ఒంగోలు సిటీ: విద్యుత్ రంగంలో ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే పవర్ పర్చేజీ అగ్రిమెంట్ల(పీపీఏ)లో టీడీపీ భారీగా అక్రమాలకు పాల్పడిందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గురువారం ఒంగోలులో విలేకరులతో మాట్లాడారు. పీపీఏలు పవన, సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న సంస్థలతో చేసుకున్న ఒప్పందాల వల్ల విద్యుత్ రంగాన్ని రూ.30 వేల కోట్ల అప్పుల ఊబిలో దించారని విమర్శించారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు యూనిట్ రూ.2.50కే ఇవ్వడానికి ముందుకొచి్చనా.. టీడీపీ ప్రభుత్వం యూనిట్ రూ.4.85 ధరకి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతోనే ఏ మేరకు అక్రమాలు జరిగాయో వెల్లడవుతుందన్నారు.పీపీఏల విషయంలో న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సానుకూల ధోరణితో ఉందని ప్రస్తావించారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోనే విద్యుత్ పీపీఏలను రద్దు చేశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ పరంగా కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమేనని బాలినేని అన్నారు. 20 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. వ్యవసాయానికి ఉచితంగా నిరాటంకంగా తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,500 కోట్లు కేటాయించామని తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలెట్టడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గరిష్ట సమయాల్లో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి బాగా పడిపోతుందని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని వివరించారు. అన్ని రంగాలను చంద్రబాబు నాయుడు నిరీ్వర్యం చేశారని బాలినేని విమర్శించారు. వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment