PPA
-
బాబు షాక్ ఖరీదు రూ.94 వేల కోట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : విద్యుత్తు రంగంలో గత సర్కారు అడ్డగోలు ఒప్పందాలు, తప్పిదాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో ఇష్టారాజ్యంగా చేసుకున్న ఒప్పందాలు (పీపీఏ) గుదిబండలా పరిణమించాయి. సరిగ్గా చెప్పాలంటే అదే రేటుతో ఇప్పుడు ఒప్పందం చేసుకుంటే వినియోగదారులపై దాదాపు రూ.లక్ష కోట్ల భారం పడేది! సాధారణంగా సౌర, పవన విద్యుదుత్పత్తి వ్యయం తొలి పదేళ్లు స్థిరంగా కొనసాగి తరువాత నుంచి క్రమంగా తగ్గుతుంది. టీడీపీ సర్కారు మాత్రం వినియోగదారుల నడ్డి విరిచేలా పాతికేళ్ల పాటు అధిక ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం దారుణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదీ జరిగింది... టీడీపీ హయాంలో 2014–2019 మధ్య ఎస్పీడీసీఎల్ పరిధిలో 464 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు 15 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాని ప్రకారం మొదటి ఏడాది యూనిట్‌కు రూ.5.98 చొప్పున చెల్లించాలి. రెండో ఏడాది నుంచి ఏటా మూడు శాతం చొప్పున పదో సంవత్సరం దాకా కొనుగోలు వ్యయం పెరుగుతుంది. పదో ఏడాది నాటికి ఒక్కో యూనిట్ కొనుగోలుకు రూ.7.8025 చొప్పున చెల్లించాలి. పదో ఏడాది చెల్లిస్తున్న ధరనే ఒప్పంద కాలం ముగిసే వరకు అంటే 25వ సంవత్సరం దాకా చెల్లించేలా గత సర్కారు ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం తొలి ఏడాది యూనిట్ రూ.5.98 చొప్పున 464 మెగావాట్లకుగాను రూ.365.89 కోట్లు చెల్లించాలి. ఏటా 3 శాతం చొప్పున పెంచడం వల్ల పదో ఏడాది రూ.477.41 కోట్లు చెల్లించాలి. వెరసి 25 ఏళ్లకు గాను కేవలం 464 మెగావాట్లకు చెల్లించాల్సిన మొత్తం రూ.10,978 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఇలా ఆదా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో పునరుత్పాదక ఇంధన రంగంలో మూడు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గత నెలలో ఏపీ జెన్కో, ఎన్‌హెచ్‌పీసీ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. మొత్తం రూ.25,850 కోట్ల పెట్టుబడుల ద్వారా 5,314 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా 5,300 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్‌కు రూ.2.49 చొప్పున 25 ఏళ్ల పాటు చెల్లిస్తారు. 5,134 మెగావాట్లకు గాను పాతికేళ్లకు ప్రభుత్వం చెల్లించే మొత్తం కేవలం రూ.16,425 కోట్లు మాత్రమే. అంటే ఒక్కో యూనిట్ గత సర్కారు హయాంతో పోలిస్తే సగం కంటే తక్కువ ధరకే లభించడంతోపాటు రూ.వేల కోట్లు ఆదా అయ్యాయి. టీడీపీ పాలనలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం చెల్లిస్తే విద్యుత్తు వినియోగదారులపై అక్షరాలా రూ.94 వేల కోట్ల మేర అదనపు భారం పడేది. పాలకులు ముందుచూపుతో వ్యవహరిస్తే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలే రుజువు చేస్తున్నాయి! ఊరూ.. పేరూ ఒకటే! 464 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా నిమిత్తం ఎస్పీడీసీఎల్ 15 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఇందులో విచిత్రం ఏమిటంటే తొమ్మిది కంపెనీల రిజిస్టర్డ్ ఆఫీసు, కార్పొరేట్ ఆఫీసుల చిరునామా ఒకటే కావడం గమనార్హం. అంతేకాదు.. ఐదు కంపెనీలలో ముగ్గురు కామన్ డైరెక్టర్లుగా ఉండటం మరో విచిత్రం. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు, కొందరు డైరెక్టర్లు కనీసం ఐటీ రిటర్నులు కూడా దాఖలు చేయకపోయినా రూ.కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు చూపడం మరో విశేషం. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడికి చెందిన కంపెనీలు కూడా వీటిలో ఉండటం పరిశీలనాంశం. ఎల్లో మీడియా ఇవన్నీ దాచిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే యత్నం చేయటాన్ని పరిశీలకులు తప్పుబడుతున్నారు. -
పోలవరం తొలిదశ సవరించిన అంచనాలపై నేడు ఢిల్లీలో కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశను పూర్తిచేయడానికి రూ.16,952.07 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఢిల్లీలో గురువారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేశాక.. ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలికి కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ పంపుతారు. దానిపై కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తే పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైనప్పుడు అడ్‌హక్‌గా రూ.పదివేల కోట్లు విడుదల చేసి, రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం లేకుండా చూడటం ద్వారా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి రైతులకు ముందస్తు ఫలాలను అందించడానికి సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ.. సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన మేరకు పోలవరానికి నిధుల విడుదలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి శాఖను ఆదేశించారు. ఈ క్రమంలోనే పోలవరం తొలిదశ పూర్తి చేయడం ద్వారా ముందస్తు ఫలాలను రైతులకు అందించడంపై ఏప్రిల్ 10న రాష్ట్ర జలవనరుల శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు. కమీషన్ల కక్కుర్తితో, ప్రణాళికారాహిత్యంతో చంద్రబాబు చేపట్టిన పనుల వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటంతోపాటు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో కొత్తగా 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి అవసరమైన వ్యయంపై సవరించిన ప్రతిపాదనలనుపంపాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆ సమావేశంలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. ఆ మేరకు తొలిదశ పూర్తిచేయడానికి రూ.16,952.07 కోట్లతో సవరించిన వ్యయ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4న పీపీఏకి పంపింది. ప్రాజెక్టును సమగ్రంగా పూర్తిచేయడం కోసం 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేయాలని కోరింది. వెంటాడుతున్న చంద్రబాబు పాపాలు ♦ విభజన చట్టం ప్రకారం కేంద్రమే పోలవరాన్ని నిర్మించాలి. కానీ కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగించాలని కేంద్రంపై అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. దీంతో కేంద్రం 2016 సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. 2013–14 ధరల ప్రకారం.. 2014 ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిన వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకు నాటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. ♦ 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం పనులకు అయ్యే వ్యయం రూ.20,398.61 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారు చేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందే రూ.4,730.71 కోట్లను పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది. దీన్ని మినహాయిస్తే రూ.15,667.90 కోట్లను మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. ♦ భూసేకరణ చట్టం–2013 ప్రకారం పోలవరం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరమైతే.. కేవలం రూ.20,398.61 కోట్లతోనే పోలవరాన్ని పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడం ద్వారా ఆ ప్రాజెక్టుకు సమాధి కట్టారు. ♦ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు రూ.4,730.71 కోట్లు, తర్వాత రూ.16,218.78 కోట్లు వెరసి.. రూ.20,949.49 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చుచేసింది. చంద్రబాబు అంగీకరించిన మేరకు 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే రూ.20,398.61 కోట్ల కంటే రాష్ట్ర ప్రభుత్వం అధికంగా రూ.550.88 కోట్లు వ్యయం చేసింది. దీంతో ఇకపై పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేయాలంటే సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించాలి. పూర్తిచేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన పాపాలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ.. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టును వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరానికి నిధుల సమస్యను పరిష్కరించాలని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్లకు పలుమార్లు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు వ్యయమవుతుందని.. ఈ నేపథ్యంలో రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తిచేయడం అసాధ్యమని వివరించారు. ప్రాజెక్టును పూర్తిచేయాలంటే 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కోరుతూ వస్తున్నారు. వాటిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ రెండుదశల్లో పోలవరాన్ని పూర్తిచేసేందుకు నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి శాఖను ఆదేశించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
పోలవరం ఎఫ్ఆర్ఎల్ సర్వేరాళ్లు 2008లోనే ఏర్పాటు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో గరిష్ట మట్టం (ఎఫ్ఆర్ఎల్) 45.72 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో 2008లోనే గుర్తించి, సర్వేరాళ్లు ఏర్పాటుచేశామని తెలంగాణ అధికారులకు ఆ ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు మరోసారి తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించిన రికార్డులు ఈనెల 14లోగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి ఇస్తామన్నారు. ఆ రికార్డులను పరిశీలించాక కూడా ఏమైనా అనుమానాలుంటే క్షేత్రస్థాయిలో ఎఫ్ఆర్ఎల్ సర్వేరాళ్లను చూపించడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ఎల్ మ్యాప్, ముంపు ప్రాంతాల్లో వేసిన సర్వేరాళ్ల (అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన) వివరాలను ఏపీ ప్రభుత్వం అందజేశాక మరోసారి సమావేశం నిర్వహిస్తామని పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం రెండు రాష్ట్రాల అధికారులకు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ (వెనుక జలాలు) ప్రభావం వల్ల ముంపుపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ నెల 3న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుస్విందర్‌సింగ్ వోరా అధ్యక్షతన సాంకేతిక కమిటీ మూడోసారి సమావేశమైంది. గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసిందని, అందులో ఎలాంటి ముంపు ముప్పు ఉండదని తేలిందని ఎత్తిచూపుతూ ఛత్తీస్‌గఢ్, ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు గతంలో గోపాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సాధికార కమిటీ కూడా సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికనే ఖరారు చేసిందని గుర్తుచేశారు. పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌పై ఏపీ, తెలంగాణ అధికారులు అధ్యయన నివేదికలను మార్చుకుని, చర్చించి.. తెలంగాణ అభ్యంతరాలను నివృత్తి చేయాలని పీపీఏను సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా ఆదేశించారు. ఆ మేరకు బుధవారం పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం రెండు రాష్ట్రాల అధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఏపీ తరఫున పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, తెలంగాణ తరఫున ఈఎన్సీ కె.నాగేంద్రరావు, ఆ రాష్ట్ర అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోసారి భేటీ.. పోలవరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ మ్యాపు, సర్వేరాళ్లకు సంబంధించిన రికార్డులు ఏపీ అధికారులు అందజేసిన తర్వాత.. రెండు రాష్ట్రాల అధికారులతో భౌతికంగా సమావేశం నిర్వహించాలని తెలంగాణ ఈఎన్సీ నాగేంద్రరావు చేసిన ప్రతిపాదనను పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం ఆమోదించారు. ఏపీ అధికారులు ఇచ్చే రికార్డులను తెలంగాణ అధికారులకు పంపుతామన్నారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల అధికారులతో చర్చిస్తామని చెప్పారు. అప్పటికీ తెలంగాణ సర్కార్ సంతృప్తి చెందకపోతే.. ఎఫ్ఆర్ఎల్ రాళ్లను క్షేత్రస్థాయిలో చూపించడానికి సంయుక్తంగా వెళదామని ఆయన పేర్కొన్నారు. ఎఫ్ఆర్ఎల్ అందరికీ తెలిసిందే.. పోలవరం ఎఫ్ఆర్ఎల్ పరిధిలోకి కిన్నెరసాని, ముర్రేడువాగులతోపాటు మరో ఆరువాగులు వస్తాయని.. వాటిలోకి బ్యాక్‌వాటర్ ఎగదన్ని తమ రాష్ట్రంలో బూర్గుంపహాడ్ మండలంలో 899 ఎకరాల భూమి ముంపునకు గురవుతోందని తెలంగాణ ఈఎన్సీ నాగేంద్రరావు చెప్పారు. ఇందుకు సంబంధించిన రికార్డులను పీపీఏ ద్వారా ఏపీ అధికారులకు అందజేశారు. కిన్నెరసాని, ముర్రేడువాగులపై పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసిందని, ఆ నివేదిక తెలంగాణ అధికారుల వద్ద కూడా ఉందని పోలవరం సీఈ సుధాకర్‌బాబు గుర్తుచేశారు. పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 2008లోనే గుర్తించి.. ముంపునకు గురయ్యే ప్రాంతాలను అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించి.. సర్వేరాళ్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన రికార్డులు రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయని, వాటిని సమీకరించి ఈనెల 14న అందజేస్తామని చెప్పారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ స్పందిస్తూ పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం వల్ల ముంపు ప్రాంతంపై ఏపీ ప్రభుత్వం వాస్తవాలను దాచేస్తోందని, అందువల్లే రికార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎఫ్ఆర్ఎల్కు సంబంధించిన రికార్డులన్నీ సీడబ్ల్యూసీ వద్ద, తెలంగాణ అధికారుల వద్ద ఉన్నాయని.. వాస్తవాలను దాచాల్సిన అవసరం తమకు లేదని పోలవరం సీఈ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. బూర్గుంపహాడ్‌లో ముంపునకు గురయ్యే 899 ఎకరాల భూమిని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిందని, దాన్ని ఏపీకి అప్పగించే ప్రక్రియలో జాప్యం జరుగుతోందని గుర్తుచేశారు. -
పోలవరానికి పీపీఏ బృందం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పనను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో శివ్‌నందకుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం బుధవారం రాజమహేంద్రవరానికి చేరుకుంది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, సీఈలు రాజేశ్‌కుమార్, వెంకటసుబ్బయ్య, డైరెక్టర్ దేవేందర్‌రావు ఈ బృందంలో ఉన్నారు. పీపీఏ సీఈవోగా శివ్‌నందకుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలిస్తుండడం ఇదే తొలి సారి. గురువారం పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే కనెక్టివిటీలను పీపీఏ బృందం పరిశీలిస్తుంది. శుక్రవారం ఏలూరు జిల్లాలో తాడ్వాయి, కృష్ణునిపాలెం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీలను పరిశీలించి, నిర్వాసితులతో సమావేశమవుతుంది. ఆ తర్వాత ఈ సీజన్లో చేయాల్సిన పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు అధికారులతో పీపీఏ బృందం సమీక్ష సమావేశం నిర్వహించనుంది. -
పోలవరంలో పీపీఏ బృందం
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బృందం గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పీపీఏ కార్యదర్శి ఎం.రఘురామ్, సీఈ రాజేష్‌కుమార్, డైరెక్టర్ పి.దేవేంద్రరావు కాఫర్ డ్యామ్, స్పిల్‌వే బ్రిడ్జి పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును సీఈ సుధాకర్‌బాబు వివరించారు. క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో ప్రాజెక్టు పనులపై బృందం సభ్యులు సమీక్షించారు. శుక్రవారం కూడా పనులు పరిశీలించనున్నారు. వారివెంట ఈఈలు మల్లికార్జునరావు, పి.ఆదిరెడ్డి, డీఈ కె.శ్రీనివాసరావు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ (సీఎస్ఎంఆర్ఎస్) నాణ్యత విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు పి.కె.ముంజిని, సోలంకి గురువారం పరిశీలించారు. పనులు, నాణ్యత ప్రమాణాలపై ఇంజనీరింగ్ అధికారులు వారికి వివరించారు. గ్యాప్–3 కాంక్రీట్ పనులు, స్పిల్‌వే గ్యాలరీ పనులను చూసిన వారు తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న టన్నెల్ పనులను కూడా పరిశీలించి ప్రాజెక్టు ప్రాంతంలోని ల్యాబ్‌లో కొన్ని పరీక్షలు నిర్వహించారు. వారి వెంట డీఈ శ్రీకాంత్ ఉన్నారు. -
రాజమహేంద్రవరానికి పీపీఏ కార్యాలయం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 31లోగా పీపీఏ కార్యాలయానికి అవసరమైన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ఆ తర్వాత పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలిస్తారు. వచ్చే నెల నుంచి రాజమహేంద్రవరం కేంద్రంగా పీపీఏ విధులు నిర్వర్తించనుంది. విభజన నేపథ్యంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించి పనులను పర్యవేక్షించడానికి 2014లో హైదరాబాద్ కేంద్రంగా పీపీఏ ఏర్పాటు చేసింది. దీంతో పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖల మధ్య సమన్వయం లోపం ఏర్పడి ఆ ప్రభావం ప్రాజెక్టు పనులపై పడుతోంది. ఇదే అంశాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వద్ద ప్రస్తావించిన సీఎం వైఎస్ జగన్.. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని కోరారు. ఇందుకు అంగీకరించిన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్.. పీపీఏ కార్యాలయాన్ని తరలింపునకు ఆదేశించారు. -
2017–18 ధరల ప్రకారమే పోలవరానికి నిధులివ్వాలి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు కేంద్రం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్’ ఇవ్వాలని కోరుతూ కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపాలని మరోసారి కోరింది. గతేడాది జరిగిన సమావేశంలోనే ఈమేరకు కేంద్రానికి ప్రతిపాదన పంపడానికి పీపీఏ అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసింది. తక్షణమే ఆ ప్రతిపాదన పంపి.. నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు నిధులిస్తేనే ప్రాజెక్టు పూర్తిచేయడం సాధ్యమవుతుందనే అంశాన్ని కేంద్రానికి గట్టిగా చెప్పాలని విజ్ఞప్తి చేసింది. ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల, సరఫరా వ్యయాలను ఒకటిగానే పరిగణించి, నిధులివ్వాలని కేంద్రానికి ప్రతిపాదన పంపాలని కోరింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇదే అంశంపై కేంద్రానికి ఇప్పటికే నివేదికలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.2,100 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయడం ద్వారా ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనలకు పీపీఏ సీఈవో జె.చంద్రశేఖర్ అయ్యర్ సానుకూలంగా స్పందించారు. గడువులోగా పూర్తికి ప్రణాళిక పీపీఏ బుధవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. పీపీఏ సీఈవోతో పాటు సభ్య కార్యదర్శి ఎస్కే శ్రీనివాస్, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. ప్రణాళిక మేరకు పనులు జరుగుతుండటంపై పీపీఏ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఉన్న నీటిని తోడివేసి, డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకు డయాఫ్రమ్ వాల్‌ను మరింత పటిష్టం చేస్తామని, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనులు 2022లోగా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. గడువులోగా పనులు పూర్తి చేయడానికి రోజుకు, నెలకు ఎంత పరిమాణంలో పనులు చేయాలన్నది తేల్చేందుకు ప్రత్యేక కమిటీ వేస్తామని, ఆ కమిటీ నివేదిక మేరకు పనులు చేపట్టాలని చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. నిర్వాసితుల పునరావాసం, భూసేకరణకే రూ.30 వేల కోట్లు అవసరమని, ఈ నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారం నిధులిస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమవుతుందని అధికారులు తేల్చిచెప్పారు. దీనిపై తాము వెలిబుచ్చిన సందేహాలను నెలాఖరులోగా నివృత్తి చేస్తే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామన్న పీపీఏ సీఈవో సూచనకు రాష్ట్ర అధికారులు అంగీకరించారు. పీపీఏ సీఈవో పదవీకాలం పొడిగింపు సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా అదనపు బాధ్యత నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ అయ్యర్ పదవీకాలాన్ని కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదనను కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంద్రశేఖర్ అయ్యర్ ప్రస్తుత పదవీ కాలపరిమితి ఈ నెల 27తో ముగియనుంది. నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూస్తే.. ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని సీఈవో ప్రశ్నించారు. డిస్ట్రిబ్యూటరీల పనులకు ఇప్పటికే సర్వే పూర్తి చేశామని, టెండర్లు పిలిచి పనులు చేపడతామని అధికారులు వివరించారు. నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూస్తే గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పీపీఏ ప్రధాన కార్యాలయాన్ని తక్షణమే రాజమహేంద్రవరానికి తరలించాలని, ఇక్కడ ఉంటే ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించవచ్చని, ఇది గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి దోహదం చేస్తుందని అధికారులు చెప్పారు. ఈ సూచనకు పీపీఏ సానుకూలంగా స్పందించింది. -
11 ‘విద్యుత్’ ఒప్పందాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల మధ్య జరిగిన 11 పాత, కొత్త విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సుమోటోగా ఆమోదించింది. జెన్కో కొత్తగా నిర్మించిన/నిర్మాణంలో ఉన్న 800 మెగావాట్ల కేటీపీఎస్–7వ దశ, 600 మెగావాట్ల కేటీపీపీ–2, 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంతో సంస్థకు చెందిన ఇతర పాత విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ ఆవిర్భావం తర్వాత డిస్కంలు పీపీఏలను కుదుర్చుకున్నాయి. విద్యుత్ చట్టం–2003 నిబంధనల ప్రకారం ఈ పీపీఏలను ఈఆర్సీ పరిశీలించి ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీపీఏలపై బహిరంగ విచారణ నిర్వహించి వివిధ వర్గాల నుంచి సలహాలను ఈఆర్సీ స్వీకరించింది. అనంతరం పలు మార్పులతో పీపీఏలను ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గడువు తీరిన పీపీఏల స్థానంలో కొత్త ఒప్పందాలు 1956 నుంచి 1998 మధ్య పాత థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు జరిగిన పీపీఏల వ్యవధి 2019లో ముగిసింది. దీంతో 400 మెగావాట్ల కేటీపీఎస్ ఏబీసీ, 500 మెగావాట్ల కేటీపీఎస్–5వ దశ, 62.5 మెగావాట్ల రామగుండం థర్మల్ స్టేషన్–బీ, 875.6 మెగావాట్ల నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం, 900 మెగావాట్ల శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం, 54 మెగావాట్ల సింగూరు/పోచంపాడు/పాలేరు/నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రాలు, 9.16 మెగావాట్ల పెద్దపల్లి జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం డిస్కంలు జెన్కోతో కొత్త పీపీఏలు చేసుకున్నాయి. ఈ పీపీఏలను సైతం ఈఆర్సీ తాజాగా ఆమోదించింది. యాదాద్రి, భద్రాద్రి వ్యయంపై అభ్యంతరాలు నిర్మాణంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యయం భారీగా పెరిగిపోతోంది. నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణవ్యయం రూ. 30 వేల కోట్లకు పెరగనుందని జెన్కో అంచనా వేసింది. 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ వ్యయం సైతం రూ. 8,536 కోట్లకు పెరగనుందని ఈఆర్సీకి తెలిపింది. 800 మెగావాట్ల కేటీపీఎస్– 7వ దశ నిర్మాణానికి రూ. 5,548.44 కోట్లు, 600 మెగావాట్ల కేటీపీపీ–2కు రూ. 4,334 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదించింది. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయం అసాధారణంగా పెరగడంపట్ల వాటి పీపీఏలపై ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో విద్యుత్‌రంగ నిపుణులు వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి అభ్యం తరం వ్యక్తం చేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు చేసినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం భూసేకరణ, పునరావాసం కోసం రూ. 845 కోట్లు, ప్రాజెక్టు ప్రదేశానికి యంత్ర పరికరాలను తరలించడం, అమర్చడం వంటి పనుల కోసం రూ. 1,617 కోట్లు, సివిల్ వర్క్స్ కోసం రూ. 5,057 కోట్లు, కంటిజెన్సి కింద రూ. 201 కోట్లను జెన్కో అనవసరంగా ఖర్చు చేసిందని, ఈ వ్యయాలను అనుమతించరాదని ఈఆర్సీని కోరారు. నిబంధనల మేరకే ఖర్చులు చేసినట్లు జెన్కో సమర్థించుకోగా విద్యుత్ కేంద్రాల నిర్మా ణం పూర్తయ్యాక రానున్న వాస్తవ వ్యయంపై నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ పేర్కొంది. -
పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం తెలంగాణపై ఉండదు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావం వల్ల తెలంగాణలో భూభాగం ఏమాత్రం ముంపునకు గురికాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావం కిన్నెరసాని, ముర్రేడు ఉప నదులపై ఏమాత్రం పడుతుందనే అంశంపై తెలంగాణ జలవనరులశాఖ అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించామని, ఇందుకు సంబంధించిన వివరాలను ఈనెల 12లోగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు పంపుతామని తెలిపింది. పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) ప్రకటన–2006 ప్రకారం.. నోటిఫికేషన్ జారీచేసిన 45 రోజుల్లోగా గ్రామసభలు నిర్వహించాలని, ఏళ్లు గడుస్తున్నా ముంపు ప్రాంతాల్లో ఇప్పటికీ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు గ్రామసభలు నిర్వహించలేదని ఎత్తిచూపింది. ఈఐఏ–2006 నిబంధనల మేరకు రెగ్యులేటరీ అథారిటీతో ఆ రాష్ట్రాల్లో గ్రామసభలు నిర్వహించాలని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి రామేశ్వర్‌ప్రసాద్‌గుప్తాకు గతనెల 15న లేఖ రాసినట్లు తెలిపింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉత్తర్వులకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను చేస్తున్నామని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ భూభాగం ముంపునకు గురవుతుందని దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే క్రమంలో ఎన్జీటీ లేవనెత్తిన అంశాలపై గురువారం వర్చువల్ విధానంలో పీపీఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల జలవనరులశాఖ అధికారులు, సీడబ్ల్యూసీ, కేంద్ర అటవీ పర్యావరణశాఖ అధికారులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబు, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం సీఈ సి.లాల్, కేంద్ర అటవీ పర్యావరణశాఖ అధికారులు పాల్గొన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికారులు గైర్హాజరయ్యారు. తెలంగాణ భూభాగం ముంపునకు గురికాదు పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందనే అంచనాతో నిర్మిస్తున్నారని, దీనివల్ల తెలంగాణలో భూభాగం ముంపునకు గురవుతుందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సమావేశంలో ప్రస్తావించగా.. అది ఒట్టి అపోహే అంటూ ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కొట్టిపారేశారు. గోదావరి నది చరిత్రలో 1986 ఆగస్టు 16న గరిష్ఠంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు ప్రాజెక్టు భద్రత కోసం 50 లక్షల క్యూసెక్కులు వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేందుకు వీలుగా ప్రాజెక్టును నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం వద్దకు 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో సీడబ్ల్యూసీ బ్యాక్‌వాటర్ సర్వే చేసిందని.. అందులో తెలంగాణలో ఒక్క ఎకరం కూడా ముంపునకు గురికాదని తేలిందని గుర్తుచేశారు. ముర్రేడు, కిన్నెరసాని ఉప నదులపై బ్యాక్‌వాటర్ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై తెలంగాణ అధికారులతో కలిసి సర్వే చేశామని, ఈ వివరాలను ఈనెల 12లోగా సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. పోలవరం బ్యాక్‌వాటర్ వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు సమస్య ఉంటుందని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు చెబుతున్నాయని.. ఆ సమస్యను తప్పించడానికి రక్షణ గోడలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు చెప్పారు. ముంపు ప్రభావం ఉండే ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించాలని ఏపీ అధికారులు రాసిన లేఖపై తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అధికారులు తెలిపారు. 2022 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించామని, ఆలోగా 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని పీపీఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. చదవండి: ఏపీ: 400 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులు ఏపీకి 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు -
కుక్కునూరులో పీపీఏ బృందం పర్యటన
కుక్కునూరు: పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీ అధికారుల బృందం బుధవారం పర్యటించింది. దాచారం పునరావాస కాలనీలను పరిశీలించిన బృందం కిష్టారం, మర్రిపాడు, ఉప్పేరు తదితర గ్రామాల్లోని నిర్వాసితులను కలిసి వారి అభిప్రాయాలు సేకరించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 కాంటూరు, 43, 45.7 కాంటూరు పరిధిలో ఏయే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి? 45.7 కాంటూరు కంటే ఎత్తులో ఉన్న గ్రామాలను ముంపు పరిధిలో ఎందుకు సేకరించారు? అనే విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల చుట్టూ నీరు చేరుతోందని, గ్రామాల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉండదని, అందుకే ఆర్అండ్ఆర్ పరిహారంలో చేర్చారని, నిర్వాసితులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల వచ్చిన వరదకు ముంపులో లేని గ్రామాలకు ఎంత వరకు తాకిడికి గురయ్యాయనే విషయాన్ని గ్రామస్తులు అధికారులకు చూపించారు. ఈ సందర్భంగా ముంపులో సేకరించిన గ్రామాల పక్కనే నిర్వాసిత కాలనీలు నిర్మిస్తున్నారని, రోడ్డుమార్గం ముంపులో ఉన్నప్పుడు నిర్వాసిత కాలనీలకు ఎలా వెళతారనే విషయంపై అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని నిర్వాసితులను అడగ్గా అడవి మార్గం గుండా మరో రహదారి ఏర్పాటు చేస్తారని అప్పటి భూ సేకరణ అధికారి చెప్పినట్లు వారు వివరించారు. -
పోలవరం పనులపై పీపీఏ సంతృప్తి
సాక్షి, అమరావతి, పోలవరం రూరల్: పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, షెడ్యూల్ ప్రకారమే ప్రాజెక్టు పూర్తవుతుందని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ తెలిపారు. ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో కేంద్రం ఇటీవల రూ.2,234 కోట్లను రీయింబర్స్ చేసిందని చెప్పారు. మరో రూ.480 కోట్ల రీయింబర్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టును 2021 డిసెంబర్‌లోగా పూర్తి చేయడానికి సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి పీపీఏ అధికారుల బృందంతో కలిసి పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన ఆదివారం రోజు స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్) గ్యాప్–1, గ్యాప్–3 పనులు, కుడి, ఎడమ అనుసంధానాలు(కనెక్టివిటీస్) పనులను క్షుణ్నంగా పరిశీలించారు. స్పిల్ వేకు గేట్ల బిగింపు ప్రక్రియను నిశితంగా గమనించారు. గేట్ల బిగింపు, ఆర్మ్ గడ్డర్స్, క్రాస్ గడ్డర్స్, స్కిన్ పేట్లను అమర్చి వెల్డింగ్ చేస్తుండటాన్ని పరిశీలించి పనుల నాణ్యంగా చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. మే ఆఖరు కల్లా స్పిల్ వే పూర్తవుతుందన్నారు. స్పిల్ ఛానల్‌తో నీటి తోడివేత ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మే ఆఖరుకు ఈ పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1లో కాంక్రీట్ డ్యామ్, గ్యాప్–3లో డయా ఫ్రమ్ వాల్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నేడు పునరావాస పనుల పరిశీలన.. పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పన పనులను క్షేత్రస్థాయిలో పీపీఏ బృందం పరిశీలిస్తుందని చెప్పారు. నాలుగు రోజులపాటు పర్యటిస్తామన్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపైనే కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ పనులు ఆధారపడ్డాయన్నారు. పునరావాసం కల్పన పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోందన్నారు. సోమవారం వీటిని పరిశీలిస్తామని చెప్పారు. గోదావరికి వరదలు వచ్చేలోగా కాఫర్ డ్యామ్‌లు పూర్తవుతాయన్నారు. వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి ఈసీఆర్ఎఫ్ పనులను నిర్విఘ్నంగా చేపట్టి డిసెంబర్‌కు పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. అయ్యర్ వెంట పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నాగిరెడ్డి తదితరులున్నారు. -
పోలవరం ఎత్తు తగ్గించలేదు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వసామర్థ్యం తగ్గించలేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చీఫ్ ఇంజినీర్ ఏకే ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించారన్న ప్రచారం అపోహేనని కొట్టేశారు. ఆయన మంగళవారం పీపీఏ సభ్యులు మోహన్ శ్రీరామ్‌దాస్(డీఈ), అమిత్‌సింగ్(సీఈ–పవర్ సెక్టార్)లతో కలిసి పోలవరం పనుల్ని పరిశీలించారు. స్పిల్‌వే బ్రిడ్జి కాంక్రీట్ పనులు, స్పిల్‌వే పనులు, గ్యాప్–3 ప్రాంతాల్లో జరుగుతున్న పనులను చూశారు. పనుల పురోగతిని ప్రాజెక్టు ఎస్ఈ ఎం.నాగిరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఏకే ప్రధాన్ విలేకరులతో మాట్లాడుతూ డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)కు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు ఉంటుందని, నీటి నిల్వసామర్థ్యం 194.6 టీఎంసీలు ఉంటుందని స్పష్టం చేశారు. మొదటి సంవత్సరం 41.5 మీటర్ల ఎత్తు మేరకు నీటిని నిల్వ చేస్తారని చెప్పారు. రిజర్వాయర్ ప్రొటోకాల్ ప్రకారం, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తయ్యే క్రమాన్నిబట్టి నీటి నిల్వ సామర్థ్యం ఏటా పెరుగుతుందని తెలిపారు. నాలుగైదేళ్లలో పూర్తిస్థాయిలో 194.6 టీఎంసీల నీరు నిల్వ చేస్తారని చెప్పారు. ఇప్పటికే కాంక్రీట్, హెడ్ వర్క్స్ పనులు 76 శాతం పూర్తయ్యాయన్నారు. మొత్తం ఆర్ అండ్ ఆర్, అన్ని పనులు కలిపి 41 శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా.. కష్టమైన సమయంలో కూడా పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరం ఈఈ ఆదిరెడ్డి, డీఈలు బాలకృష్ణ, రామేశ్వర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. పీపీఏ సీఈ ప్రధాన్, సభ్యులు బుధవారం కూడా ప్రాజెక్టు పనుల్ని పరిశీలించనున్నారు. -
పీపీఏల పాపమే!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ విద్యుదుత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు డిస్కమ్‌లకు శాపంగా మారాయి. మార్కెట్లో కారుచౌకగా విద్యుత్ లభిస్తున్నా పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవటానికి ఐదేళ్ల క్రితం చేసుకున్న కొనుగోలు ఒప్పందాలే కారణం. దీనివల్ల విద్యుత్ సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. లాక్‌డౌన్‌తో ఒకవైపు విద్యుత్‌కు డిమాండ్ తగ్గిపోగా మరోవైపు రెవెన్యూ వసూళ్లు నిలిచిపోయాయి. 2019–20 విద్యుత్ కొనుగోలు వివరాలను ఏపీ విద్యుత్ సంస్థలు సోమవారం మీడియాకు వెల్లడించాయి. (నేటి నుంచి రిజిస్ట్రేషన్లు) ► 2019–20లో మార్కెట్లో విద్యుత్ సగటు ధర యూనిట్ రూ. 4 మాత్రమే ఉండగా ఏపీ డిస్కమ్‌లు అంతకన్నా ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేశాయి. పీపీఏలే దీనికి కారణం. ► 2019 ఏప్రిల్ నుంచి 2020 ఏప్రిల్ వరకు రాష్ట్రంలో ఏడాదికి 70,747 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభ్యత ఉండగా వినియోగించింది 64,128 మిలియన్ యూనిట్లు. ఇందులో అధిక భాగం దీర్ఘకాలిక పీపీఏలే ఉన్నాయి. ► ప్రస్తుతం మార్కెట్లో సోలార్ విద్యుత్తు ధర యూనిట్ రూ.2 లోపు ఉంటే పీపీఏలున్న సంస్థల నుంచి రూ. 4.80 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. ► రాష్ట్రంలో జల విద్యుత్ యూనిట్ రూ.2.69 మాత్రమే ఉన్నా పీపీఏల వల్ల ఏటా 3,518 మిలియన్ యూనిట్లకే పరిమితం అవుతోంది. ► ఐదేళ్లుగా ఏపీజెన్కో ధర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి భారీగా తగ్గించడంతో అప్పులు వెంటాడుతున్నాయి. వీటికోసం చేసిన రుణాల వల్ల విద్యుత్ ధరలు మార్కెట్ రేటుకన్నా ఎక్కువగా ఉన్నాయి. ► కేంద్ర ప్రభుత్వ విద్యుత్ వాటా మార్కెట్ కన్నా ఎక్కువగా ఉంది. యూనిట్ రూ. 4.64 వరకు వెచ్చించాల్సి వస్తోంది. దీర్ఘకాలిక పీపీఏలు లేకుంటే ఈ విద్యుత్‌కు బదులు మార్కెట్లో తక్కువకు తీసుకునే వీలుంది. పీపీఏల వల్లే ఇబ్బందులు ‘దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి పెరగడంతో మార్కెట్లో చౌకగా లభిస్తోంది. కానీ ఏపీ డిస్కమ్‌లు గతంలో దీర్ఘకాలిక పీపీఏలు కుదుర్చుకోవడంతో చౌకగా లభించే విద్యుత్‌ను పూర్తిస్థాయిలో తీసుకోలేకపోతున్నాయి. ఇది డిస్కమ్‌లను ఆర్థికంగా దెబ్బ తీస్తోంది’ – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి -
మేలోగా నిర్వాసితులకు పునరావాసం
సాక్షి, అమరావతి: గోదావరి నదిలో వరదలు ప్రారంభమయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పన.. స్పిల్ వే, స్పిల్ ఛానల్.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను సమన్వయం చేసుకుంటూ పూర్తిచేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. అప్పుడు వరద వచ్చినా స్పిల్ వే, స్పిల్ ఛానల్ మీదుగా దానిని మళ్లించి.. ప్రధాన ఆనకట్ట (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ – ఈసీఆర్ఎఫ్) పనులు నిరాటంకంగా చేయవచ్చునని.. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయవచ్చునని సూచించింది. ఇదే కాలపరిమితితో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను యథాతథంగా ఆమోదించింది. ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని తాము కేంద్రాన్ని కోరతామని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నాలను చేయాలని పీపీఏ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈఓ) చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. హైదరాబాద్‌లో గురువారం పీపీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో.. ప్రాజెక్టు యాక్షన్ ప్లాన్‌ను ఇవ్వాలని సీఈఓ కోరడంపై రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావులు స్పందిస్తూ.. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన రూ.5,500 కోట్లను కేంద్రం ఇప్పటిదాకా రీయింబర్స్ చేయకపోవడాన్ని ప్రస్తావించారు. రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేస్తున్నట్లు నవంబర్ 8న కేంద్ర జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీచేసిందని.. కానీ ఇప్పటికీ ఆ నిధులివ్వకుండా పనుల పూర్తికి యాక్షన్ ప్లాన్ అడగడం ఏమాత్రం బాగోలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని.. 2021 నాటికి పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనిపై సీఈఓ స్పందిస్తూ.. రూ.1,850 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కేంద్రానికి వి/æ్ఞప్తి చేస్తామని.. మిగతా నిధులు ఇచ్చేలా చూస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం వంతు ప్రయత్నాలు చేయాలని సూచించారు. పునరావాసం ఆధారంగా పనులు పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో నిర్వాసితులకు పునరావాసాన్ని మే లోగా పూర్తి చేయగలిగితేనే, వరద జలాలను దిగువకు పంపడానికి కాఫర్ డ్యామ్‌ల ఇరువైపులా వదిలిన ఖాళీ ప్రదేశాలను భర్తీచేయాలని పీపీఏ సీఈఓ సూచించారు. ఆ లోగా సిŠప్ల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తిచేస్తే.. వరద నీటిని వాటి మీదుగా గోదావరి నదిలోకి మళ్లించవచ్చునన్నారు. దీనిపై సహాయ, పునరావాస కమిషనర్ బాబూరావు స్పందిస్తూ.. బిల్లులు ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లించకపోవడంవల్ల పనులు నత్తనడక సాగుతున్నాయన్నారు. దేవీపట్నంలో 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే మరో వంద కుటుంబాలకు కూడా ఈ ఏడాది పునరావాసం కల్పిస్తే ముంపు సమస్య ఉండదన్నారు. ఇందుకు రూ.మూడు వేల కోట్లు అవసరం అవుతాయని.. అలాగే, ఈ నెల నుంచి ప్రతినెలా సగటున రూ.600 కోట్ల చొప్పున విడుదల చేస్తే మే నాటికి 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరాసం కల్పించే పనులు పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. దీనిపై చంద్రశేఖర్ అయ్యర్ స్పందిస్తూ.. ఆ మేరకు నిధులు విడుదలయ్యేలా చూస్తామన్నారు. ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు మాట్లాడుతూ, స్పిల్ వే, స్పిల్ ఛానల్లో డీవాటరింగ్ పనులను నెలాఖరుకు పూర్తిచేస్తామన్నారు. ప్రస్తుతం సిŠప్ల్ వేలో రోజుకు వెయ్యి క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తున్నామని.. మే నాటికి పనులు పూర్తిచేసేలా ప్రణాళిక రచించామని వివరించారు. హెడ్ వర్క్స్, కుడివైపు కరకట్ట, ఎడమ వైపు కరకట్టలను పటిష్ఠం చేసే పనులకు సంబంధించిన ఎనిమిది డిజైన్లను కేంద్ర జలసంఘం ఆమోదించాల్సి ఉందన్నారు. దీనిపై పీపీఏ సీఈఓ స్పందిస్తూ.. ఈనెల 22న పీపీఏ భేటీని మరోసారి ఏర్పాటుచేస్తామని.. ఆ భేటీలో వాటిపై చర్చించి.. నెలాఖరులోగా డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశంలో డిజైన్లు ఆమోదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీపీఏ సభ్య కార్యదర్శి బీపీ పాండే, సీఈ ఏకే దివాన్, ఎస్ఈ నాగిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
అడ్డగోలుగా పీపీఏలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో హడావుడిగా 41 విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) కుదుర్చుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రంగా విమర్శించారు. పీపీఏలపై శాసనసభలో సోమవారం టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ)ని తప్పుదారి పట్టించి, డిస్కంలను భారీ నష్టాల్లోకి నెట్టారని తప్పుపట్టారు. పీపీఏలపై సమీక్షతోపాటు ఇతర విధానాలతో విద్యుత్తు వ్యవస్థను తమ ప్రభుత్వం గాడిలో పెడుతోందన్నారు. హడావుడిగా 41 పీపీఏలా? ‘2017 మార్చి 31తో పీపీఏల కాలపరిమితి ముగుస్తుండగా.. టీడీపీ ప్రభుత్వం మార్చి 15న హడావుడిగా 41 పీపీఏలు కుదుర్చుకుంది. 15 రోజుల్లో పవన విద్యుత్తు ప్లాంట్లు స్థాపించి ఉత్పత్తి చేయడం సాధ్యమా?’ అని బుగ్గన ప్రశ్నించారు. రెన్యువబుల్ ఎనర్జీ యూనిట్‌కు రూ.4.84 పడిందని, అదే థర్మల్ విద్యుత్తు యూనిట్ రూ.3లేనని దాంతో యూనిట్‌కు రూ.1.84 ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని ఆయన చెప్పారు. థర్మల్ విద్యుత్తు వినియోగించకపోయినా ఫిక్స్డ్ చార్జీల కింద యూనిట్‌కు రూ.1.50 తప్పనిసరిగా చెల్లించాల్సి రావడంతో డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయని మంత్రి బుగ్గన వివరించారు. 2014–15 నాటికి డిస్కంలు రూ.9 వేల కోట్ల నష్టాల్లో ఉండగా 2018–19 నాటికి రూ.29వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని ఆయన తెలిపారు. విద్యుత్తు సబ్సిడీల కోసం టీడీపీ ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో రూ.2,500 కోట్లు పేర్కొని.. కేవలం రూ.1,250 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. దాంతో డిస్కంలు రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం రూ.4,900 కోట్లు చెల్లించి డిస్కంల పరిస్థితిని చక్కదిద్ది విద్యుత్తు సరఫరాను మెరుగుపర్చిందని మంత్రి వెల్లడించారు. పీపీఏలపై విలేకరుల సమావేశంలో అధికారులు మాట్లాడటాన్ని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తప్పుబట్టగా.. మంత్రి తిప్పికొట్టారు. కొన్ని అంశాలపై అధికారులు, నిపుణులు మాట్లాడతారని, టీడీపీ హయాంలో ఐటీ గ్రిడ్స్ కేసులో ఆర్టీజీఎస్ సీఈవో విజయానంద్, అహ్మద్‌బాబు మీడియాతో మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో భ్రష్టుపట్టిన విద్యుత్తు వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే పీపీఏలను సమీక్షించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా భద్రత బిల్లుపై చర్చను అడ్డుకుంటారా? శాసనసభలో మహిళా భద్రత బిల్లుపై చర్చ సందర్భంగా పదే పదే అడ్డు తగిలిన విపక్షసభ్యులపై శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉల్లి ధరలపై చర్చకు ప్రభుత్వం సిద్ధచెప్పినా వినకుండా.. విపక్ష సభ్యులు విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారని తప్పు పట్టారు. ప్రతిపక్షానికి బాధ్యత ఉంటే స్పీకర్‌కు ఉల్లిపాయల బాక్స్‌ను పంపిస్తారా? అని ప్రశ్నించారు. లాభాల కోసం హెరిటేజ్‌లో కేజీ ఉల్లి రూ.200కు అమ్మడం సరైనదేనా? అని నిలదీశారు. అడ్డదారిలో పీపీఏలు ఆమోదించారు: మంత్రి బాలినేని పీపీఏలు చేసుకోవద్దని 2017, ఫిబ్రవరి 27న అప్పటి విద్యుత్తు శాఖ ముఖ్యకార్యదర్శి స్పష్టంగా చెప్పినా టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పీపీఏలపై చర్చలో ఆయన మాట్లాడుతూ అప్పటికే అనుకున్న లక్ష్యం చేరుకోవడంతోపాటు పవన విద్యుత్తు ధరలు పడిపోయాయని.. దాంతో ఈఆర్సీకి నివేదించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యకార్యదర్శి ఆదేశించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అయితే ఆ ఆదేశాలకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం మంత్రిమండలిలో ర్యాటిఫై చేసి మరీ పీపీఏలను ఆమోదించడం ఎంతవరకు సమంజసమని బాలినేని నిలదీశారు. -
పీపీఏల్లో టీడీపీ భారీ అక్రమాలు
ఒంగోలు సిటీ: విద్యుత్ రంగంలో ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే పవర్ పర్చేజీ అగ్రిమెంట్ల(పీపీఏ)లో టీడీపీ భారీగా అక్రమాలకు పాల్పడిందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గురువారం ఒంగోలులో విలేకరులతో మాట్లాడారు. పీపీఏలు పవన, సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న సంస్థలతో చేసుకున్న ఒప్పందాల వల్ల విద్యుత్ రంగాన్ని రూ.30 వేల కోట్ల అప్పుల ఊబిలో దించారని విమర్శించారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు యూనిట్ రూ.2.50కే ఇవ్వడానికి ముందుకొచి్చనా.. టీడీపీ ప్రభుత్వం యూనిట్ రూ.4.85 ధరకి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతోనే ఏ మేరకు అక్రమాలు జరిగాయో వెల్లడవుతుందన్నారు.పీపీఏల విషయంలో న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సానుకూల ధోరణితో ఉందని ప్రస్తావించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోనే విద్యుత్ పీపీఏలను రద్దు చేశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ పరంగా కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమేనని బాలినేని అన్నారు. 20 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. వ్యవసాయానికి ఉచితంగా నిరాటంకంగా తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,500 కోట్లు కేటాయించామని తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలెట్టడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గరిష్ట సమయాల్లో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి బాగా పడిపోతుందని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని వివరించారు. అన్ని రంగాలను చంద్రబాబు నాయుడు నిరీ్వర్యం చేశారని బాలినేని విమర్శించారు. వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు. -
2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
పోలవరం ఇక పరుగులు
సాక్షి, అమరావతి: గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టగానే పోలవరం పనులను ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) రాష్ట్ర జలవనరుల శాఖను ఆదేశించింది. మే నాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయాలని, 41.5 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని నిర్దేశించింది. పీపీఏ సీఈవో ఆర్కే జైన్ అధ్యక్షతన సంస్థ సర్వ సభ్య సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రస్తుత సీజన్లో పూర్తి చేయాల్సిన పనులు, నిపుణుల కమిటీ నివేదిక, నిర్వాసితులకు పునరావాసం కల్పన తదితర అంశాలపై ఇందులో సమగ్రంగా చర్చించారు. పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ‘రివర్స్ టెండరింగ్’ వల్ల రూ.782.8 కోట్లు ఆదా అయిందని, 65వ ప్యాకేజీ పనులకు రివర్స్ టెండరింగ్ వల్ల రూ.58.53 కోట్లు ఆదా అయిందని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ పీపీఏకి వివరించారు. పోలవరం పనులకు సంబంధించి హైకోర్టు తీర్పు అతి త్వరలోనే వస్తుందని, కోర్టు ఆదేశాల మేరకు కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. పెండింగ్ డిజైన్లపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), డీడీఆర్పీ(డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్)తో చర్చించి ఆమోదం పొందాలని పీపీఏ పేర్కొంది. పోలవరం పనుల్లో అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందంలో కేంద్ర జల్ శక్తి శాఖ సూచించే అధికారిని సభ్యుడిగా చేర్చాలని పీపీఏ సీఈవో సూచించారు. పర్యావరణానికి ఎలాంటి హాని లేదు.. పోలవరం పనుల వల్ల పర్యావరణానికి హాని వాటిల్లుతోందంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన వ్యాజ్యంపై సమావేశంలో ఆర్కే జైన్ ప్రస్తావించారు. దీనిపై ఆదిత్యనాథ్‌దాస్ స్పందిస్తూ పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు చేయడానికి తవ్విన మట్టి నిల్వ కోసమే భూసేకరణ చేశామని తెలిపారు. ఇదే మట్టిని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌లో వినియోగిస్తామని, దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదని ఎన్జీటీకి నివేదించామన్నారు. పోలవరాన్ని 2021 నాటికి పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారని, ఆ మేరకు పనులు జరిగేలా ప్రణాళిక సిద్దం చేశామన్నారు. ఇప్పటికే చేసిన పనులకు రూ.5,103 కోట్లు విడుదల చేయాలని కోరారు. సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నిధుల కొరత లేకుండా చూస్తే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించగలుగుతామని స్పష్టం చేశారు. సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్మోహన్ గుప్తా, పీపీఏ సభ్య కార్యదర్శి పాండే, సీఈ ఏకే ప్రధాన్, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు చెంపపెట్టు: బాలినేని
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కోర్టు తీర్పు చంద్రబాబు, టీడీపీకి చెంపదెబ్బ అని.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని విద్యుత్ శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పీపీఏల పునఃసమీక్ష వ్యవహారాన్ని తాము కోరినట్టుగా ఏపీఈఆర్సీకి హైకోర్టు అప్పగించిందన్నారు. రేట్లు ముట్టుకోకూడదన్న కంపెనీల వాదనను కోర్టు తోసిపుచ్చిందని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలన్నీ ప్రజల కోసమేనని తెలిపారు. విద్యుత్‌రంగ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అవినీతి రహిత, పారదర్శక పాలనను ప్రజలకు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందడుగు వేస్తున్నారని.. అందులో భాగంగా పీపీఏలపై కూడా సమీక్ష చేయాలని నిర్ణయించారని వెల్లడించారు. చేతనైతే ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ధైర్యంగా తీసుకుంటున్న చర్యలను సమర్థించాలని.. లేకపోతే మౌనంగా కూర్చోవాలన్నారు. (చదవండి : విద్యుత్ కంపెనీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ..!) ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని కట్టుకథలు.. కొన్ని కంపెనీలతో కుమ్మక్కై అధిక ధరకు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను మాత్రమే పునఃసమీక్షిస్తామని చెప్పామన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం, విద్యుత్ పంపిణీ సంస్థలు బతికి బట్టకట్టడానికే ఈ నిర్ణయాలని చెప్పామన్నారు. ప్రజలకోసం కాకుండా లోపాయికారీ ఒప్పందాలు కోసం చంద్రబాబు, టీడీపీ నాయకులు పోరాటం చేశారని మండిపడ్డారు. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేశారన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష ఘోర అపరాధంగా, అభివృద్ధికి నిరోధంగా కట్టుకథలు అల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లంచగొండి విధానాల వలనే.. పీపీఏల పునఃసమీక్ష రాజ్యాంగవిరుద్ధం, చట్ట విరుద్ధం అని మాట్లాడారని.. పరిశ్రమలకు తక్కువ ధరకు విద్యుత్ రావాలన్నా, డిస్కంలు బతికి బట్టకట్టాలన్నా, విద్యుత్ కంపెనీలకు సకాలంలో చార్జీలు చెల్లించాలన్నా... ఈ చర్యలు తప్పనిసరి అని మంత్రి బాలినేని పేర్కొన్నారు. తాము ప్రజల తరఫున మాట్లాడుతున్నామని.. ఛార్జీలు తక్కువ ఉంటేనే ప్రజలకు, పారిశ్రామిక రంగానికి మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబు లంచగొండి విధానాల వల్లే గడచిన ఐదేళ్లలో విద్యుత్ సంస్థల బకాయిలు 20 వేల కోట్లు దాటాయని విమర్శించారు. -
విద్యుత్ కంపెనీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ..!
సాక్షి, అమరావతి: పీపీఏల పునఃసమీక్ష వ్యవహారంలో విద్యుత్ కంపెనీలకు ఎదురుదెబ్బ తాకింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్షకు అవకాశమే లేదన్న విద్యుత్ కంపెనీల వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాకుండా.. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లపై పునఃసమీక్షకోసం ఏపీఈఆర్సీకి వెళ్తామంటూ ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు సమర్థించింది. ఇకపై పీపీఏల పునఃసమీక్షకు సంబంధించి ఏవైనా వాదనలుంటే ఏపీఈఆర్సీ ఎదుటే వినిపించాలని హైకోర్టు సూచించింది. (అందుకే విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష : అజేయ కల్లం) ఏపీఈఆర్సీ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ధారించలేమని హైకోర్టు తెలిపింది. ఆరు నెలల్లోగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని ఏపీఈఆర్సీకి స్పష్టం చేసింది. ఈలోగా మధ్యంతర చెల్లింపుకింద యూనిట్‌కు రూ. 2.43 నుంచి రూ. 2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది. ప్రభుత్వం నోటీసులు ఇచ్చి చట్టంప్రకారం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయవచ్చని హైకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్‌ను తిరిగి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. (చదవండి : విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు: సీఎం జగన్) -
ప్రతిపక్షం తీరు కుక్కతోక వంకరే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై శుక్రవారం శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ కొనుగోళ్లుపై గత ప్రభుత్వ విధానాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. ప్రతి విషయంలోనూ కుక్కతోక వంకరే అన్న విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ...‘ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అవకతవకలు జరిగాయి. గత ప్రభుత్వం అవసరం లేకున్నా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే టీడీపీ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమీక్షించేందుకు కమిటీ వేశాం. అయితే ఆ నిపుణుల కమిటీపై చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారు. నివేదిక రాకుండానే అజేయకల్లం, విద్యుత్ కార్యదర్శిపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిపుణుల కమిటీ విచారణ ఇంకా కొనసాగుతోంది. పీపీఏలపై సమీక్ష అనగానే చంద్రబాబు భయపడి పోతున్నారు. ఏపీఈఆర్సీ మన రాష్ట్రానికి ఆర్పీవోలను నిర్దేశిస్తోంది. 2015-16లో ఆర్పీఓ 5 శాతం నిర్ణయిస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 5.5 శాతం కొనుగోలు చేసింది. 2016-17లో ఆర్పీఓ అయిదు శాతం నిర్ణయించగా, 8.6 శాతం కొనుగోలు చేసింది. ఇక 2017-18లో ఆర్పీఓ 11శాతం నిర్ణయిస్తే 23.4శాతం కొనుగోలు చేసింది. దీంతో 2016-17లో రూ.430 కోట్లు, 2017-18లో రూ.924.9 కోట్లు, 2018-19లో రూ.1292.8 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడింది. ఎక్కువ రేట్లకు కొనుగోలు చేస్తున్నామని తెలిసి... కొన్ని కంపెనీలకు లాభం చేకూరేలా ఈ ఒప్పందాలు జరిగాయి. టీడీపీ ప్రభుత్వం రూ.2654 కోట్లకు విద్యుత్ కొనుగోలు చేసింది. అవసరం లేకున్నా గత ప్రభుత్వం కావాల్సిన కంపెనీలతో అధిక రేట్లకు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు వల్ల ఏటా రూ. 2,766 కోట్ల నష్టం. ఈ భారాన్ని మోసే పరిస్థితుల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు లేవు. పీపీఏలను సమీక్షించి, రేట్లు తగ్గించి ప్రజలకు,ప్రభుత్వానికి న్యాయం చేస్తాం. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2019 చదవండి: కరెంట్ కొనుగోళ్లపై సమీక్షతో.. ప్రజాధనం ఆదా విండ్ పవర్‌ను యూనిట్‌కు రూ.4.84కు ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీఈఆర్సీ ధరల ప్రకారం థర్మల్ పవర్ యూనిట్ రూ.4.20కి అందుబాటులో ఉంది. అయినా థర్మల్ పవర్‌ను కాదని చంద్రబాబు విండ్ పవర్‌ను కొనుగోలు చేశారు. థర్మల్ పవర్‌ను తీసుకోకపోయినా... యూనిట్‌కు రూ.1.10 పైసలు చెల్లించాల్సి వచ్చింది. మొత్తంపై యూనిట్ ధర రూ.5.94కు కొనుగోలు చేసినట్లు అయింది. దీనివల్ల యూనిట్ రూ.1.74పైసలు నష్టపోయాం. ఏడాదికి రూ.2766కోట్లు అదనంగా చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతున్నా మనం ఎందుకు పట్టించుకోలేదు?. దానికి కారణం డబ్బులే. సోలార్ విద్యుత్ కొనుగోలు విధానంలో కూడా ఇలాగే వ్యవహరించారు. విండ్ పవర్లో 64 శాతం కొనుగోళ్లు కేవలం ముగ్గురితో జరిగాయి. నోరెత్తితే టెక్నాలజీ అంటారుగా... 2016-18 మూడేళ్లలో రూ.5,497 కోట్ల విద్యుత్ కొనుగోలు చేశారు. గత మూడేళ్లలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయి. టెక్నాలజీని తానే కనిపెట్టానని చంద్రబాబు అంటారు. ఆ టెక్నాలజీ ద్వారా ఇంత నష్టం వస్తుందని చంద్రబాబుకు తెలియదా?. తెలిసీ 25ఏళ్లకు ఈ పీపీఏలను ఎలా ఒప్పందం చేసుకున్నారు. కేంద్రం నుంచి ఇన్సెంటీవ్లు వస్తున్నాయని చంద్రబాబు అంటున్నారు. గత మూడేళ్లలో కేవలం రూ.540కోట్లు మాత్రమే వచ్చాయి?. ఏపీఈఆర్సీ చైర్మన్‌గా తన వ్యక్తిని తెచ్చుకునేందుకు ....ఆ చట్టాన్ని కూడా మార్చారు. గత అయిదేళ్లుగా ఏపీ పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా ఉంది. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎందుకు విద్యుత్ కొనుగోళ్లు చేశారు. పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు లేకపోగా ఎక్కువ ధరలకు విద్యుత్ కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా సబ్సిడీ భారం పెరుగుతోంది. అయిదేళ్లలో రెవెన్యూ లోటు రూ.66,361కి చేరింది. ఈ భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేయడం సమంజసమేనా?. ఇంత దారుణంగా టీడీపీ స్కామ్‌లు చేసింది. రాష్ట్రానికి ఇంత నష్టం వస్తుందని చంద్రబాబుకు తెలియదా?’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
‘అందుకే విద్యుత్ ఒప్పందాలపై పునఃసమీక్ష’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను సరిదిద్దేందుకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. గతంలో పోలిస్తే విద్యుత్ రేట్లు భారీగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువ రేటు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..అందులో భాగంగా గతంలో ఎవరూ తీసుకోని విధంగా గతంలో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. పీపీఏల రద్దువల్ల పెట్టుబడులు వెనక్కివెళ్లిపోతాయని కొంతమంది దుష్ఫ్రచారం చేస్తోన్నారని..కానీ ఎలాంటి ఒప్పందాలు లేకుండానే కరెంటు సరఫరా చేసేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ‘విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలి. ప్రస్తుతం మనం ఎక్కువ ధరకు విద్యుత్‌ను కొంటున్నాం. గత ప్రభుత్వం పీపీఏలను రూ.6లకు ఒప్పందం చేసుకుంది. సౌర విద్యుత్‌ఒప్పందం రూ. 4.84కు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విండ్ సోలార్, విద్యుత్ ధరలు తగ్గిపోయాయి. 2010లో రూ.18 ఉన్న సౌర విద్యుత్ యూనిట్ రూ.2.45 తగ్గింది. పవన విద్యుత్ యూనిట్ రూ.4.20 నుంచి 43 పైసలకు తగ్గిపోయింది. ఎక్కువ ధరకు విద్యుత్ కొనాల్సిన అవసరం రాష్ట్రానికి లేదు. అధిక ధరల ఒప్పందం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. పీపీఏలు లేకుండానే యూనిట్ విద్యుత్‌ను రూ. 2.72లకు అందించేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి’ అని అజేయ కల్లం అన్నారు. ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. డిస్కంలు రుణపరిమితి దాటి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం డిస్కంలు రూ. 20వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రూ.26.6శాతానికి చేరుకుందని తెలిపారు. కొత్తగా వస్తున్న పరిశ్రమలపై విద్యుత్ భారం వేయలేమని తేల్చి చెప్పారు. ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీలో మార్పులు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీలో మార్పులు జరిగాయి. అడ్వకేట్ జనరల్ స్థానంలో న్యాయశాఖ కార్యదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత స్థాయి సంప్రదింపు కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్‌లు ఉన్నారు. -
పోలవరం లెక్కలు చెప్పాల్సిందే..!
-
‘పోలవరం’ లెక్కలు చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ అమలులో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సిద్ధమైంది. ఇప్పటివరకూ పోలవరం జలాశయం.. కుడి, ఎడమ కాలువల పనుల కోసం సేకరించిన భూమి సర్వే నెంబర్లు, యజమాని పేరు, చెల్లించిన పరిహారం వివరాలు ఇవ్వాలని పీపీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ ఆర్కే గుప్తా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలవరం భూసేకరణ విభాగం స్పెషల్ కలెక్టర్ సీహెచ్ భానుప్రసాద్‌కు లేఖ రాశారు. ఇప్పటివరకూ పునరావాసం కల్పించిన నిర్వాసితులు, వ్యక్తిగతంగా వారికి పంపిణీ చేసిన పరిహారం, పునరావాస కాలనీల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటికి చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వాలని కోరారు. వివరాలు ఇస్తే అక్రమాలు గుట్టంతా రట్టు అవుతుందని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. పీపీఏకు ఎలాంటి వివరాలు ఇవ్వొద్దంటూ తమపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని పోలవరం భూసేకరణ విభాగం అధికారులు చెబుతుండటం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం.. రూ.16,010.45 కోట్లు. ఇందులో భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ వ్యయం.. రూ.2,934.42 కోట్లు. 2013–14 ధరల ప్రకారం.. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.57,940.86 కోట్లకు పెంచుతూ ఆగస్టు 17, 2017న రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ వ్యయం.. రూ.33,225.74 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం.. సేకరించిన భూమికి పరిహారం చెల్లించినా, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేసినా ఇంత వ్యయం చేయాల్సిన అవసరం ఉండదని ఆదిలోనే పీపీఏ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు పనుల తరహాలోనే భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీల అంచనా వ్యయాన్ని భారీ ఎత్తున పెంచేసి కమీషన్లు పంచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ప్రణాళిక రచించినట్లు గుర్తించింది. కుడి కాలువ అక్రమాలతో ఆరంభం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నాలుగు మండలాల్లోని టీడీపీ నేతలు, సానుభూతిపరులైన రైతులకు ఎకరానికి గరిష్టంగా రూ.62 లక్షల చొప్పున పరిహారం పంపిణీ చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం లెక్కగట్టినా ఎకరానికి రూ.20 లక్షలు నుంచి రూ.25 లక్షలకు మించి పరిహారం ఇవ్వడానికి అవకాశం లేదని అధికారవర్గాలు అప్పట్లోనే వెల్లడించాయి. మొత్తం రూ.700 కోట్లను టీడీపీ నేతలు, సానుభూతిపరులకు పరిహారంగా పంపిణీ చేశారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. పోలవరం జలాశయంలో ముంపునకు గురయ్యే భూమిని 2009కి ముందే సేకరించినా.. సేకరించనట్లు చూపి బినామీ పేర్లతో పరిహారాన్ని టీడీపీ నేతలు కాజేశారు. గిరిజనులకు భూమికి బదులుగా భూమిని పంపిణీ చేసేందుకు జరిపిన భూసేకరణలోనూ, పునరావాస కాలనీల నిర్మాణానికి చేసిన భూసేకరణలోనూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి వందలాది కోట్ల రూపాయలను టీడీపీ నేతలు దోచుకున్నారు. వివరాలు ఇవ్వొద్దని ఒత్తిళ్లు పోలవరం జలాశయంలో ముంపునకు గురయ్యే భూమి, కుడి, ఎడమ కాలువల తవ్వకానికి అవసరమైన భూమి వెరసి 1,66,423.27 ఎకరాల భూమిని సేకరించాలి. ఇప్పటివరకూ 1,10,787 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. భూసేకరణకు రూ.5,398.59 కోట్లను ఖర్చు చేసింది. పోలవరం జలాశయంలోముంపునకు గురయ్యే గ్రామాల్లోని 1,05,601 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందులో 3,922 కుటుంబాలకు మాత్రమే ఇప్పటివరకూ పునరావాసం కల్పించారు. నిర్వాసితులయ్యే గిరిజనులకు భూమికి బదులుగా భూమి ఇచ్చేందుకు పది వేల ఎకరాలను సేకరించారు. సహాయ, పునరావాస ప్యాకేజీ కింద రూ.802 కోట్లను ఖర్చు చేశారు. మిగిలిన 55,636 ఎకరాల భూమి సేకరణకు రూ.7,208.89 కోట్లు, 1,01,679 మందికి పునరావాసం కల్పించడానికి రూ.19,817 కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ భూసేకరణకు, సహాయ, పునరావాస ప్యాకేజీ అమలుకు చేసిన వ్యయంతోపాటు ఇంకా సేకరించాల్సిన భూమి, పునరావాసం కల్పించాల్సిన నిర్వాసితుల వివరాలు ఇవ్వాలని పీపీఏ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరాల ఆధారంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయించి అక్రమాల గుట్టును రట్టు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కుడి కాలువ భూసేకరణలో అక్రమాలపై పక్కాగా ఆధారాలు సేకరించిన పీపీఏ.. జలాశయం, ఎడమ కాలువ భూసేకరణ వ్యవహారంపై దృష్టి పెట్టడంతో ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అంచనా వ్యయాన్ని రూ.57,940.86 కోట్లకు పెంచుతూ పంపిన ప్రతిపాదనలు మినహా.. పీపీఏకు ఎలాంటి వివరాలు ఇవ్వొద్దంటూ ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని భూసేకరణ విభాగంలో కీలక అధికారి తెలిపారు. -
కమీషన్ల దాహం ఖరీదు రూ.7 వేల కోట్లు!
సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో ముఖ్యనేత కమీషన్ల దాహం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.7 వేల కోట్లకుపైగా భారం పడుతోంది. కమీషన్లు చెల్లించని కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసి మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తూ భారీగా ముడుపులు కాజేస్తున్నారు. ఈ వ్యవహారాలను కప్పిపుచ్చుకునేందుకు పాత ధరలకే ముందుకొచ్చిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించామంటూ సర్కారు బుకాయిస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ఎనిమిదో సర్వ సభ్య సమావేశంలో పీపీఏ కళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గంతలు కట్టింది. పాత ధరలకే ముందుకొచ్చిన కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించామంటూ పీపీఏ ఎదుట అబద్ధాలు వల్లె వేసింది. అదనపు భారం పడితే తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల ఖజానాపై కనిష్టంగా రూ.7 వేల కోట్లకుపైగా భారం పడుతుందని జలవనరుల శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముఖ్యనేత కమీషన్ల దాహం ఖజానాకు శాపంగా మారిందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అదనపు భారం బాధ్యత రాష్ట్రానిదే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనులను దక్కించుకున్న వెంటనే హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం రూ.1,481.91 కోట్లు పెంచేసి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చింది. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందుపెట్టి పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. హెడ్‌వర్క్స్ స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల్లో రూ.1,196 కోట్ల విలువైన పనులను 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం వాటి అంచనా వ్యయాన్ని రూ.1395.89 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని పీపీఏ తప్పుబట్టింది. ఆ తర్వాత 28 గంటల్లోనే అంచనా వ్యయాన్ని రూ.1,483 కోట్లకు పెంచేసి టెండర్ డాక్యుమెంట్లను ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదం నుంచి గట్టెక్కేందుకు పాత ధరలకే నవయుగ సంస్థ పనులు చేయడానికి ముందుకొచ్చిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే దీనివల్ల ఖజానాపై అదనపు భారం పడితే ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేని పీపీఏ తేల్చిచెప్పింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. పీపీఏ కళ్లకు గంతలుకట్టి రూ.1196 కోట్ల విలువైన పనులను రూ.1,243.67 కోట్లకు నామినేషన్‌పై కట్టబెట్టారు. హెడ్వర్క్స్లోనే రూ.5,235.25 కోట్ల భారం.. ట్రాన్స్ట్రాయ్ నుంచి స్పిల్ వే, స్పిల్ ఛానల్‌కు సంబంధించి మిగిలిన రూ.921.87 కోట్ల విలువైన పనులను విడదీసి పీపీఏ అనుమతి లేకుండానే నవయుగకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. ఈసీఆర్ఎఫ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్– రాతి మట్టి కట్ట), కాఫర్ డ్యామ్(మట్టి కట్ట) పనులను ట్రాన్స్ట్రాయ్ నుంచి 60సీ నిబంధన కింద విడదీసి ప్రభుత్వం ఇటీవల నవయుగకు అప్పగించింది. 2010–11 ఎస్ఎస్ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్)ప్రకారం ఈ పనుల విలువ రూ.842.65 కోట్లే..! 2015–16 ధరల ప్రకారం హెడ్‌వర్క్స్ ధరలను సవరిస్తూ 2016 సెప్టెంబరు 8న ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఈ పనుల విలువ రూ.1,332.58 కోట్లు. ఈసీఆర్ఎఫ్, కాఫర్ డ్యామ్ పనులను ఇదే ధరకు చేయడానికి నవయుగ ముందుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా తాజాగా సవరించిన ధరల ప్రకారం ఆ పనుల విలువ రూ.2,800 కోట్లుగా ఉంది. దీంతోపాటు ధరల సర్దుబాటు, పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అదనంగా బిల్లులు చెల్లించడానికి సర్కారు అంగీకరించడం గమనార్హం. పాత ధరల ప్రకారం చూస్తే నవయుగకు అప్పగించిన పనుల విలువ రూ.3,498.12 కోట్లు. కానీ డీపీఆర్–2 ప్రకారం ఈ పనుల విలువ రూ.8,733.37 కోట్లుగా ఉంది. పాత ధరల ముసుగులో రూ.5,235.25 కోట్ల మేర కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చినట్లయింది. ముఖ్యనేత ఈ మేరకు కమీషన్లు వసూలు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. పీపీఏకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కనెక్టివిటీస్.. కాలువల పనుల్లో రూ.1,800 కోట్లు జలాశయం నుంచి కాలువలకు నీటిని సరఫరా చేసే కనెక్టివిటీస్ పనుల్లో ఇప్పటికే ఎడమ వైపు పనులను నామినేషన్ పద్ధతిలో కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. కుడి వైపు పనులను కూడా కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎడమ కాలువ పనుల్లో ఏకంగా ఏడు ప్యాకేజీల పనులను 60సీ కింద పాత కాంట్రాక్టర్ల నుంచి తప్పించి కొత్త కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించేశారు. పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2010–11 ధరల ఆధారంగా కొత్త కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి. అయితే 2015–16లో అంచనా వ్యయాన్ని పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వారికి పనులు అప్పగించడం గమనార్హం. డీపీఆర్–2 ప్రకారం కుడి, ఎడమ కాలువల పనుల అంచనా వ్యయాన్ని మరింత పెంచేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే కనెక్టివిటీస్, కాలువల పనుల్లో రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.1,800 కోట్లకు భారం పడే అవకాశం ఉంటుంది. ఆ మేరకు కాంట్రాక్టర్ల నుంచి ముఖ్యనేత కమీషన్లు వసూలు చేసుకోనున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.