Drought Conditions
-
కరువు, చంద్రబాబు కవల పిల్లలు : ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి: చంద్రబాబు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారుఏపీలో వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నంబరు15 జారీచేసింది. ఈ జీవోపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. బాబు వస్తే కరువు వస్తుందిచంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి. వైయస్సార్సీపి…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 30, 2024బాబు వస్తే కరువు వస్తుంది.చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి.వైఎస్సార్సీపీ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పక్కన పెట్టి రైతుల ఉసురు తీసుకుంటున్నారు’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో తాండవించిన కరువు.. కాగా, రాష్ట్రంలో దుర్భిక్షం మొదలైంది. వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది.వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో నంబరు 15 జారీచేసింది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది. 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్లలో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. -
కేసీఆర్‌కు భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,ఢిల్లీ: మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో వాటర్ మేనేజ్మెంట్ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎండిన పంటలను పరిశీలించిన తర్వాత సూర్యాపేటలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భట్టి సోమవారం ఢిల్లీలో స్పందించారు. ‘చలికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా పాలనలో ఇంకా వర్షాకాలం రానే రాలేదు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ అని డబ్బా కొట్టారు అది కూడా కూలిపోయింది. నీళ్లు ఉంటే ఇప్పటికే అది మొత్తం కూలిపోయేది. కేసీఆర్ హయాంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. కేసీఆర్ పదేళ్లలో ఎస్ఎల్బీసీ ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదు. కాళేశ్వరం కార్పొరేషన్ బకాయిలు చెల్లిస్తాం. డిఫాల్ట్ కాబోము. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది. ఐఐటీలో చదివిన ఐఏఎస్‌లను డిస్కంలకు చీఫ్‌లను చేశాం. కేసీఆర్ మాత్రం ఒక అకౌంటెంట్‌ను సీఎండీ చేశారు’ అని భట్టి విమర్శించారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డి -
వేడి తీవ్రతపై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న ఎండవేడిపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడి గాలులతో ప్రజలకు ప్రాణాపాయం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సమీక్షించారు. దేశంలో అధిక ఉష్ణోగ్రతల గురించి సమావేశంలో వాతావరణ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణా అథార్టీలు వివరించాయి. అధిక ఎండలతో అగ్ని ప్రమాదాలు, వడగాలులు సంభవిస్తాయని, వీటివల్ల ప్రాణాపాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని కోరారు. దేశంలో అడవుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అడవుల్లో కార్చిచ్చు రేగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సమీక్షించారు. రాబోయే రుతుపవనాలను దృష్టిలో ఉంచుకొని తాగునీటి సంరక్షణా చర్యలు తీసుకోవాలని, నీటివనరులు కలుషితం కాకుండా జాగ్రత్తపడాలని ఆదేశించారు. -
ఇక్రిశాట్ మరో అద్భుతం.. కరువు తట్టుకునేలా..
ఇక్రిశాట్ సంస్థ నుంచి మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఉష్ణమండల ప్రాంతాల్లో కఠిన పరిస్థితులను తట్టుకుంటే అధిగ దిగుబడి ఇచ్చే నూతన వంగడాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సీజన్ నుంచే ఈ విత్తనాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి అరిడ్ ట్రోపిక్ (ఇక్రిశాట్), హైదరాబాద్ నుంచి శనగల సాగుకు సంబంధించి మూడు నూతన వంగడాలను రూపొందించింది. ఈ నూతన వంగడాలు కరువు నేలలను తట్టుకోవడంతో పాటు రోగాలను సమర్థంగా ఎదుర్కొని అధిగ దిగుబడులు ఇస్తాయని ఇక్రిశాట్ తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), ఇక్రిశాట్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బీజీ 4005, ఐపీసీ ఎల్4-14, ఐపీసీఎంబీ 19-3 రకం విత్తనాలకు సెంట్రల్ వెరైటల్ రీసెర్చ్ కమిటీ ఆమోద ముద్ర వేసినట్టు ఇక్రిశాట్ కార్యదర్శి త్రిలోచన్ మహాపాత్ర తెలిపారు. సాధారణంగా కరువు సంభవించే ప్రాంతాల్లో మెట్ట భూముల్లోనే శనగలు సాగు చేస్తుంటారు. కరువు కారణంగా ప్రతీ ఏడు 60 శాతం దిగుబడి తగ్గిపోతుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వంగడాలు కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని అధిక దిగుబడి ఇస్తాయని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు తెలిపారు. చదవండి: రక్తపుమడుగులో వ్యక్తి, చోద్యం చూస్తూ మనుషులు! ఎమర్జెన్సీ అలర్ట్‌తో కాపాడిన స్మార్ట్‌వాచ్ -
పల్లెలు ఎడారులవుతున్న వేళ...!
కొద్దిమంది వృద్ధుల్ని మినహాయిస్తే, అనంతపురం జిల్లాలోని ఒక గ్రామంలో జనం మొత్తంగా వలస వెళ్లిపోయారు. ఇది ఒక గ్రామం కథ మాత్రమే కాదు.. భారతదేశంలో కరువు పీడిత ప్రాంతాలన్నింటి వ్యథా ఇలాగే ఉంటోంది. ఉన్న ఊరులో బతికే పరిస్థితులు లేక మొత్తం జనం పనుల కోసం వలస వెళ్లిపోతున్నారంటే.. మన గ్రామీణ ప్రాంతాలు చాలావరకు నిర్మానుష్యంగా మారుతున్నాయని అర్థం. రుతుపవనాల రాకలో జాప్యం, వర్షపాతం తగ్గుముఖం పట్టడం, వీటి ప్రభావంతో ఉష్ణోగ్రత తారస్థాయికి చేరడం ఫలితంగా భారతదేశంలోని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో భూగర్భ జలాలు వట్టిపోతున్నాయి. సంప్రదాయక నీటి వనరుల పరిరక్షణ, అడుగంటిన భూగర్భ జలాలను రీచార్జ్ చేయడం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అభివృద్ధి పేరిట అడవుల్ని, జల వ్యవస్థలను విధ్వంసం చేసే ప్రక్రియను నిలిపివేయాలి. ‘‘అందరికీ అభినందనలు... మనం ఈ సంవత్సరం 50 డిగ్రీల ఉష్ణోగ్రతను సాధిం చాము. వచ్చే సంవత్సరం 60 డిగ్రీల ఉష్ణోగ్రతను సాధించడానికి మనం మరిన్ని చెట్లను నరికేద్దాం పదండి’’ పూర్తిగా వ్యంగ్యాన్ని చొప్పిస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ నిజంగానే షాక్ కలిగించింది. అయితే ఈ వ్యంగ్యం ట్విట్టర్‌ను అనుసరిస్తున్న మెజారిటీ పాఠకుల తలకెక్కిందా లేక ఎక్కువమంది జనాలను స్థిమితంగా ఆలోచింపజేసిందా అనేది తేల్చి చెప్పడం కష్టమే. ఈ ట్విట్టర్ వ్యాఖ్య ప్రభావం ఎంత అనే చర్చ పక్కన బెట్టి చూస్తే, గత 140 ఏళ్లలో అంటే ఉష్ణోగ్రతల స్థాయిలను ప్రపంచం నమోదు చేయడం మొదలు పెట్టిన తర్వాత నాలుగో అత్యంత ఉష్ణోగ్రతా సంవత్సరంగా 2018 సంవత్సరం చరిత్రకెక్కింది. 2019 సంవత్సరంలో మరింత ఉష్ణోగ్రత ఉంటుందని నాసా అంచనా. ఇప్పటికే వేడి మనుషులను అమాంతంగా చంపేస్తోంది. ఈ సంవత్సరం మార్చి నుంచి మే వరకు రుతుపవనాలకు ముందస్తుగా కురిసే వర్షపాతం భారత్‌లో 22 శాతం లోటును నమోదు చేసింది. ఇది గత 65 ఏళ్లలో రెండో అత్యంత తక్కువ వర్షపాతం. ఈ ఏడు రుతుపవనాలు రావడం 15 రోజులు ఆలస్యం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు మండిస్తున్నాయి. రాజస్తాన్‌లోని ఛురు ప్రాంతంలో ఈ సీజన్లో ఇప్పటికే ఉష్ణోగ్రత 50 డిగ్రీల స్థాయిని మూడుసార్లు దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ప్రస్తుతం 48 డిగ్రీల సెల్సియస్‌తో మునుపెన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నీటి వనరుల క్షీణతే కరువుకు కారణం ఇప్పటికే దేశ భూభాగంలో దాదాపు 43 శాతం కరువుకోరల్లో చిక్కుకుంది. దాదాపు 60 కోట్లమంది కరువు బారిన పడ్డారని అంచనా. ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో నీటి వనరులు శుష్కించిపోతున్నాయి. ఎండవేడికి బీళ్లుగా మారిన నేల ఎంత ప్రభావం చూపిస్తుందో మాటల్లో వర్ణిం చలేం. గార్డియన్ పత్రిక రిపోర్టు ప్రకారం భారతదేశంలో వందలాది గ్రామాల్లోని కుటుంబాలకు కుటుంబాలే కాసిన్ని నీటిచుక్కల కోసం తమ ఇళ్లను ఖాళీచేసి వలస పోతున్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో కరువు ప్రభావం కారణంగా 50 వేలమంది పైగా రైతులు తమ పశువులను కాపాడుకోవడం కోసం 500 క్యాంపులకు తరలించారు. మహారాష్ట్రలో 1,501 పశు నిర్వహణా శిబిరాలు ఉంటున్నాయి. ఇక్కడ 72 శాతం భూభాగం కరువు బారినపడింది. ఇక ముంబై నగరం చుట్టూ ఉన్న గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయని వార్తలు. ఇక కర్ణాటకలో 88 శాతం పైగా భూభాగం తీవ్రకరువుతో కునారిల్లిపోతోంది. ఈ రాష్ట్రం లోని 176 తాలూకాలలో 156 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. గత 18 ఏళ్లలో 12 సంవత్సరాలు కర్ణాటక కరువు బారిన పడటం గమనార్హం. 2018–19 సంవత్సరానికి సంబంధించి కర్ణాటక ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయంలో మైనస్ 4.8 శాతం ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసింది. కరువు వ్యవసాయ పంటలకు భారీ నష్టం కలిగించడంతోపాటు, వ్యవసాయాధారిత ఆర్థిక కార్యాచరణ కుప్పగూలిపోయింది. ఒక కర్ణాటక మాత్రమే కాకుండా, దాదాపు సగం దేశంలో క్షీణిస్తున్న భూగర్భజల మట్టాలు చివరకు దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్నాయి. రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని సామాజిక వర్గాల మధ్య, వ్యక్తుల మధ్య నీటికి సంబంధించిన ఘర్షణలకు తోడుగా నీటికోసం క్యూలలో నిలుచున్న వ్యక్తుల మధ్య ఘర్షణలు కూడా గడచిన కొన్ని సంవత్సరాల్లో బాగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో మన విధాన నిర్ణేతలు నీటి పరిరక్షణ, నీటి పొదుపు ప్రాముఖ్యతను ఇప్పుడు గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు (బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ)తోసహా 21 నగరాలు 2020 నాటికల్లా భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోవడాన్ని చవిచూడనున్నాయని నీతి ఆయోగ్ ఇటీవల వెలువరించిన నివేదిక నిజంగానే ప్రమాద ఘటిం కలను మోగిస్తోంది. భూగర్భజలాలు దేశప్రజలకు అవసరమైన 40 శాతం నీటి అవసరాలను తీరుస్తున్నందువల్ల, దేశవ్యాప్తంగా 60 కోట్లమంది ప్రజలు రానున్న జల సంక్షోభం బారిన పడనున్నారు. జల సంక్షోభం తీసుకువస్తున్న ఘర్షణలు అయితే భూగర్భ జల మట్టాలు క్షీణించిపోవడం నగరాలకే పరిమితం కాలేదు. నిజానికి భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడిపారేయడం వల్లే వర్షపాతం కాసింతమేరకు తగ్గినా సరే అది విధ్వంసకరమైన కరువుకు దారితీస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సంవత్సరానికి భూగర్భజలాల క్షీణత రేటు 0.5 మీటర్లకు మించి నమోదవుతోంది. ఇది ఒక మీటర్ వరకు పడిపోతోంది. ఇక ఎండిపోతున్న నదుల నుంచి లభ్యమయ్యే నీరు కూడా తగ్గిపోతోంది. ఇలా నీటి సంక్షోభం ప్రభావాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదాహరణకు అత్యంత సమృద్దమైన జలరాశికి నిలయమైన నర్మదా నదిలో నీటి లభ్యత గత దశాబ్దకాలంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశంలోని 91 రిజర్వాయర్లలో నీటి మట్టం వాటి సామర్ద్యం కంటే 18 శాతం దిగువకు క్షీణించిపోయింది. పైగా, అనేక డ్యామ్‌ల లోని నీటిని వ్యవసాయ అవసరాలనుంచి తాగునీటితో సహా నగరప్రాంతాల అవసరాలకు మళ్లిస్తున్నారు. దీంతో రైతుల నిరసనలు తీవ్రతరమై గ్రామీణ–పట్టణ ఘర్షణలకు దారితీస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నీటి పరిరక్షణ, నీటి నిల్వ, భూగర్భజలాల రీచార్జ్ నుంచి ప్రభుత్వాల ప్రాధమ్యాలు మారిపోయాయి. కరువు ముంచుకొచ్చిన సమయాల్లో కీలకపాత్ర పోషించే సంప్రదాయక నీటి బావుల పునరుద్ధరణ పనులను పెడచెవిన పెడుతూ వచ్చారు. నీటి చెరువుల పునరుద్ధరణ, భూగర్భజలాల రీచార్జికి చేపట్టవలసిన చర్యలు అసంపూర్ణంగా ఉంటున్నాయి. లేదా వాటిని పూర్తిగా వదిలేశాయి. లేక చాలా నత్తనడకన సాగుతున్నాయి. దేశవ్యాప్త్గంగా ఇప్పటికీ 2 లక్షల మేరకు సంప్రదాయక చెరువులు, దిగుడుబావులు ఉంటున్నాయి. వీటన్నింటినీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. పంజాబ్‌లో 138 బ్లాక్‌లలో 110 బ్లాకులు డార్క్ జోన్లో ఉంటున్నాయి. అంటే వీటీలో నీటిని విపరీతంగా తోడేశారన్నమాట. 15 వేల చెరువులు, గుంతలను పునరుద్ధరించినట్లయితే భూగర్భజలాలు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. ఇంతవరకు పంజాబ్‌లో 54 గ్రామీణ చెరువులను పునరుద్ధరించారు. ఆశ్చర్యమేమిటంటే, రాజస్థాన్‌లోనూ, తరాలుగా కొనసాగుతున్న అద్భుతమైన నీటి పరిరక్షణ నిర్మాణాలను పునరుద్ధరించడానికి బదులుగా బిందు సేద్యంపైనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలో 39వేల సంప్రదాయక చెరువులు, ట్యాంకులు ఉనికిలో ఉంటున్నాయి. వీటిలో దాదాపు మూడొంతులకు పైగా చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. వీటిలో చాలావాటిని ఇప్పటికీ పునరుద్ధరించవచ్చు. ఈలోగా కర్ణాటక రాష్ట్రం జలామృత పథకాన్ని ప్రారంభించి సంప్రదాయక నీటి వనరులను పునరుజ్జీవింప చేయడానికి ప్రయత్నం మొదలెట్టింది. ఇది చాలా మంచి ప్రయత్నమే కానీ సంప్రదాయక నీటి వనరులను పునరుత్థానం చెందించడాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంప్రదాయక జల వనరులను పునరుద్ధరించాలి సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థలు అదృశ్యమైపోయాయి. కర్ణాటక రాష్ట్రం ‘కల్యాణీస్’ అనే తనదైన సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థను పరిరక్షించాలని ప్రయత్నిస్తోంది. ఒడిశా అయితే ‘కుట్టా, ముండా’ అనే సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థను కలిగి ఉంటోంది. వీటిలో కొన్ని ఇప్పటికీ ఉనికిలో ఉంటున్నాయి. అయితే సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థల చుట్టూ ఉండే సంప్రదాయక జ్ఞానాన్ని మనం ఇప్పటికే చాలావరకు కోల్పోయాం. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలోని టెక్సాస్ ఏ– ఎమ్ యూనివర్శిటీకి నేను వెళ్లినప్పుడు వారు తాము అనుసరిస్తున్న తమిళనాడులోని సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థలను నాకు చూపించారు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వానికి తనదైన సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా అనేది నాకు తెలీదు. కానీ కొంతకాలం క్రితం సెంటర్ ఫర్ సైన్స్ – ఎన్విరాన్మెంట్ సంస్థ దేశంలోని సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థల జాబితాను పొందుపరుస్తూ ‘డైయింగ్ విజ్డమ్’ (అంతరిస్తున్న జ్ఞానం) అనే పుస్తకం ప్రచురించింది. జల వనరుల పరిరక్షణకు సంబంధించి అంతరిస్తున్న మన సంప్రదాయక విజ్ఞానాన్ని తిరిగి ఆవిష్కరించవలసిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉంది. బోర్‌వెల్స్ ప్రపంచమంతటా రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థల వైపునకు మళ్లీ వెళ్లడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా బోర్‌వెల్స్ కూడా త్వరలోనో లేక ఆ తర్వాతో వట్టిపోక తప్పదు. అడుగంటిన భూగర్భ జలాలను రీచార్జ్ చేయడాన్ని అత్యవసర ప్రాతిపదికన చేపట్టాలి. అయితే యధాతథ స్థితి అనేది ఎప్పటిలాగే కొనసాగుతున్న తరుణంలో దీన్ని ఒక విడి చర్యగా చేపట్టకూడదు. అభివృద్ధి పేరిట అడవులను, జల వ్యవస్థలను, నదీపరివాహక ప్రాంతాలను విధ్వంసం చేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి. లేకపోతే ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరుగని స్థాయికి పెరుగుతుం డటం అనేది మనం ఊహించని ఉపద్రవాలకు దారితీయక మానదు. వ్యాసకర్త : దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
వానమబ్బు వెక్కిరిస్తే ‘ఉపాది’ మేఘం కురిసింది..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు మందగించడంతో గ్రామాల్లో రైతులు, కూలీలకు పనులు దొరకడంలేదు. దీంతో పనులు లేక.. కైకిలి రాక ఇబ్బందులు పడుతున్న రైతులు, కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదరువుగా నిలుస్తోంది. ఈ కష్టకాలంలో పట్టెడన్నం పెడుతూ కల్పతరువుగా మారింది. సాగు పనులు లేకపోవడంతో రైతులు, కూలీలు ఎర్రటి ఎండల్లోనూ ఉపాధి పనులకు వెళ్తున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 1,547 జాబ్ కార్డులు ఉండగా.. వారిలో 740 మంది ఉపాధి పనులు చేస్తున్నారు. అంటే దాదాపు సగం మంది ఉపాధి పనులనే నమ్ముకుని బతుకు బండి లాగిస్తున్నారు. రెంజల్ ఒక్కటే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పల్లెల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామీణ వ్యవసాయ కార్మిక, రైతు కుటుంబాలకు ఉపాధి పనులే అండగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది ఉపాధి పనుల నిమిత్తం చేసిన ఖర్చు చూస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అత్యధికంగా 2018–19లో ఏకంగా రూ.3,026 కోట్లు ఖర్చు కావడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ చిన్న, సన్నకారు రైతాంగానికి కరువు కాలంలో ఉపాధి హామీ పనులు అండగా నిలుస్తున్న వైనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..! రబీ వట్టిపోయింది.. రాష్ట్రంలో ఈ ఏడాది రబీ సీజన్ నిరాశాజనకంగా మారింది. 17 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు గతేడాది నైరుతి రుతుపవనాలు నిరాశాజనకంగా ఉండటం, ఆ తర్వాత వచ్చిన ఈశాన్య రుతుపవనాలూ అలాగే ఉండటంతో భూగర్భ జలాలు పడిపోయాయి. చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో నీటి వనరులు కూడా అడుగంటడంతో పరిస్థితి దారుణంగా మారింది. దీంతో తాగు, సాగునీటికి కటకట ఏర్పడింది. వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో కూడా గత మూడు నెలలుగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తేల్చి చెప్పింది. వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు, సూర్యాపేట, నల్లగొండల్లో తీవ్ర వర్షాభావం ఉన్నట్లు తెలిపింది. గతేడాది మార్చిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు 11.88 మీటర్ల లోతులో లభించగా, ఈ ఏడాది మార్చిలో 13.40 మీటర్ల లోతుకి వెళ్లిపోయాయి. దీంతో నీళ్లు లేక చాలా పంటలు ఎండిపోయాయి. రబీలో సాగు చేసిన మొత్తంలో 30 శాతం మేర పంటలు ఎండిపోయినట్టు అంచనా. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, 29.67 లక్షల (89%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.65 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 17.50 లక్షల (99%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. కానీ నీటి వనరులు లేకపోవడంతో పరిస్థితి ఘోరంగా మారింది. వ్యవసాయశాఖ తాజాగా వేసిన అనధికారిక అంచనా ప్రకారం దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయింది. రాష్ట్రంలో గత ఖరీఫ్, ప్రస్తుత రబీ సీజన్లలో కలిసి ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా 92.35 లక్షల టన్నులు కాగా, 2017–18లో ఇది 96.20 లక్షల టన్నులుగా ఉంది. అత్యధికంగా రబీలో 15.65 లక్షల టన్నులు తగ్గింది. ఆదుకున్న ఉపాధి... వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ పనులు జరగకపోవడంతో గ్రామాల్లో రైతులు, కూలీలకు పనులు దొరకడంలేదు. దీంతో అలాంటివారందరికీ ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఏకంగా రోజుకు రూ.4.5 కోట్ల మేర చెల్లింపులు జరుపుతూ వారిని అక్కున చేర్చుకున్నాయి. రాష్ట్రంలో 51.3 లక్షల జాబ్‌కార్డులుండగా.. 42.4 లక్షల మంది ఉపాధి పనులకు వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 11.7 కోట్ల పనిదినాలు కల్పించగా, 25.2 లక్షల కుటుంబాలు ఈ పనులపై పూర్తిగా ఆధారపడ్డాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతుల్లో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉంటారు. రబీలో పంటలు ఎండిపోవడం, సాగు పనులు సరిగా సాగకపోవడంతో వీరంతా ఉపాధి హామీ వైపు చూస్తున్నారని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఉపాధి పనులకు వెళుతున్నవారిలో చిన్న, సన్నకారు రైతులే కాకుండా.. 5 నుంచి పదెకరాలున్న అన్నదాతలు కూడా ఉన్నారని తేలింది. వీరితోపాటు నిరుద్యోగులకు కూడా ఉపాధి హామీయే భరోసా కల్పిస్తోంది. ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్న యువత కూడా ఉపాధి పనులకు వెళుతోంది. వ్యవసాయ పనులు లేక పట్టణాలకు వచ్చిన రైతులు, కూలీలు ఏవో చిన్నపనులు చేసుకుంటూ బతుకు బండి లాగిస్తుండగా.. గ్రామాల్లోనే ఉన్నవారు మాత్రం ఉపాధి హామీ పనులకు వెళ్తూ పొట్టపోసుకుంటున్నారు. ఉపాధి పనులే ఆసరా ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్తున్న. వ్యవసాయ పనులు ముగియడంతో ఉపాధి హామీ పథకంలో కూలి పని ఆసరాగా ఉంది. రోజువారి కూలి కింద రూ.210 ఇస్తుండ్రు. అధికారులు చూపిన కొలతల ప్రకారం వారం రోజులు పనిచేస్తే రూ.1400 వస్తయి. అదే నెల రోజులకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు కూలి పడుతుంది. ఇప్పుడు వేసవికాలం కావడంతో వ్యవసాయ పనులు దొరకడం కష్టంగా ఉంటుంది. ఉపాధి హామీ పథకంలో దినసరి కూలీగా వెళ్లి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాను. – కౌసల్యబాయి, ఉపాధి కూలీ, ఖిర్డి వాంకిడి, ఆసిఫాబాద్ జిల్లా నాకూ ఉపాధి దొరికింది నేను కూడా ఉపాధి కూలీ పనులకే పోతున్నా. చదువుకున్నప్పటికీ సరైన పనులు దొరకడంలేదు. వ్యవసాయం చేసుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి. అందువల్ల నాలాంటి యువత కూడా ఉపాధి హామీ పనుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఊరికే ఉండడం బదులు ఈ పనికి పోతే ఊరికి కొంత మేలు చేసిన సంతృప్తి కూడా మిగులుతుంది. – బొడపట్ల రమేష్, ఉపాధి కూలీ డిగ్రీ చదివినా ఉపాధే దిక్కైంది నేను డిగ్రీ చదివాను. నాన్నకు వ్యవసాయంలో చేదోడువాదోడుగానే ఉంటూ నా మిత్రులతో కలిసి ఉపాధి పనులకు వెళ్తున్నాను. దాదాపు పదేళ్లుగా ఉపాధి పనులు చేస్తున్నాను. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే మరింత బాగుంటుంది. అటు రైతుల కష్టాలు, ఇటు కూలీల కష్టాలు తీరతాయి. – సంజీవ్, జైనథ్ మండలం లక్ష్మీపూర్, ఆదిలాబాద్ జిల్లా వంద రోజుల పనే తిండి పెడుతోంది ఎండా కాలంలో ఉపాధి హామీ పథకమే వంద రోజుల తిండి పెడుతోంది. ఇప్పుడు వ్యవసాయ పనులు లేవు. వేసవి కావడం వల్ల ఉదయం 6 గంటలకు పనికి వెళ్లాల్సి వస్తుంది. రోజుకు రూ.200 వరకు కూలి వస్తుంది. వంద రోజుల పని లేకుంటే మా కుటుంబం పస్తులు ఉండాల్సి వస్తుంది. – జి.వనమ్మ, సీతానాగారం కరువు పనులతోనే కైకిలి నాకు ఎకరం వ్యవసాయ భూమి ఉంది. వరి వేసినం. నీరులేక ఎండిపోయింది. చేసేందుకు వేరే పని ఏదీ లేకపోవడంతో ఉపాధి పనికి పోతున్నాను. కరువు పనులతోనే కైకిలి దొరుకుతోంది. నిరుడు 100 రోజుల పనిపూర్తి చేసిన. ఈ పని దినాలను 150 రోజులకు పెంచితే నాలోంటోళ్లకు మరింత ఉపాధి కల్పించినట్లు అవుతుంది. – వంగపెల్లి మల్లవ్వ, నిజామాబాద్ పూడిక పనులకు వెళ్తున్నా నెల రోజుల నుంచి నల్ల చెరువుల పూడిక తీత పనులు జరుగుతున్నాయి. వ్యవసాయ పనులు లేని కరువు పరిస్థితుల్లో వంద రోజుల పనితో ఉపాధి పొందుతున్నాం. నాలుగు వారాల నుంచి వంద రోజుల పనికి పోతున్నా. – టి.సాంబయ్య, కానిపర్తి, వరంగల్ అర్బన్ జిల్లా సరిపడా పరదాలు లెవ్వు వంద రోజుల పనికి రోజుకు 200 మంది దాకా పోతున్నాం. ఉన్న రెండు పరదాలు ఇంత మందికి సరిపోతలెవ్వు. ఇంకో వారం పది రోజులైతే ఇంకా ఎక్కువ మంది వత్తరు. వంద రోజుల పని కాడ నీడ కోసం అందరికి సరిపడా పరదాలు లేక ఇబ్బంది అవుతుంది. ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో లెవ్వు. రెండేండ్ల నుంచి గడ్డపారలు ఇయ్యనేలేదు. – కన్నెబోయిన సరోజన, కానిపర్తి ఈ పని లేకపోతే డొక్క ఎండుడే కరువు కాలం మోపయింది. వానలు పడక చెరువులు, కుంటలు మొత్తం ఎండిపాయే. తాగుదామంటనే నీళ్లు దొరుకుతలేవాయే. ఇగ వ్యవసాయం ఎట్ల చేసుడు. ఉపాధి హామీ పథకంతోనే ఇంత పనులు దొరికి ఇళ్లు గడుస్తోంది. ఈ పని కూడా లేకపోతే ఆకలితో మాడి డొక్కలు ఎండుడే. – రెడ్డి శంకర్, ఉపాధి కూలి -
కరువు తరిమిన బతుకులు
చంద్రబాబుతో పాటే కరువూ రావడంతో చినుకు జాడ లేక..సాగు నీరందక పొలాలన్నీ బీళ్లువారుతున్నాయి. ఉన్న ఊళ్లో చేసేందుకు పనుల్లేవు. ఉపాధి హామీ పనులూ అరకొరే. మరి ఇల్లుగడిచేదెట్టా.. పొట్టచేతపట్టుకుని పెట్టా బేడా సర్దుకుని వయసుడిగిన కన్నవాళ్లను ఇళ్ల దగ్గరే వదిలి..భార్యాబిడ్డలతో సుదూర ప్రాంతాలకు వలసెళ్తున్నారు. ఇలా..ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఉపాధి కల్పనలో పాలకుల నిర్లక్ష్యం పల్లె జనం పాలిట శాపమవుతోంది. సాక్షి, చీరాల: పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం ప్రాంతంలో కరువు పరిస్థితులు ఏర్పడటంతో కుటుంబ పోషణ కోసం వివిధ గ్రామాల్లో ప్రజలు పొట్ట చేత పట్టుకుని భార్యబిడ్డలతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, బోధన్, నిర్మల్, ఆర్మూర్ మన రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటికీ సుమారు 13 నుంచి 15 వేల మంది వరకు వలసబాట పట్టారు. దీనితో గృహాల వద్ద వృద్ధులు మాత్రమే ఉంటున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని సుమారు 30 గ్రామాల్లో ప్రజలు కుటుంబాలను పోషించుకునేందుకు వలసలు వెళ్లారు. నాలుగేళ్లుగా కరువు పరిస్థితులు రావటం, మార్కాపురం ప్రాంతంలోని పలకల గనుల్లో పనులు లేకపోవటం, పొలాలు పండకపోవటంతో కుటుంబాలను పోషించుకోవటం భారంగా మారింది. దీంతో ఈ ప్రాంత రైతులు ఇతర ప్రాంతాలకు కూలీలుగా వెళ్తున్నారు. మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం, కొట్టాలపల్లె, భూపతిపల్లె, బొడిచర్ల, బొందలపాడు, మాల్యవంతునిపాడు, పిచ్చిగుంటపల్లి, మాలపాటిపల్లె, తూర్పుపల్లి, బోడపాడు, తదితర గ్రామాల నుంచి వలసలు వెళ్లారు. అలాగే తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లె, మీర్జాపేట, నాగెళ్లముడుపు, కారుమానుపల్లె, చెన్నారెడ్డిపల్లె, తర్లుపాడు, సీతానాగులవరం, కలుజువ్వలపాడు, తుమ్మలచెరువు, కొనకనమిట్ల మండలంలోని చినారికట్ల, పెదారికట్ల, గొట్లగట్టు, వింజవర్తిపాడు, మర్రిపాలెం, పొదిలి మండలంలోని నందిపాలెం, తలమళ్ల, ఇంకా పలు గ్రామాల ప్రజలు వలసలు వెళ్లారు. వీరందరూ తెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే కాంట్రాక్టర్ల దగ్గర రైల్వే కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా, బెంగళూరు నగరంలో వాచ్మెన్లుగా, పని మనుషులుగా పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తమ స్వగ్రామాల్లో ఉంటున్న తల్లిదండ్రులకు నెలకు నాలుగైదు వేల రూపాయలు పంపుతూ నాలుగైదు నెలలకు ఒకసారి వచ్చి వారిని చూసి యోగక్షేమాలు తెలుసుకుని వెళ్తుంటారు. దీంతో వారి పిల్లలు కూడా బడి మానేసి తల్లిదండ్రులతో వెళ్లిపోతున్నారు. గత ఏడాది కూడా మార్కాపురం ప్రాంతంలో వర్షాలు లేకపోవటంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. చెరువులో నీళ్లు రాక తాగునీటి సమస్య ఏర్పడింది. ప్రతి గ్రామంలో ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. ఆపదలో ఆదుకునే పాడి పరిశ్రమ కూడా గ్రాసం కొరతతో ఇబ్బందిగా మారిందని పలువురు రైతులు గేదెలను కబేళాలకు అమ్మి వలసలు పోయారు. ఇంటిని చూసుకునేందుకు వృద్ధులైన తల్లిదండ్రులను కాపలాగా ఉంచారు. మార్కాపురం ప్రాంతంలో ఎటుచూసినా చుక్క నీరు లేని చెరువులు బీడు భూములు దర్శనమిస్తున్నాయి. గతంలో పలకల పరిశ్రమ రైతులను, కూలీలను ఆదుకునేది. పలకల పరిశ్రమలో సంక్షోభం రావటంతో ఎగుమతి ఆర్డర్లు లేక ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. దీంతో సుమారు 5 వేల మంది కార్మికులు వీధిన పడ్డారు. వీరందరూ వలస బాట పట్టారు. మరో వైపు భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో ఆ రంగంలో పని చేసే సుమారు 2 వేల మంది కార్మికులు కూడా వలసలు వెళ్లారు. వలసలు తప్ప బతికే పరిస్థితి ఏదీ.. పుల్లలచెరువు మండలంలోని పుల్లలచెరువు, వెంకటరెడ్డిపల్లి, రాచకొండ, మల్లాపాలెం, అక్కపాలెం, గంగవరం గ్రామాల్లోని ప్రజలు వలస వెళ్లిక తప్పడం లేదు. ఈ ప్రాంతంలో సాగు నీరు లేక ఇక్కడ పంటలు పండకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇతర జిల్లాలకు చెరుకు నరకడానికో..లేక వరి కోతల కోసమో వెళ్తున్నారు. ఇటీవల వలస వెళ్లి వస్తున్న వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రం నుంచి పనులు ముగించుకుని ఇంటికి వచ్చేటప్పడు మాచర్ల వద్ద లారీ ప్రమాదానికి గురై చాలా మంది గాయపడ్డారు. ఇటువంటి సంఘటనలు అనేకం. మంచి నాయకుడు వచ్చి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే తప్ప ఈ ప్రాంత ప్రజలు సక్రమంగా జీవనం సాగించే పరిస్థితి లేదు. ‘మగ్గం’ వదిలి మట్టి పనులకు.. అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి అందమైన చీరలు నేసే చేనేతల చేతులు ఇప్పుడు మట్టి పని కోసం వెంపర్లాడుతున్నాయి. కన్న బిడ్డల కడుపు నింపేందుకు సిమెంట్, ఇటుకరాళ్లు పట్టి మోసేందుకు పరుగులు పెడుతున్నాయి. మరికొందరు వంటల పని, షెడ్డుల్లో లారీ క్లీనర్ల అవతారం ఎత్తుతున్నారు. మరికొంత మంది కార్మికులు బార్లలో సర్వర్లుగానూ, పెట్రోల్ బంకుల్లో హెల్పర్లుగాను పని చేస్తున్నారు. పిల్లలను పస్తులుంచలేక.. మగ్గం పనితో అర్థాకలితో భార్య, పిల్లలను పస్తులుంచలేక చేనేత కార్మికులు బేల్దారి పనుల కోసం ఒంగోలు, బాపట్ల, కావలి, చీరాల, ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. చేనేతలు అధికంగా ఉండే చీరాల ప్రాంతంలో ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు రెండు వేల మందికి పైగా చేనేత కార్మికులు మట్టి పనుల కోసం రోజూ ఒంగోలు వెళ్తున్నారు. మరికొంత మంది చీరాల, బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో బేల్దారి పనులకు వెళ్తున్నారు. ఈపూరుపాలెం, తోటవారిపాలెం నుంచే వెయ్యి మంది వరకు బేల్దారి పనులకు వెళ్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం 7 గంటలకే చీరాల రైల్వేస్టేషన్లో చేతిలో క్యారియర్ పట్టుకొని వందలాది మంది చేనేత కార్మికులు పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు వెళ్లేందుకు వేచి ఉంటారు. ఈపూరుపాలెం, జాండ్రపేట, వేటపాలెం స్టేషన్లలో కూడా పాసింజర్ రైళ్లు మట్టి పనికి వెళ్లే కార్మికులతో కిక్కిరిసిపోతున్నాయి. పొట్టచేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు.. కనిగిరి నియోజకవర్గంలోనూ వలస జీవులు ఎక్కువే. నియోజకవర్గం నుంచి ఏటా దాదాపు పది వేల మందికిపైగా వలస వెళ్తుంటారు. ఎక్కువగా పీసీపల్లి మండలం అలవలపాడు, వడ్డెరపాలెం, ఇర్లపాడు, సీఎస్‌పురం మండలం అయ్యవారిపల్లి, పెదరాజుపాలెం, డీజీపేట, అంబవరం, చెన్నపనాయునిపల్లి, కె.అగ్రహారం, సీఎస్‌పురం, వడ్డెపాలెం, అయ్యలూరివారిపల్లి, హెచ్‌ఎంపాడు మండలంలోని కొత్తూరు, పాపిరెడ్డిపల్లి, ఉమ్మనపల్లి, మహమ్మదాపురం, రామాయపల్లి, వెలిగండ్ల మండలంలోని మోటుపల్లి, ఇమ్మడిచెరువు, గణేశుని కండ్రిక, రాళ్లపల్లి, పామూరు మండలంలో కంభాలదిన్నె, పామూరు పట్టణం, గోపాలపురం, వగ్గంపల్లి, బోడవాడ, కనిగిరి మండలం వాగుపల్లి, చిన ఇర్లపాడు, వడ్డెపాలెం గ్రామాల నుంచి వలస వెళ్తుంటారు. సీఎస్‌పురం మండలం వాళ్లు బెంగళూరు, పూణె, చెన్నై తదితర నగరాలకు వలస వెళ్లి..బేల్దారి పనులు, చిన్నచిన్న హోటళ్లు నిర్వహించుకుంటుంటారు. మిగిలిన మండలాల వాళ్లు తెలంగాణ జిల్లాలకు వలస వెళ్లి మట్టి పనులు, బేల్దారి పనులు చేస్తుంటారు. -
పని కోసం పట్నం బాట
సరైన వర్షాలు లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. కరువు పరిస్థితులతో వ్యవసాయం ముందుకు సాగడం లేదు. ఉన్న ఊళ్లో చేయడానికి పనులు లేవు. దీంతో పని వెతుక్కుంటూ చాలా కుటుంబాలు వలసవెళ్తున్నాయి. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. సాక్షి, నాగిరెడ్డిపేట (కామారెడ్డి ): రోజురోజుకు ముదురుతున్న ఎండలతో భూగర్భజలాలు సైతం పాతాళానికి చేరుతున్నాయి. బోరుబావులు ఒక్కొక్కటిగా వట్టిపోతున్నాయి. కొత్తగా బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండడం లేదు. కరువు పరిస్థితులతో నాగిరెడ్డిపేట మండలంలోని చాలా గ్రామాల్లో వ్యవసాయభూములు బీడుగానే ఉన్నాయి. కొందరు రైతులు ధైర్యంచేసి అక్కడక్కడా వేసిన పంటలు సైతం సాగునీరందక ఎండుముఖం పడుతున్నాయి. దీనికితోడు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు సైతం అంతంతమాత్రంగానే ఉండడంతో పల్లె ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పనికోసం వలస బాట పడుతున్నారు. మండలంలోని మాల్తుమ్మెద, గోపాల్పేట, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, తాండూర్, ధర్మారెడ్డి, రాఘవపల్లి, కన్నారెడ్డి, మాసాన్‌పల్లి, ఆత్మకూర్, జలాల్పూర్, జప్తిజాన్కంపల్లి, బొల్లారం తదితర గ్రామాల నుంచి ప్రజలు పొట్ట చేతబట్టుకొని ఇతరప్రాంతాలకు భారీగా వలసవెళ్లారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డిపేట మండలంతోపాటు ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి మండలాల్లోని పలుగ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్, ఆర్మూర్ తదితర ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. ఆదుకోని ఉపాధి హామీ.. పేదలకు అండగా ఉండాల్సిన ఉపాధి హామీ పథకం ఈసారి పెద్దగా పనులు కల్పించలేకపోయింది. వరుసగా వస్తున్న ఎన్నికలతో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటోంది. అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో సకాలంలో పనులను గుర్తించలేకపోయారు. మరోవైపు వరుణుడి కరుణ లేకపోవడంతో వ్యవసాయ పనులూ అంతంతగానే ఉన్నాయి. దీంతో గ్రామాలలో చేయడానికి పనులు లేకుండాపోయాయి. ఇళ్లకు తాళాలు వేసి.. గ్రామాల్లో పనిలేకపోవడంతో చాలాకుటుంబాలు ఇళ్లకు తాళాలువేసి పట్టణాలకు వలసవెళ్తున్నాయి. కొందరు కుటుంబ సభ్యులందరికీ తీసుకుని ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్తుండగా.. మరికొంతమంది వృద్ధులు, పిల్లలను ఇంటివద్దనే వదిలి వలసబాట పడుతున్నారు. పిల్లలు చదువుకు దూరమవకూడదని, వృద్ధులు ఉంటే ఇంటికి కాపలాగా ఉంటారని భావించి కేవలం భార్యాభర్తలు మాత్రమే పనికోసం పట్టణాలకు వెళ్తున్నారు. మాల్తుమ్మెద గ్రామంలో 500లకుపైగా కుటుంబాలుండగా సుమారు వంద కుటుంబాలు బతుకుదెరువు కోసం వలస వెళ్లడం సమస్య తీవ్రతను తెలుపుతోంది. పిల్లల చదువు కోసం నేనిక్కడ ఉన్న ఊళ్లె పనిలేక ఆరునెలల కింద నా కొడుకు, కోడలు హైదరాబాద్‌కు వలసపోయిండ్రు. నా మువవడు, మనుమరాలి సదువు కోసం నేను ఇంటికాడ్నే ఉంటున్న. నా కొడుకు, కోడలు పనిచేసి పైసలు పంపిస్తుండ్రు. ఆ పైసలతోనే మేము బతుకుతున్నం. – తలారి దుర్గమ్మ, మాల్తుమ్మెద ఇంటికి కాపలాగా.. ఈడ పని దొరక్క ఏడాదికింద నా కొడుకులు, కోడళ్లు బతకపోయిండ్రు. నా మనుమళ్లను గోపాల్‌పేటలోని హాస్టళ్ల ఏసిండ్రు. నేను మాత్రం ఇంటికి కాపాలాగా ఉన్న. ఆళ్లు పైసలు పంపిస్తే నేను బతుకుతున్న. ఊళ్లె పనిలేక మస్తుమంది బతుకవోతుండ్రు. – నక్క పోచమ్మ, మాల్తుమ్మెద షాతకాదని ఇంటికాడ్నే ఉంటున్న నా కొడుకు, కోడలు పనికోసం ఏడాదికింద ఆర్మూర్‌కు పోయిండ్రు. నాకు షాతకాదని ఇంటికాడ్నే ఉంటున్న. ఆళ్లు ఆర్మూర్‌లో కూలిపని చేసుకుంటుండ్రు. ఈ ఏడాది కాలం కాక పొలాలు కూడా పండుతలేవు. దీంతో ఊళ్లెకెళ్లి చానామంది బతుకడానికి యాడపని ఉంటే ఆడికి పోతుండ్రు. – వదల్పర్తి గంగమ్మ, మాల్తుమ్మెద -
కరువు గడ్డ.. ఆధిపత్యాలకు అడ్డా
సాక్షి, కొత్తకోట(చిత్తూరు) : జిల్లాలోనే కరువుకు పెట్టింది పేరు తంబళ్లపల్లె. వెంటాడే వరుస కరువు.. ఉపాధి కోసం ఊళ్లు విడిచి వెళ్లే జనం..ఇక్కడే కనిపిస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. అయితే తంబళ్లపల్లె అంటే దశాబ్దాల తరబడి రాజకీయ పోరు రాజుకుంటూనే ఉంది. ఇక్కడ ఎన్నికల్లో వర్గపోరు దే కీలకపాత్ర. ఏ ఎన్నిక జరిగినా..ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయం. వర్గరాజకీయాలే కాక, ఆధిపత్యం కోసం జరిగిన హత్యా రాజకీయాలకు ఎందరో బలయ్యారు. 1980–90 దశాబ్దాల మధ్య నడచిన రాజకీయ వర్గపోరుతో ఇక్కడి ప్రజ ల జీవితాలు భయంలోకి నెట్టబడ్డాయి. జీవనప్రమాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. ఆధిపత్యం చెలాయించడానికి జరిగిన రాజకీయ క్రీడలో ఎందరో బలయ్యారు. ఈ పరిస్థితుల్లో పీ పుల్స్వార్ ఉద్యమం తంబళ్లపల్లెలో పురుడు పో సుకుని నక్సల్ ఉద్యమానికి బీజం పడింది. ఇదీ తంబళ్లపల్లె నియోజకవర్గం రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఘన చరిత్రే ఉంది. కంటిచూపుతో రాజకీయాలు శాసించిన నేతలున్న నియోజకవర్గమిది. జిల్లాలో మారుమూలన, కర్ణాటక, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దులోని ఈ నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలు నడిచాయి. 1952లో తొలి నియోజకవర్గంగా బి.కొత్తకోట మండలంలోని గట్టు కేంద్రంగా ఏర్పడింది. తర్వాత 1955లో తంబళ్లపల్లె కేంద్రంగా పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం మండలాలు, బి.కొత్తకోట మండలంలోని ఐదు పంచాయతీలతో నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో జరిగిన పునర్విభజనతో మదనపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండలం, బి.కొత్తకోట మండలంలోని మిగిలిన ఆరు పంచాయతీలను కలిపి ఆరు మండలాలతో తంబళ్లపల్లె నియోజకవర్గం ఏర్పాటు చేశారు. టీఎన్, కలిచర్ల కుటుంబాలదే పైచేయి నిత్య కరువు, వర్గపోరుకు నిలయమైన తంబళ్లపల్లె రాజకీయాల్లో టీఎన్, కలిచర్ల కుటుంబాలదే పైచేయి. తొలిసార్వత్రిక ఎన్నికలు 1952 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే పదవి విషయంలో వీరిమధ్యనే పోటీ. ఎమ్మెల్యే, రాజంపేట ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన చరిత్ర టీఎన్ కుటుంబానిదే. ఈ కుటుంబం నుంచి టీఎన్ రామకృష్ణారెడ్డి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత ఒకసారి ఎంపీగా, ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా ఈ కుటుంబీకులే గెలిచారు. ఒకసారి టీఎన్ కుటుంబం, ఒకసారి కలిచర్ల కుటుంబం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి ఎమ్మెల్యేలయ్యారు. 1983లో రాష్ట్రమంతా ఎన్టీఆర్ ప్రభంజనం ఉంటే తంబళ్లపల్లెలో టీఎన్.శ్రీనివాసులురెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఈ రెండు కుటుంబాల నడుమ 1978లో సాధారణ కుటుంబానికి చెందిన ఆవుల మోహన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున ఒకసారి, 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో అనిపిరెడ్డి వెంకట కుటుంబం నుంచి ఏవీ లక్ష్మీదేవమ్మ రెండుసార్లు, ఆమె తనయుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఒకసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు అయ్యారు. 1989 నుంచి తంబళ్లపల్లె రాజకీయాల ను శాసించి ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన టీఎన్ కుటుంబం, నాలుగుసార్లు ఎ మ్మెల్యేగా గెలుపొందిన కలిచర్ల కుటుంబం 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. నక్సలిజానికి ఆజ్యం నియోజకవర్గంలో 1980–90 దశాబ్దాల్లో నక్సలిజం పురుడు పోసుకుంది. జిల్లాలో పీపుల్స్‌వార్ కార్యకలాపాలు పుట్టింది ఇక్కడే. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తంబళ్లపల్లె మండలంలోని అన్నగారిపల్లెలో నక్సలైట్ల ధర్మగంట ఏర్పాటు ఒక అధ్యాయం. అన్యాయానికి గురైన వారు ఈ గంట మోగిస్తే రాత్రివేళల్లో అన్నలు పల్లెలోకి వచ్చి తీర్పులు ఇచ్చేవారు. భూ సమస్యలపై జరిగిన వివాదాల్లో ములకలచెరువు, తంబళ్లపల్లె మండలాల్లో నక్సలైట్లు, వారి వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన సంఘటనల్లో 13 మంది చనిపోయారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా చౌడసముద్రంలో రైతు, రైతు కూలీ సమన్వయ సంఘం ఏర్పాటైన తర్వాత వరుస హత్యలు జరిగాయి. పీపుల్స్‌వార్ దళాలు పేదలతో కలిసి చౌడసముద్రంపై జరిపిన దాడిలో ముగ్గురిని హతమార్చారు. పీపుల్స్‌వార్ జిల్లా కార్యదర్శులుగా చౌడసముద్రం ఎల్వీ రమణ, కలిచర్లకు చెందిన కృష్ణప్ప, మల్లూరివాండ్లపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి పనిచేశారు. తర్వాత కృష్ణప్ప రాయలసీమ కార్యదర్శిగా పనిచేశారు. జొన్నచేనువారిపల్లె వేమనారాయణరెడ్డి పీపుల్స్‌వార్‌తో విభేదించి కొత్తగా పీపుల్స్‌వార్ విముక్తి పథం ఏర్పాటు చేశారు. 1984లో తంబళ్లపల్లె సమీపంలో జిల్లా వార్ ప్లీనరీలో కొండపల్లె సీతారామయ్య హాజరయ్యారు. -
ఇన్ని రోజులా... నిద్ర పోతున్నావా?
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు పాలించినంత కాలం రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కరువు ఉందని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారన్నారు. అంటే ఆయన పాలనలో వర్షాలు కురవని చంద్రబాబుకు కూడా అర్థమైందంటూ ఎద్దేవా చేశారు. కరువు ఉందని ఒప్పుకున్న చంద్రబాబు.. దానికి సంబంధించి కేంద్రానికి మాత్రం తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. ఏడేళ్లుగా కరువు ఉంటే కేంద్రాన్ని సాయం అడగడానికి ఇన్ని రోజులు పట్టిందా.. నిద్ర పోతున్నావా బాబూ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 35 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.. 17 లక్షల మంది రైతులు దీనావస్థలో ఉన్నారన్న చంద్రబాబు.. మరుసటి రోజే వ్యవసాయాభివృద్ధిలో మనమే టాప్ అంటూ కోతలు కోశారన్నారు. ఇలాంటి అభూత కల్పనలు సృష్టించడంలో బాబు నంబర్‌వన్ అంటూ విమర్శించారు. మ్యానిపులేట్ చేయడంలో బాబుకు విల్, వే బాగా ఉంటుందని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తప్ప ఏ జిల్లాలో కూడా కావాల్సినంత వర్షపాతం లేదని తెలిపారు. గతంలో 9 ఏళ్ల పాలనలో.. ఇప్పుడు ఐదేళ్లలో కూడా రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ పూర్తిగా వైఫల్యం చెందిందని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్ర సమస్యలను గాలికి వదిలి.. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని విమర్శించారు. మహాకూటమి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆంధ్రాలో సంపాదించిన అవినీతి సొమ్మేనని ఆరోపించారు. మరో నాలుగు నెలల్లో ఏపీ ప్రజలు ఇక్కడి నుంచి తరిమేస్తారని తెలిసే.. చంద్రబాబు తెలంగాణలో వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తెలంగాణకు వెళ్తే పీడ విరగడవుతుందని ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలో అత్యధిక అప్పులున్న రైతులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారని నాబార్డ్ నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. ఏపీలో రైతు సమస్యలను గాలికొదిలేసి.. దేశవ్యాప్తంగా ఎందుకు తిరుగుతున్నారంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఇన్ని రోజులు హైదరాబాద్‌ను నిర్మించింది తానేనంటూ మాట్లాడిన బాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మాత్రం సైబరాబాద్‌ను మాత్రమే నిర్మించానని చెప్పాడు. అంటే కుతుబ్ షా ఆత్మలు ఏవైనా చంద్రబాబును బెదిరించాయా అంటూ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. హైటెక్ సిటీ భవనాన్ని 1992లో నేదురుమళ్లి జనార్దన్ రెడ్డి నిర్మించారని, చంద్రబాబు కేవలం తన రియల్ ఎస్టేట్ మిత్రులకు మాత్రమే లాభాలు చేకూర్చారని ఆరోపించారు. చంద్రబాబు కోతలు ఎలా ఉన్నాయంటే శంషాబాద్ విమానాశ్రయాన్ని కూడా తానే నిర్మించానని రాహుల్ గాంధీతో చెప్పారని, అసలు ఆ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసింది, ప్రారంభించింది సోనియా గాంధీ అని గుర్తుచేశారు. ఈ విషయం చెప్పలేక రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్, పీవీ నర్సింహ్మరావు ఎక్స్‌ప్రెస్ వేని నిర్మించి.. ఆ ప్రాంతాలని అభివృద్ధి చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వివరించారు. బాబు సీఎంగా ఉన్నప్పుడే, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణ బెంగుళూరును ఎంతో అభివృద్ధి చేశారు.. కానీ బాబులా ఎప్పుడు డప్పు కొట్టుకోలేదంటూ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశించి కూటమిని తెర మీదకు తెచ్చారని.. దాని బదులు టీడీపీనే, కాంగ్రెస్‌లో విలీనం చేస్తే సరిపోయేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పే సుభిక్షం, పచ్చదనం కేవలం పచ్చ పేపర్లలో, టీవీ చానళ్లలో మాత్రమే ఉంటుందని, రాష్ట్రంలో లేదని అన్నారు. దేశంలో చక్రం తిప్పాలని కలలు కనే బదులు రాష్ట్రం గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. ఎన్నికల్లో వెదజల్లుతున్న అవినీతి సొమ్మును రైతుల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదానే వైఎస్సార్ సీపీ ప్రధాన ధ్యేయంగా శ్రీకాంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. -
ఖరీఫ్ సాగుకు కరువు పోటు
ఖరీఫ్ సాగు రైతులను కుంగదీస్తోంది. ఇటీవల ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. మరోవైపు వేడి గాలులు పంటల సాగుపై ప్రభావం చూపుతున్నాయి. బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో ఇప్పటికే కొన్ని బోర్లలో నీరు రావడం లేదు. మరికొన్ని బోర్లలో నీరు వస్తున్నా వరి పొలాలు తడారిపోతున్నాయి. దీంతో ఖరీఫ్‌లో పంటలు సాగుచేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగుచేసినా చేతికందుతుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. వరుణుడు కరుణించపోతాడా అన్న చివర ఆశతో ఆకాశం వైపు రైతులు ఎదురుచూస్తున్నారు. డక్కిలి (నెల్లూరు): ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు కరువు పోటు తప్పడం లేదు. వరిపంటను సాగుచేసిన రైతులను వాతావరణ పరిస్థితులు నష్టాలోకి నెట్టేస్తున్నాయి. దీంతో పంటల సాగు రైతులకు ప్రశ్నార్థకంగా మారింది. డక్కిలి మండలంలో నెల్లూరు మసూర 34449, ఎంటీయూ–1010 రకం వరి పంటను సుమారు 800 హెక్టార్లలో ఖరీఫ్ కింద సాగు చేశారు. బోర్లు, ఏర్లను ఆధారం చేసుకొని వరి పంటను సాగుచేసిన రైతులకు ప్రస్తుతం పంటలు చేతికందుతాయా అన్న ఆందోళన నెలకొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రతి ఏటా జూన్, జూలై మాసాల్లో తొలకరి వర్షాలు కురుస్తాయి. అయితే ఈ ఏడాది రైతులను తొలకరి వర్షాలు పలకరించకపోవడంతో సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను పొందేందుకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది రైతులు అయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీటిని పంపింగ్ చేస్తున్నారు. మరికొంతమంది ఏర్లు, కాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటితో వరి పంటకు ఆరుతడులు కడుతూ పంటను సంరక్షించుకుంటున్నారు. కళ్లెదుటే ఎండిపోతున్న వరి రెండు నెలల క్రితం బోర్లలో, ఏరుల్లో నీరు పుష్కలంగా ఉంది. దీంతో రైతులు ఖరీఫ్ కింద తమకున్న పొలాల్లో వరి పంటను సాగు చేశారు. గత 10 రోజుల వరకు సాగునీటి కొరత ఎదుర్కొన్నారు. ప్రస్తుతం బోర్లు, ఏరుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో సాగునీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కొరతతో తమ కళ్లెదుటే పంట ఎండిపోతుండడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పంటను ఎలానైనా రక్షించుకోవాలన్న ఆశతో బోర్లు వేస్తున్నా నీరు రావడం లేదు. దీంతో రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. నష్టపోతున్న పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు వ్యవసాయశాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. భగీరథ యత్నం డక్కిలి మండలంలో ప్రధానంగా నాయుడుపాళెం, చాకలపల్లి, పాతనాలపాడు, భీమవరం, కొత్తనాళ్లపాడు, లింగసముద్రం, దగ్గవోలు, మోపూరు, దందవోలు, ఆల్తూరుపాడు, తీర్థంపాడు, ఆముడూరు, శ్రీపురం, మాటుమడుగు తదితర గ్రామాల్లో ఖరీఫ్ కింద వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం వరి పంట వెన్ను దశ, చిరుపొట్ట దశలో ఉంది. మరో నెల రోజులు సాగునీరు అందితే రైతులకు పంట చేతికందుతుంది. ఇప్పటికే రైతులు ఎరువులు, పురుగుమందులు, కూలీలు, దుక్కుల కోసం ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేశారు. మరోవైపు సాగునీటి కొరతను తీర్చుకునేందుకు అదనంగా కొంత ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. వ్యయ ప్రయాసాలకు లోనైనా మరో వారం రోజుల్లో వరుణుడు కరుణించకపోతే డక్కలి మండలంలో సాగవుతున్న 90 శాతం వరి పంట ఎండిపోయే అవకాశం ఉందనే ఆందోళనతో రైతులు ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులకు ఆర్జీలు ఇచ్చారు. ఎండిపోయిన డ్యామ్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది డక్కిలి మండలంలోని చాకలపల్లి సమీపంలో ఉన్న అలపలేరు డ్యామ్ పూర్తిగా ఎండిపోయింది. ఈ ప్రాంతంలో డ్యామ్‌లో నీరు ఉండడం వల్ల పరిసర గ్రామాల్లోని బోర్లలో నీరు బాగా వచ్చేది. అయితే ఈ ఏడాది డ్యామ్ ఎండిపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లలో చుక్కనీరు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు. పంటను రక్షించుకునేందుకు డ్యామ్ నుంచి కొంతమంది రైతులు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్లతో నీటిని పంపింగ్ చేకుంటున్నా మరో రెండు రోజులు మాత్రమే నీరు వస్తుందని చాకలపల్లి, యల్లావజ్జలపల్లి గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి గత 10 రోజుల నుంచి సాగునీటి కొరత ఎదుర్కొంటున్నాం. ఏర్లు, బోర్లలో నీరు అడుగంటడంతో అలపలేరు డ్యామ్ నుంచి ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీరు పొలాలకు అందిస్తున్నాం. ప్రతి రోజూ ఆయిల్ ఇంజిన్లు నడిపేందుకు బాగా ఖర్చవుతోంది. డ్యామ్‌లో కూడా నీరు అడుగంటింది. – ఎం.వెంకటేశ్వర్లు, చాకలపల్లి, రైతు రూ.వేలు ఖర్చు చేయాల్సివస్తుంది ఖరీఫ్ కింద ఐదెకరాల్లో వరి పంట సాగు చేశా. బోర్లలో నీరు రాకపోవడంతో అలపలేరు డ్యామ్ నుంచి నీటిని పంపింగ్ చేసుకునేం దుకు పైప్‌ల కోసం రూ.20 వేలు ఖర్చు చేశాను. అయినా పంట చేతికి వస్తుందన్న నమ్మకం లేకుండాపోయింది. ఎండిపోయిన పంటలకు బీమా వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – మధు, చాకలపల్లి, రైతు -
అయిదింట్లో మూడు జిల్లాలు.. కరువును ఎదుర్కోలేవు..!
దేశంలోని 60 జిల్లాలు దుర్భిక్షపరిస్థితులను తట్టుకోలేవు...ప్రతీ అయిదు జిల్లాల్లో మూడు కరువును ఎదుర్కొనే స్థితిలో లేవు...మొత్తం 634 జిల్లాల్లో 241 మాత్రమే దుర్భిక్షం నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశాలున్నాయి.... ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల ప్రభావం మనదేశంపైనా పడుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది కరువు కారణంగా వివిధ రాష్ట్రాలు తీవ్రమైన సమస్యల్లో కూరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులను పకడ్బందీగా ఎదుర్కునేందుకు మరింత మెరుగైన వ్యవసాయ, నీటి నిర్వహణ పద్ధతులను చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఇటీవల ఐఐటీ ఇండోర్, గువహటి పరిశీలనలో వెల్లడైంది. ఇటీవల . కరువు పరిస్థితులు కొనసాగుతున్న సందర్భంగా పర్యావరణ వ్యవస్థలోని ఉత్పాదకతను కాపాడే చర్యలు చేపట్టకపోతే ఆహారభద్రతకు కూడా ముప్పు ఏర్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఇదీ అధ్యయనం... నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)కి చెందిన మోడరేట్ రెసల్యూషన్ ఇమేజింగ్ స్పెక్ట్రో రేడియో మీటర్ సెన్సర్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఐఐటీ ఇండోర్, గువహటి ఈ అధ్యయనానికి ఉపయోగించారు. ఈ డేటా ద్వారా 2002014 మధ్యకాలానికి ’హై రెసల్యూషన్ ఎకోసిస్టమ్ రిసిలియన్స్ మ్యాప్ ఆఫ్ ఇండియా’ రూపొందించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 6.955 వర్ష గణనకేంద్రాల (భారత వాతావరణ శాఖ పరిధిలోని) నుంచి 19012015 మధ్యకాలంలో రోజువారి వర్షపాత గణాంకాలు పరిశీలించారు. ఈ అధ్యయనం సందర్భంగా కరువు ఏర్పడిన సంవత్సరంలో దేశంలోని 68 శాతం ప్రాంతం సాగు సంబంధిత అంశాలకు ఏమాత్రం సహాయకారిగా అందించలేదని తేలింది. మొత్తం 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిపిన పరిశీలనలో పదిరాష్ట్రాలు మాత్రమే 50 శాతం మేర ఈ పరిస్థితులను తట్టుకునే స్థితిలో ఉన్నట్టు వెల్లడైంది. రాజస్థాన్, చత్తీస్గడ్లలోని అన్ని జిల్లాలు దుర్భిక్షాన్ని ఏ మాత్రం తట్టుకోలేని విధంగా ఉంటే సిక్కింలోని నాలుగుజిల్లాలు తట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. గతేడాది ఐఐటీ గువహటి నిర్వహించిన మరోసర్వేలో దేశంలోని నాలుగు నదీపరీవాహక ప్రాంతాల్లో ఒకటి మాత్రమే (మొత్తం 22 బేసిన్లలో ఆరుమాత్రమే) కరువు సందర్భంగా పంటలతో పాటు పచ్చదనానికి తగిన సహకారాన్ని అందించగలిగినట్టు తెలిసింది. 2016లో ఐఐటీ గాంధీనగర్, కాన్పూర్ సంయుక్త అధ్యయనంలో గత కొన్నేళ్లుగా కరువు పరిస్థితులు పెరగడంతో తీవ్రత కూడా పెరుగుతున్నట్టు, గంగానది మైదాన ప్రాంతం, మధ్య మహారాష్ట్ర, దక్షిణ భారత తీరప్రాంతాల వైపు ఇవి కదులుతున్నట్టు వెల్లడైంది. పుణేలోని భారత వాతావరణ 2014లో జరిపిన విశ్లేషణ మేరకు దేశంలోని మొత్తం 103 వాతావరణ కేంద్రాల్లో 57 మార్చిజులై మధ్యలో వడగాల్పులు రికార్్డ చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని వివిధ ప్రాంతాలు ఏ మేరకు కరువు తట్టుకునేంత స్థాయిలో ఉన్నాయన్న దానిపై చేసిన పరిశీలనకు ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలోని జిల్లాల్లో ఎక్కడైతే అడవులు, పచ్చదనం శాతం ఎకు్కవగా ఉందో ఆయా ప్రాంతాల్లోనే దుర్భిక్షాన్ని తట్టుకునే పరిస్థితులున్నాయని ఈ అధ్యయనంలో మరోసారి రుజువైంది. ఐఐటీ ఇండోర్, గువహటి బృందం ’డిస్ట్రిక్ట్లెవల్ అసెస్మెంట్ ఆఫ్ ఎకోహైడ్రోలాజికల్ రిసిలీయెన్స్ టు హైడ్రోక్లైమాటిక్ డిస్టర్బెన్సన్ అండ్ ఇట్స్ కంట్రోలింగ్ ఫాక్టర్స్ ఇన్ ఇండియా’ శీర్షికతో తమ అధ్యయనాన్ని ఇటీవల హైడ్రాలజీ జర్నల్‌లో ప్రచురించారు. -
నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ అధికారుల తీరు ‘నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు’ అన్న చందంగా ఉంది. జిల్లా అంతటా తీవ్ర కరువు పరిస్థితులు కన్పిస్తున్నా..వారి నిర్ధారణలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కేవలం ఏడు మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పత్తికొండ వ్యవసాయ సబ్ డివిజన్లోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, డోన్ సబ్ డివిజన్లోని ప్యాపిలి, డోన్, ఆలూరు సబ్ డివిజన్లోని కౌతాళం మండలాల్లో మాత్రమే కరువు ఉన్నట్లు అంచనా వేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి నివేదికల కారణంగా తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. రెండు నెలలుగా వరుణుడు మొహం చాటేస్తున్నాడు. ఖరీఫ్‌లో రెండు నెలలు గడిచినా.. సాగు విస్తీర్ణం మాత్రం 51 శాతానికే పరిమితం కావడం ఇందుకు నిదర్శనం. కౌతాళం, కోసిగి, శ్రీశైలం, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, ఆదోని, హొళగుంద, దేవనకొండ, పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, కోవెలకుంట్ల, బనగానపల్లి, అవుకు, ప్యాపిలి, డోన్, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, శిరివెళ్ల, రుద్రవరం, కోడుమూరు, సంజామల, సి.బెళగల్, గూడూరు తదితర మండలాల్లో లోటు వర్షపాతం ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని మండలాల్లోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలని రైతులు, రైతుసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొనసాగుతున్న వర్షాభావం గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత ఏడాది జూన్‌లో ఆశాజనకంగా వర్షాలు పడగా.. ఈసారి మాత్రం అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక జూలైలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా ఒక్క మండలంలో మాత్రమే నమోదైంది. మిగిలిన 53 మండలాల్లోనూ లోటు వర్షపాతమే. ఖరీఫ్ సీజన్లో రెండు నెలలు పూర్తయ్యాయి. ఈ కాలంలో నమోదైన వర్షపాతాన్ని చూస్తే జిల్లా అంతటా కరువు పరిస్థితులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 77.2 మి.మీ ఉండగా.. 66.5 మి.మీ, జూలైలో 117.2 మి.మీకి గాను సోమవారం నాటికి 52.9 మి.మీ మాత్రమే నమోదు కావడం గమనార్హం. జూలైలో కేవలం హాలహర్వి మండలంలో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంది. పగిడ్యాల మండలంలో సాధారణం మేరకు వర్షాలు పడినప్పటికీ 12 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. 20 శాతం వరకు లోటు ఉన్నా.. సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. మిగిలిన 52 మండలాల్లో 93 నుంచి 30 శాతం వరకు లోటు వర్షపాతం ఉండటం గమనార్హం. ఖరీఫ్ మొదటి రెండు నెలల్లోనే డ్రైస్పెల్‌లు రెండు ఉన్నట్లు ప్రకటించారు. జిల్లా వ్యవసాయ యంత్రాంగం ప్రస్తుతం కరువు నివేదికను సిద్ధం చేస్తోంది. కాగా..గడువు ముగిసినందున ఇక మీదట వేరుశనగ సాగు చేయకపోవడమే మంచిదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. -
కేసీఆర్ మాటలు నీటి మూటలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీజేపీ శాసనసభ పక్ష నేత కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అనేక కష్టాలు ఎదర్కొంటున్నారు. రబీలో వేసిన పంటలు ఒక ఎకరం కూడా ఎండనివ్వనని కేసీఆర్ చెప్పారు. కానీ ఆయన మాటలు నీటి మూటలు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 మండలాలోల తీవ్ర కరువు పరిస్థితలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 4 నుంచి 5 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు చేరాయి’ అని తెలిపారు. తెలంగాణని ధనిక రాష్ట్రం అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, కరువు సహాయం కింద కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తే ఇప్పటివరకు అవి ప్రజలకు అందలేదని ఆరోపించారు. సన్న బియ్యంతో అన్నం పెడతామని చెబుతున్నారు, కానీ ప్రజల కడుపు కాలే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథపై ఉన్న ప్రేమ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు అందించడంపై లేదన్నారు. తాగునీరులేక ఉత్తర తెలంగాణలోని గిరిజనులు వలస పోతున్నారని ఆయన తెలిపారు. కేవలం జనగామ జిల్లాలోనే 20 వేల ఎకరాల పంట నష్టం వాటిల్లిందని కిషన్‌రెడ్డి అన్నారు. భూగర్భ జలాలు పడిపోవడం వల్ల బోరుబావులు ఎండిపోయాయని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కూరగాయలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా రైతులకు ఇచ్చే 4వేల రూపాయలను సర్వరోగ నివారిణి లాగా చెప్తున్నారని, ప్రభుత్వం పుండు ఒకటి ఉంటే మందు మరోటి వేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై అఖిలపక్షం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించకూడదు, శాసనసభలో కూడా ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తుందని సర్కార్ తీరుపై మండిపడ్డారు. -
కరువు
సాక్షి, మంచిర్యాల : జిల్లాను కరువు దుర్భిక్షం అలుముకుంది. నాలుగు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగు సంక్షోభంలో పడింది. కరుణించని వరుణుడు.. కనికరించని కరెంటు అన్న చందంగా ఈ ఖరీఫ్ కూడా రైతులకు నష్టాలనే మిగిల్చింది. తానూరులో అతి తక్కువగా -68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. దీంతోపాటు 46 మండలాల్లో లోటు వర్షం కురిసింది. లోటు వర్షపాతంతో ఇప్పటికేపంట దిగుబడులు భారీగా తగ్గాయి. వరి పంట ఎక్కువగా దెబ్బతింది. మొక్కజొన్న, కందుల దిగుబడి తగ్గే పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావం దృష్ట్యా మరో పది రోజుల్లో మిగిలిన పంటలూ ఎండిపోయే ప్రమాదముందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. నమోదైన వర్షపాతం.. భూగర్భ జలమట్టం.. సాగు విస్తీర్ణం.. పంట నష్టం.. సాగునీరు.. విద్యుత్తు కోతలకు సంబంధించిన నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. మరోపక్క.. ఈ నెల నుంచి ప్రారంభంకానున్న రబీ సీజన్ ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు పంటలు వేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో పంట దిగుబడి మరింత తగ్గే ప్రమాదముంది. వర్షపాతం ఇలా.. జూన్ నుంచి గురువారం వరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే జిల్లాలో 33 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తం 52 మండలాల్లో ఇచ్చోడ, బజార్హత్నూర్, బెజ్జంకి, నెన్నెల, వేమనపల్లి మినహా అన్ని మండలాలను వర్షాభావం వెంటాడింది. ఈ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 46 మండలాల్లో 20 శాతం నుంచి 59 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. తానూరు మండలంలో అతి తక్కువగా వర్షపాతం నమోదైంది. కుభీర్, ఇంద్రవెల్లిలో సాధారణం కంటే 50 శాతం లోటు వర్షపాతం ఉంది. పడిపోయిన భూగర్భ జలాలు..! క్రమంగా పడిపోతున్న భూగర్భ జల మట్టాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 11 మండలాల్లో భూగర్భ జలం పది మీటర్ల లోతుకు చేరుకున్నట్లు భూగర్భ జల అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్ డివిజన్లోని పలు మండలాల్లో భూగర్భ జలం ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. తాజా దుస్థితిని విశ్లేషిస్తూ భూగర్భ జల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ కోటా లేకపోవటంతో వ్యవసాయానికి ఇచ్చే ఐదు గంటల్లోనూ కోత పెడుతున్నారు. మరోవైపు జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గిపోవటంతోపాటు పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు కాపాడుకోవటానికి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సలహాలు సూచనలు అందించినా పంటలు మాత్రం ఎండు ముఖమే పట్టాయి. కరువు పరిస్థితులపై ప్రభుత్వాన్ని నివేదించాం.. - రోజ్‌లీలా, వ్యవసాయ శాఖ, జాయింట్ డెరైక్టర్ జిల్లా అంతటా కరువు ఉంది. ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. వారం రోజుల్లో మరిన్ని పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కరువు పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. -
బీమా ఉంటేనే ధీమా..!
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొని పైర్లు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో పంటల బీమాకు ప్రాధాన్యత ఏర్పడింది. రైతులు కూడా తాము సాగు చేసిన పంటలను బీమా చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి పంటల బీమా గడువు జూలై నెల చివరితోనే ముగిసింది. రుణమాఫీ కాకపోవడం, రుణాలు రీ షెడ్యూల్ చేయకపోవడంతో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం స్పందించి సెప్టెంబర్ 15 వరకు గడువు పొడిగించింది. ఈ సారి బ్యాంకులు పంట రుణాల పంపిణీ చేపట్టకపోవడంతో రైతులందరూ నాన్ లోనింగ్ ఫార్మర్స్ కింద బీమా చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వేరుశనగకు వాతావరణ బీమా.. జిల్లాలో 83వేల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేస్తున్నారు. ఈ పంటకు వాతావరణ బీమా కల్పిస్తున్నారు. నాలుగు దశల్లో వర్షాభావం లేదా అధిక వర్షాలు, చీడ పీడలను పరిగణనలోకి తీసుకొని పరిహారాన్ని చెల్లిస్తారు. హెక్టారుకు రూ.27,500 విలువకు వాతావరణ బీమా చేసుకోవచ్చు. ఇందుకు పది శాతం ప్రీమియం రూ.2750 చెల్లించాల్సి ఉంది. ఇందులో రైతులు రూ.1375 భరించాలి. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. వేరుశనగకు వాతావరణ బీమా చేసే రైతులు కర్నూలులోని యునెటైడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలో సంప్రదించవచ్చని జేడీఏ ఠాగూర్ నాయక్ తెలిపారు. వరికి గ్రామం యూనిట్‌గా బీమా.. గతంలో వేరుశనగకు గ్రామం యూనిట్‌గా బీమా సౌకర్యం ఉండేది. వేరుశనగను వాతావరణ బీమా కిందకు తీసుకురావడంతో వరికి గ్రామం యూనిట్‌గా బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లాలో ఈ పంట లక్ష హెక్టార్ల వరకు సాగు కానుంది.