సాక్షి,అమరావతి: చంద్రబాబు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు
ఏపీలో వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నంబరు15 జారీచేసింది. ఈ జీవోపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.
బాబు వస్తే కరువు వస్తుంది
చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి. వైయస్సార్సీపి…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 30, 2024
బాబు వస్తే కరువు వస్తుంది.చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి.
వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పక్కన పెట్టి రైతుల ఉసురు తీసుకుంటున్నారు’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో తాండవించిన కరువు..
కాగా, రాష్ట్రంలో దుర్భిక్షం మొదలైంది. వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది.
వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో నంబరు 15 జారీచేసింది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది. 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్లలో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.
Comments
Please login to add a commentAdd a comment