కొత్త సర్కిళ్లు ఎంతెంత దూరం? | About 23 thousand employees in the three DISCOMs | Sakshi
Sakshi News home page

కొత్త సర్కిళ్లు ఎంతెంత దూరం?

Published Fri, Aug 30 2024 3:45 AM | Last Updated on Fri, Aug 30 2024 3:45 AM

About 23 thousand employees in the three DISCOMs

రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో దాదాపు 23 వేల మంది సిబ్బంది 

26 జిల్లాలకు పెరిగినా ఇంకా పాత విధానంలోనే కార్యకలాపాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు దాదాపు 1.92 కోట్ల విద్యుత్‌ వినియోగదారులకు సేవలందిస్తు­న్నా­యి. గత ప్రభుత్వంలో 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారు. అప్పట్లో ఈ కొత్త జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుకాగా.. వీటికి అధికారులను, సిబ్బందిని నియ­మించలేదు. కానీ, 13 జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియ­మి­ంచారు. 

అలాగే, రాష్ట్రంలోని మూడు డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది పనిచేస్తున్నారు. వీరినే పాత, కొత్త డివిజన్లకు సర్దుబాటుచేసే అవకాశం ఉంది. కొత్త సర్కిళ్లు ఏర్పడితే విద్యుత్‌ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయి. తాజా బదిలీల్లోనైనా ఆ పని జరిగితే తమకు పదోన్నతులతో పాటు కోరుకున్న చోట పోస్టింగ్‌ వచ్చే వీలు కలుగుతుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.  

ఇంకా అనుమతి రాలేదు.. 
ఇక రాష్ట్రంలో దూరం (కిలోమీటర్లు), హెచ్‌టీ సర్వీసులు, ఎల్‌టీ సర్వీసులు, డి్రస్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, వాటి సామ­­ర్థ్యం, సబ్‌స్టేషన్ల సంఖ్య, నెలకు వచ్చే సగటు ఆదా­యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్‌ సర్కిళ్ల విస్తరణ చర్యలను చేపట్టాలని డిస్కంలు భావిస్తు­న్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న పోస్టుల్లోనూ మా­ర్పు­లు చేస్తున్నాయి. గతంలో విజయవాడ కేంద్రంగా చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) పోస్టు ఒకటి ఉండేది. ప్రాంతీయ కేంద్రం (జో­నల్‌ ఆఫీసర్‌)గా ఈ పోస్టులో ఓ అధికారి ఉండేవారు. 

ఏపీఎస్పీడీసీఎల్‌ ఏర్పడ్డాక ఆ పోస్టు అవసరంలేకుండా పో­యింది. ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఆ తరహా పోస్టును రాజమహే­ంద్రవరం కేంద్రంగా ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన తెరపైకి వచి్చనా ప్రస్తుతానికి అది ఆగింది. అలాగే, రెవిన్యూ కా­ర్యాలయా (ఈఆర్వో)ల్లో సిబ్బందిని పునరి్వభజన (రీ డిప్లా­యి­మెంట్‌) పేరుతో సెక్షన్‌ కార్యాలయాలకు బదిలీ చేస్తు­న్నా­యి.

ఒక్క ఏపీఈపీసీడీసీఎల్‌లోనే ఈ విధంగా ఐదు జూని­యర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (జేఏఓ), 126 సీనియర్‌ అసిస్టెంట్స్‌ (ఎస్‌ఏ), 131 జూనియర్‌ అసిస్టెంట్స్‌ (జేఏ) పోస్టులను మారుస్తున్నారు. అయితే, కొత్త సర్కిళ్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభు­త్వం నుంచి ఇంతవరకూ అనుమతి రాలేదని, తామూ దానికోస­మే ఎదురుచూస్తున్నామని డిస్కంల సీఎండీలు చెబుతున్నారు. 

దృష్టిపెట్టని కూటమి సర్కారు 
కొత్త జిల్లాలు ఏర్పడినా డిస్కంలు ఇప్పటికీ పాత పద్ధతిలోనే విద్యుత్‌ పంపిణీ, బిల్లుల జారీ వంటి అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రతి జిల్లా­లోనూ ఒక ఆపరేషన్‌ సర్కిల్‌ కార్యాలయం ఉంది. ఇక్కడ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) జిల్లా అధికారిగా వ్యవహరిస్తున్నారు. 

గత ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాలకు ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ (ఈఈ) స్థాయి అధికారులను ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా డిజి­గ్నే­షన్‌ను మార్చి వారిని ఆపరేషన్‌ డివిజన్‌ అధికారులు­గా నియమించారు. వీరితో పాటు ఇతర సిబ్బందిని కూడా నియమించాల్సి ఉన్నా కూటమి ప్రభు­త్వం ఇంతవరకూ ఆ దిశగా దృష్టి సారించడంలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement