సాక్షి, అమరావతి: పీపీఏల పునఃసమీక్ష వ్యవహారంలో విద్యుత్ కంపెనీలకు ఎదురుదెబ్బ తాకింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్షకు అవకాశమే లేదన్న విద్యుత్ కంపెనీల వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాకుండా.. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లపై పునఃసమీక్షకోసం ఏపీఈఆర్‌సీకి వెళ్తామంటూ ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు సమర్థించింది. ఇకపై పీపీఏల పునఃసమీక్షకు సంబంధించి ఏవైనా వాదనలుంటే ఏపీఈఆర్‌సీ ఎదుటే వినిపించాలని హైకోర్టు సూచించింది.
(అందుకే విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష : అజేయ కల్లం)
ఏపీఈఆర్‌సీ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ధారించలేమని హైకోర్టు తెలిపింది. ఆరు నెలల్లోగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని ఏపీఈఆర్‌సీకి స్పష్టం చేసింది. ఈలోగా మధ్యంతర చెల్లింపుకింద యూనిట్‌కు రూ. 2.43 నుంచి రూ. 2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది. ప్రభుత్వం నోటీసులు ఇచ్చి చట్టంప్రకారం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయవచ్చని హైకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్‌ను తిరిగి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.
(చదవండి : విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment