DISCOMS
-
‘సెకీ’ ఒప్పందం సక్రమమే
సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సేకరణకు సంబంధించి అనేక అభ్యంతరాలు వివిధ కారణాలతో వచ్చాయి. సెకీ విద్యుత్ సేకరణలో లంచాలకు సంబంధించి మీడియా కథనాలను బట్టి ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కొందరు కోరారు. దీంతో ఈ పీఎస్‌ఏపై ఏపీఈఆర్సీ మరోసారి దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది. కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (సీఈఆర్సీ) జనరల్ నెట్వర్క్ యాక్సెన్ (జీఎన్ఏ) నిబంధనలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ) ప్రకారం..‘సెకీ’ విద్యుత్‌కు అంతర్ రాష్ట్ర ప్రసార (ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్–ఐఎస్టీఎస్) చార్జీలు వర్తించవు. అదేవిధంగా ప్రసార నష్టాల మినహాయింపు ఉంటుంది.సెకీ విద్యుత్ కొనుగోలుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు ప్రతిపాదించాయి. అందువల్ల ఈ 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక (పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు. – ఏపీఈఆర్‌సీసాక్షి, అమరావతి: రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో కారుచౌకగా యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) క్లీన్ చిట్ ఇచ్చింది. 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందంటూ ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవిన్యూ రిక్వైర్మెంట్–ఏఆర్ఆర్)లో ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. విద్యుత్ సేకరణపై తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) చేసిన ప్రతిపాదనల్లో సెకీ విద్యుత్ కూడా ఉంది. 2025–26లో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్సీని డిస్కంలు కోరాయి. దీనిపై స్పందించిన కమిషన్ ‘సెకీ’ విద్యుత్ ఒప్పందంపై తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చింది. ‘‘సెకీ నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక (పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు’’ అని ఏపీఈఆర్సీ పేర్కొంది. ఇక సెకీ నుంచి విద్యుత్ సేకరణ ప్రణాళికలో ట్రేడింగ్ మార్జిన్ తగ్గించడంపై జరిగిన చర్చలను కూడా మండలి ప్రస్తావించింది. సీఈఆర్సీ రూ.0.7 పైసల ట్రేడింగ్ మార్జిన్‌తో టారిఫ్‌ను ఇప్పటికే ఆమోదించిందని, అందువల్ల దానిపై కమిషన్ దీనిపై ఇప్పుడు వ్యాఖ్యానించదని తెలిపింది. అంటే గత ప్రభుత్వం కుదుర్చుకున్న ధర యూనిట్ రూ.2.49కే సెకీ నుంచి విద్యుత్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపధ్యంలో సెకీ లాంటి పీఎస్ఏ ఒప్పందాలను కొందరు డిమాండ్ చేస్తున్నట్లుగా సూమోటోగా కమిషన్ రద్దు చేయలేదని తేల్చి చెప్పింది. కాబట్టి ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబరులో విద్యుత్ సేకరణకు డిస్కంలు కోరిన ప్రణాళికలో సెకీ విద్యుత్‌ను చేర్చడానికి కమిషన్ మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించింది. సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారని.. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారని.. పేరుకే సెకీ.. ఒప్పందం అదానీతోనే.. ఐఎస్టీఎస్ చార్జీలు కట్టాల్సిందే.. జుగల్ బందీలు.. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం.. ఇలా చిలువలు పలువలుగా.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఎల్లో మీడియా, టీడీపీ కూటమి నేతలు సాగించిన దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని దీన్నిబట్టి తేలిపోయింది. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా బరితెగించినట్లు వెల్లడైంది. అంటే తప్పులేదని ఒప్పుకున్నట్లేగాఅంతరాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలను (ఐఎస్టీఎస్) మినహాయించి యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో యూనిట్ రూ.2.49 చొప్పున ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ కూడా ఆమోదించింది. 2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీ ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. నిజానికి సెకీ నుంచి గతేడాది సెప్టెంబర్ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవ్వాల్సి ఉంది. తొలి ఏడాది 2024లో 3వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో 1,000 మెగావాట్లు చొప్పున మొత్తం 7వేల మెగావాట్లను రాష్ట్రం తీసుకుంటుందని ఒప్పందంలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం 4వేల మెగావాట్లను ఈ ఏడాదే తీసుకుంటామంటూ ప్రతిపాదించింది. అంటే ఇన్నాళ్లూ తాము చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని, కల్పిత కథనాలేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నట్లైంది!సంపద సృష్టించిందెవరు?.. గుదిబండ మోపిందెవరు?సెకీ నుంచి కారుచౌకగా విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ద్వారా గత ప్రభుత్వం ఏడాదికి రూ.4,400 కోట్లు ఆదా చేసింది. ఈ లెక్కన 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా సంపద సృష్టించింది. అదే చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య సౌర విద్యుత్ యూనిట్ సగటున రూ.5.90 చొప్పున కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) చేసుకున్నారు. సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్ రూ.3.41 అధికంగా కొన్నారు. దీనివల్ల ఏడాదికి రూ.3,500 కోట్లు చొప్పున 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై భారం పడింది. మరి 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్ జగన్ గొప్పా..? లేక రూ.87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్పా? చేసిన మంచిని దాచలేరు.. గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని చక్కదిద్దేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్ సరఫరా అందించింది. అందుకుగానూ డిస్కంలకు 2019–24 మధ్య రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. దానిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రెండు లక్షలపైగా వ్యవసాయ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసింది. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చి సాగుకు చేదోడు వాదోడుగా నిలిచింది. రాష్ట్రంలో 9 గంటలు వ్యవసాయానికి పగటిపూట విద్యుత్ సరఫరా చేసేలా 6,663 ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించారు. విద్యుత్ రంగానికి, రైతన్నలకు ఇంత మంచి చేసిన వైఎస్ జగన్‌పై బురద చల్లుతూ సెకీ విద్యుత్ ధర ఎక్కువని, ఐఎస్టీఎస్ చార్జీలు కట్టాల్సి వస్తుందని కూటమి నేతలు, కరపత్రికలు దు్రష్పచారం చేశాయి. చివరికి అవన్నీ తప్పుడు ఆరోపణలని విద్యుత్ నియంత్రణ మండలి తేల్చింది. ఇప్పుడేమంటారు బాబూ..?కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. మంత్రి మండలితో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే జరిగింది. సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. దాన్ని రైతుల వ్యవసాయ అవసరాల కోసం అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఆ ధర అప్పటికి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ఈ ఒప్పందంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం, టీడీపీ అనుబంధ కరపత్రిక ఈనాడు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేశాయి.అదానీపై అమెరికాలో ఏదో కేసు నమోదైందని, అందులో జగన్ పేరు ఉందని, లంచం తీసుకున్నారని నిరాధార కథనాలను వండి వార్చాయి. ఈనాడు, టీడీపీ అనుబంధ మీడియా రాసిన అసత్య కథనాలను పట్టుకుని చంద్రబాబు ప్రోద్బలంతో కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఊగిపోయారు. ఏకంగా జగన్‌పైనే కేసు పెట్టినట్లు నిందలేస్తూ ఆరోపణలు గుప్పించారు. సెకీ ఒప్పందానికి అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు రాదని, యూనిట్ రూ.2.49 కూడా ఎక్కువేనని, ప్రజలపై పాతికేళ్లలో రూ.లక్ష కోట్ల భారం పడుతుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఏమార్చేందుకు టీడీపీ కరపత్రికలు యత్నించాయి. అవన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి. ఇదే చంద్రబాబు గతంలో అత్యధిక ధరలకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పడు మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొన్నారు. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ చంద్రబాబు దానిని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్నారు. తాజాగా ఏపీఈఆర్సీ ఇచ్చిన స్పష్టత వాటికి చెంపపెట్టులా పరిణమించింది.ఎల్లో కరపత్రం.. ఎంత విషం చిమ్మిందో.. ఆరోపణ: సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరణనిజం: సెకీ లేఖ – ఒప్పందానికి మధ్య దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ సమయం. కమిటీ లోతైన అధ్యయనం తరువాతే కేబినెట్ ఆమోదంఆరోపణ: ట్రాన్స్మిషన్ చార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా అబద్ధాలు నిజం: పాతికేళ్ల పాటు అంతరాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన ’సెకీ’ఆరోపణ: సోలార్ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగింది.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారు. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్ధిక భారం పడుతుంది.నిజం: ఈ ఒప్పందంలో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. ఒప్పందం జరిగింది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వం.. డిస్కమ్‌ల మధ్య! ఇక లంచాలకు తావెక్కడ?రాష్ట్ర చరిత్రలోనే కారుచౌకరాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దూరదృష్టి, సోలార్‌పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు ఇక లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? నేరుగా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది?‘సెకీ’ ఒప్పందంతో లాభాలివీ..» కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49కే సోలార్ విద్యుత్తు అందచేస్తామంటూ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం వల్ల 25 ఏళ్ల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుందని 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సెకీ స్పష్టం చేసింది.» ఈ చారిత్రక ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర విద్యుత్తు భారం నుంచి ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది. » ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు అనేది మరే ఇతర ప్రాజెక్ట్‌కి దక్కని చాలా కీలకమైన ప్రయోజనం. ఇతర రాష్ట్రంలో ఉన్న సోలార్ పవర్ ఉత్పాదక కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా కోసం మరే ఇతర సంస్థతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం ఐఎస్టీఎస్ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు అది చాలా భారంగా మారుతుంది. ప్రతి నెలా మెగావాట్‌కు సుమారు రూ.4 లక్షలు దానికే ఖర్చవుతుంది. » రాష్ట్ర డిస్కంలు మునుపెన్నడూ ఇంత తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. » ఇది కేంద్ర సంస్థ సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. అలాంటప్పుడు ఇక లంచాలకు ఆస్కారం ఎక్కడుంటుంది?» టీడీపీ హయాంలో కుదుర్చుకున్న అధిక ధరల పీపీఏలతో పోలిస్తే సెకీతో సగం కంటే తక్కువ ధరకే ఒప్పందం కుదిరింది.అభినందించాల్సింది పోయి నిందలేస్తారా?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందంæ జరిగితే.. యూనిట్ రూ.2.49కే రాష్ట్రానికి విద్యుత్ దొరుకుతుంటే.. పైగా స్పెషల్ ఇన్సెంటివ్‌గా అంతరాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించడం ద్వారా యూనిట్‌కు మరో రూ.1.98 ఆదా అవుతుంటే.. ఇంత మంచి ప్రతిపాదన రాష్ట్రానికి వస్తే ఎవరైనా క్షణం ఆలోచించకుండా ముందుకెళ్తారు. మేం కూడా అదే చేశాం. ఈ ఒప్పందం ద్వారా 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేయడం వలన సంపద సృష్టించాం. నిజంగా ఇదొక రోల్ మోడల్ కేసు. ఇంత మంచి చేస్తే నాపై రాళ్లేస్తారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లకు సెకీ ఎంతకు అమ్మిందో తెలుసా? ఆ మూడు రాష్ట్రాలకు యూనిట్ రూ.2.61 చొప్పున సరఫరా చేశారు. అంటే వాళ్లకంటే రూ.0.12 తక్కువకే విద్యుత్ తీసుకొచ్చిన నన్ను అభినందించి శాలువా కప్పి ప్రశంసించాల్సింది పోయి బురద జల్లుతారా? మంచి చేసిన వాడిపై రాళ్లు వేయడమే ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవీ 5తో పాటు చంద్రబాబుకు చెందిన ఎల్లో గ్యాంగ్ పనిగా పెట్టుకుంది. వీళ్లు తానా అంటే తందానా అనే ఇతర పార్టీల్లో ఉండే టీడీపీ సభ్యులు మిడిమిడి జ్ఞానంతో చంద్రబాబును మోయాలన్న తాపత్రయంతో... జగన్‌పై బురద చల్లాలి అనే యావతో నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు సమంజసం?. – ఎల్లో మీడియా దుష్ప్రచార కథనాలపై గతంలో వైఎస్ జగన్ వ్యాఖ్య -
మీటర్లలో ‘సర్వీస్’ మాయ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ మీటర్లు అమర్చిన విద్యుత్ పంపిణీ సంస్థలు వాటికి సర్వీస్ నంబర్లు లేవనే విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించాయి. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సర్కిల్ పరిధిలో ఈ భాగోతం వెలుగు చూసింది. దీనిపై నివేదిక సమర్పించాలని ఈసీడీసీఎల్ సీఎండీ ఐ.పృథ్వీతేజ్ అధికారులను ఆదేశించగా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అమలాపురం ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు అమలాపురం సర్కిల్ ఎస్ఈ ఎస్.రాజబాబు మెమో జారీ చేశారు. ఇప్పటికైనా ‘మోస్ట్ అర్జంట్ మేటర్’గా పరిగణించి ఏడు రోజుల్లోగా మీటర్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అందులో స్పష్టం చేశారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది అంగన్వాడీ కేంద్రాల్లో సర్వీస్ నంబర్ లేకుండా మీటర్లు అమర్చి, బిల్లులు ఇవ్వకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. మరికొన్ని సర్వీసులకు బిల్లులు జారీ చేసినా వాటిని వినియోగదారులకు ఇవ్వలేదు. దీని వెనుక భారీ కుంభకోణం ఉందని తెలుస్తోంది. ప్రాణాలతోనూ చెలగాటం రాష్ట్రవ్యాప్తంగా 55,605 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. దాదాపు 35 లక్షల మంది ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఈ కేంద్రాలకు వస్తుంటారు. దాదాపు 1.30 లక్షల మంది అంగన్వాడీ సిబ్బంది నిత్యం ఈ కేంద్రాల్లోనే విధులు నిర్వర్తిస్తుంటారు. అలాంటిచోట విద్యుత్ మీటర్లు 6 అడుగులకు పైగా ఎత్తులో అమర్చాలి. కా..నీ చిన్న పిల్లలుంటారనే కనీస ఇంగితం కూడా లేకుండా ఈ కేంద్రాల్లో కేవలం 3 అడుగులు ఎత్తులోనే మీటర్లు ఏర్పాటు చేశారు.మొత్తం బిల్లు ఇప్పుడు ఇస్తాం కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు కూడా రూపొందించాం. కానీ.. ఆ బిల్లులను ఎవరికీ ఇవ్వలేదు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు మీటర్లు ఇచ్చినప్పటికీ సర్వీసు నంబర్ ఇవ్వలేదు. కొన్నేళ్లుగా రీడింగ్ తీయకపోయినా ఆ సమాచారం మీటర్లో నిక్షిప్లమై ఉంటుంది. దాని ఆధారంగా మొత్తం బిల్లును ఇప్పుడు జారీ చేస్తాం. – రవికుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అమలాపురం ఆపరేషన్ డివిజన్ -
లేని కరెంటుతోనూ షాక్!
కరెంటు బిల్లులు బాగా పెరిగాయని బాధ పడకండి. మీ ఇంటినే ఓ గ్రిడ్‌గా మార్చుకునే అపురూప అవకాశం కల్పిస్తున్నాం. మీకు సరిపడా కరెంటును వాడుకుని, మిగిలిన కరెంటును మీరు అమ్ముకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ సిస్టం పెట్టుకోవడమే. – ఇటీవల సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే వరుసగా విద్యుత్ చార్జీలు పెంచేస్తూ రాష్ట్ర ప్రజలపై భారం వేస్తోంది. ఇప్పటికే రూ.15,485 కోట్లు వసూలు చేయడం ప్రారంభించింది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకంలో వచ్చే ప్రోత్సాహకాలను దక్కించుకోవడం కోసం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిస్కంలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో అధికారులు, సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించాయి. దీంతో వినియోగదారులతో బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారు. కానీ అలా రిజి్రస్టేషన్ చేసుకున్న వారికి ఈ నెల జారీ అయిన బిల్లులు చూసి గుండె ఆగినంత పనైంది. ప్రతి నెలా సాధారణంగా రూ.200 నుంచి రూ.500 వరకు వచ్చే బిల్లు రూ.5 వేలు, రూ.6 వేలు రావడంతో లబోదిబోమంటూ బాధితులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే దాదాపు 250 మందికి పైగా వినియోగదారులు తమకు బిల్లులు అధికంగా వచ్చాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా, పీఎం సూర్యఘర్ పథకంలో రిజి్రస్టేషన్ చేయించుకున్న వారికి విద్యుత్ బిల్లులు భారీగా వచ్చినట్లు ఏపీఈపీడీసీఎల్ ఫైనాన్స్ విభాగం జనరల్ మేనేజర్ జీవీ అరుణకుమారి దృష్టికి అకౌంట్స్ విభాగం అధికారులు తీసుకెళ్లారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి శుక్రవారం అన్ని సర్కిళ్ల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన జీఎం.. తొలుత ఆ బిల్లులన్నింటినీ సిస్టమ్ నుంచి తొలగించాలని చెప్పినట్లు సమాచారం. అలాగే బిల్లులు అధికంగా వచి్చన విషయం మీడియా దృష్టికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించినట్లు కూడా తెలిసింది. దీనిపై జీఎంను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అరుణకుమారి ఫోన్లో స్పందించ లేదు. -
ఎప్పుడో వాడిన కరెంటుకు ఇప్పుడు చార్జీలా?
సాక్షి, అమరావతి/కర్నూలు (సెంట్రల్): ‘ఒక పరిశ్రమలో ఉత్పత్తి అయిన వస్తువుకు ఒక ధర నిర్ణయించి విక్రయిస్తారు. దాని తయారీకి అయిన విద్యుత్ ఖర్చు సహా అన్ని ఖర్చులూ అందులో ఉంటాయి. వినియోగదారుడు ఆ రేటు చెల్లించి వస్తువు కొంటాడు. కొన్ని నెలల తర్వాత ఆ వస్తువు తయారు చేస్తున్న రోజుల్లో వాడిన విద్యుత్తుకు అదనపు చార్జీ చెల్లించాలంటున్నారు. అదెలా సాధ్యం? ప్రభుత్వం అడిగినట్లు మేం కూడా వస్తువు కొన్న వాళ్ల దగ్గరకు వెళ్లి అప్పుడు మీరు కొన్న టీవీకి అదనపు డబ్బులు ఇమ్మని అడిగితే ఇస్తారా? అర్ధం లేని చార్జీలతో పరిశ్రమలు కుదేలవుతున్నాయి. సర్దుబాటు చార్జీలను వెంటనే రద్దు చేయాలి’ అని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కర్నూలులో శుక్రవారం నిర్వహించిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో పారిశ్రామికవేత్తలు కరాఖండిగా చెప్పారు. ప్రజలు కూడా విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంధన సర్దుబాటు చార్జీలకు అంతమనేదే లేదా? అంటూ అనంతపురానికి చెందిన చంద్రశేఖర్ సహా పలువురు నిలదీశారు. పెంచిన చార్జీలు ప్రజలు కాదు.. ప్రభుత్వమే భరించాలని అందరూ స్పష్టం చేశారు. మూడు రోజుల్లో 94 అభ్యంతరాలు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రూ.15,485 కోట్లకు సమర్పించిన 2025–26 ఆరి్థక సంవత్సరం ఆదాయ అవసరాల నివేదికలపై ఏపీఈఆర్సీ ఏపీఈఆర్సీ ఇన్చార్జి చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్, సభ్యుడు పీవీఆర్ రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడలో, శుక్రవారం కర్నూలులోని ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో బహిరంగ విచారణ జరిపారు. మధ్యాహ్నం వరకూ అభ్యంతరాలను వినిపించడానికి ఎంచుకున్నవారికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆన్లైన్లో లేదా సమీపంలోని డిస్కం సర్కిల్, డివిజన్ కార్యాలయాల నుంచి మాట్లాడేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పించారు. ఈ మూడు రోజుల్లో వివిధ వర్గాలకు చెందిన 94 మంది వారి అభ్యంతరాలను మండలి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల అభ్యంతరాలపై డిస్కంల సీఎండీలు వివరణ ఇచ్చారు. ఏపీఈఆర్సీ, ఇంధనశాఖ విరుద్ధ ప్రకటనలు టారిఫ్ పెంపుదలపై డిస్కంలు ఎలాంటి ప్రతిపాదన చేయలేదని, అయితే వారు చూపించిన రెవెన్యూలోటు రూ. 14,683 కోట్లను ప్రభుత్వం భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్ తెలిపారు. అయితే ఇంధనశాఖ మాత్రం రెవెన్యూ లోటు తాము భరిస్తామని చెప్పలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ రాయితీలకు కట్టుబడి ఉన్నామని, తద్వారా డిస్కంల రెవెన్యూ లోటు తగ్గించేందుకు మాత్రమే సాయపడతామని చెప్పినట్లు ఇంధన శాఖ డిప్యూటీ కార్యదర్శి బీఏవీపీ కుమారరెడ్డి వెల్లడించారు. ప్రజల అభ్యంతరాలు, డిస్కంల వివరణను పరిశీలించి ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ ఆర్డర్‌ను ఖరారు చేస్తామని చైర్మన్ చెప్పారు.»పారిశ్రామిక విద్యుత్ (హెచ్‌టీ) వినియోగదారులు ఏటా ఆర్థిక సంవత్సరం చివర్లో ఆడిట్ నివేదికలు సమర్పిస్తాయి. ఏడాది ముగిసిన తరువాత పాత వినియోగంపై అదనంగా బిల్లులు వేస్తే చెల్లించడం ఎలా సాధ్యం? – అమర్‌రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ప్రతినిధి కుమార్ రాజా » ట్రూ అప్ చార్జీలు న్యాయ సూత్రాలకు విరుద్ధం. అదనపు చార్జీలు వేయడంపై ఉన్న శ్రద్ధ నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలో కనిపించడంలేదు. విద్యుత్ లైన్లు తెగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పాతపడ్డ లైన్లను మార్చడంలేదు. – కడప జిల్లా కమలాపురానికి చెందిన అశోక్‌కుమార్‌రెడ్డి » ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులోనే ఉండాలి. పీక్ లోడ్ అవర్స్ కింద రూపాయి అదనంగా వసూలు చేస్తున్నారు. అది కాకుండా అదనంగా 4 రకాల చార్జీలు వేస్తున్నారు. ఏది ఎందుకో తెలియడంలేదు. – కర్నూలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి రామచంద్రారెడ్డివామపక్షాల ఆందోళనమరోవైపు కర్నూలులోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో విద్యుత్ టారిఫ్‌లపై బహిరంగ విచారణ సమయంలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. సీఎం చంద్రబాబు విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పి ఒకేసారి రూ.15 వేల కోట్ల భారం మోపుతున్నారని వామపక్షాలు మండిపడ్డాయి. ప్రజలపై అదనపు విద్యుత్ భారాలు వేయొద్దని, ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను పెట్టవద్దని డిమాండ్ చేశాయి. సీపీఎం నాయకుడు, ఎండీ ఆనందబాబు, సీపీఐ నాయకుడు పి.రామకృష్ణారెడ్డి, సీపీఐ (ఎంఎల్) నాయకుడు భాస్కర్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. -
AP: డిస్కంల లోటు రూ.14,683.24 కోట్లు
సాక్షి, అమరావతి: వచ్చే (2025–26) ఆర్థిక సంవత్సరానికి ఆదాయం, రాబడికి మధ్య వ్యత్యాసం రూ.14,683.24 కోట్లుగా డిస్కంలు అంచనా వేశాయి. ఈ మేరకు ఆదాయ, అవసరాలు (ఏఆర్ఆర్), ప్రతిపాదిత టారిఫ్ (ఎఫ్‌పీటీ) నివేదికలను అంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెల 30న ఏపీఈఆర్సీకి సమర్పించాయి. ఆ ప్రతిపాదనలను ఏపీఈఆర్సీ తన వెబ్సైట్లో శుక్రవారం ప్రజలకు అందుబాటులో ఉంచింది. డిస్కంలు పేర్కొన్న లెక్కల ప్రకారం.. వచ్చే ఏడాది మొత్తం రూ.58,868.52 కోట్ల వ్యయం అయితే, టారిఫ్ యేతర ఆదాయ మొత్తాలను కలుపుకుని విద్యుత్ విక్రయం ద్వారా రూ.44,185.28 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశాయి. ఫలితంగా రూ.14,683.24 కోట్ల లోటు ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. అదేవిధంగా 75,926.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయం జరుగుతుందని, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25 (73,053.78 మిలియన్ యూనిట్లు) కంటే 3.93 శాతం ఎక్కువని డిస్కంలు నివేదికలో చెప్పాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11,299.49 మిలియన్ యూనిట్ల కంటే 14.4 శాతం ఎక్కువగా 12,927 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుందని అంచనా వేశాయి. ప్రస్తుత టారిఫ్ ప్రకారం డిస్కంల ఆదాయ అంతరాన్ని తీర్చడానికి వచ్చే ఏడాది మొత్తం రూ.14,683.24 కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆమోదించబడిన సబ్సిడీ (రూ.13,769.85 కోట్లు) కంటే ఇది 6.6 శాతం పెరిగింది. విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ.4.80 అవుతుందని నివేదికలో పొందుపరిచాయి. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు 10.03 శాతంగా ప్రతిపాదించాయి. విద్యుత్ సరఫరా సగటు వ్యయం యూనిట్ కు రూ.7.75 పేర్కొనగా.. రాబడి మాత్రం యూనిట్‌కు రూ.5.82 ఉంటుందని డిస్కంలు భావిస్తున్నాయి. డిస్కంలు ఇచ్చిన ఈ ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి టారిఫ్ ప్రకటిస్తుంది. కొత్త టారిఫ్ ప్రకారం విద్యుత్ చార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. -
AP: బాదుడే.. బాదుడు.. ఇప్పుడు రూ. 9,412 కోట్లు
సాక్షి, అమరావతి/కర్నూలు న్యూసిటీ: కూటమి పాలనలో ప్రజలపై రెండో సారి భారీ విద్యుత్ చార్జీల భారం పడింది. రూ.9,412.50 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయనుంది. దీని ద్వారా ప్రతి యూనిట్‌కు రూ.0.92 అదనపు భారం ప్రజలపై పడుతుంది. డిసెంబర్ వినియోగం నుంచే అంటే జనవరి నుంచి ప్రభుత్వం ఈ చార్జీలు వసూలు చేస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం దీపావళి పండుగకే రాష్ట్ర ప్రజలపై రూ.6,072.86 కోట్ల భారం వేసింది. ఈ చార్జీలను యూనిట్‌కు రూ.1.27 చొప్పున ఈ నెల నుంచి వసూలు చేస్తున్నారు. తాజా చార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్‌కు రూ.2.19 అదనంగా వినియోగదారులు చెల్లించాలి. గతంలో వేసిన రూ.6.072.86 కోట్లు, తాజాగా వసూలు చేస్తున్న రూ.9,412.50 కోట్లు కలిపి మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల భారం ప్రజలపై మోపింది. రూ.0.92 వరకూ అదనం 2023–24 సంవత్సరానికి రూ.12,844.88 కోట్ల సర్దుబాటు చార్జీల వసూలుకు డిస్కంలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. అందులో రూ.3,432.38 కోట్లు తగ్గించి, రూ.9,412.50 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఏపీఈఆర్సీ అనుమతించింది. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు దాదాపు రూ.0.91, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో రూ.0.92, ఏపీఈపీడీసీఎల్‌లో పరిధిలో రూ.0.90 చొప్పున వినియోగదారుల నుంచి 24 నెలల్లో వసూలు చేసుకోమని డిస్కంలకు ఏపీఈఆర్సీ చెప్పింది. మాట మార్చడం.. మాట తప్పడమే బాబు నైజం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం, రకరకాల మాయ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఓట్లేసిన ప్రజలనే ముంచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మాట మార్చడం.. మాట తప్పడమే ఆయన నైజం. ఇటీవలి ఎన్నికల్లో ఆయనిచ్చిన సూపర్ సిక్స్ హామీలు, కరెంటు చార్జీలు పెంచబోమంటూ చెప్పిన మాటలను తుంగులో తొక్కేసి ఆయన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి చోటా మైకు పట్టుకొని గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందంటూ అబద్ధాలాడేశారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని, అవసరమైతే వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి ఐదు నెలలు తిరక్కుండానే చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పాను’ అంటూ నాలుక మడతెట్టేశారు. విద్యుత్ చార్జీలపై బాబు వంచనకు మచ్చు తునకలు కొన్ని.. 19 మార్చి 2019, కడప : కరెంటు కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచేది లేదన్నాం. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలూ ఇస్తున్నాం. భవిష్యత్‌లో ఎంత కావాలంటే అంత కరెంట్ ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా. 27 మే 2020, టీడీపీ మహానాడు : కరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పాం. ఐదేళ్లు కరెంటు చార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. దానివల్ల రానున్న రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందుకు వెళితే.. మీరు (జగన్) పవర్ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. 10 ఆగస్ట్ 2022, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించే వాళ్లం. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. జగన్ అధికారం చేపట్టిన మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. విద్యుత్ చార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. 16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం : తమ్ముళ్లూ.. ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా? ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడైనా కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2 ఆగస్ట్, 2023, పులివెందుల : కరెంట్ చార్జీలను పెంచను.. తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్ పెంచారు. వినూత్న ఆలోచనతో 2000లో కరెంట్ సంస్కరణలు తెచ్చి 2004కు మిగులు విద్యుత్ తెచ్చా. ఎండతో కరెంటు వస్తుంది. సోలార్ నేనే తీసుకొచ్చా. రూ.14 ఉండే కరెంటు రూ.2కు వచ్చి0ది. ఎండతో, గాలితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే రూ.2 నుంచి రూ.3కే కరెంట్ వస్తుంది. రానున్న ఐదేళ్లలో కరెంట్ చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తెస్తా. గ్రిడ్‌కు కనెక్ట్ చేసి మిగులు విద్యుత్‌ను వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా. 16 ఆగస్ట్ 2023, విజన్ డాక్యుమెంట్ విడుదల, విశాఖపట్నం : రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం. వీలైతే తగ్గిస్తాం. 90వ దశకం చివరిలో విద్యుత్ రంగంలో సంస్కరణలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఉత్పత్తి విధానాలతో యూనిట్ ధర రూ.8 నుంచి రూ.2కు పడిపోయింది. హైడ్రోజన్, అమ్మోనియా హబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. 4 మార్చి 2024, పెనుగొండ : ఎవరి మార్కు ఎంత అని అడుగుతున్నాడు.. నేను చెబుతున్నా జగన్.. నీ మార్కు తెలుసుకో. రూ.200 ఉండే కరెంటు బిల్లు రూ.800 చేయడం నీ మార్కు. కరెంటు చార్జీల బాదుడు నీ మార్కు. నేడు ఏఆర్ఆర్ సమర్పించనున్న డిస్కంలు 2025–26 సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్, రిటైల్ సప్లై బిజినెస్ ప్రపోజల్స్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) శనివారం ఏపీఈఆర్సీకి సమర్పించనున్నాయి. తమ పరిధిలోని నివేదికలతో డిస్కంల సీఎండీలు ఏపీఈఆర్సీ ముందు హాజరుకానున్నారు. -
డిస్కంల దివాలా బాట!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఏటేటా నష్టాల్లో కూరుకుపోతు న్నాయి. అత్యధిక నష్టాలున్న డిస్కంలు కలిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నది. దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని డిస్కంలకు కలిపి 2015–16లో రూ.3,74,099 కోట్ల నష్టాలు ఉండగా.. 2022–23 నాటికి అవి రూ.6,76,681 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో తెలంగాణ డిస్కంల నష్టాలు రూ.16,520 కోట్ల నుంచి రూ.60,922 కోట్లకు ఎగబాకాయి. రాజ్య సభలో ఎంపీ సంజయ్‌కుమార్ ఝా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. ప్రభుత్వరంగ డిస్కంల నష్టాల్లో రూ.1,62,507 కోట్లతో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. రూ.92,070 కోట్ల నష్టాలతో రాజస్థాన్, రూ.91,632 కోట్ల నష్టాలతో ఉత్తరప్రదేశ్, రూ.64,843 కోట్ల నష్టాలతో మధ్యప్రదేశ్ వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నాయి. లాభాల్లో ప్రైవేటు.. నష్టాల్లో సర్కారీ సంస్థలుదేశంలోని ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి దివాలా అంచున నిలువగా, ప్రైవేటు రంగ డిస్కంలు మాత్రం లాభాల్లో దూసుకుపోతున్నాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగ డిస్కంల లాభాలు రూ.12,146 కోట్లు ఉండగా.. 2022–23 నాటికి రూ.23,116 కోట్లకు పెరిగాయి. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 12 ప్రైవేటు డిస్కంలు ఉండగా, అవన్నీ లాభాల్లోనే నడుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 42 డిస్కంలు ఉండగా.. గుజరాత్‌లోని మూడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్లో ఒక్కో డిస్కం కలిపి మొత్తం ఐదు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మిగిలిన 37 ప్రభుత్వ రంగ డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయి. మోయలేని అప్పుల్లో దక్షిణ తెలంగాణ డిస్కంతెలంగాణలో రెండు ప్రభుత్వ రంగ డిస్కంలున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) నష్టాలు 2015–16లో రూ.10,625 కోట్లు ఉండగా, 2022–23 నాటికి రూ.42,330 కోట్లకు చేరాయి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) నష్టాలు ఇదే కాలంలో రూ.5,895 కోట్ల నుంచి 2022–23 నాటికి రూ.18,592 కోట్లకు పెరిగాయి. భారీగా పెరిగిన అప్పులుదేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ డిస్కంల అప్పులు 2015–16లో రూ.4,08,941 కోట్లు ఉండగా, 2022–23 నాటికి రూ.6,61,263 కోట్లకు పెరిగాయి. ఇదేకాలంలో తెలంగాణ డిస్కంల అప్పుల రూ.13,944 కోట్ల నుంచి రూ.35,883 కోట్లకు పెరిగాయి. దేశంలోని డిస్కంల పరిస్థితి» మొత్తం ప్రభుత్వరంగ డిస్కంలు 42» నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ డిస్కంలు 37» 2022–23 నాటికి సర్కారు డిస్కంల నష్టాలు రూ.6,76,681 » లాభాల్లో ఉన్నవి 5» దేశంలో మొత్తం ప్రైవేటు డిస్కంలు 12» లాభాల్లో ఉన్న ప్రైవేటు డిస్కంలు 12 -
ఏది నిజం?: సౌర విద్యుత్ మేమే ఇస్తాం
‘‘చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక ధరలకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పటికి మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేశారు. ఒకపక్క మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ చంద్రబాబు దాన్ని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకోవడంలో ఆంతర్యమేమిటి? అది కదా అసలు సిసలైన కుంభకోణం..! దీన్ని ప్రశ్నించే సాహసం ఈనాడు ఏనాడైనా చేసిందా?’’‘‘అసలు అదానీతో ఒప్పందం చేసుకోవాలనిగానీ, భారీగా లంచాలు పొందాలనిగానీ అప్పటి ప్రభుత్వం అనుకుంటే సంస్థలతోనే నేరుగా చేసుకునేవారు గానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఎందుకు చేసుకుంటారు? ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేట్ సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదా?’’రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే టెండర్లు పిలిచినా వాటిపై చట్టపరంగా సమస్యలు వచ్చాయి. ఆ తరుణంలో కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని లేఖ రాసింది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌పై ముందుచూపు, రైతులకు 25 ఏళ్ల పాటు మంచి చేయాలనే జగన్ సర్కారు సంకల్పాన్ని అభినందిస్తూ నాడు సెకీ లేఖ రాసింది. డిస్కమ్‌లపై ఆర్థిక భారం పడకుండా, రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. అదే సెకీ విద్యుత్ తీసుకోకపోతే అప్పటికే పిలిచిన టెండర్ల కేసు కోర్టులో ఎప్పటికి తేలుతుందో తెలియదు. అది తేలే నాటికి పరికరాల రేట్లు, విద్యుత్ ధరలు ఎంతగానో పెరిగేవి. అప్పుడు ఇదే ఈనాడు, ఇతర ఎల్లో మీడియా తక్కువకు ఇస్తామన్నా సెకీ విద్యుత్‌ను ఎందుకు తీసుకోలేదని బురద చల్లేవి కాదా?సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అవలంభిస్తున్న వినూత్న విధానాలు, చూపిస్తున్న చొరవకు స్పందిస్తూ తామే పాతికేళ్లపాటు రాష్ట్రానికి చవగ్గా సౌర విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తనకు తానే ముందుగా ప్రతిపాదించింది. అందుకు 2021 సెపె్టంబర్ 15న సెకీ రాసిన లేఖే తిరుగులేని ఆధారం. వేరే ప్రయత్నాలు అవసరం లేదని, అతి తక్కువ ధరకు యూనిట్ రూ.2.49కి తామే అందిస్తామంటూ సెకీనే ఆరోజు రాష్ట్రానికి లేఖ రాసింది. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన పునరుత్పాదక విద్యుత్‌ను.. అదీ డిస్కంలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అందించాలనే జగన్ వినూత్న ఆలోచనను కేంద్ర సంస్థ ఆ లేఖలో కొనియాడింది. సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలిచిందనే విషయం తమకు తెలిసిందని, అయితే తామే చౌక ధరకు సోలార్ విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు సరఫరా చేస్తామని ఆ లేఖలో తెలిపింది. 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2025 సెపె్టంబర్లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తం 9 వేల మెగావాట్లు ఇస్తామని వివరించింది. 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి రాష్ట్రానికి మినహాయింపు కూడా ఇస్తామని చెప్పింది. తామిచ్చే టారిఫ్ యూనిట్ రూ.2.49 వల్ల వ్యవసాయ విద్యుత్‌కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని పేర్కొంది. అదే విధంగా 9 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చులు, భూమి కూడా మిగులుతాయని, వాటిని రాష్ట్రం ఇతర అభివృద్ధి, ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించింది. డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గుతాయని వెల్లడించింది. తమ ప్రతిపాదనకు అంగీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ఏపీ మద్దతు ఇచ్చినట్టవుతుందని కూడా చెప్పింది. వెంటనే సానుకూల నిర్ణయాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే స్వయంగా విద్యుత్ ఇస్తామంటూ ముందుకు వచ్చిన ఈ వ్యవహారంలో స్కామ్‌కు ఆస్కారమే ఉండదన్నది స్పష్టం. ఇందులో ముడుపుల అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విషయం ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది. కేంద్రం ఇంతగా చెప్పాక ఎవరైనా కాదంటారా..! చంద్రబాబు కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల డిస్కమ్‌లపై తీవ్ర ఆర్ధిక భారం పడింది. దీనివల్ల ప్రభుత్వంపై రాయితీ భారం కూడా పెరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్రంలో సోలార్ పార్క్‌లను అభివృద్ధి చేయాలని 2020లో గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో 2020 నవంబర్‌లో 6,400 మెవాగాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జీఈసీఎల్) టెండర్లు పిలిచింది. చదవండి: నిజాలకు పాతరేసి.. నిస్సిగ్గుగా నిందలా!యూనిట్ రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొస్తూ 24 బిడ్లు దాఖలు అయ్యాయి. అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ రద్దయింది. అదే సమయంలో అతి చౌకగా విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వమే ఇంత స్పష్టంగా చెప్పాక ఏ రాష్ట్రమైనా ఎందుకు వద్దంటుంది? పైగా, ఈ విద్యుత్ తీసుకొంటే ఆరి్థకంగా, ఇతరత్రా పలు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని ఏ రాష్ట్రమూ వదులుకోదు. ఒక వేళ వద్దంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా?తక్కువకు ఇస్తామని కేంద్రమే ముందుకు వస్తే ఎందుకు తీసుకోవడంలేదని, దాని వెనుక రాష్ట్ర ప్రయోజనాలకంటే వేరే కారణాలున్నాయంటూ గోల పెట్టేవి. ఇదే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తప్పు బడుతూ కథనాలు రాసేది. అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే కేంద్ర ప్రతిపాదనను మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. మంత్రులంతా ఏకగ్రీవంగా సెకీ ఒప్పందానికి అంగీకారం తెలిపారు. చదవండి: చంద్రబాబుకు ఆ ఒప్పందాలను రద్దు చేసే దమ్ముందా?అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెకీతో ఒప్పందాలకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల ఆమోదం కూడా లభించింది. ఈ ఒప్పందాల్లో ఎక్కడా అదానీ గ్రూపునకు చెందిన సంస్థలతోగానీ అనుబంధ కంపెనీలతోగానీ ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఇక అవినీతి ఎక్కడుంది? అసలు లంచాలకు ఆస్కారం ఏముంది? -
నిజాలకు పాతరేసి.. నిస్సిగ్గుగా నిందలా!
‘‘రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ జరగలేదు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా?’’సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై గత సర్కారు దూరదృష్టి, సోలార్‌పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అంతేకాకుండా అప్పటికి యూనిట్ రూ.5.10 చొప్పున కొంటున్నారు. సెకీ విద్యుత్ తీసుకోకపోతే ఏటా రూ.3,750 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ తీసుకోకుంటే ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసేది? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది? అదానీతో దీనికి ఏం సంబంధం? ఇక సెకీ రాసిన లేఖకు కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి, రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి సైతం ఆమోదం తెలిపాయి. ఇవి రెండూ కేంద్ర సంస్థలే. ఆ ఒప్పందంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టే అనుమతిచ్చాయి. ఇంత గగ్గోలు పెడుతున్న ఎల్లో మీడియా చంద్రబాబు అత్యధిక ధరలతో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటే ఏనాడైనా కనీసం ఒక్క కథనమైనా రాసిందా? అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దాన్ని జగన్‌కు ముడిపెట్టి విషప్రచారం చేస్తూ.. టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు పుంఖాను పుంఖాలుగా అసత్యాలను వండి వార్చింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికున్న అశేష జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని బెంబేలెత్తుతున్న ఈనాడు ఎక్కడో అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్ధాన్ని అచ్చేసింది. వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థ..సెకీ ‘ట్రిపుల్ ఏ’ రేటింగ్ కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ నుంచి నేరుగా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకునేలా ఒప్పందం చేసుకుంటేనే ఇన్ని నిందలేస్తున్న ఈనాడు ఇక చంద్రబాబులా ఏ ప్రైవేట్ కంపెనీలతోనో డీల్ కుదుర్చుకుంటే ఇంకెంత శివాలెత్తిపోయేదో! గత ప్రభుత్వం ఇలాంటి వాటికి ఎక్కడా ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. నేరుగా సెకీతో ఒప్పందం చేసుకుంది. దీంతో బురద జల్లడానికి రంధ్రాన్వేషణ మొదలెట్టిన ఈనాడు... గత ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంటే అది అదానీతో కుదుర్చుకున్నట్లు, అందుకోసమే ఆ కంపెనీ జగన్‌కు లంచాలిచ్చినట్లు దిగజారుడు రాతలకు తెగబడింది. ఇంతకన్నా దివాలాకోరుతనం ఇంకేమైనా ఉంటుందా? దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా పరిగణిస్తూ.. దానికి అహర్నిశం పాటుపడిన జగన్‌పై బురద జల్లుతున్న ఎల్లో మీడియా విషపూరిత కథనాలను ఏమనుకోవాలి? తప్పయితే ‘సీఈఆర్సీ, ఏపీఈఆర్సీ’ ఎందుకు అనుమతిస్తాయి?2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీతో ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. దీంతో సెకీ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విద్యుత్ కొనుగోలు మొదలు కావాల్సి ఉంది. అన్నీ పరిశీలించాక కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా దీన్ని ఆమోదించింది. సెకీ విద్యుత్‌కు అంతర్ రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు ఉండవని ఈ ఏడాది ఆగస్టు 13న ఏపీఈఆర్సీ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అంతకు ముందే అంటే 2021 జనవరి 15నే వెల్లడించింది. మరి ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాల్లో అత్యున్నత న్యాయ సంస్థలు అనుమతించిన ఒప్పందం తప్పంటారా? ఏదైనా అవినీతి జరిగి ఉంటే అక్కడే తేలిపోయేది కదా?చదవండి: సౌర విద్యుత్ ఇస్తామని చెప్పింది సెకీనేఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతుంటే నష్టమంటారా? ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.5.10 చొప్పున అవుతోంది. సెకీ విద్యుత్ మాత్రం యూనిట్ రూ.2.49కే వస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఎన్టీపీసీ ఇస్తున్న సౌర విద్యుత్ ధర కూడా ట్రేడింగ్ మార్జిన్ కలిపి యూనిట్‌కు రూ.2.79 అవుతోంది. ఎలా చూసినా సెకీ విద్యుత్ తక్కువకే వస్తోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్ల మేరకు ఆదా అవుతోంది. కానీ ఈనాడు మాత్రం పాతికేళ్లలో రూ.1.10 లక్షల కోట్లు నష్టమంటూ నోటికొచ్చిన లెక్కలు రాసుకొచ్చింది. ఆ తప్పుడు లెక్కల వెనుక అసలు ఆంతర్యాన్ని ప్రజలు గ్రహించలేరనుకుంటోంది.ప్రయోజనాలు ఎక్కువ గనుకే ఒప్పందం..సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. అదే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే పాతికేళ్లు సెంట్రల్ గ్రిడ్ చార్జీలను చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులను నెలకొల్పితే వాటికి కావాల్సిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయటం తప్పనిసరి. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్రసార వ్యవస్థలపై దీనికోసం పెట్టాల్సిన ఖర్చును బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే తక్కువ వ్యయం అవుతోంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత సెకీ ప్రతిపాదనకు గత మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సెకీ ధర కన్నా ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయంటూ ఈనాడు రాసుకొచ్చింది. రాజస్థాన్‌లో ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ఇస్తున్న విద్యుత్ యూనిట్ రూ.2.01. కానీ అక్కడ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 23.5 శాతం. ఏపీలో ఇది 17.5 శాతమే. మరి ధరలో మార్పులుండవా?యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుదిటీడీపీ హయాంలో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్‌డౌన్ ఛార్జీలతో కలిసి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుది! అయినా సరే ఈనాడుకు అది ఏనాడూ కనపడకపోవడం విచిత్రం! ఇక పవన విద్యుత్తుకైతే యూనిట్‌కు రూ.4.84 వరకు అదనంగా పెట్టి నామినేషన్ పద్ధతిలో పీపీఏలు చేసుకున్నారు. పోటీ బిడ్డింగ్ లేనేలేదు. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 17,731 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. అందులో 12,190 మెగావాట్లు థర్మల్, 275.78 మెగావాట్లు ఇతర విద్యుత్ కాగా మిగిలింది పునరుత్పాదక విద్యుత్. 2014 జూన్‌లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు రెండింటి మొత్తం గరిష్ట డిమాండ్ 13,404 మెగావాట్లు మాత్రమే. అయినా సరే టీడీపీ ప్రభుత్వం నాడు హడావుడిగా 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకుంది. ‘ఈనాడు’కు ఇదంతా దోచిపెట్టినట్లుగా కనిపించకపోవటం చిత్రమే! చంద్రబాబు స్వప్రయోజనాల కోసం కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలపై ఏటా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అది కూడా దశాబ్దాల పాటు భరించాలి. ప్రస్తుత విలువ ప్రకారం డిస్కంలు రూ.35 వేల కోట్లకు పైనే చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలపై ప్రత్యక్షంగా, ప్రజలపై పరోక్షంగా ఇంత పెద్ద భారాన్ని మోపడానికి చంద్రబాబు సిద్ధపడ్డారంటే దాన్ని మించిన కుంభకోణం ఇంకేముంటుంది? -
తెలంగాణ: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరణ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించింది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు రూ. 10 నుంచి రూ. 50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్ ఆమోదించలేదు. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. ‘‘అన్ని పిటిషన్లపై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించింది. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నాం. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదు. స్థిర చార్జీలు రూ.10 యధాతధంగా ఉంటాయి. పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేదు. హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశాం.132కేవీఏ, 133కేవీఏ, 11కేవీలలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయి. లిఫ్ట్ ఇరిగేషన్‌కు కమిషన్ ఆమోదించింది. టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ ఆవర్‌లో రూపాయి నుంచి రూపాయిన్నర రాయితీ పెంచాం. చేనేత కార్మికులకు హార్స్ పవర్‌ను పెంచాం. హెచ్‌పీ 10 నుంచి హెచ్‌పీ 25కి పెంచాం.గృహ వినియోగదారులకు మినిమమ్ చార్జీలు తొలగించాం. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు కమిషన్ ఆమోదించింది. ఆర్ఎస్పీ ఇవి కేవలం ఐదు నెలల వరకే ఉంటాయి. రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. రూ.1,800 కోట్లు ప్రపోజల్స్ ఇచ్చారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే.. ఈఆర్సీ రూ.54,183.28 కోట్లు ఆమోదించింది’ అని వివరాలు వెల్లడించారు.చదవండి: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు -
నేడు కరెంట్ చార్జీల పెంపుపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన 9 వేర్వేరు పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ మేరకు వేర్వేరు టారిఫ్ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యల ఐదేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగియనుండగా, ఒకరోజు ముందు ఈ పిటిషన్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రంలో రూ.1,200 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) దాఖలు చేసిన ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) పిటిషన్లతో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ) పిటిషన్లపై ఈఆర్సీ ప్రకటించనున్న నిర్ణయం కీలకం కానుంది. దీంతో నవంబర్ 1 నుంచి వినియోగదారులపై ప్రత్యక్షంగా చార్జీల పెంపు భారం పడబోతోంది. హెచ్‌టీ కేటగిరీలో ఎనర్జీ (విద్యుత్) చార్జీల పెంపు, లోటెన్షన్ (ఎల్టీ) కేటగిరీలో నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే వారి ఫిక్స్డ్ చార్జీ (డిమాండ్ చార్జీ)ల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. హెచ్‌టీ కేటగిరీకి ఎనర్జీ చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్డ్ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి రూ.800 కోట్లు భారం వేసేందుకు అనుమతి కోరాయి. మరో రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారులకు ఫిక్స్డ్ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. అలాగే జెన్కో 2022–23కి సంబంధించి దాఖలు చేసిన రూ.963.18 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్‌తో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన ఎంవైటీ పిటిషన్‌పై సైతం ఈఆర్సీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. వీటితో భవిష్యత్తులో వినియోగదారులపై పరోక్షంగా చార్జీల పెంపు భారం పడనుంది. రూ.16,346 కోట్ల ట్రాన్స్‌కో ఏఆర్ఆర్పై రేపుట్రాన్స్కో దాఖలు చేసిన 2024–29 మధ్యకాలానికి ట్రాన్స్మిషన్ బిజినెస్, ఎస్ఎల్డీసీ యాక్టివిటీకి సంబంధించిన రెండు ఎంవైటీ పిటిషన్లపై ఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.16,346.1 కోట్ల ఆదాయ అవసరాలున్నట్టు అంచనా వేస్తూ ఆ మేరకు ట్రాన్స్మిషన్ చార్జీలను కొంతవరకు పెంచి వసూలు చేసుకోవడానికి ట్రాన్స్‌కో ప్రతిపాదించింది. -
బాబు మార్కు ‘షాక్’!
సాక్షి, అమరావతి: జనం భయపడినట్లుగానే జరిగింది. కూటమి ప్రభుత్వం అనుకున్నట్లుగానే చేసింది. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం వేయం.. వేయం.. అని చెబుతూనే భారీగా వడ్డిస్తోంది. చార్జీలు పెంచేది లేదని ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు ఈ చార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇచ్చిన మాట తప్పి ఏకంగా రూ.6,072.86 కోట్ల సర్దు బాటు చార్జీల షాక్ ఇచ్చింది. ప్రతి యూనిట్‌పై గరిష్టంగా రూ.1.58.. 15 నెలల పాటు ప్రజల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ చార్జీలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలోనే ఇలా ఉంటే ఇక రానున్న నాలుగున్నరేళ్లు ఎలా ఉంటుందోనని జనం భయపడిపోతున్నారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, ప్రజలపై భారం లేకుండా ప్రభుత్వమే భరించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం దిగి రాకపోతే ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. స్పందించని ప్రభుత్వం ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీలు రూ.8,113.60 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కంలు ప్రతిపాదించాయి. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్విసుల నుంచి రూ.1,901 కోట్లు, పారిశ్రామిక సర్విసుల నుంచి రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్విసుల నుంచి రూ.669 కోట్లు, సంస్థల (ఇన్స్టిట్యూషన్స్) నుంచి రూ.547 కోట్లు చొప్పున విద్యుత్ బిల్లుల్లో అదనంగా వసూలు చేసుకుంటామని అడిగాయి. ప్రతి నెల ఒక్కో బిల్లుపైనా యూనిట్‌కు రూ.1.27 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. ఈ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే 75 శాతం భారం భరించాల్సి ఉంటుందని డిస్కంలు స్పష్టం చేశాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ఈ నెల 18న బహిరంగ విచారణ చేపట్టింది. ప్రభుత్వమే ఈ చార్జీలను భరించాలని, ప్రజలపై వేయడానికి వీల్లేదని ఆ విచారణలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు కోరారు. వారం రోజుల పాటు ప్రభుత్వ స్పందన కోసం ఏపీఈఆర్సీ ఎదురు చూసింది. చార్జీలు భరించేందుకు కూటమి సర్కారు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో రూ.6,072.86 కోట్ల సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. ఇందులో రైతులు, వివిధ వర్గాల వారికి ఉచితంగా, సబ్సిడీగా ఇచ్చిన విద్యుత్‌పై దాదాపు రూ.1,400 కోట్లు భారం పడనుంది. దానిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవాల్సిందిగా డిస్కంలకు ఏపీఈఆర్సీ సూచించింది. ప్రభుత్వం నుంచి ఆ మేరకు వస్తే మిగిలిన రూ.4,672.86 కోట్లు ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంమీద డిస్కంలు అడిగిన దానిలో రూ.2,042 కోట్లు తక్కువకు అనుమతించామని మండలి తెలిపింది. గతం అంతా షాక్‌ల చరిత్రే » చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేది మరొకటి అనేది మరోసారి రుజువైంది. అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా డిస్కంలను అప్పుల పాలు చేసిన చంద్రబాబు పాపాల వల్లే ప్రజలపై చార్జీల భారం పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచమని ప్రకటించారు. కానీ ఆ మాట తప్పడానికి ఐదు నెలలు కూడా పట్టలేదు. » చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యుత్ చార్జీల విషయంలో, విద్యుత్ రంగం విషయంలో ఇలాంటి కుట్రలే చేస్తుంటారు. గతంలో ఏపీఈఆర్సీని తప్పుదోవ పట్టించారు. డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలు సమర్పించకుండా అడ్డుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే రూ.140.10 బిల్లు వచ్చేది. 2018–19కి వచ్చే సరికి ఇదే వినియోగానికి వచ్చిన బిల్లు రూ.197.60. అంటే 41.04 శాతం పెరిగింది. అదే విధంగా 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. »గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత టీడీపీ హయాంలో ఉండేది. నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. సగటు యూనిట్ సేవా వ్యయం కూడా రూ.7.17 వసూలు చేసేది. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి, అధిక భారం వేసే విధానాన్ని టీడీపీ సర్కారే గతంలో అమలు చేసింది. » అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధరలకు చంద్రబాబు కుదుర్చుకున్నారు. దాదాపు 8 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై 25 ఏళ్ల పాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అంతిమంగా అదంతా విద్యుత్ వినియోగదారులపైనే పాతికేళ్లు వేయాల్సి వస్తోంది. -
నమ్మి ఓటేస్తే కరెంట్ షాకులా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేయడంపై ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు ) ప్రతిపాదించిన రూ.8,113.60 కోట్ల ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీల భారంపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కర్నూలులో మండలి ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొని అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు 12 మంది సాధారణ ప్రజలు, రాజకీయ పార్టీలు, సంస్థల ప్రతినిధులు వివరాలు నమోదు చేసుకున్నారు. తమకు ఓటేసి అధికారంలోకి తెస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి నేతలు గాలికి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ అప్ చార్జీలు వద్దంటూ సీపీఎం నేతలు విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నా నిర్వహించారు. అభ్యంతరాలపై డిస్కమ్‌ల నుంచి ఏపీఈఆర్సీ వివరణ కోరనుంది. సమాధానాలు రాగానే వారం రోజుల్లోగా చార్జీలపై మండలి నిర్ణయం తీసుకుంటుంది.బాబు పాలనంటేనే ’షాక్’లు..టీడీపీ హయాంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.140.10 బిల్లు రాగా 2018–19లో రూ.197.60కి పెరిగింది. అంటే 41.04 శాతం పెరిగింది. 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం టీడీపీ హయాంలో అమలైంది. నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. సగటు యూనిట్ సేవా వ్యయం కూడా రూ.7.17 వసూలు చేశారు. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులు మార్చి అధిక భారం మోపే విధానాన్ని గతంలో టీడీపీ సర్కారు అమలు చేసింది. అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను నాడు చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్నారు. ఫలితంగా దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో విద్యుత్ సంస్థలపై 25 ఏళ్ల పాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అంతిమంగా అదంతా విద్యుత్ వినియోగదారులపైనే వేస్తున్నారు. అనుమతిస్తే భారం ఇలా..డిస్కమ్‌ల ప్రతిపాదనలకు ఏపీఈఆర్సీ నుంచి ఆమోదం లభిస్తే గృహ విద్యుత్ వినియోగదారులపై రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్వీసులపై రూ.1,901 కోట్లు, పారిశ్రామిక సర్వీసులపై రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్వీసులపై రూ.669 కోట్లు, ఇన్స్టిట్యూషన్స్పై రూ.547 కోట్లకుపైగా విద్యుత్ బిల్లుల భారం పడనుంది. ప్రతి నెల ఒక్కో బిల్లుపై యూనిట్‌కు రూ.1.27 చొప్పున అదనంగా చార్జీలు వేస్తారు. ఒక వేళ ప్రజలపై భారం మోపేందుకు ఏపీఈఆర్సీ అనుమతించకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.8,113.60 కోట్లలో 75 శాతం భరించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని, ప్రజలపైనే ఆ భారాన్ని మోపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ట్రూ అప్ చార్జీల వడ్డనపై ఏపీఈఆర్సీలో విచారణ సర్దుబాటు పేరుతో రూ.8,114 కోట్ల బాదుడుపై నివేదిక సిద్ధం చేసిన డిస్కమ్‌లు కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీల వడ్డనపై ఏపీ డిస్కంలు సిద్ధం చేసిన నివేదికపై వచి్చన అభ్యంతరాలపై ఏపీఈఆర్సీ (ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగులేటరీ కమిషన్)లో విచారణ జరిగింది. శుక్రవారం కర్నూలులోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో మొదటిసారి ఇంధన సర్దుబాటు చార్జీలపై చైర్మన్ నాగార్జునరెడ్డి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ అభ్యంతరాలు/సలహాలు స్వీకరించారు. ఇటీవల డిస్కమ్‌లు రూ.8,114 కోట్ల ఇంధన సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్సీకి నివేదించాయి. ఈ క్రమంలో వచి్చన అభ్యంతరాలు, సలహాలపై విచారణ జరిగింది. దాదాపు 14 సంస్థలు / మంది అభ్యంతరాలు, సలహాలు ఇచ్చారు. త్వరలోనే ఇంధన సర్దుబాటు చార్జీలపై ఈఆర్సీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. -
డిస్కంల నష్టాలు రూ.57,448 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి విద్యుత్ సరఫరాకు చేస్తున్న వ్యయంతో పోలిస్తే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న బిల్లులు, సబ్సిడీల రూపంలో వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో.. విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) నష్టాలు ఏటేటా పేరుకుపోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రంలోని రెండు డిస్కంల నష్టాలు కలిపి మొత్తం రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. అందులో రూ.39,692 కోట్ల నష్టాలు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)వే కాగా, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పిడీసీఎల్) నష్టాలు రూ.17,756 కోట్లు ఉన్నాయి. 2023–24లో రెండు డిస్కంలు మరో రూ.6,299.29 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పిడీసీఎల్ సంస్థలు 2023–24కి సంబంధించిన తమ చివరి త్రైమాసిక నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏటేటా పెరుగుతున్న నష్టాలు: గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, ఇతర అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాలో కీలకమైన డిస్కంలు ఏటేటా భారీ నష్టాలు మూటగట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లకు పెరిగిన డిస్కంల నష్టాలు, 2018–19 ముగిసే నాటికి రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2020 మార్చి 31 నాటికి రూ.రూ.42,292 కోట్లకు ఎగబాకినట్టు తాజాగా డిస్కంలు బహిర్గతం చేసిన వార్షిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2022–23 నాటికి 51,149.98 కోట్లు ఉన్న నష్టాలు 2023–24 నాటికి రూ.57,448 కోట్లకు చేరాయి. రూ.45,241 కోట్లకు చేరిన అప్పులు: రెండు డిస్కంల దీర్ఘకాలిక రుణాలు రూ.23,895.27 కోట్లకు, స్వల్ప కాలిక రుణాలు రూ.21,345.73 కోట్లకు పెరిగాయి. దీంతో డిస్కంల మొత్తం రుణాలు రూ.45,241 కోట్లకు చేరాయి. విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపులతోపాటు ఉద్యోగులకు జీతాల చెల్లింపుల కోసం డిస్కంలు ఎడాపెడా స్వల్పకాలిక రుణాలు తీసుకుంటున్నాయి. దీనికితోడు పంపిణీ వ్యవస్థ సామర్థ్యం పెంపుదల కోసం భారీగా దీర్ఘకాలిక రుణాలు పొందాయి. బకాయిలు రూ.44,744 కోట్లు తెలంగాణ జెన్కో, ఏపీ జెన్కో, సింగరేణి తదితర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కి సంబంధించిన బకాయిలతోపాటు ఇతర అన్ని బకాయిలు కలిపి రెండు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.44,744.3 కోట్లను ఎగబాకాయి. ఇటు అప్పులు, అటు చెల్లించాల్సి ఉన్న బకాయిలు భారీగా పెరిగిపోవడంతో రెండు డిస్కంలు దివాళాబాటలో నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు వెంటిలేటర్‌గా మారి డిస్కంల దీపం ఆరిపోకుండా కాపాడుతున్నాయి. -
హైటెన్షన్ కరెంట్ పిరం!
సాక్షి, హైదరాబాద్: త్వరలో రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. హెచ్‌టీ కేటగిరీలో 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యం .అనే మూడు ఉప కేటగిరీల విద్యుత్ కనెక్షన్లుండగా, మూడింటికి వేర్వేరు చార్జీలు విధిస్తున్నారు. ఇకపై 33 కేవీ, 132కేవీ/ఆపై సామర్థ్యం కనెక్షన్ల చార్జీలను 11 కేవీ కనెక్షన్ల చార్జీలకు సమానంగా పెంచేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించగా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్టు సమాచారం.కొన్ని హెచ్‌టీ కేటగిరీల్లోని 33 కేవీ కనెక్షన్లకు యూనిట్ విద్యుత్‌పై అర్ధరూపాయి వరకు, 132 కేవీ/ఆపై సామర్థ్యం కలిగిన కనెక్షన్లకు రూపాయి వరకు విద్యుత్ చార్జీలు పెరగనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎనీ్పడీసీఎల్) సంస్థలు వారంలోగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను.. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సమర్పించే అవకాశముంది. నవంబర్లోనే సమర్పించాల్సి ఉండగా... విద్యుత్ టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్, ఏఆర్ఆర్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను డిస్కంలు సిద్ధం చేయగా, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అప్పట్లో గడువు పొడిగింపు పొందాయి. ఉత్తర/దక్షిణ డిస్కంలు గత ఆర్థిక సంవత్సరం 2023–24లో రూ.6299.29 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా, వాటి మొత్తం నష్టాలు రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. ఒక్క టీజీఎస్పీడీసీఎల్ నష్టాలే రూ.39,692 కోట్లకు చేరగా, మరో రూ.17,756 కోట్ల నష్టాల్లో టీజీఎన్పిడీసీఎల్ సంస్థ ఉంది. దీంతో చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారులు అంటున్నారు. గృహాలు, వాణిజ్య కేటగిరీలకు పెంపు లేదు లోటెన్షన్ కేటగిరీ పరిధిలోకి వచ్చే గృహాలు, గృహేతర/వాణిజ్య, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా పథకాలు, సాధారణ వినియోగదారుల విద్యుత్ చార్జీలు పెరగవు. హెచ్‌టీలో చార్జీల మోత.. హెచ్‌టీ కేటగిరీలోని సాధారణ పరిశ్రమలు, లైట్స్ అండ్ ఫ్యాన్స్, కోళ్ల ఫారాలు, సీజనల్ పరిశ్రమలు, ఫెర్రో అల్లయ్ యూనిట్లు, ఇతరులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, తాత్కాలిక సరఫరా వంటి వినియోగదారులు వస్తారు. ఈ కేటగిరీల వినియోగదారులు తమ అవసరాల మేరకు 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యంతో విద్యుత్ కనెక్షన్లను కలిగి ఉన్నారు. 11 కేవీ కనెక్షన్‌తో సమానంగా సంబంధిత 33 కేవీ, 132 కేవీ/ఆపై కనెక్షన్ల చార్జీలను పెంచే అవకాశముంది.11 కేవీ కనెక్షన్ల చార్జీలు ఇప్పటికే అధికంగా ఉండడంతో యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. హెచ్‌టీ కేటగిరీలోని పారిశ్రామికవాడలు, ఆధ్యాతి్మక స్థలాలు, సాగునీటి పథకాలు, తాగునీటి పథకాలు, రైల్వే ట్రాక్షన్, మెట్రో రైలు, టౌన్ షిప్పులు/రెసిడెన్షియల్ కాలనీలు, చార్జింగ్ స్టేషన్లకు సంబంధించిన 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యమున్న కనెక్షన్లకు ఒకే తరహా చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో వీటికి చార్జీల పెంపు వర్తించకపోవచ్చు. -
కొత్త సర్కిళ్లు ఎంతెంత దూరం?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు దాదాపు 1.92 కోట్ల విద్యుత్ వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. గత ప్రభుత్వంలో 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారు. అప్పట్లో ఈ కొత్త జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుకాగా.. వీటికి అధికారులను, సిబ్బందిని నియమించలేదు. కానీ, 13 జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. అలాగే, రాష్ట్రంలోని మూడు డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది పనిచేస్తున్నారు. వీరినే పాత, కొత్త డివిజన్లకు సర్దుబాటుచేసే అవకాశం ఉంది. కొత్త సర్కిళ్లు ఏర్పడితే విద్యుత్ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయి. తాజా బదిలీల్లోనైనా ఆ పని జరిగితే తమకు పదోన్నతులతో పాటు కోరుకున్న చోట పోస్టింగ్ వచ్చే వీలు కలుగుతుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకా అనుమతి రాలేదు.. ఇక రాష్ట్రంలో దూరం (కిలోమీటర్లు), హెచ్‌టీ సర్వీసులు, ఎల్టీ సర్వీసులు, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, వాటి సామర్థ్యం, సబ్స్టేషన్ల సంఖ్య, నెలకు వచ్చే సగటు ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సర్కిళ్ల విస్తరణ చర్యలను చేపట్టాలని డిస్కంలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న పోస్టుల్లోనూ మార్పులు చేస్తున్నాయి. గతంలో విజయవాడ కేంద్రంగా చీఫ్ ఇంజనీర్ (సీఈ) పోస్టు ఒకటి ఉండేది. ప్రాంతీయ కేంద్రం (జోనల్ ఆఫీసర్)గా ఈ పోస్టులో ఓ అధికారి ఉండేవారు. ఏపీఎస్పీడీసీఎల్ ఏర్పడ్డాక ఆ పోస్టు అవసరంలేకుండా పోయింది. ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఆ తరహా పోస్టును రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన తెరపైకి వచి్చనా ప్రస్తుతానికి అది ఆగింది. అలాగే, రెవిన్యూ కార్యాలయా (ఈఆర్వో)ల్లో సిబ్బందిని పునరి్వభజన (రీ డిప్లాయిమెంట్) పేరుతో సెక్షన్ కార్యాలయాలకు బదిలీ చేస్తున్నాయి.ఒక్క ఏపీఈపీసీడీసీఎల్లోనే ఈ విధంగా ఐదు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ), 126 సీనియర్ అసిస్టెంట్స్ (ఎస్ఏ), 131 జూనియర్ అసిస్టెంట్స్ (జేఏ) పోస్టులను మారుస్తున్నారు. అయితే, కొత్త సర్కిళ్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకూ అనుమతి రాలేదని, తామూ దానికోసమే ఎదురుచూస్తున్నామని డిస్కంల సీఎండీలు చెబుతున్నారు. దృష్టిపెట్టని కూటమి సర్కారు కొత్త జిల్లాలు ఏర్పడినా డిస్కంలు ఇప్పటికీ పాత పద్ధతిలోనే విద్యుత్ పంపిణీ, బిల్లుల జారీ వంటి అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ ఒక ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం ఉంది. ఇక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) జిల్లా అధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాలకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఈఈ) స్థాయి అధికారులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా డిజిగ్నేషన్‌ను మార్చి వారిని ఆపరేషన్ డివిజన్ అధికారులుగా నియమించారు. వీరితో పాటు ఇతర సిబ్బందిని కూడా నియమించాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం ఇంతవరకూ ఆ దిశగా దృష్టి సారించడంలేదు. -
ఆ లెక్కలూ చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) చేసే కొనుగోళ్ల విషయంలో ఇకపై అత్యంత కఠిన నిబంధనలను అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ డిస్కంలు తాము పరికరాలను కొనే ముందు, లేదా ఆ తర్వాత టెండర్ వివరాలను ఏపీఈఆర్సీకి పంపిస్తున్నాయి. కానీ ఆ టెండర్‌తో కొంటున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, ఇతర సామాగ్రి వంటి ధరలను విడివిడిగా వెల్లడించడం లేదు. ఇకపై ప్రతి పరికరానికి సంబంధించి ధరల జాబితాను మండలికి సమర్పించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ, సేకరణ, ప్రసార ప్రణాళికలపై ఏపీఈఆర్సీ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కాగా 2024–25 నుంచి 2028–29 (5వ నియంత్రణ కాలం) వరకూ, 2029–30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) వరకూ విద్యుత్ ప్రణాళికలను డిస్కంలు, ఏపీ ట్రాన్స్‌కో ఏపీఈఆర్సీకి సమర్పించాయి. వాటిపై విచారణ జరిపిన మండలి ప్రతిపాదనల్లో చాలావరకు తిరస్కరించింది. కొన్నిటికి మాత్రమే అనుమతినిచ్చింది. మరికొన్నిటిపై మరింత సమాచారం కావాలని అడిగింది. అందులో వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ల అంశం ఒకటి. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ఫీడర్ల విభజన పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు అందిస్తుంది. అలాగే వినియోగదారులకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. అదీగాక ఇందుకు అయ్యే ఖర్చును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ప్రభుత్వమే భరిస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు ఏపీఈఆర్సీ ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. అలాగే జగనన్న కాలనీల విద్యుద్దీకరణకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే, తాను ఆమోదించిన విలువల కంటే డిస్కంలు లెక్కల్లో చూపించిన వ్యయం ఎక్కువ అని గుర్తించిన ఏపీఈఆర్సీ తాజా ఆర్డర్లో గతంలో ఆమోదించిన విలువలకే ఓకే చెప్పింది. అలాగే విద్యుత్ కొనుగోళ్ల అంచనాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున.. దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నిటినీ తిరస్కరించింది. -
కేసీఆర్‌కు భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,ఢిల్లీ: మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో వాటర్ మేనేజ్మెంట్ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎండిన పంటలను పరిశీలించిన తర్వాత సూర్యాపేటలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భట్టి సోమవారం ఢిల్లీలో స్పందించారు. ‘చలికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా పాలనలో ఇంకా వర్షాకాలం రానే రాలేదు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ అని డబ్బా కొట్టారు అది కూడా కూలిపోయింది. నీళ్లు ఉంటే ఇప్పటికే అది మొత్తం కూలిపోయేది. కేసీఆర్ హయాంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. కేసీఆర్ పదేళ్లలో ఎస్ఎల్బీసీ ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదు. కాళేశ్వరం కార్పొరేషన్ బకాయిలు చెల్లిస్తాం. డిఫాల్ట్ కాబోము. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది. ఐఐటీలో చదివిన ఐఏఎస్‌లను డిస్కంలకు చీఫ్‌లను చేశాం. కేసీఆర్ మాత్రం ఒక అకౌంటెంట్‌ను సీఎండీ చేశారు’ అని భట్టి విమర్శించారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డి -
గడువు పొడిగించేది లేదు
సాక్షి, హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించేది లేదంటూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఝలక్ ఇచ్చింది. 2024–25 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి డిస్కంల వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతి పాదన లు సమర్పించేందుకు జనవరి 31తో గడువు ముగిసింది. మరో మూడు నెలలు పొడిగించాలని డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఈఆర్సీ తోసిపుచ్చింది. మల్టీ ఈయర్ టారిఫ్(ఎంవైటీ) రెగ్యులేషన్స్ ప్రకారం సత్వరమే ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాలని డిస్కంలకు ఆదేశించింది. ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు గడువులోగా సమర్పించడంలో విఫలమైతే డిస్కంలపై రోజుకు రూ.5000 చొప్పున జరిమానా విధించాలని ఎంవైటీ రెగ్యులేషన్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు ప్రతి ఏటా నవంబర్ 31లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలి. దాని ఆధారంగా వినియోగదారులకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాలి? దానికి ఎంత అవుతుంది ? ప్రస్తుత విద్యుత్ టారిఫ్‌తోనే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తే వచ్చే ఆదాయం ఎంత? అవసరమైన ఆదాయం, వచ్చే ఆదాయం మధ్య ఉండే వ్యత్యాసం(ఆదాయ లోటు) ఎంత? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సబ్సిడీలు పోగా, మిగిలే ఆదాయలోటు భర్తీ చేసేందుకు ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి ? వంటి అంశాలు ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ రాత పూర్వకంగా అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు హైదరాబాద్, వరంగల్‌లో బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ఆ సంవత్సరంలో వసూలు చేయాల్సిన విద్యుత్ టారి ఫ్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వినియోగదారుల కేటగిరీల వారీగా పెరిగిన/తగ్గిన విద్యుత్ చార్జీల పట్టిక ఇందులో ఉంటుంది. గతేడాది నవంబర్ 31లోగా ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉండగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల పేరుతో అప్పట్లో డిస్కంలు డిసెంబర్ 2 వరకు గడువు పొడిగింపు పొందాయి. విద్యుత్ టారీఫ్ ఖరారుకు సంబంధించిన కీలకమైన మార్గదర్శకాలతో మల్టీ ఈయర్ టారిఫ్ రెగ్యులేషన్స్‌ను ఆ తర్వాత కాలంలో ఈఆర్సీ ప్రకటించింది. ఈ కొత్త మార్గదర్శ కాలపై అధ్యయనం జరిపి ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడానికి జనవరి 31వరకు రెండోసారి గడువు పొడిగించింది. డిస్కంల యాజమాన్యాలు తర్జనభర్జన రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారింలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారులను సీఎండీలుగా నియమించింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచడానికి అనుమతించినట్టు తప్పుడు సంకేతాలు పోతాయని ప్రభుత్వవర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది. డిస్కంల ఆర్థిక నష్టాలు రూ.50,275 కోట్లకు, అప్పులు రూ.59,132 కోట్లకు పెరిగినట్టు ఇటీవల రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారులు అంటున్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ప్రతిపాదనలు సమర్పించే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. -
మీ ‘బాబు’దే నయవంచన
సాక్షి, అమరావతి: ప్రజలు ఉతికి ఆరేసిన పార్టీని తిరిగి అధికారంలోకి తేవడం కోసం ఈనాడు రాస్తున్న ఉన్మాద రాతలకు పరాకాష్టే రైతులకు ఉచిత విద్యుత్‌పై రాసిన కథనం. ప్రజలను తప్పుదోవ పట్టించి, దాని అనుకూల పార్టీకి రాజకీయ ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో అచ్చేసిన ఆ అబద్ధపు రాతల్లో అసలు నిజాలను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సోమవారం వెల్లడించాయి. ఆ వివరాలిలా ఉన్నాయి. ఇదీ నయవంచన అంటే.. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పాలనను పరిశీలిస్తే.. రైతులను నిలువునా వంచించిన చంద్రబాబు అసలు స్వరూపం కళ్ల ముందు కదలాడుతుంది. రైతు రుణ మాఫీ పేరుతో అన్నదాతలను నిలువునా దగా చేయడంతో పాటు కనీసం పంట పండించుకోవడానికి కరెంటు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి కనిపిస్తుంది. కరెంటు ఫ్రీగా ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్య ఒక్కటి చాలు ఆయన నిజ స్వరూపానికి తార్కాణం. అటువంటి చంద్రబాబు కోసం రైతులకు ఉచిత విద్యుత్ వద్దని, దీనివల్ల విద్యుత్ సంస్థలు సంక్షోభంలోకి వెళ్లిపోతాయంటూ ఆనాడు పరోక్షంగా కథనాలు రాసింది ఈనాడు పత్రిక. టీడీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు పూర్తిగా మద్దతు పలికింది. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనన్న చంద్రబాబు మాటలను గొప్పగా కీర్తించి, రైతుల ప్రయోజనాలను పూర్తిగా మంటగలిపేందుకు తన వంతు సాయం చేసింది. చంద్రబాబు హయాంలో పగటిపూట దేవుడెరుగు.. రాత్రి పూట కూడా కనీసం నాలుగు గంటలు నిరంతరాయంగా కరెంటు ఇచ్చిన పాపానపోలేదు. రాత్రి వేళ నీటి తడులు పెట్టడానికి పొలాలకు వెళ్లి అనేక మంది రైతులు పాము కాట్లకు, విద్యుదాఘాతాలకు మరణించిన ఘటనలు అనేకం. 2014లో చంద్రబాబు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పే లేదు. రైతులకు సరఫరా చేసిన విద్యుత్తు అరకొరే. అదికూడా రాత్రిపూటే. పైగా ఉచిత విద్యుత్ కోసం డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ రూ.12వేల కోట్లు చెల్లించకపోవడంతో రైతులకు ఉచిత విద్యుత్ పథకం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుంది. రాష్ట్ర విభజన నాటికి మొత్తం విద్యుత్ సంస్థల అప్పులు దాదాపు 29,700 కోట్లు ఉంటే చంద్రబాబు పదవి ముగిసిన 2019 మార్చి నాటికి 68,600 కోట్లకు (131 శాతం పెరుగుదల) చేరాయి. 2023 మార్చి నాటికి రూ.97,500 కోట్లకు (42 శాతం పెరుగుదల) చేరాయి. విద్యుత్ సంస్థల అప్పుల భారం చంద్రబాబు హయాంలో 2014 – 2019 మధ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. వీటి గురించి ఈనాడు ఎక్కడా ప్రస్తావించదు.విద్యుత్ పంపిణీ సంస్థలు, డిస్కంల నికర విలువ 2014లో సుమారుగా మైనస్ 4,315 కోట్లు ఉంటే, 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి డిస్కంల నికర విలువ దారుణంగా క్షీణించి మైనస్ 20 వేల కోట్లకు చేరింది. ఈ విషయాలు ఈనాడు చెప్పదు. చంద్రబాబు ఘనకార్యాల కారణంగా రైతు అన్నవాడు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుపోయాడు. చంద్రబాబే నయవంచకుడని, ఆయన పాలన మరో చీకటి అధ్యాయమని రైతులే చెబుతున్నారు. రైతులకు మేలు చేసిందే సీఎం వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పక్షపాత ప్రభుత్వంగా అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఉచిత్ విద్యుత్ పథకం దీర్ఘకాలంగా, స్థిరంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అందడానికి గట్టి చర్యలు తీసుకున్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 9 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ప్రారంభించారు. సీఎం జగన్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి రోజుకి తొమ్మిది గంటలపాటు అదీ పగటిపూటే ఏ ఇబ్బందీ లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇప్పుడు రైతులు రాత్రి వేళ ప్రాణాలకు తెగించి పొలాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.1,760 కోట్లు ఖర్చు చేసి 6,663 ఫీడర్లకు అదనపు సామర్ధ్యం కల్పించి, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయడం ద్వారా పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరాకు మార్గాన్ని సుగమం చేసింది. రైతులకు ఉచిత విద్యుత్ కోసం పంపిణీ వ్యవస్థపై ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన ప్రభుత్వం ఇదే. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద చెల్లించాల్సిన రూ.12 వేల కోట్లు డిస్కంలకు ఎగ్గొట్టింది. దీంతో డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు చేయలేక మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని సంక్షోభంలో పడింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించడంతోపాటు, ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం రూ.46 వేల కోట్లు ఖర్చు చేసింది. దీంతో డిస్కంలు జెన్కోలకు సకాలంలో చెల్లింపులు చేస్తూ విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు అందించగలుగుతున్నాయి. కచ్చితంగా 9 గంటలు సరఫరా రాష్ట్రంలో ఇచ్చేదే ఏడు గంటలని, అందులోనూ సగటున 2 గంటలు కోతలేనని, లోడ్ రిలీఫ్ ఇతరత్రా పేరిట ఇష్టారాజ్యంగా నిలిపేస్తున్నారంటూ ఈనాడు రాసింది పూర్తిగా అవాస్తవం. రాష్ట్రంలో అన్ని రంగాలకు మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోటు లేదు. వచ్చే వేసవి పూర్తయ్యేవరకు ఏ ఇబ్బందీ లేకుండా అందుబాటులో ఉన్న విద్యుత్ కేంద్రాలతో పాటు స్వల్పకాలిక మార్కెట్ నుండి కొనుగోళ్లు ఖరారు చేసినట్లు డిస్కంలు తెలిపాయి. గ్రిడ్ నిర్వహణ నిమిత్తం ఎప్పుడైనా డిమాండ్‌కు సరిపడినంత విద్యుత్ అందుబాటులో లేనప్పుడు, గ్రిడ్ ఫ్రీక్వెన్సీ పరిమితికి మించి అదుపులో లేనప్పుడు, పగటి పూట సౌర విద్యుత్ ఉత్పత్తి ఉన్న ప్రాంతాల్లో మేఘాలు కమ్మినప్పుడు మాత్రమే కొద్దిసేపు సరఫరా నియంత్రణ ఉంటుంది. అలాగే దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌లో సరఫరాకు తీవ్ర కొరత ఏర్పడినప్పుడు, గ్రిడ్ ఫ్రీక్వెన్సీ తీవ్ర ఒడిదొడుకులకు లోనయినప్పుడు, దక్షిణ రీజియన్ లోడ్ డిస్పాచ్ – బెంగళూరు కేంద్ర విద్యుత్ గ్రిడ్ నుండి వచ్చే విద్యుత్‌ను రాష్ట్రాల వాటా ప్రకారం నియంత్రణ చేసే క్రమంలో ఒక్కోసారి కేంద్ర గ్రిడ్ కు అనుసంధానమైన అధిక కెపాసిటీ గ్రిడ్ ట్రాన్స్ఫార్మర్లను ట్రిప్ చెయ్యడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెస్తుంటారు. అలాంటి సమయాల్లో కూడా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ చేతుల్లో ఉండదు. ఇలా చాలా అరుదుగా జరుగుతుందని డిస్కంలు తెలిపాయి. ఇలా ఎప్పుడైనా వ్యవసాయ రంగానికి విద్యుత్ అంతరాయం ఏర్పడితే... మళ్లీ అదే రోజు వేరొక సమయంలో ఇచ్చి 9 గంటల సరఫరా భర్తీ చేస్తున్నట్లు డిస్కంలు వివరించాయి. ఏ సమస్యా లేకుండా రైతులకు ఉచిత విద్యత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ, ఈనాడు తప్పుడు రాతలు రాస్తోందని వివరించాయి. కేవలం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలన్న దురుద్దేశంతోనే ఈనాడు అవాస్తక కథనాలు ప్రచురిస్తోందని తెలిపాయి. వ్యవసాయ విద్యుత్‌కు ఢోకా లేదు సీఎం జగన్ సంకల్పంతో ఉచిత విద్యుత్ హామీకి అనుగుణంగా దీర్ఘకాలికంగా పగటి పూట వ్యవసాయ విద్యుత్ సరఫరా చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ కేవలం రూ.2.43 కే లభిస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబరు నాటికి మరో 3 వేల మెగావాట్లు, ఆ మరుసటి ఏడాది వెయ్యి మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. గత ప్రభుత్వం పీపీఏల రూపంలో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచేలా నిర్ణయాలు తీసుకుంటేం.. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. సెకీతో జరిగిన ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. దాని ప్రకారం ఈ ఒప్పందం నిమిత్తం అయ్యే విద్యుత్ కొనుగోలు వ్యయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రానున్న మూడు దశాబ్దాలపాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ అందుతుంది. అలాగే గత ఆర్థిక సంవత్సరం (2022– 23)లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 2019–2023 మధ్య నాలుగున్నరేళ్లలో సుమారు 3.83 లక్షల వ్యవసాయ పంపు సెట్లు మంజూరు చేసింది. ఇదంతా రైతాంగం మేలు కోసమే. ఇటువంటివి ఒక్కటైనా చంద్రబాబు ప్రభుత్వంలో ఉంటే ఒట్టు. అసలు చంద్రబాబు హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలే ఓ అడ్డగోలు వ్యవహారం. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు అత్యధిక ప్రయోజనం కలిగించడం కోసం ప్రజలపై మోయలేని భారం వేయడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం సంకోచించలేదు. అదే ఉద్దేశంతో అత్యధిక రేట్లు చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంది. -
Fact Check: కరెంటుంది.. కోతల్లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోటుపాట్లు లేవు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కరెంటు కోతలు లేవు. రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందుతోంది. అయినా ఈనాడు పత్రిక ‘రైతులకు జగన్ షాక్’ అంటూ ఓ పసలేని కథ అచ్చేసింది. రైతులను అనవసర ఆందోళనకు గురిచేసేలా తప్పుడు కథనాన్ని ఇచ్చింది. ఈ కథనాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ఖండించారు. వ్యవసాయానికి 9 గంటల పాటు కచ్చితంగా ఉచిత విద్యుత్‌ను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈనాడు గురువారం ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. గ్రామాల్లో రోజుకి నాలుగైదు గంటలు మించి కరెంటు అందడంలేదన్నది పచ్చి అబద్ధమని, అనధికార కోతలు విధిస్తున్నారన్నదీ అవాస్తవమేనని తెలిపారు. అన్నదాతలకు రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో ఎటువంటి రాజీ లేదని,. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడితే అదే రోజు మరొక సమయంలో భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. ‘సాక్షి’ ప్రతినిధికి సీఎండీలు వెల్లడించిన వివరాలు.. ► గ్రిడ్ లో ఏర్పడే ఫ్రీక్వెన్సీ హె చ్చు తగ్గులను అదుపు చేయడానికి దక్షిణ భారత లోడ్ డిస్పాచ్ సెంటర్ (బెంగళూరు) ఆదేశాలతో ఆటోమాటిక్ లోడ్ షెడ్డింగ్ విధానం అప్పుడప్పుడు అమల్లోకి వస్తుంటుంది. వెంటనే సంబంధిత విద్యుత్ సంస్థల ఇంజనీర్లు పరిస్థితిని అదుపు చేసి సరఫరాలో అంతరాయంలేకుండా చేయడానికి కృషి చేస్తున్నారు. ► ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ అక్టోబర్ నెలలో రోజుకు 210 నుంచి 215 మిలియన్ యూనిట్లు ఉండాల్సిన విద్యుత్ వినియోగం దాదాపు 245 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి సరాసరి రోజువారీ వినియోగం 170 నుంచి 180 మిలియన్ యూనిట్లు ఉండేది. బుధవారం రాష్ట్రంలో 234 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఇది గతేడాది కంటే 37 శాతం ఎక్కువ. తక్కువ వర్షపాతం వల్ల తగినంత సాగు నీరు అందుబాటులో లేని పరిస్థితుల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం అంచనాలకు మించి పెరిగిపోయింది.వాతావరణ మార్పుల వల్ల పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. ఈ కారణాలతో రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ► ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా గ్రిడ్ డిమాండ్‌కు అనుగుణంగా నిలకడగా ఉంది. ఏ విధమైన ఒడిదొడుకులు ఏర్పడినా పరిస్థితిని సరిదిద్దడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎంత ఖర్చయినా వెనుకాడకుండా స్వల్పకాలిక మార్కెట్లో విద్యుత్ కొని, సరఫరా చేయడానికి డిస్కంలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని విద్యుత్ కొరత ఏర్పడే సమయాల్లో అత్యవసరంగా మార్కెట్ కొనుగోళ్లకు వెళ్తున్నాయి. బహిరంగ మార్కెట్ నుంచి బుధవారం యూనిట్ సగటు రేటు రూ.8.963 చొప్పున రూ.62.554 కోట్లతో 69.789 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేశాయి. ► మన రాష్ట్రంలో విద్యుత్ కొరత పరిస్థితులు లేవు. బీహార్‌లో 7.60 మిలియన్ యూనిట్లు, ఉత్తరప్రదేశ్‌లో 5.73 మిలియన్ యూనిట్లు, కర్ణాటకలో 4.40 మిలియన్ యూనిట్లు, రాజస్థాన్‌లో 3.10 మిలియన్ యూనిట్లు, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో 47.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. కానీ మన రాష్ట్రంలో ఈ లోటు సున్నాగా ఉంది. -
అదిగో పులి.. అంటే, ఇదిగో తోక.. ఈనాడు తీరిదే! ఖరారుకాని టెండర్లపై కట్టుకథ
సాక్షి, అమరావతి: అదిగో పులి.. అంటే, ఇదిగో తోక.. అన్నట్లుంది ఈనాడు తీరు. అసలు టెండర్లే ఖరారు కాని స్మార్ట్ మీటర్లపై అప్పుడే ప్రజలపై భారం మోపేసినట్లు ఇష్టారాజ్యంగా కట్టుకథలు అల్లేస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో దాదాపు 1.96 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులుంటే వాణిజ్య, పరిశ్రమ, ప్రభుత్వ సంస్థలకు, ట్రాన్స్ఫార్మర్లకు, 11 కేవీ ఫీడర్లకు కలిపి 42 లక్షల మీటర్లకు మాత్రమే టెండర్లు పిలిచారు. ఇందులో తొలివిడతలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 8,04,864 స్మార్ట్ మీటర్లు, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 9,77,288 స్మార్ట్ మీటర్లు, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 9,85,894 స్మార్ట్ మీటర్లు ఉన్నాయి. అవికూడా ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. కానీ, ఈనాడు మాత్రం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల సర్వీసులన్నింటికీ స్మార్ట్‌మీటర్లు పెట్టి, ప్రతినెలా గృహ వినియోగదారులపై నెలకు రూ.153.40 భారం మోపనున్నారని అదానీ ‘స్మార్ట్’ షాక్ అంటూ అడ్డగోలు రాతలు అచ్చేసింది. ఈనాడు రాసిన అబద్ధాల వెనుక అసలు నిజాలు ఇవీ.. ఆరోపణ: స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై రూ.29 వేల కోట్ల భారంవేసి, భారీగా బాదేసేందుకు సిద్ధమైంది. వాస్తవం: ఇది పూర్తిగా పచ్చి అబద్ధం. పదేళ్ల పాటు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు రూ.5 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అంచనా వేశాయి. అది వదిలేసి రూ.29వేల కోట్లని కాకిలెక్కలతో పచ్చపత్రిక పిచ్చిరాతలు రాసింది. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించే చర్యలలో భాగంగా డిస్కంల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) ద్వారా 2025 నాటికి ప్రతి విద్యుత్ సర్వీసు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లకు స్మార్ట్‌మీటర్స్ అమర్చాలని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలు నిబంధన విధించాయి. ఈ ఆదేశాలను అనుసరించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల డిస్కంలు ఈ పనులు చేపట్టాయి. ఏదో ఏపీ మాత్రమే చేస్తున్నట్లు చెప్పడం ప్రజలను ఏమార్చే ప్రయత్నమే ఇది. వినియోగదారులపై ఎటువంటి అదనపు భారంలేకుండా స్మార్ట్‌మీటర్ల ఏర్పాటువలన కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. దీని ద్వారా మీటరుకు రూ.1,350 వరకు గ్రాంట్ పొందే వెసులుబాటు కల్పించింది. దానితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఖరారుచేసిన రేట్లను దృష్టిలో పెట్టుకుని, నోడల్ ఏజెన్సీ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ఆమోదం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తీసుకున్న తరువాతే టెండర్లు ఖరారుచేస్తారు. ఈ విషయాన్ని దాచి, టెండరు ఖరారు కాకుండానే ప్రతినెలా రూ.153.40 భారం అని ప్రచురించటం పూర్తిగా అవాస్తవం. ఆరోపణ: టెండర్ల వివరాలను డిస్కంలు అత్యంత రహస్యంగా ఉంచాయి. వాస్తవం : ప్రస్తుత టెండర్లను 42 లక్షల మీటర్లకు మాత్రమే డిస్కంలు పిలిచాయి. ఇందులో వినియోగదారుల మీటర్లతో పాటు ఫీడర్ మీటర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల (డీటీఆర్) మీటర్లు, ఎల్టీ, సీటీ మీటర్లు, సీటీ, పీటీ మీటర్లు ఉన్నాయి. టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపించిన తరువాతే ఏపీ ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా పారదర్శకంగా టెండర్లు పిలిచింది. ఇందులో టెండర్ల వ్యవహారం గుట్టుగా జరిగిందేమీలేదు. ఆరోపణ : ప్రజలపై పడే భారాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం ముందుకెళ్తోంది. వాస్తవం : స్మార్ట్‌మీటర్ల ద్వారా విద్యుత్ కనెక్షన్ల వినియోగం, ఇతర సర్వీస్ వినియోగ వివరాలను ఆన్లైన్ ద్వారా రియల్ టైం డేటాను పొందే సౌలభ్యం ఉంటుంది. అందువల్ల మీటర్ రీడింగ్ లను మనుషుల అవసరం లేకుండా తీసుకోవచ్చు. ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్ వ్యవస్థను పటిష్టవంతం చేయడం ద్వారా విద్యుత్ నష్టాల తగ్గింపు, బిల్ తీసేందుకు అయ్యే ఖర్చులో మిగులు, ముందుస్తు చెల్లింపు వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా మిగిలిన దాని నుంచే గుత్తేదారు సంస్థకు డిస్కం నేరుగా ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు చెల్లిస్తుంది. వినియోగదారులు ఆఫ్ పీక్ సమయాలలో విద్యుత్‌ను ఉపయోగించినప్పుడు అదనపు రాయితీని పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు విద్యుత్ వినియోగం తెలుసుకుని అవసరమైన మేర రీచార్జ్ చేసుకోవటం ద్వారా పొదుపును పాటించవచ్చు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ప్రతి వినియోగదారునికీ స్మార్ట్‌మీటర్ అమర్చాలని నిబంధనలున్నా, రాష్ట్రంలో మన డిస్కంలు ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఐఆర్డీఏ మీటర్ల ద్వారా వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించడంలో దేశంలోనే ఉత్తమంగా ఉండడంతో, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి వాటిని స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నుంచి మినహాయించాయి. ఇవన్నీ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేసినవే. -
త్రైమాసిక నివేదికలివ్వండి
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి త్రైమాసిక నివేదికలు సమర్పించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇస్తున్న రాయితీ విద్యుత్‌కు సంబంధించిన ఆడిట్ వివరాలు, బిల్లుల లెక్కలను ఏపీఈఆర్సీకి ఇవ్వాల్సిందిగా మన రాష్ట్ర డిస్కంలకు సూచించింది. అక్కడి నుంచి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) సేకరిస్తుందని తెలిపింది. ఒకవేళ డిస్కంలు చెబుతున్న లెక్కల్లో తేడాలున్నట్టు తేలితే కేంద్రం నుంచి ప్రస్తుతం డిస్కంలకు అందుతున్న రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) ప్రోత్సాహకాలను నిలిపివేస్తామని, జరిమానాలు కూడా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 2005కి సవరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ నిబంధనల ప్రకారం.. విద్యుత్ సబ్సిడీ, దాని అకౌంటింగ్‌ను క్రమబద్ధీకరించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. విద్యుత్ సబ్సిడీ పంపిణీ వివరాలను డిస్కంల నుంచి తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ సబ్సిడీకి సబ్సిడీ కేటగిరీ, వినియోగదారుల కేటగిరీ వారీగా వినియోగించే విద్యుత్‌కు సంబంధించిన కచ్చితమైన లెక్కల ఆధారంగా డిస్కం సబ్సిడీ డిమాండ్‌ను పెంచారా లేదా అనే వివరాలు నివేదికలో ఉండాలని పేర్కొంది. విద్యుత్ చట్టంలోని సెక్షన్–65 ప్రకారం సబ్సిడీకి సంబంధించిన వాస్తవ చెల్లింపు వివరాలు, ఇతర సంబంధిత వివరాల్లాగే చెల్లించాల్సిన సబ్సిడీ, చెల్లింపులో అంతరం వివరాలు కూడా నివేదికలో ఉండాలని చెప్పింది. దీనిపై అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘టైమ్ ఆఫ్ డే’ విధానానికీ సవరణ రోజులో గంటల లెక్కన విద్యుత్ ధరల ప్రకారం బిల్లులు విధించే ‘టైమ్ ఆఫ్ డే’ విధానంలోనూ సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని పరిశ్రమలకే పరిమితమైన ఈ పద్ధతిని అన్ని పరిశ్రమలు, వాణిజ్య సర్విసులకు వర్తింపజేసేలా ముసాయిదా విద్యుత్ (వినియోగదారుల హక్కులు) సవరణ నిబంధనలు–2023 పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసి.. రాష్ట్రాలు, విద్యుత్ సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే విద్యుత్ డిమాండ్ గరిష్టంగా (పీక్) ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు అధిక చార్జీలు విధించే అవకాశం ఉంది. అదే సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో వినియోగించిన విద్యుత్ చార్జీల్లో 20 శాతం వరకూ రాయితీ లభించనుంది. అయితే, ఇందుకోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. -
డిస్కంల నష్టాలు 5.49 లక్షల కోట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఏకంగా రూ. 5.49 లక్షల కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్వయంగా ప్రకటించింది. ఈ నష్టాలకు తోడు విద్యుత్ ఉత్పాదన సంస్థలకు మరో రూ. 1.20 లక్షల కోట్ల మేర డిస్కంలు బకాయిపడ్డట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం గత జూన్‌లో తీసుకొచ్చిన కొత్త విద్యుత్ విధానం ప్రకారం పంపిణీ సంస్థలకు ఉత్పాదన సంస్థలు విద్యుత్ సరఫరా చేసిన 45 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలి. సకాలంలో బిల్లులు చెల్లించకుంటే ఉత్పత్తి సంస్థలు డిస్కంల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తాయి. ఈ గడువు దాటినా బిల్లులు చెల్లించకపోతే సంబంధిత డిస్కంలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తాయి. కానీ ఈ నిబంధనను కూడా బేఖాతరు చేస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి. గతేడాది జూన్ 3కు ముందు విద్యుత్ బకాయిలు రూ. 91,061 కోట్లుగా ఉండగా కొత్త నిబంధన అమల్లోకి వచ్చాకఉత్పాదన సంస్థలకు డిస్కంలు మరో రూ. 25, 470 కోట్లు బాకీ పడ్డాయి. నిర్లక్ష్యం ఫలితం... విద్యుత్ పంపిణీ వ్యవస్థలోని లొసుగులు, లెక్కాపత్రంలేని విద్యుత్ వాడకం, వసూళ్లలో నిర్లక్ష్యం, పంపిణీ అవుతున్న విద్యుత్‌కు.. వస్తున్న ఆదాయానికి కూడా పొంతనలేకపోవడం డిస్కంల నష్టాలకు ఓ కారణం. అదే విధంగా డి్రస్టిబ్యూషన్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద చెల్లించాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం కూడా ఈ నష్టాల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు. నష్టాల్లో అగ్రస్థానం తమిళనాడు... కేంద్రం లెక్కల ప్రకారం అత్యధిక నష్టాలు మూటగట్టుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు తొలి స్థానంలో నిలిచింది. అక్కడి విద్యుత్ పంపిణీ సంస్థలు ఏకంగా రూ. 1.25 లక్షల కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నాయి. 2022–23 లెక్కలు పూర్తిగా వస్తే ఈ నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రెండో స్థానంలో రాజస్తాన్‌లోని డిస్కంలు రూ. 89,556 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా రూ. 77,937 కోట్లతో యూపీ, రూ. 59,546 కోట్లతో మధ్యప్రదేశ్, రూ. 49,816 కోట్లతో తెలంగాణకు చెందినడిస్కంలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాల్లోనే డిస్కంలబకాయిలు అధికంగా ఉండగా బెంగాల్ సహా దాదాపు 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విద్యుదుత్పాదన సంస్థలకు పెద్దగా బకాయిలు లేవు. సంస్కరణలతోనే డిస్కంల బాగు.. విద్యుత్ పంపిణీ సంస్థలు జవాబుదారీగా వ్యవహరిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. నష్టాలు తగ్గించుకొని ఆర్థికంగా డిస్కంలు బాగుపడాలంటే యుద్ధప్రాతిపదికన ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు, ఉత్పత్తి, సరఫరా, పంపిణీకి ఆటోమేటిక్ మీటరింగ్ వ్యవస్థ అమలుఅవసరమని సూచిస్తోంది. -
ఎఫ్ఎస్ఏ వసూలుకు రంగం సిద్ధం.. తెలంగాణలో పెరగనున్న విద్యుత్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఎస్ఏ)ను వసూలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కసరత్తు ప్రారంభించాయి. ఏప్రిల్ ఒకటి నుంచి ఎఫ్ఎస్ఏ చార్జీలు అమల్లోకి రానుండగా వినియోగదారులపై మాత్రం జూలైలో అందుకొనే బిల్లుల్లో ఈ చార్జీల ప్రభావం కనిపించనుంది. ఒక నిర్దిష్ట నెలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను ఆ తర్వాతి మూడో నెలలో వసూలు చేయాల్సి ఉండటమే దీనికి కారణం. ఎఫ్ఎస్ఏ చార్జీలకు అనుమతిస్తూ గత నెల 18న రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ప్రకటించిన ‘మూడో సవరణ నిబంధన, 2023’ను నోటిఫై చేస్తూ అదే నెల 20న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 12న రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు మార్గం సుగమనమైంది. దీంతో ప్రజలపై విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారనున్నాయి. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో.. ఇంధన/విద్యుత్ కొనుగోలు వ్యయంలో హెచ్చుతగ్గుల భారాన్ని ఎఫ్ఎస్ఏ చార్జీల రూపంలో ఆటోమెటిక్‌గా విద్యుత్ బిల్లుల్లో బదిలీ చేయాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్ 22న ఎలక్ట్రిసిటీ (టైమ్లీ రికవరీ ఆఫ్ కాస్ట్ డ్యూ టు ఛేంజ్ ఇన్ లా) రూల్స్ 2021ను ప్రకటించింది. బొగ్గు, ఇతర ఇంధనాల ధరల పెరుగుదలతో పెరిగిపోతున్న విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు కేంద్రం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. దీని ఆదారంగానే ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు ఈఆర్సీ అనుమతిచి్చంది. ఈఆర్సీ ప్రకటించిన ప్రత్యేక ఫార్ములా ఆధారంగా ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించి వసూలు చేయనున్నారు. యూనిట్‌పై 30 పైసల దాకా వడ్డన యూనిట్ విద్యుత్‌కి గరిష్టంగా 30 పైసల వరకు ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ అనుమతి లేకుండా డిస్కంలు విధించవచ్చు. ఒకవేళ ఎఫ్ఎస్ఏ చార్జీలు యూనిట్‌కి 30 పైసలకు మించితే అనుమతి లేకుండా ఆపైన ఉండే అదనపు చార్జీలు విధించడానికి వీల్లేదు. 30 పైసల సీలింగ్‌కి మించిన ఎఫ్ఎస్ఏ చార్జీలు వసూలు చేయాల్సి వస్తే ఈఆర్సీ నుంచి అనుమతి పొందాలి. ఒకవేళ ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించాక రుణాత్మకంగా తేలితే ఆ మేరకు ఎఫ్ఎస్ఏ చార్జీలను వినియోగదాలకు రిఫండ్ చేయాలి. ఎల్టీ–5 కేటగిరీలోని వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల వినియోగదారులపై ఈ చార్జీలు విధించనున్నారు. వ్యవసాయ వినియోగదారుల ఇంధన సర్దుబాటు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉండనుంది. ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించే సమయంలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు. 45 రోజుల్లోగా పత్రికల్లో ప్రకటన.. నిరీ్ణత కాల వ్యవధిలోపు ఎఫ్ఎస్ఏ చార్జీలను విధించడంలో డిస్కంలు విఫలమైతే తర్వాతి కాలంలో వసూలు చేసేందుకు అనుమతి ఉండదు. నెలవారీ ఇంధన సర్దుబాటు చార్జీలను నిబంధనల ప్రకారం డిస్కంలు లెక్కించి సంబంధిత నెల ముగిసిన 45 రోజుల్లోగా పత్రికల్లో ప్రచురించాల్సి ఉంటుంది. విద్యుత్ బిల్లుల్లో ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేకంగా చూపించడంతోపాటు వసూలైన ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేక ఖాతా కింద నమోదు చేస్తారు. ప్రతి త్రైమాసికం ముగిశాక 60 రోజుల్లోగా ఆ త్రైమాసికంలోని నెలలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలను ఈఆర్సీకి సమరి్పంచాలి. డిస్కంలు విధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించనుంది. ఇక ట్రూఅప్ ప్రతిపాదనలు కీలకం.. ఏటా నవంబర్ ముగిసేలోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తోపాటు వినియోగదారుల నుంచి వసూలు చేసిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలు, ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. ముందే వసూలు చేసిన ఎఫ్ఎస్ఏ చార్జీలను పరిగణనలోకి తీసుకొని ట్రూఅప్ చార్జీల రూపంలో వినియోగదారులకు పంచాల్సిన లాభనష్టాలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. ట్రూఅప్ ప్రతిపాదనలు సమరి్పంచే వరకు ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు ఈఆర్సీ అనుమతించదు. చదవండి: ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? -
ఇదేంది సారు.. ఒకే రాష్ట్రం.. వేర్వేరు కరెంట్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం 30 రోజుల ముందస్తు నోటీసులు జారీ చేసిన తర్వాతే విద్యుత్ వినియోగదారుల నుంచి ముందస్తు వినియోగ ధరావతు (ఏసీడీ) వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆదేశించింది. అప్పటి వరకు ఏసీడీ చార్జీల వసూళ్లను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. వినియోగదారులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఏసీడీ చార్జీల లెక్కలను నోటీసుల్లో పొందుపర్చాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు తాజాగా ఈఆర్సీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) భారీ మొత్తంలో ఏసీడీ చార్జీలు వసూలు చేస్తోందని వ్యతిరేకత రావడంతో ఈఆర్సీ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. వినియోగదారుడి వార్షిక విద్యుత్ వినియోగం ఎంత? అందులో రెండు నెలల సగటు వినియోగం ఎంత? ఈ మేరకు వినియోగానికి చెల్లించాల్సిన డిపాజిట్ ఎంత? ఇప్పటికే డిస్కం వద్ద ఉన్న ఆ వినియోగదారుడి డిపాజిట్ మొత్తాన్ని సర్దుబాటు చేశాక చెల్లించాల్సిన అదనపు వినియోగ డిపాజిట్ ఎంత? .. వంటి లెక్కలను నోటీసుల్లో పొందుపర్చాలని కోరింది. ఇప్పటి వరకు నోటీసులు లేకుండానే ఏసీడీ చార్జీలు వసూలు చేసిన నేపథ్యంలో ఆ వినియోగదారులకు సైతం నోటీసులు జారీ చేయాలని కోరింది. విద్యుత్ నియంత్రణ మండలి జారీ చేసిన రెగ్యులేషన్ 6, 2004 ప్రకారం ఉత్తర తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిలాల్లో గత రెండు నెలలుగా ఏసీడీ చార్జీలను టీఎస్ఎన్పీడీసీఎల్ విధిస్తోంది. నిబంధనలకు వ్యతిరేకమని విమర్శలు.. ఏపీఈఆర్సీ జారీ చేసిన రెగ్యులేషన్ 6, 2004 ప్రకారం డిస్కంలు వినియోగదారుల నుంచి అదనపు సెక్యూరిటీ డిపాజిట్ (ఏఎస్డీ) వసూలు చేసుకోవచ్చు. గృహ వినియోగదారులకు కొత్తగా కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఏఎస్డీ కింద కిలోవాట్‌కు రూ.80 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తారు. కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఏడాదిపాటు వినియోగదారుడి సగటు విద్యుత్తు వినియోగాన్ని లెక్కగట్టి రెండు నెలల సగటు మొత్తాన్ని ఏఎస్డీ చార్జీల రూపంలో మరోసారి వసూలు చేసుకోవచ్చు. ఆపై ప్రతీ ఏటా ఆ ఏడాది సగటు వినియోగాన్ని, అంతకు ముందు ఏడాది సగటుతో పోల్చి చూసి, అదనంగా జరిగిన సగటు వినియోగానికి మాత్రమే ఏఎస్డీ చార్జీలు వసూలు చేస్తారు. ఈ చార్జీలు డిపాజిట్ రూపంలో వినియోగదారుల పేరుమీదనే విద్యుత్ సంస్థల వద్ద ఉంటాయి. ఈ రెగ్యులేషన్ జారీ చేసిన 19 ఏళ్ల తర్వాత ఏఎస్డీకి బదులు ఏసీడీ చార్జీల పేరుతో టీఎస్ఎన్పీడీసీఎల్ వసూళ్లను ప్రారంభించింది. విద్యుత్ చట్టం, ఈఆర్సీ రెగ్యులేషన్లలో ఎక్కడా ఏసీడీ చార్జీల ప్రస్తావన లేనందున, వీటిని వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని విద్యుత్ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఒకే రాష్ట్రం.. వేర్వేరు చార్జీలు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు రెండు వేర్వేరు డిస్కంలు విద్యుత్ సరఫరా చేస్తున్నా ఏకరూప చార్జీలు అమల్లో ఉన్నాయి. కొత్తగా ఉత్తర తెలంగాణ జిల్లాల గృహ వినియోగదారులపై ఏసీడీ చార్జీలను విధిస్తుండటంతో ఒకే రాష్ట్రంలో వేర్వేరు విధానాలను అమలుచేస్తున్న విచిత్ర పరిస్థితి. ఇప్పటివరకు ఏఎస్డీ చార్జీలను కమర్షియల్, పరిశ్రమల వర్గాల నుంచి మాత్రమే వసూలు చేసేవారు. -
AP: వినియోగదారులకు భారీ ఊరట.. విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్లే..
సాక్షి, అమరావతి విశాఖపట్నం: విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ ఊరట కలిగించాయి! వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ కేటగిరీలోనూ చార్జీలను పెంచాలని డిస్కమ్‌లు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి రావడం ఆనవాయితీ. పేదలు మినహా అన్ని వర్గాల వినియోగదారులపై ఎంతో కొంత పెంపు సాధారణంగా ఉంటుంది. అయితే అనూహ్యంగా ఈదఫా చార్జీలు పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించలేదు. దీంతో విద్యుత్ వినియోగదారులపై వచ్చే ఏడాది విద్యుత్ చార్జీల భారం ఉండదని స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) సమర్పించిన 2023–24 వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరల ప్రతిపాదనపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ గురువారం విశాఖలో మొదలైంది. శనివారం వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు వెబ్ లింక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు (లైవ్ స్ట్రీమింగ్) చూడవచ్చు. డిస్కమ్‌ల సీఎండీలు తమ టారిఫ్ నివేదికలో గృహ, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక విద్యుత్ వినియోగంపై చార్జీల పెంపునకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. కేవలం ఇంటెన్సివ్ పరిశ్రమల (ఫెర్రో అల్లాయిస్) టారిఫ్‌ను మాత్రమే మార్చాలని ఏపీఈఆర్సీని డిస్కమ్‌లు కోరాయి. హెచ్‌టీ పరిశ్రమలకు వర్తించే టారిఫ్‌నే వాటికీ వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశాయి. ఫెర్రో పరిశ్రమలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. అక్కడ ధరలు పెరిగినప్పుడు, వేసవిలోనూ డిస్కమ్‌ల నుంచి విద్యుత్ తీసుకుంటున్నాయి. దీనివల్ల డిస్కమ్‌లు ఆర్థికంగా నష్టపోతున్నట్లు సీఎండీలు మండలికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయాల స్వీకరణ తొలిరోజు 20 మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభ్యంతరాలు, సూచనలను, తెలియచేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన మునిరత్నంరెడ్డి తిరుపతిలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఆపరేషన్) సర్కిల్ కార్యాలయం నుంచి ఏపీఈఆర్సీ దృష్టికి తెచ్చారు. కుటీర పరిశ్రమలకు విద్యుత్ లోడ్ పరిమితిని 20 హెచ్‌పీ వరకు పెంచాలని కావలికి చెందిన శాంతకుమార్ కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా బాగుందని కడప జిల్లా నుంచి రమణారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల తరహాలో బీసీలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని పాకాల నుంచి మునుస్వామి నాయుడు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఎస్ఈ కార్యాలయం నుంచి మాట్లాడిన వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. వ్యవసాయం, గృహాలకు మీటర్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులపై భారం లేదు విద్యుత్ వినియోగదారులపై చార్జీల భారం మోపేలా డిస్కమ్‌లు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిస్కమ్‌లన్నీ సామాన్యులపై భారం మోపేందుకు అంగీకరించకపోవడం శుభపరిణామమన్నారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులపై 2023–24లో ఎలాంటి భారం ఉండదని చెప్పారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు రాయితీలు కొనసాగిస్తూ డిమాండ్ చార్జీలు, టైమ్ ఆఫ్ ది డే, కనీస చార్జీల పెంపు అంశాల్లో మార్పులు చేయాలని డిస్కమ్‌లు కోరినట్లు తెలిపారు. దీన్ని క్షుణ్నంగా పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం నుంచి రావాలి్సన బకాయిల విషయంలో రాజకీయ ఆరోపణలన్నీ నిరాధారమని, వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలను తెలియచేయవచ్చన్నారు. అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని వెలువరిస్తామని తెలిపారు. విద్యుత్ సేవల్లో జాప్యం జరిగితే సంబంధిత డిస్కమ్‌లు వినియోగదారులకు పరిహారం చెల్లించాలి్సందేనని, దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారిపై భారం పడకుండా ప్రభుత్వం, ఏపీఈఆర్సీ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. డిస్కమ్‌లు చేసే ఎన్నో ప్రతిపాదనల్ని తిరస్కరిస్తున్నామని, సహేతుక కారణాలుంటే మినహా ఈఆర్సీ అనుమతులు మంజూరు చేసే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో ఏపీఈఆర్సీ కార్యదర్శి రాజబాపయ్య, ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్‌రావు, సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్థనరెడ్డితో పాటు డిస్కమ్‌ల డైరెక్టర్లు ఏవీవీ సూర్యప్రతాప్, డి.చంద్రం, బి.రమేష్‌ప్రసాద్, ఎస్ఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. – ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి -
వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు పెరగవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2023–24 ఆర్థిక సంవత్సరానికి చేసిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ సరఫరా ధరల ప్రతిపాదనల్లో గృహ విద్యుత్ వినియోగదారులకు, వాణిజ్య అవసరాలకు, సాధారణ పరిశ్రమల రంగానికి, స్థానిక సంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు నీటిపారుదల ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీల పెంపుదల లేదని రాష్ట్ర ఇంధన శాఖ స్పష్టంచేసింది. ‘సాక్షి’ ప్రతినిధికి గురువారం ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు చేసిన టారిఫ్ ప్రతిపాదనల సమగ్ర వివరాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి గతనెల 30న సమర్పించాయి. వాటి ప్రతులు ఏపీఈఆర్సీ, పంపిణీ సంస్థల వెబ్సైట్లలో ఉన్నాయి. నివేదిక ప్రతులు డిస్కంల ప్రధాన కార్యాలయంలోను, సర్కిల్ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీల్లో ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సరఫరా సేవా ఖర్చు నిర్దేశిత యూనిట్ ఖర్చు రూ.6.98 కన్నా రూ.0.70æ పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ఆ భారాన్ని ఏ వర్గంపైనా వేయడంలేదు. జనం నెత్తిన రూ.13,487.54 కోట్లు భారం పడుతోందని పచ్చ పత్రికలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అది పంపిణీ సంస్థల వార్షిక ఆదాయ ఆవశ్యకతకు, ప్రస్తుతం టారిఫ్, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయానికి మధ్య వుండే వ్యత్యాసం మాత్రమే. ఇదంతా ధరలను పెంచడం ద్వారా వినియోగదారులపై మోపడం జరగదు. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి, ప్రజాభిప్రాయం తీసుకుని, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇచ్చే విద్యుత్ సబ్సిడీ, ఇతర రాయతీల ద్వారా ఈ ఆదాయ అంతరాన్ని విద్యుత్ సంస్థలు పూడ్చుకుంటాయి. చార్జీల వసూలు ద్వారా నష్టాల భర్తీ జరగదు రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు అంటే.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం, ఆక్వా రంగం.. తదితరులకు అందించే విద్యుత్ రాయితీల మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11,123 కోట్లుగా నిర్ధారించారు. అయితే, ఏపీఈఆర్సీకి సమర్పించిన ప్రతిపాదనల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటగిరి వారీగా, శ్లాబుల వారీగా ప్రస్తుతం అమలులో వున్న ధరలనే ప్రతిపాదిస్తూ (ఇప్పటికే రాయితీ పొందుతున్న ఎనర్జి ఇంటెన్సివ్ పరిశ్రమలకు మినహా) నివేదిక ఇచ్చారు. అంతేగానీ, నష్టాలను చార్జీల వసూలుతో భర్తీ చేసుకుంటామని ఎక్కడా ప్రతిపాదించలేదు. వినియోగదారులపై విద్యుత్ చార్జీల పెంపుదల ప్రతిపాదన చాలా గోప్యంగా ఉంచారన్నది కూడా పూర్తిగా అవాస్తవం. డిస్కంల వారీగా సేవా ఖర్చు ఇక డిస్కంల కొనుగోలు వ్యయంపై వేర్వేరు గణాంకాలు సమర్పించాయనడం సరైంది కాదు. పంపిణీ సంస్థ సేవా ఖర్చు (కాస్ట్ అఫ్ సర్వీస్)లో వివిధ భాగాలు అంటే.. విద్యుత్ కొనుగోలు వ్యయం, ప్రసార, పంపిణీ నష్టాలు, నెట్వర్క్ నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, మరమ్మతు ఖర్చులు మొదలైనవి ఒక్కో డిస్కంలో ఒక్కో విధంగా ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు డిస్కంలకు విద్యుత్ కొనుగోలు వ్యయం, మొత్తం సేవా ఖర్చు–కాస్ట్ అఫ్ సర్వీస్ ప్రతీ యూనిట్‌కు ఇలా వున్నాయి.. (రూ.లలో) -
స్మార్ట్ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!?
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో తలపెట్టిన స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ఎటువంటి రుణాలు తీసుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ‘సాక్షి’కి స్పష్టంచేశాయి. రూ.1,850 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరాయనడంలో ఎలాంటి నిజంలేదని అవి తేల్చిచెప్పాయి. ‘స్మార్ట్‌గా భారం’ శీర్షికన ‘ఈనాడు’ గురువారం ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె. సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె. పద్మజనార్థనరెడ్డి గురువారం ఖండించారు. పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద అన్ని రాష్ట్రాల్లోనూ మీటర్లను అమర్చుతున్నారని.. అందులో భాగంగా రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు 23 శాతం మీటర్లకు మాత్రమే ప్రీపెయిడ్ మీటర్లు (స్మార్ట్ మీటర్లు) అమర్చేందుకు ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారుచేశాయని వారు వివరించారు. దీనిలో భాగంగా ప్రాజెక్టు అమలుకోసం కొత్తగా ఎలాంటి రుణాలు చేయడంలేదని.. అదే విధంగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇంతవరకూ ఎటువంటి విమర్శలు విద్యుత్ సంస్థల వరకూ రాలేదని వారు తెలిపారు. మీటర్ల నాణ్యతలో రాజీపడకుండా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎండీలు వెల్లడించారు. పారదర్శకంగా టెండర్లు ఇక రాష్ట్రంలో మొత్తం 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు దశల వారీగా స్మార్ట్‌మీటర్లను అమర్చనున్నట్లు సీఎండీలు తెలిపారు. తొలిదశకు సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలైందని.. ఈ టెండర్ల ప్రక్రియలో కేంద్ర ఇంధన శాఖ రూపొందించిన నిబంధనలను పాటిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థలన్నీ అవే నిబంధనల్ని అనుసరిస్తున్నాయని.. దీని ప్రకారం టెండర్లలో పాల్గొనే సంస్థలు కేంద్ర ఇంధన శాఖ ఆమోదం పొందాలన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో నమోదు ప్రక్రియను పూర్తిచేసి ఆమోదం పొందిన 29 సంస్థల వివరాలను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) వెబ్సైట్లో ఉంచారని వారు చెప్పారు. టెండరు నిబంధనలను ఇష్టానుసారం మార్చేందుకు వీల్లేదని వివరించారు. నెలనెలా చెల్లింపులు.. మరోవైపు.. మీటర్ ధర, దాని నిర్వహణకయ్యే ఖర్చును ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరంలేదని వారన్నారు. టెండర్ దక్కించుకున్న సంస్థకు ఆ మొత్తాన్నీ పదేళ్లపాటు ప్రతినెలా డిస్కంలు చెల్లిస్తాయన్నారు. తొలి విడత మీటర్ల ఏర్పాటుకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.1,658 కోట్లకు, పశ్చిమ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.947 కోట్లు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.1,508 కోట్లు వ్యయ అంచనాలను రూపొందించి సాంకేతిక, పరిపాలన, డీఆర్సీ, మంత్రిమండలి అనుమతి పొందాయని వివరించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన పత్రాలను న్యాయ సమీక్షకు పంపగా జ్యూడీషియల్ అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. దీంతో టెండర్ ప్రక్రియను ప్రారంభించాయని.. ఈ మొత్తం వ్యయంలో ఎటువంటి భారం వినియోగదారులపై పడదని వారు స్పష్టంచేశారు. కేంద్ర నిబంధనల మేరకే.. పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) గతేడాది జూలై 20న ప్రారంభమైంది. నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ పంపిణీ, వాణిజ్య నష్టాలు 12–15 శాతం తగ్గించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్లను ఏర్పాటుచేయడం.. విద్యుత్ పంపిణీ ఫీడర్లకు, ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్‌మీటర్లు అమర్చాలనే నిబంధనలు విధించారు. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ పనులు చేపట్టాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు డిస్కంలు ప్రీ పెయిడ్ స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ప్రణాళికలను పంపి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాయి. ఈ పథకం కింద డిసెంబర్ 2023లోగా ఏర్పాటుచేసిన ఒక్కో ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్‌కు రూ.900లు గ్రాంట్ రూపంలోనూ, అదనంగా రూ.450లు ఇన్సెటివ్ రూపంలోనూ కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి.. అని సీఎండీలు వివరించారు. డిస్కంలకు, వినియోగదారులకు మేలు నిజానికి.. కొత్త టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా డిస్కంలకు, వినియోగదారులకు పలు ప్రయోజనాలున్నాయి. ► ముఖ్యంగా ఈ మీటర్ల ద్వారా వినియోగదారుని బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ► బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి బిల్లును చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ► విద్యుత్ ఏ సమయాల్లో సరఫరా అవుతోంది.. నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోందా లేదా.. అనే సమాచారాన్ని కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ► ఇక విద్యుత్ బిల్లు కట్టలేదని లైన్మెన్ కరెంట్ స్తంభం ఎక్కి కరెంట్‌ను నిలిపివేయాల్సిన అవసరం ఉండదు. ► డిస్కంల పరిధిలో విద్యుత్ చౌర్యాన్ని అడ్డుకునేందుకు ఆస్కారం దొరుకుతుంది. -
TS: ప్రజలకు ఊరటనిచ్చిన ప్రభుత్వం.. విద్యుత్ చార్జీల పెంపు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24)లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచకుండా ఇప్పుడున్నట్టుగానే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుత రిటైల్ టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించాలంటూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎనీ్పడీసీఎల్/ టీఎస్ఎస్పీడీసీఎల్)లు ప్రతిపాదించాయి. ఈ మేరకు 2023–24 ఏడాదికి సంబంధించిన వార్షిక ఆదాయ, అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తోపాటు రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలను ఉత్తర, దక్షిణ డిస్కంల డైరెక్టర్లు పి.గణపతి, ఎస్.స్వామిరెడ్డి బుధవారం ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు (టెక్నికల్) ఎం.డి.మనోహర్ రాజుకు సమర్పించారు. ప్రతిపాదనల వివరాలను చైర్మన్ శ్రీరంగారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.2023–24లో రూ.54,060 కోట్ల వ్యయం అవుతుందని.. ప్రస్తుత విద్యుత్ చార్జీలను యథాతథంగా అమలుచేస్తే రూ.43,525 కోట్లు మాత్రమే వస్తాయని రెండు డిస్కంలు అంచనా వేసినట్టు తెలిపారు. రూ.10,535 కోట్ల లోటు వస్తుండగా.. ఆ మేరకు విద్యుత్ సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నాయని వివరించారు. ఉచిత, రాయితీ పథకాలు యథాతథం రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతినెలా ఎస్సీ, ఎస్టీల గృహాలకు 101 యూని ట్లు, క్షౌరశాలలు, లాండ్రీలకు 250 యూని ట్ల వరకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్, పౌల్ట్రీఫారాలు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్‌పై రూ.2 రాయితీ పథకాలు యథాతథంగా వచ్చే ఏడాది అమలు చేస్తామని డిస్కంలు ప్రతిపాదనల్లో తెలిపాయి. పెంచేదీ, తగ్గించేదీ మేమే నిర్ణయిస్తాం: ఈఆర్సీ ప్రస్తుత విద్యుత్ చార్జీలనే వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని డిస్కంలు ప్రతిపాదించినా.. వాటి ఆర్థిక పరిస్థితులను పరిశీలించిన తర్వాత అవసరమైన మేర చార్జీల తగ్గింపు లేదా పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు స్పష్టం చేశారు. డిస్కంల ప్రతిపాదనలను ఈఆర్సీ వెబ్సైట్లో పెట్టి, అన్నివర్గాల వినియోగదారుల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ప్రార్థన స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ చార్జీలను తగ్గించాలన్న విజ్ఞప్తులు తమ పరిశీలనలో ఉన్నాయని, ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. కాగా.. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై ఉందని శ్రీరంగారావు పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలు, ఎత్తిపోతల పథకాల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఉత్తర డిస్కం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉందని విలేకరుల ప్రశ్నలకు బదులుగా చెప్పారు. కొన్ని డివిజన్లలో విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీఅండ్‌సీ) 50శాతానికి మించి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ఎస్ఏ పేరిట యూనిట్‌కు 30పైసలదాకా వడ్డనకు చాన్స్! బొగ్గు ధరల పెరుగుదలతో పడుతున్న అదనపు విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని.. ఇంధన సర్దుబాటు చార్జీ (ఎఫ్ఎస్ఏ)ల రూపంలో ఎప్పటికప్పుడు వసూలు చేసేందుకు డిస్కంలు అనుమతి కోరగా.. అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రకటించినట్టు శ్రీరంగారావు తెలిపారు. ప్రతి నెలా యూనిట్ విద్యుత్‌పై గరిష్టంగా 30పైసల వరకు ఈ అదనపు చార్జీలు వసూలు చేసేందుకు ఈ నిబంధనలు అనుమతిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముసాయిదా నిబంధనలను పంపామని, దీనిపై తుది ఉత్తర్వులు జారీచేశాక అమల్లోకి వస్తాయని వివరించారు. డిస్కంల ప్రతిపాదనల్లోని ముఖ్య గణాంకాలివీ.. ► 2023–24లో విద్యుత్ అవసరం అంచనా: 83,113 మిలియన్ యూనిట్లు ► వినియోగదారులకు విద్యుత్ విక్రయ అంచనా: 73,618 మిలియన్ యూని ట్లు (మిగతాది నష్టాలు, ఇతర రూపా ల్లో వినియోగం) ► వార్షిక ఆదాయ అవసరం అంచనా: టీఎస్ఎస్పీడీసీఎల్కు రూ.36,963 కోట్లు, టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌కు రూ.17, 095 కోట్లు. మొత్తం రూ.54,060 కోట్లు. ► ప్రస్తుత విద్యుత్ చార్జీలతో రానున్న ఆదాయ అంచనా: రూ.43,525 కోట్లు ► ఆదాయ లోటు టీఎస్ఎస్పీడీసీఎల్కు రూ.3,211 కోట్లు, టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌కు రూ.7,324 కోట్లు. మొత్తం లోటు రూ.10,535 కోట్లు. (ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీగా ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.) ► 2023–24లో సగటున ఒక్కో యూనిట్ విద్యుత్ సరఫరాకు అయ్యే వాస్తవ వ్యయ అంచనా: రూ.7.34 చదవండి: కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం.. -
అద్దెకివ్వండి.. ఆదాయం పొందండి!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సంస్కరణల్లో భాగంగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అప్పులు రూ.1.32 లక్షల కోట్లకు చేరడంతో వాటి వసూలుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. తాజాగా రాష్ట్రాలకు ఓ మార్గాన్ని చూపింది. గతేడాది అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రిసిటీరూల్స్–2021(ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్)కు కొనసాగింపుగా మరికొన్ని నిబంధనలను ప్రవేశపెడుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా రాష్ట్రాలు తమ ఆధీనంలోని విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అమ్ముకునేందుకు, ఇతరుల నుంచి కొనుక్కునేందుకు, లీజుకు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ వెసులుబాట్లతో విద్యుత్ సంస్థలు ఆదాయాన్ని ఆర్జించి అప్పుల ఊబి నుంచి బయటపడతాయని కేంద్రం చెబుతోంది. నెట్వర్క్ సమస్యకు చెక్ ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్‌కో)కు ప్రస్తుతం 5,532.161 సీకేఎం(సర్క్యూట్ కిలోమీటర్ల) మేర 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 12,200.9 సీకేఎం మేర 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 13,568.18 సీకేఎం మేర 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. మొత్తంగా 400 కేవీ, 220 కేవీ,132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు 354 ఉండగా, వాటి ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థలకు ఏడాదికి సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్పొరేషన్ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్లను ప్రయివేటుకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిస్కంల ఆధీనంలోని ట్రాన్స్మిషన్ లైన్ల లీజుకు అవకాశం కల్పించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న లైన్లను అద్దె ప్రాతిపదికన ఇకపై ఎవరికైనా ఇవ్వొచ్చు. భవిష్యత్‌లో రానున్న ప్రైవేటు డిస్కంలకు నెట్వర్క్ సమస్యలు రాకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. ఇదీ చదవండి: రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన! -
మెరుగ్గా ఏపీ డిస్కంల పనితీరు
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ముందుకు వెళుతున్నాయి. విద్యుత్ సంస్థల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికే ఇందుకు నిదర్శనం. దేశవ్యాపంగా డిస్కంల సాంకేతిక, వాణిజ్య నష్టాలు 2020–21 సంవత్సరానికి సగటున 22.32 శాతంగా ఉంటే.. ఏపీలో 11.21 శాతంగా, తెలంగాణలో 13.33 శాతంగా నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా 10,05,044 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయం జరగ్గా.. ఇందులో ఏపీ వాటా 6.22 శాతం, తెలంగాణ వాటా 5.92 శాతంగా ఉంది. విద్యుత్ కొనుగోలు బకాయిల చెల్లింపునకు దేశవ్యాప్తంగా సగటున 176 రోజులు పడుతుండగా, ఏపీ కేవలం 181 రోజులకే చెల్లిస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ 292 రోజుల సమయం తీసుకుంటోంది. ప్రభుత్వ సహకారంతోనే.. ‘ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలన్నీ బలపడుతున్నాయి. రివర్స్ టెండరింగ్ ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నాయి. బొగ్గు, విద్యుత్ కొనుగోళ్లలో ప్రజా ధనాన్ని ఆదా చేస్తున్నాయి. వ్యవస్థను బలోపేతం చేసుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని సరఫరా నష్టాలను తగ్గించుకుంటున్నాయి’ అని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. -
పొరబడిన ‘ప్రాప్తి’: నిషేధానికి గురైన రాష్ట్రాల జాబితా నుంచి ఏపీ పేరు తొలగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్)లో విద్యుత్ కొనుగోలు, విక్రయాలు నిర్వహించకుండా నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన ‘ప్రాప్తి’ వెబ్ పోర్టల్ సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఏపీ సహా 13 రాష్ట్రాల్లోని 29 డిస్కమ్‌లపై గురువారం కేంద్రం నియంత్రణ విధించిన సంగతి తెలిసిందే. బకాయిలను ఏపీ డిస్కమ్‌లు సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ ప్రాప్తి పోర్టల్‌లో బకాయిదారుల జాబితాలో చేర్చటాన్ని రాష్ట్ర ఇంధన శాఖ కేంద్రం దృష్టికి తెచ్చింది. దీంతో పొరపాటును గుర్తించిన కేంద్రం నిషేధిత రాష్ట్రాల జాబితా నుంచి ఏపీని తొలగిస్తూ విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలను యధావిధిగా నిర్వహించేందుకు అనుమతించాలని ఐఈఎక్స్‌ను ఆదేశించింది. తొలి వాయిదా చెల్లించాం.. రెండో దానికి టైముంది కేంద్ర విద్యుత్తు శాఖ ఈ ఏడాది జూన్ 3న లేట్ పేమెంట్ సర్‌చార్జ్ (ఎల్పీఎస్) స్కీం కింద బకాయిల వసూలుకు సర్‌చార్జ్ రూల్స్ 2022 రూపొందించింది. విద్యుత్ ఉత్పాదక సంస్థలు, ఇంటర్–స్టేట్ ట్రాన్స్ మిషన్ లైసెన్సీలు, ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ లైసెన్సీల బకాయిలకు ఈ నియమాలు వర్తిస్తాయి. వీటి ప్రకారం ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను 45 రోజుల్లోగా డిస్కంలు చెల్లించాలి. లేదంటే విద్యుత్ క్రయ విక్రయాలపై నిషేధం విధిస్తారు. ఈ నేపథ్యంలో ఎల్పీఎస్ పథకం కింద మే 30 వరకు బకాయిలన్నీ ఏపీ డిస్కంలు చెల్లిస్తున్నాయి. పథకం పరిధిలోకి వచ్చిన బకాయిలు రూ.17,074.90 కోట్లు కాగా ఈ మొత్తాన్నీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ)ల ద్వారా 12 వాయిదాలలో చెల్లించేందుకు ఏపీ అంగీకరించింది. మొదటి విడతగా ఈ నెల 5న రూ.1,407 కోట్లను చెల్లించింది. రెండో విడత వాయిదా చెల్లించేందుకు సెప్టెంబర్ 5 వరకు గడువు ఉంది. నిరంతరాయంగా సరఫరా.. నిషేధం విధించే సమయానికి రాష్ట్రంలో డిమాండ్ 211.22 మిలియన్ యూనిట్లు ఉండగా ఆ మేరకు సరిపడా విద్యుత్‌ను ఎటువంటి అంతరాయాలు లేకుండా వినియోగదారులకు అందించారు. ఏపీ జెన్కో థర్మల్ నుంచి 55.94 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో హైడల్ నుంచి 23.46 మి.యూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్ల నుంచి 44.07 మి.యూ, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ నుంచి 21.20 మి.యూ, పవన విద్యుత్ 31.87 మి.యూ, సౌర విద్యుత్ 22.27 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరగా ఎనర్జీ ఎక్సేంజ్ ద్వారా 11.96 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.7.69 చొప్పున చెల్లించి రూ.9.52 కోట్లతో కొనుగోలు చేశారు. మన రాష్ట్రం నుంచి ఎక్సేంజ్‌లో 0.41 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించారు. శుక్రవారం 208 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేసి ఆ మేరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఇంధన శాఖ వెల్లడించింది. బిహార్‌లో 6.18 మి.యూ, ఉత్తర్‌ప్రదేశ్‌లో 3.49 మి.యూ, జార్ఖండ్‌లో 2.06 మి.యూ, మధ్యప్రదేశ్‌లో 1.39 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడినప్పటికీ మన రాష్ట్రంలో ఎలాంటి లోటు లేకుండా విద్యుత్ సరఫరా చేసినట్లు తెలిపింది. యధావిధిగా ట్రేడింగ్ ‘‘ఏపీ డిస్కంలు విద్యుదుత్పత్తి దారులకు రూ.412.69 కోట్లు బకాయి ఉన్నట్లు ప్రాప్తి పోర్టల్‌లో పొరపాటుగా చూపడం వల్ల ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ విద్యుత్ మార్కెట్లకు స్వల్పకాలిక అనుమతిని నియంత్రించింది. వాస్తవానికి ఈ బకాయిలను ఏపీ డిస్కంలు ఇప్పటికే చెల్లించాయి. ఈ విషయాన్ని ప్రాప్తి పోర్టల్ దృష్టికి తెచ్చాం. అంతేకాకుండా కొన్ని బకాయిలు ఎల్పీసీ పథకం కింద ఇప్పటికే చెల్లించేశాం. అయినప్పటికీ బకాయిలున్నట్లు చూపడంపై పోర్టల్ అధికారులకు సమాచారం అందించాం. దీంతో యాక్సెస్ పరిమితిని తొలగించారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఏపీ డిస్కంలు ఎనర్జీ ఎక్సేంజీలో ట్రేడింగ్ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగిస్తున్నాయి’’ –కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చదవండి: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు -
ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య లేనట్టే..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌లు.. జనరేటర్లకు రూ.412 కోట్లు బకాయి ఉన్నట్టు చూపించిన ప్రాప్తి పోర్టల్ తన పొరపాటును సవరించింది. ఈ బకాయిలను ఇప్పటికే డిస్కమ్‌లు చెల్లించేశాయి. ఈ విషయాన్ని ప్రాప్తి పోర్టల్ దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. దీంతో ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య ఇక లేనట్టే.. ఎల్పీఎస్-2002 నిబంధనలను ఏపీ డిస్కమ్‌లు ఖచ్చితంగా పాటిస్తున్నాయి. ఆగష్టు 5న జనరేటర్లకు రూ.1407 కోట్లు డిస్కమ్‌లు చెల్లించాయి. ప్రస్తుతం నిబంధనల ప్రకారం డిస్కమ్‌లకు ఎలాంటి బకాయిలు లేవు. ఏపీ అధికారుల సమాచారాన్ని ప్రాప్తి పోర్టల్ అప్డేట్ చేసింది. చదవండి: చంద్రబాబు పాపం.. డిస్కంలకు శాపం విద్యుత్ మార్కెట్లకు స్వల్పకాలిక యాక్సెస్‌పై పరిమితి తొలగించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. నిన్న అర్థరాత్రి నుండి యథాతథంగా విద్యుత్ ఎక్స్ఛేంజీలపై ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా 18న 211 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ని డిస్కమ్‌లు రీచ్ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామని విజయానంద్ పేర్కొన్నారు. -
‘హిందూజా’, డిస్కంల వివాదం పరిష్కారం
సాక్షి, అమరావతి: పాతికేళ్లుగా హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌పీసీఎల్), డిస్కంల మధ్య నడుస్తున్న వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పరిష్కరించింది. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఏపీఈఆర్సీ ఇరు వర్గాలకు ఇబ్బంది లేని విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం సమీపంలోని పాలవలసలో హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు 1,040 మెగావాట్ల బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ ఉంది. దీని నుంచి విద్యుత్ కొనుగోలుకు 1992లో ఏపీ డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం 1994లో 30 ఏళ్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. 1996లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ తరువాత వివిధ కారణాల వల్ల డిస్కంలకు, హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు మధ్య వివాదం తలెత్తింది. తమకు అవసరం లేకపోయినా ఎక్కువ ధర చెల్లించి విద్యుత్‌ను ఎందుకు తీసుకోవాలని, పీపీఏను పునఃసమీక్షించాలని డిస్కంలు పట్టుబట్టాయి. దీంతో 1998లో మరోసారి ఒప్పందం జరిగింది. అయినప్పటికీ వివాదం సమసిపోలేదు. మరోవైపు సంస్థ మూలధనం రూ.7,758 కోట్లుగా ఏపీఈఆర్సీకి హెచ్‌ఎన్‌పీసీఎల్ చూపించింది. దీనిపై విచారణ చేపట్టిన మండలి హెచ్‌ఎన్‌పీసీఎల్ చెబుతున్న మూలధనంలో రూ.5,810.75 కోట్లకు ఆమోదం తెలిపింది. పాతికేళ్లకే ఒప్పందం కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం తాజా అనుమతులను ఇవ్వడం ఆపివేసింది. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్న పారిస్ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు డిస్కంలకు మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని 30 సంవత్సరాలకు బదులుగా ప్రాజెక్ట్ వాణిజ్య కార్యకలాపాలు మొదలైన తేదీ నుండి 25 సంవత్సరాలుగా ఏపీఈఆర్సీ నిర్ణయించింది. హిందూజా పవర్ యూనిట్ ధర రూ.3.98 గా తేల్చింది. అంతేకాకుండా గత ఆరేళ్లలో హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు డిస్కంలు చెల్లించిన అడ్హాక్ టారిఫ్‌లను తుది టారిఫ్‌లుగా పరిగణించామని, కంపెనీ ఎలాంటి బకాయిలను వసూలు చేయడానికి వీల్లేదని చెప్పింది. తద్వారా డిస్కంలపై అదనపు భారం పడకుండా కాపాడింది. విద్యుత్ కొనుగోలు చార్జీ(ట్రూ అప్) భారం పడకుండా ప్రజలకు మేలు చేసింది. అయితే డిస్కంలకు విద్యుత్ అవసరం లేనప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ విక్రయించుకునేందుకు సంస్థకు అనుమతినిచ్చింది. -
ప్రైవేటు డిస్కంలకు లైన్ క్లియర్! విద్యుత్ చట్ట సవరణ బిల్లు బహిర్గతం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో ప్రభుత్వ విద్యుత్ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరవేస్తూ.. ప్రైవేటు డిస్కంలకు తలుపులు తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రం నూతన సంస్కరణలతో తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు ముసాయిదా శుక్రవారం బహిర్గతమైంది. దీనిని ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అందులోని కీలక అంశాలు.. ►ఎక్కడైనా ఒకే ప్రాంతం పరిధిలో విద్యుత్ సరఫరా చేసేందుకు ఎక్కువ డిస్కంలకు అనుమతులు ఇవ్వనున్నారు. సొంత ట్రాన్స్మిషన్ వ్యవస్థ (విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు) ఉన్న కంపెనీలకే లైసెన్స్ అన్న నిబంధనను తొలగిస్తున్నారు. దీనితో ప్రైవేటు కంపెనీలూ తెరపైకి రానున్నాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా లైసెన్స్ జారీ చేసేలా కేంద్ర నిబంధనలు ఉన్నాయి. ►ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ల ద్వారా వచ్చే విద్యుత్‌ను, అందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రాల ఈఆర్సీలు.. భవిష్యత్తులో వచ్చే అన్ని కంపెనీలకు సమానంగా పంచాల్సి ఉంటుంది. అదనపు విద్యుత్ అవసరమైన కంపెనీలు కొత్తగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చేసుకోవాల్సి ఉంటుంది. ►రిటైల్ విద్యుత్‌కు సంబంధించి గరిష్ట, కనిష్ట ధరలను మాత్రమే రాష్ట్రాల ఈఆర్సీలు నిర్ణయిస్తాయి. అంటే ఈ గరిష్ట, కనిష్ట ధరల మధ్య ఎవరు తక్కువ చార్జీలను ఆఫర్ చేస్తే ఆ కంపెనీని ఎంపిక చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుంది. సంస్థల మధ్య పోటీ వల్ల నాణ్యమైన సరఫరా ఉంటుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.ప్రైవేటు డిస్కంల రాకతో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఎసరు వచ్చే పరిస్థితి ఉంటుందన్న ఆందోళన కనిపిస్తోంది. ►ప్రస్తుతం విద్యుత్ రంగం రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉంది. ఇప్పుడీ సవరణలు అమల్లోకి వస్తే.. విద్యుత్ రంగం పూర్తిగా కేంద్రం గుప్పిట్లోకి వెళుతుందన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. చదవండి: మూడురోజులు అతిభారీ వర్షాలు! -
రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట.. రూ.10,200 కోట్ల రుణాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. గతంలో నిలుపుదల చేసిన రూ.10,200 కోట్ల రుణాలను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 2017 జనవరిలో చేరింది. ఈ పథకం కింద రాష్ట్ర డిస్కంలకు సంబంధించిన 75 శాతం రుణాలను టేకోవర్ చేసుకోవడానికి సమ్మతి తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం, డిస్కంలతో రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల రుణాలను టేకోవర్ చేసుకోకపోవడంతో అప్పట్లో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.75 శాతం డిస్కంల రుణాలకు సరిపడా రూ.10,200 కోట్ల ఎఫ్ఆర్బీఎం రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా కోత విధించింది. ఫలించిన తాజా చర్చలు తాజాగా సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.రామకృష్ణారావు, రజత్‌కుమార్, ఇతర అధికారుల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిసి నిలిచిపోయిన వివిధ రుణాలకు సంబంధించిన అంశంపై చర్చలు జరిపింది. ఉదయ్ రుణాలు టేకో వర్ చేసుకోనందుకు గతంలో కోత విధించిన రాష్ట్ర రుణాలకు తిరిగి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 2017–21 మధ్య కాలానికి సంబంధించిన డిస్కంల నష్టాలు రూ.8,925 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకుంటూ గత నెలలో ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించింది. అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి.. ఆర్ఈసీ, పీఎఫ్సీ నుంచి ఒప్పందాల మేరకు రావాల్సిన రుణాల విడుదలకు సైతం అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గతంలో నిలుపుదల చేసిన రూ.10,200 కోట్ల రుణాలను తీసుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తక్షణమే అనుమతిచ్చారు. ఈ మేరకు లేఖను సైతం అందజేశారు. అయితే ఇటీవల నిలిపివేసిన ఆర్ఈసీ, పీఎఫ్సీ రుణాలపై మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలిసింది. కస్టమ్ మిల్లింగ్ గడువు పొడిగింపు ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అవసరాల కోసం కస్టమ్ మిల్లింగ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2021–22లో ఎఫ్‌సీఐకి బకాయిపడిన 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండేను.. సీఎస్ సోమేశ్‌కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ బుధవారం ఢిల్లీలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. బీజేపీపై పోరుకు సీఎం దిశానిర్దేశం! – ఎంపీలతో కేసీఆర్ చర్చలు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తాజా రాజకీయ పరిణామాలపై పలువురు టీఆర్ఎస్ ఎంపీలతో బుధవారం చర్చలు జరిపారని తెలిసింది. పార్లమెంట్లో జరుగుతున్న ఆందోళనలపై ఆరా తీసిన సీఎం.. ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్న అధికార బీజేపీపై రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఏ విధంగా ఉధృతం చేయాలన్న అంశాలపై దిశానిర్దేశం చేశారని సమాచారం. మరోవైపు రాష్ట్ర ఆర్థిక అంశాలపై సీఎస్ సోమేశ్‌కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు. -
వారానికోసారి కట్టించేసుకోండి
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.లక్ష కోట్లకు పైగా బకాయి పడ్డ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. జెన్కోలకు ఊరట కలిగేలా డిస్కంల నుంచి వారం వారం పేమెంట్లను స్వీకరించాలని సూచించింది. అయితే ఈ నిర్ణయంతో ఇప్పటికే భారీ రుణభారంతో కష్టనష్టాల్లో ఉన్న డిస్కంలపై మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లేనని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. జెన్కోలకు పెరిగిన ఖర్చులు.. దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తగినంత బొగ్గు సరఫరా లేదు. దానికి తోడు బహిరంగ మార్కెట్ (పవర్ ఎక్సే్ఛంజీ)లో విద్యుత్ ధరలు భారీగా పెరిగాయి. కొంతకాలం క్రితం వరకు పీక్ అవర్స్‌లో యూనిట్ ధర రూ.20 వరకు వెచ్చించాల్సి వచ్చేది. ఇది చాలదన్నట్లు దేశీయ బొగ్గులో 10 శాతం విదేశీ దిగుమతి బొగ్గును కలిపి వాడాలని, విదేశీ బొగ్గు సరఫరా ఈ నెల నుంచే మొదలవ్వాలని కేంద్రం నిబంధన విధించింది. ఒకప్పుడు టన్ను బొగ్గు రూ.4వేల నుంచి రూ.7 వేలు ఉండేది. కానీ ఇప్పుడది రూ.19 వేల నుంచి రూ.24 వేలకు పెరిగింది. ఇంత ఖర్చవుతున్నా డిస్కంల నుంచి వస్తున్నది మాత్రం ఆ మేరకు ఉండడం లేదు. దీంతో వారం వారం బిల్లులు వసూలు చేస్తే, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులకు వాడుకోవచ్చనేది కేంద్రం భావన. డిస్కంలకు భారమే..అయినా.. కేంద్రం చెప్పిన దాని ప్రకారం..డిస్కంలు విద్యుత్ ఉత్పత్తిదారులకు ప్రొవిజనల్ బిల్లులో కనీసం 15 శాతం ఒక వారంలోగా చెల్లించాలి. ఒకవేళ అలా జరగకపోతే విద్యుత్ జెన్కోలు వారి ఉత్పత్తిలో 15 శాతాన్ని పవర్ ఎక్సే్ఛంజీలకు విక్రయించుకోవచ్చు. పవర్ ప్లాంట్లు సాధారణంగా డిస్కంలతో దీర్ఘకాల (లాంగ్ టెర్మ్) అగ్రిమెంట్ల చేసుకుంటాయి. ఫిక్స్డ్ రేట్లనే కొనసాగిస్తుంటాయి. అయితే దిగుమతుల వల్ల వ్యయాలు పెరిగితే ఆ భారాన్ని డిస్కంలకు బ దిలీ చేయొచ్చు. ఈ లెక్కన విద్యుత్ పంపిణీ సంస్థలపై మరింత ఎక్కువ భారం పడనుంది. నిజానికి రుణభారం వల్ల డిస్కంల నుంచి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు సరైన సమయంలో చెల్లింపులు జరిగే పరిస్థితి లేదు. ఒకవేళ డిస్కంలు సరైన సమయానికి బిల్లులు చెల్లిస్తే మాత్రం విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు ఊరట కలుగుతుంది. అలాగే డిస్కంలకు కూడా ఊరట కలిగించేలా ఇటీవల కేంద్రం రుణ బకాయిలను 48 నెలల ఇన్స్టాల్మెంట్లలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. -
ప్రతి వారం 15% బిల్లు కట్టాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: విదేశీ బొగ్గు దిగుమతులకు సంబంధించి కేంద్రం రోజుకో కొత్త ఉత్తర్వుతో రాష్ట్రాలను కలవర పెడుతోంది. బొగ్గు దిగుమతులకు అవసరమైన నిధుల లభ్యతకు వీలుగా విద్యుదుత్పత్తి కంపెనీలకు ఇకపై ప్రతి వారం కనీసం 15 శాతం బిల్లులను చెల్లించాలని దేశ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను కేంద్ర విద్యుత్ శాఖ గురువారం ఆదేశించింది. విద్యుదుత్పత్తి కంపెనీలు బిల్లు జారీ చేసిన తేదీ నుంచి వారంలోగా తప్పనిసరిగా కనీసం 15 శాతం చెల్లింపులు చేయాలని, మిగిలిన 85 శాతం చెల్లింపులను విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లోని నిబంధనల ప్రకారం జరపాలని సూచించింది. వారంలోగా 15 శాతం బిల్లులు చెల్లించడంలో విఫలమైతే, విద్యుదుత్పత్తి కంపెనీలు ఒప్పందం ప్రకారం డిస్కంలకు అమ్మాల్సిన విద్యుత్‌లో 15 శాతాన్ని పవర్ ఎక్సే్చంజీల్లో అమ్ము కోవడానికి వీలు కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. 15% విద్యుత్ కోల్పోయే ప్రమాదం! ఈ నిబంధనల ప్రభావం రాష్ట్ర డిస్కంలపై పడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా ఎన్టీపీసీ, ఇతర కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి నుంచి 3,111 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్లు, ప్రైవేటు సెమ్‌కార్ప్ సంస్థ నుంచి 840 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను రాష్ట్ర డిస్కంలు కొనుగోలు చేస్తున్నాయి. 45 రోజుల్లోగా బిల్లులు చెల్లించడానికి ఒప్పందాల్లో నిబంధనలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే ఈ గడువులోగా చెల్లింపులు చేయకలేక ఇప్పటికే రూ.వందల కోట్ల అపరాధ రుసుముతో బకాయిలను చెల్లించే పరిస్థితిని డిస్కంలు ఎదుర్కొంటున్నాయి. తాజాగా కేంద్రం జారీ చేసిన తాజా ఆదేశాలు డిస్కంలకు మరింత ఇబ్బందికరంగా మారవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతివారం 15 శాతం బిల్లులను చెల్లించని పక్షంలో ఒప్పందం ప్రకారం రావాల్సిన విద్యుత్‌లో 15 శాతాన్ని రాష్ట్రం కోల్పోయే ప్రమాదం ఉంది. 10 శాతం దిగుమతి చేసుకున్న బొగ్గు వాడకంతో పెరగనున్న విద్యుదుత్పత్తి వ్యయాన్ని సైతం డిస్కంల నుంచి జనరేటర్లు వసూలు చేసుకోవాలని సూచించిన కేంద్ర విద్యుత్ శాఖ, ఈ అదనపు వ్యయాన్ని లెక్కించడానికి కొత్త ఫార్ములాను సైతం ప్రకటించడం గమనార్హం. ‘దిగుమతి బొగ్గు ప్రభావం’ ఉండదనుకుంటే కొత్త బెడద దేశంలో బొగ్గు కొరత తీవ్రమైన నేపథ్యంలో దేశంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 90 శాతం దేశీయ బొగ్గులో 10 శాతం దిగుమతి చేసుకున్న బొగ్గును తప్పనిసరిగా కలిపి (బ్లెండ్ చేయడం అంటారు) విద్యుదుత్పత్తి జరపాలని గతంలో కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన విదేశీ బొగ్గు కొనుగోళ్లకు ఈ నెల 31లోగా ఆర్డర్లు జారీ చేయాలని, వచ్చే నెల 15లోగా దిగుమతులు ప్లాంట్ల వద్దకు చేరుకోవాలని మరో ఉత్తర్వులో గడువులు విధించింది. గడువులోగా ఆర్డర్లు ఇవ్వని పక్షంలో ఆ తర్వాత 15 శాతం బొగ్గును దిగుమతి చేయాల్సి ఉంటుందని అల్టిమేటం జారీచేసింది. అయితే రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనులున్న నేపథ్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేదని, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో బొగ్గు దిగుమతులకు సంబంధించిన ఆదేశాల ప్రభావం జెన్కో, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఉండదని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ తాజాగా ప్రతి వారం 15 శాతం బిల్లులను జెనరేటర్లకు చెల్లించాలని, లేనిపక్షంలో 15 శాతం విద్యుత్ కట్ చేస్తామని కేంద్రం చెప్పడంతో కొత్త బెడద వచ్చి పడినట్టయ్యింది. -
48 వాయిదాల్లో బకాయిల చెల్లింపు!
సాక్షి, హైదరాబాద్: విద్యుదుత్పత్తి కంపెనీలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు బకాయిపడిన రూ.వేల కోట్లను సులభ వాయిదాల్లో చెల్లించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త పథకాన్ని ప్రకటించబోతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న డిస్కంలు ఈ నెల 18 నాటికి విద్యుదుత్పత్తి కంపెనీలకు ఏకంగా రూ.1,00,018 కోట్ల బకాయిలు, నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయనందుకు మరో రూ.6,839 కోట్ల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంది. తెలంగాణ డిస్కంలు రూ.7,828 కోట్లు, ఏపీ డిస్కంలు రూ.9,983 కోట్ల బకాయి ఉన్నాయి. డిస్కంలు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయకపోవడంతో విద్యుత్ రంగంలోని వివిధ విభాగాల మధ్య నగదు ప్రవాహం స్తంభించి మొత్తం రంగంపై దుష్ప్రభావం పడుతోంది. బొగ్గు కొనుగోళ్లకు, నిర్వహణ పెట్టుబడికి నిధుల కొరతతో విద్యుదుత్పత్తి కంపెనీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపుల్లో డిస్కంల ఇబ్బందులను తొలగించడానికి కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. తప్పనున్న 19,833 కోట్ల ‘అపరాధ భారం’ ఈ పథకాన్ని ప్రకటించిన తేదీ నాటికి ఉన్న బకాయిల (అపరాధ రుసుముతో సహా) మొత్తంపై తదు పరిగా అపరాధ రుసుము విధించకుండా స్తంభింపజేస్తారు. మొత్తం బకాయిలను 48 వాయిదాల్లో చెల్లించడానికి వెసులుబాటు కల్పించనున్నారు. ఒకవేళ వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే మాత్రం మినహాయించబడిన మొత్తం అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఒకే పర్యాయం (వన్ టైం) అమలు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా డిస్కంలతో పాటు విద్యుదుత్పత్తి కంపెనీల ఆర్థిక పరిస్థితులు మెరుగు అవుతాయని కేంద్రం పేర్కొంటోంది. ఈ పథకంతో 48 నెలల్లో డిస్కంలపై రూ.19,833 కోట్ల అపరాధ రుసుం భారం తప్పనుంది. భారీగా బకాయిలున్న తమిళనాడు, మహారాష్ట్ర, డిస్కంలు చెరో రూ.4,500 కోట్లు, ఉత్తరప్రదేశ్ డిస్కంలు రూ.2,500 కోట్లు, ఏపీ, తెలంగాణ డిస్కంలు రూ.1,100 కోట్ల నుంచి రూ.1,700 కోట్ల అపరాధ రుసుం చెల్లింపుల నుంచి మినహాయింపు పొందనున్నాయి. దీంతో ఈ మేరకు విద్యుత్ చార్జీల పెంపు భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం లభించనుంది. అపరాధ రుసుం ఇలా..: గడువులోగా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించకపోతే ఎస్బీఐ రుణాల కనీస వడ్డీ రేటును ప్రామాణికంగా తీసుకుని మొదటి నెల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా జాప్యం జరిగితే ప్రతి నెలా 0.5% చొప్పున, ఎస్బీఐ కనీస వడ్డీ రేటుకు అదనంగా 3% వరకు అపరాధ రుసుం పెంచి చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు పేర్కొంటున్నాయి. బకాయిలపై అపరాధ∙రుసుములు రూ.వేల కోట్లకు పెరిగి డిస్కంలు ఆర్థికంగా కుదేలు కావడంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొస్తోంది. -
పరిశ్రమలకు 'పవర్' ఫుల్
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై విధించిన అన్ని ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాను ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఇంకా కొనసాగుతున్నా, రాష్ట్రంలో నిత్యం 195.26 మిలియన్ యూనిట్ల డిమాండ్ నెలకొన్నప్పటికీ పరిశ్రమల మనుగడ, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచే పరిశ్రమలపై ఆంక్షల ఎత్తివేత వర్తిస్తుందని ఏపీఈఆర్సీ ఉత్తర్వుల్లో పేర్కొంది. బొగ్గు కొరత, ఎండలతో.. వేసవి ఉష్ణోగ్రతల ప్రభావంతో గత నెల ప్రారంభంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ దాదాపు 235 మిలియన్ యూనిట్లకు చేరింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా ధర్మల్ విద్యుదుత్పత్తిలో సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పవర్ ఎక్ఛ్సేంజీల్లో యూనిట్ ధర రూ.16 నుంచి రూ.20 వరకూ పెరిగింది. ఫలితంగా సరఫరా తగ్గి కోతలు అనివార్యమయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమల విద్యుత్ వినియోగంపై నియంత్రణ విధించాల్సి వచ్చింది. డిస్కమ్‌ల అభ్యర్ధన మేరకు పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలిడే అమలు చేస్తూ ఏపీఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఆదేశాలతో.. మే 9న పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేసి ప్రభుత్వం ఊరట కలిగించింది. నిరంతరం నడిచే పరిశ్రమలు 70 శాతం విద్యుత్ వాడుకోవడానికి అనుమతిచ్చింది. పగటిపూట నడిచే పరిశ్రమలపై ఆంక్షలను పూర్తిగా తొలగిస్తూ ఈ నెల 13న ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. ఈ నెల 15 తరువాత పరిశ్రమలపై ఆంక్షలను పొడిగించలేదు. పరిశ్రమలకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని, ఆంక్షలను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల విద్యుత్తు సంస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని ఆంక్షలు, నియంత్రణలను తొలగించడంతో పరిశ్రమలకు పూర్తి స్థాయిలో ఊరట లభించింది. వ్యవసాయం, గృహ విద్యుత్ అవసరాలకు కోతలు లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో విద్యుత్తు సరఫరా జరుగుతోంది. -
ఒక్క రూపాయి కూడా వదలకుండా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నాయి. ఒక్క రూపాయిని కూడా వదలకుండా తీసుకుంటున్నాయి. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి రాగా అప్పుడు ఏప్రిల్ 15లోపు ఏ తేదీ వరకైతే బిల్లు వేశారో దానికి పాత టారిఫ్‌నే అమలు చేశారు. అయితే ఏప్రిల్‌లో ఎన్ని రోజులకైతే పాత చార్జీలు వసూలు చేశారో ఆ రోజులకు తాజాగా కొత్త చార్జీలు వర్తింపజేసి మరీ రావాల్సిన అదనపు సొమ్మును వసూలు చేస్తున్నారు. టారిఫ్ డిఫరెన్స్ పేరుతో.. ప్రస్తుతం ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీలోగా మునుపటి నెల వినియోగానికి సంబంధించిన మీటర్ రీడింగ్ తీసి విద్యుత్ బిల్లులను జారీ చేస్తూ వస్తున్నారు. ఇదే తరహాలో గత మార్చి నెల విద్యుత్ బిల్లులను ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీలోగా జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి వచ్చినా బిల్లులు జారీ చేసిన తేదీ వరకు పాత టారీఫ్‌నే వర్తింపజేశారు. అంటే మార్చి 1–15 నుంచి ఏప్రిల్ 1–15 కాలాన్ని ఒక నెలగా పరిగణించి ఏప్రిల్‌లో బిల్లు జారీ చేశారు. ఒకే నెలలో రెండు వేర్వేరు టారిఫ్‌లు వర్తింపజేసి బిల్లు వసూలు చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ రకంగా చేయాల్సి వచ్చింది. అయితే ప్రస్తుత మే నెలలో జారీ చేస్తున్న గత ఏప్రిల్ నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లుల్లో మాత్రం ‘ఏప్రిల్ 1–15’కాలానికి సైతం పెరిగిన విద్యుత్ టారిఫ్‌ను వర్తింపజేసి ‘టారిఫ్ డిఫరెన్స్’పేరుతో చార్జీలను డిస్కంలు విధిస్తున్నాయి. ఉదాహరణకు మార్చి 1–15 నుంచి ఏప్రిల్ 1–15 మధ్య కాలంలో ఓ వినియోగదారుడు 200 యూనిట్లు వినియోగిస్తే అందులో ఏప్రిల్ 1–15 మధ్యన ఎన్ని యూనిట్లు వాడి ఉంటాడో సగటున లెక్క వేసి ఆ మేరకు యూనిట్లకు పెరిగిన విద్యుత్ చార్జీలను వర్తింపజేసి అదనంగా రావాల్సిన మొత్తాన్ని మే బిల్లులో వేస్తున్నాయి. ‘ఏప్రిల్ 1, 2022 నుంచి కొత్త టారిఫ్ ప్రకారం రావాల్సిన మొత్తాన్ని మే బిల్లులో వేయడం జరిగింది’అని బిల్లు కింద ముద్రిస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 1–15 కాలానికి పాత విద్యుత్ చార్జీల ప్రకారం ఇప్పటికే వినియోగదారులు బిల్లులు చెల్లించారు. కొత్త విద్యుత్ చార్జీల ప్రకారం అదనంగా రావాల్సిన బిల్లులను ఇప్పుడు వసూలు చేసుకుంటున్నాయి. గతంలో విద్యుత్ చార్జీలు పెరిగిన సందర్భాల్లో ఇలా అదనపు చార్జీలు వసూలు చేసిన దాఖలాల్లేవని అధికారులు పేర్కొంటున్నారు. -
Telangana: పరిశ్రమలకు షాక్! .. కంపల్సరీ కొనాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు డిస్కంలకే పరిమితమైన పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు నిబంధన ఇక ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ కొనేవాళ్లకూ వర్తించనుంది. డిస్కంలతో పాటు ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ వినియోగదారులూ ఏటా తప్పనిసరిగా నిర్దేశిత పరిమాణంలో రెన్యువబుల్ విద్యుత్ కొనుగోలు చేయాల్సి రాబోతోంది. ఇందుకు సంబంధించి తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు (రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్/ఈఆర్పీపీఓ) ముసాయిదా నిబంధనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా ప్రకటించింది. 2020–23 నుంచి 2026–27 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. డిస్కంలు, ఓపెన్ యాక్సెస్ వినియోగదారులు.. వాళ్లు కొనే మొత్తం విద్యుత్‌లో 8.5 శాతం పునరుత్పాదక ఇంధనాన్ని 2022–23లో కొనాలి. ఆ తర్వాత క్రమంగా ఏటా ఒక శాతం పెంచుకుంటూ 2026–27 నాటికి 13 శాతానికి పునరుత్పాక ఇంధన సరఫరాను పెంచాల్సి ఉంటుంది. పరిశ్రమలకు షాక్! పెద్ద మొత్తంలో విద్యుత్ వాడే భారీ పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్‌లో తక్కువకే దొరికే విద్యుత్ కొంటుంటాయి. సిమెంట్, పేపర్ వంటి కొన్ని భారీ పరిశ్రమలు కాప్టివ్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని స్వయంగా విద్యుదుత్పత్తి చేసుకుంటుంటాయి. ఓపెన్ యాక్సెస్ విధానం ద్వారా రాష్ట్రంలోని 700కు పైగా పారిశ్రామిక వినియోగదారులు విద్యుత్ కొంటున్నారు. ఈఆర్సీ తాజా ముసాయిదాతో వీళ్లకు విద్యుత్ కొనుగోలు భారంగా మారే అవకాశం ఉంది. వచ్చే ఐదేళ్లకు నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్న పునరుత్పాదక విద్యుత్ నిబంధనల గడువు 2021–22తో ముగియనుండటంతో రానున్న ఐదేళ్లకు కొత్త ముసాయిదా నిబంధలను ఈఆర్సీ ప్రకటించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 2021–22లో రాష్ట్ర డిస్కంలు 8 శాతం పునరుత్పాదక విద్యుత్‌ను కొనాలి. ఇందులో 7.1 శాతం సౌర విద్యుత్, 0.9 శాతం సౌరేతర పునరుత్పాదక విద్యుత్ ఉండేలా చూసుకోవాలి. గతంలో డిస్కంలకే వర్తించిన ఈ నిబంధనలు తాజాగా ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ వినియోగదారులకూ వర్తించనున్నాయి. డిస్కంలు, ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ వినియోగదారులు కొనే మొత్తంలో విద్యుత్‌లో పునరుత్పాక విద్యుత్ శాతం ఎంత ఉండాలో ఈ కింది పట్టికలో చూడవచ్చు. లక్ష్యం చేరకుంటే జరిమానాలు పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్ల సమాచారాన్ని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నుంచి ఈఆర్సీ సేకరించనుంది. నిర్దేశించిన లక్ష్యం మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయకపోతే డిస్కంలు, ఓపెన్ యాక్సెస్, కాప్టివ్ ప్లాంట్ల విద్యుత్ వినియోగదారులపై ఈఆర్సీ జరిమానా విధించనుంది. జరిమానాలు ఎంత విధించాలో బహిరంగ విచారణలో నిర్ణయం తీసుకోనుంది. జరిమానాలకు తోడు లక్ష్యం కంటే తక్కువ కొన్న పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించిన వ్యయాన్ని ప్రత్యేక ఫండ్‌గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లక్ష్యం కంటే తక్కువ కొన్న వినియోగదారులు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) జారీ చేసే రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్‌ను కొని లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఏంటీ పునరుత్పాదక విద్యుత్ శక్తి? సౌర, పవన, జల, బయోమాస్ విద్యుత్‌ను పునరుత్పాదక విద్యుత్ అంటారు. బొగ్గు, ఆయిల్, సహజ వాయువులు వంటి శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి చేసే సాంప్రదాయ విద్యుత్‌తో కాలుష్యం పెరిగి పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది. ఈ నేపథ్యంలో క్రమంగా ఈ రకం విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా లక్ష్యాలను నిర్దేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
మారనున్న డిస్కంలు
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు నేపధ్యంలో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లోనూ మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. జిల్లాల పరిధుల మేరకు డిస్కంల పరిధులను కూడా మార్చాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యుత్ సంస్థలు కసరత్తు మొదలుపెట్టాయి. కొత్త జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతో పాటు వాటికి అధికారులు, సిబ్బందిని నియమించడంపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు అనుగుణంగానే మార్పులు చేపట్టాలని డిస్కంలు నిర్ణయించాయి. కొత్తగా వ్యవసాయ డిస్కం : రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. కొత్తగా వ్యవసాయానికి పాతికేళ్ల పాటు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ (ఏపీఆర్‌ఏపీఎస్‌సీఎల్)ను ఏర్పాటు చేస్తోంది. దీంతో నాలుగు అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,91,29,441 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వీటిలో దాదాపు 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వీటిని ప్రత్యేకంగా వ్యవసాయ డిస్కం పరిధిలోకి తెస్తారు. ఈ డిస్కం కోసం ప్రత్యేకంగా కొందరు అధికారులు, సిబ్బందిని నియమించాలి. మారుతున్న పరిధులు ప్రస్తుతం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలున్నాయి. ఎస్పీడీసీఎల్లో చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత 2019లో ఏపీసీపీడీసీఎల్ పేరుతో మూడో డిస్కంను ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, సీఆర్డీఏ పరిధిలోని సర్వీసులను తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ మూడును నాలుగు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో వీటి పరిధిలోకి ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కొత్త ప్రాంతాలు కొన్ని వస్తాయి. కొన్ని ప్రాంతాలు వేరుపడతాయి. దీంతో వీటి పరిధులూ మారతాయి. వాటికి అనుగుణంగా కార్యాలయాలు, సిబ్బందిని మార్చాలి. మూడు డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) నేతృత్వంలో ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం ఉంది. రెవెన్యూ డివిజన్ల వారీగా డివిజన్ ఇంజనీర్(డీఈ) కార్యాలయాలున్నాయి. ప్రతి డివిజన్లో నాగులుకు పైగా సెక్షన్ (ఏఈ) కార్యాలయాలున్నాయి. పునర్వ్యవస్థీకరణతో మొత్తం జిల్లాల సంఖ్య 26 అవుతుంది. వీటికి అనుగుణంగా ఎస్ఈ, డీఈ, ఏఈ కార్యాలయాలను కూడా డిస్కంలు పునర్వ్యవస్థీకరించాలి. ప్రస్తుతం 13 ఉన్న ఎస్ఈ స్థాయి అధికారుల సంఖ్య 26 అవుతుంది. వీటన్నింటికీ ఎస్ఈ స్థాయి అధికారులను నియమించాలి. దీంతోపాటు డీఈ, ఏఈ కార్యాలయాల్లోనూ మార్పులు రానున్నాయి. దీని కోసం డిస్కంలు కసరత్తు మొదలుపెట్టాయి. అర్హులైన వారికి ప్రమోషన్ ఇచ్చి కొత్త జిల్లాలకు పంపాలని డిస్కంలు భావిస్తున్నట్లు సమాచారం. -
సర్కారు తీరుతోనే కరెంటు నష్టాలు
సాక్షి, కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) నష్టాల్లో కూరుకుపోయాయని.. ఆ నష్టాలను పూడ్చేందుకు అడ్డగోలుగా కరెంటు చార్జీలను పెంచి జనంపై భారం వేయాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో జరిగిన బీజేపీ జోనల్ (ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు) ముఖ్య నేతల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతుందంటూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. అది అబద్ధమని చెప్పినా సరే.. పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయకుండా విద్యుత్ సంస్థలను నష్టాల్లోకి నెడుతున్నారు. పైగా ప్రజలపై రూ.6,200 కోట్ల కరెంటు చార్జీల భారం మోపే యత్నం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు ఉచిత విద్యుత్ అందుతోంది. 20 ఊళ్లకు సరిపడా కరెంటును ఆ ఒక్క ఫామ్‌హౌస్‌కు వాడుకుంటున్నారు..’’అని సంజయ్ ఆరోపిం చారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో మాట్లాడిందని.. పచ్చి బియ్యం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపిందని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తమ చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టి బదనాం చేసేందుకు ప్రయ త్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడానికే జోనల్ సమావేశం నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం, కేంద్ర పథకాలను వివరించడం గురించి చర్చించామన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీలు అర్వింద్, బాపురావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, సీనియర్ నేతలు శివప్రకాశ్, ప్రేమేందర్‌రెడ్డి, శ్రుతి, ఆయా జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
అవినీతి వల్లే చార్జీల పెంపు
సాక్షి, హైదరాబాద్: ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఎత్తిపోతల పథకాలు, ఇతర ఉచిత విద్యుత్ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే ఏటా సుమారు 30% విద్యుత్‌ను వాడుకుంటోంది. ఇందుకు రూ. 16 వేల కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించాల్సి ఉండగా రూ. 5,652 కోట్లనే సబ్సిడీగా ఇస్తోంది. మిగతా రూ. 10 వేల కోట్లను రాష్ట్ర ప్రజలే చెల్లించాల్సి రానుంది. ప్రభుత్వ ఆస్తులు జప్తు చేసైనా ఈ బకాయిలు వసూలు చేయాలి. ప్రజలపై భారం వేసే చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలి’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,631 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు సమర్పించిన టారిఫ్ ప్రతిపాదనలపై ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎం.డి. మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్య శుక్రవారం హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతోపాటు రైతులు, వినియోగదారులు, పారిశ్రామిక సంఘాలు తమ వాణిని వినిపించాయి. రేవంత్ మాట్లాడుతూ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల నిర్వహణలో తప్పిదాలు, ప్రభుత్వ అవినీతి వల్లే డిస్కంలు విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు చేసిన ప్రతిపాదనలను తిరస్కరించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశారు. డిస్కంలు దివాలా..! ‘ఉదయ్’ పథకంలో చేరడంతో 2014–15లో డిస్కంల అప్పులు రూ. 11 వేల కోట్ల నుంచి రూ. 2,234 కోట్లకు తగ్గాయని, కానీ 2022 నాటికి ఏకంగా రూ. 60 వేల కోట్లకు పెరిగాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుకు అడ్డగోలుగా అప్పులు చేయడంతో డిస్కంలు ఆర్థికంగా దివాలా తీశాయన్నారు. జనరేటర్లకు రూ. వేల కోట్ల బకాయిలు చెల్లించలేక చేతులెత్తేశాయని చెప్పారు. జెన్కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించి ప్రైవేటు నుంచి అధిక రేటుతో ప్రభుత్వం విద్యుత్ కొనడం వల్ల వినియోగదారులపై రూ. వేల కోట్ల భారం పడిందని ఆరోపించారు. ‘భద్రాద్రి’ వ్యయాన్ని ఆమోదించొద్దు: శ్రీధర్‌బాబు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయం భారీగా రూ. 8,536 కోట్లకు పెరిగిందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ వ్యయాన్ని ఆమోదించరాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు. గృహాలపై డిస్కంలు అడ్డగోలుగా రూ. 8 వేల వరకు డెవలప్మెంట్ చార్జీలు వేస్తున్నాయని తప్పుబట్టారు. విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రభుత్వ సబ్సిడీలు పెంచడం ద్వారా డిస్కంల ఆర్థిక లోటును పూడ్చాలని సూచించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన రూ. 6,831 కోట్ల చార్జీల పెంపునకు తోడుగా భవిష్యత్తులో గత ఐదేళ్లకు సంబంధించిన ట్రూఅప్ చార్జీలను సైతం వసూలు చేస్తామని డిస్కంలు పేర్కొనడంతో రూ. 50 వేల కోట్లకుపైగా చార్జీల పెంపు భారాన్ని ప్రజలపై వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎన్.వేణుగోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పుడు విధానాలు, విద్యుత్ సంస్థల నిర్వహణ లోపాలే దీనికి కారణమన్నారు. విద్యుత్ చార్జీల పెంపును తట్టుకోలేక బహిరంగ మార్కెట్ నుంచి ఓపెన్ యాక్సెస్‌లో విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ జీవీ మల్లికార్జునరావు పేర్కొన్నారు. ఫిక్స్డ్ చార్జీల పెంపు, గ్రిడ్ నిర్వహణ చార్జీల విధింపును టీసీఎస్, ఫ్యాప్సీ, సిమెంట్ కంపెనీలు వ్యతిరేకించాయి. రాత్రి విద్యుత్ వాడకంపై రాయితీలను తగ్గించడాన్ని తప్పుబట్టాయి. బోరు ఎండిపోవడంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ను సరెండర్ చేసిన 30 ఏళ్ల తర్వాత రూ. 4 లక్షల బిల్లు జారీ చేశారని భువనగిరి జిల్లాకు చెందిన సామా సత్తిరెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, వివిధ వర్గాల అభ్యంతరాలపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వివరణ ఇచ్చారు. -
విద్యుత్ వాత.. అభ్యంతరాల మోత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం లో రూ.6,831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపు నకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన ప్రతిపాదనలపై బడా పారిశ్రా మికవేత్తలు, అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు, టాప్ కంపెనీలతోపాటు సామాన్య వినియోగదా రులూ భగ్గుమన్నారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్న ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) కి రికార్డు సంఖ్యలో రాత పూర్వక అభ్యంత రాలు అందాయి. గడువు ముగిసిన జనవరి 28 నాటికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు 191, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్)కు 92 అభ్యంతరాలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీ రింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈ ఐఎల్), ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్స ల్టెన్సీ సర్వీసెస్ (టీసీ ఎస్), ఎల్అండ్టీ మె ట్రో రైలు, పెన్నా సిమెంట్స్, జువారి సిమెం ట్స్, ఫ్యాప్సీ తెలంగాణ, తెలంగాణ ఫెర్రో అలాయ్స్ ఉత్పత్తిదారుల సంఘం, ఐటీసీ లిమిటెడ్, ఇండియా ఎనర్జీ ఎక్సే్ఛంజీ లిమి టెడ్, మైత్రాహ్ ఎనర్జీ, డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ పవర్ అసోసియేషన్, సౌత్ ఇండియా సిమెంట్స్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ వంటి ప్రముఖ వ్యాపార సంస్థలతోపాటు కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆయోధ్య రెడ్డి, విద్యుత్ రంగ విశ్లేషకులు తిమ్మారెడ్డి, ఎం.వేణు గోపాల్ రావు, ధోంతి నర్సింహా రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ఏపీసీపీడీసీఎల్ మాజీ డైరె క్టర్ సూర్య ప్రకాశ రావు, అఖిల భారత్ కిసాన్ మహాసభ నుంచి సారంపల్లి మల్లారెడ్డి అ భ్యంతరాలు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. బహిరంగ విచారణలో మళ్లీ.. భారీగా వచ్చిన అభ్యంతరాలన్నింటికీ రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వడం డిస్కంలకు ఇబ్బందికర విషయమే. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 18న సిరిసిల్లలో, 21న హన్మకొండలో, 23న వనపర్తిలో, 25న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్టు ఇప్పటికే ఈఆర్సీ ప్రకటించింది. ఆ సమయంలో మళ్లీ పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చే అవకాశముంది. వీటికి డిస్కంల సీఎండీలు అప్పటికప్పుడే మౌఖికంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఊహించని రీతిలో పెద్దసంఖ్యలో స్పందన వస్తుండటంతో చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఎత్తిపోతల్లో మునిగిన డిస్కంలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ ఎత్తిపోతల పథకాలు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు గుదిబండగా మారుతున్నాయా? ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న డిస్కంలను మరింతగా కుంగదీస్తున్నాయా? దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) తాజాగా ప్రకటించిన త్రైమాసిక ఎనర్జీ అడిట్ నివేదిక అవుననే సమాధానం చెబుతోంది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ఐదు ఉమ్మడి జిల్లాలకు టీఎస్ఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా చేస్తుండగా, గతంలో ఒక్క హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోనే అసాధారణ రీతిలో విద్యుత్ నష్టాలు జరిగేవి. అయితే తాజాగా చార్మినార్ డివిజన్లో 35.73 శాతం, అస్మాన్‌గఢ్‌లో 35.01 శాతం, గజ్వేల్‌లో 35.5 శాతం, సిద్దిపేటలో 32.31 శాతం విద్యుత్ సాంకేతిక, వాణిజ్య (ఏటీఅండ్‌సీ లాసెస్) నష్టాలున్నట్టు 2021 జూలై –సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించిన ఎనర్జీ ఆడిట్ నివేదిక వెల్లడించింది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో నిర్మించిన రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు సంబంధిం చిన పంప్‌హౌస్‌ల కరెంట్ బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోవడంతోనే ఓల్డ్‌సిటీకి సమానంగా ఈ రెండు డివిజన్ల పరిధిలో ఏటీఅండ్‌సీ (అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్) నష్టాలు పెరిగిపోయినట్టు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. సాంకేతిక లోపాలతో జరిగే విద్యుత్ నష్టాలు, విద్యుత్ చౌర్యం, బిల్లింగ్ లోపాలతో జరిగే నష్టాలు, విద్యుత్ బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థతతో జరిగే నష్టాల మొత్తాన్ని ఏటీఅండ్‌సీ లాసెస్ అంటారు. భారీగా కొనుగోలు.. అరకొరగా బిల్లులు! ఎత్తిపోతల పథకాల నిర్వహణకు డిస్కంలు భారీ మొత్తంలో విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కరెంట్ బిల్లులను చెల్లించడం లేదు. దీంతో ఎత్తిపోతల పథకాల కనెక్షన్ల నుంచి రావాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు, వాటిపై చెల్లించాల్సిన అపరాధ రుసుం (డిలేయ్డ్ పేమెంట్ సర్‌చార్జీ)లు రూ.వందల నుంచి రూ.వేల కోట్లకు ఎగబాకి డిస్కంలను భారీ నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 132 కేవీ లోడ్ సామర్థ్యం గల 18 ఎత్తిపోతల పథకాల కనెక్షన్లుండగా, గత జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో 476.04 ఎంయూల విద్యుత్‌ను వినియోగం జరిగింది. మరో 11 కేవీ లోడ్ సామర్థ్యం కలిగిన 130 కనెక్షన్లుండగా, 7.99 ఎంయూలు, 33 కేవీ సామర్థ్యం లోడ్ కలిగిన 19 కనెక్షన్లుండగా 2.69 ఎంయూల విద్యుత్‌ను వాడినట్టు ఆడిట్ రిపోర్టు వెల్లడించింది. -
‘లోటు’ పాట్లపై లోతుగా..
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టారిఫ్ సవరణ(చార్జీల పెంపు) ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆదేశించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు, విద్యుత్‌మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం, ఆ వ్యత్యాసాన్ని పూడ్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లను డిస్కంలు గత నెల 30న ఈఆర్సీకి సమర్పించిన విషయం తెలిసిందే. ఏఆర్‌ఆర్‌తోపాటే సమర్పించాల్సిన టారిఫ్ పెంపు ప్రతిపాదనలను అప్పట్లో డిస్కంలు వాయిదా వేసుకున్నాయి. భారీ ఆదాయలోటులో ఉన్న డిస్కంల మనుగడ కోసం చార్జీలు పెంచకతప్పదని ఇప్పటికే ఈఆర్సీ స్పష్టం చేసింది. ఆదాయలోటు పూడ్చుకోవడానికి ప్రభుత్వ సబ్సిడీలను పెంచేందుకున్న అవకాశాలు ఏమిటి? సబ్సిడీలుపోగా మిగిలి ఉండే లోటు పూడ్చుకోవడానికి ఏ మేరకు టారిఫ్ పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి సమర్పించాలి? అన్న అంశాలపై మంత్రులు లోతుగా చర్చించారు. ఆర్థికలోటు పూడ్చడానికి ఉన్న ఇతర మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావులకు సూచించారు. డిస్కంల ఆర్థిక పరిస్థితి, టారీఫ్ ప్రతిపాదనలపై మరో మారు భేటీ కావాలని నిర్ణయించారు. విద్యుత్‌పై భారీగా పెట్టుబడులు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.వేల కోట్ల పెట్టుబడులు, వ్యయప్రయాసలతో రాష్ట్ర విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల సామర్థ్యాన్ని భారీగా పెంచినట్టు అధికారులు మంత్రులకు నివేదించారు. జెన్కో స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 16,623 మెగావాట్లకు పెరిగిందన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.33,722 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో 2,700 మెగావాట్ల లోటు ఉండేదని, కేవలం 6 నెలల్లోనే కోతలు అధిగమించి అన్ని రంగాలకు 24 గంటల నిరంతర సరఫరా చేస్తున్నామని వివరించారు. సౌర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 74 మెగావాట్లు నుంచి 3997 మెగావాట్లకు, గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,661 మెగావాట్ల నుంచి 13,688 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. వినియోగదారుల సంఖ్య కోటీ 11 లక్షల నుంచి కోటీ 68 లక్షలకు, తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్ల నుంచి 2,012 యూనిట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 19 లక్షల నుంచి 25.92 లక్షలకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరిగాయన్నారు. ట్రాన్స్‌కో పరిధిలోని సబ్ స్టేషన్ల సంఖ్య 233 నుంచి 361కు పెంచినట్టు తెలిపారు. ఈ మేరకు పెరిగిన ఆర్థిక అవసరాలకు తగ్గట్టు విద్యుత్ సంస్థల విద్యుత్ టారిఫ్ పెంచుకోవడానికి అనుమతికోరినట్టు తెలిసింది. -
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు 7 రోజుల్లోగా సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టారీఫ్ (చార్జీల పెంపు) ప్రతిపాదనలను 7 రోజుల్లోగా సమర్పించాలని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆదేశించింది. నవంబర్ 30న డిస్కంలు సమర్పించిన 2022–23 ఆర్థిక సంవత్సరాల వార్షికాదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)ల్లో టారీఫ్ ప్రతిపాదనలు లేవని, వీటిని సమర్పించినట్లు పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు డిస్కంల సీఎండీలకు ఈఆర్సీ గురువారం లేఖ రాసింది. వచ్చే ఆర్థిక సంవత్సరాని(2022–23)కి సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించిన నాటి నుంచి 120 రోజుల తర్వాతే రాష్ట్రంలో చార్జీల పెంపునకు అనుమతిస్తామని ఈఆర్సీ స్పష్టం చేసింది. దీంతో డిస్కంలకు ఎదురు దెబ్బతగిలింది. ప్రతిపాదనలు ఎంత ఆలస్యం చేస్తే చార్జీల పెంపులో అంత ఆలస్యం జరగనుంది. గడువులోగా టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించకపోతే ఏఆర్ఆర్లను ఈఆర్సీ తిరస్కరించే అవకాశాలున్నట్లు తెలిసింది. 120 రోజులు ఎందుకంటే?.. డిస్కంలు ఈఆర్సీకి ఏఆర్‌ఆర్‌తో పాటు టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత నిబంధనల ప్రకారం వాటిని బహిర్గతం చేసి రాతపూర్వకంగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిం చాలి. డిస్కంలతో పాటు ఈఆర్సీ వెబ్సైట్లో వీటి ని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. డిస్కంల టారిఫ్ పెంపు ప్రతిపాదనలు, వాటిపై వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, డిస్కంల ప్రతిస్పందనలపై ఈఆర్సీ అధ్యయనం జరిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెంచాల్సిన విద్యుత్ చార్జీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ప్రక టిస్తుంది. సుదీర్ఘ ప్రక్రియ కావడంతో 120 రోజుల సమయాన్ని ఇందుకు కేటాయిస్తూ కేంద్ర ప్రభు త్వం నిబంధనలను రూపొందించింది. అందుకే ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సం బంధించిన ఏఆర్‌ఆర్‌లు, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పి ంచాలని టారిఫ్ నిబంధనలు పేర్కొంటున్నాయి. వ్యూహాత్మకంగానే ఆలస్యం.. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజావ్యతిరేకత నుంచి ఉపశమనం పొందడానికే డిస్కంలు టారిఫ్ ప్రతి పాదనలను గడువులోగా సమర్పించకుండా వ్యూహాత్మకంగా వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. చివరిసారిగా 2018–19కిసంబంధించిన ఏఆర్ఆర్లను ఈఆర్సీకి సమర్పించగా, అప్పట్లో చార్జీలు పెంచలేదు. 2019–20, 2020– 21 ఏఆర్ఆర్లను ఇవ్వలేదు. 2021–22 ఏఆర్ఆర్లను గడువు తీరాక సమర్పించాయి. 2022–23 ఏఆర్ఆర్లను సమర్పించినా, టారిఫ్ ప్రతిపాదనలను వాయిదా వేసుకున్నాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి చార్జీలు పెంచాలని భావించినా, 120 రోజుల నిబంధన లో ఈఆర్సీ రాజీపడకపోవడంతో డిస్కంలకు ఎదురు దెబ్బతగిలింది. -
డిస్కంలపై ‘దివాలా’ పిడుగు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డి స్కం)లు కొత్తగా ‘దివాలా’ముప్పు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ డిస్కంలకు కూడా దివాలా స్మృతి సంపూర్ణంగా వర్తిస్తుందని.. దివాలా వ్యా పార పరిష్కార ప్రక్రియ (కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్/సీఐఆర్‌పీ) కింద వాటిపై చర్యలు తీసుకోవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. దీనితో అప్పులు, బకాయిలు చెల్లించడంలో విఫలమైన డిస్కంలను దివాలా తీసినట్టు ప్రకటించి, వాటి ఆస్తుల వేలం ద్వారా తమ బకాయిలు ఇప్పించాలంటూ.. బ్యాంకులు, విద్యుదుత్పత్తి సంస్థలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని కోరేందుకు వీలు కలుగనుంది. నిజానికి ప్రభుత్వ రంగ డిస్కంలు విద్యుత్ చట్టం పరిధిలోకి వస్తాయని, వాటికి ‘దివాలా స్మృతి’వర్తించదని రాష్ట్రాలు వాదిస్తూ వచ్చాయి. బకాయిలు కట్టని డిస్కంలపై విద్యుత్ చట్టం కింద బ్యాంకులు, విద్యుదుత్పత్తి సంస్థలు చర్యలు తీసుకునేవి. జరిమానాలతో బకాయిలు వసూలు చేసేందుకు ప్రయత్నించేవి. కానీ ఇకపై డిస్కంలకు గడ్డుకాలమేనని నిపుణులు చెప్తున్నారు. రుణాలు, బకాయిల భారంతో.. దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలు రూ.వేల కోట్ల అప్పులు, బకాయిల్లో కూరుకుపోయి ఉన్నాయి. విద్యుత్ కొనుగోలు ధరల్లో పెరుగుదలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు విద్యుత్ చార్జీల పెంపు లేకపోవడం, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులు వందలకోట్ల మేర పేరుకుపోవడం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరిపడా విద్యుత్ సబ్సిడీలు అందకపోవడం వంటి కారణాలతో డిస్కంలు ఆర్థికంగా కుంగిపోయి ఉన్నాయి. విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు కొనే విద్యుత్‌కు 45 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. కానీ నిధుల్లేక నెలలు, ఏళ్ల తరబడిగా కట్టలేకపోతున్నాయి. ►కేంద్ర విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారమే.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ/ప్రైవేటు రంగ విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.98,518 కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.7,888 కోట్లు. వీటితోపాటు తెలంగాణ జెన్కో, సింగరేణి థర్మల్ ప్లాంట్లకు చెల్లించాల్సిన సొమ్ము కూడా కలిపితే.. తెలంగాణ డిస్కంల బకాయిలు రూ.20 వేల కోట్ల వరకు ఉంటాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు డిస్కంలు రూ.36 వేల కోట్ల మేర అప్పులు చేశాయి. ►డిస్కంల నుంచి సకాలంలో చెల్లింపులు రాక విద్యుదుత్పత్తి కంపెనీలు బొగ్గు కొనుగోళ్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ.. గతంలోనే తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. -
Telangana: అదనపు సర్‌చార్జీల మోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నుంచి కాకుండా.. బహిరంగ మార్కెట్ నుంచి ఓపెన్ యాక్సెస్ విధానంలో నేరుగా విద్యుత్ కొనుగోలు చేస్తున్న వినియోగదారులపై అదనపు సర్‌చార్జీల మోత మోగనుంది. డిస్కంల కన్నా తక్కువ ధరకే విద్యుత్ విక్రయించే విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొన్ని భారీ పరిశ్రమలు నేరుగా ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల నుంచి రూ.372.51 కోట్ల అదనపు సర్‌చార్జీల వసూలు చేసేందుకు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించాయి. ఓపెన్ యాక్సెస్‌లో కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్‌పై ...తొలి అర్ధవార్షికం లో రూ.2.01, రెండో అర్ధవార్షికంలో రూ.2.34 చొప్పున అదనపు సర్‌చార్జీలు వసూలు చేసుకోవడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరాయి. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 23 వరకు అభ్యంతరాలు పంపించాలని ఈఆర్సీ కోరింది. డిసెంబర్ 7న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ నిర్వహించి ఏ మేరకు అదనపు సర్‌చార్జీలు వసూలు చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది. బయటి కొనుగోళ్లతో మిగిలిపోతున్న విద్యుత్ దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా డిస్కంలకు 2021–22 తొలి అర్ధభాగంలో 8,210.18 మెగావాట్లు, రెండో అర్ధభాగంలో 8,574.88 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉండనుంది. ఓపెన్ యాక్సెస్ వల్ల తొలి అర్ధభాగంలో 171.89 మె.వా, రెండోఅర్ధభాగంలో 219.76 మె.వా. విద్యుత్‌ను డిస్కంలు విక్రయించుకోలేకపోయాయి. ఈ విద్యుత్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీల నష్టాలు కలిపి ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల నుంచి రూ.372.51 కోట్ల అదనపు సర్ చార్జీలను వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఎందుకు ఇలా? రాష్ట్రంలోని వినియోగదారులందరి అవసరాలకు సరిపడ విద్యుత్ కోసం విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో డిస్కంలు పీపీఏలు కుదుర్చుకుంటాయి. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లను వినియోగించి ఈ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీలు చెల్లిస్తాయి. వినియోగదారుల నుంచి వసూలు చేసే బిల్లుల ద్వారా ఈ ఖర్చులను డిస్కంలు తిరిగి వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం మేరకు విద్యుత్ కొనుగోలు చేయకపోయినా, విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు.. కొనుగోలు చేయని విద్యుత్‌కు సంబంధించిన స్థిర చార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అదే తరహాలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీలు చెల్లించక తప్పదు. కొంతమంది వినియోగదారులు నేరుగా బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుండడంతో, ఆ మేరకు ఫిక్స్డ్ చార్జీలు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీల భారం డిస్కంలపై పడుతోంది. ఈ నేపథ్యంలోనే సదరు నష్టాలను అదనపు సర్‌చా ర్జీల రూపంలో, అందుకు కారణమైన వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. -
భారం మోపి బురద!
సాక్షి, అమరావతి: గత సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో విద్యుత్ రంగం కుదేలైంది. బకాయిలు చెల్లించకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అప్పుడు చేసిన తప్పిదాలే ట్రూ అప్ చార్జీల భారానికి కారణమయ్యాయని విద్యుత్తు రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చౌక విద్యుత్తు కొనుగోళ్లు, పొదుపు చర్యలతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ పంపిణీ సంస్థలను ఆదుకుంటోంది. విద్యుత్తు రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అనవసర వ్యయాన్ని నియంత్రిస్తోంది. మరోవైపు ప్రజలపై పెనుభారం పడకుండా భారీగా రాయితీలను భరిస్తోంది. రైతులతో పాటు ఇతర వర్గాలకు ఉచిత, రాయితీ విద్యుత్‌ను అందిస్తూనే కొనుగోళ్లు, పంపిణీలో నష్టాలను తగ్గించుకునేందుకు చర్యలు చేపడుతోంది. అయితే టీడీపీ నేతలు వాస్తవాలను మభ్యపుచ్చి తమ కారణంగా ప్రజలపై పడిన ట్రూ అప్ చార్జీలపై వారే ఆందోళనకు దిగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆ ఐదేళ్లూ అప్పుల కొండ ఆర్ధిక భారం నుంచి తప్పించుకునేందుకు గత సర్కారు తప్పుడు నివేదికలతో డిస్కంలను అప్పుల ఊబిలోకి గెంటేసింది. ఫలితంగా 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి ఏకంగా రూ.27,240 కోట్లకు చేరాయి. గత రెండున్నరేళ్లలో నష్టాలు రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. ప్రస్తుతం నష్టాలు రూ.27,551 కోట్లుగా ఉన్నాయి. టీడీపీ హయాంలో వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పొదుపు చర్యలతో ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది. ఇక 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. 2014 జూన్ 2 నాటికి విద్యుత్తు కొనుగోళ్ల బకాయిలు, నిర్వహణ ఖర్చులు రూ.12,500 కోట్లు ఉండగా 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరాయి. భారమైనా భరిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి రూ.1,707.07 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాయితీలు, ప్రోత్సాహకాలు, గృహ విద్యుత్ వినియోగదారులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, పౌల్ట్రీ వర్గాల భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.7297.08 కోట్ల ఆర్ధిక భారం ప్రభుత్వంపై పడింది. తొలిసారిగా ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65 కింద ప్రత్యక్ష రాయితీ పొందేలా ఒకే గొడుగు కిందకు ఏపీఈఆర్సీ తెచ్చింది. దీనివల్ల పడిన రూ.1,657.56 భారాన్ని కూడా భరించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు పంపిణీ సంస్థల పరిధిలోనూ ఒకే విధంగా ధరలు అమలుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.136.72 కోట్ల భారం పడింది. అప్పటిలా కనీస చార్జీలు లేవు గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత సర్కారు హయాంలో అమలైంది. దీనివల్ల నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తొలగించి కిలోవాట్‌కు రూ.10 వసూలు చేసే విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే నెలంతా విద్యుత్ వినియోగించకపోతే కనీస చార్జీ చెల్లించనవసరం లేదు. ఇక సగటు యూనిట్ సేవా వ్యయం రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గించింది. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి అధికభారం మోపే విధానాన్ని టీడీపీ సర్కారు ఐదేళ్లూ అమలు చేసింది. దాని నుంచి కాపాడటానికి ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో టారిఫ్ ప్రకారం ఆ నెలలోనే బిల్లు వేసే విధంగా కంటిన్యూ బిల్లింగ్ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం తెచ్చింది. విద్యుత్ సంక్షేమ రంగంవైపు అడుగులు.. విద్యుత్తు రంగాన్ని ప్రగతిశీల, ప్రజా సంక్షేమ రంగంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లు, ఎంబీసీలు, చేనేత కార్మికులకు 100 యూనిట్లు, దోబీఘాట్లు, లాండ్రీలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, సెలూన్లు, రోల్డ్ గోల్డ్ పనివారికి 100 యూనిట్లు ఉచితంగా అందజేస్తోంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. 2019–20లో 3 లక్షలుగా ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్‌కు రూ.7.23 చొప్పున ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.6.37కి తగ్గించగలిగింది. ఇటు డిస్కంలను ఆదుకుంటున్న ప్రభుత్వం.. విద్యుత్తు సంస్థలు 2019–21 మధ్య కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. దీనిని తట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో అందాలి. ఈ నేపథ్యంలో 2019 మార్చి 31 నాటికి విద్యుత్తు సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్తు సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు విడుదల చేసింది. ఇలా విద్యుత్తు సంస్థలను ఆదుకునేందుకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది. వాస్తవ సర్దుబాటు వ్యయం రూ.20,572 కోట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు 2014–19 కాలానికి దాదాపుగా రూ.20,572 కోట్ల వాస్తవ అదనపు వ్యయం సర్దుబాటు కోసం విద్యుత్ నియంత్రణ మండలికి 2019 చివరిలో విన్నవించాయి. ఇదే కాకుండా 2014–15 నుంచి 2018–19 వరకు సంస్థల నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణ, ఆదాయ అవసరాల వాస్తవ ఖర్చుల ఆధారంగా జరిపిన అదనపు వ్యయం సర్దుబాటు రూపంలో మరో రూ.7,224 కోట్లు అనుమతించాలని విద్యుత్ నియంత్రణ మండలిని కోరాయి. ఇందులో రూ.3,555 కోట్ల వసూలును ఏపీఈఆర్సీ తిరస్కరించింది. రూ.3,669 కోట్ల ట్రూ–అప్ చార్జీల వసూలు మాత్రం అనివార్యమైంది. నిజానికి ఇది కూడా ఆమోదించకపోతే విద్యుత్ పంపిణీ సంస్థల మనుగడ కష్టంగా మారే ప్రమాదం ఉంది. అది మంచిది కాదని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాం నాటివే ‘ప్రస్తుతం అమలవుతున్న ట్రూ అప్–సర్దుబాటు చార్జీలు గత ప్రభుత్వ హయాం నాటి విద్యుత్ పంపిణీ నెట్వర్క్ చార్జీలకు సంబంధించినవి. విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక ఖర్చులు, ఆదాయ అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం, విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన సబ్సిడీని భరించని కారణంగా పంపిణీ సంస్థల అప్పులు పెరిగిపోయాయి. ఏపీఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసరాల నివేదికలలో వాస్తవాలను వెల్లడించకుండా పరోక్షంగా భారాన్ని తగ్గించుకుని తప్పుల తడకలు నివేదికలతో సమయాన్ని వెళ్లదీశారు. అప్పుడు జరిగిన నష్టమంతా సర్దుబాటు చార్జీల రూపంలో వినియోగదారులపై పడింది. 2014–15 నుంచి 2018–19 వరకు నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణకు అనుమతించిన వ్యయం కన్నా వాస్తవ ఖర్చు అధికమవడం వల్లే ఈ సవరింపు చార్జీలు విధించాల్సి వచ్చిందనే విషయాన్ని గమనించాలి’ –నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి -
తెలంగాణలో ‘కరెంట్’కు కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. కొండలా పేరుకు పోయిన రుణాలకు ప్రతినెలా వడ్డీలు కట్టడం, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం తమ వల్ల కావట్లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు మొత్తుకుంటున్నాయి. ప్రతినెలా రూ.1,200 కోట్లు ఆర్థిక సాయం చేయాలని, లేకుంటే డిస్కంల నిర్వహణ సాధ్యం కాదని కోరుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యుత్ సబ్సిడీలను భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరింతగా నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రత్యామ్నాయంగా విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించి డిస్కంలను గట్టెక్కించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఒత్తిళ్లు తట్టుకోలేక..: గత నెల 21న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన ఓ సమీక్షలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు డిస్కంల పరిస్థితిని వివరించినట్టు తెలిసింది. ప్రతినెలా డిస్కంల అప్పులపై వడ్డీల చెల్లింపు కోసం రూ.800 కోట్లు, జీతాల కోసం రూ.400 కోట్లు కలిపి రూ.1,200 కోట్ల చొప్పున ప్రభుత్వ సాయంగా విడుదల చేయాలని కోరారని.. విద్యుత్ చార్జీలు పెంచడానికి కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారని సమాచారం. అయితే విద్యుత్ చార్జీల పెంపుపై మాత్రమే సీఎం సానుకూలంగా స్పందించారని.. అదనపు నిధులివ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనితో చేసేదేమీ లేక ప్రభాకర్‌రావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని పేర్కొంటున్నాయి. బిల్లులు, బకాయిలు చెల్లించాలంటూ విద్యుదుత్పత్తి కంపెనీలు, రుణ సంస్థలు తెస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నానని.. జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ప్రభాకర్‌రావు కొద్దినెలలుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారని, కానీ సీఎం అంగీకరించడం లేదని పేర్కొంటున్నాయి. రూ.20 వేల కోట్ల అప్పుల్లో.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు ఏటేటా పెరిగిపోయి.. ప్రస్తుతం రూ.20 వేల కోట్లను దాటినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. విద్యుత్ పంపిణీ వ్యవస్థల (నెట్వర్క్) సామర్థ్యం పెంపునకు డిస్కంలు రూ.వేల కోట్ల అప్పులు చేశాయి. ప్రస్తుతం ప్రతినెలా వడ్డీల కిందనే రూ.800 కోట్ల మేర చెల్లించాల్సి వస్తోంది. ఉద్యోగుల జీతాలకూ ఇబ్బంది తలెత్తుతోంది. దీనితో కొంతకాలంగా ప్రతి నెలా బ్యాంకుల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. చార్జీల పెంపుపై కసరత్తు రాష్ట్రంలో గత ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలను పెంచలేదు. విద్యుత్ చట్టం ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల పెంపు (టారిఫ్ సవరణ) ప్రతిపాదనలను, ఆదాయ, వ్యయాల అంచనా (ఏఆర్ఆర్) నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాల్సి ఉంటుంది. ఈఆర్సీ వాటిని పరిశీలించి చార్జీల సవరణను ఆమోదిస్తుంది. అయితే డిస్కంలు గత మూడేళ్లుగా టారిఫ్ సవరణ, ఏఆర్ఆర్ నివేదికలను సమర్పించడమే లేదు. విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే దీనికి కారణం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిస్కంలను గట్టెక్కించడం కోసం చార్జీలు పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో.. ఆ ప్రక్రియ ముగిశాక ఈఆర్సీకి టారిఫ్ పెంపు ప్రతిపాదనలను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆరేళ్లుగా చార్జీలు పెంచని నేపథ్యంలో ఈసారి గణనీయంగానే పెంపు ఉండవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. కేటగిరీల వారీగా 10 శాతం నుంచి 20శాతం వరకు చార్జీలు పెంచాలని డిస్కంలు కోరుతున్నాయని వివరించాయి. అంతేగాకుండా గత ఆరేళ్లుగా వచ్చిన నష్టాలకు సంబంధించి ‘ట్రూఅప్’ చార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయని.. దానికి ఈఆర్సీ అనుమతిస్తే వినియోగదారులపై ఒకేసారి పెనుభారం పడే అవకాశాలు ఉంటాయని వెల్లడించాయి. ప్రభుత్వం, ఈఆర్సీ అనుమతిస్తే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి వస్తాయని తెలిపాయి. ఇప్పటికే సబ్సిడీల భారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర రాయితీ పథకాలు, ఎత్తిపోతల స్కీమ్‌లకోసం ప్రతినెలా డిస్కంలకు రూ.833.33 కోట్లు విడుదల చేస్తోంది. ఇందుకోసం బడ్జెట్‌లోరూ.10 వేల కోట్లు కేటాయిస్తోంది. డిస్కంలు కోరినట్టు ప్రతినెలా మరో రూ.1,200 కోట్ల చొప్పున ఇస్తే ఏడాదికి రూ.14,400 కోట్ల అదనపు భారం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పులు, నష్టాలు పెరుగుతూ.. కొన్నేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు బాగా పెరిగాయి. డిమాండ్‌కు తగినట్టుగా ఎక్కువ ధరతో విద్యుత్ కొని తక్కువ రేటుతో సరఫరా చేయాల్సి వచ్చింది. దానికితోడు ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, ఉద్యోగులకు భారీగా జీతాల పెంపుతోనూ డిస్కంలపై ఆర్థిక భారం పడింది. వివిధ కేటగిరీల కింద సరఫరా చేస్తున్న రాయితీ విద్యుత్ కంటే.. ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీ సొమ్ము తక్కువగా ఉందన్న అంచనాలు ఉన్నాయి. దీనితో ఏటేటా నష్టాలు, అప్పులు పెరుగుతూ పోయాయి. -
Coal Crisis: పెను సంక్షోభం..?
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందని ఉత్తరప్రదేశ్ నుంచి కేరళ వరకు వివిధ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఎదురవనుంది. రాజస్తాన్ ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో రోజుకి రెండు గంటలు, పల్లెల్లో రోజుకి నాలుగు గంటలు విద్యుత్ కోతలు విధిం చడం మొదలు పెట్టింది. కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి అందాల్సిన బొగ్గులో సగం కూడా రాజస్తాన్‌కి అందడం లేదు. పంజాబ్, జార్ఖండ్, మహా రాష్ట్రలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ సమస్యని తగ్గించి చూపించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. డిస్కమ్‌లు యూనిట్‌కు రూ.20 పెట్టి మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొద్దిరోజుల వ్యవధిలోనే నాలుగింతలు ధర పెరిగింది. దేశంలో 66% మేరకు విద్యుత్ వినియోగం థర్మల్ విద్యుత్ కేంద్రాలపైనే ఆధారపడి ఉంది. సాధారణంగా ఈ కేంద్రాలలో 20 రోజుల వరకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంటాయి. కానీ ఇప్పుడు 70 వరకు కేంద్రాల్లో నాలుగు రోజులకి సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 136 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 50% బొగ్గు సరఫరా కేంద్రానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) నుంచే జరుగుతుంది. కానీ నాలుగేళ్లుగా ఈ సంస్థ నుంచి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతూ వస్తోంది. 2016 నుంచి స్వదేశీ బొగ్గుపైనే ఆధారపడాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ సీఐఎల్‌లో బొగ్గు ఉత్పత్తి ఆశించిన దాని కంటే 70 లక్షల నుంచి కోటి టన్నుల మేరకు పడిపోతూ వస్తోంది. కొన్ని బొగ్గు గనుల్ని వేలం వేసి ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కేంద్రం అప్పగిం చింది. వీటి ద్వారా 12–14 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ ప్రైవేటు సంస్థలు కూడా బొగ్గు వెలికితీయడంపై దృష్టి పెట్టకుండా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు తక్కువగా ఉన్నప్పుడు దిగుమతులపై ఆధారపడ్డాయి. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు ఈ ఏడాది మొదట్లో టన్ను 75 డాలర్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 270 డాలర్లకు చేరుకుంది. దీంతో బొగ్గును కొనలేక, ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెంచలేక చేతులెత్తేస్తున్నాయి. ఇదో సంధికాలం బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులతో వాతావరణం కలుషితమై గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులకు దారి తీస్తూ ఉండడంతో చాలా దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడుతున్నాయి. భారత్ కూడా అదే బాటలో నడుస్తూ గ్రీన్ ఎనర్జీ పేరుతో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి ప్రోత్సహిస్తోంది. ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తోంది. దీంతో బొగ్గు గనుల అవసరాలకు అనుగుణంగా నిధుల్ని కేటాయించడం లేదు. అలాగని ప్రత్యామ్నాయ విధానాల ద్వారా విద్యుత్ డిమాండ్‌కి తగినంత ఉత్పత్తి జరగడం లేదు. ఫలితంగా సంక్షోభం ముంచుకొస్తోంది. కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. లెబనాన్‌లో గత వీకెండ్లో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చైనాలో కూడా విద్యుత్‌కి కొరత ఏర్పడడంతో కొత్తగా 90 బొగ్గు గనుల్లో తవ్వకాలు ప్రారంభించింది. యూరప్‌లో అధికంగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే ఉన్నాయి. అయితే చమురు ధరలు ఆకాశాన్నంటడంతో యూకేలో కూడా 15 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయని బ్రిటన్ మీడియా చెబుతోంది. ఇక యూరప్‌లో చమురు ధరలు ఏకంగా 400 శాతం పెరగడంతో త్వరలోనే అక్కడ కూడా చార్జీలు పెరగనున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ వాతలు తప్పవా ? విద్యుత్ కోతలతో పాటు చార్జీలు పెరిగి ప్రజలకు వాతలు కూడా తప్పేలా లేదు. కొద్ది రోజుల క్రితం వరకు ఒక యూనిట్ విద్యుత్‌ని 5 రూపాయలు ఉంటే, ఇప్పుడు డిస్కమ్ కంపెనీలు 20 రూపాయలు చెల్లించి కొనే పరిస్థితి వచ్చేసింది. గత జనవరి నుంచి బొగ్గు ధరలు అమాంతంగా 300 శాతం వరకు పెరిగాయి. ఈ పరిస్థితి కేవలం భారత్‌లోనే కాదు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితి కునారిల్లిపోయింది. దీంతో గ్యాస్ ఆధారితంగా పనిచేసే విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఫలితంగా విద్యుత్ చార్జీల మోత ఖాయమన్న ఆందోళనలు అంతటా వ్యక్తం అవుతున్నాయి. -
Telangana: డిస్కంలు ఇక ‘గల్లీ’ స్థాయికి!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమీప భవిష్యత్తులో గల్లీ లకు మాత్రమే పరిమితం కానున్నాయి. 11 కేవీ లైన్లు, రోడ్డు పక్కన దిమ్మెలపై ఉండే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీలు), వీటి నుంచి వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే లోటెన్షన్(ఎల్టీ) లైన్లు మాత్రమే వీటి నిర్వహణలో ఉండ నున్నాయి. డిస్కంల యాజమాన్యంలోని కీలకమైన 33 కేవీ వ్యవస్థను గంప గుత్తగా విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)కు అప్పగించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీంతో 33 కేవీ సరఫరా లైన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్లు ట్రాన్స్‌కోకు బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇదే జరిగితే డిస్కంల అజమాయిషీ కింద ఒక్క సబ్‌స్టేషన్ కూడా ఉండదు. నష్టాల తగ్గింపు, విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంపుదల, సరైన వ్యూహ రచన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం పేర్కొంది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణకు ముమ్మర కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 33 కేవీ భారం తప్పించడానికే.. ప్రతిపాదిత విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2021ను చట్టసభలు ఆమోదిస్తే విద్యుత్ పంపిణీ రంగంలో డిస్కంలకు పోటీగా ప్రైవేటు ఫ్రాంచైజీలు, ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీల ఆగమనానికి మార్గం సుగమనం కానుంది. 33 కేవీ వ్యవస్థను ట్రాన్స్‌కోకు అప్పగించిన తర్వాత విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ సాంకేతికంగా సరళీకృతం కానుంది. కొత్తగా వ్యాపారంలోకి దిగే ప్రైవేటు ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలకు ఇలా సులభంగా ఉండేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది. డిస్కంల 11 కేవీ వ్యవస్థను మాత్రమే అద్దెకు తీసుకోవడం ద్వారా ప్రైవేటు ఆపరేటర్లు తమ వినియోగదారులకు నేరుగా విద్యుత్ సరఫరా చేసి బిల్లులు వసూలు చేసుకోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడనుందని నిపుణులు పేర్కొంటున్నారు. దశల వారీ అప్పగింతకు చర్యలు తీసుకోండి డిస్కంల 33 కేవీ వ్యవస్థ ఆస్తులను దశల వారీగా ట్రాన్స్‌కోకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఈ నెల 1న రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో సూచించింది. తొలి దశలో 33 కేవీ వ్యవస్థకు సంబంధించిన ఇంక్రిమెంటల్ అసెట్స్‌తో పాటు ఓవర్ లోడెడ్ అసెట్స్‌ను ట్రాన్స్‌కోకు అప్పగించాలని కోరింది. 33 కేవీ వ్యవస్థ నవీకరణ, ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్‌కోకు ఆర్థిక సహాయం చేయాలని తెలిపింది. లేనిపక్షంలో పవర్ గ్రిడ్‌తో ట్రాన్స్‌కో జాయింట్ వెంచర్‌ను నెలకొల్పడం ద్వారా 50:50 వాటా పెట్టుబడితో నవీకరణ, ఆధునీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. నష్టాలను సాకుగా చూపుతూ.. ప్రస్తుతం ట్రాన్స్‌కో యాజమాన్యం పరిధిలో 400 కేవీ 220 కేవీ, 132/110 కేవీ, 66 కేవీ విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. దీని నిర్వహణలో ఉన్న 66 కేవీ–220 కేవీ స్థాయి వ్యవస్థల్లో కేవలం 1.72–2.39 శాతం నష్టాలు మాత్రమే ఉండగా, డిస్కంల నిర్వహణలో ఉన్న సబ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ (33 కేవీ వ్యవస్థ)లో భారీగా 4.8 శాతం నష్టాలున్నట్టు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీఎండీ నేతృత్వంలోని ఓ కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో డిస్కంల చేతిలో ఉన్న 33 కేవీ వ్యవస్థను ట్రాన్స్‌కోకు అప్పగించాలని ఈ కమిటీ చేసిన సిఫారసులను గత నెల 16న కేంద్రం ఆమోదించింది. ఒక్క శాతం నష్టాన్ని తగ్గించుకున్నా ఏటా రాష్ట్రాలకు రూ.4,495 కోట్ల నష్టాలు తగ్గిపోతాయని ఈ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రంలో ట్రాన్స్‌కోకు బదిలీ కానున్న డిస్కంల ఆస్తులు.. ఆస్తులు టీఎస్ఎన్పీడీసీఎల్ టీఎస్ఎస్పీడీసీఎల్ 33 కేవీ లైన్లు (కి.మీలో) 10,993 13,458 33/11 సబ్స్టేషన్లు 1,405 1,622 డిస్కంలకు మిగలనున్న ఆస్తులు.. ఆస్తులు టీఎస్ఎన్పీడీసీఎల్ టీఎస్ఎస్పీడీసీఎల్ 11 కేవీ లైన్లు (కి.మీలో) 87,260 91,997 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 2,95,000 4,35,453 -
విద్యుత్ సబ్సిడీలు: ముందు చెల్లిస్తే.. తర్వాత నగదు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంతో సహా ఏదైనా కేటగిరీ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీలు ఇవ్వాలనుకుంటే, నగదు బదిలీ (డీబీటీ) విధానంలో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయానికి ఉచితంగా, గృహాలు, ఇతర వినియోగదారులకు రాయితీపై తక్కువ టారిఫ్‌తో విద్యుత్ సరఫరా కోసం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విద్యుత్ సబ్సిడీలను చెల్లిస్తున్నాయి. డీబీటీ విధానం వస్తే ముందుగా రైతులు, ఇతర వినియోగదారులు పూర్తి స్థాయిలో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు విద్యుత్ సబ్సిడీ మొత్తాలను బదిలీ చేస్తాయి. విద్యుత్ విధానంలో కీలక సిఫారసులు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటిం చిన ముసాయిదా జాతీయ విద్యుత్ విధానం– 2021లో పలు కీలక సిఫారసులు చేసింది. కాలుష్య రహిత, సుస్థిర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడం, అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను అభివృద్ధి పరచడం, డిస్కంలకు పునరుజ్జీవనం కల్పించడం, విద్యుత్ రంగంలో వ్యాపారాలను ప్రోత్సహించడం, విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలకు సంబంధించిన పరికరాల ఉత్పత్తిని దేశంలో ప్రోత్సహించడం, నిబంధనలను సరళీకరించడం వంటి లక్ష్యాలతో ఈ ముసాయిదాకు కేంద్రం రూపకల్పన చేసింది. రాష్ట్రాలతో సంప్రదింపుల అనంతరం రానున్న ఐదేళ్లలో దీనిని అమలుపరచనుంది. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 22లోగా మీటర్ల అనుసంధానం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఫీడర్లు అన్నింటికీ కమ్యూనికబుల్ మీటర్లు్ల/ ఏఎంఆర్ మీటర్లను బిగించి, వాటిని నేషనల్ పవర్ పోర్టల్ (ఎన్పీపీ)తో డిసెంబర్ 22లోగా అనుసంధానం చేయాలని కేంద్రం రాష్ట్రాలకు గడువు విధించింది. నాన్–కమ్యూనికబుల్ మీటర్లు ఉన్న స్థానంలో కమ్యూనికబుల్ మీటర్లు బిగించాలని స్పష్టం చేసింది. కచ్చితమైన విద్యుత్ సరఫరా లెక్కలు, ఆడిటింగ్ కోసం రానున్న మూడేళ్లలో 100 శాతం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించాలని కోరింది. ఇక రెండు టారిఫ్‌ల విధానం... విద్యుత్ డిమాండ్ అత్యధికం (పీక్), అత్యల్పం (ఆఫ్–పీక్) ఉన్న సమయాల్లో వేర్వేరు విద్యుత్ టారిఫ్‌లను వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలి. విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్న వేళల్లో తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించాలి. ఏటా గడువులోగా క్రమం తప్పకుండా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించేలా ఈఆర్సీలు చర్యలు తీసుకోవాలి. విద్యుత్ సరఫరాకు అవుతున్న మొత్తం వ్యయాన్ని విద్యుత్ చార్జీల రూపంలో రాబట్టుకునేలా టారిఫ్‌ను ఈఆర్సీలు ఖరారు చేయాలి. ప్రైవేటీకరణే శరణ్యం.. విద్యుత్ పంపిణీ రంగంలో సుస్థిరత, అభివృద్ధి కోసం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యాన్ని (పీపీపీ) ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణతో వినియోగ దారులకు మెరుగైన సేవలు లభించడంతో పాటు పోటీతత్వం వృద్ధి చెందుతుంది. ప్రైవేటు ఫ్రాంచైజీల ఏర్పాటు ద్వారా ప్రైవేటీకరణను ప్రవేశపెట్టాలి. ఇందుకు డిస్కంల పరిధిలోని కొంత ప్రాంతంలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను థర్డ్‌పార్టీకి కాంట్రాక్టు పద్ధతిలో అప్పగించాలి. రాష్ట్ర ఈఆర్సీ ఆమోదంతో సబ్ లైసెన్సీల ఏర్పాటు ద్వారా కూడా ప్రైవేటీకరణను ప్రవేశపెట్టవచ్చు. 10 వేల మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి ప్రస్తుతం దేశం 6,780 మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండగా, రానున్న 10 ఏళ్లలో మరో 10 వేల మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఉన్న అవకాశాలపై పరిశీలన జరపాలని నిర్ణయించింది. స్మార్ట్ మీటర్లతో చాలా చేయొచ్చు విద్యుత్ చౌర్యం నివారణ కోసం విద్యుత్ ఆడిటింగ్ వ్యవస్థలో భాగంగా స్మార్ట్ మీటర్లను వినియోగించాలి. వ్యవసాయ వినియోగ దారులకు మీటర్లు ఏర్పాటు చేయడంలో ఆశించిన పురోగతిని రాష్ట్రాలు సాధించలేదు. ఈ విధానాన్ని ప్రకటించిన తర్వాత ఏడాదిలోగా వ్యవసాయ వినియోగదారులతో పాటు అన్ని రంగాల వినియోగదారులకు 100 శాతం మీటర్లు బిగించాలి. 3 ఏళ్లలోగా 100 శాతం వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలి. దీని ద్వారా పీక్, ఆఫ్ పీక్ టారిఫ్ విధానాన్ని అమలు చేయవచ్చు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను వినియోగంలోకి తీసుకొస్తే సుదూర ప్రాంతం (రిమోట్) నుంచి మీటర్ రీడింగ్, బిల్లింగ్, బిల్లుల కలెక్షన్, బిల్లులు చెల్లించకుంటే డిస్ కనెక్షన్ వంటి పనులను డిస్కంలు నిర్వహించవచ్చు. ఇకపై విడుదల చేసే కొత్త కనెక్షన్లకు తప్పనిసరిగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలి. -
డిస్కంల నష్టాలు రూ.36,231 కోట్లు
హైదరాబాద్: డిస్కంలు నష్టాలతో డిష్యుం డిష్యుం అంటున్నాయి. ఏటేటా నష్టాలు ఎట్లెట్లా ఎగబాకుతున్నాయో నివేదికలు తాజాగా వెల్లడించాయి. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నష్టాలు ఏకంగా రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లు నష్టాల్లో ఉండగా, 2018–19లో కొత్తగా మరో రూ.8,022.21 కోట్ల నష్టాలు జతయ్యాయి. దక్షిణ/ ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎస్పీడీసీఎల్/ టీఎస్ఎన్పీడీసీఎల్)లు ఇటీవల రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన వార్షిక నివేదికలు ఈ సంచలన విషయాలను బహిర్గతం చేశాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీ డీసీఎల్) నష్టాలు 2017–18 ముగిసేలోగా రూ.19,395.03 కోట్లుండగా, 2018–19 నాటికి 24,362.30 కోట్లకు పెరిగాయి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) నష్టాలు 2017–18 ముగిసేనాటికి రూ.8,814.23 కోట్లుండగా, 2018–19 నాటికి రూ.11,869.17 కోట్లకు ఎగబాకాయి. ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.5,764.95 కోట్ల విద్యుత్ సబ్సిడీలను మంజూరు చేసింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్ల సబ్సిడీలు ఇస్తున్నా, డిస్కంల నష్టాలు శరవేగంగా పెరిగిపోతుండటం గమనార్హం. ఎన్పీడీసీఎల్ ఆదాయంలో 40% సబ్సిడీలే.. టీఎస్ఎన్పీడీసీఎల్ 2018–19లో 19,119.78 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను సమీకరించగా, అందులో 17,226.28 ఎంయూల విద్యుత్‌ను వినియోగదారులకు విక్రయించింది. మిగిలిన 1,893.50 ఎంయూల విద్యుత్ పంపిణీ నష్టాల రూపంలో వృథా అయింది. విద్యుత్ కొనుగోళ్లకు రూ.10,461.63 కోట్లు, ట్రాన్స్మిషన్, ఎస్ఎల్డీసీ చార్జీల కోసం రూ.459.49 కోట్లు కలిపి మొత్తం రూ.10,291.13 కోట్లను ఖర్చుచేసింది. విద్యుత్ అమ్మకాలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, దానిపై వడ్డీలు, జరిమానాలు, విద్యుత్ చౌర్యం/అక్రమాల రికవరీలు, వినియోగదారుల నుంచి ఇతర చార్జీల వసూళ్ల ద్వారా ఎన్పీడీసీఎల్ రూ.6,027.55 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.4,254.15 కోట్ల విద్యుత్ సబ్సిడీలు, రూ.113.30 కోట్ల అదనపు సబ్సిడీలను మంజూరు చేసింది. దీంతో 2018–19లో ఎన్పీడీసీఎల్ రూ.10,395 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎన్పీడీసీఎల్ మొత్తం ఆదాయంలో ప్రభుత్వ సబ్సిడీల వాటే 41 శాతానికిపైగా ఉండటం గమనార్హం. అధికధరకు కొని తక్కువధరకు విక్రయం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) 2018–19లో 44,997.11 ఎంయూల విద్యుత్‌ను కొనుగోలు చేయగా, 40,342.50 ఎంయూల విద్యుత్‌ను వినియోగదారులకు విక్రయించింది. మిగిలిన 4,654.61 ఎంయూల విద్యుత్ పంపిణీ నష్టాల రూపంలో వృథా అయింది. ఈ మేరకు విద్యుత్ కొనుగోళ్లు, ట్రాన్స్మిషన్, ఇతర చార్జీలు కలిపి సంస్థ రూ.24,837.33 కోట్లు వ్యయం చేసింది. ఉద్యోగుల జీతభత్యాల కోసం మరో రూ.2,134.85 కోట్లు వెచ్చించింది. వినియోగదారులకు విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.23,899.76 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో రూ.1,397.50 కోట్ల సబ్సిడీలున్నాయి. జీతభత్యాల వ్యయం తడిసిమోపెడు విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ, పెన్షనర్లకు అదనంగా మరో 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను 2018 ఏప్రిల్ నుంచి అమలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కన్నా అధికంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల జీతాలు పీఆర్సీ అమలుతో మరింత భారీగా పెరిగిపోయాయి. 2017–18లో రూ.2,541.27 కోట్లున్న రెండు డిస్కంల ఉద్యోగుల జీతభత్యాల వ్యయం 2018–19లో రూ.4,059.69 కోట్లకు పెరిగిపోయింది. టీఎస్ఎస్పీడీసీఎల్ జీతభత్యాల వ్యయం రూ.1,876.93 కోట్ల నుంచి రూ.2,134.85 కోట్లకు, టీఎస్ఎన్పీడీసీఎల్ జీతభత్యాల వ్యయం రూ.664.34 కోట్ల నుంచి రూ.1,624.84 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీకి అనుమతి ఇచ్చిందని, ప్రభుత్వ అనుమతి లేకుండా పెన్షనర్లకు అదనంగా 7.5 శాతం ఫిట్మెంట్ వర్తింపజేశారని కాగ్ అభ్యంతరం తెలిపింది. ట్రాన్స్‌కో సంస్థ జారీ చేసే ఉత్తర్వులను డిస్కంలు కూడా అమలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోందని, పెన్షనర్ల విషయంలో సైతం ఇదే చేశామని, ఇందులో ఉల్లంఘనలేమి లేవని టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం కాగ్‌కు వివరణ ఇచ్చింది. -
డిస్కంలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు లేట్ పేమెంట్ సర్‌చార్జీల నుంచి కొంత ఉపశమనం లభించింది. విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరిగితే జరిమానాగా చెల్లించాల్సిన లేట్ పేమెంట్ సర్‌చార్జీలు కొంతవరకు తగ్గిపోనున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం డిస్కంలు బకాయిపడ్డ బిల్లు మొత్తంపై.. 18 శాతం వడ్డీని లేట్ పేమెంట్ సర్‌చార్జీగా చెల్లిస్తూ వస్తున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన ఎలక్ట్రిసిటీ (లేట్ పేమెంట్ సర్‌చార్జీ) రూల్స్-2021తో సర్‌చార్జీలు కొంతమేర తగ్గాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వార్షిక రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేటుపై మరో 5 శాతాన్ని జత చేసి లేట్ పేమెంట్ సర్‌చార్జీలుగా చెల్లించాలని రూల్స్ పేర్కొంటున్నాయి. ఎస్బీఐ వార్షిక రుణాలపై ప్రస్తుతం 7.59 శాతం వడ్డీరేటు ఉండగా, మరో 5 శాతం జత చేసి 12.59 శాతం సర్‌చార్జీగా (జరిమానా) ఇకపై చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా విద్యుదుత్పత్తి కంపెనీలకు 45 రోజుల్లోగా డిస్కంలు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 45 రోజుల గడువు మించిన తర్వాత తొలి నెల జాప్యానికి 12.59 శాతాన్ని (వడ్డీ రేటు) సర్‌చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం... రెండో నెల నుంచి ప్రతి నెలా 0.5 శాతం చొప్పున ఈ సర్‌చార్జీ పెరుగుతుంది. ఈ పెంపుపై గరిష్ట పరిమితిని 3 శాతంగా నిర్ణయించారు. అంటే ఏడు నెలల జాప్యం జరిగితే సర్‌చార్జీలు 15.59 శాతానికి చేరి ఆగిపోనున్నాయి. ఆ తర్వాత జరిగే జాప్యానికి అదనంగా వడ్డీరేటు పెరగదు. భారీగా బకాయిలు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రాప్తి (http://praapti.in) పోర్టల్ ప్రకారం విద్యుదుత్పత్తి కంపెనీలకు తెలంగాణ డిస్కంలు గత డిసెంబర్ నాటికి రూ.6,954 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రూ.2,500 కోట్లు, తెలంగాణ జెన్కోకు రూ.5 వేల కోట్లు సైతం డిస్కంలు చెల్లించాల్సి ఉంది. అన్ని కలిపి విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.15 వేల కోట్లకు పైనే ఉంటాయని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.15 వేల కోట్ల బకాయిలపై ప్రతి నెలా చెల్లించాల్సిన లేట్ పేమెంట్ సర్‌చార్జీలు (జరిమానా) తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్‌తో 18 శాతం నుంచి 12.59– 15.59 శాతానికి (వడ్డీరేటు) తగ్గనుండడంతో ప్రతి నెలా డిస్కంలకు రూ.కోట్లలో భారం తగ్గుతుందని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి. -
జలమండలికి ప్రత్యేక టారిఫ్
సాక్షి, హైదరాబాద్: జలమండలికి సంబంధించిన విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వం విడుదల చేయట్లేదని, వీటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) తోసిపుచ్చింది. జలమండలికి ప్రస్తుతం రాయితీపై అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్ స్థానంలో పాత హెచ్‌టీ–4(బీ) కేటగిరీ టారిఫ్‌ను కొనసాగించా లన్న డిస్కంల మరో విజ్ఞప్తిని కూడా ఈఆర్సీ నిరాకరించింది. జలమండలి ప్రత్యేక టారిఫ్‌పై పెండింగ్‌లో ఉన్న కేసులో ఇటీవల డిస్కంలు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. సత్వరమే పెండింగ్ టారిఫ్ ప్రతిపాదనలను దాఖలు చేయాలని, టారిఫ్ ఉత్తర్వుల్లో జలమండలికి సంబంధించిన ప్రత్యేక టారిఫ్ అంశంపై తుది ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అప్పట్లోగా జలమండలికి సంబంధించిన తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకు విద్యుత్ కనెక్షన్లను కట్ చేయబోమని డిస్కంలు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని ఈఆర్సీ కోరింది. హైదరాబాద్ మెట్రో రైలు కోసం యూనిట్ విద్యుత్‌కు రూ.3.95 చొప్పున అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్‌ను తాగునీటి సరఫరా పంప్‌హౌస్‌లకు సైతం వర్తింపజేయాలని జలమండలి చేసిన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తూ గతేడాది జూలైలో ఈఆర్సీ తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. 2019–20, 2020–21 సంవత్సరాల్లో ఈ ప్రత్యేక టారిఫ్‌ను వర్తింపజేయాలని అప్పట్లో ఈఆర్సీ ఆదేశించింది. ప్రత్యేక టారిఫ్ అమలుతో గతేడాది జూన్ నాటికి రూ.538.95 కోట్లు నష్టపోయామని డిస్కంలు తెలిపాయి. జలమండలి ద్వారా తాగునీటి సరఫరాకు అవుతున్న ఖర్చులతో పోలిస్తే అవుతున్న వ్యయం అధికంగా ఉందని, 2016–17లో రూ.232 కోట్లు, 2017–18లో రూ.330 కోట్లు, 2018–19లో రూ.299 కోట్లు, 2019–20లో రూ.577 కోట్లు, 202–21 అక్టోబర్ వరకు రూ.265 కోట్ల నష్టాలు వచ్చాయని జలమండలి ఈఆర్సీకి నివేదించింది. పాత టారిఫ్ ప్రకారం విద్యుత్ చార్జీలు పెంచితే భరించలేమని వాదనలు వినిపించింది. డిస్కంలు, జలమండలి వాదనలు విన్న ఈఆర్సీ.. డిస్కంల మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
బకాయిల బండ!
సాక్షి, హైదరాబాద్: విద్యుదుత్పత్తి కంపెనీలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన బకాయిల భారం ఏటేటా భారీగా పెరిగిపోతోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రాప్తి పోర్టల్ (https: //praapti.in) ప్రకారం 2019 డిసెంబర్ నాటికి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,860 కోట్లు ఉండగా 2020 డిసెంబర్ నాటికి అవి రూ. 7,101 కోట్లకు ఎగబాకాయి. తెలంగాణ జెన్కోతోపాటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు ఈ జాబితాలో పొందుపర్చలేదు. అవి రెండూ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు కావడంతో డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయడం లేదు. జెన్కో, సింగరేణిలకు చెల్లించాల్సిన బకాయిలు కలిపితే డిస్కంల మొత్తం బకాయిలు రూ. 10 వేల కోట్లకుపైనే ఉండనున్నాయి. ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువ ఎన్టీపీసీ, జెన్కో వంటి ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు పలు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు భారీ ఎత్తున విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రంలోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల వ్యయం, పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వంటి అన్ని ఖర్చులు కలిపి విద్యుత్ సరఫరాకు అవుతున్న వాస్తవ వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్)తో పోల్చితే వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్ల ద్వారా పొందుతున్న ఆదాయంలో భారీ వ్యత్యాసం ఉండటంతో డిస్కంలు ప్రతి నెలా రూ. 200 కోట్ల నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న ప్రతి యూనిట్ విద్యుత్‌పై 0.93 పైసల చొప్పున డిస్కంలు నష్టపోతున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న ‘ఉదయ్’పోర్టల్ పేర్కొంటోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విద్యుత్ సబ్సిడీలు పూర్తిస్థాయిలోఆదాయ లోటును పూడ్చటంలో విఫలం కావడంతో డిస్కంలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. నష్టాల కారణంగా విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరపలేకపోతున్నాయి. దీంతో క్రమేణ జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. గత డిసెంబర్ నాటికి డిస్కంలు వివిధ జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు (రూ. కోట్లలో) విద్యుదుత్పత్తి కంపెనీ డిస్కంల బకాయిలు సీఎల్పీఐ 171.73 ఐటీపీసీఎల్ 9.53 ఎన్ఎల్సీఐఎల్ 492.11 ఎన్‌టీఈసీఎల్ 248.55 ఎన్టీపీసీ 1,723.97 ఎన్టీపీఎల్ 418.65 ఎస్‌ఈఎంబీ 2,532.22 సంప్రదాయ విద్యుత్ బకాయిల మొత్తం: 5,596.76 సంప్రదాయేతర విద్యుత్ బకాయిలు: 1,504.57 మొత్తం బకాయిలు: 7,101 ‘కో–ఆర్డినేషన్’కమిటీపై బకాయిల భారం.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 478.86 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 1,335.16 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కో–ఆర్డినేషన్ కమిటీ (టీఎస్పీసీసీ) రూ. 5,287.31 కోట్లు కలిపి డిస్కంలు మొత్తం రూ. 7,101.33 కోట్లను విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిపడ్డాయి. అత్యధిక శాతం విద్యుత్ కొనుగోళ్లను టీఎస్పీసీసీ ఆధ్వర్యంలో జరుపుతుండటంతో అత్యధిక బకాయిలు సైతం దీని పేరిటే ఉన్నాయి. ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు చైర్మన్‌గా ఉన్న టీఎస్పీసీసీ డిస్కంల తరఫున విద్యుత్ కొనుగోళ్లు, జనరేటర్లకు బిల్లుల చెల్లింపుల వంటి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. నెలవారీగా జనరేటర్లకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు (రూ. కోట్లలో) 2020 బకాయిలు జనవరి 6,153 ఫిబ్రవరి 6,385 మార్చి 6,039 ఏప్రిల్ 6,494 మే 7,143 జూన్ 7,443 జూలై 4,755 ఆగస్టు 4,872 సెప్టెంబర్ 5,485 అక్టోబర్ 6,096 నవంబర్ 6,655 డిసెంబర్ 7,101 కేంద్రం మెట్టు దిగితేనే.. విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలకు ఆత్మనిర్భర్ రుణాలను ప్రకటించింది. తెలంగాణ డిస్కంలకు ఆర్ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రూ. 12,600 కోట్ల రుణాలు మంజూరవగా 50 శాతం రుణాలను తొలి విడత కింద విడుదల చేశారు. రెండో విడత రుణాల విడుదలకు విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదిస్తున్న సంస్కరణల అమలుకు అంగీకరిస్తేనే మిగిలిన రుణాలను విడుదల చేస్తామని కేంద్రం పేర్కొంటోంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణల అమలును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మెట్టుదిగి రుణాల విడుదలకు అంగీకరిస్తేనే డిస్కంలు బకాయిల భారం నుంచి బయటపడనున్నాయి. -
ఒకేసారి మూడేళ్లకు.. విద్యుత్ చార్జీల పెంపు!
గత రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదు. దాంతో డిస్కంల ఆదాయలోటు కొండలా పెరిగిపోయింది. రూ. 20 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) లు ఈ నెల 8 లేదా 9న రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించనున్నాయని ఉన్నతాధికార వర్గాలు ధ్రువీకరించాయి. విద్యుత్ చట్టం ప్రకారం ఏటా నవంబర్ 30లోగా... వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల అంచనా నివేదిక (ఏఆర్ఆర్)ను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ను జీహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా డిస్కంలు వాయిదా వేసుకున్నాయి. 2019–20, 2020–21 సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికలను సైతం ఇప్పటివరకు డిస్కంలు ఈఆర్సీకి సమర్పించలేదు. ఈ నేపథ్యంలో మూడేళ్ల ఏఆర్ఆర్ నివేదికలను ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో ఒకేసారి సమర్పించబోతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ సుదీర్ఘ కసరత్తు... వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం? ఈ విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయడానికి ఎంత ఖర్చు కానుంది? ప్రస్తుత విద్యుత్ చార్జీలతో సరఫరా చేస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడనుంది? ఆర్థిక లోటును అధిగమించడానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి? గృహ, వాణిజ్య, పరిశ్రమల కేటగిరీల్లో ఎవరికెంత పెంచుతారు? వంటి ప్రతిపాదనలు ఏఆర్ఆర్ నివేదికలో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ తొలుత అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తుంది. అనంతరం బహిరంగ విచారణ నిర్వహించి ఏప్రిల్ 1తో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ఉత్తర్వులను మార్చి 31లోగా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ నిర్వహణకు కనీసం నాలుగు నెలల సమయం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా నవంబర్ 30లోగా ఏఆర్ఆర్ నివేదికను సమర్పించాలని విద్యుత్ చట్టం పేర్కొంటోంది. రాజకీయ కారణాలతో గత మూడేళ్లుగా ఏఆర్‌ఆర్‌ను వాయిదా వేసుకుంటూ రావడంతో డిస్కంలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 2018–19 నాటి టారిఫ్‌నే తర్వాతి రెండేళ్లు కొనసాగించడంతో డిస్కంల ఆర్థికలోటు రూ.20 వేల కోట్లకు చేరిందని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 2019–20, 2020–21లో విద్యుత్ చార్జీలు పెంచకపోవడంతో జరిగిన నష్టాన్ని వినియోగదారుల నుంచి ‘ట్రూ అప్’చార్జీల రూపంలో వసూలు చేసేందుకు అనుమతించాలని సైతం డిస్కంలు ఈఆర్సీని కోరనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. దీనికి ఈఆర్సీ సమ్మతిస్తుందా? లేదా? అనేది వేచిచూడాలి. (చదవండి: ట్రూ-అప్ చార్జెస్ అంటే ఏమిటి?) డిస్కంలు గాడిలో పడేలా... ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీలు పోగా, మిగిలిన ఆదాయ లోటును చార్జీల పెంపు ద్వారా డిస్కంలు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంపునకు అనుమతిస్తే, అంతమేరకు ఆదాయ లోటు ఉందని ఈఆర్సీ టారిఫ్ ఉత్తర్వులు జారీ చేయడం ఆనవాయితీగా మారింది. ఇలా సర్దుబాటు చేస్తున్న ఆదాయలోటు వచ్చే ఏడాదికి బదిలీ కావడం, ఏటేటా ఇదే తంతు సాగుతుండడంతో ప్రస్తుతం కొండలా రూ.20 వేల కోట్లకు పెరిగిపోయి డిస్కంలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడేసింది. ఇక జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీతో పాటు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలు, సొలార్ విద్యుత్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిలే రూ.14 వేల కోట్లకు చేరిపోయాయి. వీటిని చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో ఇటీవల డిస్కంలు కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీ కింద ఆర్ఈసీ, పీఎఫ్సీ నుంచి రూ.14 వేల కోట్ల రుణాన్ని పొందాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేల కోట్ల వరకు విద్యుత్ చార్జీలు పెంచితే కాని డిస్కంలు ఆర్థికంగా కుదుటపడవని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త టారిఫ్‌లో ఉచిత హామీలు డిసెంబర్ నుంచి సెలూన్లు, ధోబి ఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టారిఫ్ పట్టికలో కొత్త కేటగిరీని సృష్టించి వీరికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదించనున్నాయి. ఉచిత విద్యుత్ సరఫరాతో డిస్కంలపై పడనున్న భారాన్ని ప్రభుత్వం భరించి... ఈ మేరకు విద్యుత్ సబ్సిడీలు పెంచాల్సి ఉంటుంది. -
ఆ ఐదేళ్ల నిర్వాకం .. తీరని శాపం
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలను దారుణంగా దెబ్బతీసింది. ఆ ప్రభుత్వ విధానాలు, నిర్వాకాలతో ఇప్పటికీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అవసరం లేకున్నా ప్రాజెక్టులు, కమీషన్ల కోసం కాంట్రాక్టులు, ఎక్కడా లేని రేట్లతో ఎడాపెడా ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు నిండా ముంచేశాయి. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ సంస్థలకు రూ.7,069.25 కోట్ల అప్పులుంటే... 2019 మే చివరి నాటికి అవి రూ.35,700.97 కోట్లకు పెరిగాయి. కాగా ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం వీటిని గట్టెక్కించే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఏడాది కాలంలోనే రూ.38,288 కోట్ల ఆర్థిక సాయం అందేలా చేసింది. డిస్కమ్‌లపై పెను భారం గత ప్రభుత్వ ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు (పీపీఏలు) డిస్కమ్‌లపై పెను భారం మోపాయి. మిగులు విద్యుత్ పేరుతో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ళు చేశారు. రూ.4కు లభించే యూనిట్ విద్యుత్‌కు రూ.6పైనే వెచ్చించడం, మార్కెట్లో అప్పటికప్పుడు యూనిట్‌ను రూ.9 కూడా పెట్టి కొనడం సంస్థలను అప్పుల్లోకి నెట్టాయి. 2014–2019 మార్చి నాటికి డిస్కమ్‌లు ఏకంగా రూ.28 వేల కోట్ల నష్టాల్లోకెళ్ళాయి. రాష్ట్రంలో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని అవసరం లేకున్నా (రెన్యూవబుల్ ఆబ్లిగేషన్ కింద) ఎక్కువ మొత్తంలో ప్రోత్సహించారు. 11 శాతం ఉండాల్సిన ఈ విద్యుత్‌ను 23 శాతంకు అనుమతించడంపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రైవేటు ఉత్పత్తిదారుల నుంచి ముడుపులు తీసుకుని ఈ విధంగా అనుమతించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పవన, సౌర విద్యుత్‌ను లెక్కకు మించి కొనడం వల్ల డిస్కమ్‌లపై 2014–19 మధ్య దాదాపు రూ.6 వేల కోట్ల అదనపు భారం పడింది. మరోవైపు ఈ విద్యుత్ కోసం థర్మల్ విద్యుత్‌ను తగ్గించారు. అయినా ఈ ప్లాంట్లకు ఐదేళ్ళల్లో రూ.7 వేల కోట్ల వరకు ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించడంతో నష్టాలు మరింత పెరిగాయి. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం మెగావాట్‌కు రూ.4.5 కోట్ల చొప్పున చేపడితే.. ఏపీలో మాత్రం కొత్త ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టు మెగావాట్‌కు రూ.6 కోట్ల వరకు ఇచ్చారు. కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం ప్లాంట్ల నిర్మాణంలో ఏకంగా రూ.2 వేల కోట్ల అదనపు వ్యయం చేశారు. ఇందులో అప్పటి ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలొచ్చాయి. విదేశీ బొగ్గు ధరలు తగ్గినా పాత రేట్లకే కొనుగోలు చేశారు. దీంతో థర్మల్ ప్లాంట్లు భారీగా నష్టపోయాయి. స్వదేశీ బొగ్గు కాంట్రాక్టు రవాణాలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి వల్ల జెన్కో అప్పులపాలైంది. సౌర విద్యుత్ కోసం వేసిన ట్రాన్స్‌కో లైన్లలో అవినీతి జరిగిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. జగన్ సర్కారు దిద్దుబాటు చర్యలు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్యుత్ సంస్థలను ఆదుకునేందుకు ఏడాది కాలంలోనే పెద్ద ఎత్తున సహకరించింది. 2019–20లో డిస్కమ్‌లకు సబ్సిడీ కింద రూ.17,904 కోట్లు విడుదల చేసింది. బిల్లుల చెల్లింపునకు రూ.20,384 కోట్లు ఇచ్చింది. 2020–21 ఆర్థిక వ్యయాన్ని దాదాపు రూ.5 వేల కోట్లకు తగ్గించింది. రివర్స్ టెండరింగ్ చేపట్టి ప్రతి కాంట్రాక్టును తక్కువ రేటుకే ఇచ్చేలా చేస్తోంది. తక్కువ ధరకే విద్యుత్ కొనుగోళ్ళు చేయడం వల్ల ఏడాది కాలంలోనే రూ.500 కోట్ల వరకు మిగిల్చింది. -
కరెంట్ చార్జీల పెంపుపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మళ్లీ కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ నెలాఖరులోగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించనున్నాయి. వరుస ఎన్నికలతో గత రెండేళ్లుగా చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు వాయిదా వేసుకుంటూ వచ్చాయి. కేంద్ర విద్యుత్ చట్టం ప్రకారం ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) అంచనాల నివేదికను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విద్యుత్ సరఫరా అవసరాలు ఏమిటి? ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కానుంది? ఇంత విద్యుత్ సరఫరా చేయడానికి ఎంత ఖర్చు కానుంది? ప్రస్తుత విద్యుత్ చార్జీలతో ఇంత విద్యుత్ సరఫరా చేస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడనుంది? ఆర్థిక లోటును అధిగమించడానికి ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి? ఏ కేటగిరీ వినియోగదారులపై ఎంత భారం మోపాలి? వంటి అంశాలకు సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలతో ఏఆర్ఆర్ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. వాటిపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి వచ్చే ఏడాదికి సంబంధించిన టారిఫ్ ఉత్తర్వులను జారీ చేస్తుంది. అయితే గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు, ఇతర రాజకీయ కారణాలతో డిస్కంలు 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికలను ఇప్పటివరకు ఈఆర్సీకి సమర్పించలేదు. దీంతో 2018–19 ఆర్థిక సంవత్సరం కోసం జారీ చేసిన టారిఫ్ ఆధారంగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు వసూలు చేసుకోవడానికి డిస్కంలకు ఈఆర్సీ అనుమతిచ్చింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికను ఈఆర్సీకి సమర్పించడానికి ఈ నెలాఖరుతో గడువు ముగియబోతోంది. అందువల్ల 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్స రాలకు సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే 2019–20, 2020–21కి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికలు డిస్కంల వద్ద సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో ఈఆర్సీకి సమర్పించలేకపోయాయి. గడువు సమీపిస్తుండటంతో 2021–22కి సంబంధించిన ఏఆర్ఆర్ల రూపకల్పనపై దృష్టి సారించాయి. ఆదాయ లోటు రూ. 20 వేల కోట్లు డిస్కంల ఆదాయ లోటు ఏకంగా రూ. 20 వేల కోట్లకు ఎగబాకిందని ఇంధన శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2018–19 నాటికి రూ. 12 వేల కోట్లు ఉన్న ఆదాయ లోటు గత రెండేళ్లలో భారీగా పెరిగి రూ. 20 వేల కోట్లకు మించిపోనుందని ఉన్నతాధికారులు పేర్కొంటు న్నారు. ఉచిత వ్యవసాయ విద్యుత్, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 10 వేల కోట్ల విద్యుత్ రాయితీలను బడ్జెట్లో కేటాయించింది. ఈ రాయితీలు పోగా ఆదాయ లోటు రూ. 20 వేల కోట్ల వరకు మిగిలి ఉంటాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు రూ. 10 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద ఆర్ఈసీ, పీఎఫ్సీ నుంచి రూ. 12 వేల కోట్ల రుణాలను పొందడానికి డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే రూ. 6 వేల కోట్ల రుణాలు మంజూరవగా కేంద్రం విధించిన షరతులు పూర్తి చేస్తే మిగిలిన రుణం మంజూరు కానుంది. అయితే భారీ మొత్తంలో విద్యుత్ చార్జీలు పెంచితేనే ప్రస్తుత పరిస్థితుల్లో డిస్కంలు ఆర్థిక సంక్షోభం నుంచి కొంత వరకు గట్టెక్కే అవకాశాలున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతే.. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించడానికి డిస్కంలకు అనుమతి లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయితే ఆ వెంటనే టారీఫ్ పెంపు ప్రతిపాదనలను సమర్పించే అవకాశముంది. -
ఏంటీ ట్రూ-అప్ చార్జెస్!
సాక్షి, అమరావతి: విద్యుత్ ట్రూ-అప్ చార్జీలపై ఐదేళ్లుగా స్పష్టత లేకపోవడంతో రూ.19,604 కోట్ల మేర ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో డిస్కమ్‌లు అప్పుల బాట పట్టాల్సి వస్తోంది. 2021-22 వార్షిక ఆదాయ, అవసర నివేదికలను ఈ నెలాఖరులోగా పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాలి. ఈ నేపథ్యంలో ట్రూ-అప్ సంగతేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై సరైన స్పష్టత ఇవ్వాలని డిస్కమ్‌లు ప్రభుత్వాన్ని కోరాయి. ఏంటీ ట్రూ-అప్! విద్యుత్ సంస్థల ఖర్చును నియంత్రిస్తూ, దేనికి ఎంత ఖర్చు పెట్టాలనే ఆదేశాలతో ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ప్రతీ ఏటా టారిఫ్ ఆర్డర్ ఇస్తుంది. అందుకు లోబడే సంస్థలు ఖర్చు చేయాలి. కానీ 2014-15 నుంచి 2018-19 వరకూ గత ప్రభుత్వం నియంత్రణ రేఖను దాటింది. అధికంగా చేసిన ఖర్చుకు కారణాలు వివరిస్తూ కమిషన్ అనుమతి కోసం మరుసటి సంవత్సరం డిస్కమ్‌లు పిటీషన్ ఫైల్ చేస్తాయి. దీన్నే ట్రూ-అప్ అంటారు. 2014-19 మధ్య కాలంలో ఇలా ఫైల్ చేసిన మొత్తం రూ.19,604 కోట్లు. దీన్ని అనుమతిస్తే టారిఫ్ రూపంలో ప్రజలపైనే భారం వేయాలి. ఖర్చు అనవసరం అని భావిస్తే కమిషన్ దాన్ని అనుమతించకూడదు. ఏపీఈఆర్సీ దీనిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఫలితంగా ఇదంతా తమకు రావాల్సిన బాకీ అని డిస్కమ్‌లు భావిస్తున్నాయి. దీనికోసం అప్పులు చేశామని చెబుతున్నాయి. దానికి ప్రతీ ఏటా వడ్డీ చెల్లిస్తున్నామంటున్నాయి. ఖర్చు ఎందుకు పెరిగింది? మార్కెట్లో చౌక విద్యుత్ లభిస్తున్నా.. ఎక్కువ రేటుకు విద్యుత్ ఇచ్చే ప్రైవేట్ సంస్థలనే ప్రభుత్వం ప్రోత్సహించింది. మరో పక్క ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయలేకపోయారు. 2014-15 వరకూ విద్యుత్ కొనుగోలుకు కమిషన్ అనుమతికి మించి రూ.451 కోట్లు అదనంగా ఖర్చు చేస్తే.. 2015-17లో రూ.2,580, 2017-18లో రూ.2,577 కోట్లు, 2018-19లో రూ.3,990 కోట్లు అదనంగా ఖర్చు చేశారు. విద్యుత్ బిల్లుల వసూళ్లలోనూ భారీ తేడా వచ్చింది. 2014-15 నుంచి 2018-19 మధ్య రూ.5,259 కోట్లు వసూలు చేయలేదు. ఇందులో చాలా వరకూ ప్రభుత్వ సంస్థల బాకీలే ఉన్నాయి. విద్యుత్ కొనుగోళ్ల భారం, వసూలు కాని బకాయిలు పెరిగి పెరిగి రూ.19,604 కోట్లకు చేరింది. ప్రస్తుత ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వస్తోంది అడ్డగోలుగా విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారానికి లెక్కలు చెప్పకపోవడం గత ప్రభుత్వ నిర్వాకమైతే, ఇన్నేళ్లూ ట్రూ-అప్ సంగతి తేల్చకపోవడం శోచనీయం. గత ప్రభుత్వం చేసిన చర్యకు ప్రస్తుత ప్రభుత్వం జవాబు చెప్పాల్సి రావడం ఇబ్బందే. - ఎ.పున్నారావు, విద్యుత్‌రంగ నిపుణుడు విద్యుత్ కొనుగోళ్ల భారం, వసూలు కాని బకాయిల వివరాలు: సంవత్సరం ఎంత? (రూ. కోట్లలో) 2014-15 861 2015-16 3,958 2016-17 7,186 2017-18 3,257 2018-19 4,342 మొత్తం 19,604 -
నష్టాల మార్కెట్లో విద్యుత్ షేర్ల వెలుగులు
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కమ్)లకు ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రుణ సౌకర్యాల పరిమితిని తాత్కాలికంగా సడలించింది. దీంతో కోవిడ్-19, లాక్‌డవున్ తదితర సవాళ్ల నేపథ్యంలో లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొంటున్న పలు విద్యుత్ రంగ కంపెనీలు లబ్ది పొందనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఉదయ్ పథకంలో భాగంగా ఇప్పటివరకూ గతేడాది వర్కింగ్ క్యాపిటల్‌లో 25 శాతం వరకూ డిస్కమ్‌లకు రుణ సమీకరణకు అనుమతి ఉంది. అయితే వన్‌టైమ్ చర్యలకింద ఆర్థిక వ్యవహారాల కేంద్ర కమిటీ రుణ సమీకరణ పరిమితిని సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ రంగ కంపెనీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. పలు కౌంటర్లు నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. జోరుగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో టాటా పవర్ 10 శాతం దూసుకెళ్లి రూ. 62ను అధిగమించగా.. ఎన్టీపీసీ 7 శాతం జంప్‌చేసి రూ. 102కు చేరువైంది. గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ 6 శాతం పురోగమించి రూ. 81ను తాకగా.. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ 3.5 శాతం పెరిగి రూ. 59 వద్ద, సీఈఎస్సీ 2.5 శాతం పుంజుకుని రూ. 621 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో ఎన్‌హెచ్‌పీసీ 11.25 శాతం ఎగసి రూ. 23.3 వద్ద కదులుతుంటే.. అదానీ పవర్ 4.4 శాతం జంప్‌చేసి రూ. 39.5కు చేరింది. ఈ బాటలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎస్జీవీఎన్, టొరంట్ పవర్, ఎన్ఎల్సీ ఇండియా, అదానీ గ్రీన్ ఎనర్జీ 2-1 శాతం మధ్య బలపడి ట్రేడవుతున్నాయి. -
ఈఆర్సీ ససేమిరా..!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు జూన్ 30 వరకు మరోసారి గడువు పొడిగించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా తోసిపుచ్చింది. వాస్తవానికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను గతే డాది నవంబర్ 30లోగా సమర్పించాల్సి ఉండగా, డిస్కంలు వివిధ కారణాలు చూపుతూ పలు దఫాలుగా గడువు పొడిగింపు కోరుతూ వచ్చాయి. చివరిగా ఈ ఏడాది మార్చి 31 వరకు ఈఆర్సీ గడువు పొడిగించినా, డిస్కంలు ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమయ్యా యి. మరింత కాలం గడువు పొడిగింపు కోరుతూ అప్పట్లో డిస్కంలు ఈఆర్సీకి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయలేకపోయాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మార్చి 24 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకి రావడంతో గడువు పొడిగింపు కోరలేకపోయాయి. గడువు ముగిసిన 2 నెలల తర్వాత మళ్లీ జూన్ 30 వరకు మరోసారి గడువు పొడిగించాలని కోరుతూ ఇటీవల డిస్కంలు విజ్ఞప్తి చేయగా, ఈఆర్సీ ససేమిరా నిరాకరించింది. ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించే సమయంలోనే ఇప్పటివరకు జరిగిన జాప్యానికి మన్నించాలని విజ్ఞప్తి చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జూన్ 1న డిస్కంలకు ఈఆర్సీ లేఖ రాసింది. చివరిసారిగా పొడిగించిన గడువు మార్చి 31తో ముగిసిపోగా, ఆ గడువులోపే మళ్లీ గడువు పొడిగింపు కోసం విజ్ఞప్తి చేయాల్సి ఉండగా డిస్కంలు విఫలమయ్యాయి. రెండు నెలల ఉల్లంఘన తర్వాత గడువు కోరడం వల్లే ఈఆర్సీ అంగీకరించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలో చార్జీల పెంపు ప్రతిపాదనలు.. గడువు పొడిగింపునకు ఈఆర్సీ నిరాకరించిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలతో పాటు ఏఆర్ఆర్ నివేదికను డిస్కంలు వెంటనే ఈఆర్సీకి సమర్పించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలు మళ్లీ కసరత్తు ప్రారంభించాయి. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలు విద్యుత్ చార్జీలు పెంచేందుకు గత ఆరు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా, వివిధ రకాల ఎన్నికలు, రాజకీయ కారణాలతో వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను సైతం డిస్కంలు ఈఆర్సీకి సమర్పించలేదు. గత మూడేళ్లకు పైగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచలేదు. దీంతో డిస్కంలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని.. గతంలో ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్ నివేదికలో డిస్కంలు అంచనా వేశాయి. 2019–20 ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల ఆర్థిక లోటు రూ.12 వేల కోట్లకు చేరిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా సుమారు రూ.2 వేల కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని అర్జించాలని డిస్కంలు యోచిస్తున్నాయి. విద్యుత్ సంస్థల సీఎండీలు త్వరలో సీఎం కేసీఆర్‌తో సమావేశమై ఈ పరిస్థితులను వివరించి చార్జీల పెంపునకు అనుమతి కోరే అవకాశముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిస్తే జూన్ 30లోగా ప్రతిపాదనలు సమర్పించే అవకాశాలున్నాయి. -
కేంద్రం పవర్ గేమ్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో సమూల సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో విద్యుత్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు విద్యుత్ సరఫరా బాధ్యతలతోపాటు కీలక అధికారాలన్నీ రాష్ట్రాలకే ఉన్నాయి. భవిష్యత్తులో రాష్ట్రాలు కేవలం బాధ్యతలకు మాత్రమే పరిమితం కాబోతున్నాయి. కీలక అధికారాలను రాష్ట్రాల నుంచి కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటోంది. అలాగే విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేటు ఫ్రాంచైజీలు, సబ్ లైసెన్సీలకు అనుమతించాలని నిర్ణయించింది. దశల వారీగా విద్యుత్ సరఫరా ప్రైవేటీకరణకు ఈ నిర్ణయం దారి తీయనుంది. వినియోగదారులకు అందించే విద్యుత్ సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం పాడాలని మరో నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఎన్నో కీలకమైన సంస్కరణల అమలు కోసం కేంద్ర విద్యుత్ చట్టం– 2003కు పలు సవరణలను ప్రతిపాదిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లు 2020ను ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. దీనిపై జూన్ 5లోగా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. (చదవండి: ఆర్మీలో ‘టెంపరరీ’ జాబ్స్!) రాష్ట్రాల అధికారాలకు కత్తెర ఈఆర్సీ చైర్మన్, సభ్యుల నియామకం విషయంలో రాష్ట్రాల అధికారాలకు కేంద్రం కత్తెర వేయబోతోంది. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ), అప్పిలేట్ ట్రిబ్యునల్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి (ఎస్ఈఆర్సీ)ల చైర్మన్, సభ్యులను.. కేంద్రం నియమించే కమిటీ ఎంపిక చేయనుంది. ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా సుప్రీం కోర్టు జడ్జి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ఏవైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్, సభ్యులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోంది. విద్యుత్ చట్టం సవరణలు అమల్లోకి వస్తే ఆ అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోనున్నాయి. ప్రస్తుత విధానంలో రాష్ట్రాలు నియమించుకుంటున్న ఈఆర్సీ చైర్మన్, సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించకుండా, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలు బొమ్మల్లాగా పనిచేస్తున్నాయని, దీంతో విద్యుత్ సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గవర్నర్లను నియమించి రాష్ట్రాలకు పంపినట్లు ఎస్ఈఆర్సీ చైర్మన్, సభ్యులను ఇకపై కేంద్రం నియమించనుందని, దీంతో వీరి నిర్ణయాలు సైతం కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ప్రైవేటీకరణకు రాచబాట! విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తమ పరిధిలోని ఏదైనా ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసే బాధ్యతలను డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీలు, ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఈ సవరణలు వీలు కల్పించనున్నాయి. ఏదైనా ప్రాంతంలో డిస్కంలు తమ తరఫున విద్యుత్ సరఫరా చేసేందుకు ఎవరినైనా డిస్ట్రిబ్యూషన్ సబ్‌లైసెన్సీలుగా నియమించుకోవచ్చు. అయితే సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే, ఫ్రాంచైజీల విషయంలో ఈఆర్సీ నుంచి లైసెన్స్ కానీ, అనుమతి కానీ అవసరం ఉండదు. ఫ్రాంచైజీగా నియామకమైన వ్యక్తి/సంస్థతో డిస్కంలు ఒప్పందం కుదుర్చుకుని ఈఆర్సీకి సమాచారం ఇస్తే సరిపోతుంది. అయితే, ఫ్రాంచైజీలకు అప్పగించిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు డిస్కంలే బాధ్యులు కానున్నాయి. ప్రధానంగా నష్టాలు బాగా వస్తున్న ప్రాంతాలను డిస్కంలు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు మార్గం సుగమం కానుందని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునరుత్పాదక విద్యుత్ కొనకపోతే జరిమానా ఈఆర్సీ నిర్దేశించిన మొత్తంలో ఏటా డిస్కంలు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిందే. నిర్దేశించిన పరిమాణం కన్నా తక్కువగా కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన ప్రతి యూనిట్‌కు 50 పైసలు చొప్పున డిస్కంలు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం ప్రతిపాదించింది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఈ నిబంధన పెను భారంగా మారే ప్రమాదముంది. ఏటేటా బిల్లుల వాత.. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న మొత్తం ఖర్చులను రాబట్టుకునేలా విద్యుత్ టారిఫ్ ఉండాల్సిందేనని విద్యుత్ చట్ట సవరణ బిల్లులో కేంద్రం పేర్కొంది. డిస్కంల నష్టాలను పూడ్చుకోవడానికి అవసరమైన మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా, ఆ నష్టాలను వచ్చే ఏడాదికి సర్పాజ్ చేసుకుంటూ పోతున్న ప్రస్తుత విధానానికి ఫుల్స్టాప్ పెట్టాలని కోరింది. ఈ నిబంధలను అమలు చేస్తే ఏటా విద్యుత్ బిల్లులు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం.. ప్రస్తుతం అవలంభిస్తున్న విద్యుత్ సబ్సిడీ, క్రాస్ సబ్సిడీల విధానానికి మంగళం పాడాలని కేంద్రం కోరుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నివాస గృహాలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, హెయిర్ కటింగ్ సెలూన్స్ తదితర కేటగిరీల వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వీరికి సంబంధించిన కొంత సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుండగా, మిగిలిన భారాన్ని క్రాస్ సబ్సిడీల రూపంలో పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు భరిస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీల కారణంగానే గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులపై బిల్లుల భారం తక్కువగా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న సబ్సిడీలను నేరుగా నగదు బదిలీ (డీబీటీ) విధానంలో వినియోగదారులకు నేరుగా ఇవ్వాలని, పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారుల నుంచి క్రాస్ సబ్సిడీల వసూళ్ల నుంచి విరమించుకోవాలని కేంద్రం కొత్త విద్యుత్ బిల్లులో పేర్కొంది. దీంతో వినియోగదారులు సబ్సిడీ లేకుండానే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి రానుంది. దీంతో విద్యుత్ బిల్లులు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం క్రాస్ సబ్సిడీల భారం మోస్తున్న పరిశ్రమలు, వాణిజ్య, రైల్వే కేటగిరీల వినియోగదారులకు ఈ విధానంతో భారీ ఊరట లభించనుంది. మరోవైపు క్రాస్ సబ్సిడీల ఆదాయానికి గండిపడటంతో ఆ మేరకు చార్జీల భారం సైతం సబ్సిడీ వినియోగదారులైన గృహాలు, ఇతర వినియోగదారులపైనే పడనుంది. వ్యవసాయ కనెక్షన్లకు సైతం మీటర్లు పెట్టి బిల్లులు జారీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. కేంద్రం తీసుకొస్తున్న జాతీయ టారిఫ్ పాలసీ వస్తేనే విద్యుత్ సబ్సిడీల విషయంపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది. ప్రస్తుతం ఇలా.. భవిష్యత్తులో ఎలా.. ఇప్పుడు గృహ వినియోగదారులకు యూనిట్‌కు రూ.1.45 పైసల నుంచి రూ.9.50 వరకు వినియోగం ఆధారంగా సబ్సిడీతో బిల్లులు వేస్తున్నారు. నెలకు 50 యూనిట్లు మాత్రమే వాడితే యూనిట్‌కు రూ.1.45 చొప్పున, 100 యూనిట్ల లోపు వినియోగిస్తే 51–100 యూనిట్లకు రూ.2.45 చొప్పున బిల్లులు వసూలు చేస్తున్నారు. 100 యూనిట్లు దాటితే తొలి 100 యూనిట్లకు రూ.3.30 చొప్పున, 101–200 యూనిట్లకు రూ.4.30 చొప్పున టారిఫ్ ఉంది. వినియోగం 300 యూనిట్లు దాటితే రూ.7.20, 400 యూనిట్లకు చేరితే రూ.8.50, 400–800 యూనిట్ల వినియోగానికి రూ.9, 800 యూనిట్లు దాటితే రూ.9.50 చొప్పున ధరతో టారిఫ్ వసూలు చేస్తున్నారు. (చదవండి: 9 రాష్ట్రాలు, యూటీల్లో జీరో కేసులు) తక్కువ విద్యుత్ వినియోగించే పేదలకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఈ లెక్కలు పేర్కొంటున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్ బిల్లుల్లో సబ్సిడీల అమలును నిలిపేయాల్సి వస్తుంది. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్) ఆధారంగా ఆయా కేటగిరీల వినియోగదారులకు టారిఫ్‌ను నిర్ణయించాలని ఈ బిల్లులో కేంద్రం సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున యూనిట్ విద్యుత్ సరఫరాకు సగటున రూ.7.02 వరకు వ్యయం అవుతోంది. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, తదితర కేటగిరీలకు ఈ వ్యయంలో స్వల్ప తేడాలుంటాయి. ఆయా కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే వ్యయాన్ని సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలు లేకుండా పూర్తి స్థాయిలో తిరిగి రాబట్టుకోవాలని కొత్త బిల్లు చెబుతోంది. అంటే, యూనిట్‌కు రూ.7, ఆపై చొప్పున టారిఫ్‌ను వినియోగదారులందరూ చెల్లించాల్సి రానుంది. దీంతో ప్రస్తుతం నెలకు వందల్లో బిల్లులు చెల్లిస్తున్న గృహ, ఇతర కేటగిరీల బిల్లులు ఒక్కసారిగా రూ.వేలకు పెరగనున్నాయి. -
విద్యుత్ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
విద్యుత్ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. తీవ్ర రుణభారం, బకాయిల నుంచి డిస్కంలను గట్టెక్కించే మార్గాలపై ప్రధానంగా చర్చ జరిగింది. జెన్, ట్రాన్స్ కో ఆర్థిక పరిస్థితులపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వివరాలు ఆయనకు తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు అమ్ముతామంటూ ఎవరైనా ముందుకు వస్తే.. వారితో ఒప్పందాలు కుదుర్చుకోండని ఈ సందర్భంగా సీఎం సూచించారు. దీనివల్ల డిస్కంలపై భారం తగ్గుతుందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో మాదిరిగా అధిక ధరలకు కాకుండా రీజనబుల్ ఖరీదుకు ఎవరు అమ్మినా విద్యుత్‌ను కొనుగోలు చేయండని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దాంతోపాటు.. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాలక్రమంలో ఈ ప్లాంట్‌ను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. జెన్కో థర్మల్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన బొగ్గుతో ప్లాంట్ల సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. హైడ్రో రివర్స్ పంపింగ్ ప్రాజకెక్టులపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రం విద్యుత్ అమ్మకాల కోసం ఇన్వెస్టర్ల కోసం ఎక్స్‌పోర్టు పాలసీ రూపొందించాలన్నారు. విద్యుత్ రంగంలో అవినీతికి చోటు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
మరో 1,500 మెగావాట్ల సౌర విద్యుత్
సాక్షి, అమరావతి: చౌక విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు(డిస్కంలు) మరో ముందడుగు వేశాయి. యూనిట్ రూ.2.70కే సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయబోతున్నాయి. ఈ ప్రతిపాదనలు తుది దశలో ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కడప, అనంతపురం జిల్లాల్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ సంయుక్త భాగస్వామ్యంతో సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. ఈ రెండింటి నుంచి 1,500 మెగావాట్ల కరెంటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై ఇటీవల విద్యుత్ సమన్వయ కమిటీ సమీక్షించింది. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకుని, ఈ విద్యుత్‌ను తీసుకోవడం ఉపయోగకరమని కమిటీ నిర్ణయానికొచ్చింది. 2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్‌ను యూనిట్ రూ.6.25 చొప్పున కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 2018 వరకూ అధిక రేట్లతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) జరిగాయి. దీనివల్ల విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం పడింది. అందువల్ల చౌకగా లభించే విద్యుత్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి రోజుకు 1.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభించే వీలుంది. యూనిట్ రూ.2.70 చొప్పున చూస్తే.. దీని ఖరీదు రూ.32 లక్షలు. 2015లోయూనిట్ ధర రూ.6.25 ప్రకారం చూస్తే రోజుకు రూ.75 లక్షలు అవుతుంది. అంటే రోజుకు రూ.43 లక్షలు ప్రభుత్వానికి ఆదా కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతోపాటు సోలార్ ప్యానళ్ల ధరలు తగ్గడం వల్ల సోలార్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గుతున్నట్టు అధికారులు వివరించారు. -
30న నివేదిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)ను ఈ నెల 30న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచాలని భావిస్తున్న నేపథ్యంలో కొత్త టారిఫ్ ప్రతిపాదనలను ఏఆర్ఆర్తోపాటు ఈఆర్సీకి సమర్పించడం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) అధికార వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఏఆర్ఆర్ నివేదికతోపాటు టారిఫ్ పెంపు ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలు స్వీకరించిన అనంతరం బహిరంగ విచారణ నిర్వహించి కొత్త విద్యుత్ టారిఫ్‌ను ఖరారు చేసేందుకు ఈఆర్సీకి కనీసం 120 రోజులు అవసరం కానుంది. ఏటా నవంబర్ 30లోగా తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికతోపాటు టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలని టారిఫ్ నిబంధనలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో వచ్చే ఏడాది టారిఫ్ పెంపు ప్రతిపాదనలు మినహా ఏఆర్ఆర్ నివేదికను మాత్రమే ఈఆర్సీకి సమర్పించాలని డిస్కంలు నిర్ణయించాయి. గృహ, వాణిజ్యం తదితర కేటగిరీల వారీగా పెంచాల్సిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈఆర్సీకి అందజేయనున్నాయి. యూనిట్‌పై రూ.1.66 నష్టం.. ఒక యూనిట్ విద్యుత్ సరఫరాకు 2018–19లో డిస్కంలు సగటున రూ. 6.91 ఖర్చు చేయగా, బిల్లుల వసూళ్ల ద్వారా సగటున రూ.5.25 మాత్రమే ఆదాయాన్ని ఆర్జించాయి. ప్రతి యూనిట్ విద్యుత్ సరఫరాపై సగటున రూ.1.66 నష్టపోయాయి. 2015–16లో యూనిట్ విద్యుత్‌పై రూ.0.95 ఉన్న ఆదాయలోటు 2016–17లో రూ.1.55కు, 2017–18లో రూ.1.42కు, 2018–19లో 1.66కు పెరిగింది. ఏటా 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి డిస్కంలు సరఫరా చేస్తున్నాయి. 2018– 19లో రూ.9970. 98 కోట్ల ఆర్థికలోటు ఎదుర్కోనున్నామని అప్పట్లో ఈఆర్సీకి ఇచ్చిన ఏఆర్ఆర్ నివేదికలో డిస్కంలు అంచనా వేశాయి. విద్యుత్ చార్జీల పెంపుతో ఈ ఆదాయ లోటును భర్తీ చేసుకోవాలని డిస్కంలు భావించినా వరుస ఎన్నిక ల నేపథ్యంలో మూడేళ్లుగా విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతించలేదు. కాగా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2019–20 ముగిసే నాటికి ఆర్థికలోటు రూ.11 వేల కోట్లకు చేరనుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిన రూ.6,079 కోట్లు విద్యుత్ రాయితీలకు పోగా రూ.5 వేల కోట్ల ఆర్థికలోటు మిగిలి ఉండనుంది. దీనిని భర్తీ చేసుకోవడానికి వచ్చే ఏడాది చార్జీల పెంపు తప్పదని అధికారులు అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే చార్జీల పెంపు ప్రతిపాదనలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. -
విద్యుత్ కంపెనీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ..!
సాక్షి, అమరావతి: పీపీఏల పునఃసమీక్ష వ్యవహారంలో విద్యుత్ కంపెనీలకు ఎదురుదెబ్బ తాకింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్షకు అవకాశమే లేదన్న విద్యుత్ కంపెనీల వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాకుండా.. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లపై పునఃసమీక్షకోసం ఏపీఈఆర్సీకి వెళ్తామంటూ ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు సమర్థించింది. ఇకపై పీపీఏల పునఃసమీక్షకు సంబంధించి ఏవైనా వాదనలుంటే ఏపీఈఆర్సీ ఎదుటే వినిపించాలని హైకోర్టు సూచించింది. (అందుకే విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష : అజేయ కల్లం) ఏపీఈఆర్సీ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ధారించలేమని హైకోర్టు తెలిపింది. ఆరు నెలల్లోగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని ఏపీఈఆర్సీకి స్పష్టం చేసింది. ఈలోగా మధ్యంతర చెల్లింపుకింద యూనిట్‌కు రూ. 2.43 నుంచి రూ. 2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది. ప్రభుత్వం నోటీసులు ఇచ్చి చట్టంప్రకారం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయవచ్చని హైకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్‌ను తిరిగి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. (చదవండి : విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు: సీఎం జగన్) -
అంత డబ్బు మా దగ్గర్లేదు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆగస్టులో రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆ మేర వ్యయాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసి ముందస్తుగా ఎల్సీ జారీ చేసేందుకు మరో రెండు రోజులే ఉన్నాయి. ఈ నెల 31లోగా డిస్కంలు ఎల్సీ జారీ చేస్తేనే ఆ మేర విద్యుత్‌ను కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఎల్సీ జారీ చేసే సత్తా తమకు లేదని చేతులెత్తేశాయి. ఎన్టీపీసీ వంటి కేంద్ర విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు ప్రైవేటు జనరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ప్రతి నెలా రూ.1,089 కోట్లు అవసరమని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం డిస్కంల వద్ద రూ.400 కోట్ల నిధులు మాత్రమే ఉన్నాయని, విద్యుత్ కొనుగోళ్లకు ముందస్తు ఎల్సీ జారీ చేసేందుకు రూ.1,000 కోట్లను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆగస్టులో విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుతో పాటు ఇతర ఖర్చులకు డిస్కంల వద్ద ఉన్న రూ.400 కోట్ల నిధులు ఆవిరైపోతాయని, ముందస్తుగా ఎల్సీ జారీ చేసే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్సీ నిబంధన అమలును కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వాయిదా వేయని పక్షంలో, నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అత్యవసరంగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. డిస్కంల వద్ద నిధులు లేనిపక్షంలో కనీసం వారం, పక్షం రోజులకు అవసరమైన విద్యుత్ కొనుగోళ్లకు అయినా ఎల్సీ జారీ చేయాల్సిందేనని కేంద్రం నిబంధన పెట్టింది. అదీ సాధ్యం కాని పక్షంలో ఏ రోజుకు ఆ రోజు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఒక రోజు ముందుగానే విద్యుత్ కంపెనీలకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ రూపంలో నిధులను బదిలీ చేయాలని చెప్పింది. ఈ విషయంలో విఫలమైన డిస్కంలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లను ఆదేశించింది. మరో రెండు రోజుల్లోగా రాష్ట్ర డిస్కంలు ఎల్సీ జారీ చేయకపోయినా, కనీసం నగదు బదిలీ చేయకపోయినా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సమస్యలు తప్పవని ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు దక్షిణాది రాష్ట్రాల భేటీ.. లెటర్ ఆఫ్ క్రెడిట్ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్ఆర్పీసీ) సోమవారం బెంగళూరులో సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ట్రాన్స్‌కో ఎస్ఈ హాజరయ్యారు. కేంద్రం ఆదేశాల అమలుకు ఒక్కరోజు మాత్రమే వ్యవధి నేపథ్యంలో ఎల్సీ నిబంధనల అమలును వాయిదా వేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలున్నాయి. రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఇప్పటికే తప్పుబడుతూ కేంద్రానికి లేఖ రాసింది. -
విద్యుత్ సేవలపై 18 శాతం జీఎస్టీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేలాది మంది విద్యుత్ వినియోగదారులపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మోత మోగింది. గత నెల వినియోగానికి సంబంధించి ప్రస్తుత నెలలో జారీ చేసిన విద్యుత్ బిల్లుల్లో విద్యుత్ చార్జీలకు అదనంగా జీఎస్టీని సైతం విధించడంతో బిల్లులు భారీగా పెరిగి వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి విద్యుత్ జీఎస్టీ పరిధిలోకి రాదు. కానీ కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ, అదనపు లోడ్ మంజూరు సేవలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయని జీఎస్టీ కమిషనరేట్ ఇటీవల రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు స్పష్టం చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2017 జూలై 1వ తేదీ నుంచి జారీ చేసిన కొత్త విద్యుత్ కనెక్షన్లు, మంజూరు చేసిన అదనపు లోడ్ విషయంలో సంబంధిత వినియోగదారుల నుంచి జీఎస్టీ బకాయిలు వసూలు చేయాలని ఆదేశించింది. దీంతో విద్యుత్ చార్జీలు మినహా విద్యుత్ సేవలకు సంబంధించిన అన్ని రకాల డెవల్మెంట్ చార్జీలపై 18 శాతం జీఎస్టీని డిస్కంలు విధిస్తున్నాయి. కొత్త విద్యుత్ కనెక్షన్‌తోపాటు ఇప్పటికే కనెక్షన్ కలిగి ఉండి అదనపు లోడ్ కోసం దరఖాస్తు చేసే వారి నుంచి జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. అదే విధంగా 2017 జూలై నుంచి జారీ చేసిన కొత్త కనెక్షన్లతోపాటు అదనపు లోడ్ మంజూరు చేయించుకున్న పాత వినియోగదారుల నుంచి జీఎస్టీ బకాయిలను మాత్రం ఫిబ్రవరి నెల విద్యుత్ బిల్లులతో కలిపి వసూలు చేస్తున్నాయి. -
రిమోట్ నొక్కితే కరెంట్ వచ్చేస్తుంది!
కరెంట్ పోతే ఆటోమేటిక్‌గా మరో లైన్ నుంచి సరఫరా ► జీహెచ్ఎంసీ, పారిశ్రామిక ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ ప్రాజెక్టు డిస్కంల ఆటోమేషన్ ప్రాజెక్టుకు ప్రాథమిక అంచనాల మేరకు అయ్యే ఖర్చు 5,000 కోట్లు జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యం (మెగావాట్లలో) 3,000 గత వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ (మెగావాట్లలో) 2,450 సాక్షి, హైదరాబాద్: సాంకేతిక సమస్యతో భాగ్యనగరంలోని ఓ ప్రాంతంలో కరెంట్ పోయింది.. విద్యుత్ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసేదాకా ఆ ప్రాంతంలో అంధకారమే! ఇకపై ఆ పరిస్థితి ఉండదు. రిమోట్ నొక్కితే చాలు.. 5 నిమిషాల్లోపే ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా కరెంట్ వచ్చేస్తుంది! ‘డిస్కంల ఆటోమేషన్’ప్రాజెక్టుతో ఇది సాధ్యం కాబోతోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)తోపాటు రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయికి చేరుకుని మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించేందుకు గంటల సమయం పడుతోంది. ఇలా సిబ్బంది ద్వారా(మాన్యువల్‌గా) మరమ్మతులు చేసే వరకు వేచి చూడకుండా... స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజిషన్) కార్యాలయం నుంచి రిమోట్ సాయంతో తక్షణమే సరఫరాను పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. ప్రైవేటు డిస్కంల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతున్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల్లో మాత్రమే ఇలాంటి ఆటోమేషన్ ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. ప్రభుత్వరంగంలో తొలిసారిగా ఈ సేవలను అమల్లోకి తెచ్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) కసరత్తు ప్రాంభించింది. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆటోమేషన్ ప్రాజెక్టు రూపకల్పనపై నివేదిక(డీపీఆర్) తయారు చేసే బాధ్యతను తాజాగా ఓ ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఈ ప్రాజెక్టు రూపకల్పనకు దాదాపు రూ.5 వేల కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యం 3 వేల మెగావాట్లు కాగా.. గత వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,450 మెగావాట్లుగా నమోదైంది. డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ ప్రాజెక్టు అమలు కోసం నగరంలో విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని 6 వేల మెగావాట్లకు పెంచనున్నారు. ఇలా అమలు చేస్తారు.. డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ అమలు కోసం జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నారు. కరెంట్ వినియోగదారుడికి రెండు వనరుల నుంచి విద్యుత్ సరఫరా చేసేలా.. ప్రస్తుతమున్న 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నారు. రెండు లైన్ల నుంచి సరఫరాకు వీలుగా ప్రతి పోల్‌పై ఓ బాక్స్ ఏర్పాటు చేస్తారు. సరఫరాను ఓ లైన్ నుంచి మరో లైన్‌కు మార్చేందుకు ఈ బాక్స్‌లో సెక్షనలైజర్ అనే పరికరాన్ని అమరుస్తారు. సాంకేతిక కారణాలతో ట్రాన్స్ఫార్మర్/సబ్‌స్టేషన్ నుంచి ఏదైనా లైన్‌కు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే అదేలైన్ ద్వారా సరఫరాను పునరుద్ధరించేందుకు రెండుసార్లు టెస్ట్చార్జ్ చేస్తారు. ఒకవేళ సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ వనరుగా ఏర్పాటు చేసే ట్రాన్స్ఫార్మర్/సబ్ స్టేషన్ నుంచి మరో లైన్ ద్వారా 5 నిమిషాల్లోపు సరఫరాను పునరుద్ధరిస్తారు. రిమోట్ సాయంతో సెక్షనలైజర్కు సంకేతాలు పంపి రెండో లైన్ ద్వారా కరెంట్ సరఫరా చేస్తారు. క్షేత్రస్థాయిలో వెళ్లి మరమ్మత్తులు చేసే వరకు ఎదురుచూడకుండా హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయం నుంచి రిమోట్ సహాయంతో ఈ వ్యవస్థను నిర్వహించనున్నారు. ప్రతిష్ట పెరుగుతుంది సీఎండీ రఘుమారెడ్డి ఈప్రాజెక్టు అమల్లోకొస్తే రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల ప్రతిష్ట పెరుగుతుందని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలిగితే విద్యుత్ అమ్మకాలు తగ్గి సంస్థ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే సాంకేతిక సమస్యలు ఎదురైనా నిరంతరాయంగా సరఫరా కొనసాగించవచ్చని, ఈ ప్రాజెక్టుపై పెట్టే ఖర్చు 4 ఏళ్లలో తిరిగి వస్తుందన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఏడాదిన్నరలో ప్రాజెక్టును అమల్లోకి తెస్తామని చెప్పారు. -
రాష్ట్రంలో కొత్త విద్యుత్ సర్కిళ్లు!
మరో 21 సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు - 15 నుంచి 36కు పెరిగిన డిస్కంల ఆపరేషన్స్ సర్కిళ్లు - గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 4 సర్కిళ్లు - కొత్త జిల్లాలకు అనుగుణంగా డిస్కంల అధికార వికేంద్రీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అధికార వికేంద్రీకరణ చేపట్టాయి. ఉమ్మడి జిల్లాల ఆపరేషన్స్ సర్కిల్ కార్యాలయాల ఆధ్వర్యంలోనే కొత్త జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవహారాలను డిస్కంలు పర్యవేక్షిస్తుండగా, తాజాగా కొత్త జిల్లాల్లో సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)ల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 15 ఆపరేషన్స్ సర్కిల్ కార్యాలయాలుండగా, తాజాగా మరో 21 కొత్త సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. దీంతో రాష్ట్రంలో విద్యుత్ సర్కిల్ కార్యాలయాల సంఖ్య 36కు పెరిగింది. గ్రేటర్ పరిధిలో 6 సర్కిల్ కార్యాలయాలు ఉండగా.. పెంపులో భాగంగా 4 కొత్త సర్కిళ్లు ఏర్పాటయ్యాయి. విద్యుత్ సర్కిల్ కార్యాలయాల పర్యవేక్షణలోనే క్షేత్రస్థాయి వరకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. విద్యుత్ పంపిణీలో అంతరాయాలను సరిదిద్దడం, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లుల వసూళ్లు తదితర కీలక బాధ్యతలను విద్యుత్ సర్కిల్ కార్యాలయాలు పర్యవేక్షిస్తున్నాయి. ఒకేసారి వీటి సంఖ్య భారీగా పెంచడంతో క్షేత్రస్థాయి వరకు సర్కిల్ కార్యాలయాల సేవలు అందనున్నాయి. ఈ కార్యాలయాలకు సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) స్థాయి అధికారులను నియమిస్తూ డిస్కంలు ఉత్తర్వులిచ్చాయి. భారీ ఎత్తున డివిజనల్ ఇంజ నీర్లను ఎస్ఈలుగా పదోన్నతులు కల్పించాయి. దక్షిణ డిస్కం పరిధిలో.. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 10 సర్కిల్ కార్యాలయాలుండగా, కొత్తగా మరో 9 కార్యాలయాలను సంస్థ యాజమాన్యం ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్, రంగారెడ్డి ఈస్ట్, రంగారెడ్డి నార్త్, రంగా రెడ్డి సౌత్ సర్కిల్ కార్యాలయాలున్నాయి. తాజా గా గ్రేటర్ పరిధిలో 4 సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నార్త్ సర్కిల్‌ను రెండుగా విభజించి బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. సరూర్‌నగర్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి సౌత్ సర్కిల్ పేరును వికారాబాద్‌గా మార్చింది. గ్రామీణ ఉమ్మడి జిల్లాలైన నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్‌లతోపాటు సిద్దిపేటలో ఒక్కో సర్కిల్ కార్యాలయం ఉండగా, ఇప్పుడు యాదాద్రి, సూర్యాపేట, గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్‌లలో కొత్త సర్కిల్లను ఏర్పాటు చేసింది. ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో.. టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో 5 సర్కిళ్లు ఉండగా, తాజాగా మరో 10 కొత్త సర్కిళ్లు ఏర్పాటయ్యా యి. గతంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ సర్కిళ్లు ఉండగా, కొత్తగా నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, జగి త్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కామారెడ్డి, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి సర్కిళ్లను ఏర్పాటు చేసింది. వరంగల్ సర్కిల్‌ను వరంగల్ అర్బన్‌గా పేరు మార్చింది. దీంతో టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో సర్కిళ్ల సంఖ్య 17కి పెరిగింది. -
అదను చూసి చార్జీలు బాదుతారు!
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్ చార్జీలు పెంచ ట్లేదని గొప్పలకు పోతున్నారు. వచ్చే ఎన్నికల దృష్ట్యానే ఇలా చెబుతున్నారు. ఎన్నికలు ముగి సిన తర్వాత ఆదాయ లోటును పూడ్చుకోడానికి ఒక్కసారిగా విద్యుత్ చార్జీలు పెంచేసి ప్రజల నడ్డి విరుస్తారు’ అని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లపై విద్యుత్ రంగ నిపుణులు, రైతు సంఘాల నేతలు, వక్తలు మండిపడ్డారు. రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితి పైపైన బాగా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో పెచ్చురిల్లిన అవినీతితో రైతు లు, ప్రజలు తీవ్ర ఇబ్బందు లు గురవుతున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయి విద్యుత్ అధికారులు, సిబ్బంది అవినీతి, నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేస్తే ‘మేమేమీ చేయలేం, ఏసీబీకి ఫిర్యాదు చేసుకోండి’ అని డిస్కంల ఉన్నతాధికారులు పేర్కొనడం సరికాదని తప్పుబట్టారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీ డీసీఎల్) 2017–18కి సంబంధించి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), విద్యుత్ టారీఫ్ ప్రతిపాదనలపై మంగళవారం హైదరాబాద్‌లో ని ఫ్యాప్సీ ఆడిటోరియంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) నిర్వహించిన బహి రంగ విచారణ వాడివేడీగా జరిగింది. ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యులు శ్రీని వాస్ల సమక్షంలో కార్యక్రమం జరిగింది. చేతులు తడపనిదే పని జరగదు.. క్షేత్రస్థాయి అధికారుల చేతులు తడిపితేకాని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు, కొత్త స్తంభాల ఏర్పాటు, కొత్త వ్యవసాయ కనెక్షన్ల జారీ కావడం లేదని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. అవినీతి, నిర్లక్ష్యం వల్ల అమాయక రైతులు, పౌరులు విద్యుదాఘాతాలు, ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా బహిరంగ విచారణలో ఈ అంశాలపై ఫిర్యాదు చేస్తున్నా డిస్కంల యాజమాన్యాలు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఏకంగా 11,303 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉండనుందని అంచనాల్లో చూపారని, యూనిట్‌కు రూ.1.97 చొప్పున స్థిర చార్జీలు విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లించాల్సి వస్తుందని, దీంతో ప్రజలపై రూ.2,226 కోట్ల అనవసర భారం పడనుందని విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్‌రావుతో పాటు ఎం.తిమ్మారెడ్డి, దొంతి నర్సింహారెడ్డి తప్పు బట్టారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, స్తంభాల ఏర్పాటు కోసం క్షేత్రస్థాయి అధికారులు రైతులను దోచుకుంటున్నారని, ఈ అవినీతికి చెక్‌పెట్టాలని పలువురు కోరారు. ఓపెన్ యాక్సెస్‌కు అనుమతించండి తెలంగాణలో రైల్వే ట్రాక్షన్ కేటగిరీ విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.7.10 ఉండగా, ఏపీలో రూ.4.74 మాత్రమే వసూలు చేస్తున్నారు. అధిక చార్జీలు ఉండటంతో రాష్ట్రంలో కొత్త రైల్వే విద్యుదీకరణ ప్రాజెక్టులను ప్రారంభించలేకపోతున్నాం. ఏపీ తరహాలో రైల్వేకు విద్యుత్ చార్జీలను రూ.4.74కు తగ్గించాలి. లేకుంటే ఓపెన్ యాక్సెస్ విధానంలో బయట నుంచి విద్యుత్ కొనేందుకు అనుమతించాలి. –ఎల్ఎల్ మీనా, చీఫ్ ఇంజనీర్, ద.మ«.రైల్వే ఛత్తీస్‌గఢ్‌కు రూ.50 కోట్ల ట్రేడింగ్ మార్జిన్ కాస్ట్ ఆఫ్ సర్వీస్ గతేడాది యూనిట్‌కు రూ.5.47 కాగా.. ఈ ఏడాది రూ.6.71కు పెంచుతూ ప్రతిపాదించడం సరికాదు. ఒక్కసారిగా 15 శాతం పెంచితే వినియోగదారులపై భారం పడుతుంది. ఏపీ, తెలంగాణ జెన్కోల విద్యుత్ ధరలు అసాధారణ రీతిలో పెరిగిపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్ డిస్కంలు రూ.50 కోట్ల ట్రేడింగ్ మార్జిన్‌ను తెలంగాణ నుంచి రాబట్టుకుంటామని ఆ రాష్ట్ర ఈఆర్సీకి తెలిపాయి. ఇది కూడా ప్రజలపై భారం కానుంది. –సౌరభ్ కుమార్ శ్రీవాస్తవ, ఫ్యాప్సీ -
వచ్చే ఏడాదీ ప్రస్తుత విద్యుత్ చార్జీలే...
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలు పెంచుతూ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు రాష్ట్రంలో ప్రస్తుత చార్జీలే వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18)లో కూడా అమలు కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఇంకా సమర్పించకపోవడంతో వచ్చే ఏడాదికి సంబంధించి చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోలేకపోయామని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో తదుపరి నిర్ణయం వరకు ప్రస్తుత చార్జీలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనల సమర్పణకు డిస్కంలు ఏప్రిల్ 15 వరకు గడువు కోరాయి. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి కొత్త టారిఫ్ ఉత్తర్వులు జారీ చేసేందుకు కనీసం 45 రోజుల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశముందని ఈఆర్సీ వర్గాలు తెలిపాయి. -
అలాంటి సమాచారమే లేదు!
⇒ విద్యుత్ చార్జీలు పెంచవద్దని ప్రభుత్వం నుంచి సూచనల్లేవు ⇒ స్పష్టం చేసిన టీఎస్ఈఆర్సీ అధికార వర్గాలు ⇒ చార్జీల పెంపుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనపై స్పందన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచాలని ఈఆర్సీ కోరినా ఒప్పుకోలేదని, చార్జీలు పెంచవద్దని చెప్పానని సీఎం కె.చంద్రశేఖర్‌రావు గత శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. డిస్కంల ఆదా య లోటు అంచనాలు రూ.10 వేల కోట్లు ఉండనుండగా, బడ్జెట్లో రూ.4,200 కోట్లు మాత్రమే కేటాయించారని, విద్యుత్ చార్జీల పెంపు ద్వారా మిగిలిన భారాన్ని ప్రజలపై వేస్తారా అని విపక్ష నేత కె.జానారెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు బదలిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై ఈఆర్సీ, డిస్కంల వర్గాల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది. విద్యుత్ చార్జీలు పెంచవద్దని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకున్నామని పేర్కొన్నాయి. విద్యుత్ చార్జీల పెంపు కసర త్తులో భాగంగా ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2017–18కి సంబంధిం చిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లు సమర్పించాయని, ఈఆర్సీ సుమోటోగా చేపట్టిన టారీఫ్ పెంపు ప్రక్రియ పురోగతిలో ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచవద్దని, డిస్కంల ఆదాయ లోటు భారాన్ని సబ్సిడీగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా తెలిపితేనే ఈఆర్సీ పరిశీలిస్తుందని తెలిపారు. టారీఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించేం దుకు డిస్కంలు కూడా ఏప్రిల్ 15 వరకు గడువు పొడిగింపు కోరాయని గుర్తు చేశారు. అసెంబ్లీ తర్వాత ప్రతిపాదనలు రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సరఫరాను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచిన నేపథ్యం లో వ్యయ భారం పెరిగిందని, ప్రస్తుత చార్జీలే అమలు చేస్తే వచ్చే ఏడాది రూ.9,824 కోట్ల ఆర్థిక లోటు మూటగట్టుకోవాల్సి వస్తుందని ఇప్పటికే డిస్కంలు అంచనా వేశాయి. రూ.7,150.13 కోట్లను విద్యుత్ సబ్సిడీగా బడ్జెట్లో కేటాయించాలని కోరగా, ప్రభుత్వం రూ.4,200 కోట్లే కేటా యించింది. సబ్సిడీ పోగా రూ.5,600 కోట్ల ఆదాయ లోటు మిగలనుంది. దీంతో చార్జీల పెంపు అనివార్యమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈఆర్సీకి టారీఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పిస్తామని, వచ్చే జూలై నుంచి చార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశముందని తెలిపాయి. అప్పటి వరకు పాత చార్జీలు: డిస్కంలు ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్ చార్జీల కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో తదుపరి చార్జీలు పెంచే వరకు ప్రస్తుత చార్జీలనే కొనసాగించాలని తాజాగా డిస్కంలు ఈఆర్సీని కోరాయి. వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రస్తుత చార్జీలు అమలు కానుండగా, జూలై నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. జీహెచ్ఎంసీ, ఇతర పురపాలికలకు ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఏఆర్ఆర్, టారీఫ్ ప్రతి పాదనలు సమర్పించడంలో తీవ్ర జాప్యం చేయడంతో గతేడాది కూడా ఆలస్యంగా జూలై నుంచి చార్జీల పెంపు అమలు చేసిన విషయం తెలిసిందే.