సాక్షి,ఢిల్లీ: మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో వాటర్ మేనేజ్‌మెంట్ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎండిన పంటలను పరిశీలించిన తర్వాత సూర్యాపేటలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భట్టి సోమవారం ఢిల్లీలో స్పందించారు. ‘చలికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా పాలనలో ఇంకా వర్షాకాలం రానే రాలేదు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ అని డబ్బా కొట్టారు అది కూడా కూలిపోయింది.
నీళ్లు ఉంటే ఇప్పటికే అది మొత్తం కూలిపోయేది. కేసీఆర్ హయాంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. కేసీఆర్ పదేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదు. కాళేశ్వరం కార్పొరేషన్ బకాయిలు చెల్లిస్తాం. డిఫాల్ట్ కాబోము. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది. ఐఐటీలో చదివిన ఐఏఎస్‌లను డిస్కంలకు చీఫ్‌లను చేశాం. కేసీఆర్ మాత్రం ఒక అకౌంటెంట్‌ను సీఎండీ చేశారు’ అని భట్టి విమర్శించారు.
ఇదీ చదవండి.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment