incharges
-
కొత్త సర్కిళ్లు ఎంతెంత దూరం?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు దాదాపు 1.92 కోట్ల విద్యుత్ వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. గత ప్రభుత్వంలో 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారు. అప్పట్లో ఈ కొత్త జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుకాగా.. వీటికి అధికారులను, సిబ్బందిని నియమించలేదు. కానీ, 13 జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. అలాగే, రాష్ట్రంలోని మూడు డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది పనిచేస్తున్నారు. వీరినే పాత, కొత్త డివిజన్లకు సర్దుబాటుచేసే అవకాశం ఉంది. కొత్త సర్కిళ్లు ఏర్పడితే విద్యుత్ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయి. తాజా బదిలీల్లోనైనా ఆ పని జరిగితే తమకు పదోన్నతులతో పాటు కోరుకున్న చోట పోస్టింగ్ వచ్చే వీలు కలుగుతుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకా అనుమతి రాలేదు.. ఇక రాష్ట్రంలో దూరం (కిలోమీటర్లు), హెచ్‌టీ సర్వీసులు, ఎల్టీ సర్వీసులు, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, వాటి సామర్థ్యం, సబ్స్టేషన్ల సంఖ్య, నెలకు వచ్చే సగటు ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సర్కిళ్ల విస్తరణ చర్యలను చేపట్టాలని డిస్కంలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న పోస్టుల్లోనూ మార్పులు చేస్తున్నాయి. గతంలో విజయవాడ కేంద్రంగా చీఫ్ ఇంజనీర్ (సీఈ) పోస్టు ఒకటి ఉండేది. ప్రాంతీయ కేంద్రం (జోనల్ ఆఫీసర్)గా ఈ పోస్టులో ఓ అధికారి ఉండేవారు. ఏపీఎస్పీడీసీఎల్ ఏర్పడ్డాక ఆ పోస్టు అవసరంలేకుండా పోయింది. ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఆ తరహా పోస్టును రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన తెరపైకి వచి్చనా ప్రస్తుతానికి అది ఆగింది. అలాగే, రెవిన్యూ కార్యాలయా (ఈఆర్వో)ల్లో సిబ్బందిని పునరి్వభజన (రీ డిప్లాయిమెంట్) పేరుతో సెక్షన్ కార్యాలయాలకు బదిలీ చేస్తున్నాయి.ఒక్క ఏపీఈపీసీడీసీఎల్లోనే ఈ విధంగా ఐదు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ), 126 సీనియర్ అసిస్టెంట్స్ (ఎస్ఏ), 131 జూనియర్ అసిస్టెంట్స్ (జేఏ) పోస్టులను మారుస్తున్నారు. అయితే, కొత్త సర్కిళ్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకూ అనుమతి రాలేదని, తామూ దానికోసమే ఎదురుచూస్తున్నామని డిస్కంల సీఎండీలు చెబుతున్నారు. దృష్టిపెట్టని కూటమి సర్కారు కొత్త జిల్లాలు ఏర్పడినా డిస్కంలు ఇప్పటికీ పాత పద్ధతిలోనే విద్యుత్ పంపిణీ, బిల్లుల జారీ వంటి అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ ఒక ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం ఉంది. ఇక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) జిల్లా అధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాలకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఈఈ) స్థాయి అధికారులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా డిజిగ్నేషన్‌ను మార్చి వారిని ఆపరేషన్ డివిజన్ అధికారులుగా నియమించారు. వీరితో పాటు ఇతర సిబ్బందిని కూడా నియమించాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం ఇంతవరకూ ఆ దిశగా దృష్టి సారించడంలేదు. -
రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్‌ల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు నియామకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్‌ల నియామకం జరిగింది.వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిలను నియమించారు.కాగా, ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. -
టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సెగ్మెంట్లకు ఇంఛార్జీలను ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు భవనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణారావు ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నల్గొండ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరంగల్-రేవూరి ప్రకాశ్‌రెడ్డి మహబూబాబాద్-తుమ్మల నాగేశ్వర్రావు నిజామాబాద్- సుదర్శన్‌రెడ్డి ఆదిలాబాద్-సీతక్క కరీంనగర్- పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి-శ్రీధర్‌బాబు హైదరాబాద్-ఒబెదుల్లా కొత్వాల్ సికింద్రాబాద్-కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహబూబ్‌నగర్-సంపత్, చేవెళ్ల-వేం నరేందర్‌రెడ్డి మల్కాజ్గిరి-మైనంపల్లి హన్మంతరావు మెదక్- కొండా సురేఖ జహీరాబాద్-దామోదర రాజనర్సింహ -
YSRCP ఇంచార్జిల మరో అధికార జాబితా
-
వైఎస్సార్సీపీ మరో జాబితా విడుదల
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ పదకొండవ జాబితా విడుదల అయ్యింది. రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిలను ప్రకటిస్తూ శుక్రవారం సాయంత్రం అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్‌ను నియమించింది. అలాగే.. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఇటీవలె పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటివరకు విడుదలైన 11 జాబితాల వారీగా చూస్తే.. 75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జిల జాబితాల్ని వైఎస్సార్సీపీ విడుదల చేసింది . ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచి పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. -
YSRCP: వైఎస్సార్సీపీ 9వ జాబితా విడుదల
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్సీపీ.. తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది. అలాగే.. కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతియాజ్(రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది. ఇంతియాజ్ ఈ మధ్యే వీఆర్ఎస్ తీసుకుని వైఎస్సార్సీపీలో చేరారు. తాజాగా మంగళగిరిలో జరిగిన వైఎస్సార్సీపీ కీలక సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కోసం పార్టీ తరఫున ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తైందని.. ఒకటిరెండు మార్పులు తప్పించి ఇప్పటిదాకా ప్రకటించిన ఇన్‌ఛార్జిలకే టికెట్లు దాదాపు ఖాయమని ప్రకటించారు. ఇప్పటివరకు విడుదలైన తొమ్మిది జాబితాల వారీగా చూస్తే.. 74 అసెంబ్లీ స్థానాలకు, 21 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జిల జాబితాల్ని వైఎస్సార్సీపీ విడుదల చేసింది . తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ), ఐదో జాబితాలో 7 స్థానాలకు(4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్సీపీ. ఆరో జాబితాలో 10 స్థానాలకు(4 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాలకు).. ఏడో జాబితాలో 2 అసెంబ్లీ స్థానాలకు, ఎనిమిదో జాబితాలో 5 (2 ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు).. తాజాగా తొమ్మిదో జాబితాలో 3 స్థానాలకు(ఒకటి పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను నియమిస్తూ/మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్సీపీ. ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచి పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. -
వైఎస్ఆర్ సీపీ ఇన్ చార్జ్ ల 8వ జాబితా విడుదల
-
YSRCP ఐదో జాబితా విడుదల
గుంటూరు, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. అసెంబ్లీ నియోజకవర్గాలకు,పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్సార్సీపీ ఐదో జాబితాను విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత.. మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్రకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంఛార్జిల మార్పును ప్రకటించారు. ఐదో విడతలో.. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిల మార్పును ప్రకటించారు వాళ్లు. నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్‌కు ప్రమోషన్ దక్కింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది పార్టీ. ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్సీపీ. బాధ్యతలు కూడా.. పార్టీ ఐదో జాబితా విడుదల చేసే క్రమంలో.. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి(రాజ్యసభ సభ్యులు)కి అదనంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పజెప్పింది. అలాగే.. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ రీజినల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించింది వైఎస్సార్సీపీ. వైఎస్సార్సీపీ తొలి జాబితా ఇదే వైఎస్సార్సీపీ రెండో జాబితా ఇదే! వైఎస్సార్సీపీ మూడో జాబితా ఇదే! వైఎస్సార్సీపీ నాలుగో జాబితా ఇదే! -
TS BJP: పలు జిల్లాలకు అధ్యక్షుల మార్పు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పలు జిల్లాల అధ్యక్షులను మార్చింది. పలు జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. అలాగే, కొత్తగా ఆరుగురు బీజేపీ మోర్చా అధ్యక్షులను కూడా నియమించింది. వివరాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ నాయకత్వం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పలు జిల్లాల అధ్యక్షులను మార్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులకు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి సమాచారమందించారు. కొత్తగా నియమితులైన ఆరు మోర్చాలా అధ్యక్షులు ఎస్టీ మోర్చా - కల్యాణ్ నాయక్ ఎస్సీ మోర్చా - కొండేటి శ్రీధర్ యువ మొర్చా - మహేందర్ OBC మోర్చా - ఆనంద్ గౌడ్ మహిళ మోర్చా - డాక్టర్ శిల్పా కిసాన్ మోర్చా - పెద్దోళ్ల గంగారెడ్డి. కొత్త అధ్యక్షులు వీరే.. నిజామాబాద్ - దినేష్ కుమార్ పెద్దపల్లి - చందుపట్ల సునీల్ సంగారెడ్డి - గోదావరి అంజిరెడ్డి సిద్దిపేట - మోహన్ రెడ్డి యాదాద్రి - పాశం భాస్కర్ వనపర్తి - డి నారాయణ వికారాబాద్ - మాధవరెడ్డి నోల్గొండ - డాక్టర్ వర్షిత్ రెడ్డి ములుగు - బలరాం మహబూబ్ నగర్ - పీ శ్రీనివాస్ రెడ్డి వరంగల్ - గంట రవి నారాయణపేట - జలంధర్ రెడ్డి. -
TS: స్పీడ్ పెంచిన బీజేపీ.. పొలిటికల్ ఇంచార్జీల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు వ్యూహ రచనలు చేస్తున్నారు. నేడు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది కమిటీ నేతల భేటీ జరిగింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ పొలిటికల్ ఇంచార్జీలను తెలంగాణ బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంఛార్జ్‌లు వీరే.. ►హైదరాబాద్- రాజసింగ్ ►సికింద్రాబాద్- లక్ష్మణ్ ►చేవెళ్ల- ఎమ్మెల్సీ వెంకట్ నారాయణ రెడ్డి ►మల్కాజిగిరి- పైడి రాకేష్ రెడ్డి ►అదిలాబాద్- పాయాల్ శంకర్ ►పెద్దపల్లి- రామారావు పటేల్ ►కరీంనగర్- ధన్ పాల్ సూర్యనారాయణ ►నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి ►జహీరాబాద్- వెంకట రమణ రెడ్డి ►మెదక్- పాల్వాయి హరీష్ ►మహబూబ్ నగర్- రామచందర్ రావు ►నాగర్ కర్నూలు- మాగం రంగారెడ్డి ►నల్గొండ- చింతల రామచంద్రారెడ్డి ►భువనగిరి - NVSS ప్రభాకర్ ►వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి ►మహబూబాబాద్ - గరికపాటి మోహన్ రావు ►ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి -
అభ్యర్ధుల మార్పులు, చేర్పులతో సీఎం జగన్ దూకుడు..విపక్షం విలవిల
-
ఇంచార్జిలు మార్చగానే ఎందుకంత భయం ?
-
వైఎస్సార్ సీపీ ఇంచార్జిల రెండో జాబితా విడుదల
-
YSRCP: 11 నియోజకవర్గాల ఇంఛార్జిల మార్పు
సాక్షి, గుంటూరు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్సీపీ ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో.. పలు నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జిలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను సోమవారం సాయంత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాకు తెలియజేశారు. పదకొండు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జీలను నియమించినట్లు తెలిపారాయన. స్థాన చలనం జాబితాలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. గుంటూరు పశ్చిమ- విడదల రజిని, మంగళగిరి-గంజి చిరంజీవి, పత్తిపాడు-బాలసాని కిషోర్ కుమార్, వేమూరు- అశోక్‌బాబు, సంతనూతలపాడు -మేరుగ నాగార్జున, తాడికొండ-మేకతోటి సుచరిత, కొండెపి -ఆదిమూలపు సురేష్, చిలకలూరిపేట- రాజేష్ నాయుడు, అద్దంకి -పాణెం హనిమిరెడ్డి, రేపల్లె -ఈవూరు గణేష్, గాజువాక-వరికూటి రామచంద్రరావులను నియమించినట్లు తెలిపారు. ‘‘రేపటి నుండి పార్టీ వ్యవహారాలను వీరంతా పర్యవేక్షిస్తారు. పార్టీ ఎవరినీ వదులుకోదు. అందరి సేవలనూ వినియోగించుకుంటాం. 175కి 175 సీట్లు సాధించాలనే లక్ష్యంతో పని చేస్తాం. అణగారినవారికి ధైర్యం ఇచ్చి పని చేస్తున్నాం. ఏదో మాటలు చెప్పి చేయటం లేదు. ఏపీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే ప్రతిపాదికన ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని బొత్స పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంకా.. ఈ మార్పుతో 2024 ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల తెలిపారు. నేతల గెలుపు అవకాశాల్ని బట్టి ఇంఛార్జిలను మార్చామని స్పష్టత ఇచ్చారు. ‘అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించాలి. అందుకోసమే సీఎం జగన్ ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది. భవిష్యత్తులో కూడా అవసరాన్ని మార్పులు ఉంటాయ’ని సజ్జల ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసుకుని, ఎన్నికలకు శ్రేణులను నడిపించే సమర్థత ఉన్నవారిని ఇంచార్జులుగా నియమిస్తున్నామన్నారు. pic.twitter.com/6fHPp7cg3Y — YSR Congress Party (@YSRCParty) December 11, 2023 ‘‘పార్టీ పుట్టినప్పటి నుండి ప్రజల కోసమే పనిచేస్తున్నాం. అది మా బాధ్యతగా చూస్తున్నాం. పార్టీకి ఎవరు ఎక్కడ అవసరమో అక్కడ వారిని నియమిస్తున్నాం. అధికారంలోకి రావాలంటే సమీక్షలు అవసరం. సీఎం జగన్ చాలా ఓపెన్‌గా ముందునుండే చెప్తున్నారు. అన్నీ శాస్త్రీయంగా పరిశీలించాకనే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మార్చిన ఈ 11 మంది గెలవరని కాదు.. ఇంకా మెజారిటీతో గెలవాలన్నదే మా ఆలోచన. ప్రతిపక్షానికి ఒక దారీతెన్నూ లేకుండా పోతోంది. ఎక్కడ ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి వారిది. కానీ మా(వైఎస్సార్సీపీ) పార్టీలో అన్నీ చర్చించే నిర్ణయం తీసుకుంటాం’’ అని సజ్జల పేర్కొన్నారు. -
లీడర్‌కు కే‘డర్’
అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి రాజకీయ వలసలు అన్ని పార్టీల్లోనూ నిత్యకృత్యంగా మారాయి. దిగ్గజ నేతలు మొదలుకొని క్షేత్రస్థాయి కార్యకర్త వరకు పార్టీని వీడటం అన్ని పార్టీల్లోనూ రివాజుగా మారింది. టికెట్ల కేటాయింపుపర్వం అన్ని రాజకీయ పక్షాల్లోనూ ప్రకంపనలు సృష్టించగా, భంగపడిన ఆశావహులు సొంతపార్టీని వీడి ప్రత్యర్థి పార్టీలోకి చేరిపోయారు. తమ టికెట్ ఎగురేసుకు వెళ్లిన అభ్యర్థులను ఓడిస్తామంటూ శపథం చేస్తూ ఎదుటి పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇక టికెట్ దక్కించుకున్న నేతలు ఎదుటి శిబిరాలపై కన్నేసి క్షేత్రస్థాయి కేడర్‌ను లాక్కునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా తాయిలాలు ఎర వేస్తూ తమవైపు లాక్కునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇక మరోవైపు ఉన్న సొంతకేడర్ను కాపాడుకునేందుకూ తంటాలు పడుతున్నారు. స్థానికంగా జనంలో కాస్త పలుకుబడి ఉన్న నేతలకు సైతం పార్టీ మారాల్సిందిగా వివిధ పక్షాల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఎటూ తేల్చుకోలేని కిందిస్థాయి నేతలు కొందరు ఫోన్లు బంద్ పెట్టుకొని అందుబాటులో లేకుండా పోతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. స్థానిక సంస్థల ప్రతినిధులకు గిరాకీ... ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు క్షేత్రస్థాయి కేడర్ చేరికలపై అన్ని పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. వలసలను ప్రోత్సహించే క్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన వార్డు మెంబర్లు మొదలు ఉప సర్పంచ్‌లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, చైర్మన్లు, స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు గిరాకీ ఏర్పడింది. పార్టీ నిర్ణయానికి కంకణబద్ధులైన స్థానిక సంస్థల ప్రతినిధులు కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులతో తమకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారు. మరికొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతోనూ బేరసారాలు సాగిస్తున్నారు. వలసలను అరికట్టే క్రమంలో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే అడ్వాన్సు రూపంలో కొంత మేర చెల్లింపులు పూర్తి చేశారు. అయినా సంతృప్తి చెందని కొందరు క్షేత్ర స్థాయి నేతలు, కేడర్ ఎదుటి పార్టీ అభ్యర్థులతో మంతనాలు జరుపుతుండటం సొంత పార్టీ అభ్యర్థులకు తలనొప్పులు తెచ్చి పెడుతోంది. కొందరు కిందిస్థాయి నాయకులు అడ్వాన్సులు పుచ్చుకుని కూడా పార్టీలు మారుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కొత్త కేడర్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్లో కింది స్థాయిలో వీరిదే ప్రధాన పాత్ర కావడంతో తమకు విధేయతతో పనిచేసే కేడర్ కోసం నేతలు వెతుకులాట ముమ్మరం చేస్తున్నారు. సొంత సైన్యం మోహరింపు క్షేత్రస్థాయిలో కేడర్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందు కు ఎమ్మెల్యే అభ్యర్థులు తమ సొంత సైన్యాన్ని మండలాల వారీగా మోహరింపజేశారు. ఓవైపు పార్టీ నేతలకు మండలాలు, కీలక గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగిస్తూనే తమ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నారు. బీఆర్ఎస్ లాంటి పార్టీలు కీలక నియోజకవర్గాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాయి. వారు తమ అనుచరగణంతో కేటాయించిన మండలాల్లో మకాం వేసి కేడర్ సమన్వయం, ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ తదితరాల్లో అభ్యర్థులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్లో అత్యంత కీలకమైన డబ్బు, మద్యం పంపిణీ బాధ్యతలను అభ్యర్థులు తమ సొంత సైన్యానికే అప్పగిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తమకు నమ్మకస్తులైన వారి ఇళ్లు, ఇతర ప్రదేశాల్లో మద్యం డంప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నగదు తరలింపులో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కీలక స్థావరాలకు చేర్చినట్లు సమాచారం. అయితే కొన్ని చోట్ల పార్టీ ఇన్‌చార్జ్‌లు, అభ్యర్థుల నడుమ కూడా సమన్వయ లోపం తలెత్తుతోంది. -కల్వల మల్లికార్జున్ రెడ్డి -
పదేళ్ల అభివృద్ధితో ప్రజల్లోకి..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు అన్ని నియోజకవర్గాల్లో సానుకూల వాతావరణం ఉందని, పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతీ గడపకు తీసుకెళ్లాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ఎన్నికల సమన్వయం కోసం నియమించిన 54 మంది నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిలతో మంత్రి హరీశ్‌రావుతో కలిసి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేశారు. పదేళ్ల పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతీ ఒక్కరితో మమేకమయ్యేలా పార్టీ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలిచ్చేందుకు వేదికలు మాత్రమేనని, బీఆర్ఎస్కు మాత్రం తాము చేసిన అభివృద్ధిని వివరించే అద్భుత అవకాశమన్నారు. ఇన్చార్జిలు తక్షణమే రంగంలోకి దిగి ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సహకారం అందించండి: హరీశ్ రాబోయే 45 రోజులపాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో ప్రచారం పకడ్బందీగా ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, ఆ దిశగా ఈ 45 రోజులపాటు విస్తృతంగా పనిచేయాలని ఇన్చార్జిలకు హరీశ్ విజ్ఞప్తి చేశారు. -
54 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఇంచార్జ్‌ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తొలి విడతగా 54 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్‌ల జాబితాను గురువారం.. బీఆర్ఎస్ విడుదల చేసింది. పార్టీ ఇంచార్జ్‌లతో జరిగిన టెలి కాన్ఫరెన్స్ సమావేశంలో కేటీఆర్.. వారికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితికి అద్భుతమైన సానుకూల వాతావరణం ఉందన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్ధానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికి బ్రహ్మరథం పడుతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణ పైన పార్టీ ఇంచార్జీలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని ఓట్లు అడగాలని, ఇందుకోసం 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు తీసుకువెళ్లాలని పార్టీ ఇంచార్జ్‌లకు కేటీఆర్ సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని పార్టీ నాయకులకు సూచించారు. -
తిరుగుబాటు చేస్తారా? సైలెంట్‌గా ఉండిపోతారా?
ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను మారుస్తారనే వార్తలు పార్టీలో కలకలం రేపుతున్నాయా? పార్టీ కోసం కష్టపడిన నేతలను పక్కన పెట్టాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ఇంతకాలంగా కష్టపడుతున్న తమను తొలగిస్తే సహించబోమంటూ తిరుగుబాటు చేస్తారా? అలాగే సైలెంట్‌గా ఉండిపోతారా? అసలు ఈ మార్పుల వల్ల నష్టం జరిగేదెవరికి? ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో అనిశ్చితి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం సీట్లు ఇస్తానని భరోసా ఇవ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. రూరల్ జిల్లాలోని ఇన్చార్జిల్లో కొంతమందిని తప్పించడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్‌లకు సీట్లు ఓకే, మరి తమ పరిస్థితి ఏంటని మిగతా నేతలు ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్ళుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలు నిర్వహించామని, తమను ఎలా తప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్టీని కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డామని, కీలక సమయంలో హ్యాండిస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏంకావాలంటూ ఆందోళన చెందుతున్నారు. హైకమాండ్ నిర్ణయాలకు అనుగుణంగానే తమ రియాక్షన్ వుంటుందనే స్ట్రాంగ్ సంకేతాలు పంపుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను..నగర పరిధిలో ఉన్న నాలుగు సీట్లను టిడిపి గెలుసుకుంది. రూరల్‌లోని 11 స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధించింది. పరిపాలనా రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు తీరును తప్పుబడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపికి గుడ్ బై చెప్పారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబులు తమ స్థానాల నుంచి మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రతి సారి నియోజకవర్గాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సారి నార్త్ నియోజకవర్గం నుంచి కాకుండా..భీమిలి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దీనికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భీమిలి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు అలెర్ట్ అయ్యారు. నాలుగేళ్ళుగా పార్టీని మోస్తుంటే.. ఇప్పుడెవరికో టిక్కెట్ ఇస్తే మేము చూస్తూ ఊరుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల తర్వాత చోడవరంలో బత్తుల తాతయ్య బాబుకు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఓడిపోయాక నియోజకవర్గంలో కనిపించని మాజీ ఎమ్మెల్యే రాజు యాక్టివేట్ అవుతున్నారు. తమ సీటును రాజుకు సీటు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలంతా చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. విశాఖ సౌత్ లో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. అయితే గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ తోడల్లుడు భరత్ విశాఖ సౌత్ సీటును ఆశిస్తున్నారు. గండి బాబ్జితో కలిసి భరత్ కూడా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆఖరి నిముషంలో బీసీ వర్గానికి చెందిన గండి బాబ్జికి గండి కొట్టడం ఖాయమనే టాక్ ఇప్పుడు నడుస్తోంది. ఇక యలమంచిలిలో ఇన్చార్జ్గా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు సీటును పొత్తులో భాగంగా జనసేన ఆశిస్తోంది. మాడుగుల నియోజకవర్గ టీడీపీలో అయితే మూడు ముక్కలాట నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, ఇన్చార్జ్ పీవీజీ కుమార్, NRI పైలా ప్రసాదరావులు సీటు ఆశిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తనను కాదని పార్టీకి కోటి రూపాయలు ఇచ్చాడని.. ముక్కు మొహం తెలియని పి వి జి కుమార్‌కు గాని సీటు ఇస్తే కచ్చితంగా రెబల్‌గా బరిలో ఉండాలని రామానాయుడు నిర్ణయించుకున్నారు. ఎన్నికల కాలం దగ్గరపడుతుండటంతో నాలుగేళ్ళుగా పార్టీ కోసం కష్టపడినవారిని పక్కన పెడితే ధిక్కరించడానికి సిద్ధమని పలువురు ఇన్‌చార్జ్‌లు పార్టీ నాయకత్వానికి సంకేతాలు పంపిస్తున్నారు. -
బన్సల్‌కే బాధ్యతలన్నీ..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీని చక్కదిద్దేపనిలో భాగంగా అటు రాజకీయ వ్యవహారాలు, ఇటు సంస్థాగత అంశాలకు సంబంధించిన బాధ్యతలను ఒక్కరికే అప్పగించే దిశలో బీజేపీ జాతీయ నాయకత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. నలుగురైదుగురు ఇన్చార్జీలు కాకుండా ఒక్కరికే పూర్తిస్థాయి ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చనే అంచనాకు వచ్చినట్టు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికలతో పాటు, యూపీలో పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకుని రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన సునీల్ బన్సల్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అసంతృప్తిని చల్లార్చే చర్యలేవీ..? తెలంగాణకు ఏకంగా నలుగురైదురు ఇన్చార్జీలను నియమించి వారి ద్వారానే జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి ఎన్నికల దిశానిర్దేశం చేస్తున్న సంగతి విదితమే. జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జిగా, మరో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జిగా కొనసాగుతుండగా మరో ఇద్దరు జాతీయ నేతలు శివప్రకాష్, అర్వింద్ మీనన్‌లు కూడా ఇన్చార్జిలుగా ఉన్నారు. వీరంతా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు దాదాపు ఆరేడు నెలలుగా వివిధ కార్యక్రమాలు, పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గత 20, 30 ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేసిన సీనియర్లకు సరైన ప్రాధాన్యత, గౌరవం లేదని, వారికి తగిన బాధ్యతలు కూ డా ఇవ్వడం లేదన్నది ప్రధాన విమర్శ. కాగా సొంత ప్రచారానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీ నాయకుల్లో అసంతృప్తి వివిధ సందర్భాల్లో బయటపడుతున్నా ఈ సమస్యను అధిగమించే దిశగా ఇన్చార్జిలు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని అసంతృప్త నేతలు భావిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న జాతీయ నాయకత్వం ఒక్కరికే పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. కేడర్‌లో స్తబ్ధత తొలిగేలా చర్యలు.. ప్రస్తుతం పార్టీలో పాత, కొత్తనేతల మధ్య సమన్వయలేమి, క్షేత్రస్థాయిలో ఎదురౌతున్న సమస్యలతో కేడర్‌లోనూ కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంత స్తబ్ధత కూడా నెలకొంది. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై, ముఖ్య నేతల వ్యవహారశైలి, అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం కావడం, అసమ్మతి కార్యక్రమాలకు తావిచ్చేలా కొందరు వ్యవహరించడం వంటివి క్రమశిక్షణా రాహిత్యంగా జాతీయ నాయకత్వం పరిగణిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో వివిధ స్థాయి నాయకుల్లో అసంతృప్తిని, ముఖ్యంగా కిందిస్థాయి కేడర్‌లో ఏర్పడిన స్తబ్ధతను తొలగించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. పార్టీ క్రమశిక్షణ గీతను దాటుతున్న వారికి, పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని హెచ్చరించడంతో పాటు ఒకరిద్దరిపై క్రమశిక్షణ చర్యలకు కూడా దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. ఈ మేరకు త్వరలో చేపట్టబోయే చర్యలపై రాష్ట్ర ముఖ్య నేతలకు సంకేతాలు కూడా అందినట్టు తెలుస్తోంది. -
తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత!
సాక్షి, అమరావతి : రాజకీయ పార్టీ అంటే నాయకులుండాలి. క్షేత్ర స్థాయి నుంచి పైస్థాయి వరకు కొరత లేకుండా నాయకులు ఉంటేనే ఏ పార్టీ అయినా ఎన్నికల్లో నిలబడగలుగుతుంది. కానీ, అసలు నియోజకవర్గ స్థాయి నేతలు కూడా లేని పార్టీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని, అదీ ముందస్తు ఎన్నికలు వచ్చినా మాకేం పరవాలేదు అంటూ బీరాలు పలికితే.. ఆ పార్టీ టీడీపీ అవుతుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అవుతారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనను చూసి రాజకీయ నేతలు, విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయమిది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో టీడీపీ కేడర్, నేతలు కనుమరుగైపోయారు. పలు నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు లేక, పార్టీ కార్యక్రమాలను పట్టించుకునే నాథుడే లేక చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నారు. కొత్త వారిని ప్రోత్సహిస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 50కి పైగా నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్‌ఛార్జిలే లేరు. మిగిలిన చోట్లా సగానికిపైగా నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు, నేతలు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణాలోనూ నాయకుల కొరత టీడీపీకి గట్టి పట్టున్నట్టు చెప్పుకొనే కృష్ణా జిల్లాలోనే నాయకుల కొరత ఏర్పడింది. గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జిగా మచిలీపట్నానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. అయినా ఆయన గన్నవరం వైపు పెద్దగా వెళ్లడంలేదు. విజయవాడ పశ్చిమలో జలీల్‌ఖాన్, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వంటి వారు పార్టీని నడిపించలేకపోతుండడంతో ఏంచేయాలో బాబుకు పాలుపోవడంలేదు. కైకలూరులోనూ నాయకుల కొరత వేధిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పోలవరం నియోజకవర్గాల్లో కొత్త నాయకుల కోసం వెదుకుతున్నారు. మాజీ మంత్రి జవహర్ కొవ్వూరుతో పాటు దూరంగా ఉన్న కృష్ణా జిల్లా తిరువూరులోనూ తిరగాల్సిన పరిస్థితి. ఆయన ఏ నియోజకవర్గానికి ఇన్చార్జో అర్థం కాక పార్టీ కేడర్ తలలు పట్టుకుంటోంది. విజయనగరం జిల్లా కురుపాం, నెల్లిమర్ల ఇన్‌ఛార్జిలు పతివాడ నారాయణస్వామి, శత్రుచర్ల విజయరామరాజులకు వయసు పైబడడంతో బయటకు రావడమే లేదు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని పాడేరు, అరకు, మాడుగుల నియోజకవర్గాల్లో సరైన నాయకులే లేరు. పట్టించుకునే వారు ఎవరు? గుంటూరు జిల్లాలో వేమూరు, సత్తెనపల్లిలో టీడీపీని ఎవరు నడిపిస్తున్నారో అర్థంకాని పరిస్థితి. సత్తెనపల్లిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడిని పార్టీ కేడర్ అంగీకరించడంలేదు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, రంపచోడవరం, గన్నవరం నియోజకవర్గాల్లో సరైన నాయకులే లేరు. చీరాల, నెల్లూరులోనూ ఇదే పరిస్థితి. నెల్లూరు నగరంలోనే పార్టీని పట్టించుకునే వారు కనిపించడంలేదు. ఇటీవల జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క కార్పొరేటర్ పదవి కూడా రాలేదు. రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరీ ఘోరంగా తయారైందని టీడీపీ నేతలు వాపోతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, కోడూరు, బద్వేలు, ప్రొద్దూటూరు నియోజకవర్గాలకు నాయకులు లేరు. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో శింగనమల, అనంతపురం అర్బన్, మడకశిరలో నాయకత్వ సమస్య ఉంది. చిత్తూరు జిల్లా పుంగనూరు, సత్యవేడు, పూతలపట్టు వంటి చోట్ల నాయకులు లేరు. ఈ నేతలు చేతులెత్తేశారా! ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిలు కూడా చురుగ్గా పనిచేయడంలేదు. వీరిలో చాలా మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్సార్సీపీ నేతల దూకుడును తట్టుకోలేక అనేక మంది చేతులెత్తేసిన వాతావరణం కనిపిస్తోంది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి పుల్లారావు, నెల్లూరులో నారాయణ, ఏలూరులో మాజీ మంత్రి మాగంటి బాబు, విశాఖలో గంటా శ్రీనివాసరావు, విజయనగరంలో సుజయకృష్ణ రంగారావు, కర్నూలులో కేఈ కృష్ణమూర్తి వంటి నేతలు అసలు పార్టీ వైపే పెద్దగా కన్నెత్తి చూడడంలేదు. ఈ నేపథ్యంలో కొత్త తరాన్ని ప్రోత్సహిస్తామని, కొత్త నాయకులకు అవకాశం ఇస్తామని చంద్రబాబు ప్రతి సమావేశంలోనూ చెబుతున్నారు. పని చేయకపోతే ఇన్చార్జిలను మారుస్తామని చెప్పడం వెనుక తెలుగుదేశం పారీ్టలో ఉన్న నాయకత్వ కొరతను తేటతెల్లం చేస్తోంది. -
స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని ఓవైపు డిమాండ్ చేస్తూనే మరోవైపు ఆ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఇప్పటికే ప్రారంభించిన ఆ పార్టీ, తాజాగా జిల్లాలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమించింది. పూర్వపు జిల్లాల వారీగా నియమితులైన ఇన్‌చార్జ్‌లు, వాటి పరిధిలోని కొత్త జిల్లాల్లో ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేయనున్నారు. ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫామ్స్‌ను వారే జారీ చేస్తారని బీజేపీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇన్‌చార్జ్‌లు వీరే చింతా సాంబమూర్తి: రంగారెడ్డి, జి. ప్రేమేందర్ రెడ్డి: కరీంనగర్, డాక్టర్ జి.మనోహర్ రెడ్డి: మహబూబ్‌నగర్, ఎండల లక్ష్మీనారాయణ:ఆదిలాబాద్, చింతల రామచంద్రా రెడ్డి: వరంగల్, పేరాల శేఖర్ రావు: మెదక్, వెంకటరమణి: నిజామాబాద్, ఎం.ధర్మారావు: నల్గొండ, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు: ఖమ్మం -
బూత్ కమిటీలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ప్రచార గడువు ముగింపుకొస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు బూత్‌కమిటీలపై దృష్టి పెట్టాయి. పోలింగ్‌కు ముందు రెండ్రోజులు, పోలింగ్ రోజున వీరి పాత్ర క్రియాశీలకం కానున్న నేపథ్యంలో బూతు కమిటీలకు కావాల్సిన సరంజామా సర్దే పనిలో పడ్డాయి. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీలతో పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీఎంలలో అభ్యర్థుల నంబరింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో డమ్మీ ఈవీఎంలతో వారికి అవగాహన కల్పిస్తున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా, ప్రతి ఇంటికీ ఓటరు స్లిప్పులు పంచడం, వారి నుంచి ఓటు హామీ పొందడం, తటస్థులను మచ్చిక చేసుకోవడం లక్ష్యంగా బూత్ కమిటీలను పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. ఓటింగ్ శాతం పెంచడం, వృద్ధ, దివ్యాంగ ఓటర్లను బూత్‌లకు తీసుకొచ్చేందుకు పార్టీలన్నీ బూత్ కమిటీలపై ఆధారపడుతున్నాయి. ఇన్‌చార్జీలకు ప్రత్యేక శిక్షణ పోలింగ్ రోజు, అంతకు ముందు రోజు ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు వీరే కీలకం కావడంతో బూత్ కమిటీల ఇన్‌చార్జీలకు పార్టీలు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. పార్టీ ప్రచారాస్త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కరపత్రాలు పంచడం, నేతల మధ్య సమన్వయం చేసే బాధ్యతలన్నీ కమిటీలకే అప్పగించాయి. పార్టీల అసెంబ్లీ ఇన్చార్జీల సూచనల మేరకు బూత్కమిటీలను ఎంపిక చేసి, పార్టీకి ఓట్ల శాతం పెంచే యత్నాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రధాన పార్టీలన్నీ పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ కమిటీలు నియమించాయి. ఒక్కో బూత్ పరిధిలో 10 మంది ముఖ్య పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించడంతో పాటు ఓటర్లతో సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. -
వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌ల నియామకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీలోని యూనివర్సిటీలకు వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌లను నియమించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌గా బీ. మోహన్ నియమితులయ్యారు. నాగార్జున వర్సిటీ ఇంఛార్జ్‌గా కిరణ్ నియమితులు కాగా, కాకినాడ జేఎన్టీయూ, కేఎల్ వర్సిటీల బాధ్యతలను కే రాజశేఖర్‌లకు అప్పగించారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఇంఛార్జ్‌గా పీ, మురళీ, ఎస్కేయూ, రాయలసీమ, విక్రమసింహపురి వర్సిటీలకు జీ లింగారెడ్డిను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
జిల్లాలో ఖాళీల కథ !!
► జిల్లా ప్రధాన శాఖల్లో అధికారుల కొరత ► ఇన్‌చార్జులతోనే పాలన ► కుంటుపడుతున్న అభివృద్ధి ► గాడితప్పుతున్న శాఖలు ► ఒక్కో అధికారికి మూడు బాధ్యతలు ► పథకాల అమలులో అవస్థలు ► నియామకాలపై ఊసెత్తని సర్కారు ► పదోన్నతుల కోసం నిరీక్షణ ఇందూరు: జిల్లాలోని ప్రధాన శాఖలు ఇన్చార్జుల పాలనలోనే కొనసాగుతున్నాయి. అన్ని రంగాల్లో ముందువరుసలో ఉన్న జిల్లాను అదేస్థాయిలో అధికారుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా రెగ్యూలర్ అధికారులను నియమించకపోవడం, సర్కారు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఎవరైనా అధికారి రిటైర్డ్ అయినా, స్థానం ఖాళీ అయినా ఆ శాఖను వేరే అధికారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారికి ఇష్టం లేకున్నా అంటగడుతున్నారు. దీంతో అవస్థలు పడుతూ.. మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. తమ సొంతశాఖతోపాటు ఇన్చార్జి శాఖకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. జిల్లాలో దాదాపు 62 వరకు ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. పరిపాలనలో వేగవంతంగా పనులు జరగాలన్నా, పథకాలు అమలు కావాలన్నా పంచాయతీ రాజ్, సంక్షేమ, రెవెన్యూ, కార్పొరేషన్, ఇతర రెండు మూడు శాఖలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధానంగా ఈ శాఖల్లోనే జిల్లా అధికారుల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఖాళీలు ఇవే.. ♦ జిల్లాకు తలమానికమైన జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) పోస్టు ఆరు నెలలుగా ఖాళీ ఉంది. గతంలో పని చేసిన మనోహర్ పదవీ విరమణ పొందడంతో రెగ్యులర్ అధికారిని ప్రభుత్వం నియమించలేదు. ప్రస్తుతం జెడ్పీ సీఈఓ మోహన్‌లాల్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు భూ భారతి శాఖకు కూడా ఇన్‌చార్జీగా ఉన్నారు. ముఖ్యంగా జిల్లా పరిపాలన, కలెక్టర్ వ్యవహారాలు, ఫైళ్లు, ఉత్తర్వులు అన్ని కలెక్టరేట్ నుంచే జరుగుతాయి. రెగ్యులర్ అధికారి లేకపోవడంతో కలెక్టర్ పరిపాలన విభాగానికి సుస్తీ పట్టింది. ♦ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ విజయ్‌కుమార్‌ను కలెక్టర్ సరెండర్ చేశారు. దీంతో ఏజేసీ రాజారాం ఇన్చార్జి అధికారిగా ఉన్నారు. 62 వసతిగృహాలు, వార్డెన్లు, ఎస్సీ సబ్ ప్లాన్, కల్యాణ లక్ష్మి, ఉపకార వేతనాలు, ఇతర పథకాల అమలు పర్యవేక్షణ అట కెక్కింది. కాగా ఇదే శాఖలో జిల్లా సాంఘీక సంక్షేమాధికారి(డీఎస్‌డబ్ల్యూఓ) పోస్టు కొన్నేళ్లుగా ఖాళీ గా ఉంది. ఈ పోస్టులో నిజామాబాద్ ఏఎస్‌డబ్ల్యూ ఓ జగదీశ్వర్‌రెడ్డి ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. కాగా కామారెడ్డి, బోధన్, మద్నూరు, ఆర్మూర్ ఏఎస్డబ్ల్యూఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ♦ జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌లో జిల్లా అధికారి పోస్టు ఖాళీగా ఉంది. మైనార్టీ కార్పొరేషన్‌కు చెందిన ఈడీ ప్రేమ్‌కుమార్ ఇన్‌చార్జీగా ఉన్నారు. ఈ శాఖలో షాదీముబారక్, షాదీఖానాలు, స్కాలర్షిప్, తదితర పథకాల అమలు, పర్యవేక్షణ ఆయనకు కష్టంగా మారింది. ♦ జిల్లా సహకార శాఖలో డీసీఓగా పనిచేసిన శ్రీహరి పదవీ విరమణ పొందారు. ఇన్‌చార్జీగా అదేశాఖలో పని చేస్తున్న గంగాధర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ♦ జిల్లా బీసీ కార్పొరేషన్‌కు కొన్నేళ్లుగా రెగ్యులర్ ఈడీ లేకపోవడంతో సాయిలును నియమించారు. ఈయనను రెండు నెలల క్రితం కలెక్టర్ సరెండర్ చేశారు. ప్రస్తుతం స్టెప్ సీఈఓ ఉపేందర్‌రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం రుణాల సీజన్ కావడంతో వాటిని లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది. ♦ జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు నాలుగేళ్లుగా రెగ్యులర్ ఈడీ లేడు. రుణాల మంజూరు, దళితులకు భూ పంపిణీ వంటి పథకాలున్న ఈ శాఖకు రెగ్యులర్ అ ధికారి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్న ఇన్చార్జికి తలకు మించిన భారం అవుతోంది. ♦ నీటి సరఫరా శాఖ(ఆర్డబ్ల్యూఎస్)లో ఎస్ఈగా పని చేసిన ఇద్దరు అధికారుల్లో ఒకరు బదిలీపై వెళ్లారు. అనంతరం వచ్చిన అధికారి అనారోగ్యంతో సెలవులో ఉన్నారు. ప్రస్తుతం ఇన్చార్జి అధికారిగా బాన్సువాడకు చెందిన వెంకటేశ్వర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం రెగ్యులర్ అధికారిని నియమిస్తూ నెల రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసినా విధుల్లో చేరలేదు. ♦ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్‌పోర్టు పోస్టు ఖాళీగా ఉంది. నిజామాబాద్ ఆర్డీఓ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. వెహికిల్ ఇన్స్పెక్టర్, ఇతర ప్రధాన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ♦ ఎక్సైజ్ శాఖలో ప్రధానమైన ఏసీ, డీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పక్క జిల్లా అధికారి డిప్యూటీ కమిషనర్ ఇన్చార్జిగా పని చేస్తున్నారు. అలాగే ఎక్సైజ్ ఎస్సై, సీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ♦ ఐసీడీఎస్‌లో ఏపీడీ పోస్టుల కొన్నేళ్లుగా ఖాళీ ఉంది. నెల రోజుల క్రితం ఈ పోస్టులో శ్రీదేవిని ప్రభుత్వం నియమించింది. ఆమె విధుల్లో చేరలేదు. జిల్లాలో పని చేయడానికి ఆమె విముఖత చూపుతున్నారు. ♦ జిల్లా పరిషత్‌లో డిప్యూటీ సీఈఓ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీ ఉంది. ప్రస్తుతం ఎంపీడీఓగా పని చేస్తున్న గోవింద్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. పదోన్నతులు, నియామకాలు లేవు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పింది. కానీ అమలులో జాప్యం చేస్తోంది. ఇటు జిల్లాలో ఖాళీలపై ఉన్నతాధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదు. నూతన నియూమకాలు, శాఖల్లో పని చేస్తున్న రెండో శ్రేణి అధికారులకు పదోన్నతులు ఇవ్వకపోవడం కూడా ఖాళీలకు కారణమవుతున్నాయి. పదోన్నతుల కోసం చాలా మంది అధికారులు ఎదురు చూస్తున్నారు. -
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఇంఛార్జ్ లుగా కేంద్ర మంత్రులు
ఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఇంఛార్జ్‌లుగా కేంద్ర మంత్రులను నియమించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఏడు రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ కేంద్ర మంత్రులను ఆయా రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లుగా నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్‌గా జేపీ నడ్డా, తెలంగాణకు హంసరాజు అహిద్ లను పార్టీ అధిష్టానం నియమించింది. వీటితో పాటు తమిళనాడుకు పీయూష్ గోయల్, కేరళకు రాజీవ్ ప్రతాప్‌రూడీ, పశ్చిమ బెంగాల్‌కు నిర్మలా సీతారామన్, అస్సాంకు ధర్మేంద్ర ప్రధాన్, ఒడిషా బీజేపీ ఇంఛార్జ్‌గా మహేశ్ శర్మలను పార్టీ అధిష్టానం మంగళవారం నియమించింది.