ప్రతీకాత్మక చిత్రం
దేశంలోని 60 జిల్లాలు దుర్భిక్షపరిస్థితులను తట్టుకోలేవు...ప్రతీ అయిదు జిల్లాల్లో మూడు కరువును ఎదుర్కొనే స్థితిలో లేవు...మొత్తం 634 జిల్లాల్లో 241 మాత్రమే దుర్భిక్షం నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశాలున్నాయి....
ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల ప్రభావం మనదేశంపైనా పడుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది కరువు కారణంగా వివిధ రాష్ట్రాలు తీవ్రమైన సమస్యల్లో కూరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులను పకడ్బందీగా ఎదుర్కునేందుకు మరింత మెరుగైన వ్యవసాయ, నీటి నిర్వహణ పద్ధతులను చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఇటీవల ఐఐటీ ఇండోర్, గువహటి పరిశీలనలో వెల్లడైంది. ఇటీవల . కరువు పరిస్థితులు కొనసాగుతున్న సందర్భంగా పర్యావరణ వ్యవస్థలోని ఉత్పాదకతను కాపాడే చర్యలు చేపట్టకపోతే ఆహారభద్రతకు కూడా ముప్పు ఏర్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
ఇదీ అధ్యయనం...
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)కి చెందిన మోడరేట్ రెసల్యూషన్ ఇమేజింగ్ స్పెక్ట్రో రేడియో మీటర్ సెన్సర్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఐఐటీ ఇండోర్, గువహటి ఈ అధ్యయనానికి ఉపయోగించారు. ఈ డేటా ద్వారా 2002014 మధ్యకాలానికి ’హై రెసల్యూషన్ ఎకోసిస్టమ్ రిసిలియన్స్ మ్యాప్ ఆఫ్ ఇండియా’ రూపొందించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 6.955 వర్ష గణనకేంద్రాల (భారత వాతావరణ శాఖ పరిధిలోని) నుంచి 19012015 మధ్యకాలంలో రోజువారి వర్షపాత గణాంకాలు పరిశీలించారు. ఈ అధ్యయనం సందర్భంగా కరువు ఏర్పడిన సంవత్సరంలో దేశంలోని 68 శాతం ప్రాంతం సాగు సంబంధిత అంశాలకు ఏమాత్రం సహాయకారిగా అందించలేదని తేలింది. మొత్తం 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిపిన పరిశీలనలో పదిరాష్ట్రాలు మాత్రమే 50 శాతం మేర ఈ పరిస్థితులను తట్టుకునే స్థితిలో ఉన్నట్టు వెల్లడైంది.
రాజస్థాన్, చత్తీస్‌గడ్‌లలోని అన్ని జిల్లాలు దుర్భిక్షాన్ని ఏ మాత్రం తట్టుకోలేని విధంగా ఉంటే సిక్కింలోని నాలుగుజిల్లాలు తట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. గతేడాది ఐఐటీ గువహటి నిర్వహించిన మరోసర్వేలో దేశంలోని నాలుగు నదీపరీవాహక ప్రాంతాల్లో ఒకటి మాత్రమే (మొత్తం 22 బేసిన్లలో ఆరుమాత్రమే) కరువు సందర్భంగా పంటలతో పాటు పచ్చదనానికి తగిన సహకారాన్ని అందించగలిగినట్టు తెలిసింది. 2016లో ఐఐటీ గాంధీనగర్, కాన్పూర్ సంయుక్త అధ‍్యయనంలో గత కొన్నేళ్లుగా కరువు పరిస్థితులు పెరగడంతో తీవ్రత కూడా పెరుగుతున్నట్టు, గంగానది మైదాన ప్రాంతం, మధ్య మహారాష్ట్ర, దక్షిణ భారత తీరప్రాంతాల వైపు ఇవి కదులుతున్నట్టు వెల్లడైంది. పుణేలోని భారత వాతావరణ 2014లో జరిపిన విశ్లేషణ మేరకు దేశంలోని మొత్తం 103 వాతావరణ కేంద్రాల్లో 57 మార్చిజులై మధ్యలో వడగాల్పులు రికార్‌్డ చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని వివిధ ప్రాంతాలు ఏ మేరకు కరువు తట్టుకునేంత స్థాయిలో ఉన్నాయన్న దానిపై చేసిన పరిశీలనకు ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలోని జిల్లాల్లో ఎక్కడైతే అడవులు, పచ్చదనం శాతం ఎకు‍్కవగా ఉందో ఆయా ప్రాంతాల్లోనే దుర్భిక్షాన్ని తట్టుకునే పరిస్థితులున్నాయని ఈ అధ‍్యయనంలో మరోసారి రుజువైంది.
ఐఐటీ ఇండోర్, గువహటి బృందం ’డిస్ట్రిక్ట్‌లెవల్ అసెస్‌మెంట్ ఆఫ్ ఎకోహైడ్రోలాజికల్ రిసిలీయెన్స్ టు హైడ్రోక్లైమాటిక్ డిస్టర్‌బెన్సన్ అండ్ ఇట్స్ కంట్రోలింగ్ ఫాక్టర్స్ ఇన్ ఇండియా’ శీర్షికతో తమ అధ‍్యయనాన్ని ఇటీవల హైడ్రాలజీ జర్నల్‌లో ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment