గుంటూరు, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. అసెంబ్లీ నియోజకవర్గాలకు,పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఐదో జాబితాను విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత.. మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్రకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంఛార్జిల మార్పును ప్రకటించారు.
ఐదో విడతలో.. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిల మార్పును ప్రకటించారు వాళ్లు. నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్‌కు ప్రమోషన్ దక్కింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది పార్టీ.
‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ.
బాధ్యతలు కూడా..
పార్టీ ఐదో జాబితా విడుదల చేసే క్రమంలో.. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి(రాజ్యసభ సభ్యులు)కి అదనంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పజెప్పింది. అలాగే.. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ రీజినల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించింది వైఎస్సార్‌సీపీ.
వైఎస్సార్‌సీపీ తొలి జాబితా ఇదే
వైఎస్సార్‌సీపీ రెండో జాబితా ఇదే!
Comments
Please login to add a commentAdd a comment