న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న ఎండవేడిపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడి గాలులతో ప్రజలకు ప్రాణాపాయం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సమీక్షించారు. దేశంలో అధిక ఉష్ణోగ్రతల గురించి సమావేశంలో వాతావరణ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణా అథార్టీలు వివరించాయి. అధిక ఎండలతో అగ్ని ప్రమాదాలు, వడగాలులు సంభవిస్తాయని, వీటివల్ల ప్రాణాపాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని కోరారు. దేశంలో అడవుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అడవుల్లో కార్చిచ్చు రేగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సమీక్షించారు. రాబోయే రుతుపవనాలను దృష్టిలో ఉంచుకొని తాగునీటి సంరక్షణా చర్యలు తీసుకోవాలని, నీటివనరులు కలుషితం కాకుండా జాగ్రత్తపడాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment