ఏపీకి 6, తెలంగాణకు 5
* జాతీయ ఇంధన పొదుపు అవార్డులు అందజేసిన కేంద్రమంత్రి
* డిస్కమ్స్, బిజినెస్ విభాగంలో ఏపీ ఎస్పీడీసీఎల్‌కు ప్రథమ బహుమతి
సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన పొదుపులో తెలంగాణకు 5, ఆంధ్రప్రదేశ్‌కు 6 జాతీయ అవార్డులు లభించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సోమవారం నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఇంధన పొదుపులో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన సంస్థల ఉన్నతాధికారులు, ప్రతినిధులకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ అవార్డులను అందచేశారు. డెయిరీ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, ఉప్పల్(హైదరాబాద్) జనరల్ మేనేజర్ ఎల్.శ్రీనివాస్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో ద్వితీయ బహుమతి సాధించిన టాటా కాఫీ లిమిటెడ్, ఇన్‌స్టంట్‌కాఫీ డివిజన్, తూప్రాన్ యూనిట్(మెదక్) ప్రతినిధి సంజీవ్ సారన్, జనరల్ కేటగిరీలో ద్వితీయ బహుమతి సాధించిన దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్, కాజీపేట పంపింగ్ సెక్టర్(సికింద్రాబాద్) నుంచి సోలంగుప్త, మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ బీఈఈ స్టార్ లేబుల్డ్ అప్లియెన్స్(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సుఫార్మర్) విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్(ఇండియా) మెదక్ ప్రతినిధి ఉపాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, కార్యాలయ భవనం విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ సీ-టీఏఆర్‌ఏ బిల్డింగ్(సికింద్రాబాద్) ఎస్సీఆర్ జీఎం రవీంద్ర గుప్తాలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులు ప్రదానం చేశారు.
దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ షీప్‌మండి పంప్‌హౌజ్ (సికింద్రాబాద్), కాచీగూడ రైల్వే స్టేషన్, దక్షిణ మధ్య రైల్వే సంచాలన్‌భవన్ (సికింద్రాబాద్), లాలాగుడ సెంట్రల్ ఆసుపత్రి, జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (సికింద్రాబాద్) మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్, ఆదిత్యాపార్క్ హోటల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), సోహరబ్జి గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (రంగారెడ్డి జిల్లా)కు మెరిట్ సర్టిఫికెట్లు లభించాయి.
ఏపీ నుంచి..: డెయిరీ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్(చిత్తూరు) అధ్యక్షుడు సాంబశివరావు, విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కమ్స్) విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(చిత్తూరు) సీఎండీ హెచ్.వై.దొర, జనరల్ కేటగిరీలో ప్రథమ బహుమతి సాధించిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(విశాఖ) కమిషనర్ ప్రవీణ్ కుమార్, స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీస్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఎస్‌ఈసీఎం), ఇంధన శాఖ విభాగం, ఐఎండీఐ, (ఏపీ ప్రభుత్వం) సీఈవో చంద్రశేఖరరెడ్డి, బిజినెస్ మోడల్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన ఎస్పీడీసీఎల్(తిరుపతి) సీఎండీ హెచ్.వై.దొర, ద్వితీయ బహుమతి సాధించిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌లకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అవార్డులను ప్రధానం చేశారు.