‘పీఎం సూర్యఘర్’లో బలవంతంగా పేర్లు నమోదు
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూ.వేలల్లో బిల్లులు
ఒక్క ఏలూరు సర్కిల్‌లోనే 250 మందికిపైగా బాధితులు
బయటకు పొక్కకుండా చూడాలన్న ఫైనాన్స్ జీఎం
కరెంటు బిల్లులు బాగా పెరిగాయని బాధ పడకండి. మీ ఇంటినే ఓ గ్రిడ్‌గా మార్చుకునే అపురూప అవకాశం కల్పిస్తున్నాం. మీకు సరిపడా కరెంటును వాడుకుని, మిగిలిన కరెంటును మీరు అమ్ముకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ సిస్టం పెట్టుకోవడమే. – ఇటీవల సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే వరుసగా విద్యుత్ చార్జీలు పెంచేస్తూ రాష్ట్ర ప్రజలపై భారం వేస్తోంది. ఇప్పటికే రూ.15,485 కోట్లు వసూలు చేయడం ప్రారంభించింది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకంలో వచ్చే ప్రోత్సాహకాలను దక్కించుకోవడం కోసం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిస్కంలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో అధికారులు, సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించాయి. దీంతో వినియోగదారులతో బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారు. కానీ అలా రిజి్రస్టేషన్ చేసుకున్న వారికి ఈ నెల జారీ అయిన బిల్లులు చూసి గుండె ఆగినంత పనైంది. ప్రతి నెలా సాధారణంగా రూ.200 నుంచి రూ.500 వరకు వచ్చే బిల్లు రూ.5 వేలు, రూ.6 వేలు రావడంతో లబోదిబోమంటూ బాధితులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు.
ఇప్పటికే దాదాపు 250 మందికి పైగా వినియోగదారులు తమకు బిల్లులు అధికంగా వచ్చాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా, పీఎం సూర్యఘర్ పథకంలో రిజి్రస్టేషన్ చేయించుకున్న వారికి విద్యుత్ బిల్లులు భారీగా వచ్చినట్లు ఏపీఈపీడీసీఎల్ ఫైనాన్స్ విభాగం జనరల్ మేనేజర్ జీవీ అరుణకుమారి దృష్టికి అకౌంట్స్ విభాగం అధికారులు తీసుకెళ్లారు.
కార్పొరేట్ కార్యాలయం నుంచి శుక్రవారం అన్ని సర్కిళ్ల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన జీఎం.. తొలుత ఆ బిల్లులన్నింటినీ సిస్టమ్ నుంచి తొలగించాలని చెప్పినట్లు సమాచారం. అలాగే బిల్లులు అధికంగా వచి్చన విషయం మీడియా దృష్టికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించినట్లు కూడా తెలిసింది. దీనిపై జీఎంను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అరుణకుమారి ఫోన్‌లో స్పందించ లేదు.
Comments
Please login to add a commentAdd a comment