాలువల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. పెద్ద కాలువల పనులకు నాణ్యతను పాటించకుండా తూతూమంత్రంగా పనులు చేసి ప్రజల సొమ్ము కాజేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను టీడీపీ అనుయాయులకు కట్టబెట్టారని బాలినేని ఆరోపించారు. ఒంగోలులో టీడీపీ అవినీతి చిట్టాకు అంతూపొంతులేదన్నారు. వైఎస్సార్ సీపీకి ప్రజలు అండగా ఉండి రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని బాలినేని కోరారు. పీడీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు, వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, రాష్ట్ర అదనపు కార్యదర్శి వేమూరి సూర్యనారాయణ, నాయకులు కటారి శంకర్, కటారి రామచంద్రరావు, పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, కటారి లక్ష్మణ, కటారి ప్రసాద్, ఎస్కే సుభానీ, కాటా అంజిరెడ్డి, జడా బాలనాగేంద్ర, కరాటే కరిముల్లా, మట్టే రాఘవ, అడపాల రాము, మహిళా నాయకులు గంగాడ సుజాత, పురిణి ప్రభావతి, బి.రమణమ్మ, పల్లా అనూరాధ, బడుగు ఇందిర, బైరెడ్డి అరుణ పాల్గొన్నారు. -
ప్రతి ఎకరా వరికి నీరివ్వాల్సిందే
దర్శి : నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ప్రతి ఎకరాకు నీరు అందివ్వాల్సిందేనని, లేని పక్షంతో తమ పోరాటం ఉధృతం చేస్తామని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం దర్శి నియోజకవర్గంలో సాగర్ నీరు అందక సాగుకు నోచుకోని పొలాలను బాలినేని స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం దర్శి పట్టణంలో గడియారం స్తంభం సెంటర్లో రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. తొలుత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వరికి నీరిస్తామని చెప్తేనే జిల్లాలో రైతులు నార్లు పోసుకున్నారన్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.10 వేలు ఖర్చుపెట్టి నార్లు పోసుకుంటే ఇప్పుడు నీరివ్వలేమని చెప్పడం సిగ్గుచేటన్నారు. నాగార్జున సాగర్‌లో 579.80 అడుగుల మేర నీరున్నా అధికారులు వారబందీలు పెట్టి జిల్లాకు 10 రోజులకు ఒక సారి నీరిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఇప్పటి వరకు వరినార్లు పోసుకున్న వారే నాట్లు వేసుకోవాలని, అది కూడా ఈనెల 27వ తేదీ నాటికే నాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సాగర్ ఆయకట్టు రైతులకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. జిల్లా రైతాంగం అంటే చంద్రబాబుకు ఆది నుంచి వివక్షే అని బాలినేని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సాగర్‌లో 545 అడుగుల నీరు ఉన్నప్పుడే వరితో పాటు ఆరుతడి పంటలకు నీరిచ్చారని బాలినేని గుర్తు చేశారు. జిల్లాకు రావాల్సిన నీటి ఎక్కువ భాగం గుంటూరు జిల్లా రైతులు అక్రమంగా తరలించుకుపోతుంటే ఇక్కడ అధికారంలో ఉన్న మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జిల్లాకు రావాల్సిన నీటి వాటా తీసుకురావడం చేతకాక దద్దమ్మల్లా మంత్రి, ఎమ్మెల్యేలు ఇళ్లలో కూర్చున్నారని ఆయన విమర్శించారు. రైతుల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీని ధర్నాలు చేయడమేంటని అధికార పార్టీ నేతలు పేర్కొనడం దారుణమన్నారు. ఓట్లేసి గెలిపించిన రైతుల కోసం కాలువల పై తిరిగి వారి సమస్యలు తెలుసుకోవడం చేతకాని మీరా వైఎస్సార్ సీపీని విమర్శించేదని బాలినేని మంత్రిని నిలదీశారు. ఒక్క సారి పొలాలకు వెళ్లి పరిశీలిస్తే రైతుల బాధలు అర్థమవుతాయన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాగునీటి కోసం చీమకుర్తిలో ధర్నా చేస్తుండగా అప్పటి మంత్రి దామచర్ల ఆంజనేయులు ముఖ్యమంత్రితో మాట్లాడి నీరిస్తామని హామీ ఇచ్చి తమ ధర్నాను విరమింపజేశారన్నారు. ఆ తరువాత ఆయనకు రెండు రోజుల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని బాలినేని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు రైతులపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన శిద్దా రాఘవరావు నీరు తెప్పించడం చేతకాక ప్రతిపక్షంపై విమర్శలు చేయడం సబబుకాదన్నారు. నీరు తెప్పించడం చేతకాకపోతే మంత్రి పదవికి శిద్దా రాజీనామా చేయాలని బాలినేని డిమాండ్ చేశారు. మార్చి ఆఖరు వరకు నీరందించకపోతే మీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ప్రతి ఎకరాను పరిశీలించి రైతులకు నీరందించే వరకు ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వమన్నారు. ఎక్కడ ఎకరా ఎండినా మళ్లీ ధర్నాలు చేసి స్తంభింపచేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ జీ నాగరాజు, స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి రమణమ్మ, జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రసిడెంట్ కేవీ ప్రసాద్, జిల్లా యూత్ ప్రసిడెంట్ గంటా రామానాయుడు, యూత్ జనరల్ సెక్రటరీ బీమిరెడ్డి నాగమల్లేశ్వర్‌రెడ్డి, దర్శి, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, సూదిదేవర అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు కుమ్మిత అంజిరెడ్డి, రొండా అంజిరెడ్డి, యడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, తాళ్లూరు ఎంపీపీ, జెడ్పీటీసీలు గోళ్లపాటి మోషె, మారం వెంకారెడ్డి, మాజీ సాగర్ ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ సద్ది పుల్లారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కేవీరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోను నారాయణరెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షుడు ఉడుముల వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్‌లు పాణెం కృష్ణారెడ్డి, చంద్రగిరి గురవారెడ్డి నాయకులు పాల్గొన్నారు. -
సంక్రాంతి తర్వాత బాబును సాగనంపడమే..
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి.. పశ్చిమ ప్రకాశం రైతున్నలకు వ్యవసాయం పండుగ కావాలనే సత్ సంకల్పంతో స్వాతంత్య్ర దినోత్సవ శుభ తరుణాన ఆరంభమైన ప్రజా పాదయాత్ర 14 రోజుల పాటు సాగింది. ఐదు నియోజకవర్గాలు.. 69 గ్రామాల మీదుగా మొత్తం 207 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనే డిమాండ్‌తో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. ఆయన చేపట్టిన కార్యం విజయవంతం కావాలని కాంక్షిస్తూ మహిళలు హారతులిచ్చి స్వాగతాలు పలికారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన నేతలు వైవీకి సంఘీభావం పలికారు. ప్రాజెక్టు పూర్తి చేసే వరకు తన పోరాటం ఆగదని వైవీ ప్రతినబూనారు. అదిగో ప్రాజెక్టు.. ఇవిగో నీళ్లంటూ టీడీపీ సర్కారు ఏడాదికో ప్రకటనతో ప్రకాశం ప్రజల్ని మోసగిస్తోందని, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుని రాజన్నపాలన తెచ్చుకుందామని వైవీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ పూర్తి చేసి, నీళ్లిస్తామని ప్రకటించగా ప్రజలు హర్షధ్వానాలు చేశారు. కనిగిరి పట్టణం నుంచి ప్రారంభమైన ప్రజా పాదయాత్ర పెద్దదోర్నాల మండలంలోని వెలిగొండ ఒకటో సొరంగమార్గం వద్ద మంగళవారం ముగిసింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు పూర్తిగా గాలికొదిలారని, దివంగత నేత వైఎస్ నిధులిచ్చి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యి వెలిగొండకు నీరిస్తారని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వెలిగొండ సాధన కోసం సుబ్బారెడ్డి ఈనెల 15 నుంచి చేపట్టిన ప్రజా పాదయాత్ర మంగళవారం వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ వద్దకు చేరింది. యాత్ర ముగింపు సందర్భంగా సాయంత్రం సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ పాదయాత్రలో తనతో కలిసి నడిచిన అందరికీ తొలుత వైవీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా ఆది నుంచి కరువు ప్రాంతమని, 33 లక్షల మంది జనాభా ఉండగా దాదాపు 12 లక్షల ఎకరాల సాగుభూమి ఉందని వైవీ చెప్పారు. 6.80 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారని, 13 లక్షల మంది యువత, 3 లక్షల మంది పట్టభధ్రులు ఉన్నారన్నారు. జిల్లాలో 70 శాతం మందికి తాగునీరు అందడం లేదన్నారు. 50 శాతం భూములకు సాగునీరు లేక బీళ్లుగా ఉన్నాయన్నారు. సంక్రాంతి తర్వాత బాబును సాగనంపడమే.. ప్రకాశం జిల్లాపై దివంగత నేత వైఎస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి, చంద్రబాబు రాకముందే వెలిగొండ 75 శాతం పనులు పూర్తి చేశారన్నారు. 13 ఏళ్ల పాలనలో చంద్రబాబు వెలిగొండను పట్టించుకోలేదని వైవీ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి 2014 నుంచి ఏటా నీళ్లిస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. నాలుగేళ్లు దాటినా పనులు పూర్తి కాలేదని విమర్శించారు. 13 ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం దక్కలేదని, వారి భూములు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఆర్ యాక్ట్ ద్వారా వారికి న్యాయం చేయాలని వైవీ డిమాండ్ చేశారు. అందుకే 14 రోజుల పాటు పాదయాత్ర చేశానన్నారు. వెలిగొండ పూర్తి అయితేనే పశ్చిమ ప్రాంతానికి బతుకని, ఫ్లోరైడ్‌ను పారదోలే అవకాశం ఉంటుందని చెప్పారు. సంక్రాంతి తర్వాత చంద్రబాబును ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలోనే ఫేజ్–1లో 1.20 లక్షల ఎకరాలకు నీరిస్తామని, 3వ టన్నెల్ తవ్వి అయినా కొండపి, పొన్నలూరులకు నీరిస్తామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ముగిసిన పాదయాత్ర : వెలిగొండ ప్రాజెక్టు సాధన కోసం ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈనెల 15న కనిగిరి నుంచి చేపట్టిన పాదయాత్ర కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో 69 గ్రామాల గుండా 14 రోజుల పాటు 207 కిలో మీటర్లు సాగింది. చివరి రోజు మంగళవారం పాదయాత్ర వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన టన్నెల్–1కు చేరింది. సాయంత్రం ఇక్కడే బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా పాదయాత్ర పైలాన్‌ను ఆవిష్కరించారు. వెలిగొండ ప్రాజెక్టు తాజా పరిస్థితిపై పుస్తక ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ మంత్రులు మానుగుంట మహీధర్‌రెడ్డి, పార్థసారధి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పిడతల సాయి కల్పనారెడ్డి, జక్కంపూడి రాజా, బాపట్ల సమన్వయకర్త సురేష్, పార్టీ అధికార ప్రతినిధులు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కాకుమాని రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్తలు బాదం మాధవరెడ్డి, రావి రామనాథంబాబు, బుర్రా మధుసూదన్‌యాదవ్, సుధాకర్‌బాబు, ఐవీ రెడ్డి, యడం బాలాజీ, బాచిన చెంచు గరటయ్య, నాయకులు బియ్యపు మధుసూధన్‌రెడ్డి, వెన్నా హనుమారెడ్డి, వరికూటి అశోక్‌బాబు, చుండూరు రవి, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, సింగరాజు వెంకట్రావ్, కుప్పం ప్రసాద్, రామారావు, పి.చంద్రమౌళేశ్వరరెడ్డి, ఆదినారాయణ, మధుసూదన్‌రెడ్డి, జెట్పీటీసీ సభ్యులు అమిరెడ్డి రామిరెడ్డి, దుగ్గెంపూడి వెంకటరెడ్డి, ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, నాయకులు కన్వీనర్లు జంకె ఆవులరెడ్డి, దొంతా కిరణ్‌గౌడ్, పి.చంద్రమౌళిరెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, షేక్.జబీవుల్లా, కె.ఓబులరెడ్డి, ఎం.బాలగురవయ్య, కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పులుగు అక్కిరెడ్డి, పటా పంజుల అశోక్, షేక్.అబ్దుల్‌మజీద్, గంటా గురువారెడ్డి, వై.లింగారెడ్డి, కె.మల్లారెడ్డి, ఎ.రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెలిగొండపై సవాల్‌కు సిద్ధమా..? ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి నీటిని విడుదల చేస్తే తాను విసిరిన సవాల్‌కు కట్టుబడి గుండు గీయించుకుంటానని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మరోమారు స్పష్టం చేశారు. సంక్రాంతి నాటికి నీరు ఇవ్వలేకపోతే జిల్లాకు చెందిన మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని బాలినేని ధ్వజమెత్తారు. జిల్లాకు బాబు ఒరగపెట్టింది శూన్యమన్నారు. ప్రజా పాదయాత్ర ముగింపు సభలో బాలినేని ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. పశ్చిమ ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు వర ప్రదాయని అన్నారు. ఈ ప్రాంతం సశ్యశ్యామలం కావాలని దివంగతనేత వైఎస్ కలలు కన్నారన్నారు. 1996లో చంద్రబాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఒక్క పైసా ఇచ్చి పనులు మొదలు పెట్టలేదని బాలినేని విమర్శించారు. 2003 ప్రాంతంలో వైఎస్ జిల్లాకు వచ్చి తాను సీఎం అయితే వెలిగొండ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆమేరకు రూ.3వేల కోట్లకు పైగా నిధులిచ్చి పనులు 70 శాతం పైగా పూర్తి చేశారన్నారు. నిధులిచ్చి పనులు చేయకుండానే చంద్రబాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది తానేనని, నీళ్లిచ్చేది కూడా తానేనని చెప్పడం సిగ్గుచేటన్నారు. టెంకాయ కొడితే ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలన్నారు. సంక్రాంతికి నీరిస్తానంటూ చంద్రబాబు జనాన్ని వంచించే ప్రయత్నంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు బాబు చేసింది శూన్యమన్నారు. వైఎస్ హయాంలోనే గుండ్లకమ్మ, రామతీర్థం, ఉలుచి చెక్‌డ్యామ్ తదితర పనులు పూర్తయ్యాయన్నారు. చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను పెంచి పోషించేందుకే నీరు చెట్టు పనులు ప్రవేశపెట్టారన్నారు. అవి ప్రజల కోసం కాదని బాలినేని విమర్శించారు. -
ప్రకాశంలో పూజా సందడి
ఒంగోలు (ప్రకాశం): స్థానిక గుంటూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్‌ను ప్రముఖ సినీనటి పూజాహెగ్డే బుధవారం ప్రారంభించారు. పూజాహెగ్డేతో పాటు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాల్ చైర్మన్ కంది రవిశంకర్, అతని కుటుంబ సభ్యులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలుత మాల్ అండ్ మల్టీప్లెక్స్ ముందువైపు ఏర్పాటుచేసిన వాటర్ ఫౌంటైన్‌ను పూజాహెగ్డే ప్రారంభించారు. అనంతరం ప్రధాన భవనాన్ని మంత్రి శిద్దా రాఘవరావు, గ్రౌండ్‌ఫ్లోర్‌లోని మాక్స్షాపింగ్ మాల్, ఫుడ్‌కోర్టును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, కేఎఫ్‌సీ సెంటర్‌ను మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి, క్రీమ్స్టోన్ను మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. తదుపరి మొదటి అంతస్తులో 65 అడుగుల భారీ స్క్రీన్‌తో నిర్మితమైన స్క్రీన్–1 థియేటర్‌ను బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించగా, స్క్రీన్–2ను ఎమ్మెల్సీ కరణం బలరాం, స్క్రీన్–3ని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గేమ్‌జోన్‌ను ప్రారంభించారు. అభిమానులను చూస్తుంటే ఆనందంగా ఉంది : పూజాహెగ్డే పూజా హెగ్డే రాకతో రెండు గంటల ముందు నుంచే ఆ ప్రాంతానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. మాల్ ఎదురుగా రోడ్డు పక్కన, డివైడర్లపై బారులుదీరి ఆమెను చూసేందుకు, ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపారు. భారీ బందోబస్తు మధ్య డప్పులతో పూజా హెగ్డేకు స్వాగతం పలికారు. మాల్ ప్రారంభం అనంతరం పూజాహెగ్డే మాట్లాడుతూ అభిమానులను చూస్తుంటే తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన రవిశంకర్ గ్రూప్ వారికి కృతజ్ఞతలు ప్రకటించారు. త్వరలోనే తాను నటించిన అరవింద సమేత విడుదలవుతుందని, ఆదరించాలని కోరారు. కేవలం కేకలు కాకుండా ఈలలు వేసి అభిమానాన్ని చాటాలంటూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. లవ్యూ సోమచ్ అంటూ గాలిలోకి ముద్దులు విసిరి కుర్రకారును గిలిగింతలు పెట్టారు. ఐదేళ్ల క్రితమే మాల్ నిర్మించాలనుకున్నాం : చైర్మన్ రవిశంకర్ ఐదేళ్ల క్రితం 2013లోనే ఒంగోలులో మాల్ అండ్ మల్టీప్లెక్స్ నిర్మించాలని తాము భావించినట్లు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ వెల్లడించారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రాండ్లు అయిన మ్యాక్స్, కేఎఫ్‌సీ, క్రీమ్‌స్టోన్, పిజ్జాహట్లు, థియేటర్లతో పాటు పిల్లలకు అవసరమైన గేమ్‌జోన్ వంటి వాటిని మాల్లో ఏర్పాటు చేశామన్నారు. అన్నింటినీ సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం తాను, తన గ్రూప్ ఉన్నతంగా ఉండటానికి ఒంగోలు, పరిసర ప్రాంతాల ప్రజల ఆశీర్వాదమే కారణమన్నారు. అందుకే ఈ మల్టీప్లెక్స్‌ను ఒంగోలు ప్రజలకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత కలిగిన కార్నివాల్స్ సినిమా గ్రూప్ స్క్రీన్లు మూడింటిని సినిమాలకు ఏర్పాటు చేశామన్నారు. మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాథ్ మాట్లాడుతూ 65 అడుగుల పూర్తిస్థాయి స్క్రీన్‌పై సినిమా చూడటం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం ఒంగోలు ప్రేక్షకులకే సాధ్యమన్నారు. హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో సైతం కొన్ని సినిమాలను మాత్రమే పూర్తిస్థాయి స్క్రీన్‌పై చూడటం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్ డైరెక్టర్లు ప్రియదర్శిని, విష్ణుమోహన్, విజయసాయి పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)