
ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతు పలికిన జిల్లా ప్రజలకు ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన గురువారం రాత్రి సాక్షితో మాట్లాడారు. తనతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన వారికి ఎన్నికల్లో ఓట్లు వేసి అత్యధిక మెజారీటి రావటానికి కారణమైన ఓటరు దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు జన రంజక పాలన అందిస్తారన్నారు. ప్రకాశం జిల్లాకు అంతా మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నెలకున్న సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. ప్రతి ఒక్కరికీ ఎలాంటి కష్టం రాకుండా సేవ చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా కార్యచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తామని అన్నారు. ఓటర్లు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా బాలినేని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment