
( ఫైల్ ఫోటో )
సాక్షి, ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిలో అన్ని జిల్లాలు సమానమేనని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రైతుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఏ ప్రభుత్వం చేయని విధంగా మేలు చేస్తోంది. ప్రతి నెలా మూడో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి మీటింగ్ ఉంటుంది. టీడీపీ ఎమ్మెల్యేలు సాగర్ నీళ్లపై ముసలి కన్నీరు కారుస్తున్నారు.
టీడీపీ అధికారంలో ఉండగా ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా?. ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు రైతుల సమస్యలు గాలికి వదిలేశారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే డ్రామాలు ఆడుతున్నారు. ప్రకాశం నీటి సమస్యపైన చంద్రబాబు ఎందుకు మాట్లాడడు? ఎందుకు స్పందించడు?. ఓటుకి నోటు కేసులో లోపల వేస్తారని భయమా?. నీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment