స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కసరత్తు  | BJP wants to postpone elections to ZPTC And MPTC | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కసరత్తు 

Published Mon, Apr 22 2019 6:04 AM | Last Updated on Mon, Apr 22 2019 6:04 AM

BJP wants to postpone elections to ZPTC And MPTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని ఓవైపు డిమాండ్‌ చేస్తూనే మరోవైపు ఆ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఇప్పటికే ప్రారంభించిన ఆ పార్టీ, తాజాగా జిల్లాలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమించింది. పూర్వపు జిల్లాల వారీగా నియమితులైన ఇన్‌చార్జ్‌లు, వాటి పరిధిలోని కొత్త జిల్లాల్లో ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేయనున్నారు. ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫామ్స్‌ను వారే జారీ చేస్తారని బీజేపీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.  

ఇన్‌చార్జ్‌లు వీరే 
చింతా సాంబమూర్తి: రంగారెడ్డి, జి. ప్రేమేందర్‌ రెడ్డి: కరీంనగర్, డాక్టర్‌ జి.మనోహర్‌ రెడ్డి: మహబూబ్‌నగర్, ఎండల లక్ష్మీనారాయణ:ఆదిలాబాద్, చింతల రామచంద్రా రెడ్డి: వరంగల్, పేరాల శేఖర్‌ రావు: మెదక్, వెంకటరమణి: నిజామాబాద్, ఎం.ధర్మారావు: నల్గొండ, డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు: ఖమ్మం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement