సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ | Samaikya Sankharavam wall poster released | Sakshi
Sakshi News home page

సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

Published Mon, Dec 23 2013 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

Samaikya Sankharavam wall poster released

ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తశుద్ధితో పోరాడుతోంది వైఎస్‌ఆర్ సీపీ మాత్రమేనని పార్టీ ఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఉదయం తన నివాసంలో బాలినేని ఆవిష్కరించారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వంద్వ నీతితో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు సహకరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం కిరణ్ తీరును ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే సమైక్య శంఖారావం చేపడుతున్నట్లు వివరించారు. యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న చిత్తూరు జిల్లా నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న సమైక్య శంఖారావాన్ని జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువజన విభాగం కరపత్రాలు, వాల్‌పోస్టర్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
 సమైక్యవాదులంతా జగన్‌కు మద్దతివ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటేశ్వరరావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి కొఠారి రామచంద్రరావు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి,  ైనాయకులు తిరుమలరావు, సింగరాజు వెంకట్రావు, మీరావలి, శంకరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement